*ఉషోదయ పుష్పాలు వేంకటేశ*
సులభ తరమేది మది మధు సూధన కళ
అళవికానిదైవం కోర ఆశ యగుట
కలలు నిజముకావని చెప్ప గాల మేల
వేకువ కనులు కనలేను వేంకటేశ
కాల మాయయిదియు నెంచ గమ్య మేది
ధనమనే యాశ పలుకులు దారి చూప
యేది ఏమైన నీకృప యేల కలుగు
విలువ లేనిచోట బతుకు వేంకటేశ
అంబరాన యదృశ్యమై ఆశ్రితకళ
ఆత్మ యానంద పరమగు ఆత్రపు కళ
అక్షర మలుపు తెలియదు అక్కరేల
వేల్పుల తలపు మాత్రమే వేంకటేశ
ఆధిపత్య పోరుయిదియె లంధకీర్తి
ప్రాకులాట వలనజన పదవి రాదు
ప్రజల నాడి తెలిసితెల్ప ప్రాభవమును
సేవ చేయవల చెలిమి వేంకటేశ
మనసు సద్భావమే నుంచ మార్గమేది
ఒక్కసారి వలయమందు ఓర్పు లేక
నిజము తెలుసుకో లేకయు నమ్మలేక
విజయ దృక్పదం చూపయ్య వేంకటేశ
మోడు వారిన వృక్షము మోక్షమేది
పుష్ప ఫలములు పంచితి పుడమి నందు
శాస్త్ర సద్వినియోగమ్ము శాప మేల
విశ్వ లోక కర్తవు నీవు వేంకటేశ
చేయి పట్టనాన్నయు లేరు చింత లేదు
ముద్దు చేయు యమ్మయు లేదు ముప్పు లేదు
అన్ని నీవెననియు చెప్ప ఆశ నాది
వినయ వాక్కు యందించుము వేంకటేశ
తెలుగు బ్రతకాలని కలలు తిష్ట నాది
వెలుగు సాహిత్యమును పంచ విధిగ ప్రభలు
చనువు తో తెల్ప కలిగితి జయము నీది
వింత లొద్దు సత్యము చాలు వేంకటేశ
పుణ్యభూమిన నీదయా పుట్టగిట్ట
జ్ఞానమన్నది పంచెది జ్ఞప్తి జేయ
లోక నాయకత్వము నీది చోటు జూపు
సిరులు వద్దు మనసు శాంతి వేంకటేశ
అమ్మలను గన్నా యమ్మ యాశ్రి తవగు
అచ్చరువు చూప కళలతో అమ్మతోను
ప్రజల యాశయ సిద్ధికి ప్రభలు గాను
విషయ వాంఛలు నీదయ వేంకటేశ
నీవు పరమాత్ముడవు భక్తి సేవ చేయ
యాపదలు తొలగించుమా యనఘ దేవ
నిత్య కైమోడ్చి భజయించ నీడ జూపు
వెరపు నామది రక్షించు వేంకటేశ
ముందు సూత్రాలు మురిపించు ముఖ్య మేది
నెప్పుడు నరరక్ష సలుపు నిజము దేవ
సమయ సంతృప్తి నీయుము సమర నాధ
వేయి కాసులివ్వను లేను వేంకటేశ
సూర్యదేవర మాకును సుఖము యేది
కశ్యపాత్మజ ! కదలిరా కమలబంధు !
వర్ష ధాటికి జనులెల్ల వగచుచుండ
నీదు దర్శన భాగ్యము వేంకటేశ
విశ్వపూజిత ! వినతులన్ వినుము దేవ
హనుమకును విద్య నేర్పిన యాదిదేవ
నీదు దర్శన భాగ్యము నిఖిల మందు
విశ్వ మంతయు క్షేమము వేంకటేశ
జీవనాధార మీవెగా జీవులకును.
