Monday, 3 June 2024

04-06-2024 ప్రాంజలి ప్రభ తెలుగు కథలు

028..ప్రాంజలి ప్రభ... హాస్యం.. 

*ఈరోజు ప్రత్యేకం*

భార్య: 

నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.

భర్త:

నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !

          😄😁😄😃

భార్య :

ఏమిటి ఫోన్ లో ఎవరితో చాలా లోగొంతుకతో మాట్లాడుతున్నారు ?

భర్త :

చెల్లెలితో మాట్లాడుతున్నా.

భార్య :

చెల్లెలితో ఐతే మెల్లగా ఎందుకు మాట్లాడటం ?

భర్త  (అసలు విషయం బయటపెడుతూ) :

నేను మాట్లాడేది *నీచెల్లెలితో*.

           😁😆😁😆😁

భార్య :

ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.

భర్త : 

జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.

            😁😄😁😄😁

భార్య :

ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.

భర్త :

పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.

           🙂😄😋🙂😁

టాక్సీ డ్రైవర్ :

సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ? 

పాసింజర్ : 

ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !

              😄😁😆😁😄

భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.

షాపువాడు :

మీకు పెళ్ళి అయిందా ?

కొనేవాడు :

ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?

             😁😆😆😆😁

*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-

ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...

*ప్రతిభ* అంటారు.

కానీ...

అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....

అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.

             😄😁🙂😇😄

అడుక్కుతినే సాధువు 

(కారులో కూర్చుని ఉన్న మహిళతో) :

మేడమ్..! ఓపదిరూపాయలివ్వండి.

ఆవిడ పదిరూపాయలు ఇస్తూ అన్నది :

ఏంటి స్వామీ..? నన్నేమీ దీవించరా ?

సాధువు :

ఇంకా ఏంకావాలి నీకు ? కారులో ఊరేగుతున్నావు చాలదా ? ఇక రాకెట్ లో కూర్చొని ఎగరాలనిఉందా ?

               😁🙃😁🙃😁

టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...

*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*

గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..

*అబ్బేలేదు. బాంబు సీతాకోకచిలుక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నాచెవిదగ్గర గుసగుసలాడుతూ అన్నది..తుస్* !!!

         ⚡💥🔥😆😁😆

ఒకడు మెడికల్ షాప్ కు విషం కొనుక్కోవటానికి వెళ్ళాడు.

షాపువాడు :

నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?

కొనేవాడు తనజేబులోంచి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.

షాపువాడు : ఇక ఆపరాబాబు ! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా...?

029..🔅 చిత్తూరు జిల్లా : నారాయణ వనం

🙏 కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం: నారాయణవనం 🙏

👉 కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది.
సాక్షాతూ శ్రీ ఏడుకొండల వాడు "ఎరుకలసాని " గా తిరుగాడిన పవిత్రమైన తిరువీదులు ఉన్న పురం నారాయణవనం . లోకకళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకం లో పరిణయమాడిన స్థలం ఈ నారాయణవనం.
     
తిరుమల యాత్ర లో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవం గా జరిగింది.

🔅 స్థలపురాణం : శ్రీ వేంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్యావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు.
తరువాత క్రమంలో వైకుంఠం నుండి బృగ్నుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం.
వకుళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడుగా ఉండటం జరుతుంది.
కలియుగంలో శ్రీనివాసునిగా శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు . ఆకాశరాజు కుమార్తె పద్మావతి , సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి . వకుళమాత పుత్రుడు శ్రీనివాసుడు . అవతార పురుషుడు . వీరిరువురికీ కళ్యాణం జరిపించాలి వకుళమాత .
ఆమె సన్యాసిని , ఆశ్రమవాసి . నాగరికతకు దూరంగా ఉంది .  శ్రీనివాసునితో పద్మావతీ దేవి పరిణయం జరిపించి తరించిందా పుణ్యమూర్తి .
ఆ కళ్యాణానికి సకల దేవగణాలతో దేవదేవేరులందరూ విచ్చేశారు .
ఆ మహాదానంద ఘటన జరిగింది  నారయణవనంలో .

👉 గ్రామానికి వన్నె తెచ్చేలా పుణ్య అరుణానది ఈ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది
శ్రీవేంకటేశుని భక్తాగ్రణ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన్ చక్రవర్తి స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం .

