Monday, 3 June 2024

ప్రాంజలి ప్రభ కథలు 5/6/9

 



*037..🌹 సిద్దేశ్వరయానం - 71 🌹*


*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*


*🏵 నిస్తికథ 🏵*


*స్వామివారు కొండలో గుహలలో సంచారం చేస్తూ ఒక గ్రామానికి చేరారు. గ్రామస్థులు వారికి వారి పరివారానికి ఒక యింట్లో వసతి యేర్పాటు చేసి బియ్యం, ఉప్పు, పప్పు కూరలు మొదలైనవి తెచ్చి పెట్టారు. శిష్యులు వండిన పదార్థాలను స్వామివారు భోజనం చేసిన తర్వాత ఆ రోజు సాయంకాలం చాలామంది దర్శనానికి వచ్చారు. శిష్యుల ద్వారా స్వామివారు మహిమాన్వితుడైన యోగి అని తెలుసుకొని తమ తమ సమస్యలను విన్నవించుకొంటుంటే వాటి పరిష్కారానికి కావలసిన మంత్రము లుపదేశించి వానిని చేయవలసిన విధానాలు చెప్పి పంపిస్తున్నారు.*


*ఇలా జనం వస్తున్నారు. పోతున్నారు. కాసేపటికి ఇద్దరు దంపతులు తమ కూతురును తీసుకొచ్చి చూపించి "అయ్యవారూ! ఈ బిడ్డ ఒంటి నిండా కురువులు లేచినవి. చీము కారుతున్నది. దురదతో చాలా బాధపడుతున్నది. ఎన్నిమందులు వాడినా తగ్గటం లేదు. ఊళ్ళో సుగాలి అని మంత్రవేత్త ఉన్నాడు. నెలరోజుల నుండి మంత్రం వేస్తున్నాడు. మందులిస్తున్నాడు. కానీ తగ్గలేదు. మీరు గొప్ప యోగీశ్వరులని ఊళ్ళో అందరు చెప్పుకొంటుంటే విని తీసుకొచ్చాము. దయతో మా అమ్మాయిని బాగు చేయండి" అని ప్రార్థించారు. స్వామివారు "చర్మవ్యాధులు పోవటానికి నాగ మంత్రం పనిచేస్తుంది. మీరు చెయ్యగలిగితే ఉపదేశిస్తాను" అన్నారు.*


*వారు "అయ్యా! మేము ఎంత చెయ్యగలుగుతాము? మా వల్ల ఏమవుతుంది? ఇంటి పనులు పొలం పనులతో ఏదో కొద్దిగా చేస్తాము. అది సరిపోతుందా? అని విచారం వ్యక్తం చేశారు. స్వామివారు “నేనిక్కడ రెండు మూడు రోజులుంటాను. మీరు భక్తితో చేతనయినంత చేయండి. ఒక పాము పుట్ట దగ్గరకు వెళ్ళి కాస్త పసుపు, కుంకుమ చల్లి కాసిని పాలు పోసి ఆ పుట్ట మట్టి కొంచెం తెచ్చుకొని అది కాస్త తడిచేసి బొట్టు పెట్టుకొని జపం చేయండి.! నాగరాజు అనుగ్రహం వల్ల తగ్గుతుంది. అమ్మాయికి బాగవుతుంది” అని వారిని పంపివేశారు. స్వామివారు చెప్పినట్లు మూడవరోజు కల్లా ఆ అమ్మాయికి కురుపులు మాడిపోయినవి. దురదలు తగ్గినవి. అందరికి ఆశ్చర్యం కలిగింది. ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి కృతజ్ఞతతో పాద నమస్కారములు చేశారు.*