కదలిరావయ్యకరుణతో కావు మమ్ము
కాల మంతయు కలుషితం కాన వయ్య
వేగు చుక్కవు నీవెగా వేంకటేశ
చెడ్డవారు పెరుగు చున్న చింత జేర
మంచివారి మనుగడ యె మాయ ప్రశ్న
మంగళమనునది కలలు మనసు లోన
విచ్చల విడిగా బ్రతుకగు వేంకటేశ
గుణయుత శుభము చేకూర్చు గుర్తు నీవు
కాంతిమంతుడు గను నీవు కాల మందు
మూర్తిత్రయీతనోద్దీపితుడు ముంద రుండి
విద్య విద్యారుల కళలు వేంకటేశ
కాదిహాదిస్వరూపము కామ్య మగుట
స్వప్రకశిత యై పరాశక్తి సమయ మిదియు
నిత్య నేత్రానందకరుడు విశ్వ మందు
సత్పదము తెల్ప సమయము వేంకటేశ
*ఉషోదయ పుష్పాలు వేంకటేశ*
మల్లాప్రగడ రామకృష్ణ
దీనతకు సెలవేదియు ? దిగులు తప్ప
నల్లమబ్బు లెక్కడలేవు ? నాశనంబు
పల్లెలో రైతులకు బాధ పగలు రాత్రి
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
కారుచీకటి బ్రతుకునందు కష్ట నెలవు
విత్తుజల్లగ నీరేది వినయ మూర్తి
చేత విత్తంబు కరువాయె చింత బతుకు
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
సత్తువను చూప లేనయ్య సమయ మందు
సంఘ తోడు కరువు గాను సాక్షి యేది
సాహసము లేదు ప్రకృతిపై సమరమేల
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
గొడ్డుగోద తిండికి కష్ట గోడు వినుము
కొఱతగా కనబడుటలే కోప మొద్దు
బిడ్డలకు కూడు నిత్యము పెట్టలేను
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
కర్షకున్ని నోదార్చరే కాలమందు
రారు రాలేరు తోడుగా రాజ్య మేల
నీతి మరచిన నేతలు దీటుగాను
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
కదలి వచ్చి జనము నాకు కాపు కాయు
కరములను కలపుట తప్ప కార్య మేది
ముదము రైతులనడిపించు ముఖ్య మేను
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
వికృతమౌ చేష్టలనుజూడు విశ్వ మందు
ప్రకృతిని జయించ వనరాశి ప్రభలు పంచు
తెలపగలుగు విద్య యిదియే తేరుకొనియు
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
సాదరంబుగ భువినందు సాధ్య మేల
నిత్యమూ సమీరము చుట్టలేను దేవ
చల్లనౌ గాలిచకచకా చల్ల భరచు
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
నయముగా జలం కురిపించు నమ్మకమ్ము
పృద్విపై ప్రేమ కురిపించి కృపయు జూపు
సృష్టి రక్షణ నీదేగ శృతి లయలగు
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
పల్లెలో పంటలను పండ ప్రాణమౌను
భాగ్యములు పొంగ హృదయము బాధ తీర
జాతి కంతట జయమగు జాతరగను
వేగిరొచ్చి బాధలు తీర్చు వేంకటేశ
తొణికిన స్వప్నమగుటయే తోలు తిత్తు
తొలగుతున్నది స్వర్గము తోడు కరువు
జాడకోసమే మనసులో జాతరగుట
వేగు అన్వేషణను జూడు వేంకటేశ
యే మిదీ వెంకటేశ్వరా యేల చెప్ప
