Tuesday 11 June 2024

11-06-2024

 


తల్లి తండ్రుల పాఠాలు ( 1 ) (Telugu daily serial)   
ప్రాంజలిప్రభ.  (నిత్య సంతోషం )

అది ఒక కుటుంబం  

కళ్ళజోడు సర్దుకుంటూ చెప్పులు మూల వదలి చేతి కర్రను గట్టిగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు తాతగారు.  

నాన్న ఇప్పుడేనా రావటం అంటూ ఎదురు వచ్చాడు కొడుకు  

ముందు కబురు చెయ్యబోయ్యావా నేను స్టేషన్కు వచ్చేవాడ్ని కదా అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు. 

నీకు ఇబ్బంది ఏమోనని స్టేషన్ దగ్గరదగా వుంది నీ ఇల్లు అందుకే  నేనే వచ్చాను

అమ్మకెలాఉంది నాన్న 

ఎలావుంటుంది అలా నే వుంది "చెట్టంత మొగుణ్ణి ప్రక్కన ఉన్నా కొడుకు ఎలా ఉన్నాడు మనవుళ్లు ఎలా ఉన్నారు అని ఒకటే కలవరింత.

నీతోపాటు తీసుకు వస్తా బాగుండేది, అమ్మ కూడా 2  రోజులు ఉండి పొయ్యేది కదా 

అంటే నన్ను 2 రోజులు ఉండి పొమ్మంటావా ఏంటి ?

అదికాదు నాన్న నేను ఏది మాట్లాడినా " తప్పు పట్టుకుంటావు " ఇంకా మారలేదు మీరు. 

మేమెందుకు మారాలి మీకేమన్న తక్కువ చేశామా, చక్కగా చదువు చెప్పించాము 
కదా 

అవును చెప్పించారు ఎం లాభం ఆ చదువు బతకటానికి కూడా పనికి రాలేదు ఇక బతికించుకోవటం ఎట్లా ?

నీకో విషయం చెపుతా విను " పక్షులు రెక్కలు వచ్చేదాకా పోషిస్తాయి, " తర్వాత స్వేశ్చగా తిరగమంటాయి.   

పక్షులకు మనకు తేడా వుంది కదా నాన్న

వుంది లేదనను 

"మనం జంతువులనుండి పుట్టామని తెలుసుకో కలిగిన వాడే నిజమైన మానవుడు"  

 అంటే ఏమిటి అర్ధం కాలేదు 

ఎందుకు అర్ధం అవుతుంది మాతృభాష వదలి "ఇంగ్లీషు " నేర్చుకోవటం వళ్ళ 

బతికించు కోవాటానికి ఉపయోగ పడుతుందేమో కానీ జ్ఞాన సంపద పెరుగు తుందంటే నేను నమ్మను.

నాన్న  మీరు భాషను తక్కువ చేసి మాట్లాడు తున్నారు 

అవునురా చేతకాని ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఇట్లా గే మాట్లాడుతాను 

"ఎక్కువ జనాభా ఉన్నప్రాంతాలో మెదడు ఉపయోగించుకొని వారి పోషణకు ఆధారపడాలి కానీ వారి పొట్టలు కొట్టి విదేశీ "కంప్యూటర్ " వ్యవస్థను కొన్ని కోట్లు పెట్టి తెస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొచ్చారు. ఎప్పుడు కరంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో తెలియదు.   

అర్ధం కాలేదు నాన్న 

ఎందుకు అర్ధం కాదు నేను తెలుగులో నే కదా మాట్లాడింది 

అందుకే అర్ధం కాలేదంటున్నాను. 

మాతృభాష వదలి పరభాష నేర్పించి నేనే మోసపోయాను, కనీసం మన భాష సంస్కృతి తెలుసు కోలేని కొడుకుని కన్నందుకు మేమె భాధ పడాలి. 

 25 -11-2 0 1 8                                                                 
మల్లా ప్రగడ రామకృష్ణ (6281190539)    
మిగతా భాగం రేపు  


తల్లి తండ్రుల పాఠాలు ( 2 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
          నాన్న ఆధునిక పద్ధతులు, నేర్చుకోవాలి, కొత్త విధానాలతో ముందుకు పోవాలి, ఎంత సేపటికి  పాత చింతకాయ పచ్చడే  గొప్ప అంటే ఎట్లాగు నాన్న, నీకా పెద్ద వయసు వచ్చింది, ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటూ మనవళ్లుతో  ఆడుకోవచ్చుకదా. ఎదన్నా మాట్లాడితే చాలు  రోషం వచ్చేస్తుంది,  రాకెట్టులో చంద్రమండ లానికి పోయే రోజులు వచ్చాయి, అక్కడే కొత్త నగరాలను సృష్టించటానికి మన శాస్త్రజ్ఞులు విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నారు.  

