Sunday, 30 June 2024

 సదాగతి పద్యాలు 


001..సన్నగాలి కదలికలు సనగ సనగ

సన్నపిల్లి బ్రతుకు గాను సమయ సమయ 

సన్నసనసంపద నిలువ సహజ సహజ 

సన్నదు కళలు సహకార సంఘ సంఘ


002..బంకముచ్చు బతుకు యేల బంధ మందు 

బంగరము చుట్టు చూపులు భాగ్య మేల 

బంగిలో మునుగుట యేల భార మైన 

బంటు లాగ బతుకుచాలు భార్య చెంత


003..రాజి రాజిక రంజిల్లు రంగవెల్లు 

రాణి రాణించు రమ్యత రంభ తృప్తి 

రాధ రాపిడి రాత్రియు రవ్వ వెలుగు 

రామ రాయబారము చూడు రక్ష గాను


004.. అశ్రుకణీకామలీమస మయిన యతని 

కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు 

తెఱచి యుండియు కనలేని తివుట లొదవె 

కలికి నవఘర్మకలుషితగండములను.


005..చిలికి మనసుగెలుచు చుండి చెలిమి గాను 

తలపు లుండియు కనలేని తీరమగుట 

గమ్యకాభోగ సూత్రయుగ్మమ్ము నపుడు 

అతని కళలు తీర్చుటగాను కామి బుద్ధి


006..తే.రాజకీయ చతురతగా రాటుతేలి 

సాహితీదురందరుడుగా సహన శీలి 

సంస్కరణలకు ఆద్యుడు సంఘ నేత 

దక్షతా ధర్మ పరిపాల ధారి యతడు


007..మేరునగ ధీర నరసింహ మనసు జూడ

భారతావని రత్నము భాగ్య శాలి 

వేయి పడగలు హిందీన విప్పి చెప్పె 

తెలుగు దేశాన బహు భాష పండితుండు


009.. నేర్చుకున్నది నేర్పుట నేర మవదు 

 నేర్వలేనిది నేర్చుట నీతి సబబు 

 కాలమందున నేతగా కలసి కదలు 

 అనుభవాలను పంచుటే ఆత్మ తృప్తి


010..మనిషి యద్భవ  తత్భావ  మేను  అనక 

మనసు భౌతిక వాస్తవ  మేది  గనక 

వినయ భావపు మర్మము వింత  కొనక 

విషయ  వాంఛల వెంటనే వేళ్ళు వాయె   ...... 


011..యుక్త  మధ్యమ వృద్ధాప్య  యుజ్వలమ్ము  

త్యాగ బుద్ధియు ఉన్నచో తృప్తి గనుము 

శక్తి అంతయు ఖర్చుగా శపధ మాయె  

తార తమ్యము తెలిసికో  తప్పు గనుము  ........


012..దేహ కాంతియు వృద్ధాప్య దీనబందు  

మేధ  శక్తియు  వృద్ధాప్య మోక్ష మిచ్చు  

మూడు కాళ్ళను మోసియు ముందు నడుచు  

చూపు మంద గిస్తుందని చూసి నడుచు   ........


013..ప్రకృతి మౌనముండినదని ప్రభల తీరు  

వికృతి  తాండవించినదని  వీనులగుట  

సుకృతి ఇదియును అదియును శుభము కలుగు  

ఎశృతి విన్నను మంచిని ఎంచి కదులు  ...... 