*ఈ వార్త విని ఆ ఊరి మాంత్రికుడు వచ్చాడు. తాను చేయలేని దానిని ఇంకెవడో వచ్చి చేయటం అతడు భరించలేక పోయాడు. “ఏమయ్యా! నీవేదో పెద్ద చేశానని విర్రవీగకు. ఈ అమ్మాయి అసలు పుట్టింది నా దయ వల్ల. ఈ దంపతులకు పిల్లలు పుట్టక బాధపడి నన్ను ఆశ్రయిస్తే ఒక ప్రత్యేక దేవతను ఆవాహన చేసి ఆ విగ్రహంకు పూజ  చేశాను. అది ఒక ఉచ్ఛిష్ట విద్య. దాని ప్రభావం వల్ల ఈ బాలిక పుట్టింది. నిష్ఠీవన ప్రభావం వల్ల పుట్టింది కనుక నిస్తి అని పేరు పెట్టాను. ఇప్పుడు ఆ అమ్మాయికి చర్మవ్యాధి తగ్గించానని పొంగిపోతున్నావేమో! అది ఎక్కడకు పోయింది? నీ మీదకు వచ్చింది. చూచుకో" అన్నాడు. స్వామివారి శరీర మంతా దద్దురులు - కురుపులు వచ్చినవి. వారేమీ మాట్లాడ లేదు. ప్రశాంతంగా కండ్లు మూసుకొని నాగస్తుతి చేయటం మొదలు పెట్టారు.*


*ఆ స్తోత్రం పూర్తి అయ్యేసరికి స్వామివారి చర్మం మీది కురుపులు మాయమైనవి. జనం ఆశ్చర్యంతో చూస్తున్నారు. స్వామివారు ఇలా అన్నారు. “సుగాలీ! క్షుద్రవిద్యలు కొన్ని నేర్చుకొని వాటిని ఇలా ప్రయోగిస్తున్నావు. ఎప్పుడూ ఇది సాగదు. నీవు చేసిన ప్రయోగాన్ని నేను తిప్పికొట్టగలను. ఒంటి మీదకు భయంకరమైన కురుపులు వచ్చి శరీరమంతా కుళ్ళిపోయి మరణిస్తావు. కాని నా ప్రవృత్తి అది కాదు. అయితే నీకు శిక్ష తప్పదు. ఇక ముందు నీవు చేసిన మంత్ర విద్యలేవీ పనిచేయవు. ఎవరిమీద ప్రయోగాలు చేయాలని తలపెట్టవద్దు. అవి ఫలించవు. భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ సాధన చేసుకో”*


*ఆ క్షుద్ర మాంత్రికుడు తలవంచుకొని కాళ్ళమీద పడ్డాడు. ప్రజల నమస్కారాల మధ్య స్వామివారు ఆ ఊరి నించి బయలుదేరారు.*

*( సశేషం )*

🌹🌹🌹🌹🌹


038..ప్రాంజలి ప్రభ కథలు... 02-06-
మల్లాప్రగడ రామకృష్ణ

చివర విడత ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మొన్న సాయంత్రం అంటే 30వ తేదీ నాడు
ప్రధాని మోదీ కన్యాకుమారి లో గల వివేకానంద రాక్ మెమోరియల్ లో గల 'ధ్యాన మండపం'లో 45 గంటల ధ్యాన దీక్ష చేపట్టారు. స్వామి వివేకానంద ఇదే రాక్ పై కూర్చుని 3రోజులు ధ్యానం చేసి జ్ఞాన సిద్ధి పొందారు అని ఆయనకు సంబంధించిన రచనల్లో ఉంది.

అసలు ఈ రాక్ మెమోరియల్ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

ఇది ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలో మూడు సముద్రాలు అంటే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం కలిసే చోటు అయిన కన్యాకుమారిలో ప్రధాన భూభాగంకి  500 మీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న రెండు పెద్ద రాళ్లలో ఒకదానిపై స్వామి వివేకానంద జ్ఞాపకార్ధం ఏర్పాటు చేయబడ్డ ఒక స్మారక చిహ్నం.

పురాణాల ప్రకారం, ఈ రాతిపైనే కన్యాకుమారి దేవి అంటే పార్వతి శివుని కోసం భక్తితో తపస్సు చేసింది అని చెప్పబడింది. అందుకే ఈ ప్రాంతానికి 'కన్యాకుమారి'అనే పేరు వచ్చింది అనేది స్థానిక కధనం.

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 1962లో ఈ స్మారక చిహ్నం ఇక్కడ ఏర్పాటు చేయాలి అని భావించి మద్రాస్ రామకృష్ణ మిషన్ సహకారం తో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ స్థానికంగా ఎక్కువ జనాభా గల రోమన్ కేథలిక్కులు ఈ ప్రతిపాదన పై వ్యతిరేకంగా ఆందోళన చేసి ఆ కొండపై ఒక అతి పెద్ద సిలువ ఏర్పాటు చేశారు. ఇది హిందువుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది.