గుడ్డొచ్చి పిల్ల నెక్కి రించినట్లు లాగా ఉన్నాయరా నీ మాటలు, అయినా నీవు చెప్పిన దానిలో కొంత నిజం దాగి ఉన్నది.  పాత చింతకాయ పచ్చడిని చులకన చేయవద్దు అది మన ఆరోగ్యానికి ఏంతో  అవసరం, ఎండు మిరపకాయలు వేయించి, ఇంగువవేసి నూనెతో తిరగమోత పెట్టి చింత తొక్కును కలిపి రోలు యందు వేసి రోకలితో దంచి పచ్చడి చేస్తే దాని వాసన  పది గ్రామాల దాకా వ్యాపించేది అనేవారు. అన్నంలో పచ్చడి కలుపుకొని నూనె వేసుకొని తింటే దాని రుచి  ఇంత అని చెప్పలేము, మరియు దానికి తోడు తల్లి కూడా చేయలేని ఉల్లిపాయను కోరొక్కొని తింటే  అబ్బా అబ్బా  ఉంటుంది తిన్నవాడికే తెలుస్తుంది. ఎంతసేపటికి ఆధునికమని "పిజ్జాలు, గప్ చిప్పులు, చాక్ లేట్లు " తింటే అనారోగ్యము మరియు జీర్ణము కాకా ఏంతో భాధ పడాలి. తిండి విషయంలో ఆధునికమా పాత అని ఆలోచించటం తప్పు, శుభ్రంగా చేసింది ఏది, శరీరానికి హానికలుగా కుండ శక్తి వంతుడుగా మార్చే పౌష్టిక ఆహరం తీసుకోవాలి. 

మరో విషయం పెద్ద వయసు వచ్చింది మూల కూర్చో అనే హక్కు నీకు లేదు, ఎవరి కష్టార్జితం వారిది, ఎవరి శక్తి వారిది, పెద్ద వయసులో జ్ఞానం పెరుగుతుంది, హితబోధ చేయుటకు సహకరిస్తుంది, శరీరము కూడా మందులపై ఆధార పడుతుంది. తండ్రిగా చేయవలసినది చేసాం,  మాలో ఉన్న శక్తిని 50% మీకే  దారపోసామ్, నేను ఉన్నాను, నేను చదివిన రామాయణ భారత భాగవతాలలో ఉన్న   అంతర్గత సూక్తులను రోజుకు ఒక స్కూలుకు వెళ్లి చెపుతున్నాను,  అట్లా చేయుట వళ్ళ నాకు మీ అమ్మకు ఏంతో  తృప్తిగా ఉన్నది. నీవు అనవచ్చు  నీవు చెప్పే కధలు ఇంగ్లీషు మీడియంలో చదివే వారికి ఏమి అర్ధం అవతాయని, నీ  ప్రయత్నం శుద్ధ దండగా అని అనవచ్చు. ఏది ఏమైనా మన సంస్కృతి సంప్ర దాయాలని కాపాడాలని మా ప్రయత్నం మాత్రం ఆపను, నా వయసులో ఉన్న వారికీ మన: శాంతి కల్పించి చేతనైన సహాయము చేయాలని అను కుంటున్నాను. తెలుగు భాష బతకాలనీ నా ప్రయత్నం మానను, అందర్నీ తెలుగు నేర్చుకోమని ప్రాధేయ పడతాను.                        
   
              రోషం వస్తుందంటావు, కష్టపడ్డ వాడికి తెలుస్తుంది సుఖ విలువ, సుఖ పడే వానికి ఎం తెలుస్తుంది కష్టం విలువ.  మంచి చెడు ఆలోచించ కుండా, చిన్న పెద్ద ఆలోచించ కుండా, మిడి మిడి జ్ఞానముతో దేవుడు సహకరించిన ధనాన్ని చూసుకొని, ఇది నా కష్టార్జితమ్  మూర్ఖుడుగా మారి నోటికి ఏది వస్తే అది అంటే పడేవారు కాదు పెద్దవారు. పేద వయసులో పిల్లల  సంపాదన కన్నా తక్కువ ఉండవచ్చు సంపాదన, అంత  మాత్రాన చేతకాని వారిలాగా చూస్తే ఎవ్వరూ ఊరుకోరు కొడుకులందరు అది గుర్తించు కోవాలి.        

  25 -11-2 0 1 8                                                                 

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ (6281190539)    
                                                                                                      మిగతా భాగం రేపు   



తల్లి తండ్రుల పాఠాలు ( 3 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
చూడు బాబు ఎదో నా మనసు ఒప్పక కొన్ని విషయాలు నీకు తెలపాలనుకున్నా ఎందుకంటే మానవ ప్రయత్నమూ ఎంత ఉన్న భగవంతుని ప్రయత్నము తప్పక ఉండ వలెను. ఉపయోగము, నిరుపయోగము గూర్చి వివరిస్తాను. ఎందు కంటే మనిషన్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆవిషయాల వళ్ళ మనకు జ్ఞానము పెరగాలి.      
చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో
 - భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమూ  

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో
 - శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమూ

చదువు  లేని మూర్ఖుడు ఉన్నా ఎంత నిరుపయోగమో
 - తల్లి తండ్రుల్ని చూడని బిడ్డ అంతే నిరుపయోగమూ

 శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమే 
- శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   

ఏమిటిరా అల్లా బిత్తర చూపులు చూస్తున్నావు, నువు చెప్పేవి ఏమి అర్థకాని మొహంలా  ఉన్నది. అసలు దేవుడు భక్తి అనేది ఎదో తెలియకుండా పెరిగావ్, ఎదో నీ  అదృష్టమో, మా అదృష్టమో, తక్కువ మార్కులు వచ్చినా  ఉద్యోగం సంపాదించి కాలర్ ఎగరేస్తున్నావు అది నీ  గొప్పతనం కాదు, అది దేవుని సహకారము వళ్ళ వచ్చిందని గమనిస్తే నీకు మాకు ధర్మము. 