లేను విధి వాకిట నున్నటి కిటికి బతుకు
మంచి చేయనివ్వని విధి మాయ సెగలు
వాకిటను గుమస్తానులే వేంకటేశ
భావ సున్నితం సుమధురం బలుకు రీతి
విధి సుసంపన్న లక్ష్యము విజయ వాంఛ
ఉన్నత కళలు తెలిపెడి ఉద్య మమ్ము
వెలుగు కవితల వైభవం వేంకటేశ
కలియుగాన రక్షణ జేయు కామ్య విధియు
దుష్టుల నతమార్చ మనసు దూతయగును
నణచ భక్తులఁగావమూ నయన ధీర
వెళయు లీలలు నవతార వేంకటేశ
తరణి తన్మయ పరిచెడి తపన యేల
కృపయు జూపకళలు పుట్టి క్రియలు యేల
నమ్మబలుకులు తెలిపెడి నటన యేల
వెక్కిరింపులు జాగిలం వేంకటేశ
బతికి బతికించు చదువుయే బంధము గను
తెలుగు మాధ్యమమూ గతీ తెలపగలుగు
కాల నిర్ణయం తెలుగుగా కళలు గాను
స్వయ మనో ప్రకాశము పెంచ వేంకటేశ
ఆచరించుత మేలు సకామ మదియు
నిక్కము పలుకు నిజముగా నియమ మౌను
మనసు శ్రేయోభిలాషి గా మమత జూప
వెన్నెలలు పంచు నిత్యము వేంకటేశ
విద్య తో వినయ పలుకు విశ్వ మందు
యున్న కాలము సుఖదుఃఖ యున్నతిగను
సర్వ కళలు వృద్ది సహజ సమయ తృప్తి
నేల నందు నున్నటి మూర్తి వేంకటేశ
*ఉషోదయ పుష్పాలు వేంకటేశ*(3)
మల్లాప్రగడ రామకృష్ణ
యవ్వనంలో *"మొటిమలుగా ఎఱ్ఱ ఎఱ్ఱ "*
ముసలితనములో "*ముడతలే "మొఱ్ఱ మొఱ్ఱ*"
యవ్వనంలో *"ఆమె"* చెయ్యియే *ఎఱ్ఱ ఎఱ్ఱ*"
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
యవ్వనంలొ*"ఒంటరిగాను ఎఱ్ఱ ఎఱ్ఱ "*
ముసలితనమేను *"ఒంటరి"* మొఱ్ఱ మొఱ్ఱ
యవ్వనంలో సలహాలు లె *"చికాకు"* ఎఱ్ఱ ఎఱ్ఱ
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
ముసలి తనము *"మాట్లాడటం"* మొఱ్ఱ మొఱ్ఱ
యవ్వనంలోన *"అందాన్ని"* ఎఱ్ఱఎఱ్ఱ
ముసలితనములో "అందాన్ని"* మొఱ్ఱ మొఱ్ఱ
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
యవ్వనంలొ *"చావు"* యనరు ఎఱ్ఱ ఎఱ్ఱ
ముసలితనము *"రోజులనెడి మొఱ్ఱ మొఱ్ఱ
యవ్వనంలో *"ప్రతి క్షణం"* ఎఱ్ఱ ఎఱ్ఱ
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
ముసలితనము *" జ్ఞాపకములే "* మొఱ్ఱ మొఱ్ఱ
యవ్వనం *"నిద్రలేవడం"* ఎఱ్ఱ ఎఱ్ఱ
ముసలితనము *"నిద్రలుగను*" మొఱ్ఱ మొఱ్ఱ
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
యవ్వనం *"గుండె పైగుండె*" ఎఱ్ఱ ఎఱ్ఱ
ముసలితనము *"గుండెయుయాగి*" మొఱ్ఱ మొఱ్ఱ
జీవికి *"ఆటు పోట్లుగా "*జెఱ్ఱ జెఱ్ఱ*"
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
*"జీవితానుభవముగాను ".* "*జెఱ్ఱ జెఱ్ఱ*"
జీవి *"గా ప్రశాంతముగాను "* "*జెఱ్ఱ జెఱ్ఱ*"
*యవ్వనంలొ వృద్దాప్యము ఎఱ్ఱ ఎఱ్ఱ
వృద్ధ జీవితం నీ చేయి వేంకటేశ
తెలుగు నేర్వ నెంతయనెడి తేజమేది
వెలుగు జిల్గు గా కధగాను వేల పలుకు
పలుక వ్రాయ యెంతయులేదు పాఠమేది
