Tuesday, 4 June 2024

07-06-2024****

 


*064..వర్జ్యం అంటే !*

                  

(చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు.)




*జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.*


ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది .                 


వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.

అశుభ సమయం.


శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.


ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.


భారతీయులు….   నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు. 

అటు దైవకార్యాలకి ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది. 


ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.


ఈ నేపథ్యంలోనే ‘వర్జ్యం’ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 


‘వర్జ్యం’ అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. 


”ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం” … 

”కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది … త్వరగా బయలుదేరండి” అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం. 


వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. 

ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.


వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. 


ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.


ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.


వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. 


అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. 


ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

065..విశ్వంలో ... వ్యామొహం (రోజువారి కథ )

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం ) 

          సూర్యోదయం ఉద్యోగ ధర్మంగా జగతిలో సంచారిస్తూ ఉన్న వారు గుర్తించారా లేదని అను కోకుండా తనగమ్యం ఏమిటో నిర్ధారణ చేసుకొని తన ప్రవర్తన మార కుండా ఊపిరిలో ఊపిరిగా, ఉదకంలో ఉదకంగా, విశ్వవ్యాప్తిగా ఉపకారిగా.... ... .... 

కంటిలో తెలుపు నలుపు ఏకమై, కనురెప్పలు ధగ ధగ మెరుపులు చూసి, చూడనట్లుగా. నెత్తిమీద ఎర్ర ఎర్రని పొరలు కమ్ముకొస్తూ, కాలు కింద ధూళిపొర పొరలుగా విస్తరించి అద్దముపై సేదతీచుకొనగా, కిరణ ప్రతిబింబాలు జిలుగు జిలుగుగా, కదలసాగె .... ...

అంబరవీధులనుంచి కొండ చెరియలు చేరి, వృక్షమాలికల మధ్య నలిగి, నే నొస్తున్న నాకు దారి ఇవ్వండి అంటూ సముద్ర మట్టంపై విస్తరించి కెరటాలమధ్య నలిగి గుర్తించే విధముగా థళ థళ మెరుపుల్లా నావికుల దిక్సూచిగా సంద్రము మీద కిరణాలు  కదలసాగె .... ...

పాలమీగడ తరగల్లా, మంచు తుషార బిందువుల్లా,  పువ్వుల నుండి విస్తరించే పొప్పొడి  రేణువుల్లా, చీకటి తరిమే మిణుగురు పురుగుల్లా, విత్తుల పొత్తి కడుపులో చెట్ల నెత్తురు నింపుకొని కొత్త వెలుగుల్లా, పువ్వునుండి రాలిన గులాబీ రేకులు గాలితో సమానము గా ఉనికి  విధముగా కథలు లాగా .... ..... ...            

అంబరం నుండి కాళ్ళు విఱిగి నేల మీద పడ్డ మేఘాలలో కరిగిన చినుకులు, పుడమిని చేరే పుడమి తల్లి పురిటి నెప్పుల్లా,  హాహాకారాలు, అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా, వళ్ళు విరుచుకొని విస్తరించే పువ్వులా, డొక్కలు ఎండిన వాడికి నీటిచుక్కలు బతికిచ్చినట్లు పుడమి ఆవిరి కొంత తగ్గే ..... .... ...     

***** 

066..మధురిమలు (పుడమితల్లి పులకరింతలు ఇలా వున్నాయి ) 

మల్లె పువ్వు అడిగిందే - కొంత సౌరభమున్నదా

మందారం అడిగిందే  - కొంత మాధుర్యమున్నదా 


గులాబీ అడిగిందే   . కొంత  సోయగమున్నదా 

చామంతీ కలగందే - కొంత లావణ్య ముగదా 


మలయా నిలం ఉరికింది  - కెరటాలలొ గమ్మత్త0ది 

కోయిల పాట పాడింది  - గొంతులొ గాంధర్వముంది  

 