"మృదు స్వభావం కలవాడు ఎల్లప్పుడూ అవమానాలకు గురి అవుతాడు. కోపిష్టికి ఎప్పుడూ విరోధాలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ వదలి మధ్యేమార్గాన్ని ఆశ్ర యించాలి "       


నాన్న నన్ను క్షమించు నేను ఎమన్నా తప్పు చేస్తే మన్నించు అన్న మాటలకూ తండ్రి వెంబడి కళ్ళు నీరుకారాయి. 

చూడు బాబు   ఎండిన ఆకు రాలక తప్పదు, లేత ఆకు పండి ఎండేదాకా ఆగక తప్పదు.            
 26-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     
(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 
  

                                                                                                         మిగతా భాగం రేపు   


తల్లి తండ్రుల పాఠాలు ( 4) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
నాన్న నీవు చాలా మంచి విషయాలు తెల్పావు, మీకు కాఫీ కలుపుకొస్తాను అన్నాడు. 

ఏమిటిరా కోడలు లేదు ఇంట్లో. 

లేదు నాన్న ఉద్యోగ రీత్యా క్యాపుల్కి వెళ్తున్నది

మరి ఎప్పుడొస్తుంది     

ఇంకా 4  రోజులు పడు తుంది 

మరి పిల్లలు ఎరిరా 

స్కూల్ హాస్టల్లో చేర్చాను 

చిన్న పిల్లలే కదా వారు ఇంట్లో మీదగ్గర చదివితే మంచిది. అక్కడ తిండి ఎలా ఉంటుందో 

అది కాదు నాన్న ఇద్దరం ఉద్యోగం కు వెళ్ళాలి 

పిలల్లను పెంచటం కష్టమని ఈ పనిచేసాను నాన్న

అట్లయితే నీదగ్గర నేను కూడా ఉండటం కష్టమే 

నీకు పిల్లలకు తేడా ఉందికదా నాన్న

ఏమిటి తేడా వయసా 

60 ఏళ్ళు నిండినవాడు 6  ఏళ్ళు వయసు వారితో సమానమని ఎక్కడో చదివాను రా 

మీ పురాణాలు నాకెందుకు నాన్న

ఇదిగో కఫీ త్రాగు ముందు         

గీజెర్ వేసా నీళ్లు కాగాయి ముందు స్నానం చేసిరా 

ఆ తర్వాత టేబుల్ పై ఇంగ్లీసు పాపర్ ఉంది చదువుకో 

అవును నీకు ఇంగ్లిష్ రాదు కదా 

తెలుగు బాషా పిచ్చోడివి 
  
అవునురా నేను పిచ్చో డ్ని 

మిడిసి పడకు 
ఎప్ప టికైనా బతికి బతికించేది మాతృ భాష మాత్రమే, అది మాత్రం గుర్తించుకో

ఇంగ్లిష్ చదువులు మేఘం లాంటివి 

గాలి వీస్తే మేఘాలు కదిలినట్లు, భాషా పరిజ్ఞానమ్ పెరుగుతున్నది ఇప్పుడున్న కంప్యూటర్లో ఆంట్ తెలుగు భాషగా మారుతున్నది, అప్పుడు మీరు తెలుగు నేర్చుకోవాల్సి వస్తుంది 

సరే ముందు స్నానము చేసి రండి 

తర్వాత ప్రక్కన ఉన్న హోటల్ కే పోయి టిఫిన్ తిందాం 

ఇంతకూ నిన్ను అడగటం మరిచా మన పొలం కవులు కిచ్చావుగా ఏమైనా డబ్బు ఇచ్చారా అవి తీసుకొచ్చావా 

హాస్టల్ ఫీజు కట్టాలి 

ఇద్దరు ఉద్యోగం చేస్తూ కూడా ఈ అడుక్కోవడం ఎందుకురా 

ఈ సంపాదనలో కనీసం తిండి కూడా తినలేక పోతున్నారు 

ఆరోగ్యాలు చెడితే ఇంకా కష్టం, అదేనెను చెప్పా దాలిచా 

ఎరా నన్ను కనీసం స్నానమన్న చేయ నిస్తావా, ఇట్లా బస్సు ఎక్కి పొమంటావా

నేను అడిగినది ఏమిటి, నీవు చెప్పేది ఏమిటి, అర్ధం అసలు కావటం లేదు నాన్న

అవునురా అర్ధం చుట్టూ తిరుగుతున్నావు, ఆ అర్దమే పరమార్ధం  అను కుంటున్నావు అది

 నిన్ను ఒక్క చోట నిల్వ నీయదు, మన: శాంతి ని మింగేస్తుంది

అది ఇప్పుడు అవసరమా 

నాన్న నేను నీతో మాట్లాడలేను ముందు స్నానమ్ చేసి రండి                   

సరే అట్లాగే చేస్తా 

సంచి ఇక్కడ ఉంచవచ్చు వచ్చు, ఎం పర్వాలేదు ఎక్కడెవ్వరు లేరు దొంగలు 

ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేరుట ఎవరి జాగర్త వారిది 

(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 

-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     

  మిగతా భాగం రేపు   



బాబు నేను ఒక్క విషయం చెప్పా దలుచుకున్నాను

మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేస్తే అది " దానం ". మనకోసం ఆలోచించకుండా ఇతరుల శ్రేయస్సు కోరి చేసిన సహాయం "త్యాగం" అవుతుంది. అలాంటి త్యాగ గుణం ఉన్నప్పుడు మనిషి మనిషిగా గుర్తింపు పొంద గలుగుతారు.