హిందువులు దీనిని వివేకానంద శిల అని, క్రైస్తవులు సెయింట్ జేవియర్ రాక్ అని పేర్కొనడంతో మద్రాసు ప్రభుత్వం ఆదేశించిన న్యాయ విచారణ ఆ శిల వివేకానంద శిలగా గుర్తింపు పొందింది అని, అక్కడ శిలువ పెట్టడం అతిక్రమణ అని నిర్ద్వంద్వంగా పేర్కొంది. దాంతో ఒక రాత్రి రహస్యంగా ఆ శిలువను తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆ కొండ ప్రాంతాన్ని ప్రభుత్వం నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించి, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది.

చివరకు, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం , ఆ శిల స్వామి వివేకానందతో ముడిపడి ఉందని తెలిపే టాబ్లెట్‌ను మాత్రమే అక్కడ ఏర్పాటు చేయాలి అని ఇంకేమి ఏర్పాటు చేయకూడదు అని చెప్పడంతో,  ప్రభుత్వ అనుమతితో, 17 జనవరి 1963న రాక్‌పై ఒక టాబ్లెట్‌ను అంటే శిలా ఫలకాన్ని అమర్చారు.

1914లో పుట్టి 1982లో మరణించిన ఏక్ నాధ్ రామకృష్ణ రనాడే మహారాష్ట్ర కు చెందిన RSS కార్యకర్త. వివేకానంద రచనలతో బాగా స్ఫూర్తి పొందారు. ఈయనను వివేకానంద రాక్ మెమోరియల్ స్థాపన కోసం ఆ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. దీంతో
రనాడే స్మారక నిర్మాణం మద్దతు కోసం పలువురు పెద్ద వారిని కలవడం ప్రారంభించారు.

అయితే, ఇటువంటి స్మారక నిర్మాణం ఆ ప్రాంత సహజ సౌందర్యానికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పి అప్పటి కేంద్ర సాంస్కృతిక మంత్రి 'హుమయూన్ కబీర్' స్మారక నిర్మాణానికి అడ్డు చెప్పారు. అయితే ఈ కబీర్ బెంగాల్ కి చెందిన వాడు. దాంతో రనాడే బెంగాల్ వెళ్లి బెంగాల్ గొప్ప పుత్రులలో ఒకరైన వివేకానంద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడాన్ని మీ బెంగాల్ కి చెందిన మంత్రి అడ్డు చెపుతున్నారు అని ప్రచారం చేయడం తో, రాజకీయంగా తనకు నష్టం కలుగుతుంది అని భావించి కబీర్ తన మాట మార్చాడు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం అప్పటికీ అడ్డుగా వున్నాడు.

అందుకని కేంద్రం వైపు నుండి వత్తిడి పెంచే ఉద్దేశ్యం తో రనాడే లాల్ బహదూర్ శాస్త్రి గారి సూచన మేరకు ఢిల్లీ వెళ్లి పార్లమెంటు సభ్యుల మద్దతు కూడకట్టడం ప్రారంభించి, 323 ఎంపీల సంతకాల తో ప్రధానికి వినతి పత్రం ఇచ్చాడు.

ఈ సంగతి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగి 15x15 సైజు కట్టడానికి మాత్రమే అనుమతి ఇచ్చాడు. అయితే, ఈ ముఖ్యమంత్రి గారికి కంచి మఠం అంటే విపరీతమైన గౌరవం ఉండటం తో రనాడే కంచి మఠం పరమాచార్య గారి చేత పెద్ద కట్టడ నమూనా అనుమతింప చేయడంతో మరి ముఖ్యమంత్రి భక్త వత్సలానికి మరో దారి లేక ఈ పెద్ద కట్టడ నమూనాను (130x56 అడుగులు) అంగీకరించారు.

అన్ని అవరోధాలు తొలగిన తరువాత ఈ నిర్మాణ పూర్తి బాధ్యతను రనాడే తీసుకుని అన్ని సాంకేతిక పరీక్షలు నిర్వహింపచేసి, కావలసిన నిర్మాణ సామగ్రిని, నీటిని, విద్యుత్ ని ఏర్పాటు చేయించడం వంటి పనులు చేపట్టాడు.

