Wednesday, 5 June 2024

08-06-2024

 



073..విశ్వంలో ... విజ్ఞాన దీపం ..( 9    ) రోజువారి కధ ..... ప్రాంజలి ప్రభ
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ (ఇది కధ కాదు అనుభవ సారం )


మైదాన మంతా ఎగిరి ఎగిరి, అలసిన బంతి ఎండిన గడ్డి మీద , ఆయాసం వగర్పూ
చెమటలా ఆరి పోయే ఆట కబుర్లు, అట్లాగే ఉదయం లేచిన నప్పడి నుండి సాయత్రం వరకు కష్టపడి చల్లని వెన్నెల తగల గానే హృదయం చల్లబడి ఆత్మారాముడు చల్లఁబడి, శ్రీమతి చెప్పు కబుర్లు,   ఆ సమయమునా ముసురు కాకి అరుపులు వినరావు, రెక్కలు సహకారం అందుతుంది సమస్యలు అనేవి ఆ సమయాన అసలు గుర్తుకు రావు, విషయ వాంఛ అనుభవేశ్చ తృప్తి సంతృపి మధ్య అనురాగ సంగమం ముద్దర ఏర్పడుతుంది।  ఇంకా పైకి ఎదగడానికి ఆరోగ్యం ఆనందం కలసి మెలసి ఒకటౌతుంది। 

ఇక తెల్లవారిన తర్వాత ఇక ఈ గూడు ఖాళీ ఎటు పడితే అటు కదులుతుంది ఎండిన ఆకులా తల్లి వంట కార్యక్రమములోభార్య,  పిలల్లు చదువునిమిత్తం బయటకు, భర్త ఉద్యోగధర్మం నిర్వహిస్తారు।  
మరలా చుక్కలు లేని రాత్రి వర్షం వచ్చిన  చప్పుడుతో, ఒళ్ళు నెప్పులతో దెబ్బలతో నొప్పులతో బయటికి ఇక మళ్ళీ సాయంత్రం, ఏ గాలి దెబ్బకు ఇమి జరిగినా గూటికిచేరిన పక్షులు ఆనందం చేటుచేసుకుంటూ గతాన్ని మరచి వర్తమానాన్ని అనుకరిస్తూ, భవిషత్తుకు పునాది వేసుకుంటూ బతకాలి ప్రతిఒక్కరు।   


సోయగములు 
సాటిలేనిది మేలు చేసేది  
పాట మనసు చేరు 
పోటీలొ ఉన్నా హృద్యంచేరు 
ఆట లాంటి తీరు 
వేటతో ఉబలాట పెరిగెను 
తాట తీసి కదులు 
ఎవరికి వారుఈ లోకంలొ   

గురువుయే మమతల తరువు 
అరువు లేని బతుకు 
తరువుల ఉపయోగము మనకు 
పరువు నిలుపు చుండు 
చిరు నగవులతోను జీవితం 
మెరుపు పుట్టు చుండు 
తారుమారు అయిన బతకాలి 

త్యాగమభయహస్తముగనులే 
వేగ ముంచి కదులు 
భాగ్యమెప్పుడు నీతొ ఉండును 
త్యాగ బుద్ధి వల్ల 
స్వాగతించుము బీదవారిని 
సాగు తుంది కలిలె 
ఎంతోతెలిపెను సోయగములు 

  --(())--

****


074..*ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య యిచ్చాడు.సముద్రానికి అనేక పర్యాయపదాలు వున్నాయి.

'అంభోధి,జలధి:,పయోధి:,ఉదధి:,వారాంనిధి:వారిధి:' అని ఆరు సమానార్థక పదాలు ఆఖరి పాదంగా యిచ్చి  పూరించ మన్నాడు.

కాళిదాసు ఒక చక్కటి కథ ఊహించాడు.పార్వతికి కోపం వచ్చింది ఎందుకు?తనభర్త తనకో సవితి ని తీసుకొని

రావడమే గాక ఆమెని నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటే కోపం రాదా?

కుమారుడైన షణ్ముఖుడికి  తన కష్టం చెప్పుకుంది.కుమారుడికీ కోపం వచ్చింది.నేరుగా పరమశివుడి దగ్గరకు వెళ్లి నాన్నా అమ్మకు కోపం వస్తున్నది.

నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచి పెట్టు. అన్నాడు.కుమారా!చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగ నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది:అన్నాడు మహాదేవుడు.

సవితి తల్లిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి  బొత్తిగా నచ్చలేదు.ఏమవుతుంది?ఎక్కడకు వెళుతుంది?అంటే తనేం చెప్తాడు?బంగాళాఖాతం లోకి వెళ్ళమను.నాకేమిటి?(నదీనాం సాగారో గతి:)అని కోపంగా తన ఆరు ముఖాలతో ఆరుసార్లు చెప్పాడు.