ఏమో నాన్న దానం అంటూవుంటావో, త్యాగం అనుకుంటావో అది నీ ఇష్టం నాకు మాత్రం డబ్బు కావాలి అది నీవు సర్దాలి అంతే

నేను నీకు ఇవ్వకపోతే ఏమ్చేస్తావ్

ఏంచేస్తాను ఏమి చేయను, నాకున్న దానిలో స్దర్దుకుంటాను

అయితే నేను నీకు డబ్బు ఎందుకు ఇవ్వటం, అయితే సర్దుకో ఎవరైనా దగ్గరగా ఉంటె ప్రేమ చూపిస్తారు, దూరమయిన కొద్ది ప్రేమ పెంచు కుంటారు, నీవేమో కేవలం డబ్బు చుట్టూ తిరుగుతున్నావు, డబ్బే ప్రేమ అనుకుంటున్నావు, తల్లితండ్రులు సహాయం చేశారే వారికి చేయూతగా ఉండాలని ఒక్క నిముషమైన అనుకున్నావా, కేవలము నీపెళ్ళాం, నీపిల్లలని ఆలోచించుకుంటుంన్నావు, నీకూ వయసు రాక పోతుందా, అనుభవం రాక పోతుందా అన్ని నేను చూస్తానురా

నాన్నా డబ్బు అడిగినందుకు ఇంట ఉపన్యాసం అవసరమా

సరే నాన్న ఇక్కడ టిఫిన్ తిందాం

ఇక్కడ ఎక్కడ హోటల్ లేదుకదరా

అదిగో నాన్న ఆ బడ్డి కొట్టు పాకా క్రింద దోశలు వేస్తున్నారు కనిపించాలా

నీ బుద్ధి, అక్కడ ఉన్న స్థితి చూస్తే నాకు ఆకలి చచ్చి పోయింది రా

నీవు రోజు ఇక్కడే తింటావా

లేదు నాన్న ఇంట్లో రోజు నేనే చేస్తాను, ఇప్పుడు మా ఆవిడ లేదుకదా నీవేమో ఆకలిగున్నావు అందుకని

అందుకని ఇక్కడకు తెచ్చానంటావ్ , ఇక్కడ కూర్చొని తినమంటావ్

తినేవారు మనుష్యులు కాదంటావా

కాదనను పరిశుభ్రం పాటించమన్నారు, ఉన్నవాటిలో సుబ్రహముగా ఉంచమన్నారు, ఇఇగాలు దోమలు రాకుండా చూడమన్నారు, రోడ్డు మీద పోయే వాహనాలు పొగ దూర కూడదన్నారు, మంచి నీరు పాకెట్లుకాని, మంచి నీరు కాం కానీ ఉండాలన్నారు, జంతువులూ రాకుండా చూడాలన్నారు. అక్కడ  చూస్తే అన్ని వ్యతిరేకముగా ఉన్నాయ్ .

అల్లాంటప్పుడు

అల్లాంటప్పుడు ఇక ఊరికి వెనక్కి వెళ్ళితే ఆకలితో అలమటిస్తావ్ . నాకెందుకు పాపం తండ్రికి కూడా కూడు పెట్టలేని కోడుకు అని లోకులు అనుకుంటారు.

అబ్బో నీకు ఎంత దయార్ద్ర హృదయం, తండ్రి మీద ఎంత గౌరవం, చాలు బాబు చాలు

నీ వినయ నయనాల చూపులకు, నేను లొంగి పోతాననుకుంటున్నావా ?

ముందు నీ సెల్ తీ ఎవ్వరో పిలుసున్నారు,  మీ ఆవిడ అయితే, నీకు ఇంకా కష్టం ముందు దానికి సమాధానము చెప్పు

నాన్న మా ఆవిడ ఫోన్  నీవిక్కడే ఉండు నేను అలా మాట్లాడి వస్తాను.

తండ్రి వద్ద కూడా ఫోన్ మాట్లాడలేని పరిస్థితి కల్పించిన భగవంతుని ప్రార్ధించటం తప్ప ఏమి చేయలేను.