అయితే నిధుల కొరత తీవ్రంగా ఉండటం తో ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో సహా దేశ ప్రజల దగ్గర నుండి విరాళాలు సేకరించి, నిర్మాణం పూర్తి చేసి సెప్టెంబర్ 2, 1970లో జాతికి అంకితం చేశారు. ఈ మెమోరియల్ పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు వాస్తు శిల్పం కలబోసినదిగా నిర్మించారు. దీనిలో వివేకానంద మండపం (దీనిలోనే ధ్యాన మందిరం, సమావేశ మండపం ఉన్నాయి) మరియు శ్రీపాద మండపం అని నిర్మించారు. ఇది కాక కన్యాకుమారి అమ్మవారి పాద ముద్ర ఉన్న ప్రాంతం లో పాద పరై మండపం కూడా ఉంది.

ఏక్ నాధ్ రనాడే పూనుకుని అంత శ్రమ తీసుకోకపోయి ఉంటే ఈ నిర్మాణం ఏర్పడి ఉండేది కాదేమో?

నాటి RSS కార్యకర్త  నేటి దేశ ప్రధాని అయిన మోదీ 1970లో సాటి RSS కార్యకర్త ఎక్ నాధ్ రనాడే ని కలసినప్పుడు తీసిన ఫోటో. ఫోటోలో మోదీ పక్కన కళ్ళద్దాలతో ఉన్నవారే రనాడే.

....చాడా శాస్త్రి..
****
039..ప్రాంజలి ప్రభ..
. 02-06

ఎంత చిత్రమో!
మరెంత విచిత్రమో!

ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు,
పోయాక ఎక్కెక్కి ఏడుస్తారు.

పక్కనే ఉన్నా పట్టించుకోరు,
పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు.

బ్రతికున్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు,
సచ్చాక కాకుల కోసం వెతుకుతారు.

ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు,
లేనప్పుడు ఎంతో మంచి మనిషి అని బిరుదిస్తారు.

ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు,
ఊపిరి పోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు.

ఏదైనా ఉన్నప్పుడు
విలువ తెలుసుకోరు,
పోయాక తెలుసుకున్నా
తిరిగి రారు.

ఏమి మనుషులో?
ఏమి జీవితాలో?👏

ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ
నాశనం అవ్వమని,
పాడవ్వమని కాని తిట్టకండి.
బుద్ది బాగుపడాలి
బావుండాలి అని కోరుకోండి.
ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.
అంతే కాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.
ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.
ఏది మనం ఇస్తామో
దానికి పదింతలు లభిస్తుంది.
చెట్టుకి నీరు పోస్తేనే కదా
వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.
సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు
అలాగే ఇది కూడా ..
కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వ కుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.

అందుకే కదా భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు.
అది వినని రావణుడు మృతుడయ్యాడు.
యుధిష్ఠిరుడు కూడా మహామహాపాపాత్ములని క్షమించాడు.
చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు.
చివరికి చచ్చాడు.

మేలు కోరుకోవడం మనవంతు. వినకపోతే ఆఫలితం అనుభవించడం వాళ్ళ వంతు. మంచి చెప్పి మహాత్ములు అవ్వండి.
****
040..ప్రాంజలి ప్రభ... 02-06-

పూర్తిగా తెగిపోనున్న 68 ఏళ్ల బంధం...

👉 *10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా* ఉన్న హైదరాబాద్...
ఆంధ్రప్రదేశ్ కైతే యిక లేదు నోరెత్తలేని స్థితి?

👉ఇప్పటితో, *1956 లో ఏర్పడ్డ బంధానికి పూర్తిగా వీడ్కోలు*...

👉1591 నుంచి నిజాం పాలనలో హైదరాబాద్ రాజధాని...

👉భాగ్యనగరం లో అనేక అద్భుత చారిత్రక కట్టడాల తో గోల్కొండ ఖిల్లా రాజ్యం గా  కొనసాగింది...

👉జంట నగరాలు, మూసీ నది  పరవళ్ళతో 1769 నుంచి 1948 వరకూ  కొన్నాళ్ళు మొఘలులు ఎక్కువ కాలం నిజాం పాలనలోనే హైదరాబాద్...

👉1948 లో హైదరాబాద్ సంస్థనాన్ని భారత్ లో కలపడం...

