Wednesday 5 June 2024

 *జ్ఞాన రత్నాలు*



*1. నేనే దేహమని దేహవానన ఉన్నంతవరకు మోక్షము కలుగదు.*


*2. నీవు బంధించుకున్న బంధాలే నీ జన్మకు కారణం. అవి ఎవరో బంధించినవి కావు. అందుచే నీ బంధాలని నీవే విడిపించుకొని మోక్షం పొందాలి.*


*3. బంధాలలో నుండి విడివడటమే మోక్షం.*


*4. బయట వెతుకున్నంత వరకు పరమాత్మ దర్శనం కాదు.*


*5. ఈ దృశ్యమాన జగత్తులోని విషయాల పైకి ఇంద్రియాలు వరుగెత్తినంత వరకు ప్రతిబంధకమే. జ్ఞానప్రాప్తి కాదు.*


*6. యజ్ఞయాగాదులు, సత్కర్మలు, తీర్థ యాత్రలు మొదలగునవన్ని వాసనాక్షయానికి చిత్తశుద్దికి తోడ్పడుతాయి తప్ప స్వస్వరూప జ్ఞానం కలుగదు.*


*7. కర్మోపానన జ్ఞానానికి విరుద్ధం. అజ్ఞానం నశిస్తే కాని జ్ఞానప్రాప్తి కలుగదు.*


*8. ఇది నాది, నీది, అన్ని విషయాలమీద అభిప్రాయాలు రూఢి చేసుకొని కర్మలాచరించటం. బంధ హేతువే.*


*9. భూతకాల విషయాలను భవిష్యత్తులో జరుగబోవు వాటిని చింతిస్తూ కూర్చోవటం అవివేకం. వర్తమానంలో ఉండి జ్ఞానమార్గంలో పయనించు.*


*10. నీవు జన్మించినవుడు వట్టి చేతులతో వచ్చావు. పోయేటప్పుడు అన్నీ వదిలి పోతున్నావు. బతికి ఉన్న నాల్గు రోజులు ఇవి కావాలి అవి కావాలి అని కోర్కెలు, ఆశలు పెంచుకొని జన్మపరంవరలో చిక్కుకోవటం ఎందుకు?*


*11. పెట్టి పోషించిన నీ శరీరమునే వదలి పెట్టి పోతుంటే అట్టి శరీర సంబంధీకుల మీద మోహమెందుకు?*


*12. సోమరితనమే తన శత్రువు.*


*13. తృష్ణయే సంసారపాశము.*


*14. అమిత కోర్కెలు గలవాడు శ్రీమంతుడయినను దరిద్రుడు.*


*15. విషయవాంఛల యందు కోర్కెలు నశింప చేసుకున్నవాడు ధనవంతుడు.*


*16. పుణ్యఫలము నుఖము. పావఫలము దుఃఖము.*


*17. పరమాత్మను చూశాను అన్నవాడు చూడనట్లే. పరమాత్మ అవాజ్ఞ్మానన గోచరుడు. ఈ చర్మచక్షువులతో చూడలేరు.*


*18. వరమాత్మ నిరాకారుడు నర్వవ్యాపి సర్వాంతర్యామి అని ఉపనిషత్తులు ఘోషిస్తుంటే నీలో ఉన్న పరమాత్మ కోసం బయట పరుగెత్తటం ఎంత హాస్యాస్పదం.*


*19. జగత్తుకు అధిష్ఠానము పరబ్రహ్మ. జగత్తు బ్రహ్మకంటే వేరుకాదు. అజ్ఞాన భ్రాంతి వలన త్రిగుణాలతో నిండిన జగత్తులోని విషయానందం కొరకు కర్మలు చేసి జన్మ పరంపరలలో చిక్కుకొన్నావు. చేయవలసిన దల్లా జగభ్రాంతి వదలటమే. పరమాత్మ దర్శనమవుతుంది.*


