Thursday, 18 May 2023

మరి ఇట్టి అనాత్మ వ్యవహారములలోనుంచి నిత్యమైనటువంటి అఖండమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి ఆత్మ వస్తువును మానవుడు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దివ్యత్వము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే అమృతత్వము సాధ్యమౌతుంది. 


మానవుడు ఎప్పటికీ ఈ సత్యాలను గుర్తుపెట్టుకుని జీవిస్తూఉండాలి. తన ఆ జీవన పర్యంతమూ జనన మరణాలతోసహా, మృత్యుకాలంలో సహా, సహజమైనటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని, స్వయం ప్రకాశాన్ని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వారికి మృత్యువే లేదు. ఎందుకని అంటే, వారు ఆ మృత్యువును దాటినటువంటి వారు. 


వారు జనన మరణాలను దాటినటువంటి వారు. సశరీరులైన ఉన్నటువంటి అశరీరులు. శరీరము నందే ఉండి ముక్త స్థితిలో ఉన్నటువంటి వారు. వారికి శరీరము వలన ఏ రకమైనటువంటి సంగత్వము లేదు. అధ్యాస లేదు. ఈ రకంగా అనాత్మ యొక్క విశేషాలని వివరిస్తూ, అట్టి విశేషాలని త్యజించాలని చూపిస్తూ, అష్టవిధ శరీరాలలో సాక్షిగా ఉండాలనేటటువంటి బోధను మనకు అందిస్తున్నారు.


        నచికేతా! అట్టి బ్రహ్మను తెలియుటకు సదాచార్యుల ఉపదేశము వలన మనస్సును సంస్కరింపవలయును, యమ నియమాదుల చేత బుద్ధిని శుద్ధమొనర్చవలెను. అట్టి శుద్ధ బుద్ధి చేతనే, ఏకరసమైన ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు. 


బ్రహ్మము ఒక్కటే వాస్తవమనియు, దానికి వ్యతిరేకముగా ఏదియూ లేదని, దృఢనిశ్చయము చేయవలెను. అట్టి నిశ్చయము వలన అవిద్య నశించును. బ్రహ్మము ఏకము అను నిశ్చయము లేని వారికి, అవిద్య నానాత్వ బుద్ధిని కలిగించును. నానాత్వ బుద్ధి కలవారు మాటిమాటికి జనన మరణములను పొందుచున్నారు.


మరల స్పష్టముగా నిర్వచిస్తున్నారన్న మాట. ఏకరసమైనటువంటి, శుద్ధ బుద్ధి చేతనే, ఏక రసమైనటువంటి ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు. 


అర్థమైందా? అండీ! అంటే ప్రపంచములో నువ్వు ఎన్ని మార్గాలలో వెతికినప్పటికి, ఎన్ని శోధనామార్గములు ప్రయత్నము చేసినప్పటికీ, అవన్నీ నిన్ను ఎక్కడకు తీసుకొచ్చి వదిలేస్తాయి. అంటే శుద్ధ బుద్ధి దగ్గరకు తీసుకొచ్చి వదిలేస్తాయి. ఆ శుద్ధ బుద్ధి చేత, నువ్వు పొందదగినటువంటి, ఏకైక వస్తువు బ్రహ్మము. ఏకైక వస్తువు ఆత్మ. మరి అట్టి, ఏకత్వస్థితిని చెందించేటటుంవంటి, శుద్ధ బుద్ధిని సాధించడమే మానవుని యొక్క ప్రయత్న ఫలము. 


ఏమండీ! నన్ను పూజలు చేయమంటారా? జపం చేయమంటారా? ధ్యానం చేయమంటారా? యోగం చేయమంటారా? ఆసనాలు వేయమంటారా? ప్రాణాయామం చేయమంటారా? ఏం చేయమంటారు? విచారణ చేయమంటారా? లేదా సత్ క్రతువులు ఏమైనా యజ్ఞయాగాది కర్మలు చేయమంటారా?


 లేదా, నవవిధ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటిని ఏమైనా ఆచరించమంటారా? లేదా ఇతరత్రా దూషిత కర్మలలో నేను ఏమైనా ప్రయత్నం చేస్తే, నేను ఏమైనా ఉద్ధరించ బడ గలగుతానా? అనేటటువంటి ప్రశ్నలన్నీ మానవులకు కలుగుతూ ఉంటాయి. ఏం చేస్తే నేను బయట పడగలను? ఏం చేస్తే నేను ఉద్ధరింపబడగలను. 


ఏం చేస్తే, నేను పొందవలసినటువంటి దానిని పొందుగలుగుతాను? ఏమి చేస్తే నేను ఈ స్థితిని అధిగమించ గలుగుతాను? అనేటటువంటి ప్రశ్నలు జననం నుంచి మరణం వరకూ వస్తూనే ఉంటాయి. కారణం ఆయా పరిస్థితులు కానీ, ఆయా అవసరములు కానీ, ఆయా ఆకాంక్షలు కానీ, ఆయా మోహ సదృశమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రేరణలు కానీ, కామ క్రోధాది అరిషడ్వర్గములు కానీ, త్రిగుణాత్మకమైన వ్యవహారము కానీ, అవిద్య, మోహము కానీ... 


వీటన్నిటిలోనుంచీ మానవుడు తప్పించుకోవడం రావాలి. వివేకంతో తప్పించుకోవాలి. విచారణతో తప్పించుకోవాలి. ఎదురుగా వెళ్ళి గోడ వుంటే, ఢాం అని గుద్దుకొని, ముక్కు పగిలిందండి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారండీ? అంటే, నాయనా! గుద్దుకోకముందుకదా నీవు ఆలోచించాలి, తల పగలక ముందు కదా ఆలోచించాలి? అని అంటారు పెద్దలు.


సశేషం...


1-06-2020
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
షష్ఠ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము
నారాయణ కవచము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరీక్షిన్మహారాజు నుడివెను - మహాత్మా! శుకయోగీ! నారాయణ కవచ ప్రభావమున దేవేంద్రుడు శత్రువుల చతురంగబలములను అవలీలగా జయించి, త్రైలోక్య రాజ్యసంపదను అనుభవించెనని నీవు తెలిపియుంటివి. ఆ నారాయణ కవచమును నాకు ఉపదేశింపుము. దాని ప్రభావమున దేవేంద్రుడు తనపై దండెత్తిన శత్రువులను జయించిన విధానమును వివరింపుము.

శ్రీ శుక ఉవాచ

శ్రీశుకుడు వచించెను- మహారాజా! దేవతలు త్వష్టపుత్రుడగు విశ్వరూపుని పురోహతునిగా చేసికొనిన పిమ్మట, దేవేంద్రుడు ప్రశ్నింపగా విశ్వరూపుడు ఆయనకు నారాయణ కవచమును ఉపదేశించెను. దానిని సావధానుడవై వినుము.

విశ్వరూప ఉవాచ

విశ్వరూపుడు వచించెను- దేవేంద్రా! భయావహ పరిస్థితి ఏర్పడినప్పుడు నారాయణ కవచమును పఠించి, తమ శరీరమును రక్షించుకొనవలెను. దాని విధానమును తెలిపెదను- కాళ్ళు, చేతులను ప్రక్షాళనమొనర్చుకొని, ఆచమింపపవలెను. పవిత్రమును చేతియందు ధరించి, ఉత్తరముఖముగా కూర్చొనవలెను. అనంతరము కవచధారణ పర్యంతము మౌనము వహించుటకు నిశ్చయించుకొని, శుచియై ఓమ్ నమో నారాయణాయ, ఓమ్ నమో భగవతే వాసుదేవాయ అను మంత్రముల ద్వారా హృదయాది అంగన్యాసమును, అంగుష్ఠాది కరన్యాసములను ఆచరింపవలెను. ఓమ్ నమోనారాయణాయ - అను అష్టాక్షరి మంత్రము యొక్క ఓమ్ మొదలుకొని ఎనిమిది అక్షరములను క్రమముగా కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, ఉదరము, హృదయము, వక్షస్థలము, ముఖము, శిరస్సు అను అంగముల యందు న్యాసము చేయవలెను (ఎనిమిది అంగములను స్పృశించుచు మంత్రము నందలి ఎనిమిది అక్షరములను జపించవలెను). లేదా ఇదే మంత్రమును యకారమునుండి ఓంకార పర్యంతము ఎమిమిది అక్షరములను శిరస్సుతో ప్రారంభించి పాదములవరకు, ఎనిమిది అంగములయందు విపరీత (సంహార) క్రమములో న్యాసము చేయవలెను.

అనంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరి మంత్రముయొక్క ఓం మొదలుకొని పన్నెండు అక్షరముల మంత్రముతో, ఓంకారమును మొదలుకొని, యకారము వరకు ఒక్కొక్క అక్షరమునకు ఓంకారమును జోడించి రెండు చేతుల ఎనిమిది వ్రేళ్ళయందు (బొటన వ్రేళ్ళను మినహాయించి), రెండు బొటన వ్రేళ్ళు యొక్క నాలుగు కణుపులయందు, వెరసి పన్నెండు స్థానములలో కరన్యాసమును చేయవలెను.