👉గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా వుంది . శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి వుంటాడు .
ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

👉 కళ్యాణం జరిపించుకొంటున్న ఈ పెండ్లికొడుకు సర్వలంకార భూషితుడై , సుందరకారుడై భక్తజనులను తన చల్లని చూపులతో ఆదరిస్తుంటాడు . శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో వేంచేసివున్నారు . గర్భాలయ  ముఖద్వారం వద్ద నాలుగు చేతులతో ఆయుధాలు ధరించిన ద్వారాపాలకుల విగ్రహాలు రమణీయంగా వున్నాయి . ముఖ్యంగా ఈ ఆలయంలో గమనించవలసిన విషయం ఒకటుంది . గర్భాలయం అంతరాళం , ముఖమండపానికంటే ఎత్తులో వుంది .
ఇక్కడ తిరుమల ఆలయానికి , శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరాలయాలకు భిన్నంగా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మందిరం వుంది .

👉నారయణవనంలో అమ్మవారి ఆలయం ముందు " భాగంలో " పెద్ద తిరగలి " ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . శ్రీనివాసుని కళ్యాణ సమయంలో ఈ తిరగలిని ఉపయోగించారన్నది ఇక్కడి పౌరాణిక ఐతిహ్యం .  అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు.

👉 ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపు వరదరాజ స్వామి ఆలయం వుంది . ఉత్తరం వైపున మరిన్ని దేవతా మూర్తులున్నాయి . ఆలయానికి వెనక వైపున కోనేరు వుంది . ఆనాటి రాజ్య కైంకర్యాలతో ఆలయం శోభించిందని చాటిచెప్పే ప్రతీక ఈ సరోవరం మధ్యలో నిరాళిమండపం , మనకు కనువిందుచేస్తుంది . కళ్యాణ వేంకటేశుని ఆలయానికి కొద్ది దూరంలోని సొరకాయల స్వామి ఆలయాన్ని తప్పక చూడాలి . ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న హోమగుండం లోని విభూతిని ధరాణచేస్తే అనేక విధాల పీడలు తొలగిపోతాయన్నది స్థానిక ప్రజల నమ్మకం .

👉పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.
కేవలం దర్శన మాత్రముచే వివాహం, సంతానం, ఐశ్వర్యం అందించే నారాయణపురం లోని శ్రీ పద్మావతి కళ్యాణ వేంకటేశ్వరస్వామి

👉 ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి . ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది .
అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది . •

👉ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాలు :
🔅శ్రీ పరాశర స్వామివారి గుడి •
🔅శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి •
🔅శ్రీ శక్తివినాయక గుడి
👉 ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి. అవి :
🔅శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి .
🔅శ్రీ పద్మావతి అమ్మవారు గుడి •
🔅శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి •
🔅శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి •
🔅శ్రీ రంగనాయకులవారి గుడి . •
🔅శ్రీ అవనాక్షమ్మ గుడి

సేకరణ... ప్రాంజలి ప్రభ

030..గొప్ప విద్యావేత్త అయిన కత్తి వెంటకస్వామి అన్న నాయకత్వంను అందరం బలపరుద్దాం

కత్తి వెంకటస్వామి అన్నకు విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను ఇవ్వాలని అందరం కోరుదాం

ప్రభుత్వ ఉద్యోగాన్ని సహితం తృణప్రాయంగా వదిలేసి, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ స్వరాజ్యం కోసం
జయశంకర్ ఆశయ సాధనకోసం , సర్వస్వం సమర్పించిన,  గొప్ప నాయుకుడు, నిస్వార్థపరుడు, మేధావి, వక్త, తెలంగాణ
విద్యావ్యవస్థమైన సంపూర్ణమైన అవగాహనగలవారు, మన తెలంగాణ ప్రాచార్యులు
కత్త వెంకటస్వామి అన్న

అన్నకు వెంటనే విద్యాశాఖమంత్రి పదవి ఇవ్వాలి, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవాలి.

తెలంగాణ ఉద్యమంలో కత్తి వెంకటస్వామి అన్న చేసిన కృషి న భూతో న భవిష్యతి

కత్తి వెంటకస్వామి అన్న నాయకత్వం చిరస్మరణీయం

తెలంగాణ ఉద్యామానికి స్ఫూర్తి, కత్తి వెంకటస్వామి అన్న నాయకత్వం,

తెలంగాణ గురువులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను
చేసిన ప్రప్రథమ  ఘనత కత్తి వెంకటస్వామి అన్నకే  లభిస్తుంది.

నీరసంలో నిస్పృహలో ఉన్న తెలంగాణ ప్రైవేట్ ప్రభుత్వ గురువులను ఐక్యం చేసి తెలంగాణ టి.ఎల్.ఎప్ ఫోరమ్ ద్వారా
తెలంగాణ గురువులను ఐక్యం చేసిన మహానుభావుడు మనందరి శ్రేయోభిలాషి కత్తి వెంటకటస్వామి అన్న

ఇలాంటి వారికి ఉన్నత పదవులను ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలి మరియు తెలంగాణ  ఉద్యమ స్ఫూర్తి ప్రదాతా పురస్కారాలు అందించి గొప్పగా గౌరవించుకోవాలి.