విలువలు మరచే విస్తృతి వేంకటేశ
అచ్చ తెలుగు సొగసు మీద ఆంగ్ల భాష
సాంస్కృతి విష కోరల్లోకి సాగు తెలుగు
మాతృభాష వాడకపోతే మనుగడేది
విలువ పెంచే తెల్గు మరచె వేంకటేశ
నీకడ శృతి ఘోషలు మది నిర్ణయమ్ము
ధర్మమార్గము జూపుము ధరణి యందు
తపము చేసద నీకడ తన్మయమ్ము
వెలుగులై విస్త రించుము వేంకటేశ
మీకు సాష్టాంగ ప్రణతులు మేలు కోరి
మనము గా విన్న వించేద మార్గ విధియు
నిన్ను వేడుకుంటాముగా నిజము దేవ
వెతికి మమ్మునూ కరుణించు వేంకటేశ
విద్య తో తూగు బంధువు వినయ మేది
విద్య తో స్నేహ మన్నది విజయ మేది
విద్య తో దనము సుఖము వేదనయగు
విద్య లకు మూల మైనట్టి వేంకటేశ
సాధన తలపు మనిషిగా సత్య విలువ
ఆచరణ యనుకరణయె ఆశ పలుకు
వెల్లువగు బుద్ధి చదువుయే వేకువగుట
విజయ వాంఛలు తీర్చుమా వేంకటేశ
పైకి చూడ అచలమూర్తి పిలుపు గాను
'రక్షణామూర్తి'గానులే రమ్య తీరు
తరచి చూడగా అహమహం తపన తీరు
వినయ 'నయనాల తాండవం' వేంకటేశ
రెక్కలే లేని పక్షియు నేల కొరుగు
ఎండి పోయిన చెట్టుయు యగ్ని పుట్టు
నీరు లేని సరోవరం నీడ కరువు
వెన్న ముద్దలు పెట్టెదా వేంకటేశ
పళ్ళు పీకిన పాముయు పడగ విప్పు
బతుకుకే బీదవాడుయు బంధ ప్రీతి
మాటకే భయపడు వాడు మాయగాడు
సేవనే పంచని మహిళా వేంకటేశ
55..జనులు భాగవతంబుల జడ్య మిది
ఘనత సతి సుతులన్ బాధ గాంచ గలుగు
మాది ప్రతిమల రాజ్యము మార్గ మేది
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
56..పాఠముల్ యున్నతమనియే పాలనగను
పాఠ్యమగుజేర్చ తృప్తిగా పాలనేది
కల్మ షమనిషి హరియించి కాలమిది
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
57..పాపపు పలుకు మాదియు పాశ మేల
పర్వు పెట్టు బుద్ధిమతియు పంతముగను
మగుత నామము పల్కితి మాయ వలన
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
58..కళల సంగతి వీడితి కథలు యేల
వేళలో పూజ భక్తిగ వినయముంచు
దేవ విద్య సారమెరుగ దీన బతుకు
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
59..జాతి మేలు కోరితి మది జాడ్య మాయె
జాగృత పరచినను బాధ కాన లేను
నీతి వీడక నిష్ఠగ నిన్ను కొలువ
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
60..నిత్య విహితపు కర్మలు విధిగ చేయ
వెన్ను పోటు యన్నదిలేదు వినయ దేవ
సహనబ్రతుకుగా నడిచితి సంఘ మందు
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
61..మాటలన్ని నీదయకృప మానవునకు
మనసు పంచ సృష్టియునీది మాయ గాను
సర్వ వేళలందు సమయ భావము గను
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
62..ఔరసుడని పిలిచినాను వైనతేయ
దత్తపుత్రుడు వైతివి ధరణి యందు