👉 *పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం మద్రాస్ స్టేట్ నుంచి విడివడ్డ ఆంధ్ర* కి కర్నూల్ రాజధాని గా జరిగిన నిర్ణయం...

👉 *భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ ను రాజధానిగా* అంగీకారం...

👉58 ఏళ్ల తర్వాత  10 ఏళ్ల హక్కుని మాత్రమే సాధించుకున్న AP...

👉 *10 ఏళ్లుగా* తనని తాను నిర్మించుకోలేక *రాజకీయ గాయాలతో నలుగుతున్న ఆంధ్ర*...

👉 *అభివృద్ధి* సంగతి దేవుడు
ఎరుగు... *కనీసం అడ్రస్ లేని రాజధాని*...

👉రాష్ట్రం పట్ల ప్రేమ, నిబద్దత, నా రాష్ట్రం, *నా ప్రజల అభివృద్ధి అన్నది మరచిన నాయకులు*...

👉 *కేంద్ర సంస్థల కొరత, కొత్త కంపెనీల ఆశలు, ఇవన్నీ అందని ద్రాక్షలు* గా ఎందుకు మారాయి...

👉 *ప్రజాచైతన్యం* కొరవడిందా, *ప్రశ్నించే తత్వం* సన్నగిల్లిందా...
సరైన *నాయకుల ఎంపిక లోపమయ్యిందా*...?

👉ఎన్నికల కోడ్ అడ్డమో... రాజకీయమే అడ్డమో... తెగిపోయే ఈ బంధం పై నోరువిప్పని నాయకులు...

👉 *10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాలతో తెలంగాణాలో సంబురాలు*...

👉 *10 ఏళ్ల తర్వాత కూడా అడుగు ముందుకు పడని రాష్ట్రం గా ఆంధ్ర*...

👉 *ఆంధ్ర ప్రజల తెలివి... తెలంగాణ ప్రజల తెలివి* ముందు చిన్నబోయిందా...?

👉విడిపోయి కలిసుందామన్న *తెలంగాణ గొప్ప భావం* నిలబడింది...

👉విడిపోయి నిలబడగలం అన్న *AP ధైర్యం* చిన్నబోయింది..

*తెలుగు ప్రజలు* ఏమి కోరుకుంటారు...? తెలుగు ప్రజలు ఏమి నిర్ణయిస్తారు...✍️
****-
041..ప్రాంజలి ప్రభ.. కధలు... 03-06-

శివలింగాలు రేడియోధార్మికత!  భారతదేశం యొక్క రేడియో ధార్మికత పటాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది. శివలింగం కూడా ఒక రకమైన అణు రియాక్టర్లు గా చూడొచ్చు.  బిల్దేవా,  అక్మద్,  ధాతురా,  గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.శివలింగం పై అమర్చిన నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది.బాబా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది.  శివలింగం మీద పొసే నీరు నది ప్రవహించే నీటితో కలిస్తే ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.అప్పుడు మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే ప్రళయం వస్తుందని మనకు చెప్పేవారు.  మహాకల్ ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య సంబంధం (దూరం) చూడండి -  ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఓంకరేశ్వర్ - 111 కి.మీ.  ఉజ్జయిని నుండి  భీమాశంకర్ - 666 కి.మీ.  ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి  కేదార్‌నాథ్ - 888 కి.మీ.  ఉజ్జయిని నుండి  త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.  ఉజ్జయిని నుండి బైద్యనాధ్  - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి రామేశ్వరం - 1999 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఘృష్ణేశ్వర్ - 555 కి.మీ.  హిందూ ధర్మం లో, కారణం లేకుండా ఏమీ జరగదు.  వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా  పరిగణించబడుతుంది.   అందువల్ల,  సూర్యుడిని లెక్కించడానికి మరియు జ్యోతిష్యాన్ని సుమారు 2050 సంవత్సరాల క్రితం లెక్కించడానికి ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు కూడా తయారు చేయబడ్డాయి.   సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ  ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.  నేటికీ శాస్త్రవేత్తలు ఉజ్జయినికి సూర్యుడు మరియు అంతరిక్షం గురించి సమాచారం కోసం మాత్రమే వస్తారు అని తెలిసింది.                    సేకరణ
****


