200. ఉచ్ఛిష్ట గణపతి
ప్రాతః స్మరామి గణనాథ మనాధ బంధుం
సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం |
ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండం
ఆఖండలాది సురనాయక బృంద వంద్యం ||
గణేశుని యొక్క తాంత్రికాచారమే "ఉచ్ఛిష్ఠ గణపతి" విద్య. భారత దేశంలో ఉన్న షణ్మతములలో "గాణాపత్యులు" ఒక శాఖ. గాణాపత్యులలో....గణపతిని మరల అనేక విధాలుగా ఆరాధిస్తారు. ఈ ఉచ్ఛిష్ఠ గణపతిని తాంత్రిక గణపతి అనికూడా అనవచ్చును.
32 గణపతులలో "ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన" విశేష ఫలదాయకం. మంత్ర శాస్త్రమందు ఇలా చెప్పబడినది.
"హరిద్రోచ్ఛిష్ట లక్ష్మీచ ప్రసన్న శక్తి రేవచ"
అనగా.....ప్రస్తుత కలియుగమందు హరిద్ర,ఉచ్ఛిష్ట, లక్ష్మీ, ప్రసన్న, శక్తి గణపతులు....ఎంతో ప్రభావం కలిగి శీఘ్ర సిద్ధిని ఇస్తారు.
ఉచ్ఛిష్ట గణపతి పేరు ఇలా వచ్చింది. ఉచ్ఛిష్టము అనగా ఎంగిలి. ఈ "ఎంగిలి" అన్న పదము యొక్క సంస్కృత అర్థము "ఉచ్ఛిష్టము". ఉచ్ఛిష్టము అన్న పదము నుండే "ఉచ్ఛిష్ట గణపతి" అన్న నామము....క్రమంగా, ఆరాధన వచ్చాయి. ఈ గణపతి నామాన్ని ఎంగిలి నోటితో ఉచ్ఛరిస్తారు కావున "ఉచ్ఛిష్ట గణపతి" అంటారు. ఉచ్ఛిష్టము అనగా....నోటిలోని లాలాజలముతో, సమ్మిశ్రితమైన ఆహారము, ఇది కర్మ పరంగా చూసినా స్వచ్ఛమైనది కాదు. సనాతన సాంప్రదాయాల ప్రకారం ఇది నిషిద్ధమైనది కూడా.....అయితే తంత్ర సాధనలో ఉచ్ఛిష్టం నిషిద్ధం కాదు, ప్రత్యేకించి సాధనలో......
"మంత్ర మహార్ణవంలో" , గణపతి ఎరుపు రంగులో వర్ణించబడ్డాడు. ఉత్తర-కామికాగమ తంత్రంలో గణపతి గాఢమైన రంగు కలిగిన వాడిగా వర్ణించ బడ్డాడు.
ఉత్తర-కామికాగమ తంత్రం ప్రకారం గణపతి, పద్మాసనస్తుడై- ఆరు చేతులతో - రత్న, మణిమయ కిరీటంతో - నుదుటిపై నేత్రంతో....వర్ణించబడ్డాడు.
మరో తాంత్రిక గ్రంథం ప్రకారం గణపతి , తన ఆరు చేతులలోనూ స్వర్ణంతోనూ- నీలి తామర తోనూ- దానిమ్మ పండుతోనూ- వీణ తోనూ- అక్ష మాలతోనూ - ధాన్యపు కంకితోనూ.....వర్ణించబడ్డాడు.
మంత్ర మహార్ణవం ప్రకారం గణపతి... విల్లు బాణముతోనూ- పాశము తోనూ - అంకుశం తోనూ....వర్ణించబడ్డాడు.
ఉత్తర- కామికాగమం ప్రకారం, మరో సందర్భంలో ...గణపతి నాలుగు చేతులు కలవాడని, ప్రతి చేతిలోనూ.....పాశము, అంకుశము, చెఱకు గడతోనూ, మిగిలిన హస్తము అభయ ముద్రతో ఉంటుందని చెబుతోంది.
ఉచ్ఛిష్ట గణపతి, తన ఎడమ తొడపై ఉన్న ఒక దేవేరితో కూడి యుంటాడని తంత్రశాస్త్రం చెబుతోంది. గాణాపత్యంలో గణపతిని"అత్యున్నత దేవతా మూర్తిగా" కొలుస్తారు.
ఎవరి జాతకము లోనైతే కేతు గ్రహ అనుగ్రహముంటుందో, వాడికే "ఉచ్ఛిష్ట గణపతి" ఫలిస్తుందని జైమిని సూత్రం. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనలో , న్యాస-హోమాదుల అవసరం లేకపోవచ్చును. మంత్రజపం, సహస్రనామ పఠనం వలన సిద్ధి కలుగును. అయితే ఏ ఉపాసనకైనా విశ్వాసము,భక్తి, శ్రద్ధాదులు మిక్కిలీ అవసరం.
ఉచ్ఛిష్ట గణపతి చిత్రాన్ని చూస్తే మనకు ఒక విచిత్ర భావం కలుగుతుంది. ఉచ్ఛిష్ట గణపతి తన దేవేరి యైన "నీలా సరస్వతి" పట్ల అభిమానంగా ఉంటాడు. ఇక్కడ నీలా-సరస్వతి అంటే మాతంగి గా అర్ధం చేసుకోరాదు. ఉచ్ఛిష్ట గణపతి పూజలో, గణపతి దేనినీ త్యజించడు. అతడు దేనినీ త్యజించడు. ఒకానొక స్థాయిలో శ్రీవిద్య, ఉచ్ఛిష్ట గణపతి విద్య సమాంతరంగా వెళతాయి. ఉచ్ఛిష్ట గణపతి విద్య, వామాచార విద్య కూడా. ఉచ్ఛిష్ట గణపతిని బౌద్ధంలో "రక్త గణపతి" అని కూడా అంటారు. బౌద్ధంలో రక్త గణపతి అత్యంత శక్తివంతుడిగా పేర్కొంటారు.
ఉచ్ఛిష్ట గణపతి తంత్ర సాధన, చాలా శక్తి వంతమైనది. కానీ కత్తి మీద సాము.
సేకరణ
No comments:
Post a Comment