.'అంభోధి,జలధి,పయోధి,ఉదధి,వారాంనిధి,వారిధి'

చమత్కారంగా కాళిదాసు యిలా పూరించాడు.

అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయం  ఉత్సృజ్యతాం !

విద్వన్ షణ్ముఖ!కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?

కోపావేశవశాత్- అశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్

అంభోధి:జలధి:పయోధి :రుధధి,వారంనిధి:వారిధి:

నీవు నెత్తిన గంగను పెట్టుకున్నావని అమ్మకు కోపం వచ్చింది.ఈ గంగను విడిచి పెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా! .పాపం చిరకాలం గానన్ను నమ్ముకొని నా దగ్గరే వుంటున్నది  యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అన్నాడు శివుడు.అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు.ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు సంతోషం తోసింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకున్నాడు.ఉచిత రీతిని సత్కరించాడు.

అంబా కుప్యతి =అమ్మకోపిస్తున్నది,

మూర్ద్ని విలసత్ గంగా ఇయం ఉత్సృజ్యతాం ! = నీ శిరసు మీద వున్న గంగ పరిత్యజింప బడుగాక!   విద్వన్  షణ్ముఖ =సర్వము తెలిసిన షణ్ముఖుడా!

మయి చిరాత్  స్థితాయా: -అస్యా: - కా గతి: -వద =నాతోనే చిరకాలంగా వుంటున్నఈమె గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? అన్నాడు శివుడు

కోప- ఆవేశవశాత్ - అశేష వదనై: -ప్రత్యుత్తరం దత్తవాన్ =కోపావేశాలతో యిలా ప్రత్యుత్తరం యివ్వబడింది. .అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు.ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు సంతోషం తోసింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకున్నాడు.ఉచిత రీతిని సత్కరించాడు.

*****

075..సీ..నిన్నుగాంచగల నిన్నెంత పిల్చినగాని
మనసు చెప్పదళచా మౌన తనమొ
మానస బుద్ధి నీ మాయనన్నుజేర
గమ్యమే తెలవకే గడుసు తనమొ
కాలవాంఛలు చేరి గాయపరచ గాని
పలుకు వేదము తెల్పు ప్రౌడ తనమొ
స్థిరమన్నదియు లేక సేవజేసెద నన్న
తోలు ఖాయముజూడు దూర్త తనమొ

తే..కష్టపెట్టక కనికరం కరుణ జూపు
కాల నిర్ణయమును చూసి కావ లేవ
తెలివి హీనుని జూడుమా తిష్ట వేసి
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రకృతి రామ
*****
రాజుగారి అన్న:🌚🌝:

పృధ్వీపాలుడు ఔదార్యంగల రాజు ఆయన కొలువు లోకి పండితులు ఎప్పుడు స్వేచ్చగా ప్రవేశించే వీలు ఉండేది. ఒకరోజు బిచ్చగాడిలా కనిపిస్తున్న ఒక వృద్ధుడు పృధ్వీపాలుడి కొలువులోకి ప్రవేశించబోయాడు. అతడి అవతారం చూసి ద్వారపాలకులు అడ్డుకున్నారు.

"నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు. నేను రాజు గారి అన్నని" అని చెప్పాడతడు.
"ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు. మా రాజు గరికి అన్నలుగాని, తమ్ముళ్ళుగాని లేరు" అన్నారు ద్వారపాలకులు.
"నా మాటలు నమ్మకపోతే మీరు నేరుగా రాజు దగ్గరకి వెళ్ళి మీ అన్న కలవటానికి వచ్చాడు అని చెప్పండి" అని చెప్పాడు ఆవ్యక్తి.

ద్వారపాలకులు చెప్పింది వినగానే పృధ్వీపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. "అవునా...వెంటనే అతన్ని నాముందుకు తీసుకురండి" అని ఆదేశించాడు.

ఆ వ్యక్తిని చూడగానే రాజు "అన్నగారికి స్వాగతం. ఏమిటి విశేషాలు?" అని అడిగాడు. అతను రాజుగారి ముందు ఆసీనుడవుతూ "సోదరా, నా దగ్గర మంచి వార్తలేం లేవు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నారాజ్యం రోజు రోజుకి కూలిపోతున్నది. నాకున్న ముఫ్ఫైరెండుమంది సేవకులలో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. నాఅయిదుగురు రాణులు కూడా ముసలివాళ్ళైపోయారు. దయచేసి నాకు సాయం చెయ్యి" అన్నాడు.

పృధ్వీపాలుడు అతని వైపు చాలా ఆసక్తిగా చూశాడు. తరువాత తన కోశాధికారితో అతనికి ఒక యాబై రూపాయలు ఇవ్వమని చెప్పాడు. " యాబై రూపాయలు చాలా తక్కువ" చెప్పాడతను.

