సుభాషితాలు - 001..నేటి ప్రాంజలి
---------------
పక్షవికలశ్చ పక్షీ శుష్కశ్చ తరుః సరశ్చ జలహీనమ్ |
సర్పశ్చోద్ధృతదంష్ట్రః తుల్యం లోకే దరిద్రశ్చ ||
(మృచ్ఛకటికం)
రెక్కలు లేని పక్షి, ఎండిపోయిన చెట్టు, నీరు లేని సరోవరం, పళ్ళు పీకిన పాము, బీదవాడు - అందరూ ఒక్కటే.
002
శ్లో𝕝𝕝 *బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే।*
*అనయో నయసంకాశో హృదయాన్నావసర్పతి*॥
తా𝕝𝕝 *పోయేకాలం దగ్గరకి వస్తే బుద్ధి కాస్తా కలుషితం అయిపోతుందట... అప్పుడు చేయకూడని పనులు చేయాల్సినవిగానూ, చేయవలసిన పనులు కూడనవి కానూ కనిపిస్తాయట... అంతేకాదు, *చేయకూడని పనిని చేపట్టేదాకా అది హృదయంలోనే తిష్ట వేసుకుని ఉండిపోతుంది....అందుకే పెద్దలు వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు కదా*!
003
నాస్తి విద్యాసమో బంధుః నాస్తి విద్యాసమో సహృత్ ।
నాస్తి విద్యా సమం విత్తం నాస్తి విద్యాసమం సుఖం ॥
విద్యతో సరితూగ గల బంధువు లేడు. విద్యతో సమానమైన స్నేహితుడు లేడు. విద్యతో సమానమైన ధనమూ లేదు. విద్యతో సరితూగ గల సుఖము లేదు.
004..మార్జాల భక్షితే దుఃఖం యా దృశం గృహా కుర్కుటేl
న తా దృశ్ మమతా శూన్యే కలవింకేథ మూషకేll
భావం: పిల్లి యింట్లో పెంచిన కోడిని తిన్నప్పుడు ఎంతో దుఃఖమవుతుంది. అయితే అంత దుఃఖం పిచుకను, ఎలుకను పిల్లి తింటే ప్రజలకు ఏ దుఃఖం రాదు. దీనికి కారణం.. పెంచిన కోడిమీద ఉన్న మమత.. పిచుక ఎలుకల మీద లేకపోవడమే!
005..అశ్వః శస్త్రం శాస్త్రం వీణా వాణీ నరశ్చ నారీ చ |
పురుషవిశేషం ప్రాప్యభవంత్య యోగ్యాశ్చ యోగ్యాశ్చ ||
(హితోపదేశః-సుహృద్భేదః)
గుఱ్ఱం, ఆయుధం, శాస్త్రం, వీణ, మాట, మనిషి మరియు మహిళ – వీరు విశిష్టులైన వ్యక్తులకు తోడైనప్పుడు అనుగుణంగా యోగ్యులైనా కావచ్చును లేదా అయోగ్యులైనా కావచ్చును.
006..స్వాధీనం సమతిక్రమ్మ మాతరం పితరం గురుంl
అస్వాధీనం కథం దైవం ప్రకార్తె రభిరాధ్యతేll
భావం: తల్లి, తండ్రి, గురువు.. ఈ ముగ్గురూ ప్రత్యక్షముగా కనపడే దేవుళ్ళు. వీరికి మించి కళ్ళకు కనపడని దేవుళ్ళను ఆరాధించే విధానం ఏమైనా ఉందా?
007
సహవసతామప్యసతాంజ లరుహజలవద్భవత్యసంశ్లేషః |
దూరేఽపి సతాం వసతాం ప్రీతిః కుముదేందువద్ భవతి ||
(నీతి ద్విషష్టికా)🌺
సజ్జనులు దుర్జనులతో కలిసి ఉన్నా తాము తామరాకుతో నీటి లాంటి వంటివారు, అంటిపెట్టుకోరు. సజ్జనులు దూరంగా ఉన్నా, వారి ప్రేమ నీలమేఘంలో చంద్రునిలా ఉంటుంది
పట్టి పట్టనట్లుగా, ముట్టి ముట్టనట్లుగా, తాకి తాకనట్లుగా, చేసి చేయనట్లుగా, చూసి చూడనట్లుగా, త్రాసులా బ్రతకడమే జీవితం
08..శాంతి తుల్యం తుల్యం తపో నాస్తి న సంతోషాత్పరం సుఖమ్l
న తృష్ణయా పరోవ్యాధి:నచ ధర్మో దయా పర:ll
భావం: శాంతి కంటే మించిన తపస్సు లేదు. తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖం లేదు. పేరాశను మించిన రోగం లేదు. దయాగుణమునకు మించిన ధర్మం లేదు.
-009 శరశతపాతానాజానేయః కశాం న వా సహతే |
సహతే విపత్‌సహస్రం మానీ నైవాపమానలేశమపి |
(మహాభారతం)
మంచి జాతి గుఱ్ఱం వందల బాణాలను తట్టుకోగలదు, కాని కొరడా దెబ్బను సహించలేదు. అలాగే, గౌరవం కలవాడు వేల కష్టాలను భరించగలడు, కాని అపమానం తట్టుకోలేడు.
010.పతత్యవశ్యం హి వికృష్యమాణం
కాలేన యత్నాదపి రక్ష్యమాణమ్ |
వర్ష్మామునా సిధ్యతి చేత్పరార్థః
స ఏవ మర్త్యస్య పరః పుమర్థః ||
(మాధవీయ శ్రీశంకర దిగ్విజయః)
ప్రయత్నపూర్వకంగా
రక్షిస్తున్నప్పటికీ ఈ దేహము కాలానికి వశమై నిశ్చయంగా పిపోతుంది కదా! అలాంటి దేహమువలన పరార్థము సిద్ధించునట్లయితే (ఇతరుల అవసరాలు తీరునట్లయితే) అదియే పరమపురుషార్థమవుతుంది.
009..
No comments:
Post a Comment