150* మనమేం చేస్తున్నాం?
"గడచిన పది సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది ఆర్థిక మానసిక స్థితిగతులు ఆందోళనకరంగా మారటానికి 10 కారణాలు."
1. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ప్రతి సంవత్సరం తనకు అత్యంత అధునాతనమైన స్మార్ట్ ఫోన్ కావాలనే ఒక రంది లో పడిపోవటం. అవసరం ఆదాయం కంటే అట్టహాసం ఆర్భాటం కోసం వెంపర్లాడటం.
2. అందరితో చెప్పుకోవడం కోసం అవసరం ఉన్నా లేకున్నా ఖర్చుతో కూడిన దూరప్రయాణాలు చేపట్టటం, తాహతుకు మించి ఖర్చు చేయటం.
3. నడిచి వెళ్ళ గ లిగినా, సైకిల్ వేసుకుని వెళ్ళ గలిగినా, స్కూటర్ తో పని జరుపుకో గలిగినా, అంతస్తులు కృత్రిమంగా పెంచుకునే భాగంగా కారు కొనుక్కోవటం ఆ అప్పులు తీర్చటంలో అసహనం పాలు కావడం.
4. ఆరోగ్యకరమైన ఇంటి వంట భోజనం మరచి మనము కూడా బయటకు వెళ్ళి తినకపోతే అనాగరికులు అని అనుకుంటారేమో సామాజిక ఒత్తిడి కోసం వారానికి ఒకసారి బయటకు వెళ్లి అవసరాన్ని మించి ఖర్చు చేసి భోజనం చేయటం. వంట ఇంటి ని దేవాలయంగా.. ఆహారాన్ని ప్రసాదంగా.. వడ్డించే వారిని మాతృ సమానులుగా... భావించే సంస్కృతి నుంచి దూరంగా జరిగిపోవటం, భౌతిక ఆహారంతో పెనవేసుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక మనోల్లాస పార్శ్వాలను పక్కన పెట్టడం.
5. సౌందర్య చిట్కాలు ఇంట్లో ఎన్ని పాటించగలిగినా, ఫలానా బ్యూటీపార్లర్ కు, సెలూన్ కు వెళితేనే, అందం ఇనుమడిస్తుంది అని, అలాగే సరసమైన ధరలకు లభించే చక్కని ఆరోగ్యకరమైన చేనేత వస్త్రాలు ధరించ కలిగినా, బ్రాండెడ్ దుస్తులు ధరిస్తే విలువ పెరుగుతుందనే ఒక అజ్ఞానపు ఆవేశంలో బ్రాండెడ్ దుస్తులు వస్తువులపై అనవసరంగా ఖర్చు చేయటం.
6. పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు ఆత్మానందం కలిగించే అతిశయం తగ్గించే ఖర్చులేని ఆత్మ సంతృప్తినిచ్చే ఆత్మీయ పనులు చేపట్టకుండా గుడ్డిగా అనుకరణకు పోయి అనవసరపు ఖర్చులు చేసి అప్పులపాలు కావటం.
7. అనుబంధాలను ఇనుమడింప చేస్తూ అనురాగాలను ఆవిష్కరింప చేసే ఆహ్లాద పూరిత వాతావరణంలో చేయవలసిన వివాహ సంబంధిత కార్యక్రమాలు అయిన పసుపు కుంకాలు, ప్రదానాలు, వివాహ ఉత్సవం .... ఎవరినో అనుకరిస్తూ అద్దె ప్రదేశాలలో, అద్దె వస్తువులతో, ఆత్మీయ పలకరింపులు లేకుండా, కృత్రిమ వస్త్రధారణలతో కేవలం ఫోటోలు వీడియోలు కోసమే జరిగే తంతుగా, ఎంత ఖర్చు పెడితే దంపతులు అంత సుఖపడతారు అనే శూన్య భావంతో ఆర్ధిక హద్దులు పరిమితులు మరిచి ఖర్చు చేయటం అప్పుల పాలు కావటం.
8. చక్కని శిక్షణ పొందిన అధ్యాపకులు , మంచి తరగతి గదులు ఉన్న పాఠశాలలను కళాశాలలను వదిలిపెట్టి పిల్లలను పలానా స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు అంటే సామాజిక హోదా పెరుగుతుందనే అనాలోచిత ఆలోచనలకు బందీలై అవాంచిత ఖర్చులు పెంచుకుని ఆర్థిక వ్యాధులను కొని తెచ్చుకోవడం.