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

031..🙏_*శివ నవరత్నమాలా స్తోత్రం*_🙏

_*బృహస్పతిరువాచ*_  💐

*నమో హరాయ దేవాయ*
*మహామాయా త్రిశూలినే*
*తాపసాయ మహేశాయ*
*తత్త్వజ్ఞానప్రదాయినే*   ౧

*నమో మౌంజాయ శుద్ధాయ*
*నమః కారుణ్యమూర్తయే*
*నమో దేవాధిదేవాయ*
*నమో వేదాంతదాయినే*  ౨

*నమః పరాయ రుద్రాయ*
*సుపారాయ నమో నమః*
*విశ్వమూర్తే మహేశాయ*
*విశ్వాధారాయ తే నమః*   ౩

*నమో భక్త భవచ్ఛేద*
*కారణాయాఽమలాత్మనే*
*కాలకాలాయ కాలాయ*
*కాలాతీతాయ తే నమః*   ౪

*జితేంద్రియాయ నిత్యాయ*
*జితక్రోధాయ తే నమః*
*నమః పాషండభంగాయ*
*నమః పాపహరాయ తే*  ౫

*నమః పర్వతరాజేంద్ర*
*కన్యకాపతయే నమః*
*యోగానందాయ యోగాయ*
*యోగినాంపతయే నమః*   ౬

*ప్రాణాయామపరాణాం తు*
*ప్రాణరక్షాయ తే నమః*
*మూలాధారే ప్రవిష్టాయ*
*మూలదీపాత్మనే నమః*  ౭

*నాభికం తే ప్రవిష్టాయ*
*నమో హృద్దేశవర్తినే*
*సచ్చిదానందపూర్ణాయ*
*నమస్సాక్షాత్పరాత్మనే* ౮

*నమశ్శివాయాద్భుతవిక్రమాయ తే*
*నమశ్శివాయాద్భుతవిగ్రహాయ తే*
*నమశ్శివాయాఖిలనాయకాయ తే*
*నమశ్శివాయామృతహేతవే నమః*    ౯

_*సూత ఉవాచ*_ 💐

*య ఇదం పఠతే నిత్యం*
*స్తోత్రం భక్త్యా సుసంయుతః*
*తస్య ముక్తిః కరస్థా*
*స్యాచ్ఛంకరప్రియకారణాత్*
   ౧౦

*విద్యార్థీ లభతే విద్యాం*
*వివాహార్థీ గృహీ భవేత్*
*వైరాగ్యకామో లభతే*
*వైరాగ్యం భవతారకమ్*  ౧౧

*తస్మాద్దినే దినే యూయమిదం స్తోత్రం సమాహితాః*
*పఠంతు భవనాశార్థమిదం వో భవనాశనమ్*   ౧౨

_*ఇతి శ్రీస్కాందమహాపురాణే సూత సంహితాయాం బృహస్పతికృత శివనవరత్నస్తవమ్ సంపూర్ణమ్*_🙏
సేకరణ....ప్రాంజలి ప్రభ

032..🔅 చిత్తూరు జిల్లా : నారాయణ వనం

🙏 కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం: నారాయణవనం 🙏

👉 కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది.
సాక్షాతూ శ్రీ ఏడుకొండల వాడు "ఎరుకలసాని " గా తిరుగాడిన పవిత్రమైన తిరువీదులు ఉన్న పురం నారాయణవనం . లోకకళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకం లో పరిణయమాడిన స్థలం ఈ నారాయణవనం.
     
తిరుమల యాత్ర లో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవం గా జరిగింది.

🔅 స్థలపురాణం : శ్రీ వేంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్యావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు.
తరువాత క్రమంలో వైకుంఠం నుండి బృగ్నుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం.
వకుళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడుగా ఉండటం జరుతుంది.
కలియుగంలో శ్రీనివాసునిగా శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు . ఆకాశరాజు కుమార్తె పద్మావతి , సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి . వకుళమాత పుత్రుడు శ్రీనివాసుడు . అవతార పురుషుడు . వీరిరువురికీ కళ్యాణం జరిపించాలి వకుళమాత .
ఆమె సన్యాసిని , ఆశ్రమవాసి . నాగరికతకు దూరంగా ఉంది .  శ్రీనివాసునితో పద్మావతీ దేవి పరిణయం జరిపించి తరించిందా పుణ్యమూర్తి .
ఆ కళ్యాణానికి సకల దేవగణాలతో దేవదేవేరులందరూ విచ్చేశారు .
ఆ మహాదానంద ఘటన జరిగింది  నారయణవనంలో .