నాన్నా

ఏమిటి కన్నా

మా ఆవిడా

అలా పెదాలు తిప్పకు, అసలు విషయం చెప్పు

మా ఆవిడ వచ్చి టిఫెన్ చేస్తుందట ఇంటికెల్దామ్ పదా నాన్న అన్నాడు

నీ శ్రీమతి రాలేదుకదా

ఒక్క అరగంట లో వస్తుంది నాన్న

ఒక్క అరగంట

అవునూ ఒక్క అరగంట

"మార్గం పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో నిండి ఉంటుంది. అయినా నిస్పృహ చెందకుండా, లేవండి, మేల్కొండి గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి అన్నారు స్వామి వివేకానంద నాన్న "

అవును కదా నాన్న

ఏమిటి అల్లా నావు కుంటున్నావు

నీ  నోటినుండి మంచి వాక్యం కూడా వింటున్నానే  అని ఆశ్చర్యంగా  ఉన్నది , అందుకే నాకు నవ్వు వచ్చింది

అవును కదా నాన్న నీ కొడుకే కదా

విత్తు వేసిన మెక్కే కదా చెట్టుగా మారేది

వేరే చెట్టు ఎలా ఎదుగు తుంది నాన్న

అవునురా నీ  బుద్దిని అర్ధం చేసుకోలేని మూర్ఖున్ని నేనే

పద పదా ఇంటికి పోదాం

లేక పొతే నీకు అక్షన్తులు పడతాయ్, దానికి నేను కారకుణ్ణి కాకూడదు

నాకు ఆకలి లేనే లేదురా పద పద ఇంటికిపొదాం
   


నమస్కారం రామకృష్ణ శర్మ గారు మిమ్మల్నిచూసి ఎన్ని రోజులయిందో
బాగున్నారా
బాగున్నాను, మిమ్మల్ని గుర్తు పట్టలేదు
నేనండీ గుంటూరులో ఆంజనేయస్వామి గుడి వద్ద ఉండేవారు, అప్పుడు మీరు లెక్కల పాఠాలు చెప్పేవారు
ఎప్పటి విషయం 40 సంవత్సరాల వెనకటి విషయం కదా అది
నేను మీ శిష్యుణ్ణి అప్పటి నుండి మిమ్మల్ని కలుద్దామను కుంటున్నా
ఇక్కడే మాయిల్లు
ఒక్క సారి మాఇంటికి రండి మమ్మల్ని దీవించండి
నేను మా అబ్బాయి ఇంటికి వచ్చాను.
నేను మీ అబ్బాయిని అడుగుతాను, మీకు అభ్యంతరం లేదుకదా
నాకేం అభ్యంతరం లేదు,
బాబు నీవు కూడా రా ఒక్కసారి మా ఇంటిదాకా రండి, కాఫీ టిఫిన్
తీసుకోవచ్చు 
వద్దులెండి నాకు పని ఉంది తొందరగా పోవాలి
నాన్న గారు మీ శిష్యుడు అంతగా అడుగుతున్నాడుగా వెలతారా నాతో  వస్తారా
బాబు మీ ఆవిడ నుంచి ఎదో ఫోన్ వచ్చింది కదా
నేను మా శిష్యుని దగ్గరకు పోయి వస్తాను
నాన్న ఇల్లు గుర్తుందా మీకు
మీ ఇల్లు అడ్రస్సు చెప్పండి నాకు, నేనే దించుతాను గురువు గారిని           
సరే మీ ఫోన్ నెంబరు చేయాండి ఇది నా ఫోన్ నెంబర్ అంటూ చెప్పఁటం జరిగింది
అడ్రస్ తీసుకోవటం, కొడుకు వెళ్ళటం, గురువుగారు శిష్యుని ఇంటికి చేరటం క్షణాల్లో జరిగి పోయింది
ఇల్లు బాగా కట్టుకున్నావు ఎం చేస్తున్నావు, ఎపి మోడల్ స్కూల్ ల్లో టీచర్ గా పనిచేస్తున్నాను.
ఏ సబ్జెక్టు చెపుతున్నావు
 లెక్కలు -
చాలా సంతోషం
గురువుగారు అడిగినానని అనుకోవద్దు మీరు ఏంచేస్తున్నారు
నేను కొన్నాళ్ళు లెక్కల టీచర్ గాను, అనేక సంస్థలలో పనిచేయటం జరిగింది.
ప్రస్తుతం కాలక్షేపం కోసం తెలుగు సాహిత్యాన్ని వృద్ధి పరుచుటకు కృషి చేస్తున్నాను
మంచిది గురువుగారు నేను కూడా మీకు సహకరిస్తాను మన మాతృభాష వృద్ధికి నేను సహకరిస్తాను.
అల్పాహార విందు అద్భుతముగా ఉన్నది. మీ శ్రీమతి ని వత్తిడి చేయలేదు కదా
మేము రోజు చేసుకొనేవే మేము పెట్టాము అంతే
మీ సంతోషాన్ని చూస్తే మీకు నాలుగు మంచి వాక్యాలు చెప్పాలని ఉంది చెప్పమంటే చెప్పఁగలను,           
ఆకలిగా ఉన్న వానికి అల్పాహారం పెట్టిన పార్వతి పరమేశ్వరుల్లా  కనిపిస్తున్నారు, నేను మీ కన్నా పెద్ద వాన్ని కదా, దీవెనలు అందించ గలను, అంత కన్నా ఏమి ఇవ్వలేను, అన్యదా భావించ వద్దు.
అయ్యో ఏమిటండి ఆ మాటలు
ఏమిటి బాబు అవి
ఏమిలేదు, మీకు టీచరమ్మగారికి "రాములువారికి చేసిన హనుమంతుని  భక్తిగా " ఎదో నా శక్తి కొద్ధి వస్త్రాలు సమర్పించు కుంటున్నామండీ  అంతే
అవన్నీ ఇప్పుడెందుకు బాబు
అట్లాగణకండి ఇది మాతృప్తి
అలా కూర్చోమ్మ ఎంత సేపు నుంచొని ఉంటావ్
నీవుకూడా కూర్చో మీ మాటలను కాదన లేక పోతున్నాను
అక్షంతలు ఇవ్వండి ఆశీర్వదిస్తాను   
ఆ పరమేశ్వరుని నమ్ముకొని సుఖ శాంతులతో జీవించండి. అన్నారు గురువుగారు
గురువుగారు మీ సందేశం వినాలని ఉంది.
అలాగే             
సావధానంగా వినండి ....