పున్నమి వెన్నెల విస్తరి - పులకింత గిలిగింత సిరి 

కిరణాలలోను ఊపిరి  - ప్రకృతిలోన హృదయేస్వరి 

                                               
                                                  ఇలా సాగుతున్నది కిరణాల వెల్లువా .... (2)

*****

067..విశ్వంలో ... వ్యామొహం (రోజువారి కథ (2)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం ) 


      మేఘసందేశాలు కదులుతున్నాయి, రసవత్తరమైన సంఘటనలు జరుగుతున్నాయి, ఉజ్వలమైన కాంతి ఒకవైపు ప్రజ్వలిస్తున్నది, కడలి కెరటాలు ఎగసి పడుతూ గట్టు దాటాల్ని ఉబలాట పెరిగింది. చూపులు సోపానాలు కదిలి మన మనుగడ ప్రశ్నల పరంపరంగా ఉషస్సులేంతగా ఉద్వేగపడ్డాయో, కాలచక్రము తిరుగుతూనే ఉంటుంది. ఋతువులు మార్చుకున్నా హృదయవేదన, వాదన, సమర్ధన, ఉషోదయ కిరణాలకు మేఘాలు కమ్ముకున్నా విశ్రాంతిగా మేఘాలు కదిలాక విశ్వవ్యాప్త విదితమగును ప్రజ్వలించే కిరణాలు.

విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి"  లెక్కన అనుభవించటం జరుగుతుంది.

 అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు.  జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.  దు:ఖమనేది, నాకు చేతకాదు, రాదు, అనే బలహీనత పలుకులు, ఈ, ఏ, స్థితిలోను  నీలో రానీయకు.   
******



చూడమన సూర్య వెలుగే 
సమయ మంతయును సమాన కళలే, 
వినయ రూపమున, పొందు పరచే, 
విషయవాంఛలను, సమ్మతముగా, 
తనువు వేడిగను పెంచుటయు, 
సాను భవంతమును తెల్పు చునె. 

                                                                    ఇలా సాగుతున్నది కిరణాల వెల్లువా .... (3)


విశ్వంలో... విజ్ఞాన దీపం ..రోజువారి కధ..3
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ...ప్రాంజలి ప్రభ

జరుగుతున్నదంతా - దైవే చ్ఛ.
మనగడన్నదంతా - ప్రేమే చ్ఛ
పలుకులను తిని మారే - వాదే చ్ఛ
కరుగుతున్నదంతా - పాపే చ్ఛ

 ఇలా జరగాలి, అలా జరగాలి అని అనుకుని ప్రయత్నించడం - పురుష ప్రయత్నం.
 పురుష ప్రయత్నం, దైవే చ్ఛ రెండు ఒక్కోసారి కలిగుట వల్లనే మనస్సంతా ప్రసాంత త
 అవుతుంది. అప్పుడు సంతోషం కలుగుతుంది, అలా కానప్పుడు దుఃఖం కలుగుతుంది. దానికి కారణాలు అనేకం అవి తెలుసుకొనే లోపే వయసు కరిగి పోతుంది.
అందుకే ఏ సమయానికి ఏది సంభవిస్తే దానిని అనుభవించడానికి సిద్ధపడడమే - శరణాగతి.

ఆనందం.... పరమానందం.... బ్రహ్మానందం...
 శరణాగతి అంటే కర్మరాహిత్యం కాదు,  కర్తృత్వరాహిత్యం.
 జన్మ సార్థకం అవ్వాలంటే ముందు నిన్ను నీవు నిమ్ము, నీలో ఒకదైవమున్నదని నిమ్ము, నిన్ను నడిపించేది ప్రేమే అని తెలుసుకో, ప్రేమకు మూలం ప్రకృతి, పుడమి, గాలి, అగ్ని, జ్నానం అని తెలుసుకో, తెలుసుకున్నది నలుగురికి పంచుటే ఆది దైవము లీల అని తెలుసుకో, నీ ప్రయత్నమే కుటుంబానికి ధనం చేకూరుస్తూ ఉంటుంది. కోట్ల సంపాదన ఉన్నా తినేది అన్నమే, 