"సోదరా... ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా భాండాగారం  తరిగిపోయింది" అన్నాడు రాజు.
ఆ వృద్దుడు ఒకసారి గాడంగా నిట్టూర్చి "ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక వుంది. నాతో వచ్చి ఆ బంగారు ఇసుక తీసుకువచ్చి నీ భాండాగారం నింపుకో అన్నాడు"
"మరి ఆ సముద్రాలను దాటటం ఎలా?" సందేహంగా అడిగాడు పృధ్వీపాలుడు.
"నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే వుంటావు. నేను సముద్రం లో అడుగు పెడితే అక్కడి నీరు కూడ ఆవిరైపోతుంది" అన్నాడు వృద్దుడు.

పృధ్వీపాలుడు అతను కోరినంత ధనం ఇచ్చి పంపించమని కోశాధికారికి ఆదేశించాడు. వృద్ధుడు వెళ్ళిపోయాక ప్రధానమంత్రి "ప్రభూ...మీ ఇద్దరి సంభాషణ నాకు అర్ధం కాలేదు" అన్నాడు.

పృధ్వీపాలుడు చిన్నగా నవ్వి " అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు. అదృష్టం నాణేనికి ఒకవైపు నన్ను రాజుగా రెండోవైపు అతణ్ణి పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది. అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే. అతని ముఫ్ఫైరెండు సేవకులంటే అతని పండ్లు. అయిదుగురు రాణులంటే అతని పంచేంద్రియాలు. అంతేకాదు ఖాండాగారం తరిగిపోయింది అని నేనన్న మాటకు, తనెక్కడ కాలు పెట్టినా సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తనమీద వేసుకున్నట్లు మాట్లాడి సున్నితంగా నన్ను విమర్శించాడు" అని వివరించి చెప్పాడు🌚🌝
***-
🌸శ్రీ రామ స్తుతి🙏

సీ. భండన భీముండు  పరమాత్మ రాముండు
                కరుణాంత రంగుండు కడలిసముడు
     భరతాగ్రజా ! నిన్ను  భజియించు వారికి
               భయమేల  కల్గును భక్త వరద !
     సంతాపముల మాన్పి సంతసమ్ముల నిచ్చు
               సాకేతపురవాస ! సత్త్వ తేజ !
     నిరతమ్ము  నినుమది  నీమమ్ముతో  నెంచ
              భవబంధ మోహముల్  బాసి పోవు
తే.శరణు వేడిన వారిని కరుణ తోడ
     కూర్మి రక్షించి కాపాడు కోసలేంద్ర !
     భక్తి నర్పింతు నతులను ముక్తి గోరి
     ధశరథాత్మజ !  శ్రీరామ ! ధర్మపురుష !

          జయలక్ష్మి
****
సుభాషితం - 1166
---------------
🌺సుజనో న యాతి వైరం
     పరహితబుధ్ధిర్వీనాశ  కాలేsషి
     ఛేదేsపి చందనతరుః సురభయతి
     ముఖం కుఠారస్య ౹౹🌺
        పరులకు మంచి జరగని అనే సజ్జనులకు వినాశ కాలంలో కూడా శత్రుత్వాలు ఉండవు.శ్రీగంధం చెట్టు కత్తిరించినా గొడ్డలి చివర సుగంధం అలాగే ఉంటుంది.
🌺✍🏽ప్రభ,మైసూరు.
           6-6-2024

*076..పిల్లలకు….ప్రేమను పంచినట్టే…*  *మీ కష్టాన్ని తెలుపండి, వారికి  కూడా పంచండి, వాళ్ళు జీవితంలో ఎదిగిన తరువాత, మీ పట్ల వారికున్న బాధ్యతను, ప్రేమను తెలుపండి. ఈ కాలం జనరేషన్  మాకేంటి తప్ప, మనకేంటి అనేది లేదు. వారికున్న పరిస్తితులవళ్ళ, ఆ ఏముందిలే చూద్దాం, చేద్దాం,  వాళ్లకు అవి అలవాటే, మా బాధలు  వాళ్లకు ఏమి తెలుసు, ఇలా ఎన్నెన్నో. వాళ్ళ పిల్లల కోసం లక్షలు తగలేస్తారు, తల్లిదండ్రుల కోసం, కొంచెం సర్దుబాటుకు కూడా అలోచించేవాళ్ళు ఎంతో మంది. పిల్లలను ప్రేమించాలి, వారి ఉన్నతికి తోడ్పడాలి, కానీ మీకో ముసలితనం వుందని మర్చిపోకండి. అప్పుడు ఆరోగ్యం, ఆహారం, కొన్ని సంతోషాలు వుంటాయని గుర్తుంచుకోండి. దానికోసం వయస్సులో వున్నప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకూడదు. ప్రపంచాన్ని చూడండి, కాస్త తెలివిగా మసులుకోండి, లూఇకపోతే తీరిగ్గా బాధ పడాల్సి వస్తుంది. సర్వేజనా (ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్) సుఖీనో భవంతు. ఇక చదవండి* 😔😔     