 దీపం ప్రత్యక్ష పరబ్రహ్మ స్వరూరం. పరమాత్ముడు అందరిపై ఒకే విధముగా ప్రవర్తిస్తాడు. అదేవిధముగా మనము కూడా అందరిపై ప్రేమా ను రాగాలను పంచాలి. స్వార్ధం అనేది మనసులోకి రాకుండా జాగర్త పడాలి. మనలో దానవత్వం పోవాలంటే అసురగుణాలను తరిమి మనస్సును పరిసుద్ధముగా మార్చుకొని, బుద్ది వికసించుకొని, వివేకముతో ఉదయించాలి, అనగా మనలో ఉన్న చీకటిని తరిమి జ్ఞానవేలుగును అందరికి పంచాలి.

           దీప ఎవరు వెలిగించినా వెలుగు తుంది దానికి అస్పృశ్యభావన లేదు, వర్ణ వివక్షత లేదు, ఆడ, మొగ, అనే భేదము లేకుండా ఎవరు వెలిగించిన వెలిగేది దీపం. అలాగా మనం జాతి, మత, కులాల అతీతంగా ఎదిగేలా హృదయంలో ఉన్న దీప వెలుగును, అధికారంలో ఉండి అలమటిస్తున్న జీవులకు చేయతనిచ్చి వెలుగు నింపాలి.

           దీపం ఏ నూనె వేసినా వెలుగు తుంది అలాగే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్న, ఎలాంటి వారితో ఉన్న, మనకర్తవ్యం ఏమిటి అని అలోచించి మన పని చేసుకొంటూ పనిలో ఉన్న వెలుగును చీకటి కమ్మకుండా (అనగా చీకటి తెచ్చే దుష్ట ఆలోచనల పరిబ్రమలు తొలగించుకోవాలి)  పనిలో ఇతరులకు సహాయము చేసి వాళ్ళ కల్లో వెలుగును చూడాలి అదే  నిజమైన దీపం అని గ్రహించాలి.

           దీపం పెద్ద మెడలోని, చిన్న గుడిసెలోను ఒకే విధముగా వెలుగుతుంది. అలాగే మనకు సిరిసంపదలు ఉన్న లేకపోయినా,     
అధికులపట్ల, అధములపట్ల ఒకేవిధముగా కష్టాలలోను సుఖాలలోను వెలుగును నింపాలి. సూర్య భగవానుడు తూర్పును ఉడాయించి పడమర అష్టమికిన్చేవార్కు తన వెలుగును పంచుతూ సర్వజీవుల ఎలా ఉపయోగ పడుతున్నారో అలాగే ప్రతిఒక్కరు ఉపయోగ పడాలి అప్పడే దేశం వెలిగి పోతుంది అంతా శుభ సూచనలే మన వెంట ఉంటాయి.
 
              అందుకే అన్నారు కంటికి వెలుగు, ఇంటికి దీపం ఇల్లాలిని అన్నారు. ఏది లేకపోయినా ఆయిల్లు చికటితో సమానమని అన్నారు.
అనడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసుని వధించాడు. అలానే ఏపని చేసిన శ్రీమతికి తెల్పి శ్రీమతి చెప్పే సలహా మంచో చెడో ఒక్కసారి ఆలోచించి ( అనగా ఆ ఆలోచనే వెలుగు) చేస్తే అదే కుటుంబానికి వెలుగు.                   
పుడమి తల్లికి ఉన్న ఓర్పు ప్రతి స్త్రీ కి ఉంటుంది కనుక సలహాను అనుకరించటం తప్పు కాదు అదే ఒప్పే అని భావించాలి. జ్ఞమనే పురుషుడు, వివేకమనే స్త్రీ తో కలసి మనలో ఉన్న అసురగుణాలను తొలగించుకొని నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలుగుతూ ఉండటమే జీవితం.

             దృష్టి (వెలుగు) దోషముకూడా ఉంటుంది, కనుక మన మనస్సు ఒకరి వృద్ధినిచూసి మరొకరు అసూయపడకుండా, మనస్పర్ధలు లేకుండా సమెక్యత భావము తో పనిచేస్తూ, అంతటా ఆనంద జ్యోతులను వెదజల్లి   ప్రతిఒక్కరు జీవితాన్ని సాగించాలి.   అదే అందరిలో వెలిగే నిత్య దీపావళి         

          చివరిగా ఒక్క మాట తెలుపుతున్నాను మన మనస్సు ఒక బూతద్ధం (ఆశలు అనే) దూళికమ్మి ఉంటుంది. దాన్ని తొలగించు కోవాలను కుంటే  అరిషడ్వర్గ రూపంలో మన మనో అంటుకున్న మాలిన్యాన్ని తొలగించు కుంటే నిత్యవసంతం, అండ పిండ బ్రహ్మాణ్డె లోకాలను దర్శించే వెలుగు శక్తి మన వెంటే ఉంటుంది అదే మన: శాంతి.   