సంపద పెరుగుట విరుగుట కొరకే
ఆశలు పెరిగియు కలుగుట కొరకే
కాలము తెలియక తిరుగుట కొరకే
శాంతిని మరచియు పెరుగుట కొరకే

సార్థకం అయ్యాకే జన్మ పరిపక్వత జరుగుతుంది.
సార్ధకమనగా జీవి నిస్వార్ధంగా, ధర్మంగా, న్యాయంగా, సత్యంగా, దైవికంగా, ప్రేమగా ఉండగలిగితే నే......ఇది కలియుగం కనుక 
అహాన్ని వదిలి ప్రేమను పెంచు
మోహాన్ని వదిలి స్నేహము పేంచు
దాహాన్ని వదిలి డబ్బును పెంచు
మోనాన్ని వదిలి శాంతిని పెంచు
ఏది ఏమైనా శీలం చెడకుండా జీవించడమే జీవితలక్ష్యంగా భావించు.
0***--

069..విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(4) ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి.
ధర్మం గా ప్రవర్తించు ఆధర్మమే నిన్ను నీకుటుంబాన్ని నీదేశాన్ని రక్షిం చెబుతుంది.
ధర్మం అంటే

 ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించు గాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా ధర్మము గా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు గారు.
ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు.  న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. 
అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు.  

దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.
ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. 
‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు.
గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 
ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. 
రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.  

మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు.
 ‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు.  నిజాయతీగా సంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువుగారు.

నీవు చేసే పనిలో శాంతి కల్గించు ఆనందాన్ని అనుభవించి అందరికీ నీ సహాయము అందించు.  అదే నీకు గమ్యము, మోక్షము.
శాంతి సంతోషంలాగా వ్యక్తం కాదు. అందుకే శాంతి పొందిన మనసు రహస్యానంద స్వరూపమే అవుతుంది. ఒక్కసారి ఆనందం చవిచూస్తే ఇక అది మనని వదలివెళ్ళదని తెలుస్తుంది. అప్పుడది సదానందంగా నిలిచిపోతుంది. అదే మహానందంగా పరిణమిస్తుంది. అప్పుడు లోకం కూడా ఆనందమయంగానే కనిపిస్తుంది. ఆనందం తనలోనిదేనని అర్థమైన తర్వాత దానికోసం ఈ లోకంలో వెతకాల్సిన పనిలేదని తెలుస్తుంది. అలా తెలుసుకున్న మనసు లోకాతీతమైన ఆనందంలో ఉండిపోతుంది !_
విశ్వంలో విజ్ఞాన మనేది ఆనందం వల్లే ఏర్పడుతుంది. ఈర్ష్యా ద్వేషం ఉంటే విజ్ఞానం ఉన్నా లేనట్టే
--(())--
0****-

070..విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(5) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

ఈలోకాన్ని ఎవరు ఉద్దరించలేరని అనుకుంటున్నారు, ఎందరో మహానుభావులు మనదేశ రక్షణకు , దేశప్రజల ఉన్నతికి సహకరించారు అందులో నేనొకణ్ణి  
మన ప్రజలలో కొందరు 

గుణములు పంచని మనసే ల 
తృణము లెక్క యగును
మంచిని గమనించక అరుపే
నీచ తీర కుండు
ధర్మం తప్పి నడువు డెందుకు
మర్మ మంత మాయ
కాలాన్ని ప్రశ్నించు టెందుకు

చాతకాని పనులు ఎందుకు
వెతలు పొందు టేల 
మాటతూలి పనులు ఎందుకు
వేట వల్లె మారు
తప్పుని ఒప్పను టెందుకు
ఉప్పు లాగె బతుకె 
ప్రకృతిని ప్రశ్నించు డెందుక

ఆశ పాశము తోను ఎందుకు
పాశ మైన బతుకు
వేష మోసములన్ని ఎందుకు
ఘోష వచ్చి చేరు
ఉన్నభాషను మర్చు టెందుకు
అన్న మాట మరచు
ఈ లోక మాయ బతుకు లోన
--(())--