014..మనకు  నైతిక భౌతిక మలుపు లుండు 

మనము అద్భుత ఆనంద మార్గ ముండు  

మనసు చట్రంలొ చిక్కితే  మాయ మెండు 

మనమె  ఆచార సంస్కృతి మనసు నందు  


015..నీలొ  నమ్మక వ్యవస్థ  నియమ మగుట  

కాల నిర్ణయ మార్పులు కధల మెండు        

హోళి ఆడేటి  కాంక్షయు హాయి తెలుపు   

జాలి చూపియు సంపద జడ్జ్య మెండు


016..సకల యజ్ఞాల దానము సరయు చుండ

పుణ్యతీర్ధాల ఫలమును పూర్తి దాన 

ఇది యహింస సమానము ఇష్ట మవదు 

 ఇంతి కోర్కయిష్టపరచు యీశ్వరే చ్ఛ


017..పుస్తక పఠన వ్రాతలు పుణ్య గతియు 

మస్తక సముదాయ ఫలము మనుగడ కథ 

ప్రస్తుత బతుకు సంతృప్తి పుడమి నందు

విస్తృత విధి వాక్కుల వింత వినయ చరిత


018..ప్రేమ రహిత్యము పురుష ప్రీతి వరము 

 స్త్రీలకు సహజ సిద్ధంగ శిద్ధి బ్రతుకు 

 సున్నిత హృదయం సుకుమార సుమతి కలలు 

బ్రతుకు మాతృత్వ లక్ష్యము భర్త చెంత


019..సర్వదా పరమాత్మయే సేవ చేయు 

నిశిత బుద్ధి స్థిరమ్ముగా నియమముంచు

అనుభవ ఫలము సహనపు ఆశయమ్ము 

సాధనే శోధనలుగాను సాగు జీవి


020..అర్హతయనేది చదువుకు అణుకువ యగు 

 జీవితంలో మనం కోరు జీవయాత్ర 

 సుఖ శుభోదయం మనసు సూత్ర మౌను 

 లాభ నష్ట కష్టములు గా లయలు బట్టి


029..నవసమాజ మేది యిపుడు నటన బతుకు 

ధరలు యెచ్చినా యడగరు ధరణి యందు 

దోపిడీగతిగా విద్య, దొడ్డ బుద్ధి 

శాంతి శక్తులు ఫలమేది సంఘ మందు


030..నిప్పులా నిరాశ మనిషి నిహము తెలుపు 

శ్వాసలా యాశలు మనిషి సాధనయగు 

జీవనాధార ము మనసు చేరువయగు 

ఏది లేకున్న ను కుటుంబ మేల సాగు


031..ఇదియు దొరక గలుగు ఇంతి బుద్ధి గనులే 

బుద్ధి శక్తి యున్న రుజువు కాదు 

వయసు చింత వలదు ఆయుస్సు ముగియుటే 

పుడమి శక్తి యుక్తి పూజ్య మౌను


032..ఇతరులకునచ్చి నట్లును ఇంతి కదులు 

జీవితాంతము సుఖమిచ్చి చెలిమి జేయు 

నటన యన్న బతుకుమాట నన్న కదులు 

కొందరి బతుకుచేదుగా కోర్కె మిగులు


033..అర్హతలు యేవి ప్రేమకు అలక కాదు 

నిత్య సంసారి చదువుల నియమ మేది 

కోరికలు వెలుగులమల్లె వొచ్చి పోవు 

నిగ్రహమ్ము విశ్వాసము నిజము తెలుపు


034..జన్మజన్మల బంధము జ్ఞాన వృద్ధి 

సహన సంపద పంచిన సత్యమార్గ 

సమయ శక్తి సంతృప్తిగా సరళ రీతి 

విధిని యెoచిబతుకు సాగు వినయ శీలి


035..కపి పలుకులు నమ్మి కాల సౌఖ్యము పొందు 

కరిమద బలము గను గాని చిక్కు

కవి కవిత్వము విని గమ్యము దిద్దుకో 

కసి కనులు కళ కల గాయ పరచు


036..కర్మసాక్షి కిరణతేజ కార్యదక్ష 

మర్మమన్నది లేక యే మార్గ దీక్ష 

జీవ సంరక్ష  మరిపించు జాతిదృష్టి 

కర్మపరి పక్వత ప్రకృతి కాల నేత్ర


037..అద్దమన్నది ప్రతిబింబ అసలు కళలు 

కుడి యెడ మయినా తెలియదు గుర్తుగాను 

నీదు యాలోచనలు చెప్ప నిజము యేది 

వినిన వన్నీ నిజముకావు విలువ బట్టి


038..నమ్మ లేవు నా పలుకులు నటన యనచు 

నల్లి గా నాపనియు చేయ నియమ మేది 