పిమ్మట ఓం విష్ణవే నమః అనుమంత్రము యొక్క ఓంకారమును హృదయమునందును, వి కారమును బ్రహ్మరంధ్రమున, ష కారమును కనుబొమల మధ్యయందును, ణ కారమును శిఖయందును, వే కారముసు రెండుకనుల యందును, స కారమును అన్ని కీళ్ళయందును వ్యాసము చేయవలెను. ఓం, మః, అస్త్రాయఫట్ అని చెప్పి దిగ్బంధము చేయవలెను. ఈ విధముగా వివేకియైన సాధకుడు ఓం విష్ణవే నమః అను మంత్రస్వరూపుడగును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

02-06-2020
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

అపరాహ్ణకాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనుస్సుతోడను, సాయంకాలము నందు మాధవుడు బ్రహ్మవిష్ణుమహేశ్వర రూపము తోడను, సూర్యాస్తమయమైన పిదప హృషీకేశునిగను, అర్ధరాత్రముస పద్మనాభునిగను నన్ను కాపాడుగాక!

అపరరాత్రి యందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరియు, ఉషఃకాలమున ఖడ్గధారియైన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషఃకాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక!

తీవ్రమైన అంచులు గల సుదర్శనచక్రము ప్రళయాగ్నిని విరజిమ్ముచు, భగవత్ప్రేరణచే అన్ని వైపుల తిరుగుచుండును. వాయువు తోడగుటతో అగ్ని ఎండుగడ్డిని కాల్చివైచినట్లు ఆ సదర్శనచక్రము మా శత్రుసైన్యములను వెంటనే దగ్ధమొనర్చుగాక!

కౌమోదకీ గదాయుధమా! నీనుండి వెలువడు అగ్ని కణముల స్పర్శ వజ్రాయుధమువలె దుర్భరమైనవిగా నుండును. నీవు అజితుడైన శ్రీహరికి ప్రియమైన దానివి. నేను ఆ ప్రభువునకు సేవకుడను. కనుక, నీవు కూష్మాండ వినాయక, యక్షరాక్షసభూత ప్రేతాది గణములను ఇప్పుడే నుగ్గు నుగ్గు చేయుము. అట్లే నాశత్రువులను పిండి, పిండిగావింపుము.

శ్రేష్ఠమైన శంఖమా! పాంచజన్యమా! శ్రీకృష్ణభగవానునిచే పూరింపబడి, భీకరమైన శబ్దమొనర్చుచు శత్రువుల హృదయములను కంపింపజేయుదువు. అట్లే రాక్షసులు, ప్రమథగణములు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోలుము.

శ్రీహరికి ప్రీతి పాత్రమైన ఓ ఖడ్గమా! నీ అంచులు మిగుల తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలు గావింపుము. నీవు భగవంతునకు మిగుల ప్రియమైన దానివి. నీయందు వందలకొలది చంద్రునివంటి మండలాకారములు గలవు. శత్రువుల పాపదృష్టిని హరించివేయుము.

సూర్యాదిగ్రహములు, ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోఱలుగల క్రూరమృగములు, భూతప్రేతాదులు, అట్లే పాపాత్ములైన ప్రాణులనుండియు నన్ను రక్షింఫుము. మా శ్రేయస్సునకు వీరు అందరు విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తించుటవలన ఇవి అన్నియును వెంటనే నశించుగాక!

పూజ్యుడు, వేదమూర్తియు అగు గరుత్మంతుడు బృహద్రధంతరము మొదలగు సామములచే స్తుతింపబడు చుండును. ఆ ప్రభువు అన్ని కష్టములనుండియు మమ్ము కాపాడుచుండుగాక! పార్షదుడైన విష్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావముచే నన్ను రక్షించుగాక!

శ్రీహరియొక్క నామ, రూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు, మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను, సకల ఆపదలనుండి  కాపాడుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

03-06-2020
నారాయణ కవచము
8.31 ....   42
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కార్యకారణరూపమగు ఈ సకలజగత్తు వాస్తవముగా భగవత్స్వరూపమే. ఇట్టి సత్యప్రభావముచే  ఉపద్రవములు అన్నియును నశించిపోవుగాక!

బ్రహ్మ-ఆత్మల ఏకత్వమును (అద్వైతస్థితిని) అనుభవించిన వారికి వారి దృష్టిలో భగవత్స్వరూపము సమస్త వికార, భేదరహితము. ఐనను, భగవంతుడు తన మాయాశక్తి ద్వారా భూషణములును, ఆయుధములను, నామ, రూపములను,శక్తులను ధరించుచుండును. ఇది నిశ్చయముగా సత్యము. ఈ కారణము వలన సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడైన శ్రీహరి సదా సర్వత్ర అన్ని రూపములతో మమ్ము రక్షించుచుండుగాక!

నృసింహభగవానుడు తన భయంకర అట్టహాసముచే జనులు భీతిల్లి పారిపోవునట్లు చేయును. తన దివ్యతేజస్సుతో అందరి తేజస్సులను గ్రహించును. అట్టి శ్రీహరి దశదిశలయందును, పైన, క్రింద, లోపల, వెలుపలను, అంతటను మమ్ము రక్షించుచుండుగాక.

దేవేంద్రా! నేను నీకు ఈ నారాయణ కవచమును వినిపించితిని. దీనివలన నీవు సురక్షితుడవు అగుదువు. ఇంక నీవు సులభముగా దైత్య సేనాపతులందరిని జయింపగలవు.

ఈ నారాయణ కవచమును ధరించినవాడు, నేత్రములతో ఎవరిని చూచినను, తన పాదములతో ఎవరిని తాకినను అతడు కూడా వెంటనే సమస్త భయములనుండి విముక్తుడగును.

ఈ వైష్ణవీ విద్యను ధరించిన వానిని రాజులవలన, దొంగలవలన, ప్రేత పిశాచాదుల వలన, వ్యాఘ్రాది క్రూరమృగముల వలన ఎట్టి భయమూ ఉండదు.

దేవేంద్రా! పూర్వకాలమున కౌశిక గోత్రమునకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ విద్యసు (నారాయణ కవచమును) ధరించి, యోగధారణచే ఒక మరుభూమియందు తన దేహమును త్యజించెను.

ఒకప్పుడు గంధర్వరాజైస చిత్రరథుడు, తన స్త్రీలతో గూడి విమానమును అధిష్ఠించి, ఆకాశమున వెళ్ళుచుండెను. ఆ విమానము ఆ విప్రుని శరీరము పడిన చోటునకు మీదుగా వెళ్ళుచుండెను.

అంతట ఆ గంధర్వరాజు విమానముతో గూడ తలక్రిందులుగా భూమిపై బడెను. ఈ సంఘటన ఆయనకు ఆశ్చర్యమును కలిగించెను. వాలఖిల్యమహర్షులు అది నారాయణ కవచమును ధరించిన బ్రాహ్మణుని యొక్క మహత్త్వము అని తెలిపిరి. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముని అస్థులను తీసికొనిపోయి పూర్వవాహిన ఐన సరస్వతీ నది యందు కలిపెను. పిమ్మట అతడు స్నానమాచరించి తన లోకమునకు వెళ్ళెను.

శ్రీ శుక ఉవాచ

శ్రీ శుకుడు వచించెను- పరీక్షిన్మహారాజా! ఈ నారాయణ కవచమును ఎప్పుడైనను వినిన వానికి, సాదరముగా దీనిని గ్రహించిన వానికి సకలప్రాణులు గౌరవముగా నమస్కరించును. వారు సమస్త భయముల నుండియు విముక్తులగుదురు.

ఇంద్రుడు తన పురోహితుడైన విశ్వరూపుని ద్వారా ఈ నారాయణ కవచము అను విద్యను పొంది, రణభూమియందు అసురులను జయించెను. ముల్లోకములయందలి సంపదలను అనుభవించెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే అష్టమోఽధ్యాయః (8)

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి షష్ఠ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము (8)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏






31-05-2020

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.11 (పదకొండవ శ్లోకము)

అనంతరము సమగ్రమగు ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను  సద్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానింపవలెను. తనను గూడ ఆ రూపములోనే చింతింపవలెను. పిదప విద్య, తేజస్సు,తపస్స్వరూపమైన ఈకవచమునుపఠింపవలెను.

ఆశ్రితుల ఆర్తిని హరించునట్టి భగవంతుడైన శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మములను మోపియున్నాడు. అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవించుచున్నవి. ఎనిమిది చేతుల యందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనుస్సు, పాశము ధరించియున్నాడు. ఓంకారస్వరూపుడైన ఆ ప్రభువే అన్ని విధములుగా అంతటను నన్ను రక్షించుగాక.

శ్రీహరి మత్స్యమూర్తియై, జలముల యందలి జలజంతువుల నుండియు, వరుణపాశము నుండి నన్ను రక్షించుగాక. మాయాబ్రహ్మచారి రూపమునగల వామనమూర్తి భూతలము నందును, విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందును నన్ను కాపాడుగాక.