👉 గ్రామానికి వన్నె తెచ్చేలా పుణ్య అరుణానది ఈ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది
శ్రీవేంకటేశుని భక్తాగ్రణ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన్ చక్రవర్తి స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం .

👉గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా వుంది . శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి వుంటాడు .
ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

👉 కళ్యాణం జరిపించుకొంటున్న ఈ పెండ్లికొడుకు సర్వలంకార భూషితుడై , సుందరకారుడై భక్తజనులను తన చల్లని చూపులతో ఆదరిస్తుంటాడు . శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో వేంచేసివున్నారు . గర్భాలయ  ముఖద్వారం వద్ద నాలుగు చేతులతో ఆయుధాలు ధరించిన ద్వారాపాలకుల విగ్రహాలు రమణీయంగా వున్నాయి . ముఖ్యంగా ఈ ఆలయంలో గమనించవలసిన విషయం ఒకటుంది . గర్భాలయం అంతరాళం , ముఖమండపానికంటే ఎత్తులో వుంది .
ఇక్కడ తిరుమల ఆలయానికి , శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరాలయాలకు భిన్నంగా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మందిరం వుంది .

👉నారయణవనంలో అమ్మవారి ఆలయం ముందు " భాగంలో " పెద్ద తిరగలి " ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . శ్రీనివాసుని కళ్యాణ సమయంలో ఈ తిరగలిని ఉపయోగించారన్నది ఇక్కడి పౌరాణిక ఐతిహ్యం .  అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు.

👉 ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపు వరదరాజ స్వామి ఆలయం వుంది . ఉత్తరం వైపున మరిన్ని దేవతా మూర్తులున్నాయి . ఆలయానికి వెనక వైపున కోనేరు వుంది . ఆనాటి రాజ్య కైంకర్యాలతో ఆలయం శోభించిందని చాటిచెప్పే ప్రతీక ఈ సరోవరం మధ్యలో నిరాళిమండపం , మనకు కనువిందుచేస్తుంది . కళ్యాణ వేంకటేశుని ఆలయానికి కొద్ది దూరంలోని సొరకాయల స్వామి ఆలయాన్ని తప్పక చూడాలి . ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న హోమగుండం లోని విభూతిని ధరాణచేస్తే అనేక విధాల పీడలు తొలగిపోతాయన్నది స్థానిక ప్రజల నమ్మకం .

👉పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.
కేవలం దర్శన మాత్రముచే వివాహం, సంతానం, ఐశ్వర్యం అందించే నారాయణపురం లోని శ్రీ పద్మావతి కళ్యాణ వేంకటేశ్వరస్వామి

👉 ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి . ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది .
అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది . •

👉ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాలు :
🔅శ్రీ పరాశర స్వామివారి గుడి •
🔅శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి •
🔅శ్రీ శక్తివినాయక గుడి
👉 ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి. అవి :
🔅శ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి .
🔅శ్రీ పద్మావతి అమ్మవారు గుడి •
🔅శ్రీ ఆండాళ్ అమ్మవారి గుడి •
🔅శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి •
🔅శ్రీ రంగనాయకులవారి గుడి . •
🔅శ్రీ అవనాక్షమ్మ గుడి

సేకరణ... ప్రాంజలి ప్రభ

033ఫ్లాష్ న్యూస్.... 

సంతోషకరమైన వార్త, మన జాతీయ గీతం "జన గణ మన... " "ప్రపంచంలో నే ఉత్తమ గీతం" ప్రతి ఒక్కరూ పాడాలి 

 మన జాతీయ గీతం యొక్క అర్థం

 చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు స్పష్టంగా ఉచ్చరించండి.

 *”పదం పదం లోని అర్థం*

 జన            = ప్రజలు

 గణ            = సమూహం

 మన           = మనసు

 అధినాయక = నాయకుడు

 జయహే       = విజయం

 భారత      = భారతదేశం

 భాగ్య       = విధి

 విధాత      = డిస్పోజర్

 పంజాబ     = పంజాబ్

 సింధు       = సింధు

 గుజరాత   = గుజరాత్

 మరాఠా    = మరాఠీ (మహారాష్ట్ర)