నారి చేరి వేడుక చెప్ప నమ్ము రామ 

నారి సారించె రాముండు నల్లి చచ్చె 


039..మొయిలునైతేను మిన్నుసమోన్న తయగు

హొయిలు నీవైన తేలించ హాయి గొలుపు 

కోయి లైతేన చందుని కళలు చూపు

చేయి చేయి తో మురిపించ చేష్టలవియు 


040..దిగులుమబ్బులు కమ్ముతూ సెగలు ఏల 

మిగులు జీవుడి ముగియడం మేల ఏల

వగలు నాటక ప్రళయమే వ్యాధి ఏల

మగువ అవధులు దాటితే మనసు ఏల


041..హృదయమంత చీకటి గను హద్దు ఏల

పొదల మాటుసరశ మైన పోరు ఏల

అదును లేని దై వినయము ఆశ ఏల 

యదను సామరశ్యముగాను ఏల మాయ


042..చరితకు పిలుపై విషయము జయము నిచ్చు  

చిత్త చాంచల్య మల్పును చేర్చు విధియు   

బలమున పనికై  పంటకు చేరు నీరు  

భద్రత ప్రేమ  నీదేయని బలము జూపు    


043..నిజమున పిలుపై నీరుగా  నిర్మలమగు   

నేడు ప్రేమమ్ము విధిగాను నియమ నీడ   

నియమము తలపైపడినను నిక్క మగుట    

నేడు పర్వము తీర్ధము నేస్తమగును  


044..నిలకడ మనసై నియమము వినయ విధియు  

నేడు సర్వమ్ము సహనము నీడ కళలు    

నటనల తెలివై తలపుల నడక సాగు  

నిత్య ధైర్యమ్ము బోథగా నిత్య మలుపు  


045..నీరు పల్లమెరుగు నిజం దేవు డెరుగు

నీరు నిప్పు చెలిమి కాని నిజము కాదు

నీరు కళగాను బతుకుటే నియమ మందు

అగ్ని ఆహుతి యగుటయు ఆశ నున్న  


046..ఏమి యీలోకము యెరులా  ఏల పరుగు

ఎంత వేచి చూసిన నంత ఏమి కలుగు 

ఏది మాయ చెప్పను లేను ఏల పెరుగు

ఏల చెప్పినా మదిభావ మేంత కరుగు 


047..నవ్యతకు నాంది యనుచునే నటన పరుగు

ఉజ్వల యుగాది తలపులు ఉరక కలుగు

షడ్రు చులు జీవిత సుఖాలు షకలకమగు

నవ వసంతం తలుపు తట్టు నడక కలగు


048..చదువు సమయపాలనలేని జపము లేల 

ఆచరణ లేని మాటలు అలల గాను 

విలువ కానరాని బతుకు విధిగ కలలు

నాలుక రుచులు పలికించు నటన కలలు


049..కనులు తెరచినా మనసున కళలు మెండు 

కనుల నిద్రనా కలలగా కదులు చుండు

కనుమరుగవని కథలన్ని కలసి దండు

చినికు లాతడిపి వెతలు చేష్ట గుండు


050..వేకువ బడిలోన వెలుగు వెతలు మార్చు

పాఠములు చెప్ప కిరణాలు పగలు తీరు 

విశ్వ తేజ వేల్పు కిరణ వినయ మార్పు

విచ్చెదవు విద్య వినయమ్ము విజయ నేర్పు


051..స్పష్టముగ తెలియనగు విజ్ఞాన మయ మ

నియడి విధి విధానమ్ముగా నిలయమగు మ

నియడి శోభ డనిత్యము నిత్య నియమ

పూర్వ పుణ్య కర్మ ఫలము పుడమి ప్రేమ


052..ధర్మ కళలన్ని పెరిగేను  ధరణి యందు

ఒకరికొకరు తొడగు నీడ ఓర్పు యందు

న్యాయ అన్యాయ మనునదే నాడి యందు

నైతికము గాను ధర్మమై నేస్త మందు

053..మంత్ర శక్తులు అనుకోగ  మాయ ఉండు 
యోగ శక్తులు సాధన యోగ్య మగుట   
యంత్ర మన్నది నిలకడ యనియు త్రిప్పు 
తంత్ర మన్నది లోకోక్తి  తత్వ బుద్ధి   

054.. సుఖము వెనుకనే కష్టము శుభము నిచ్చు  
గృహము లోనికి  వెలుగులు గొప్ప గుండు  
గ్రహము లన్నియు తిరుగుచు గోల యనకు  
దైవ పూజలు కల్గించు ధైర్య బుద్ధి  