శ్రీహరి, నృసింహప్రభువుగా అవతరించి రాక్షససైన్యములను హతమార్చెను. దిక్కులు పిక్కటిల్లునట్లు ఆ స్వామి యొనర్చిన భయంకరమైన అట్టహాసమునకు దైత్యస్త్రీలయొక్క గర్భములు జారిపోయెను. అట్టి నృసింహ ప్రభువు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్దానములయందు కాపాడుగాక!

శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి, పృథ్విని తన దంతములపై ధరించెను. అట్టి ఆ ప్రభువు మార్గములయందు నన్ను కాపాడుగాక! పర్వతశిఖరములపై పరశురాముడుగను, ప్రవాసకాలముల యందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడుగను నన్ను రక్షించుగాక!

శ్రీమన్నారాయణుడు అభిచారహోమముల వంటి భయంకరమైన మారణ హోమములనుండియు, అన్నివిధమలైన ప్రమాదముల నుండియు, నన్ను రక్షించుగాక! ఋషిశ్రేష్ఠుడైన నరుడుగా నా గర్వమును దూరము చేయుగాక! యోగ విఘ్నములనుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడుగా నన్ను కాపాడుగాక! త్రిగుణాధిపతియైన కపిలభగవానుడుగా కర్మబంధముల నుండి నన్ను రక్షించుగాక!

మహర్షియైన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక! హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించుచున్నప్పుడు, దేవతామూర్తులకు నమస్కారములు చేయకుండుట మొదలగు అపరాధముల నుండి నన్ను రక్షించుచుందురుగాక! దేవర్షియైన నారదుడు నేను ఒనర్చెడి సేవాపరాధములనుండి నన్ను రక్షించుచుండుగాక! కూర్మావతారుడైన శ్రీహరి వివిధములగు నరక బాధలనుండి రక్షించుచుండుగాక!

ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక! జితేంద్రియుడైన ఋషభదేవుడు సుఖదుఃఖాది భయంకర బాధలనుండి నన్ను కాపాడుగాక!  యజ్ఞ పురుషుడైన నారాయణుడు లోకాపవాదముల నుండియు, బలరాముడు మానవుల వలన కలుగు కష్టముల నుండియు, ఆదిశేషుడు క్రోధమును సర్పగణములనుండియు నన్ను రక్షించు చుండునుగాక!

వ్యాసభగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యములనుండి రక్షించుచుండుగాక! బుద్ధుడు పాషండగణముల నుండియును, ప్రమాదముల నుండియు నాకు రక్షణను ప్రసాదించుచుండుగాక! ధర్మరక్షణకొరకు కల్కి అవతారమును దాల్చి భగవంతుడు పాపసంకులమైన కలికాల దోషములనుండి నన్ను కాపాడుచుండుగాక!

కేశవభగవానుడు ప్రాతఃకాలమున తన గదాయుధము తోడను, ఆసంగవకాలమున (సూర్యోదయానంతర కాలమున) వేణుగానలోలుడగు గోవిందుడు, పూర్వాహ్నమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు, మధ్యాహ్న కాలమున విష్ణుభగవానుడు సుదర్శన చక్రమును చేబూనియు, నన్ను రక్షించుచుండుగాక!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి షష్ఠస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


***

కల్పన బతుకు బండి  (రోజువారీ చిన్న కథ) 

రైలు ఒక స్టేషన్ వద్ద ఆగింది , రైల్లో నలుగురు మొగ, ఆడ,  పోలీసులు ఒక స్త్రీ చేతికి సంకెళ్లు వేసి, ముఖానికి ముసుగు వేసి  లోపలికి ఎక్కించారు। 
ఆరోజు పేపర్లోకి ఎక్కింది, ఒక స్త్రీ వింత కధ ఈరోజే కోర్టు తీర్పు  ఉరా? యావజ్జివ శిక్ష? 
అప్పుడే పేపర్లో ఉన్న విషయాన్నీ పెద్దగా చదువు తున్నాడు ఒక మహానుభావుడు.  

సాక్ష మున్నది ద్రవ్యము సాకు అదియు 
తప్పు చేసిన వారికీ తీర్పు వరకు 
బంది ఖానాకు తప్పదు బంధ మొవ్వు 
కాల మార్పులే మనిషికి కమ్ము కొచ్చు    

టెన్త్ క్లాస్ పస్ట్ గా పాసైనది కల్పన, ఇంట్లోవాళ్ళు ఇక చదువు ఆపై నీకు పెళ్లి చేస్తాం అని వత్తిడి చేసారు, చదువుకోవాలని ఆశయం బాగా మనస్సులో నాటుకుంది, తల్లి తండ్రులు సంబంధం చూసి బలవంతంగా పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు కల్పనను। పెళ్లి హడవిడిగా జరిగి పోయినది।               

పెళ్లైన రోజు రాత్రి బాగుగా త్రాగి ఇంటికొచ్చాడు కొత్తపెళ్ళికొడుకు, అత్తగారు సముదా యించ పోగా ఒక్క తోపు తోసి దుర్భాషలు ఆడాడు, మావగారు రాగ బలవంతాన బ్రాందీ త్రాగించాడు।     

కల్పన మనసు చితికేను కల్పనల్లె 
విద్య ఆపియు పెళ్లి యు విజయ మేది  
మగడు మూర్ఖుడు  త్రాగియు గోల చేసె 
వావి వరుసలు చూడక చిందు లేసె  

ఇదంతా చూస్తున్నది కల్పన, కళ్ళు అగ్ని కణాల్లా మారినాయి, ధైర్యంతో ఒక్కసారి సివంగి లా దూకింది అందుబాటులోఉన్న కొడవలి తీసింది ఒకకాలు, ఒక చెయ్ నరికేసింది, అంతే మంగళసూత్రం తెంపేసి వాడి మోహాన కొట్టి, కొన్ని గుడ్డలు సంచిలో సర్దుకొని ప్రక్కనున్న రైల్ స్టేషన్లో రైల్ కదులుతుంటే ఎక్కేసింది కల్పన।  

కోప మాపుకోలేనిది కొరకు పడని 
కొత్త మొగుడ్ని కొడవలి కొసను చూపి 
ముందు వెనుక చూడక మోటు తనము 
కాళ్ళుచేతులు  నరికియుఁ కళ్ళు తిప్పె 

పలికి మాంగల్యమును తెంపి పమిట సర్ది 
వాడి మొహాన కొట్టియు వాక్కు తెలిపి 
గుడ్డలన్నియు సర్దియు గడ్డ దాటి 
బతుకు తెరువుకు రైలులో బయలు దేరె      
 
 
గేటు ప్రక్కన మూట పట్టుకొని కూర్చున్నది కల్పన, ఒక స్టేషన్లో ఆగగానే కొంటె కుర్రోళ్ళు తోసుకుంటూ అమ్మాయి మీద పడ్డారు, పడింది కాక స్త్రీ అని చూడక దుర్భాషలాడారు, చాలా ఓపికతో ఉన్నది కల్పన, అందులో ఒక కుర్రోడు వచ్చి నాతొ వస్తావా రాత్రికి నీకు డబ్బు ఇస్తా అన్నాడు చెవితో పాటలు వింటూ అన్న వాడితో వయసు కూతలు కూయకు స్త్రీని గౌరవించటం నేర్చుకో అసలు సంగీతమ్ ఇంత మూర్ఖముగా మారుస్తునందని అనుకోక ఈవిధముగా చెప్పింది 

"క  చ  ట  త  ప   అనే అయిదు వర్ణాలలో *క అనేది  నోటిలో చాలా లోపలి కి తగులుతుంది. చ చాలా మద్యస్తములోనూ, ట చివరిలో     త పంటి దగ్గర, ప  పెదవుల దగ్గర తగులుతాయి. పెదవుల నుంచి గొంతు వరకు ఉండే అన్ని ప్రాంతాలనీ నాలుక ముట్టుకుంటూ, నృత్యము చేసుకుంటూ, మన చేత వాక్యాలు పలికిస్తూ ఉంటుంది.*

 అదంతా వాగ్దేవతల కూటమి. కంఠము నుంచి నాలుక కొన వరకు ఉన్న భాగమును వాగ్భవ కూటము అన్నారు."  ప్రేమ అంటూ వెంట పడటం మూర్ఖత్వం అన్నా వినిపించుకోక 

కౌగలించుకోవాలని చూసేవాడ్ని  నీతో రావాలా రావాలా అంటూ ఒక్క తోపు తోసింది అంతే కదులుతున్న రైలు నుండి క్రింద పడ్డాడు, 

                                                                                                         మిగతాది రేపు చదవండి
2. కల్పన బతుకు బండి  (రోజువారీ చిన్న కథ) 

కల్పన భర్తను చంపి రైలెక్కింది రైల్లో ఒక్కడు గొడవ చేయ బోతే రైల్లో క్రిందతోయగా చనిపొయ్యాడు రైలు ఆపగా క్రిందకు దిగి పట్టాలపై నడుస్తున్నది ఇక చదవండి 