 ద్రావిడ    = దక్షిణ

 ఉత్కల        = ఒరిస్సా

 వంగా       = బెంగాల్

 వింధ్య     =వింధ్యాలుl

 హిమాచల   =హిమాలయ్

 యమునా     = యమునా

 గంగా         = గంగ

 ఉచ్ఛల = కదులుతున్న

 జలధి =మహాసముద్రము 

 తరంగ = అలలు

 తవ= మీ

 శుభ=మంచిది

 నామే= పేరు

 జాగే     = మేల్కొలపండి

 తవ   = మీ

 శుభ      = శుభప్రదమైనది

 ఆశిష = దీవెనలు

 మాగే     = అడగండి

 గాహే      = పాడండి

 తవ       = మీ

 జయ= విజయం

 గాథ      = పాట

 జన       = ప్రజలు

 గణ      = సమూహం

 మంగళ = అదృష్టము

 దాయక   = ఇచ్చేవాడ

 జైయహే    = విక్టరీ బీ

 భారత = భారతదేశం

 భాగ్య = విధి

 విధాత = పంచేవాడు

 జైయహే, జైయహే, జై యహే, జైయ జైయ జైయ   జయహే = విజయం విజయం,విజయం, విజయం,  ఎప్పటికీ...

 దయచేసి దీన్ని షేర్చేయండి మరి మన జాతీయ గీతం యొక్క అర్థాన్ని ప్రజలందరికీ తెలియజేయండి

034..

*ఆవకాయకూ మాగాయకూ తేడా* చెప్పమని ఒక మిత్రుడు అడిగితే..........

నా పంథాలో.... ఇలా చెప్పాను.

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ తొక్కలే అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  

సాటి జనులపట్ల అమిత కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా

 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊట లోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు

ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...

నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

మానవసేవే మాధవసేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది *మాగాయ!*

************************

సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...

ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 

తనతోపాటు నూనె, శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను.  అని చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది *ఆవకాయ.*

035..ఊహల ఊయల ఊసుల వేళలు 

ఉండిపో ఊసులకలలో ఊపిరగుచు

 ఎప్పటి తలపు అప్పుడే యెదనుతాకు

ఆశల వలయం ప్రేమల అణుకువ కథ

చెప్పగలుగుహృదయ వాంఛ చింతకాదు

 వ్రాసి కథలుగాతెలిపేది వరుసకాదు 

చదలని దులిపే పుస్తకం చరిత్ర కాదు

ఇదియు నిన్నునన్నుకలిపే యిరుసుకాదు

 కలువ పువ్వుచూడనికళ కాలమవదు

 గడప చేరే వెలుతురుగా గమ్య మగుచు 

తడిసి తడవని వయసుగు తపన యగుచు 

తడబడే మనసున శాంతి తత్వ మగుచు 

నడవడిక మనమధ్యన నమ్మ పరచు

రక్ష ణకరువె యనుచునే రాజు వెంట

రాతి గుండె కరుగలేక  రక్ష వెంట 

సగటు మనిషి చాలుబతుకు  సాయ మంట 

చేరు మతని చెంతకళలు చెలిమి మంట 

ఉత్తమ గుణాల దక్షత యుత్తమంబు 

తనదు విద్యయే తనకు నుత్తమ ధనంబు

లాభతతిని యారోగ్యమే లాస్య మంబు 

ఉన్నదానితో సంతృప్తి యుచిత మంబు 

మాట వినటలేక మమత మనసు రాక 

మౌన హృదయపూర్వక తలమో పలేక 

బంధ బాసటగా యేది బలము లేక 

ప్రేమ భద్రత మనలోన ప్రీతి కేక 

అపరిపక్వపండు యనుచు నాశ కలిగి 

రుచులు రావుగాని బ్రతుకు రోత కలిగి 

పెద్ద  చదువు చెప్పబతుకు పిలుపు కలిగి 

చేరదయ్య ఫలమునాకు  చెలిమి కలిగి

రేపటి దిన తపనయేల రీతి మార్చ 

నేటి నిద్ర కదియుతెచ్చు చేటు చేర్చ 

నేడు నిద్ర లేకగతియు నిత్య మచ్చ 

చేటు తెచ్చు రేపు కథలు చింత కచ్చ

036..ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు. ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి.

అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. 

కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది.

ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది. కాకి తెలివి తక్కువ తననికి నవ్వుకుంది.ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా,మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి.ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. 

మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 

'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే ముక్క చేర్చలేదు. 

ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ ' అంటూ మరో మాట చేర్చింది. 

ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.

వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే ... పాపం! రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. 

మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను 'అంటూ వాపోయింది.

మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. 

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. 

ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. 

అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి . 

కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది. 

ఒక్కోసారి అంతే! మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాపనిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు. అలాంటి వందల మంది నీకేలా? " అంటూ ఓదార్చింది కొమ్మమీద కోయిలమ్మ.

No comments:

Post a Comment