*20. నీలోనున్న ఆత్మ ఇతర జీవరాశులలో నున్న ఆత్మ వేరు కాదు. సర్వాత్మ భావన చేసి ప్రేమ అభివృద్ధి చేసుకో.*


*21. భేద భావనే అవిద్య. నామ రూపాల మీద ఆసక్తి పెంచుకున్నంత వరకూ మోక్షము కలుగదు.*


 *22. తీవ్ర వైరాగ్యమే మోక్షసాధనకు శరణ్యం.*


*23. వైరాగ్యమంటే భార్య పిల్లలను వదలి కాషాయ వస్త్రాలు ధరించి అరణ్యాలకు పోవటము కాదు. జగత్తులోని విషయవాంఛలను విడనాడటం దేహ వాసన వదలటమే వైరాగ్యం.*


*24. అసత్యవస్తువును సత్యవస్తువు అనే భ్రమ నుండి బయటపడి, ఆభ్రమచే కలిగిన నకల వాననలు త్యజించటమే వైరాగ్యము.


*25. ఎంతో పూర్వ జన్మల పుణ్య పరిపాకము వలన గాని తీవ్ర వైరాగ్యము, ముముక్షత్వము లభించవు.*


*26. ఉన్నది తాడే కాని (అజ్ఞానంలో) చీకట్లో దానిని పాముగా భ్రమించి భయకంపాలకు లోనయ్యావు. ఆ స్థితిలో పాము సత్యమే. దీపకాంతి చూపించగానే అప్పటి వరకూ ఉన్న పాము త్రాడులో లీనమయింది. అదే విధంగా సద్గురువు ద్వారా స్వస్వరూప జ్ఞానం కలుగనంత వరకూ త్రిగుణాలతో నిండిన జగత్తు గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం, (స్వస్వరూపజ్ఞానం) పొందిన జ్ఞాని జగత్తుని బ్రహ్మమయంగా చూస్తాడు.*


*27. కర్మ బంధాలు జ్ఞానాగ్ని చేతనే (స్వన్వరూపవిజ్ఞానము చేతనే) దహింప బడుతాయి కాని సకామ్యకర్మలు, యజ్ఞయాగాదుల వల్ల కాదు.*


*28. దీవం ఉన్నచోట చీకటి ఉండదు. అదే విధంగా జ్ఞానోపాసికి కర్మోపానన పనికి రాదు. జ్ఞానం కలగటానికి తనలోని అజ్ఞానాన్ని నిర్మూలించుకోవాలి.*


*29. చిదా భానుడు వరమాత్మకన్న భిన్నుడు కాడు. నూక్ష్మ శరీరము (అంతఃకరణ) భంగమవుతే చిదాబానుడు పరమాత్మలోనే లయమవుతాడు.*


*30. సూర్యప్రకాశం వలన కొందరు శృంగార నవలలు చదువుతారు. కొందరు నంద్గంథ పఠనం చేస్తారు. కొందరు స్వస్వరూపజ్ఞానం పొందటానికి ధ్యాననిమగ్నులై ఉంటారు. వారి వారి ఉపాధుల బట్టి. వారు చేస్తున్న కర్మలన్నిటికి నూర్యుడు సాక్షి. అదే విధంగా అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఆయన చైతన్య శక్తి వల్ల బుద్ధి మనన్సు ఇంద్రియాల కార్యకలాపాలకు సాక్షిగా చూచున్నాడే కాని ఆకర్మలకు బద్ధుడు కాడు.*


*31. సాక్షికి సంఘర్షణ పడుతున్న వ్యక్తులతో సంబంధం లేనట్లు మనోబుద్ధి అహంకారాల వలన జరిగిన కర్మలకు సాక్షికి సంబంధము లేదు. ఆ సాక్షి చైతన్యమే "నేను".*