నేను మనసుని నమ్మినవాణ్ణి, నిస్వార్ధ పరుణ్ణి, నిర్భయుణ్ణి, ధీబలుణ్ణి, తలయెత్తుకు తిరుగువాణ్ణి, నన్నునేను తెలుసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి, హృదయానందం అందించేవాణ్ణి, జ్ఞాన మనే పవనాలు హాయిగా పీల్చే పిచేవాణ్ణి, మాయా మర్మాన్ని చేధించేవాణ్ణి, విజ్ఞన సర్వస్వాన్ని అందరికీ పంచేవాణ్ణి, ధర్మమార్గములో దప్పికంటు లేకుండా శ్రమించేవాణ్ణి, మాటకు కట్టుబడి ప్రవర్తించే 
వాణ్ణి, సంకుచితభవాలు, స్వార్ధపు ఆలోచనలు లేనివాణ్ణి,  సంస్కృతి సంప్రదాయాలు అడవి కాచిన వెన్నెల కాకుండా, మతాలలో ఉన్న నమ్మకాలు వ్యర్థ పరచ కుండా, వంశపారంపర విద్యను మరువకుండా, ఆధునీక విద్యా విధానమును అనుకరిస్తూ,  ఎంతదూరమైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, తనగమ్యం కడలి వైపు అనే సాగె నదీమ తల్లిని నమ్మిన వాణ్ణి,  మనసు పెడదారి పట్టకుండా, బంధాలకు చిక్కకుండా, పట్టుదల చెదర కుండా, ఆనంద పదములో అందర్నీ ఆనంద పరిచే వాణ్ణి, నిద్రలో కూడా కలలు రానివాణ్ణి, దేశ ఉన్నతి కొఱకు, చేతనైన సహాయము చేసేవాణ్ణి, తెలుగువారి ఆత్మగౌరవమును, తెలుగు భాషను బతికించుటకు కంకణం కట్టుకున్న వాణ్ణి, అక్రమాలను అరి కట్టడానికి, అనాధులను రక్షించ టానికి, విద్యా వ్యాప్తికి సర్వ మత సమ్మేళణంగా, సమస్త హృదయాలను జాగృతి పరిచి జాగృతుణ్ణైనవాణ్ణి, ఇవి కలలు కావు కళలు గా భావించి జీవించేవాణ్ణి .                                 
అదేవిధముగా ప్రతిఒక్కరూ ధైర్యము ఆయుధముగా శాంతి లక్ష్యంగా జీవితసాఫల్యమును పొందగలరని ఆశిస్తున్నాము 

--(())--
****
071..విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(6) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమైనట్లు, మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి. ధర్మబద్ధంగా చేసే వ్యాపారం, కర్మ బద్ధంగా చేసే ఉద్యోగం, ఆత్మ శుద్ధి తో చేసే పూజలు, మనో నిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 

నియమ బద్ధమైన జీవితం అంటే, కేవలం మనసులో దానికి తగిన పవిత్ర భావాలకు తగ్గ క్రమ శిక్షణ  గా జీవితం, శాంతితో సాఫీగా సాగిపోతుంది. మన జీవితంలోని మాధుర్యాన్ని గుర్తించి పంచు కున్నప్పుడే అందరికీ సంతోషము.  పెద్దలు జీవితం అశాశ్వతమని గుర్తించు అని చెప్తారు. అంటే నిరాశకు లోనుకావాలని వారి ఉద్దేశ్యం కాదు. దాన్ని వదిలివేయమని సూచనకాదు. అర్ధంచేసుకొని సరిగా సాగించమని బోధ. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వితమో గుర్తించమని సూచన. ఐస్క్రీమ్ ఐదునిముషాల్లో కరిగిపోతుందని తెలిస్తే పిల్లాడు దాన్ని వెంటనే పూర్తిగా తిని సంతృప్తి చెందుతాడు. ఇదీ అలాంటిదే. జీవితం ఎందుకు వచ్చింది. మనం ఎలా జీవించాలి. ఎలా జీవిస్తే మనకి దాని పూర్తి ప్రయోజనం అందుతుందో తెలిపేదే సరైన మార్గదర్శనం !