042..ప్రాంజలి ప్రభ.. కధలు... 03-06-


శివలింగాలు రేడియోధార్మికత!  భారతదేశం యొక్క రేడియో ధార్మికత పటాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది. శివలింగం కూడా ఒక రకమైన అణు రియాక్టర్లు గా చూడొచ్చు.  బిల్దేవా,  అక్మద్,  ధాతురా,  గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.శివలింగం పై అమర్చిన నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది.బాబా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది.  శివలింగం మీద పొసే నీరు నది ప్రవహించే నీటితో కలిస్తే ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.అప్పుడు మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే ప్రళయం వస్తుందని మనకు చెప్పేవారు.  మహాకల్ ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య సంబంధం (దూరం) చూడండి -  ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఓంకరేశ్వర్ - 111 కి.మీ.  ఉజ్జయిని నుండి  భీమాశంకర్ - 666 కి.మీ.  ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి  కేదార్‌నాథ్ - 888 కి.మీ.  ఉజ్జయిని నుండి  త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.  ఉజ్జయిని నుండి బైద్యనాధ్  - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి రామేశ్వరం - 1999 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఘృష్ణేశ్వర్ - 555 కి.మీ.  హిందూ ధర్మం లో, కారణం లేకుండా ఏమీ జరగదు.  వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా  పరిగణించబడుతుంది.   అందువల్ల,  సూర్యుడిని లెక్కించడానికి మరియు జ్యోతిష్యాన్ని సుమారు 2050 సంవత్సరాల క్రితం లెక్కించడానికి ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు కూడా తయారు చేయబడ్డాయి.   సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ  ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.  నేటికీ శాస్త్రవేత్తలు ఉజ్జయినికి సూర్యుడు మరియు అంతరిక్షం గురించి సమాచారం కోసం మాత్రమే వస్తారు అని తెలిసింది.                    సేకరణ

****

[ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

సేకరణ.. మల్లాప్రగడ 


హనుమంతుని పుట్టినరోజు?


043..

*US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా యేల?


US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (చిత్రం) వ్యాపార రికార్డులను తప్పుడు 34 గణనల్లో దోషిగా నిర్ధారించారు.


*ఇండీ కార్ రేస్ లో ఎవరు గెలిచారు?


ఇండీ కార్ రేసింగ్‌లో, జోసెఫ్ న్యూగార్డెన్ ఇండియానాపోలిస్ 500ను గెలుచుకున్నాడు.


*ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది ఎవరు?


క్రికెట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది.


*లిథువేనియా అధ్యక్షుడిగా ఎవరు?


లిథువేనియా అధ్యక్షుడిగా గిటానాస్ నౌసెడా తిరిగి ఎన్నికయ్యారు.


*పాపువా న్యూ గినియాలో ఏం జరిగింది?


పాపువా న్యూ గినియాలోని ఎంగా ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు తప్పిపోయి చనిపోయారని భావించారు.


*ఇటీవల, ఉగ్రవాద నిరోధకంపై భారత్-జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? [A] న్యూఢిల్లీ[B] హైదరాబాద్[C] చెన్నై[D] బెంగళూరు షో 


సరైన సమాధానం: A [న్యూఢిల్లీ]


*రాకెట్..అగ్నబాన్ ప్రయోగం ఎక్కడ ఎప్పుడు ఎవరు?


IIT మద్రాస్‌లో ప్రారంభించబడిన అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ, మే 30, 2024న పూర్తిగా 3D-ప్రింటెడ్ ఇంజన్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ "అగ్నిబాన్ - SorTeD"ని సురక్షితంగా ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలో ఈ కీలక ఘట్టం చోటుచేసుకుంది.


*కాన్సర్ కు మందు?


క్యాన్సర్ వ్యాక్సిన్‌లు ఒక రకమైన ఇమ్యునోథెరపీ. క్యాన్సర్‌ను నివారించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను కనుగొని చంపడంలో సహాయపడటం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. DNA సీక్వెన్సింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం..


*పేరు మార్పు?


OSIRIS-APEX ప్రాజెక్ట్ OSIRIS-RExగా ప్రారంభమైనప్పటి నుండి మార్చబడింది, ఇది బెన్నూ ఉల్క నుండి నమూనాలను విజయవంతంగా తీసుకుంది. అంతరిక్ష నౌక ఇప్పుడు సుదీర్ఘమైన మిషన్‌లో ఉంది, ఇందులో అపోఫిస్ అనే గ్రహశకలాన్ని సందర్శించడం కూడా ఉంది.

***

ప్రాంజలి ప్రభ.. కథలు 

.044..మల్లాప్రగడ రామకృష్ణ... 1--6--


*హై అలర్ట్ జారీ చేయబడింది*


 *మే 31 నుండి జూన్ 4 వరకు, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ (ఓపెన్ స్కై కింద) బయటకు వెళ్లకూడదు, ఎందుకంటే ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్‌కు వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది, దీని కారణంగా ఏదైనా ఉంటే ఒక వ్యక్తికి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి, తద్వారా వెంటిలేషన్ లేకుండా, మొబైల్ వాడకాన్ని తగ్గించండి, మొబైల్ పేలిపోయే అవకాశం ఉంది, దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు ప్రజలకు తెలియజేయండి. పెరుగు, పాలవిరుగుడు, చెక్క యాపిల్ జ్యూస్ మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించండి.*


 *చాలా ముఖ్యమైన సమాచారం* 

 *డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్* 

 *ఈ క్రింది వాటి గురించి పౌరులు మరియు నివాసితులను హెచ్చరిస్తుంది*

         *రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 నుండి 55 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరగడం మరియు క్యుములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం ఉన్నందున, ఇక్కడ కొన్ని హెచ్చరికలు మరియు జాగ్రత్తలు ఉన్నాయి.*

  *కార్ల నుండి వీటిని తొలగించాలి*

 1.గ్యాస్ కంటెంట్ 

 2 లైటర్లు 

 3. కార్బోనేటేడ్ పానీయాలు 

 4. సాధారణంగా పెర్ఫ్యూమ్ మరియు ఉపకరణం బ్యాటరీలు

 5. కారు కిటికీలు కొద్దిగా తెరిచి ఉండాలి (వెంటిలేషన్) 6. కారులోని ఇంధన ట్యాంకును పూర్తిగా నింపవద్దు. 

 7. సాయంత్రం ఇంధనంతో కారుని పూరించండి 

 8.ఉదయం కారులో ప్రయాణించడం మానుకోండి 

 9. ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు కారు టైర్లను ఓవర్‌ఫిల్ చేయవద్దు.

         *తేళ్లు మరియు పాముల నుండి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి వాటి రంధ్రాల నుండి బయటకు వస్తాయి మరియు చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ పార్కులు మరియు ఇళ్లలోకి ప్రవేశించవచ్చు.*

  *నీరు మరియు ద్రవాలను పుష్కలంగా త్రాగండి, గ్యాస్ సిలిండర్‌లను సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోండి, విద్యుత్ మీటర్లను ఓవర్‌లోడ్ చేయకుండా చూసుకోండి* *మరియు ఇంట్లో రద్దీగా ఉండే ప్రదేశాలలో, ముఖ్యంగా విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషనర్‌లను ఉపయోగించండి.  మరియు రెండు-మూడు గంటల తర్వాత, 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి.  45-47° ACని 24-25°కి మాత్రమే ఆపరేట్ చేయండి, ముఖ్యంగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతికి గురికాకుండా ఉండండి.*

         *చివరిగా: దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు తెలియకపోవచ్చు మరియు దీన్ని మొదటిసారి చదువుతున్నందున షేర్ చేయండి.*

****

045..ప్రాంజలి ప్రభ కథలు.... 1-06-


నిన్న నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా..దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు..నేను ముందు వరుసలో కూర్చున్నా..ఆకలిగా అనిపించింది.


కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది..ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి..చిరాగ్గా అనిపించింది.తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా.


ఈలోగా మరొక ఆమె కూల్డ్రింక్స్ తెచ్చి ముందువరుస నుండి పంపకం మొదలెట్టింది..అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి..


కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా..సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు..స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా.


ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు..థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది..ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం..


అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చేసుకుంటున్నా..


సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి..తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది..ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా..అదేంటో తెలుసా??


టూత్ పిక్..పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు..ఛి ఛీ.ఎదవ జన్మ.


నీతి :

జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు.


దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు.


కాదూ,కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే.

****

No comments:

Post a Comment