*32. మోక్షగామి పురుషయత్నంలో దైవీ సంపదను అలవరచు కోవాలి. అసురసంపదను విడనాడాలి.*


*33. నీవు వంచకోశ విలక్షుణుడవైన సాక్షివి. అదేవిధంగా శరీరత్రయమునకూ. సాక్షివే.*


*34. "నేను" "నేను" స్వస్వరూప విజ్ఞానం తెలుసుకోకుండా దానికి ప్రయత్నించకుండా ఇంద్రియలోలుడై మానవ జీవితము వ్యర్థము చేయరాదు.*


*35. అవిద్య కారణంగా విషయ వాంఛలతో కూడిన మనస్సు బంధ హేతువు. మలిన వాసనలు త్యజించిన శుద్ద మనస్సు మోక్ష హేతువు. కాబట్టి బంధమోక్షాలకు మనస్సే కారణం. చేయవలసిన వనంతా పురుషయత్నంతో మనస్సు శుద్ధ పరచుకో. ఇందులో కష్టమేముంది.*


*36. వరమాత్మకు నీకు (అంతఃకరణ) మనస్సే అడ్డు. మనస్సును తొలగిస్తే నీవు పరమాత్మవే. అందుచే మనస్సుని శుద్ధపరచుకొని జాగ్రదావస్థలోనే నిస్సంకల్ప స్థితిలో ఉండి "అహంబ్రహ్మాస్మి" అనే మహావాక్యార్థము తదాకార వృత్తిలో ధ్యానం చేస్తూ స్వస్వరూప విజ్ఞానము పొందుము.*


*37. ముముక్షువు సంసారంలోనే ఉంటూ సంసారం తనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుతాడు. అది ఎలాగ అంటే నావ నీళ్లలోనే ఉండాలి. నీరు నావలోకి రాకూడదు.*


*38. మనస్సునకు వెలువల వేరొక అజ్ఞానము లేదు. మలిన వాసనలు కలిగి భ్రమచే భేద బుద్ధి కలిగిన మన స్సే అజ్ఞానము.*


*39. అన్ని జీవులు స్వాభావికముగా కేవలము శుద్ధ చైతన్యమే. "జీవో బ్రహ్మైవ నా పరః" దీనికి విరుద్దముగా బేధబుద్ధి కలిగి ఉండటం అజ్ఞానమే.*


*40. ఒక నిర్మలమైన స్ఫటికం వద్ద ఎర్రని వుష్పాలు పెడితే స్పటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. కాని స్ఫటికానికి ఏవిధమయిన నష్టము లేదు. అదే విధంగా ప్రత్యగాత్మ సామాన్యంలో ఉంటున్న మనోబుద్ధి అహంకారాలు ప్రత్యగాత్మ ఆ చైతన్య శక్తి వలన పని చేస్తున్న వాటి కర్మలు ప్రత్యగాత్మముకు (నేను) సంబంధము లేదు. అయస్కాంతము దగ్గర చిన్న చిన్న ఇనువ వస్తువులు కదిలినట్లుగా.*


*41. అలల ప్రవాహం తగ్గిన తర్వాత సముద్రం స్నానం చేద్దామని కూర్చోవటం అవివేకం. అలలు తగ్గవు. స్నానము చేయలేవు. అందుచేత అలల తాకిడి లేని సమయం చూసుకొని గబుక్కున స్నానం చేయాలి. అదే విధంగా సంసార సాగర తీవ్రత తగ్గిన తర్వాతా వృద్ధాప్యములో మోక్షసాధనకు ప్రయత్నించ వచ్చని కూర్చోవటం అవివేకం. చిన్నప్పటి నుండి శక్తి ఉండగానే సంసారంలోనే ఉంటూ, సంసారానికి అంటుకోకుండా, మనోభావన మార్చుకుంటూ, సద్గురు బోధవల్ల తత్త్వజ్ఞానము పొంది స్వస్వరూప విజ్ఞానానికి తీవ్ర సాధన చెయ్యాలి."*