055.. ముక్తి కలుగుట దారులు, ముఖ్య మగుట  
ప్రేమ పొందియు, కాలాను ప్రతిభ జూపు  
నిగ్రహమ్ముగా, జీవితపు నియమ కళలు  
పరచి, ఉపచార లక్ష్యము ప్రముఖ మనెను  
  
056.. ఆపదలురాగ బుద్ధికి అర్ధ మవదు  
సీత కోరగా బంగారు జింక కొరకు 
రాము నికల రాజ్యము ఇది రమ్య చరిత  
మనము ఆర్భాటమును చేసి మనసు మార్చు  
    
057.. చంకలో బిడ్డ ఉన్నను వెతికి నట్లు  
కంటి ముందున్న వస్తువు కాన నట్లు 
మంచి మాటలు చెవులకు ఎక్క నట్లు 
బుద్ది పెళ్ళాము ఆశకు బుద్ది చెప్పు  

058.. అద్దపు గదిలో కుక్కలా అదర బెదర  
కంది రీగలా శబ్దము కరకరకర  
తేనె టీగలా పొడిచియు త్రాగు చుండు 
పందిలా పిల్లలను కని పొర్లు చుండు 

059.. వెకిలి వేషము ప్రాణాల్ని తీయు చుండు  
గుబిలి పుట్టంగ గుర్రమే గుక్కు చుండు 
వావి వరుసలు లేకయు వాత పెట్టు 
దొడ్డి దారిన దొంగలా దౌడు చేయు  

060.. విత్తము కొరకు చెయరాని వింత పనులు 
మత్తు మగువకు చిక్కియు మాయ మొచ్చు 
విత్తు నాటినా దేవుడే దిక్కు ననుచు 
కత్తిలా బత్క లేకయు కదల గుండు 

061.. స్త్రీని బేరము పెట్టియు సీగ్ర బుద్ది  
స్త్రీల కోరిక తీర్చక వేచి ఉండు 
స్త్రీల ఆశలు అడియాశ చేయు చుండు 
స్త్రీల బతుకులు  వేదన తీవ్రతగను  

062.. వ్యక్తి బానిస కాదురా వ్యాధి అదియు   
ధైర్య సంపద కలిగియు దంచు చుండు  
వ్యక్తి  కోపము జలముపై వ్యాకరణము  
దేనురా, కాల మాయకు ధిక్కి ఉండు 

063.. చేత జలము నుండను లేదు చింత ఏల
బ్రతుకు దాహము తీరును బాధ ఏల 
జలము దేహముకు విధియు జపము ఏల 
జలము త్రాగి బ్రతక వచ్చు జాడ్జ్య మనకు      

064.. ప్రకృతి లో జల విన్యాస ప్రక్రియ జరుగు 
అన్ని వైపులా పదునుంచు ఆశయముకు   
పంట చేను తడిపి రైతు మేలు చేయు  
తరువులు ఎదుగుటకు వీలు తోడు నీరు

065.. యంత్ర భూతాలతో పాడి యాఁకలిగను   
పశువులుకు గడ్డి ఆహార పంట నీరు  
సూర్యుడు ఉదయాన్నె కళలు సూత్ర జలము     
పలక రించిట హృదయమై పలుకు బలము 

066.. దోపిడీ పరుగు జలము బోధ పడక   
చదువు నీడలో సేధ్యము జలము నడక 
ఎండ మావులు తరిమేసి ఎంచు నీరు 
కావ్యగతశబ్దార్థరసము కవిత బలము 

067.. రగులుతు కులుకై జలముల రమ్యత యగు   
రమ్య దాహమ్ము పిల్పేను రంగు మారు    
బ్రతుకున వెలుఁగై జీవన బంధ మగుట  
భాగ్య మంతయు నేర్పడి భాద్యతగుట 

068.. ఈ జగమ్మున మాయయె ఈశ్వ రేచ్ఛ 
బ్రతుకు వేదాంత భావము భాగ్య మౌను  
జీవ సారమింతేనయా  కీలక మగు 
కష్ట సుఖ కావడిని మోయు కామ్య మగుట 