          సూర్యుని వెలుగు చీకటిని పారద్రోలినట్లు దారిద్రమనే చీకటిని పారద్రోలి శ్రేయస్సును కలిగించే లక్ష్మి కళ నిజమైన దీపం. మానవజన్మ (స్మృతి, మతి, బుధ్ధి, ప్రజ్ఞ ) అనగా గతం గత: జరిగి పోయిన కాలాన్ని పదే పదే ఆలోచించటం అనవసరం అదే భూతకాల "స్మృతి", ప్రకృతిని బట్టి, కాలాన్ని బాట్టి బుద్దిని ఉపయోగించటమే వర్తమానకాలం "బుద్ధి",  జరగ బొయ్యేది ఎవ్వరూ ఊహించలేరు భవిషత్ కాలం గురించి ఆలోచనే "మతి " సమయాన్ని వ్యర్ధ పరచ కుండా జీవించే వ్యక్తికీ భవిషత్ కాలం గురించి ఆలోచనే రాదు. మానవ మేధస్సే "ప్రజ్ఞ " ఇదే ప్రతిఒక్కరిలో వెలిగే దీపం.      

అని రామకృష్ణ శర్మ గారు తనకు ఆతిథ్యం ఇచ్చిన దంపతులకు అమూల్య సందేశము అందచేశారు

     




: *భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*

*1.* భగవద్గీతను లిఖించినదెవరు?

=విఘ్నేశ్వరుడు.

*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?

= భీష్మ పర్వము.

*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?

=మార్గశిర మాసము.

*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?

=హేమంత ఋతువు.

*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వసంత ఋతువు.

*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?

=శ్రీకృష్ణుడు అర్జునునికి.

*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?

=కురుక్షేత్ర సంగ్రామము.

*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?

=కౌరవ పాండవులకు.

*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?

=అర్జునుడు.

*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=సామవేదము.

*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?

=పాంచజన్యము.

*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?

=పద్దెనిమిది (18)

*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?

= వినోబా భావే.

*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

= మహాత్మా గాంధీ.

*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?

= సంజయుడు.

*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కుమారస్వామి.

*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?

=దేవదత్తము.

*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?

= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)

*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?

=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= శ్రీరామచంద్రుడు.

*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=అచ్యుత, అనంత, జనార్ధన.

*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?

=ధనుంజయ, పార్ధ, కిరీటి.

*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?

=గీతా గానం.

*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?

=ఎడ్విన్ ఆర్నాల్డ్.

*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?

=పౌండ్రము.

*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=శంకరుడు.

*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?

=మహాత్మాగాంధీ.

*28.* భగవద్గీత ఏ వేదములోనిది?

=పంచమ వేదం-మహాభారతం.

*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?

=11వ అధ్యాయము

*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=విష్ణువు

*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?

=అర్జున విషాద యోగము.

*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?

=పదివేలమంది.

*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?

=అనంతవిజయము.

*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?

= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.

*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?

=సంజయుడు.

*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?

=దృష్టద్యుమ్నుడు.

*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వజ్రాయుధము.

*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?

=వజ్ర వ్యూహం.

*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?

=భీష్ముడు.

*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాసుకి.

*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= అనంతుడు.

*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?

=సుఘోషము.

*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?

=గాండీవము.

*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?

=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)

*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గంగానది.

*46.* ఆత్మ యెట్టిది?

=నాశరహితమైనది.

*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?

=నిష్కామ కర్మ.

*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?

=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)

*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?

=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?

= రావిచెట్టు.


*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?

=ఆత్మ.

*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?

=మణిపుష్పకము.

*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?

=ఆత్మయందు.

*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?

=హనుమంతుడు.

*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= గరుత్మంతుడు.

*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?

=తాబేలు.

*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?

=చేయుటయే మేలు.

*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?

=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?

=లోక క్షేమం కొరకు.

*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కామధేనువు.

*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?

=స్వధర్మము.

*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?

=కామము చేత.

*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?

= కామము యొక్క ప్రేరణచే.

*64.* భగవంతుడెపుడు అవతరించును?

=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.

*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ప్రహ్లాదుడు.

*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= చిత్రరథుడు.

*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?

=జ్ఞానతపస్సు.

*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?

=పరమశాంతి.

*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?

=గాలిలేనిచోట గల దీపంతో.

*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?

=అభ్యాసము, వైరాగ్యము.

*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?

=భగవంతుని శరణుపొందుట వలన.

*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?

=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)

*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?

=అజ్ఞానులు.

*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?

=బ్రహ్మవిద్య.

*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= భృగు మహర్షి.

*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?

=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?

=పరమాత్మయందు.

*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?

=పరమాత్మయందు అనన్యభక్తిచే.

*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?

=భగవంతుని భక్తుడు.

*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?

=సాక్షాత్తు పరమాత్మయే.