*42. పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల కష్టాలు ఎలా వచ్చాయో సుఖాలు కూడా ఆవిధంగానే వస్తాయి. అది అనివార్యము. దుఃఖ నివృత్తికి, సుఖ ప్రాప్తికి భగవంతునితో మొక్కుబడులని బేరాలాడటం అవివేకం.*


*43. సుఖాలయినా కష్టాలయినా ఉదాసీనంగా వాటిని శరీరాని వదలి పెట్టి వాటికి చలించక సాక్షిగా దైవ ప్రసాదాలుగా ఎంచినవాడు యోగి.*


*44. ఆత్మ పుట్టేదీ కాదు. చచ్చేది కాదు. 'శాశ్వతోయం - అవినాశి' "నేను నే నేను" అనేది సంభోధించేది అదే. అది గుర్తించి స్వస్వరూవ విజ్ఞానం పొందటమే జీవిత పరమావధి.*


*45. సత్యాం గత్యము పూర్వజన్మ పుణ్య పరిపాకము వలన గాని కలుగదు. ముముక్షువుకు ఇది అత్యవసరము.*


*46. కర్తృత్వ రహితంగా, నిష్కామంగా, భగదర్పణం చేస్తూ కర్మలు చెయ్యాలి. అవి బంధనాలు కావు.*


*47. తండ్రిని ఋణము మొదలైన వాటి నుండి పుత్రాదులు విడిపింవ గలరు. కాని తన బంధములు తనకు తానే విడిపించుకోవాలి. శతకోటి కల్పములకైనా ఇతరుల వలన కాదు.*


*48. నాస్తికులు కళ్లుండియు గుడ్డివారే.*


*49. కామాతురుడు మహాంధుడు.*


*50. నంసారదుఃఖము పోగొట్టునది వేదోక్తమగు ఆత్మ భోదే.*


*51. దీర్ఘ రోగము నంసారమే. దానికి విచారమే మండు.


52. తన ఇంద్రియాలే తనకు శత్రువులు. వశీభుతములైన తన ఇంద్రియాలే తన మిత్రులు.*


*53. ప్రారబ్ధమే శరీరము నిలబెట్టుతుంది.*


*54. అధిక తృష్ణ కలవాడు ధనవంతుడయిననూ దరిద్రుడు. సర్వదా తృప్తితో ఉండువాడు ధనవంతుడు కాకపోయిననూ లక్ష్మీయుతుడు.*


*55. ఇతరులు నీకు ఏదిచేస్తే అసౌకర్యము అవుతుందో అటువంటి పనులు ఇతరులకు చేయకు.*


*56. భగవంతుడు సృష్టించిన పుష్పాలు ఫలాలు ఆయనకే సమర్పించటంలో ఘనత ఏముంది. నీలో ఉన్న అహంకారాన్ని ఆయనకు సమర్పించు కృతార్థుడవుతావు.*


*57. ఈ విశ్వ భువన భోనాంతరాళములో భూమి గ్రహమెంత? అందులో ఆసియా ఖండమంత. అందులో నీ భారతదేశమెంత? అందులో నీ గ్రామమెంత? అక్కడి నీ ఇల్లు ఎంత? ఆ ఇంటిలో నువ్వెంత. వాటితో పోల్చితే నీవు కేవలము అణుమాత్రుడవు. ఇది మరచి ఎందుకు అహంకరిస్తావు. వినయ నమ్రతలు అలవాటు చేసుకుంటూ సర్వాత్మ భావన చేయి.*


*58. మనస్సు ఒక పిచ్చికోతి లాంటిది. కుక్కలాగా అటూ ఇటూ పరుగెడుతూ వ్యర్థమయిన దుస్సంకల్పాలతో ఉంటుంది. దానికి ఏదో ఒక ఆలంబన కావాలి కాబట్టి. బలవంతంగా పురుషయత్నంతో దాన్ని పరమాత్మపై అంతర్ముఖం చేసి "అహంబ్రహ్మాస్మి" అను వాక్యార్థముపై లగ్నం చేసి స్థిర పరచు. ఆ అనందం అనుభవిస్తే ....అనుభవిస్తే అది ఇక వదలి పెట్టదు.*