9. శరీర అవసరాలకు ఉపయోగపడే ఆహారం కాకుండా మార్కెట్లో లభ్యమవుతోంది, ఫలానా ఆహారం తింటే ఆధునికతకు చిహ్నం, అటువంటివి తినకపోతే వెనుకబడినవారు అనుకుంటారేమో, అనే అపోహ మధ్య అనవసరపు ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని చేజేతులా అటకెక్కిoచేయడంవల్ల, కృత్రిమ జీవన ప్రయాణం లో పెరిగిన వైద్య ఖర్చుల భారం.
10. అప్పు చేయటం అనర్థమనే అనాది ఆలోచనను ఆదిమానవుడి ఖాతాలో వేసి, అవసరం లేని అప్పులు చేస్తూ వడ్డీలను కడుతూ భవిష్యత్తును తాకట్టు పెడుతూ వర్తమానంలో సంతోషంగా జీవించ లేకపోవటం.
మీరుగా ఆలోచించండి. మారే ప్రయత్నం చేయండి
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
****
151 *ప్రేమ పంచాలి అతి ప్రేమ అనర్ధానికి మూలం
*తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..*
*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10 % కారకులు, కానీ 90% కారకులు తల్లిదండ్రులే..!*
పిల్లల్ని గారాబం మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*
పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, వారిని నాశనం చేస్తున్నారు. ఇప్పుటి తరం 70% పిల్లలు..
తల్లిదండ్రులు బండి తుడవమంటే తుడవరు..
మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..
కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...
రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటలలోపు నిద్ర లేవ మంటే లేవరు...
గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు..
తిడితే వస్తువులను విసిరి కొడతారు..
ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..
ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు..
20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..
కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు..
వారిస్తే వెర్రి పనులు..
మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*..
*కష్టం గురించి తెలిసేలా పెంచండి*
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరెట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..
మరికొంతమంది సోమరిపోతులులా తయారు అవుతున్నారు..
*అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం..
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...
గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, *100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు* అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీలు..
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..
వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే *తల్లిదండ్రులు మారాలి..*
*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*
ఒక్కసారి ఆలోచన చేయండి...
*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*
కేవలం గుడికి వెళ్లి
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 *బాధ్యత*
👉 *మర్యాద*
👉 *గౌరవం*
👉 *కష్టం*
👉 *నష్టం*
👉 *ఓర్పు*
👉 *సహనం*
👉 *దాతృత్వం*
👉 *ప్రేమ*
👉 *అనురాగం*
👉 *సహాయం*
👉 *సహకారం*
👉 *నాయకత్వం*
👉 *మానసిక ద్రృఢత్వం*
👉 *కుటుంబ బంధాలు*
👉 *అనుబంధాలు*
👉 *దైవ భక్తి*
👉 *దేశ భక్తి*
*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*
కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయంగా బ్రతుకుదాం.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం* వారికి అందించిన వారమవుతాం..
భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.
---
152 -కర్మ - జన్మ
7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"
కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 4
4. పశ్చాత్తాపం:
మనం పాపం అని భావించకుండా చేసిన దానిని ఇప్పుడు పాపంగా గుర్తించి, దాన్ని మరెన్నడూ చేయకపోవడం పశ్చాత్తాపం, సరయిన పశ్చాత్తాపంతో గతంలో చేసిన దుష్కర్మలన్నీ క్షయం అవుతాయి.
మనసు పొరల్లోంచి దానంతట అదే ఉద్భవించి, గుండెలో స్పందన కలిగి తిరిగి ఆ తప్పు చేయకపోవడమే నిజమైన పశ్చాత్తాపం.
జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఆ తప్పు తిరిగి చేస్తే పశ్చాత్తాపం వల్ల రద్దయిన ఆ దుష్కర్మల ఫలితాలు మనకి బంధాలుగానే మిగిలిపోతాయి. పశ్చాత్తాపం గురించి మనుస్మృతిలో ఇలా చెప్పారు.
అజ్ఞానాత్ యదివ్యామోహాత్ కృత్వా కర్మ విగర్హితం
తస్మాద్విముక్తి మన్విచ్చన్ ద్వితీయం న సమాచరేత్
భావం:-
తెలియక, మోహం వల్ల ఒకసారి చేసిన పాపం యొక్క ఫలం నించి విముక్తులం కావాలనుకుంటే, మరల ఆ పాప కృత్యాన్ని చేయకుండా ఉండాలి.
భార్యాభర్తల మధ్య పోట్లాటలు సర్వసాధారణం. 'అయ్యో! అనవసరంగా తిట్టానే' అని తర్వాత పశ్చాత్తాప పడ్డా, తిరిగి పోట్లాటలు మామూలే.
దాంతో ఆ పశ్చాత్తాపం రద్దయిపోతుంది. అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు. అందుకు సరయిన చోట, సరైన పాళ్ళలో మనసులో దెబ్బ తగలాలి. రక్తపుటేరులు చూస్తే కాని అశోకుడికి అలాంటి పశ్చాత్తాపం రాలేదు.
ఉత్తర భారత దేశంలో ఇది నిజంగా జరిగింది. ఓ గజదొంగ అనేక దోపిడీలు, హత్యలు చేస్తూ పోలీసులకి, తన గ్రామస్థులకి దొరక్కుండా జీవనం సాగించేవాడు.
కరడు కట్టిన స్వార్థానికి ప్రతిరూపమైన అతను ఓసారి తనని తరిమే పోలీసుల నుంచి దాక్కోడానికి గుళ్ళోకి వెళ్ళి, ఓ పండితుడు చెప్పే పురాణ కాలక్షేపం విన్నాడు.
'ఇతరులని హింసించడం పాపం' అన్న హితోపదేశం అతని మనసులోకి ఇంకింది. అంతా వెళ్ళాక ఆ పండితుడికి తన వృత్తాంతం మొత్తం చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.
ఆయన సానుభూతితో అర్థం చేసుకుని మరెన్నడూ ఆ దుష్కృత్యాలు చేయవద్దని, నీటి ఎద్దడి బాగా ఉన్న అతని గ్రామంలో చెట్లు నాటి వాటిని పెంచమని సలహా ఇచ్చాడు. అతను. చెట్లు నాటి దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చి వాటిని పెంచి పెద్ద చేశాడు.
ఫలితంగా ఆ గ్రామంలో వానలు కురిసి సుభిక్షం అయింది. తనని కోరలు తీసిన పాముగా గుర్తించాక గ్రామస్థులు ఏం చేసినా అహం చంపుకుని సహించి, ప్రపంచం నుంచి ప్రతిఫలాపేక్ష లేని సేవ చేస్తూ తిరిగి ఆ పాపాలు చేయని ఆ గజదొంగకి ఆ దుష్కర్మల బంధాలంటవు.
---
|
155 *గుడి మండపంలో కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన...*
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు
కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ. అది ఏమిటంటే..!
"అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
*"అనాయాసేన మరణం"*
నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు.
*"వినా ధైన్యేన జీవనం"*
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
*"దేహాంతే తవ సాన్నిధ్యం"*
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
*"దేహిమే పరమేశ్వరం"*
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ ....నా బిడ్డలకు కానీ ...సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరువకండి.
దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ🙏🙏🙏🙏🙏
156. ఇది ఇటలీలో జరిగింది, 93 ఏళ్ల వృద్ధుడు కి ఓ వ్యాధి సోకింది,ఒకరోజు వెంటిలేటర్ మీద పెట్టారు,బాగైంది డిశ్చాజ్ చేసేరోజు బిల్ చేతిలో పెట్టారు5000 యూరోస్అది చూసి ఆయన భోరున ఏడ్చాడు, డాక్టర్లు అన్నారు, డబ్బు లేకపోతే బిల్ కట్టోద్దు,ఆ వృద్ధుడు చెప్పింది విన్నాక ,డాక్టర్లు కూడా బోరున ఏడ్చారు, ఆ వృద్దుడు చెప్పింది,93 ఏళ్ల పాటు దేవుడు ఇచ్చిన గాలిని పీల్చా,ఒకరోజు కూడా ఆయనకు కృతఙ్ఞతలు చెప్పలేదు,
--(())--
No comments:
Post a Comment