 మిగతా క్రుర్రోళ్ళు ఒక్కసారి ట్రైన్ చైన్ లాగారు, బోగి వెనుక నుండి దిగి కల్పనా పరుగెత్తింది। క్రింద పడ్డ వానికి దెబ్బలు బాగా తగిలినాయి। క్రింద పడ్డ వాణ్ని ట్రైన్లోకి తీసుకొచ్చారు ట్రైన్ కదిలింది పోలీసులొచ్చారు ఏమి జరిగింది గేటు దగ్గర నుండి తూలి క్రింద పడ్డాడు అని చెప్పారు, ఒక ప్రాణాన్ని రక్షించటానికి చైన్ లాగారు కాబట్టి కేసు ఉండదు, వెంటనే పక్క స్టేషన్లో హాస్పటల్ ఉన్నది చేర్చండి అని రైల్లో ఉన్న ఒక  డాక్టర్ కట్లు కట్టాడు । 

కాలమేదైన నిజముకు కొరత లేదు 
చావు బతుకుల మధ్యనే చింత చేరు 
ప్రాణ రక్షణ కోరుకునే పనులు జరుగు 
నమ్మ బలికిన మాటలు నిజము అగును 

కల్పన పట్టాలు మధ్య నుండి నడుస్తున్నది దారి తెలియక, ఎదురుగా ట్రైన్ వస్తూ ఉండటం వళ్ళ ప్రక్కన నడుస్తున్నది నీరసముగా 
వెనుక ఎవ్వరో తరుముకొస్తున్నట్లుగా పట్టాలమీద పరిగెడుతూ మధ్య వయసున్న స్త్రీ రైలు ఎదురుగా పోతున్నది।    
వెంటనే కల్పన రైలు క్రింద పడకుండా రక్షించింది

అత్తగయ్యాళి తనముతో రంకు గట్టి 
మొగుడు ముందునే దొంగగా మచ్చ తెచ్చె 
భర్త వెడలెను అత్తయుఁ బాధ పెట్టె 
బాధలను భరించక చచ్చె బాట ఇదియె 
 
నీపేరేంటి, నీ చావుకు కారణం క్లుప్తంగా చెప్పు చేతనైతే సహాయము చేస్తా 

నాపేరు ప్రభావతి, మా అత్తగారు గయ్యాళి, పరాయివాడితో రంకు కట్టి, నన్ను ఒక దొంగగా నా మొగుడు ముందు రుజువు చేసింది, నామొగుడు పట్టరాని కోపంతో ఏటో వెళ్లి పొయ్యాడు, రాక్షసి నాకొడుకే లేకపోతె నువ్వు నాఇంట్లో ఉండకూడదని బయటికి నెట్టేసేంది।
బతకటం కష్టమనిపించి చద్దామని అనుకున్నా అన్నది 

నీవు తొందరపడుతున్నావు, ఆవేశానికి లోనయ్యావు, కష్టాలు ఎప్పుడూ ఉండవు, మనం బత్కటానికి దారి చూసు కోవాలి ధైర్యంతో ఎదుర్కొనాలి " మానవుడు దైవత్వ సిద్ధిని బడయుటకును, అటుపిమ్మట సాధారణ చైతన్యమును తిరిగి పొంది సద్గురువు యొక్క సహాయమే అవసరము".

 సద్గురువు జ్ఞాన సూర్యుడగుటచే, తాను సంకల్పించినచో ఎవరికైనను రెప్పపాటు కాలములో మోక్షమును ప్రసాదించగలడు. కాబట్టి నీవు సద్గురువు అనే దైవాన్ని నమ్మి బతకాలి అన్నది కల్పన . 

                                                                            ఇంకావుంది ...3

3. కల్పన బతుకు బండి  (రోజువారీ చిన్న కథ) 

కల్పన భర్తను చంపి రైలెక్కింది రైల్లో ఒక్కడు గొడవ చేయ బోతే రైల్లో క్రిందతోయగా చనిపొయ్యాడు రైలు ఆపగా క్రిందకు దిగి పట్టాలపై నడుస్తున్నది , అట్టి అమ్మాయిని రక్షించి ధైర్యము చెప్పింది ఇక చదవండి.   

నేను చెప్పినట్లు నీవు చేస్తే నీ కాపురం నిలబెడ్తా, నిండా 18 సంవత్సరాలు నిండని కల్పన మొండి ధైర్యం కల్పించింది।       

స్నేహమంటూను రంకుకు సేవ చేసి 
మనసు మార్చియు అత్తకు మాయ విప్పి 
కాశి కిని పంపియు ప్రభా కాపురమ్ము 
చక్క బరచియు చదువును చక్కచేయు   
 
ఇంట్లో స్నేహితురాలుగా ప్రవేశించింది। రంకు కట్టిన వాడ్ని ముగ్గులోకి దించింది, అత్తకు బుద్ది వచ్చేటట్లు ప్రవర్తించింది    
కొడుక్కి అన్ని విషయాలు చెప్పి క్షమాపన చెప్పించి కాశీకి వెళ్ళమని టిక్కెట్టు కొని మరీ పంపించింది।

ముగ్గులో దిగినవాడు పెళ్ళాన్నే చంపి తప్పించుకు తిరుగుటవళ్ళ పోలీసులు పట్టుకుపోయారు।  

ప్రభావతి ఇంటర్ చదువుకోమని హాస్టల్లో చేర్పించింది (తనభర్త బుద్ది ఎప్పుడు మారుతుందోనని భయముతో) 

గీ .....సార మైన విజ్ఞాన విస్తారజలధి 
         కాటపట్టయి యున్నావు ఆదిదేవ 
         శ్రీ విరాట్స్వరూవుండయి, చెలిగి నావు 
         ప్రాంజలి నొనర్తు కృష్ణ నీ పాదములకు 
   
కాల చక్రం తిరుగుతున్నది, కల్పన కల్పన ఇంటర్ ఒకవైపు చదువుతూ ఖాళీ సమయములో పెట్రోల్ బంకులో పనిచేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని కొలుస్తూ ఎవ్వరిమీద ఆధార పడకూడదని భావించి చదువుకుంటున్నది. ఒకరోజు రాత్రి హాస్టల్ కు పెట్రోల్ బంకు నుండి ఆలస్యముగా రావటం జరిగింది,  ఇంకా రాత్రి పది గంటలు కూడా కాలేదు, వాచ్ మాన్ అసభ్య కరంగా కల్పనను తిట్టడం జరిగింది, దానికి తోడు హాస్టల్ వార్డెన్ కూడా బయటకు పంపిం చేస్తాము జాగర్త అని హెచ్చరించింది. ఎన్ని అన్న ఓర్పుతో ఉన్నది. 

ఎవరినడిగినా స్త్రీ లకు ఏడ్పు కలుగు
క్లిష్ట పరమైన మాటకు కన్ను విప్పు
జరుగు సంఘటన లు బాధ జాప్య మవ్వు
ఏది ఏమైనా మహిళల ఎదను చెరచు

ఇదే అవకాశంగా చేసుకొని వాచ్ మాన్ మరునాడు బాయ్స్ హాస్టల్ డబున్న విద్యార్థి నిన్ను కోరు కుంటున్నాడు నీకు కొంత డబ్బు ఇస్తాడట నీవు రైల్లో ఎవర్నో తోసి చంపావుట, నీవు వప్పు కుంటే పోలీసులకు చెప్పడట, లేదా నిన్ను అరెష్టు చేయిస్తాడుట, ఈ  హాస్టల్క్ చెడ్డ పేరు వస్తుంది, చదువు మానుకొని వెళ్తావో, లొంగి బతుకుతావో అంతా నీ ఇష్టం అని సిగరెట్టు వెలిగించి మొఖం మీద ఊది ఒక అడ్రస్ కార్డు ఇవ్వటం జరిగింది. 
                                                                              ఇంకా ఉంది ...4


4. కల్పన బతుకు బండి  (రోజువారీ చిన్న కథ) 

(కల్పన భర్తను చంపి రైలెక్కింది రైల్లో ఒక్కడు గొడవ చేయ బోతే రైల్లో క్రిందతోయగా చనిపొయ్యాడు రైలు ఆపగా క్రిందకు దిగి పట్టాలపై నడుస్తున్నది , అట్టి అమ్మాయిని రక్షించి రంకు మార్చి ప్రభా కుటుంబము సరిచేసి విద్యార్థుల బెదిరింపుతో  ధైర్యము తో కదిలే ఇక చదవండి.)   

