Saturday 22 June 2024

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ

 శ్రీ  శ్రీ  శ్రీ శారదాంబ శతకం.. ఆటవెలదిలో 

మల్లాప్రగడ రామకృష్ణ 


001..దృక్పధమ్ము కలగ ధృడత యాలోచనా 

మంచి చెడున మునగ మహిమ చెంద

మానస మణి కళ సమాజ ధరణి తత్వ 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


002..మాయ లక్షణమ్ము మహిమాన్వితమ్ము గా

ప్రశ్న ఉనికి గలది ప్రతిభ తీరు 

ఆశ పాశ మగు యనంత సామర్ధ్యము 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


003..గొప్ప శక్తి గలిగి కోర్కెతీర్చ గలుగు 

అనుభవించ గలుగు ఆ శ్రి త మగు 

విలువ కట్టలేని విశ్వ వాహిని గాను 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


004..వీర్యవంతముగను విశ్వాస ముంచెది 

బుద్ధి కుశలతగను భుక్తి నిచ్చి 

సిద్ది శ్రద్ధ కలుగు విశ్వేశ్వర తలచ

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


005..బలిసి నోడు బుక్క బక్కవాడు నలుగు

బ్రతుకు బీడు భూమి బలుపు నెరుగ

భావియువత తెలివి బద్ధకము గనుండ

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


006..వారు ద్రోహులనుచు వీరు వారనుటేల 

వీరు దొంగలనుచు వారి మాట

నిర్ణయించలేక నిజము చెప్పను లేక 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


007..ఎవరు యెన్ని యన్న యేమి యనక సాగు

నువ్వు మారకున్న నిన్ను మార్చు

పలుకు తేడ యన్న పాఠ్యమని బతుకు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


008..వివరణ వల యేల విజయ వాంఛలు చాలు

నొచ్చు కొన్న యడల నొప్పి యనకు

మనసు పాడుచేసి మనను యేల యనకు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


009..ద్వేషి నెంచ వలదు దివ్య వెలుగు జూడు

తప్పు కొనకనుండ తపము జేయ

నువ్వు నలిగి పోక సుడులు తిర్గు నిజము 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


010..వ్యాఘ్రతోలు కట్టి వలరాజు వలె జూపు 

సిగను బెట్టె శశిని శీఘ్ర వెలుగు 

వలపు భార్య తలపు వలదన్న కలుగునే 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


011..శివశివయని పిలువ శివమెత్తి యాడగా 

పవలు రాత్రి మరచి పాఠ్య మదియు 

భవహరయని గొలువ భాగ్యంబు బ్రాణతులు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


012..హృదయ లీల యేల హృద్యము నీ దయా 

జగతి యేలుచున్న జాగుయేల

నేలెడి హర ననుగ నిరవుగ కొలిచిదా 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


013..లతలు జుట్టి మ్రొక్క లాస్యమేలను మీరు 

చేరు దరిన యనక చేష్ఠ లేల 

జిరునగవులు తోడ జేకొను యీ శ్వరా 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


014..నరులు మునులు సురులు నయనాల కొలవగా 

సేవలందు కొనుచు సిద్ధిగ నులె 

తనివి తీర తాప తపము చేయ గలగ 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


015..కడుపు నిండ కున్న కాలాన్ని యనుచుండు 

కడుపు నిండె పలుకు కాల గొప్ప 

మనిషి తీరు యదియు మనసు పలుకు మారు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


016..శిశువు తల్లి మాయ శీఘ్ర్oబు తొలగును 

భయము బయట పడ్డ బంధ మేను 

జగతి నందు మాయ జగమెరుగును జీవి 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


017..సాత్వికులయి బోధ తత్త్వకుల్ గనుటయు 

శాశ్వతంబు లేదు శాప బతుకు 

జీవితంబు గడప చింత చెలిమి నీడ 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


018..ఋతువులన్ని జేరి గతులు మార్చను లేవు 

పృథ్వి నందు మార్పు పుస్తి బతుకు 

కలుగ చుండ సహజ కాల మలుపు గాను 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


019..సంపదున్న వేళ సహనకర్కశమగు 

కోమలమ్ము కోర కోపముండు 

ఉష్ణమున్నచోట ఉరిమి యరుపు యుండు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


020..నీటి బుడగ బతుకు నీడలేక వెతుకు 

పాము పడగ నీడ పాశ మాశ 

జీవితమ్ము గనుము జీవయాత్ర జగతి 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


021..చెప్పలేని బాష చేరువలేనిది 

చేతకానితనము చెలిమి నాది 

చల్ల కొచ్చి ముంత దాచేటి బ్రతుకౌను 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


022..చేతులారపూజ సొంపార చుండినా 

రీతి యొప్ప చెప్ప శ్రీ చక్రంబు 

ప్రీతిగా వసించు విలువ నిలుపు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


023..మనము జంకు గల్గి మాంచె మంత్ర మహిమ 

ముని యవజ్ఞ గలిగి ముందరి కథ 

దినెడు వారు కాగ దెంచుకు రాలేరు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


024..కూర్ఛ గలుగు బుద్ధి గుండెలో తడియున్న

కరుణ కాంక్ష నున్న కానుకయగు

నిత్య తపన యున్న నిజమైన మనసగు 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


025..వినయ వంతునిగని విశ్వానికి చెలిమై 

మంచి నెంచి బ్రతుకు మార్పు తేవ 

దృష్టి దోష మనక దురుకు తనమొ దలె 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ 


026..ఆ..సజ్జణులకుబాధ సంపదలకు వేట 

గుణము దోష మొప్ప గోప్య మేది 

పరుష పలుకు నెంచ పాడియావు బలియె 

శాస్త్ర ధర్మ సత్య శారదాంబ

No comments:

Post a Comment