నేటి స్థితి 
గాలి మాటలు చెవులనే కరచి వేయు 
గాలి ఊపిరి నిలిపును కాలమంత  
నేడు గాలిలేనిబతుకు నాట్య మాడె   
ప్రకృతి గాలిలే సరిపోక కుత్రిమమ్ము  

సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది  ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడి కాయలు కాయ లేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు.
మంచి మామిడి చెట్టు ను పెంచుకుంటే తీయని మామిడి పండ్లును, చల్లని నీడను ఇస్తుంది. అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్ది సత్ఫలితాలు వాటంతట అవే రావడం మొదలు పెడతాయి. అది ఎలా అంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకుల కు చేరి పూలు పూసి, కాయలు కాసినట్లు, మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. 
--(())--

విశ్వంలో ... విజ్ఞాన దీపం ..(7) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

మనిషిలో భయము ,  ధైర్యము కోల్పోయినప్పుడు కొన్ని ఆలోచనలు నిన్నుతట్టుతాయి, అవే   

బెదరు విడి మానసము పదిలపడి నపుడు, 
కుదుటపడి ఆనందము కలిగినపుడు, 
కలతలు తొలగి సంతోషపడినపుడు ,  
పరువుతో తల యెత్త బడియున్నపుడు, 
కళలతో విజయము పొందినపుడు,  
విజ్ఞాన బంధములు చేరి సంసార బంధమున 

సుఖలు దు:ఖములు కలిగినపుడు, 
ఇఱుకు సంసారముల కఱకు గోడల నడుమ, 
బరువు బాధ్యతలు మోసినప్పుడు, 
ఆశలు అడియాశలు అయినపుడు, 

భువనాలు తునుకలై పోక మిగిలిన యపుడు, 
పలుకులు సత్యగర్భమ్ము వెలువడు నపుడు, 
ధర్మము న్యాయము రెండు పాదముల మీది 
నడచినపుడు, 

సకల సౌకర్యాలు కలిగి నపుడు,  
 అలసి యెఱుగనియట్టి హస్తములు పరిపక్వ దశ 
నంటగను సాగు తరుణ మొదవిన యపుడు, 
పండిత పామరులు, మనసును వేదించనపుడు, 
ఐశ్వర్యము ఉన్న బీదరికంలో బతికినపుడు, 
బీదరికంలో ఉండి ఐశ్వర్యాన్ని ఆశించినపుడు, 
వేషాలు వేసినపుడు,  

చెడ్డ యలవాటనెడు చీకటెడారిలో 
తేటతెల్లని తెలివి బాట తప్పని యపుడు, 
దైవ ప్రార్ధనలో మనసుకు శాంతి కలిగినపుడు 
నిత్యవిస్తృతమైన నిర్మలిన భావనా- శ్రయ 
కర్మముల చేయ స్వాంతమును ముందునకు 
నా స్వామి నీవుగా నడుప బూనిన యపుడు, 
లోకంలో ఉన్న ప్రకృతిని స్వాదించినపుడు, 
మనిషిగా మానవత్వాన్ని బతికిస్తూ 

తల్లి తండ్రుల సేవకు అంకితమయినపుడు,  
సర్వార్ధ సాధనకు నిత్యమూ పుడమితల్లి సాక్షిగా, 
గగనమ్ము సాక్షిగా, నాలో ఉద్యమించుచున్న 
శాంతి నిలిపే సమస్త భోదలు తెలపాలిపుడు. 
అందుకే ప్రతిఒక్కరు ధైర్యాన్ని వీడకండి 
అదే మిమ్ము రక్షించుతుంది. 

తోడును వదలకండి అదే మిమ్ము బతికిస్తుంది.   
సర్వేజనా సుఖినోభవంతు ... ఓం శాంతి: శాంతి: శాంతి:
--(())--



No comments:

Post a Comment