*59. నామ రూపాలపై భ్రమతో వాసనలు ఏర్పరుచు కొని వాటిని రూఢి చేసుకుంటే బద్దుడవవుతావు. నీకు ఒక పళ్లెంలో రకరకాలయిన పంచదారతో చేసిన పక్షులు, జంతువులు పెట్టారనుకో. అందులోని పంది ఆకారములో ఉన్న దాన్ని తీసుకోవు. చిలక ఆకారంలో ఉన్న దాన్ని తీసుకుంటావు. ఎందుకంటే పందిని ఏహ్య వస్తువుగా ఇది వరకే రూఢి చేసుకున్నావు కాబట్టి. అందులో ఉన్న పంచదార ఇతర చిలకలలో ఉన్న పంచదార ఒకటిఐనప్పటికి దానికి ప్రాధాన్యత ఇవ్వక నామరూపాలకై ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి నామరూపాల మీద దృష్టి పొగొట్టుకొని, సర్వాత్మ భావన చేయనంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేవు.*


*60. ఈ దేహం లేనిదే నీ స్వన్వరూవజ్ఞానం తెలుకోలేవు. కాని ఆ దేహం నీవు కాదు.*


*61. సిద్దులు వాటి మహత్తు ప్రకటించటం జ్ఞాని లక్షణం కాదు. వాటిని కూడా తృణీకరించాలి.*


*62. ఒకనిని నీటిలో ముంచి అదిమి పడుతే బయటకు రావడానికి ఎంత తవన వడతాడో అంత తవన వరమాత్మ పై పెట్టు. ఆయనే నద్గురు రూపంలో నీకు తత్త్వ బోధ చేసి తరింప చేస్తాడు.*


*63. ధర్మాన్ని నువ్వు రక్షించు. ధర్మం నిన్ను రక్షిస్తుంది.*


*64. ఆత్మ సాక్షాత్కారము పొందని జీవితము వ్యర్థము. రాజమానతను బోదించు విద్య కలిగినను, అత్యధిక ధనవంతుడైనప్పటికి, పెక్కు దేశములు తిరిగినప్పటికీ, సుందరాంగియైన రమణులతో భోగించినప్పటికీ, ఇష్టులైన బంధువర్గమును పోషించి పేరు గడించినప్పటికీ, ఎటువంటి పుణ్య నదులలో స్నానమాచరించినప్పటికి, కోటి మంత్రజవములు చేసినను, అనేక దాన ధర్మములు చేసి ఖ్యాతి గడించినా, గానములో సమర్థత ఉన్నప్పటికీ, విప్రులకు అన్న భోజనములతో సంతోష పెట్టినా, దేవతలకు యజ్ఞ యాగాదులు చేసి తృప్తి పరచినా, ఉపవాసములు చేసి, యోగ సిద్దులు పొందినను, వంశాభివృద్ధి అగు పుత్రులను బడసిననూ, విషము పాలవలె త్రాగ గలిగినను, నిప్పులను పేలాలవలె తినగలిగిననూ, పక్షివలె ఆకాశము నందు ఎగుర గలిగిననూ, స్వర్గమున దేవేంద్ర పదవి లభించినా, ఉర్మి(భూమి) యందు రాజేంద్ర పదవి లభించినా, అరిషడ్వర్గములు జయించినా, మోహము, గర్వము, మాత్సర్యము మొదలగు అసుర గుణములు త్యజించిననూ, బ్రహ్మ, విష్ణు, శివలోకములను పొందిననూ, ఆత్మసాక్షాత్కారము, (స్వస్వరూపము) పొంద కుండిన అన్నియూ వ్యర్థములు. ఆత్మ సాక్షాత్కారము పొందుటయే 🧘‍♂మానవ జన్మ 🧘పరమావధి🧘‍♀.


🕉️🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment