Tuesday 4 June 2024

07-06-2024

 



055🙏🏻*ప్రదోషం *🙏🏻

------------------------------

🙏🏻**ప్రదోష వ్రతం**🙏🏻

******************

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

**************************

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

-------------+++++----------------

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

**************************

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి,  శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి.  ----------------------------------------     *త్రయోదశి మహా ప్రదోషం,*

*************************

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,

సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 

మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 

బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 

గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 

శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 

శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 

**************************

వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే  శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు. 

----------------------------------------

🙏🏻*ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి? *🙏🏻

**************************

ప్రదోషం రోజు ఉదయమే స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించాలి. శరీరంపై విభూతిని, రుద్రాక్షమాలను కూడా ధరించటం మంచిది. ఆ రోజులో వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని  (ఓ నమ:శివాయ) జపం చేయాలి. ప్రదోషం రోజున నిశ్శబ్దంగా ఆరాధించటాన్ని శివుడు ఇష్టపడతాడని చెబుతారు. కఠిన ఉపవాసం చేయలేనివారు పండ్లు, పాలు లాంటివి తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థాలను తీసుకోకూడదు. 

**************************

సాయంకాలం ప్రదోష సమయంలో స్నానమాచరించి శివ షోడశోపచార పూజ జరపాలి. ప్రదోషం రోజు ఆ పరమశివుడికి నేతి దీపారాధన, ఆవుపాలతో అభిషేకం అభిషేకం చేయటం, బిల్వ పత్రాలు మరియు శంఖుపూలతో అర్చించటం శ్రేయస్కరం. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రదోష కథను వినటంగానీ చదవటం గానీ చేయాలి. ఇంటిలో పూజ ముగించిన అనంతరం శివాలయాన్ని దర్శించాలి. వీలైనవారు ప్రదోష స్తోత్రం, శివ స్తోత్రములను కూడా పఠించాలి.

----------------------------------------

స్కంద పురాణంలో ప్రదోష మహత్య కథ కూడా వివరింపబడింది.

------------++++++---------------

*మహా మృత్యుంజయ మంత్రము*

**************************

ఓం త్రయంబకం యజామహే 

సుగంధిం పుష్టి వర్ధనం 

ఊర్వారుకమివ బంధనాత్ 

మృత్యోర్ముక్షీయ మామృతాత్

----------------------------------------        *శని ప్రదోషం *

*************************

దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించినప్పుడు వెలువడిన హాలాహలం నుండి శివుడు ప్రపంచాన్ని రక్షించిన రోజుగా శనిప్రదోషం రోజును చెబుతారు. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమంగా పరిగణిస్తారు.

**************************

శని ప్రదోష వ్రతం ఆచరించటం వలన కర్మ దోషాలు, జాతక దోషాల నుండి విముక్తి పొందవచ్చునని చెబుతారు. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజున ప్రదోష కాలంలో శివారాధన చేయాలి. గత జన్మల పాపాలు కూడా తొలగి సకలసంపదలు చేకూరుతాయి. శని ప్రదోషానికి సంబంధించి ఉజ్జయిని మహాకాళేశ్వరునికి సంబంధించిన కథ ఒకటి చెప్పబడినది. 

-------------+++++++------------       *సోమ ప్రదోషం*

*************************

సోమవారము శివుడికి ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున వచ్చే  సోమ ప్రదోషమును ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఈ రోజున ప్రదోష వ్రతము ఆచరించటం వలన మనసులోని మలినాలన్నీ తొలగిపోతాయి . 

**************************

🙏🏻 గురు ప్రదోషం 🙏🏻

**************************

త్రయోదశీ ప్రదోషము గురువారము వస్తే ఆ రోజును గురు త్రయోదశిగా భావిస్తారు.  గురు ప్రదోష పూజ వలన విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయని చెబుతారు. జాతకములో ఉండే గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా భావిస్తారు. 

 ************************

సేకరణ.. ప్రాంజలి ప్రభ

***-

*056.._జీవిత రహస్యం....._*


*_మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలో దానం చేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు._*


*_చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది. ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు._*


*_మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించి గలుగుతాడు._*


*_మన చేతికి అలంకారం దానం చేయడం అది ఒక గొప్ప సౌశీల్యం దానధర్మాల విశేషంగా చేయాలి తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. మనిషి జీవితం దానధర్మాల తోనే ముడిపడి ఉంది అదే అతడు దాచుకున్న సంపద అదే సద్గతిని కలిగిస్తుంది అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు._*


*_పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు... కామక్రోధ, లోభాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు._*


*_అవి ఆత్మ వినాశనానికి దారులన్నీ వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలి జీవించాలి దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు . ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి._*


*_మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు, ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము . అది తిరిగి రెట్టింపు అయ్యి10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు._*


*_అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా  చేరుతుంది. ఇది అక్షర సత్యం... మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరు పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు. 🙏

******

057..సీ..అమ్మను తలచియు సహనమ్ము నుంచియు 

కనుల కవిత్వను కావ్య మలుపు 

అయ్యను కొలిచియు ఆశయము తెలిపి 

ఆరాధ్యమనసగు ఆశ మెరుపు 

చల్లని గాలిగా చరితము చదివియు 

హృదయము పిలుపగు కృపగ తలపు 

విశ్వనాధుని లీల విశ్వమున్ గాచును 

కమ్మని కథలుగా కాల పిలుపు 


తే..చిద్వి లేసుని కళలవి చేరువగునె 

విఘ్న నాయక నిలయము విజయ మివ్వ

వారణాసినందును గంగ వరము లిచ్చు 

కాల భైరవ వీక్షణ కాల మార్పు


మల్లాప్రగడ రామకృష్ణ


కాశీపురి వర్ణన 🙏



 సీ. కాశీపురమ్మును కాంచిన చాలును

                  తొలగిపోవును కదా ! దురిత రాశి

      విశ్వేశ్వరస్వామి విశ్వమున్ గాచును

                 కనినంత పాపముల్ కరిగిపోవు

      అన్నపూర్ణమ్మయు న్నాహార మిడునిల

                 సకల జనాళికి సాకుచుండి

      గలగలపారెడు గంగానదీమాత

                 పాపాళి నెల్లను పరిహరించు

 తే.  కాలభైరవుడు మనల కనికరించ

       డుంఠి విఘ్నేశు డెప్పుడు నండ గుండ

    కరుణతోవిశాలాక్షియు కాచు మనల

       వరములకు నిలయము గదా వారణాసి 🙏🙏


జయలక్ష్మి


గెలుపు. ఓటమి.. సిలక.. తేటగీతి మాలిక 


గెల్చి నట్టి శక్తిపలుకు తెల్పు గీత 

సంస్కరించవలయు నిత్య సంఘగతిని

ఓడి నట్టి బలిమి కళలు యోర్పుతోనె 

చెడును పట్టవలయు సేవ చింత సిలక 


మాగిన ఫలము దగ్గర మనసు చిలక 

కుళ్ళిన ఫలము వైపు పురుగు మొలక 

మంచి మనుగడ నాయక మానసమ్ము 

చెడును మరచి స్వభావాన్ని చెప్పు సిలక 


ఎంత ఘనత యీ దేశంది యేల చెప్ప 

తెలివినెంత పెంపు చదువు తిష్టవేయు 

కులము కాదు కాలము పోటు కూడికయగు 

నరులు నమ్మి ఓటునువేయ నమ్ము సిలక 


పదిలపరచ జ్ఞానమ్ముయె పలుకు తీరు 

ఎంతచెప్పినా తక్కువే యేల యనకు 

అధిక బలము యున్నను కష్ట మేను సిలక 


కాలమే మురిపించును కామ్య రీతి 

గాయమే మరిపించును కావ్య రీతి 

ధ్యేయమే ఫలమవ్వును ధ్యాన రీతి 

ధర్మమే సత్య భావము ధరణి సిలక 


మంచి పెంచుము దేవరా మనుషులందు 

కొంచె మైనను మార్చుము మంచి వైపు 

మంచి చెడు మనుషులు చూడు మహిని యందు 

రాజనీతి నిలుపు మంచి రాజ్య సిలక 


ధనము దర్పాన్ని చూపకు ధరణి యందు 

మనసులోని ప్రేమ పలుకు మనని పెంచు 

అంద రందురు మా బలం యనియు గొనుగు 

చెప్పిన పలుకు చేయూత చింత సిలక 


మీ 

మల్లాప్రగడ రామకృష్ణ

******

*058..పిల్లలకు….ప్రేమను పంచినట్టే…*  *మీ కష్టాన్ని తెలుపండి, వారికి  కూడా పంచండి, వాళ్ళు జీవితంలో ఎదిగిన తరువాత, మీ పట్ల వారికున్న బాధ్యతను, ప్రేమను తెలుపండి. ఈ కాలం జనరేషన్  మాకేంటి తప్ప, మనకేంటి అనేది లేదు. వారికున్న పరిస్తితులవళ్ళ, ఆ ఏముందిలే చూద్దాం, చేద్దాం,  వాళ్లకు అవి అలవాటే, మా బాధలు  వాళ్లకు ఏమి తెలుసు, ఇలా ఎన్నెన్నో. వాళ్ళ పిల్లల కోసం లక్షలు తగలేస్తారు, తల్లిదండ్రుల కోసం, కొంచెం సర్దుబాటుకు కూడా అలోచించేవాళ్ళు ఎంతో మంది. పిల్లలను ప్రేమించాలి, వారి ఉన్నతికి తోడ్పడాలి, కానీ మీకో ముసలితనం వుందని మర్చిపోకండి. అప్పుడు ఆరోగ్యం, ఆహారం, కొన్ని సంతోషాలు వుంటాయని గుర్తుంచుకోండి. దానికోసం వయస్సులో వున్నప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకూడదు. ప్రపంచాన్ని చూడండి, కాస్త తెలివిగా మసులుకోండి, లూఇకపోతే తీరిగ్గా బాధ పడాల్సి వస్తుంది. సర్వేజనా (ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్) సుఖీనో భవంతు. ఇక చదవండి* 😔😔     

*🔹నిజజీవితం అంటే… రెండున్నరగంటల  సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి!*

*ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది….                           "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను.    మా అమ్మాయిని ఎటువంటి  కష్టం    తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి  అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.*

*జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది.    బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు.                                   ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.*

*ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని.   నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను." అనిచెప్పింది.*

*ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.*

*జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ    ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని.*
*ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే  ఆలోచించి అలా చెప్పారు.*

*ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ,  ఎటువంటి మేజిక్కూ జరగలేదు.*

*అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.*

*"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.*

*అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.*

*ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.*

*జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.*

*కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.*

*సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.*
*తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.*

*మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.*

*ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి తమదారిన తాము వెళ్ళిపోతారు.*
         
*ఇదీ నేటి జనరేషన్ 💗హృదయం*

ప్రాంజలి ప్రభ కథలు
******
*059..నమ్మకానికి మరో రూపమే దేవుడు*
🙏
             
ఒకప్పుడు ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడింది, 
అలా నిర్వహిస్తున్నప్పుడు, ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితులు,

అదే ప్రాంతంలో ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది! ఈ కర్ఫ్యూ వల్ల ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మోకాళ్ళ మీద మొకరిల్లి ప్రార్థన చేస్తోంది…
           
ప్రార్థనలో భాగంగా ఆవిడ దేవునితో…" భగవంతుడా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు పక్షితో ఆహారాన్ని సమకూర్చావని విన్నాను, అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.

ఆ మాట విన్న తన మనవడు భగవంతుడు పంపే పక్షి తనకు ఆహారాన్ని తెస్తుందని నమ్మి , పక్షి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి ఉండాలని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.

అయితే… ఆ కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి      తొంగి చూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..