*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మనస్సు.

*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?

=మేరువు.

*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=బృహస్పతి.

*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=ఓం కారము.

*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?

=జప యజ్ఞము.

*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఐరావతము.

*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఉచ్ఛైశ్శ్రవసము.

*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?

= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)

*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= నారదుడు.

*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

=కపిల మునీంద్రుడు.

*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?

= మోక్షసన్యాస యోగము.

*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= కాలము.

*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మొసలి.

*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?

= సత్త్వ, రజ, తమో గుణములు.

*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాయువు.

*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 35.

*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?

= ఆధ్యాత్మ విద్య.

*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?

= వాదము.

*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?

= "అ"-కారము.

*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?

= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?

= మార్గశిరము.

*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?

= 20 (ఇరువది).

*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 26 (ఇరువదియాఱు).

*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?

= 6 (ఆఱు).

*105.* తపస్సులెన్ని రకములు?

= మూడు (శారీరక, వాచిక, మానసిక)

*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?

= మూడు (ఓమ్, తత్, సత్).

*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?

= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.

*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?

వేదవ్యాసుడు.

💐🙏💐


పరమ శివుని శత నామాలు - నిత్యమూ స్మరించవలసినవి 🙏🌹
📚. ప్రసాద్ భరద్వాజ

1 స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
2 స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,
3 ప్రభుః = సమస్తమునకు అధిపతి,
4 భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
5 ప్రవరః = సర్వశ్రేష్టుడు,
6 వరదః = వరములనిచ్చువాడు,
7 సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
8 సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
9 సర్వః = సమస్తము తానేఅయినవాడు,
10 సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
11 భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
12 జటీ = జడలు ధరించినవాడు,
13 చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
14 శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
15 సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
16 సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
17 హరః = సమస్త పాపములను హరించువాడు,
18 హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
19 సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
20 ప్రభుః = అధిపతి,
21 ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
22 నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
23 నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
24 శాశ్వతః = నిత్యమైనవాడు
25 ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
26 శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
27 భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
28 ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
29 అగోచరః = కంటికి కనిపించనివాడు,
30 అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
31 అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
32 మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
33 తపస్వీ = తపస్సుచేయువాడు,
34 భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
35 ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః= పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
36 సర్వలోక ప్రజాపతిః= సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
37 మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
38 మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
39 వృష రూపః = పుణ్య స్వరూపుడు,
40 మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
41 మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
42 సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
43 శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
44 మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
45 లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
46 అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
47 ప్రసాదః = అనుగ్రహించువాడు,
48 నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
49 పవిత్రం = పరిశుద్ధమైన,
50 మహాన్ = గొప్పవాడు,
51 నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
52 నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
53 సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
54 స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
55 ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
56 నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
57 సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
58 విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
59 సోమః = చంద్రుని వంటివాడు,
60 నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
61 చంద్రః = చంద్రుని వంటివాడు,
62 సూర్యః = సుర్యుని వంటివాడు,
63 శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
64 కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
65 గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
66 వరః = శ్రేష్టుడు.
67 ఆది = మొదలు,
68 అంతః = చివర,
69 లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
70 మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
71 అనఘః = పాపరహితుడు,
72 మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
73 ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
74 అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
75 దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
76 సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
77 మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
78 ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
79 పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
80 యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
81 యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
82 మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
83 మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
84 మహాబలః = గొప్పశక్తి కలవాడు.
85 సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,
86 సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
87 సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
88 బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
89 దశబాహుః = పది భుజాలు కలవాడు,
90 అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
91 నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
92 ఉమాపతిః = పార్వతి భర్త
93 విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
94 స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
95 బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
96 బలః = బలము కలవాడు
97 గణః = సమూహ స్వరూపమైనవాడు
98 గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
99 గణపతిః = ప్రమ
ధాతి గణములకు అధిపతియైనవాడు
100 దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు
🌹 🌹 🌹 🌹 🌹



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు*..


భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:-


1) *భూలోకం* - ఇచ్చట స్వేదజాలు (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు, పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.


2) *భువర్లోకము* (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.


3) *సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము* (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.


4) *మహర్లోకము* (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


5) *జనోలోకము* (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ, భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో, ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువురూ, ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.


6) *తపోలోకము* (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో, ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి, కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో, అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు.


7) *సత్యలోకం* (తపోలోకము పైన) - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు, ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది, తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడా, అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు, వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


*భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు (7)*:-


1) *అతల లోకం* - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున, అధిక మద సంపన్నులు.


2) *వితల లోకం* (అతలలోకం కింద) - ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది, సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు, ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.


3) *సుతల లోకము* (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు, బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.


4) *తలాతల లోకం* (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.


5) *మహాతలము* (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై, మహా బలవంతులై, కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.


6) *రసాతలము* (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.


7) *పాతాళము* (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు, సర్ప సమూహములన్నీ కామరూపధారులై, సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును...


*సర్వేజనాసుఖినోభవంతు*🙏


🌹🌹🌹🌹🌹🌹                                                     🪷⚛️✡️🕉️🌹

No comments:

Post a Comment