క్షేత్ర పాలక వైతివి క్షేమము గను
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
63..మనమనస్సున కొలువైన మహిమ దేవ
పరిమళ సుగంధ పుష్పాలు పరచి నుంచ
సుందర సువర్ణ పూలను ముందు నుంచ
వేయి జన్మల సుఖమివ్వు వేంకటేశ
64..భార్య బలముగా భర్తకు బడయు సుఖము
భర్త సంపద భార్యకూ భాగ్య మౌను
భారమన్నది లేనట్టి బంధ బతుకు
వేళ సంసార పూజలే వేంకటేశ
65..భోగిగ సుఖము పొందితి పోరు బడసి
త్యాగిగ జనము యశముయు తగిన తృప్తి
యోగిగ బతికిన గూడు యోగ్యత గను
రోగమోచ్చిన మనిషిగా వేంకటేశ
66..సంత మురికి సాగర మగు సంఘ మందు
సంపదంతమాయ మగుట సాక్షి గాను
మనిషి తనము మాయ మగుట మార్గ మందు
వినుడు మాగోడు యిపుడునే వేంకటేశ
67..నిత్య నిరతమ్ము నినుగోల్తు నిగమ వేద్య
మాలొ పాపముల్ నశియించు మార్గ మేది
కళల కైవల్య మిచ్చినన్ గావు మయ్య
వినుడు మాగోడు యిపుడునే వేంకటేశ
68..కొండ రాయుడు వైనావు కొలుతు నిన్ను
నీదు నామమ్ము దళచితి నియమ మందు
ధర్మ తేజ ప్రజల గోడు ధరణి యందు
వినుడు మాగోడు యి పుడునే వేంకటేశ
69..నీదు నేత్రల చిత్రమ్ము న్నిచ్చ లందు
నాలుక పలుకుయేలిక నాడు లందు
సాహితీ పర కావ్యము సాధు లందు
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
70..స్వార్ధ దోష బుద్ధిగనులే సాగు జీవి
సంఘముందు నాలోచన సమర మగుట
ప్రేమతో ప్రేమ కరు వైన ప్రీతి లేక
వినుము మాగోడు యిపుడునే వేంకటేశ
71..చిన్న చిన్న సంతోషాలు చిత్త మందు
ధనము ధ్యాస మనసు కష్ట దారి యందు
జీవితమ్ము సాగుట విధి జాడ్య మేను
వెట్టి చాకిరీ బతుకగు వేంకటేశ
72..తే..యీ గులాబి మిత్రుల నెంచ యిచ్ఛ పెంచు
వయసుననె గులాబిమెరుపు వలపు లాగ
తాపపు ప్రేమ పుట్టించు తన్మయమున
వెట్టి చాకిరీ బ్రతుకగు వేంకటేశ
నీరు దగ్గర వృక్షాల నీడ పెరుగు
రాజు వద్ద పండిత కళ రమ్య పరచు
దేవ నీవద్ద భక్తులు దీన పలుకు
వెళ్ళు వైన జనులు జూడు వేంకటేశ
ఆరని జ్వాలలానుండ ఆత్ర మదియు
ఎగసి పడుతున్న మనసుకి యేది హద్దు
మంచు బిగుసుకుంటున్న తీరు మాయ లాగ
వయసు కోర్కెలు గానులే వేంకటేశ
శుభోదయం 🙏 బుధవారం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏
73.. పట్టుకున్నది నిజమైన ఫలము లేదు
పట్ట రెబ్బల వలవలా పాశ మగును
నిలబడే పడి పోతున్న నిజము పట్టు
పక్క పక్కన కదలిక పలుకు పట్టు
వెట్టి చాకిరీ బతుకగు వేంకటేశ
074..జీతమిచ్చిన నేతయు దాత కాడు
భృత్యుడడుగ భృతియునే బిక్ష కాదు
ఫలము శ్రేయస్సు సత్కీర్తి ప్రేమ పెంచు
సేవక శ్రమ పాలకా వేంకటేశ
075.జ్ఞానము కవికి లేదనె జాతి యిదియు
జేయువారలి సన్నుతి చేష్ట యదియు
ధాత్రి సత్కవనము వ్రాయు వారలగును