కల్పన ఆలోచనలో పడింది. మరునాడు మొండి ధైర్యంతో యధాప్రకారంగా స్కూల్ కు వెళ్ళింది అప్పుడే తోటి విద్యార్థులు పాపర్ ల్లో విషయాలు మాట్లాడు కుంటున్నారు. బాయ్స్ తిరిగి వస్తునప్పుడు ఎవరో గుర్తు తెలియని ఆడవారు బుర్కాలు వేసుకొని విద్యార్థులను చితక బాదారుట  అందరూ ఆసుపత్రిలో చేరారుట అని చదివారు. వారిమాటలు విని కల్పన నవ్వుకుంటూ వున్నట్లుగా వెళ్ళిపోయినది. 
                                                                                                                        
మరునాడు రాత్రి 10 గంటలకే హాస్టల్ కు వచ్చింది వాచ్ మెన్ గబగబా వచ్చి కల్పనగారు మీరు వెళ్ళవచ్చు అప్పుడే హాస్టల్ వార్డెన్ వచ్చి ఏమిటి లెట్ గా వచ్చింది వెంటనే లోపలలకు పంపిస్తున్నావ్ ఏమిటి 

మేడం గారు మీరు పెద్దగా ఆరవకండి, కల్పనకు పెద్ద గ్రూప్ ఉన్నది మొన్న కల్పనతో మొన్న తక్కువచేసి మాట్లాడ ఒక ధనవంతుడి విషయంలో ఆరోజు రాత్రే కొందరు బుర్కాలతో వచ్చి చితకబాదారు మొగతనం లేకుండా చేశారు. 

ఆ ఏమన్నవ్ అవును అక్షరాలా నిజం కల్పనే చెలించి ఉంటుంది. 

ఇంకా నయం నీవు చెప్పావు, నా మాంగల్యం కాపాడావు అన్నది 

కష్టం ఫలించి కాలచక్రంలో ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఇంజనీర్ పూర్తి చేసింది.

చక్రి , కల్పన లు సాఫ్ట్ వేర్ఇంజనీర్లుఒకేఆఫీసులోపనిచేస్తున్నారు
వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి తల్లితండ్రులు వారి వివాహానికి అంగీకరించ లేదు .కారణం, ముఖ్యంగా వారు వేరు వేరు కులములు కావటమే . 
వారిద్దరికీ వారి తల్లితండ్రులు వేరే వేరే సంబంధాలు చూశారు .కానీ అవి చక్రి, కల్పన  లకు ఇష్టం లేదు . రిజిస్టర్ మ్యారేజీ చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు . వారి వారి తల్లి తండ్రులను ధిక్కరించి వారినుండి సంక్రమించే ఆస్తిపాస్తులను కాలదన్ని ఒకరోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి కున్నారు .అప్పుడు కల్పన  స్నేహితురాలు మాలతి పెదనాన్నగారు  కూడా వచ్చి ఆదంపతులను ఆశీర్వదించి ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చారు. 
                                              
                                                                ఇంకా ఉన్నది 
                           

5. కల్పన బతుకు బండి  (రోజువారీ చిన్న కథ) 

(కల్పన భర్తను చంపి రైలెక్కింది రైల్లో ఒక్కడు గొడవ చేయ బోతే రైల్లో క్రిందతోయగా చనిపొయ్యాడు రైలు ఆపగా క్రిందకు దిగి పట్టాలపై నడుస్తున్నది , అట్టి అమ్మాయిని రక్షించి రంకు మార్చి ప్రభా కుటుంబము సరిచేసి విద్యార్థుల బెదిరింపుతో  ధైర్యము తో కదిలే ఇక చదవండి.)   

ఇప్పుడే అసలు కధ మొదలైంది . చూస్తూ చూస్తూండగనే రెండేళ్ళు గడిచాయి . చక్రి కి కల్పన మీద మొదట్లో ఉన్న ప్రేమ తగ్గటం మొదలైంది ఆఫీసులో ఇంకో అమ్మాయితో తిరగటం మొదలు పెట్టాడు. శ్యామలను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమన్నాడు . తాను సాయంత్రం ఆఫీసునుండి అలసిపోయి వస్తే ఇంటిదగ్గర తన భార్య తనకు కాఫీ తో

స్వాగతం పలకాలని కోరిక అదీ కాకుండా వారికి పుట్టబోయే సంతానాన్ని ఇంట్లో తనభార్య ప్రేమతో పెంచాలని కోరిక . ఈ కోరికను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోకముందు చెప్ప లేదు . ఇప్పుడేంచేయాలి? కానీ కల్పనకు తాను చాలా కాలంనుండీ చేస్తున్న ఉద్యోగం మానటం ఇష్టంలేదుచివరకుచక్రి కల్పన మీద కోపం వచ్చి విడాకులు ఇవ్వటానికే నిర్ణయించుకున్నాడు.

చక్రి కల్పనకు  విడాకులనోటీస్ ఇవ్వటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు స్కూటర్ మీద వెడుతూ అడ్వకేట్ తో సెల్ ఫోన్ లో మాట్లాడుతూండగా ఏక్సిడెంటు జరి గింది కాలికి ఫ్రాక్చర్ అయింది హాస్పటల్ లో ఎడ్మిట్ అయ్యాడు ఏక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే కల్పన హాస్పటల్ కు వెళ్ళి నెలరోజులు వైద్యం చేయించి ఇంటికి తెచ్చుకుంది చక్రి కి సపర్యలు చేస్తుంది.  చక్రి ఫ్రాక్చర్ తో మంచంమీద కల్పన  చేత సపర్యలు చేయించుకొంటూ బాధపడుతూ ఉన్నాడు.

రెండు నెలలో పూర్తిగా కోలుకున్నాడు, ఏంతో సేవలు చేసిన కల్పన గుర్తుకు రాలేదు, 

కల్పన ముందే తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకు రావటం చూసి మనస్సు చలించి పోయినది. మనస్సు వికలమైనది మొగవారి బుద్ధి తెలిసికొని ప్రేమకలాపాలు వీడియో తీసి, పోలీసులకు రిపోర్ట్ చేసి ఉన్న ఉద్యోగము తీయించి, తన ఉద్యోగమునకు రాజీనామాచేసి తన భవిషత్తుకోసం ప్రయాణమైనది మరో ప్రపంచానికి.    

     
అప్పుడే 
నేను పురుషాంగం, ఈ క్రింది కారణాల వల్ల జీతం పెంచమని అభ్యర్థించాను:
నేను శారీరక శ్రమ చేస్తాను.
నేను చాలా లోతులో పని చేస్తున్నాను.
నేను చేసే ప్రతి పనిలో తలదూర్చుతాను.
నాకు వారాంతాల్లో లేదా ప్రభుత్వ సెలవులు ఉండవు.
నేను తడి వాతావరణంలో పని చేస్తాను.
నేను వెంటిలేషన్ సరిగా లేని చీకటి కార్యాలయంలో పని చేస్తున్నాను.
నేను అధిక ఉష్ణోగ్రతలలో పని చేస్తాను.
నా పని నన్ను అంటు వ్యాధులకు గురి చేస్తుంది.
నాకు సహాయకులుగా ఎవరన్నా వస్తారా 
ఒక్కటే నవ్వుకుంది పూశాన్గమ్ వేషాలు మారే  
 పాపరు ప్రకటన చూసి ఆ ఉద్యోగానికి వెళదామనుకుంది కల్పనా       


ప్రియమైన మిస్టర్ పి. నిస్:
మీ అభ్యర్థనను అంచనా వేసిన తర్వాత మరియు మీ వద్ద ఉన్న వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత
ఈ క్రింది కారణాల వల్ల పరిపాలన మీ అభ్యర్థనను తిరస్కరించింది: నేనే ఎండు కంటే ఇందువలనా  
అక్కడ స్థితిగతులుచూసి ఉత్తరం వ్రాసి పెట్టి ప్రపంచం చూడాలనుకుంది కల్పనా 
ఇదే ఉత్తరం 
మీరు వరుసగా 8 గంటలు పని చేయరు.
కొద్దిసేపు పని చేసిన తర్వాత మీరు నిద్రపోతారు.
మీరు ఎల్లప్పుడూ నిర్వహణ బృందం యొక్క ఆదేశాలను అనుసరించరు. నువ్వు చెయ్యి కాలుతో పనే లేదు 
మీరు నియమించబడిన ప్రాంతంలో ఉండకూడదు మరియు తరచుగా ఇతర ప్రదేశాలను సందర్శించడం కనిపిస్తుంది.
మీరు చొరవ తీసుకోరు - మీరు ఒత్తిడి మరియు ఉద్దీపన అవసరం పని ప్రారంభించడానికి.
మీ షిఫ్ట్ ముగిసే సమయానికి మీరు పనిప్రదేశాన్ని గజిబిజిగా వదిలివేస్తారు. మీరు అవసరమైన భద్రతా నిబంధనలను ఎల్లప్పుడూ పాటించవద్దు, సరైన రక్షణ దుస్తులను ధరించడం వంటివి. మీరు 65 ఏళ్లలోపు పదవీ విరమణ చేస్తారు. మీరు డబుల్ షిఫ్ట్‌లలో పని చేయలేరు.
మీరు కొన్నిసార్లు మీ నియమించబడిన పని ప్రాంతాన్ని వదిలివేయడానికి ముందే వదిలివేయండి అప్పగించిన పనిని పూర్తి చేసింది. మరియు అది అన్ని కాకపోతే, మీరు నిరంతరం ప్రవేశించడం మరియు చూడటం జరిగింది ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులతో కార్యాలయంలో నుండి నిష్క్రమించడం- చూస్తున్న సంచులు.

భవదీయు రా లు, అని ఉత్తరం వ్రాసింది అనుభవశాలి ఐన  కల్పనా 

కల్పన చందమామను చూస్తూ తనలో తను అనుకుంటున్నది, పున్నమి వెన్నెల ను కురిపిస్తున్నావు, నాలో వెన్నెల లేకుండా చేస్తున్నావు ఎందుకు అని అనుకుంటున్నది. ఒక ఉద్యానవనంలో ఉన్న బల్లపై కూర్చొని ఆలోచిస్తున్నది. అప్పుడే అక్కడకు పల్లీలు అమ్మేవాడు వచ్చాడు పల్లీలు తీసుకోని తింటూ కాగితంపై ప్రకటన చూసింది, సివిల్ ఇంజినీర్ కావలెను, అడవారు మాత్రమే అని ప్రకటన చూసింది, వెంటనే అడ్రస్సు తెలుసుకొని వెళ్లి కలిసింది. హనుమంతుని నమ్ముకొని బతకాలని అనుకున్నది నలుగురికి సేవలు చేసి తనజీవితాన్ని సాగించాలని అనుకున్నది అప్పుడే 

ఉద్యోగంలో చేరటమే కాదు, ముగ్గురు స్నేహితుల్ని కుడా సంపాదించింది.
అందులో ఒకరు (చామంతి) చపల చిత్తంగలది, రెండవవారు (జలజ)  జిత్తులమారి ఎత్తుకుపై ఎత్తులు వేయగల సామర్ధ్యం గలది, మూడవవారు
(మృదుల) దొంగబుద్ధి కలది.
వీరితో సాగుదాని కల్పనా 

                            అందరికీ ధన్యవాదములు
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

 

****

మేము కాశ్మీరు వెళ్ళాం

“ఇప్పడు నీకు ప్రయాణం చెయ్యడానికి తగ్గంత బలం వచ్చింది. నేను నీతో కాశ్మీరు వస్తాను,” అన్నాడు శ్రీయుక్తేశ్వర్‌గారు; ఏషియాటిక్ కలరా అద్భుతంగా నయమై నేను కోలుకున్న రెండు రోజుల తరవాత.

ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురం కలిసి ఉత్తరదేశానికి వెళ్ళే బండి ఎక్కాం. మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా; హిమాలయ పర్వతాలనే సింహాసనం మీద కుదురుగా కూర్చున్న నగరరాణి ఇది. అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధుల్లో సంచరించాం.

“ఇంగ్లీషు స్ట్రాబెరీలున్నాయి,” అని అరుస్తూ ఒక ముసలామె, అందమైన ఆరుబయటి అంగడి వీథిలో కూర్చుని ఉంది.

చిత్రమైన ఆ చిన్నచిన్న ఎర్రటి పళ్ళమీద గురుదేవులకు ఆసక్తి కలిగింది. ఆయన ఒక బుట్టెడు పళ్ళు కొని, పక్కనున్న నాకూ కనాయికీ పెట్టారు. ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున నేలమీద ఉమ్మేశాను.

“పులుపు రొడ్డండి సార్! స్ట్రాబెరీలు నాకు ఒక్కనాటికి నచ్చవు?”

మా గురుదేవులు నవ్వారు. “ఆఁహాఁ, నీకు నచ్చుతాయవి - అమెరికాలో. అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు, నీకు ఆతిథ్యమిచ్చే ఆవిడ, వాటిలో పంచదారా మీగడావేసి ఇస్తుంది. ఆ పళ్ళని ​ఆవిడ ఫోర్కుతో బాగా ఎనిపిన తరవాత నువ్వు రుచి చూసి, ‘ఎంత రుచిగల స్ట్రాబెరీలు!’ అంటావు. అప్పుడు నీకు గుర్తు వస్తుంది, సిమ్లాలో ఈ రోజు.

(శ్రీయుక్తేశ్వర్‌గారు చెప్పిన జోస్యం నా మనస్సులోంచి తొలగిపోయింది. కాని మూడేళ్ళ తరవాత, నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తల్లో మళ్ళీ మనస్సులో మెదిలింది. మెసాచుసెట్స్‌లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ ఆలిస్ టి. హేసీ అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళాను. భోజనాల బల్లమీద స్ట్రాబెరీల డిసర్ట్ పెట్టినప్పుడు, మా ఆతిథేయిని ఒక ఫోర్కు తీసుకొని, బెరీపండ్లకు మీగడా పంచదారా కలిపి, వాటిని బాగా ఎనిపింది. “ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది; దీన్నిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను,” అన్నదామె. నేను నోరుపట్టినంత తీసి పెట్టుకున్నాను. “ఎంత రుచిగల స్ట్రాబెరీలు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించాను. వెంటనే, సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జోస్యం, ఆగాఢమైన నా స్మృతిగహ్వరంలోంచి బయల్పడింది. దైవానుసంధాన శీలకమైన ఆయన మనస్సు చాలాకాలం కిందటే, భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయాను).

త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి, రావల్పిండి బండి ఎక్కింది. అక్కడ మేము జోడుగుర్రాలు పూన్చిన గూడుబండి ఒకటి అద్దెకు తీసుకుని శ్రీనగర్‌కు ప్రయాణమయాం; శ్రీనగర్ కాశ్మీరుకు రాజధాని. మేము ఉత్తరదిశకు ప్రయాణం సాగించిన రెండోనాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది. మా బండికున్న ఇనప చక్రాలు, మలమల మాడుతున్న రాతిగొట్టు బాటల్లో కీచుమని రొదచేస్తూ సాగుతూ ఉండగా, ఆ పర్వతశోభలో మారుతున్న తరుశ్రేణుల రామణీయకతకు మేమంతా ముగ్ధులమయిపోయాం. ​“గురుదేవా, మీ పావన సాహచర్యంలో ఈ మనోహరదృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి,” అంటూ గురుదేవులతో అన్నాడు ఆడీ. ఆ ప్రయాణానికి నేను ఆతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల, ఆడీ మెప్పుకి నాలో రవ్వంత ఉల్లాసం పెల్లుబికింది. శ్రీయుక్తేశ్వర్‌గారు నా ఆలోచన పసిగట్టారు; నావేపు తిరిగి గుసగుసలాడారు:

“నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు; ఆడీ, మనని విడిచిపెట్టి పోయి ఒక సిగరెట్టు కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు,” అన్నారాయన.

నేను అదిరిపడ్డాను. గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను. “గురుదేవా, మీరు దయచేసి ఇలాటి వెగటు మాటలతో మా పొత్తు చెడ గొట్టకండి. ఆడీ ఒక దమ్ముకోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒక్కనాటికి నమ్మను.” మామూలుగా, ఎవరూ అదుపుచెయ్యడానికి లొంగని మా గురుదేవుల వేపు అనుమానంగా చూశాను నేను.

“సరేలే, నేను ఆడీతో ఏమీ అనను,” అంటూ గురుదేవులు ముసి ముసిగా నవ్వారు. “కాని నువ్వే కాసేపట్లో చూస్తావు; మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు.”

మా బండి ఒక చిన్న కారవాన్‌సెరాయి దగ్గిరికి చేరుకుంది. మా గుర్రాల్ని నీళ్ళు పట్టడానికి తోలుకువెళ్తూ ఉండగా, ఆడీ అడిగాడు, “గురుదేవా, నేను బండివాడితో బాటు కాసేపు అలా స్వారి చేసివస్తే మీకు అభ్యంతరమాండి? నాకు కొంచెం బయటిగాలి పీల్చుకోవాలని ఉంది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు అనుమతి ఇచ్చారు. కాని, “అతనికి కావలసింది స్వచ్ఛమైన గాలి కాదు, స్వచ్ఛమైన దమ్ము,” అన్నారాయన నాతో. ​బండి మళ్ళీ బయల్దేరి, దుమ్ము రోడ్లమీద రొదచేసుకుంటూ ముందుకు సాగింది. గురుదేవుని కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి; ఆయన నాతో అన్నారు:

“బండి తలుపులోంచి మెడ సారించి స్వచ్ఛమైన గాలితో ఆడీ చేస్తున్న వేమిటో చూడు.”

ఆయన చెప్పినట్లు చేశాను. ఆడీ, రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్ర్భాంతి చెందాను. క్షమార్పణ కోరుతున్నట్టుగా శ్రీయుక్తేశ్వర్‌గారి వేపు చూశాను.

“మీరే రైటండి; ఎప్పటిలాగే. ఆడీ ప్రకృతి దృశ్యంతో బాటు దమ్ముకొడుతూ ఆనందిస్తున్నాడు.” మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు; ఆడీ కలకత్తానుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు.

నదులూ, లోయలూ, నిటారుగా నిలిచిన కొండ కొమ్ములూ, అసంఖ్యాకమైన పర్వతశ్రేణులూ గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారిగుండా ప్రయాణం సాగించాం. ప్రతి రాత్రీ మే మొక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం. నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీయుక్తేశ్వర్‌గారు, నా పథ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటికింకా నీరసంగానే ఉన్నాను. బరబరలాడే ఆ బండి కచ్చితంగా మా అసౌకర్యంకోసమే తయారై ఉన్నప్పటికీ, అప్పటికింకా నేను నీరసంగానే ఉన్నా- రోజూ రోజూకీ ఆరోగ్యం మెరుగవుతోంది.

మేము మధ్య కాశ్మీరుకు చేరువవుతూ ఉండగా, పద్మసరోవరాల దివ్యలోకం, నీటిమీద తేలే తోటలు, అందాల గుడ్డపందిళ్ళు వేసిన నావ ​ఇళ్ళు, అనేక వంతెనలుగల జీలంనది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నిటినీ చుట్టిఉన్న హిమాలయాలూ చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది.

మేము శ్రీనగర్‌కు వెళ్ళే దారికి ఇటూఅటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తయిన కొండల నేపథ్యంలో ఉన్న రెండతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు; దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్ళు తోడుకునే వాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది: వెచ్చటి పగళ్ళూ చిరుచలి రాత్రులూ.

శ్రీనగర్‌లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరిశిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండమీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమయింది; శ్రీనగర్‌లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ, అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు దర్శనమయింది (నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్‌ఏంజిలిస్‌ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు, అంతకుపూర్వం ఎప్పుడెప్పుడో, కాశ్మీరులోనూ ఇతర చోట్లా నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను).

***

2.🍀 198। వివిధ కోణాలు 🍀

🕉 ఇతరులను విభిన్న కోణాల్లో అనుభూతి చెందడం ఎల్లప్పుడూ మంచిది, ఎందుకంటే వ్యక్తులు బహుళ అంశాలను కలిగి ఉంటారు। 🕉

మనమందరం మనలో ఒక ప్రపంచాన్ని కలిగి ఉంటాము మరియు మీరు నిజంగా ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటే మీరు అతనిని లేదా ఆమెను సాధ్యమైన అన్ని కోణాల నుండి తెలుసుకోవాలి। అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనంతం కోసం ఒకరికొకరు ఆకర్షణీయంగా ఉండగలరు, ఎందుకంటే అప్పుడు ఏ పాత్ర కూడా స్థిరంగా ఉండదు। కొద్దిరోజుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు సంభవించినప్పుడు మళ్లీ భార్యాభర్తల పాత్రల్లో వస్తే అందంగా, కొత్తదనంగా ఉంటుంది! అప్పుడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నట్లు అనిపిస్తుంది।

మార్పు ఎప్పుడూ మంచిదే। ఒక వ్యక్తితో, కొత్త పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ కొత్త విధానాలను మరియు మార్గాలను కనుగొనండి। ఎప్పుడూ పాతదానిలోనే ఉండిపోవద్దు। అప్పుడు సంబంధం ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది। ఎల్లప్పుడూ ఆశ్చర్యకరమైనవి ఉంటాయి; మరొకరిని ఆశ్చర్యపరచడం ఎప్పుడూ మంచిదే; అప్పుడు సంబంధం ఎప్పటికీ చావదు।

కొనసాగుతుంది।।।

🌹 🌹 🌹 🌹 🌹

3. ఓం సదాశివ పతివ్రతాయై నమః

తానవతరించిన వివిధ అవతారము లందును సదా శివుడే పతిగా, శివునిలో తను సగమై అర్ధనారీశ్వర తత్వమునకు ప్రతీకగా, శివునితో అవినాభావ సంబంధం గలిగి పాతివ్రత్యమునకు సంకేతమై నిలచిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సదాశివపతివ్రతా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సదాశివ పతివ్రతాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకామార్ధసిద్ధి సంప్రాప్తించి, అంత్యమున సాయుజ్యమునందగలరు.

శివుడు అంటే మంగళకారుడు. సదాశివుడు అంటే నిత్యమూ మంగళకారుడు. అటువంటి సదాశివుని జగన్మాత భర్తగాపొందినది. తాను అవతరించిన ప్రతీ అవతారములోను ఆయననే తన భర్తగాపొందినది. పార్వతీ-పరమేశ్వరులు అన్నారు. ఎందుచేతనంటే తనభర్తతో అవినాభావసంబంధం గలిగి పాతివ్రత్యానికి సంకేతమై తను నిలిచినది. అందుకనే జగన్మాతకు తనభర్త సదాశివునిలో గల అన్ని విభూతులు గలిగియున్నది. శివశక్త్యైక స్వరూపిణి. రూపంలోను, నామంలోను, పంచకృత్యాలలోను అన్నివిధాలా పరమేశ్వరునితో జగన్మాత సమన్వయింపబడినది. సాధకుడు యోగసాధనలో కుండలినీ శక్తిని జాగృతంచేసి ఊర్ధ్వముఖంగా పయనింపజేయగా, బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదించి, షట్చక్రాలకావల సహస్రారంలోని చంద్రమండలంలో సుధాసాగరమధ్యమందు పరమేశ్వరునిచేరి ఆయనతో ఆనందతాండవమాడిన తరుణంలో అమృతధారలను వర్షింపజేసినది అంటే ఆ సదాశివుని ఎంతగానో కోరినదైన జగన్మాత సదాశివపతివ్రతా యని స్తుతింపబడవలసినదేగదా! సౌందర్యలహరిలో, 96వ శ్లోకంలో  శంకరభగవత్పాదుల వారు అమ్మవారి పాతివ్రత్యాన్ని ఇలా చెప్పారు:

కళత్రం వైధాత్రం - కతికతి భజంతే న కవయః

శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః|

మహాదేవం హిత్వా - తవ సతి సతీనామచరమే‌

కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః||96||

సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.

భావము:

అమ్మా! పతివ్రతాగ్రగణ్యా - ఎందరెందరో కవులు సరస్వతిని ఉపాసించి ఆమె అనుగ్రహం తో కవీశ్వరులై సరస్వతీ వల్లభులు అనిపించుకుంటున్నారు. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె దయతో ధనవంతులై లక్ష్మీపతులు అవుతున్నారు. కాని అమ్మా శివునికి మాత్రమే సొంతమై శివునిలో అర్ధభాగమై ఉండు నీ అనుగ్రహం పొందుట మాత్రం అంత తేలికైన విషయం కాదు.లోకంలో కురవకవృక్షం ( గోరింటాకు చెట్టు) పండుటకు ఉత్తమ స్త్రీ ఆలింగనం చెప్పబడి ఉన్నది. నీ ఉద్యాన వనంలో ఆ చెట్టుకు నీవు దోహదం చేయునప్పుడు కూడా ఆ వృక్షమునకు నీ స్పర్శ నీలో అర్ధభాగమైన సదాశివునితోనే తప్ప శివేతరగా (శివుడు లేకుండా) నిన్ను తాకుట కుదరదు. అటువంటి పతివ్రతవు నీవు.పతివ్రతలలో అగ్రగణ్యవు (ముందు లెక్కింపవలసినదానవు) నీవు.

ఇచట శ్రీ ఆదిశంకరులు చెబుతున్నది ఏమనగా - బ్రహ్మ లేకుండా సరస్వతిని ఉపాసించి సరస్వతిని మాత్రం పొందవచ్చు, విష్ణువు లేకుండా లక్ష్మిని ఉపాసించి లక్ష్మి‌ని మాత్రం పొందవచ్చు. కాని జగన్మాత విషయంలో మాత్రం అలాకాదు, ఆమె ఒక్కరేగా నిన్ను అనుగ్రహించదు.ఆమె అనుగ్రహం పొందాలంటే అర్ధనారీశ్వరులైన వారిరువురినీ కలిపి ఉపాసించవలసినదే. అంతేకాదు లోకంలో ఎవరైనా ఎప్పటికైనా విద్యావంతులు కావచ్చు,  లక్ష్మీవంతులు కావచ్చు కాని లలితా కటాక్షవంతులు కావటం మాత్రం పరమ దుర్లభం. ఎంతో కఠోరమైన "యమ నియమ ఆసన ప్రత్య ఆహార ధ్యాన ధారణ సమాధి" ఇత్యాది అష్టాంగ యోగ నిష్ఠాగరిష్టులై అనన్య భక్తితో ఉపాసించు వారికి తప్ప ఇతరులకు ఇది సాధ్యం కాదు. ఇహ లోకంలో సుఖములను ఉపకరించు ఈ విద్యా, ధనం పొందినంత సులభం కాదు పరలోకంలో ముక్తిని అనుగ్రహించు అమ్మ పాదాలు పొందుట అని కవి భావము.

జగన్మాత ఆయన ప్రేమఅనే మణిరత్నాన్ని మొత్తంగా తనదిగా చేసుకోవడానికి తన స్తన ద్వయమనే ప్రపిఫలాన్ని అచ్చం ఇచ్చేసిందనడానికి,  శ్రీలలితా సహస్రనామావళిలోని 33వ  నామ మంత్రాన్ని పరిశీలించుదాము: కామేశ్వరప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ పరమ పదాన్ని పొందడానికి భక్తి, జ్ఞానములు రెండూ కూడా కావాలని గూఢార్థము.

ఆ మహాతల్లి ఎంతటి పతివ్రత అంటే కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా (శ్రీలలితా సహస్ర నామావళి లోని 39వ నామ మంత్రము). పతివ్రతామతల్లులు తమ ముఖపద్మమును సహితం ఒరులకు  కనుపింపనీయరు. అటువంటిది కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మృదుత్వాలతోగూడిన ఉరుద్వయం గలిగిన మహాతల్లి జగన్మాత ఎంతటి పతివ్రతామతల్లి. శివశక్త్యైక్యము ఇక్కడ నిరూపితమౌతోందిగదా!

తన భర్త వలదు వలదని చెప్పినా వినక తన తండ్రి (దక్షుడు) నిర్వహించు దక్షయజ్ఞమునకు వెళ్ళగా, తాను (జగన్మాత) పిలవని పేరంటమునకు వచ్చినదనియు, అలా పంపించిన పరమేశ్వరుని (దక్షుడు) నానా దుర్భాషలాడగా, తన భర్త అవమానము తనదిగా భావించిన జగన్మాత, యజ్ఞకుండంలో తనువు చాలించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నది.

సురాసురులు అమృతము కొరకై చేయు క్షీరసాగరమథనమందు లోకభయంకరమైన హాలాహలము ఉత్పన్నమైనవేళ, జీవకోటి హాహాకారములు చేస్తుండగా, లోకానికి వచ్చిన పెనుముప్పుకు తల్లడిల్లినది జగన్మాత. ఆ తల్లి ఆ పెనుముప్పును తప్పించలేకనా?  తన మాంగల్యసౌభాగ్యమును, తన పాతివ్రత్య మహనీయతను ఎంతగానో విశ్వసించినదిగా, అంతటి భయంకరమైన హాలాహలమును పరమేశ్వరునిచే సేవింపజేసింది. ఎందుకని? తన పాతివ్రత్యాన్ని, తన మాంగల్యబలాన్ని అందరికీ ఆదర్శంగా ఉండడంకోసం . ఇదే విషయాన్ని బమ్మెర పోతనామాత్యులవారు అమ్మవారి పాతివ్రత్యానికి అబ్బురపడిన ఈ పద్యరత్నములను ఒకసారి పరిశీలిద్దాము.

కంద పద్యము

మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

తాత్పర్యం

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

ఆ హాలాహలమును పరమ శివుడు గ్రోలినప్పుడు

మత్తేభ విక్రీడితము

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు

ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;

వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ

బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

తాత్పర్యము

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.

అంతటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సదాశివపతివ్రతాయై నమః అని అనవలెను.

***

3. ఓం సంశయఘ్న్యై నమః

దేహము, ఇంద్రియాలే తాను అనే అజ్ఞానభావన అను హృదయగ్రంథి విడిపోయి, సాధకునికి తానే సచ్చిదానందరూపుడనే జ్ఞానమును అన్ని వర్ణముల (బ్రహ్మక్షత్రియవైశ్యశూద్ర యను వర్ణముల) వారికి ప్రసాదించు జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సంశయఘ్నీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సంశయఘ్న్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునకు ఆ తల్లి సంశయములన్నియు తీర్చి, సచ్చిదానంద స్వరూపుడునను జ్ఞానాన్ని ప్రసాదించును.

పరమాత్మస్వరూపిణి అయిన జగన్మాతను ఆరాధిస్తున్నాము. అనేక సంశయాలు ఉండడం సహజం.  

అజ్ఞానమను అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమనే జ్యోతిని వెలిగించు నతడు గురువు. మంత్రోపదేశం చేసి, దీక్ష ఇచ్చి, ఎలా సాధనచేయాలో తెలియజేయునతడు గురువు. సాధకునికి సంశయాలు ఉండడం సహజం గనుక సంశయాలకు సమాధానంచెప్పేది గురువు మాత్రమే.  అటువంటి గురుస్వరూపిణి కాబట్టి సంశయఘ్నీ యను నామము కలిగియున్నది.

జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. గురుమూర్తిః (603వ నామ మంత్రము)  గురువుయొక్క రూపముగా ఉన్నది జగన్మాత. అందుచే సంశయఘ్నీ అను నామ మంత్రము కలిగియున్నది.

త్రిమూర్తిః (628వ నామ మంత్రము)  సత్త్వరజస్తమోగుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తిస్వరూపిణి,  త్రిగుణాతీతమైన పరబ్రహ్మను సూచించే గురుస్వరూపిణి గనుక ఆ తల్లి భక్తుల సంశయములను తీర్చుతుంది. అందుచే అమ్మవారిని సంశయఘ్నీ అని స్తుతిస్తున్నాము.

దక్షిణామూర్తిరూపిణీ (725వ నామమంత్రము) వటవృక్షం క్రింద, దక్షిణాభిముఖంగా, పద్మాసనంలో, చిన్మయముద్రతో, తురీయస్థితిలో కూర్చుని త్రిమూర్తులకే గురువుగా ప్రసిద్ధికెక్కిన దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మవారు. దక్షిణామూర్తి స్వరూపంలో జగన్మాత దర్శనం సర్వసంశయములను పోగొడుతుంది. గనుకనే జగన్మాత సంశయఘ్నీ యని నామ ప్రసిద్ధి చెందినది. శ్రీవిద్యాపరంపరలో సిద్ధౌఘమునందున్న సనకసనందనాదులచే ఆరాధింపబడిన గురుస్వరూపిణి గనక జగన్మాత సంశయఘ్నీ యని స్తుతింపబడుచున్నది.

 శివజ్ణానప్రదాయినీ (727వ నామ మంత్రము) జగన్మాత శివసంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదించు గురుస్వరూపిణి గనుక జగన్మాత సంశయఘ్నీ యను నామమునకు సార్థకత కలిగియున్నది. 

అజ్ఞానంతో ఈ దేహము, ఇంద్రియములు మాత్రమే తాను అనే భావన అయిన హృదయగ్రంథి విడిపోయి, సాధకుడు తానొక సచ్చిదానంద స్వరూపుడనను జ్ఞానంతో తనలోనున్న సంశయనాశనమునకు కారణమైన జగన్మాత సంశయఘ్నీ యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సంశయఘ్న్యై నమః అని అనవలెను.

***  

4. సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం 

సుదీర్ఘ సాధన ఒక్కటే పరిష్కారం. ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, సంస్కారాలు మరియు కోరికలను మన దగ్గర ఉన్న ఏ కవచం లేదా పరికరంతో ఎదుర్కోలేము. నిరంతర సాధన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ కోరికలతో మనం చేస్తున్న ఒక రకమైన సత్యాగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. అవి కూడా అంతే శక్తివంతులు కాబట్టి మనం వాటిని నేరుగా యుద్ధంలో ఎదుర్కోలేము. కానీ, అవి మళ్లీ తలలు చూపించే అవకాశం లేదన్నంత పట్టుదలతో ఉంటాం. ఒక వ్యక్తి తన లక్ష్యం వైపు పయనిస్తున్నాడనే భావన సంవత్సరాలు సాధన తర్వాత ప్రారంభమవుతుంది-నెలల తర్వాత కాదు.

జ్ఞానేశ్వర మహారాజ్, జనకుడు వంటివారు పూర్వ జన్మలలో ఈ అభ్యాసం చేసి మరియు జీవితంలో చిన్న వయసు లోనే నైపుణ్యం మరియు విజయానికి సంబంధించిన సంకేతాలను చూపించిన ఆత్మస్థైర్యం కలవారు.  ఇతరులకు ఇది ఒక హింసలా కనిపిస్తుంది కానీ మన పంచకోశ శరీరాలను ప్రక్షాళన చేయడానికి ఇదే మార్గము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మరియు ఆనందమయ - ఈ ఐదు కోశాలు కోరిక యొక్క అభివ్యక్తి యొక్క వివిధ సాంద్రతలు.

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹

 5. 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 195 🌹

🍀. ఎవరి హృదయాలు అద్భుతంతో నాట్యం చేస్తాయో ఎవరి అస్తిత్వం సంభ్రమంతో సంచలిస్తుందో దేవుడు వాళ్ళకు సన్నిహితంగా వుంటాడు. అస్తిత్వం అలుపు లేనిది. అద్భుతం నిరంతరం కొనసాగుతుంది. రహస్యం కొనసాగుతుంది. 🍀

6.*. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు -  Ratha Saptami, Narmada *

*ప్రసాద్ భరద్వాజ*ప్రాంజలి ప్రభ..

*🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*

*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి.  సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*

*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*

*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*

*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*

*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*

*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*

7 *🌻. సూర్య స్తోత్రం 🌻*

*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*

*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*

*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*

*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*🌻. పాలు పొంగించే విధానం 🌻*

*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*

*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం  సూర్యునికి ఎంతో ప్రీతి.*

*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*

*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*

*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*

*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*

*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*

*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే  ౧*

*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*

*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్  ౨*

*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*

*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే  ౩*

*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*

🌹 🌹 🌹 🌹 🌹





No comments:

Post a Comment