*🔹నిజజీవితం అంటే… రెండున్నరగంటల  సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి!*

*ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది….                           "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను.    మా అమ్మాయిని ఎటువంటి  కష్టం    తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి  అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.*

*జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది.    బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు.                                   ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.*

*ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని.   నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను." అనిచెప్పింది.*

*ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.*

*జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ    ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని.*
*ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు.*

*ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు.*

*అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.*

*"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.*

*అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.*

*ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.*

*జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.*

*కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.*

*సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.*
*తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.*

*మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.*

*ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి తమదారిన తాము వెళ్ళిపోతారు.*
         
*ఇదీ నేటి జనరేషన్ 💗హృదయం*

ప్రాంజలి ప్రభ కథలు


క్ష077..మాగుణం


తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవీ లక్షణం అన్నారు విజ్ఞులు. తెలిసో తెలియకో ప్రతివారూ తప్పులు చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ఆ వ్యక్తిని క్షమించడం గొప్ప. దానికి ఓర్పు, సహనం ఉండాలి.


ఓర్పు ఉన్న స్త్రీలను ధరిత్రితో పోలుస్తారు. తనను ఎంతగా బాధించినా, అపవిత్రం చేసినా, ఇంకా ఏయే రకాలుగా ఇక్కట్ల పాల్టేసినా క్షమిస్తుంది భూమి. అలాగే అనుభవిస్తున్న బాధలను గురించి చింతించకుండా, విసుగు చెందకుండా అన్నింటినీ సహించేది స్త్రీ మాత్రమే. అందుకే క్షమాగుణానికి ఆమెను ప్రతీకగా చెబుతారు.


రావణుడిపై విజయం సాధించిన తరవాత s విజయవార్తను తీసుకుని సీతాదేవి దగ్గరకు వెళ్ళాడు హనుమంతుడు. రాముడి సందే శాన్ని ఆమెకు వినిపించి, అన్నాళ్లూ ఆమెను ఇబ్బందులకు గురి చేసిన రాక్షస స్త్రీలను వధిస్తాను అనుజ్జ ఇమ్మని కోరాడు. దానికి సీతాదేవి 'వారు ఇతరుల ఆజ్ఞలను పాటిం చేవారు మాత్రమే. వారిపై కోపగిం చడం సమంజసం కాదు. అపరాధం చేయని వారెవరూ ఉండరు. పాపి అయినా, పుణ్యాత్ముడైనా, వధిం పదగినంత అపరాధమే చేసినా అందరి పట్ల దయ చూపించ వలసిందే' అని పలికింది.

మహాపురుషులైనవారు తమ పట్ల ఇతరులు చేసిన అపరాధాలను లెక్క చేయరు. మనుషుల మధ్య విభేదాలు సహజం. తమను ఇబ్బంది పెట్టినవారిని క్షమించగలిగే ఔదార్యం మనకుండాలి. క్షమించడం, గతం మరిచిపోవడం కష్టం కాదు. ఎదుటి మనిషిని క్షమించమని అడగడానికి అహంకారం వదులుకోవాలి. క్షమించమని అడగడం ఓటమిని అంగీకరించడం కాదు. బలహీనత, చేతకానితనం అంతకన్నా కాదు. అదొక శక్తిమంతమైన ఆయుధం. అది వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తుంది.


పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి కామ ధేనువును ఆశ్రమానికి తీసుకు వచ్చి తండ్రికి చెబుతాడు. అప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని క్షమ కలిగి ఉండాలని బోధిస్తాడు. ఆ సందర్భంలో కుమారుడితో 'క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. విద్య అబ్బుతుంది. సుఖాలన్నీ కలుగుతాయి. దయామయుడైన శ్రీహరి సైతం సంతోషిస్తాడు' అని క్షమ గొప్పతనాన్ని చెబుతాడు.


విశిష్టాద్వైత స్థాపకులైన శ్రీరామానుజులవారికి గురువు యామునాచార్యులు. ఈయన రంగనాథుని భక్తాగ్రేసరుడు. ఆ రాజ్యంలో కొందరికి ఆచార్యులపై ద్వేషం అసూయ ఉంది. ఒక రోజు ఆయన కావేరిలో స్నానం చేసి వచ్చే మార్గంలో అడ్డంగా పాదరక్షల తోరణాన్ని కట్టారు. యామునాచార్యులు అది గమనించి ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు. పైగా సాగిలపడి ఆ పాదరక్షల తోరణానికి నమస్కరించాడు. ఆయన నోటి వెంట ఒక శ్లోకం వెలువడింది. దాని భావం... 'సమర్థులైన కొందరు పుణ్యాత్ములు, కర్మయోగాన్ని అనుసరిస్తారు. మరి కొందరు మహానుభావులు జ్ఞానయోగాన్ని అనుసరిస్తారు. నాలాంటి ఏ యోగమూ అనుసరించలేని అసమర్థులకు వారి పాదరక్షలే గతి. వాటిని ఆశ్రయించిన నావంటివారు ఉద్దతి పొందుతారు' అని ఆ శ్లోక భావం. ఇదంతా గమనిస్తున్న ఆకతాయిల హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. వారిలో ద్వేషం మంచులా కరిగిపోయింది. ఆయన పాదాలపై పడి క్షమించమన్నారు. ఆయన చిరునవ్వుతో వారిని క్షమించారు. అదీ క్షమాగుణం గొప్పతనం.