సేవక శ్రమ పాలకా వేంకటేశ
076.విలువ తెలిసియు వర్ణించు వేగిరమ్ము
ఆచరించుట ఆదర్శ ఆలయమగు
యీప్రవచనమే ప్రేరణం యీశ్వరేశ్చ
సేవక శ్రమ పాలకా వేంకటేశ
077..పాలకులు నిరంకుశ దూర్త పాఠ్య మేను
శాంతి నిల్ప గలుగు నట్టి చరితలేదు
జగతి యంతటన ప్రజాస్వామ్య మేను
చిందె రక్తధారలు నేడు వేంకటేశ
078..నీతి నియమాలు వల్లించి నిప్పు పెట్టి
ఫలితమేదిలేదని మాట వట్టి మాట
మణుజులందుతిరిగి తెల్ప మాట లొల్లి
చేయవలెను సేవ యిపుడు వేంకటేశ
O79..తనకు కలుగు బాధ తలిచి దారి యడుగ
తల్లి యగుట కొరకుయాస తపన జెంద
మగువ గొప్ప తనముచెప్ప మనసు విప్ప
వేడు కలుయివి తల్లిగా వేంకటేశ
80.అలుపెరగని కార్యపు దక్షతా మనస్సు
మనిషి ధైర్యమే జీవిత మలుపు ఓర్పు
ప్రళయమనిపించు ప్రణయమ్ము ప్రభలు తీరు
వేగిరా రమ్ము జూడుము వేంకటేశ
81.సంరక్షకుడు నాన్నవు నీవు సైనికుడువి
శ్రామికుండుగా నాన్నగా శక్తి నీవు
సతి సుతల ప్రతినిధిగాను సారథిగను
నీవు మాకు దైవము నిత్య వేంకటేశ
082..వేగ మేఘాల మనసును వెలిగి ఉండు
నింగి ఎగిరేటి పక్షుల నీడ గాను
నిమిరి చక్కలి గింతలు నియమగాలి
వెన్ను తట్టిన నేస్తాలు వేంకటేశ
83.ఆగ్ర హింపకు వెంకయ్య యాగు మయ్య
నవ్వులగుటయేల యిపుడు నమ్మలేరు
చేసినా తప్పును తెలుపు సేవలందు
చేతకాని వాడిని నేను వేంకటేశ
084..జీవకోటికై పరితపించి దయ చూప
తాపత్రయము సంభావ్యత తపన చూప
ప్రకృతి పురుషుల దైవమ్ము ప్రభలు చూప
వేదన గను ప్రార్ధనలుగా వేంకటేశ
085..సత్య పలుకులుగా రాజ్య సేవ ఎపుడు
ధర్మ నిర్ణయం తెలిపేది ధరణి ఏది
న్యాయమే జగతిననుంచు మార్గ మేది
నిజముతెలుపు మనిషియేడి వేంకటేశ
086..వరుస దైవత్వమే మానవత్వ మగుట
మానవత్వమే దైవత్వ మార్గమగుట
సృష్టికార్యము భగవతీ శృతిలయలగు
వేడుకుంటున్న మనిషిగా వేంకటేశ
087..సత్య పలుకులుగా రాజ్య సేవ ఎపుడు
ధర్మ నిర్ణయం తెలిపేది ధరణి ఏది
న్యాయమే జగతిననుంచు మార్గ మేది
నిజముతెలుపు మనిషియేడి వేంకటేశ
088..జీవితం ఇచ్చి చూచెడే దీనబంధు
జీవితం దిద్ద మార్పుకు తేజ నిధియు
జీవితం ప్రయాణంగాను జీవ బంధు
తెలిపెద కృతజ్ఞతలు గాను వేంకటేశ
089..అసలు ఆశించడం వద్దు ఆశ వద్దు
సమయ శాశించడం వద్దు సహన ముంచు
వినయ సంతోష పలుకులే విద్య వలన
వేడుకుంటున్న యానంద వేంకటేశ
090..సత్య వాక్యముపలుకు గా శాంతి నింప
సత్ప్రవర్తన హితముయే సంఘమందె
నిత్యబలము రెట్టింపగు నీదయ మది
వీర విశ్వ నాయకుడవే వేంకటేశ
091..సాన సంఘర్షణ వెలుగు జాతి రత్న
మీ స్వయం సహాయంతోను మీరు మారు
బాధ కలిగించే జాతర బంధ కూర్పు
వేడుకొంటిని వెన్నెల వేంకటేశ
092..పాల నీరుక్రమ మెరుంగ పరమ హంస
మౌనమున్నా కలహములు మాయమగును