ఆ పోలీసు  "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు.

ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు పక్షితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.

అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా? " అని అడిగి  "మీ బామ్మ చెప్పిన పక్షిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.

ఆ పోలీసు ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.

ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ పోలీసు ద్వారా ఆకలి తీర్చాడు.

ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు!

ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!

’నమ్మకం’ ఆచిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!

నమ్మకానికి మరో రూపమే..  ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు ‘సహాయం’ చేయడం ..!

పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకం లో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి!     
          అవి చూడాలంటే… కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు!
****

060..*దైవీ సంపదలు*

*ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి ఈ క్రింద చెప్పబడిన దైవీ సంబంధమైన 26 గుణాలు ఉంటాయి.* *శ్రీ మాత్రేనమః*

*1) భయం లేకపోవడం.*

*2) సత్వగుణం కలిగి వుండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.*

*3) జ్ఞానాన్ని సంపాదించడం.*

*4) విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలైన దానాలు శక్తి కొద్దీ చేయడం.*

*5) ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం.*

*6) జ్ఞాన యజ్ఞం చేయడం.*

*7) పురాణాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం.*

*8) ప్రతి పనీ ఒక తపస్సులాగా చేయడం.*

*9) మంచి ప్రవర్తన కలిగి వుండటం.*

*10) అహింస వ్రతాన్ని పాటించడం.*

*11) సత్యం పలకడం.*

*12) కోపం విడిచిపెట్టడం.*

*13) దుర్గుణాలను త్యాగం చేయడం.*

*14) ప్రశాంతంగా ఉండటం.*

*15) ఇతరులను విమర్శించకుండా ఉండటం.*

*16) భూత దయ కలిగి ఉండటం.*

*17) ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండటం.*

*18) మృదువుగా మాట్లాడటం.*

*19) చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.*

*20) చిత్త చాంచల్యం వదిలిపెట్టడం.*

*21) ముఖంలో, మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.*

*22) ఓర్పు కలిగి ఉండటం.*

*23) అన్నివేళలా ధైర్యంగా ఉండటం.*

*24) శరీరంతో పాటు మనస్సును కూడా శుచిగా ఉంచుకోవడం.*

*25) ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.*

*26) స్వాభిమానం వదిలి పెట్టడం.*

*ఈ గుణాలను దైవీసంపదగా పెద్దలు పరిగణించారు.*

ప్రాంజలి ప్రభ కథలు
*****
       
*061.._"సహనంతో చాలా వివాదాలు, ప్రమాదాలు తగ్గుతాయి. సమర్దులకే సహనం ఉంటుంది. మంచికోసం తగ్గేవాడు ఎప్పుడు నా దృష్టిలో గొప్పోడే. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ముమ్మాటికీ సమర్థుడే ."_*

*_సహనం ఉండాలి కానీ, అ సహనం అన్నివేళలా  పనికిరాదు. దేనికైనా ఒక హద్దు, అదుపు ఉండాలి. ఎక్కడ ప్రదర్శించాలి. ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది తెలిసి ఉండాలి..._*

*_ఎవరికైనా సరే ఒకసారి చెప్పండి లేదా, రెండుసార్లు చెప్పండి. ఇకపోతే పదిసార్లు కూడా చెప్పండి. అయినా వినకపోతే వారి కర్మకే వదిలేయండి. ఎందుకంటే, ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు._*

*_"మేఘం బరువు మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు బయటకు వస్తుంది." పర్వాలేదు కన్నీరు ఆపకండి. ఎందుకంటే, గుండె బరువు తగ్గుతుంది._*

*_అంతమాత్రాన కన్నీరు కారుస్తూ కూర్చోకండి. అ కన్నీటికి కారణమైనదాన్ని కాసేపు వదిలేయండి. ప్రశాంతంగా మారండి. తప్పకుండా అన్ని సర్దుకుంటాయి._*

*_బాధలో నిర్ణయాలు, ఆవేశంలో వాగ్దానాలు, నిన్ను మరింత బాధకు గురిచేస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. నీ జీవిత గమనాన్ని మార్చేస్తాయి._*

*_"నీ మేలు" కోరేవారు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, నిరంతరం నిన్ను పొగుడుతుంటే నీ కీడు కోరుతున్నట్టే. భజన చేసేవారు కాదు ప్రశ్నించే వారే నీ శ్రేయోభిలాషులు.☝️_*

         *_మీ శ్రేయోభిలాషి..
ప్రాంజలి ప్రభ..
        *****
062..★ *టీడీపీ కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు* ★
------------------------------------

1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం


2. *వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు*


3. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు.


4. *18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు, నెలకి రూ.1500*


5.ఆర్టీసీ బస్సులో ప్రతి
     మహిళలకు ఉచిత ప్రయాణం

6. *యువతకు 20 లక్షల ఉద్యోగాలు*


7. నిరుద్యోగులకు నెలకి రూ.3000 నిరుద్యోగ భృతి


8. *తల్లికి వందనం కింద,  ఎంత మంది బిడ్డలు ఉన్నా, ఏడాదికి ఒకో బిడ్డకు రూ.15,000*


9. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా


10. "ప్రతి రైతుకు ఏడాదికి


   రూ 20000 వేల పెట్టుబడి"

11. *వాలంటర్లకు  గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు*


12. ఉచిత ఇసుక


13. *పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు*


14. భూహక్కు చట్టం రద్దు


15. *ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనక్షన్ ఇచ్చి, స్వచమైన నీరు*


16. బీసీ రక్షణ చట్టం


17. *పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేద వాడిని సంపన్నులని చేయడం*


18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్


19. *కరెంటు చార్జీలు పెరగవు*


20.బీసీలకు 50 ఏళ్ళకే  
పెన్షన్ వస్తుంది

21. *ప్రతి పేద వాడికి, రెండు సెంట్ల ఇళ్ళ స్థలం*


22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం


23. *పెళ్లి కానుక కింద రూ.లక్ష*


24.విదేశీ విద్య మళ్ళీ వస్తుంది

25. *పండుగ కానుకలు వస్తాయి*


ఎటువంటి కండిషన్స్  లేకుండా...
******

063..ఓటు ఆయుధపు పదునెంతో
ఓర్పు మలుపుకు సుఖమంతే

విసిగిన ప్రజల గుండె మంటెంతో
కల్ముషాన్ని తుడిచే మనసంతే

నిరంకుశత్వం మితిమీరిన నాశనానికను నీతెంతో
అర్ధ పోరాటంలో అవకాశం కొంతే

అధికారమదం తలకెక్కిన
అథ:పాతాళానికేనని తెలుసుకో
తనచెప్పుతో తనే కొట్టుకొనే కాల గమన మంతే

అహంభావం కడకు పతనానికేనని తెలుసుకో
పుంజులతో కత్తుల ఆట కొంత సంతోష మంతే

ఎదురులేదని విర్రవీగితే
వినాశమేనని తెలుసుకో
తేనతుట్టే సక్రమముగా తీయకపోతే  తేనె టీగలతో యంతే

పచ్చని చెట్లు పగబట్టిన పోకాలమేనని తెలుసుకో
చెప్పినవి చేయకపోతే గతాన్ని గుర్తుగా యంతే

గ్రహణం వీడిన 'చంద్రుడు'
తిరిగి వెలుగునని తెలుసుకో
కష్టానికి ప్రతిఫలము పొంది జనం తిరస్కరించే స్థితి యైతే యంతే

తెలుగు దేశంలో తెలుగు భాషకు గౌరవం
పరిశ్రమలకు అవకాశమే గౌరవం
ఉద్యోగాలు కల్పిస్తే దేశానికే గౌరవం
జలాలు సక్రమంగా ఉపయోగం గౌరవం
ఎన్నో మరెన్నో ప్రభుత్వానికి గౌరవం
ప్రజలతీర్పని తెలుసుకో
తెలుసుకో తెలుసుకో
***


No comments:

Post a Comment