వి.ఎస్.రాజమౌళి


****

078..ఏమివ్వగలను ప్రేమ తప్ప... ఆటవెలది.

మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ 


రేయి కదలదేల రెప్పతెరవదేల

రాక తెలియదేల రసిక చరిత 

మన కబుర్లుగను మందమతి యు ఏల 

ఆగనికల మాయ అలక చరిత 


మనసు కుదుట పడే మమత ఎరుగనెంచ 

మాటలేని గతియు మహిమ చరిత 

స్నేహ చరిత గాను చెలములాగా చూపు 

దగ్గరవ్వగలుగు ధరణి చరిత


తియ్య నయిన మాట తిప్ప గలుగుటేల 

పొంద గువ్వలకళ పోరు చరిత జూడు 

మల్లెతీగ లతలు మధురమే యగుటయు 

ఒంటరి బ్రతుకునాది ఓర్పు చెరిత


సూన్యత మనసుగతి సూత్రము ఏదియొ

పాదములు తడవగ పదనిస చరితయే 

నిత్య మందిరమ్ము నియమాల తలపులై 

ధనము తోడు బతుకు ధరణి చరిత


తెలియ ఉపశమనము తెలుప సుమతి బేల 

గోలగోలలగను గొప్ప చరిత తెల్ప 

దాగనున్న  ప్రేమ దాపరికం లేక 

ధనము చేర తీరు ధర్మ చరిత


గడియలేనటువిధి కాంతి లేకయు యున్న

గడియ గడియ సాగు కాల చరిత 

బడియె లేనిమదియు మార్గము గానిరా

రాబడిగను లేని రభస చరిత


ముచ్చటైనచూపు ముందు కాళ్ళనతట్టు 

గంధసింధు రమగు  గంతు చరిత 

పరిమళలపు సొబగు పకపక తికమిక 

కోయిలమ్మకధలు కూకు చరిత


మనసు దాహ మగుట మనుగడే చేయుట 

మౌనదేహమగుట మోక్ష చరిత 

ఎదురుచూపులుగను ఎదనుపంచదలిచ

నిండుగాను నవ్వు నాట్య చరిత


 వయసుకు ఒరవడియె వలపుల సవ్వడి 

హుంద తనముగాను హాయి చరిత 

ప్రేమలో న పడ్డ ప్రేయసి పిలుపులే 

తన్మయపు తపన తాళ చరిత

******

079.

సీస పద్యమాలిక...తల్లి పార్వతి 


సాధన లెన్నియొ సమరస్య మగుటయే 

సల్పుచు మౌనులు సహనముగను 

శాంకరి సన్నిధి సాంబసదా శివా 

భక్తిగ జేరిరి ప్రణతి గాను 


బాధలు తీర్చెడి బాధ్యతగా శివా 

మాతను పొగడుచు మనసు గాను 

ప్రాపును పొందగ ఫలనీల కంఠుడు 

ప్రణతిగ వేడెను పలుకు గాను 


తల్లికి బిడ్డలు తన్మయ తృప్తియు 

భారము కాదులె బంధ మౌను 

తల్చిన చాలును తప్పులు దిద్దును 

దయతో గాచును ధరణి గాను 


చల్లని చూపుల చెలిమి తలంపులు 

పార్వతి నవ్వుచు పాశమౌను 

సాధకు లెల్లరఁ  సాధ్యపు ప్రార్ధన 

వినయము ప్రోచెను విశ్వ మౌను 


కాలము నందున కార్యము చేయూత 

 జిక్కిన మనుజులు చేష్ట లౌను 

కష్టములొందుచు కనికరం కోసము 

సఖ్యత కనులగా సమయ మౌను 


జాలిని జూపెడి జాతిపై శ్రీమాత 

తల్లితండ్రి గతియు త్యాగమగును 

సాగిలి మ్రొక్కితి సహనము జూపితి 

మీదయ మామీద మిధ్యగాను 


మౌనుల విన్నప మార్గము ధ్యానము 

దీనత  తొల్గగ దివ్య మౌను 

మక్కువ మీరగ వరముల నొసగెను 

జనులిట ధరలో జపము గాను 


తృప్తిగ  నుండగ తృనమగు జీవితం 

మునితతి మురిసెను ముఖ్య మౌను

చరిత సుకృతి గాను జయము నిచ్చు కళలు 

మేలుచేయు విధిగా మౌన మౌను 


తే.. హరిత భరిత ప్రకృతి గాను హాస్య మవదు 

సేద తీర్చ టే ప్రాణము సీఘ్రమౌను 

సర్వజనులకాహ్లాదము సమయ మౌను 

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రబల గీత 


*****


*080..శీర్షిక: రాజకీయం.. రగడ 

ఊరు:హైదరాబాద్

పేరు: మల్లాప్రగడ రామకృష్ణ 

సంఖ్య: 