ధ్యాస కలవాడు సంతృప్తి ధ్యాన బతుకు
వేళ నీతులు తెలిపావు వేంకటేశ
093..ఆలి మాటలు విని శాంతి యాత్ర జేయ
నిత్య తప్పొప్పులను చెప్ప నిన్ను చేర
నమ్మబలుకులు మావియే నమ్ము దేవ
వేడు కుంటున్న మీ దయ వేంకటేశ
094..ద్రోహ చింతన కలవాన్ని దొడ్డ బుద్ధి
గౌరవించడం తెలియని కౌలు నైతి
దుర్గుణము తోడు నీదయే దుర్గ మందు
విశ్వ నేత్ర ఏమిటి లీల వేంకటేశ
095..కొంచమైన జాలిని జూప కోప మేల
కంచు కంఠ బలకు జూడు కాల నేత్ర
ఇంచుకైనను ప్రేమయు ఇపుడు యేది
వేళ సార్లు వేడెద నిన్ను వేంకటేశ
096..సగము బలము సంతోషము సహనమందు
కలసి బ్రతికినపుడు నీడ కాల మహిమ
నిత్య సద్గుణ సాంగత్య నియమ తృప్తి
వేకువ కళలు నీదయ వేంకటేశ
097..నాలొ యపరాధ భావన నన్ను మార్చు
నాలొ అర్ధ విధానాలు నన్ను ముంచు
అందలమ్ము యెక్క మనసు ఆశ పెంచు
విశ్వ వేదరక్షకుడవే వేంకటేశ
098..జీవులను జంపు మనిషి చిందులెయ్య
మ్రొక్కు మూర్ఖ పూజ లగుట మోక్షమనియు
ధర్మ మిద్ది బలి యనుచు ధరణి యందు
వేడ్కగా వింత లన్నియు వేంకటేశ
099శిల్పి నైపుణ్య కళలుగా శిల్పమగుట
పుత్తడి మెరుగు ఆకర్ష పూజ్యమగుట
కళ్ళు చూడ దైవహృదయ కాల మాయ
విగ్రగాముని లీలలు వేంకటేశ
100..ఉత్తముల సేవ భాగ్యము ఉన్నతమ్ము
గురువుల పరిణామమ్ముగా గుర్తు విద్య
విగ్రహ పూజ నిగ్రహము గా విలువ బట్టి
విశ్వ రూపము పోలిక వేంకటేశ
101..శుద్ధ తత్వయర్దము కాదు సుఖము లోన
వాక్య పరిబావ ప్రభలుగా వాక్కు చిలుకు
ఆఖరి మజలి బోధగా ఆట పట్టు
వేల్పుల నిలయ విజ్ఞాన వేంకటేశ
102..తేనెలా తీయగా పల్కు తిష్టవేసి
తేలులా కుట్టి మాట్లాడు తీవ్ర బుద్ధి
మనుషుల స్వభావంయిది మనసు పట్టు
వెన్న తిన్న మూఢ మనసు వేంకటేశ
103..ఎవ్వరెవ్వరివాడు గా యేలు జీవ
నెవ్వరికి నేమి మౌనణో నిత్య జీవు
ఎందరి కొడుకుగాఁనుండ యేలజీవ
వెనకముందు నీవగుటయే వేంకటేశ
104..కెందరికిఁనొ తోబుట్టుగా క్రియల జీవ
యెందరిని భ్రమయించఁడ యేలజీవ
మెందరికిఁ గాను సేవలు మేలుజీవ
వెనకముందు నీవగుటయే వేంకటేశ
105..యెక్కడెక్కడఁ తిరుగాడు యేల జీవ
ఎక్కడో తనజన్మ యో యేలు జీవ
యెక్కడక్కడ చుట్టము యొప్పు జీవ
వెనకముందు నీవగుటయే వేంకటేశ
106..ఎన్నఁడును చేటులేకయే యేలు జీవ
ఎన్ని తనువులు మోవఁడీ యోప్పు జీవ
యెన్నిపదవులఁ పొందఁడీ యేమి జీవ
వెనకముందు నీవగుటయే వేంకటేశ
107..ఎన్నివ్రాసినా యదలోన యేమి తెలుప
ఎంతచూడాలని మనసు యేల ఒప్ప
యేమి చేయలేని విధియు ఎరుక పరచ
వేగి రాగలనున్నాను వేంకటేశ
108..తప్పు లెన్నియో వ్రాసితి తమరు జూడ
నాదు మల్లాప్రగడవంశ నమ్మ బలుకు
పూర్తి చేసితి శతకము పుడమి నందు
వేకువ తలపు పద్యాలు వేంకటేశ
No comments:
Post a Comment