069.. కుడి యడమల సరాగము కూల గుండ
ఎరుక నిశ్చలానందము ఏళ్ల వేళ
బ్రతుకు సుడిగుండమై తిర్గ భయము వలదు 
జీవితం ఎదురీదుటే స్థిరముగాను  
 
070..ఉప్పు కన్నీళ్ళు కట్టడి ఊసు వద్దు 
మబ్బు కన్నీళ్ళు పడగానె మనసు ముద్దు    
బ్రతుకు చన్నీళ్ళు వేణ్ణీళ్ళు బంధ హద్దు 
మనిషి మూన్నాళ్ళ జీవితం మాయ సద్దు

071..వినయమార్గోపదేశము వింత గుండ
కనిన చిత్ర విధి విచిత్ర కలల గుండ
తనివి తీరదు దేనికీ తలప గుండ
మనవి ఏదైన మనుగడ మనసు గుండె

072.. నిజముకే నీడ కరువగు నిత్య మందు
వింతది అబద్దము నిజము విజయ మొందు
ఈ అబద్దము ఆస్థిర ఊహ పలుకు
నిజము సత్య స్థిర పలుకు నింగి నేల

073..అం బలి ద్వేషి శుభమేను అర్ధ మేను
చింత కాయ శుభప్రద చెలిమి ధీర
కూర గాయ భయోత్పాత గుర్తు చేయ
ఆవు పాల నేయి ప్రియ ప్రేమ కృష్ణ

074..అక్షర తపస్వి మనసునే ఎంచలేవు
ఊహ నిజమౌను సత్యమై ఉన్న తమ్ము
ఓ మధురజ్ఞాన విజ్ఞాన ఓటమవని
ఓర్పు చూపు విద్య వినయ మోక్ష మౌను

075..చీకటంతయు నీవల్లె చేరి వగచె
బాసలన్ని యు నీవల్లె బదులు లేక
చిగురు ప్రేమైంది నీవల్లె చెప్ప లేను
మనసు తేజము నీవల్లె మంత్ర మాయె

076..చలన కన్నుల కన్నీరు చావలేదు
హేయ మనసుకు ఎక్కడ తావు లేదు
ఆశ కనుల జోడుకు దారి కొదువ లేదు
వేదన యని పలుకులోన విలువ లేదు

077..మేలు కొలుపులే మోహనా, మిన్న తలపు
లేదులే, ధ్వని కరుణయే ఈ పదాలు
చెవికి ఇంపు యగుటయేను, చేరు వగుట
ఉభయ ద్వందాల సేవలే ఉజ్వలమగు

078..కడలి పొంగులు  పయనము గట్టు వరకు
మనిషి పరుగులు సుఖముకై మట్టి నందు
స్త్రీలు ఊహల కదలిక స్వేచ్ఛ కొరకు
కాల చక్రము తిరుగును కలుసు కొనుచు

079..పువ్వు వికసించిగా నేత్ర పూజ్య మగుట
నారి నేత్ర కదలిక యే నాట్య భంగి
చూడ డెందమా నందము పూల వలెను
పూలు యే స్త్రీలు సున్నితంగాను నుండు

080..నింగి మేఘాల దుప్పటి నీడ గాను
ఇండ్ల తలపుల కదలిక ఇష్ట మౌను
ఉదయ కళ్ళు మూత యగుట ఊహ మారు
తేలివచ్చి పోవు కిరణ వెల్గు నీడ

081..కొంగలా ఎకాగ్రత నుంచి పోరు సలుపు
సింహము వలనే ధైర్యము స్వేచ్ఛ పోరు
కోడి లో నిబద్ధత చూపు వోడ కుండ
కాకి నమ్మదు ఎవరినీ కాల మందు

082..ఉట్టిమాట ఎట్టా అన ఉత్త ముండు
గట్టి పోటు పెట్టి యు గట్టు గాటు నాటు
ఒట్టు చుట్టచుట్టి యు మట్టు ఓర్పు కాటు
చెట్టు నాటునోట్లును పంచు చిరుత వేటు

083..నీలి గగనాన నెలరాజు నిలిపె జూపు
మగువ కురుల మల్లెలవైపు మాయ కైపు
ఘుమఘుమలు గగనమ్ము నే కమ్ముకొనియు
మన్మధుని వీక్షణ మగువ మనసు చెరచు

084..నల్లుల తలపు మగవారి నటన యదియు
ఆగ్రహం అవ మానము ఆశ పొగరు 
భాగ్య అక్రోశ శరఘాత భార మగుట
నిత్య హారతి కప్పుర నీడ గున్న

085..చరిత గతిమార్చవచ్చును చలన మగుట
బుద్ధి గమన వేగన్ని ఏ పూజ మార్చు
ద్రోహ బుద్ధి దాగనులేదు పోరు యున్న
మంచి మనసున చేరక మడత పడును

086..వంపులున్న యవ్వన చూపు వలపు ఏది?
దప్పి కొన్న కనుల చూపు మెరుపు ఏది?
బతుకు తోటలోన విరుల భాగ్య మేది?
కౌగిలింత సుఖము ఇచ్చు కాల మేది?

087..మనిషి భార్యేషణ మదిగా మనుగడయగు 
మనిషి పుత్రేషణ సుఖము మాయ కూర్చు 
మనిషి మద ధనేషణ వల్ల మచ్చ చేర్చు 
మనిషి అన్వేషణ బ్రతుకు మనసు వణకు

088.. ఎవరి హృదయ స్వరము వల్ల ఏల కదులు
ఎల్ల వేళల కాలము ఎదను తట్టు
వానలా కలసియు ఉండి వరద లవక
గాలిలా కలసి బ్రతుకు గాయమవదు

089.. కలము కలలన్ని తెలిపితే కాల మాయ
కనక బ్రతక గలుగుట యే కామ్య నిజము
లోకము నయన చూపులు కోప తాప
మదిన మహిమయే జీవితం మనుగడయగు

090.. యింత పాపంబు జగతిలో ఇఛ్ఛ నైన
గలదె నాపాప మిటు పండె గాక అయిన
ధరణి నీ మదికరుణ మాత్రంబు తప్పి
చెప్ప లేని కన్న కొడుకు చేర విధియు

091.. చెలియ శాకుంతల కలలు చేరు వాయె
పృద్వి రాజు ప్రేమ చిగురు పెళ్లి చేరి
సంగమ సుఖము పొందియే జారు కొనియు
గర్భవతి సతి గమనించ లేని రాజు

092.. చరణ పద్మము మీదియు చంద్రకాంతి
సిరులు మించిన గుణముయు శీతలమగు
మోహనా కృతి మీరగా మురువు యున్న
దేహమను దాహ మగుటయే తేన తీరు

093.. తియ్య నైనభాష మనసు తల్లి భాష
అక్షరాల పద కళల ల్లాంటి భాష
అమ్మలు మరిపించే ఆశయాల భాష
నిత్యమూ సుగం దాలుగా నియమ భాష

094..  బ్రహ్మ మతిలేని నాసృష్టి బంధ మణియు
గమ్య మెరుగని దారినే గళము విప్పె
అవని బ్రతుకులో చెడుగుడు ఆశ చూపె
గురువుగా విధాత తెలివి గుర్తు రాదు

095.. మర్మ మేమిది కాదులే మసక వెలుగు
బ్రహ్మ సృష్టియే విధి వ్రాత బంధ మగుట
అడగ లేని జీవమగుట అలక కాదు
తెలుసు కోలేని ఫలము యే తేట నీతి

096..  పెళ్లి తో కవిత్వము పుట్టు ప్రేమ కొరకు
జీవితం గాయ మయినను జపము కవిత
నిలువ నీడ కొరకు నిజ నియమ కవిత
బీదరికము లోన బ్రతుకుల గీత బోధ

097.. మంచు తెర విడిపోయినా మనుగడ గుట
పదపదమని ఉషోదయం పలుకరింపు
పక్షుల కువకువ గళము పగలు తెల్పు
గుడి బడిన గంట గణ గణ గుర్తు చేయు

098.. చెంచె లా అని పిలిచేను చేరి గిరిజ 
బిచ్చగాని భార్యవు నీవు పిలుపు లక్ష్మి
తండ్రి ఎవరు అని పలుకు చేరి గిరిజ 
నీటిలినుండి పుట్టావు నీవు లక్ష్మి








No comments:

Post a Comment