 

ముందు నీవు క్షమాపణ చెప్పు "జగన్ " ప్రజలకు గెలుపు ఓటములు సహజము ప్రభుత్వ ధనము దుర్వినియోగం చేసావేమో, నీ పధకాలు ప్రజలకు నచ్చలేదేమో, అయినా చేసిన తప్పులు సరిదిద్దుకో అన్నది తల్లి విజయమ్మ *మనం ఎవ్వరికీ తక్కువకాదు* ప్రయత్నం వదలకు భవిష్యత్తు వుంది ముందు కార్యకర్తలకు ధైర్యము చెప్పు జరిగినవన్ని మనమంచికే.14 నెలలు జైల్లో ఉన్న జనులు నీకు ఒకనాడు పట్టంగట్టారు, ఋణం తీర్చుకోలేదేమో. కాని బయట మాధ్యం తెచ్చి ఎక్కువకమ్మినా పట్టించుకోరనుకున్నావు, కరంటు చార్జీలు పెంచావు, కోట్లు బటన్ నొక్కవు పంచావు హారతి కర్పూరమే కదా అవియన్ని, తెలుగు భాషను తీసేసావు అది పెద్ద తప్పు ప్రజలు జీర్ణించు కోలేకపోయారు, తిరగబడి ఓటు వేశారు, ప్రజలను దూషిస్తున్నావు అక్కా చెల్లెలని అన్నావు మోసం చేస్తే ఊరుకుంటారా.


 కాలం కలిసి వస్తే బీదవారు గొప్పవారవుతారు, గొప్పవారు బీదవారవుతారు, మంచి చెడుల స్థితి మానవత్వం పై ఊహల ఊసలు ఊయలలుగా కదులుతూ ఉంటాయి.  * ఈనాటి గొప్పవారిలో ఒకప్పుడు సామాన్యులే *


జగన్ జరిగిన దేదో జరిగింది  ఈ సారి గట్టి ప్రయత్నం చెయ్యి. కాస్త కస్ట పడితే నువ్వు కూడా తప్పకుండా మంచి మార్గము లో జీవించగలవు. నీ భార్య భారతి చెప్పినట్లు విను కానీ నీ ఆలోచన విక్రమార్కునిగా కాకుండా జాగ్రత్తగా పలుకు.


"లేదు అమ్మ నాకు ఆశ పోయింది.  నేను మరి రాజకీయ సన్యాసిగా మారుతా .  ఒకప్పుడు చాలా ఆశపడ్డాను  ప్రజా సేవగా బ్రతికాను రాజధానినే మార్చదలిచాను, ఇంటిదాకా సరుకులిచ్చాను, గ్రామ నౌకర్లు పెట్టాను ఇన్ని చేసిన గుర్తింపు లేదు.


*విజయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాలి*. కాని ఉద్యోగులను దూరంచేసుకున్నావు, జీతాలే ఇవ్వలేక పోయావు నన్ను మరిచావు, చేల్లెలను దూరం చేసుకున్నావు, అందులో 10సంవత్చారాలు కోర్టుకు హాజరుకాక తిరిగావు ఇవన్నీ తప్పులు కావా? 


"చూడు బంగారం *శ్రమించడం చేదుగా ఉంటుంది. ఫలితాలు తీయగా ఉంటాయి*. , నా మాట మీద నమ్మకం ఉంచు కార్యకర్తలను దూరం చేసుకోకు 


 *ఈనాటి వారిలో కొందరు ,నిన్ను ప్రేమించే వారున్నారు  వారినివదులుకోకు ఎంతో పట్టుదలతో తిరిగావు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నావు నీకు తెలుసు కదా. నీకున్న సాక్షి తో ప్రజలలోకి వెళ్ళు ప్రభుత్వతప్పులు ప్రజలకు తెల్పు అదే నీకు శ్రీరామ రక్ష, ఇవే ప్రభు వాక్కులుగా భావించి నీ మనసు మార్చుకొని 

 ముందుకు సాగడానికి ప్రయత్నించు...


నీ మనోవాంఛ సఫలీకృతం చేసుకో. 

గొప్ప కుటుంబం లో *  మతం మారినా.   సామాన్యుడి గా పుట్టినా *మనం ఎవరికీ తక్కువ* *కాదు

కృషితో నాస్టిదుర్భక్షం, తెలుగు దేశం యేలే జగన్నాధ రధ చక్రాలు పట్టేందుకు ఓర్పు వహించి నీ సొంతంసొమ్మును దానం చేయి, అప్పుడు నీ విజయానికి తిరుగులేదు.

 

సమాప్తం.

*****


081..🌹🙏కేశవనామాల విశిష్టత🙏🌹


మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ


 కేశవాయనమః,,నారాయణాయనమః,,

మాధవాయనమః

 

    అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.


*1. ఓం కేశవాయనమః*

(శంఖం _చక్రం_గద_పద్మం)


    బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.


*2. ఓం నారాయణాయనమః* (పద్మం_గద_చక్రం_శంఖం)


    నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత,సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.

    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ,     ప్రాతఃకాలానికీ     నియామకుడు.


*3. ఓం మాధవాయ నమః*

(చక్రం_శంఖం_పద్మం_గద)


    ‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.

    ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.


*4. ఓం గోవిందాయ నమః*

(గద_పద్మం_శంఖం_చక్రం)


    వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,

    శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ,కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.


*5. ఓం విష్ణవే నమః*

(పద్మం_శంఖం_చక్రం_గద)


జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.

ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ,చైత్రమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ,సింహరాశికీ,పాలకూ నియామకుడు.


*6.ఓం మధుసూదనాయ నమః* (శంఖం_పద్మం_గద_చక్రం)


    “మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని

    ‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు


*7. ఓం త్రివిక్రమాయ నమః* (గద_చక్రం_శంఖం_పద్మం)


    మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.

    వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ణి’అన్న అక్షరానికీ,నేత్ర తత్త్వానికీ,జ్యేష్ఠమాసానికీ,శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.


*8. ఓం వామనాయ నమః*

(చక్రం_గద_పద్మం_శంఖం)


అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.  

ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ  జిహ్వాతత్త్వానికీ,ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,వృశ్చికరాశికీ,పెరుగుకూ నియామకుడు.


*9. ఓం శ్రీధరాయ నమః*

(చక్రం_గద_శంఖం_పద్మం)


శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.


    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.


*10. ఓం హృషీకేశాయ నమః*

(చక్రం_పద్మం_శంఖం_గద)


ఇంద్రియ నియామకుడూ,రమ,బ్రహ్మ,రుద


్రాదులకు ఆనందాన్

ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు.


    ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.


*11. ఓం పద్మనాభాయ నమః*

(పద్మం_చక్రం_గద_శంఖం)


నాభిలో పద్మాన్ని కలిగినవాడూ,భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ,సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీహరి‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు.


    ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ,

    ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.


*12. ఓం దామోదరాయ నమః*

(శంఖం_గద_చక్రం_పద్మం) 


యశోదచేత పొట్టకు బిగించబడిన 

తాడుగలవాడూ,ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ,దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ,దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.


    ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.


*13. ఓం సంకర్షణాయ నమః*

(శంఖం_పద్మం_చక్రం_గద)


భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.


    ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,

    మనోమయకోశానికీ,క్షత్రియవర్ణానికీ,స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.


*14. ఓం వాసుదేవాయ నమః*

(శంఖం_చక్రం_పద్మం_గద)


త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.


    ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.


*15. ఓం ప్రద్యుమ్నాయ నమః*

(శంఖం_గద_పద్మం_చక్రం)


అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.


    ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.


*16. ఓం అనిరుద్ధాయ నమః*

(గద_శంఖం_పద్మం_చక్రం)


ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ,సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ,జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’అనబడుతున్నాడు.


    ఈయన గాయత్రిలోని‘హి’అన్న అక్షరానికీ,స్పర్శతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ,  అబ్దానికీ,           నల్లని  ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మఋతువుకూ   నియామకుడు.


*17. ఓంపురుషోత్తమాయనమః*

(పద్మం_శంఖం_గద_చక్రం)


దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు


    ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ,రూపతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.


*18. ఓం అధోక్షజాయ నమః*

(గద_శంఖం_చక్రం_పద్మం)


ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ  అయినందువల్ల  శ్రీహరి    ‘అధోక్షజుడు’     అనబడుతాడు.


    ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.


*19. ఓం నారసింహాయ నమః*

(పద్మం_గద_శంఖం_చక్రం)


నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.


    ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.


*20. ఓం అచ్యుతాయ నమః*

(పద్


మం_చక్రం_శంఖం_గద)


శుద్ధజ్ఞానానందాలే దేహంగా క


లవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.


    ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. 


*21.ఓంజనార్థనాయనమః*

(చక్రం_శంఖం_గద_పద్మం)


సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,  మోక్షప్రదుడూ,     జన్మలేనివాడూ,    సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ,సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.


    ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ,వాయుతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.


*22.ఓంఉపేంద్రాయనమః*

(గద_చక్రం_పద్మం_శంఖం)


ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి   ‘ఉపేంద్రుడు’   అనబడుతున్నాడు.


    ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.


*23. ఓంహరయేనమః*

  (చక్రం_పద్మం_గద_శంఖం)


భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.


    ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ,అపోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.


*24. ఓంకృష్ణాయనమః*

(గద_పద్మం_చక్రం_శంఖం)


  సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ,  నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“కృష్ణుడు”అనబడుతున్నాడు.


    ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ,పృథ్వీతత్త్వానికీ,కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ,  దైహిక  కర్మకూ    నియామకుడు.


🌹🙏ఓం..నమో...శ్రీవేంకటేశాయా🙏🌹ప్రాంజలి ప్రభ


🌹 సిద్దేశ్వరయానం - 73 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 1864 - సాధకయోగి 🏵*


*పరమాత్మస్వామి: హిమాలయాలలో డాకినులు మాట్లాడే ఒక ప్రాకృత భాష ఉంది. దానిని నేర్చుకొనే అవకాశం నీకు లభిస్తుంది. ఆభాషలోని కొన్ని మంత్రములు నీకు ప్రాప్తిస్తవి. కిరాతరూపుడైన పరమేశ్వరుడు అనాగరికులైన ఆటవికులు, క్రూరజంతువుల నుండి బాధల నుండి తప్పించుకోవటం కోసం తీవ్ర సాధనలతో, ఆచారాలతో, హోమాదులతో అవసరంలేని మంత్రములను సృష్టించాడు. అవి చాలా త్వరగా సిద్ధిస్తవి. వాటి వల్ల వచ్చిన శక్తులతో లోకోపకారం చేయగలుగుతావు. ప్రస్తుతం వీలైనంత త్వరలో హిమాలయాలకు వెళ్ళు.*


*ఆశ్రమ : స్వామీ ! నేను ఊహించని, ఊహించలేని ఎన్నో విశేషాలను తెలియజేశారు. మళ్ళీ మనం కలుసుకొనే అవకాశం కలిగించండి!*


*పరమాత్మస్వామి : ఈశ్వరేచ్ఛ! జీవులు నదిలో కొట్టుకుపోయే కాష్ఠముల వంటివారు. కొంతసేపు కలిసి విడిపోతుంటారు. భాగవతంలో ఇలా చెప్పబడింది.*


*ఉ . వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు నొక భంగి చరింపదు కాలమన్నిటిన్ జేయుచునుందు కాలము విచిత్రము దుస్తరమెంత వానికిన్  -  అన్నింటికి మూలం కాలం. ఎంత వారికైనా దాటరానిది. నీవడిగినది మనసులో పెట్టుకొంటాను. నీవు కోరిన ప్రకారము మళ్ళీ కలుద్దాము.*


*ఆశ్రమ : స్వామివారూ ! మీరప్పటికి ఈ శరీరంతోనే వస్తారు గదా!*


*పరమాత్మస్వామి : నేనిప్పటికి ఎన్నో శరీరాలు మారాను. దేవతల,సిద్ధాశ్రమ గురువుల సంకల్పాన్ని, ఆజ్ఞను అనుసరించి యోగ్యులలో దివ్యచైతన్యాన్ని జాగృతం చేయటం కోసం సమయాన్ని బట్టి కొత్త శరీరాలను తీసుకొంటుంటాను. అప్పటికి నేను కూడా మారిన శరీరంతో వస్తాను.*


*ఆశ్రమ : మహానుభావ! మీరు అపారశక్తి సంపన్నులు. మీరు కోరితే ఈ శరీరంతో ఉండలేరా?*


*పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం*

*పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక ఇవి తప్పవా?*


*స్వామి : సామాన్యంగా తప్పవు. తీవ్రంగా సంకల్పిస్తే దీర్ఘకాలం జీవించవచ్చు. కాలాన్ని జయించాలన్న పట్టుదలతో కాలానికి అధీశ్వరియైన కాళిని ఉపాసించి పూర్వజన్మలో మూడు వందల సంవత్సరాలు జీవించాను. సిద్ధగురుకృపఉంటే వారి అనుగ్రహం వల్ల దివ్యస్ఫురణ కలుగుతూ ఉంటే దేవకార్య, గురుకార్యం చేయటం కోసం శరీరాలు మారటంలో విచారం ఉండదు. నేను కర్తను కాదు, భోక్తనూ కాదు. దేవకార్యం కోసం నియమించ బడిన నిమిత్తమాత్రుడను అని మనసా వాచా కర్మణా భావించ గలిగితే అప్పుడు మనలను గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేవారు వేరే ఉంటారు. సరి! వీటికేమి! మనం మళ్ళీ కలుస్తాము. నేను నిన్ను గుర్తుపట్టగలను. నీవు కూడా తెలుసుకోగలవు. ప్రస్తుతానికి ఇది చాలు.*


*ఆశ్రమాధిపతి : మీ ఆజ్ఞ! కర్తవ్య నిర్వహణకు దీవించండి.!*

*పరమాత్మస్వామి : తథాస్తు !*


*( సశేషం )*

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment