Monday, 15 May 2023

136-142 stories


136. ‘జీవన్ముక్తి’.....

: *ఉర్వారుక మివ బంధనం అంటే...!!!*

*ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు.తీరికగా అలంకారాలు అద్దుతారు.తోచినంతసేపుహాయిగాఆడుకుంటారు.పొద్దువాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు.* *కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు.అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు.* *‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.* 

*"త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక మివబంధనా న్మృత్యో ర్ముక్షీయ మామృతాత్"*

*మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే.*

*‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో.* *ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది.* 

*పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.*

*అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు.*

 *దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.* 

*సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం.* 

*‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు.*   🙏🙏

****

137.ప్రాంజలి ప్రభ  ...మల్లాప్రగడ రామకృష్ణ ...ఇది జీవత సత్యo..21-02-2023 

నలభై ఏళ్ల వయసులో.. ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.

యాభై ఏళ్ల వయస్సులో.. అందమైన దేహం.. అందవిహీనం.. మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం.

 *ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.

*అరవై ఏళ్ల వయసులో..ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు. డెబ్బై ఏళ్లవయస్సులో..విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...

కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు. ఎనభైఏళ్ల వయస్సులో..

ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం. తొంభైఏళ్ల వయస్సులో. నిద్ర మెలుకువ రెండూ ఒకటే. 

సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం యాలోకూడా తెలియదు. అందంతో వచ్చే మిడిసిపాటు... ఆస్తులతోవచ్చే అహంకారం... పదవులతో గౌరవాన్ని ఆశించటం... కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం. సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే. అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ... అనుబంధాలను  పదిలపరుచుకుంటూ... జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!

 ఇది జీవత సత్యo

***

138 *మూసి ఉన్న గుప్పిట  కధ  ** 22-02-2023
 
మూసి ఉన్న గుప్పిటి , మూసి ఉన్న మనస్సు యితరులకు మంచి చేయలేవు . యితరులనుండి మంచిని స్వీకరించలేవు . " నేను - నాది " అనే స్థితి నుండి "మనము - మనది " అనే మహోన్నత స్థాయికి ఎదగాలి నేటి మానవాళి .

ప్రోత్సాహం కోసం ఎదురు చూడకుండా ఉత్సాహం తో మంచి
పనులు చేస్తూ ముందుకు పోవాలి . సంక్రమించిన ధనం తో సంతోషాన్ని పొందగలము . కానీ స్వయము కృషి తో సంపాదించిన ధనం తో ఆత్మ సంతృప్తి పొందగలము కలసి మెలసి జీవించడం బలం . ఒకరినొకరు కలబడటం బలహీనం . తాళంచెవి లేని తాళాలు ఉండవు . పరిస్కారం లేని సమస్యలు ఉండవు .మెల్లగా నడిచినా పర్వాలేదు .అడుగులు లక్యం వైపు ఉంటె గమ్యాన్ని తప్పక చేరుకోగలం .అసత్యం తో సాధించిన విజయం కంటే , సత్య మార్గం లో నడచి పొందిన ఓటమి గొప్పది . నేను - నాది , నువ్వు - నీది అనే ఈ నాలుగు పదాలు అనేక సమస్యలకు మూల కారణాలు లేనివారికి ఆకలి భాధ , ఉన్నవారికి యింకా కావాలనే బాధ . నిజానికి యిద్దరివి బాధలే .

ధనాన్ని సంపాదించడం యెంత కష్టమో , దానిని రక్షించుకోవడం కూడా అంటే కష్టము .గొప్పవారైనా మరణించక తప్పదు . కానీ గొప్పదనానికి మరణం ఉండదు.  క్షమా గుణం చేతకానితనం కాదు . క్షమించాలంటే కొండంత మనో బలం ఉండాలి . మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం , మనకు మనమే మిత్రులం . మనకు సమానమే శత్రువులం .మన సమస్యలకు , దుఃఖాలకు మనమే కారణం యితరులు కారణం అనుట దారుణం .

యితరులను జయించటానికి ప్రయత్నిమ్చుట కంటే నిన్ను నీవు జయించటానికి ప్రయత్నిమ్చు . మౌనం అంటే మాట్లాడకుండా ఉండటమే కాదు,  మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి . జ్ఞానాన్ని తెలుసుకోవడం యెంత ముక్ష్యమో , తెలుసుకొన్నజ్ఞానాన్ని జీవితం లో ఆచరించడం అంతకంటే ముఖ్యం .ధనం పరుల పాలు - కుటుంబ సభ్యులు , బంధువులు స్నేహితులు స్మశానం వరకు - శారీరం చితి పైకి - నీకర్మ ఫలితం మాత్రమే నీ వెంట వస్తుంది .

కర్మలను విత్తనాలతో పోల్చవచ్చును . ఏ విత్తనము వేస్తె ఆ ఫలమునే పొందుతాము . అలాగే నీవు చేసే కర్మలుఎటువంటివో అటువంటి ప్రారబ్దాన్ని పొందుతావు . ఒక రోజు పూర్తి అయింది అంటే , ఆయుస్సు లో ఒక రోజుతగ్గిందని అర్ధము . అందువలన సత్కర్మలు యెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది . తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     

--(())--

139 ప్రాంజలి ప్రభ .. "గేలం".  23-02-2023

*మనసు అనే బావిలోంచి గాలిస్తే వచ్చిన జ్ఞాపకం.

వెనుకటి రోజుల్లో మన ఇళ్లల్లో బావులు, బొక్కెన ల తో పాటే ఉండే ఇంకొక అతి ముఖ్యమైన సాధనం "గేలం".

బావిలో పొరబాటున బొక్కెన జారి పడినా, తాడు తెగి పడినా, గేలం గురించి వెతుకులాట మొదలయ్యేది. వెంటనే దొరికితే సరే సరి. కనపడకపోతే వెంటనే నిన్న, మొన్న చుట్టుపక్కల వారు ఎవరైనా తీసుకెళ్లి ఇంకా ఇవ్వలేదా అని ఆలోచించడం మొదలయ్యేది. 

ఎవరో ఒకరికి జ్ఞాపకం వచ్చేది ఫలానా నీలం డాబా పిన్నిగారు మొన్న తీసికెళ్లారు, లేదా ఫలానా  దొడ్డమ్మగారు తీసుకువెళ్లారు, ఇంకా ఇవ్వలేదు అని అనుకుంటూ ఇంట్లోని పిల్లగాళ్లనో, పనివాళ్ళనొ తరిమేవారు ఆ ఇంటికి. 

బోరింగులు,మోటార్లు,పంపులు లేని ఆ రోజుల్లో బావికి , బొక్కెన కి అంత విలువ ఉండేది. సరే, ఈ లోపుల గేలం వెతుక్కొని, పట్టుకొని ఆఘమేఘాల మీద వచ్చి ఏదో ఘనకార్యం చేసినట్లు సంబరపడేవాళ్ళం పిల్లగాళ్ళం.

ఇంక గేలం బావిలో వేసి బొక్కెన చిక్కించుకోవడం ఒక పెద్ద కళ.  బావి చుట్టూ చేరి నేనంటే నేను అని అందరం పోటీ పడేవాళ్ళం.చిన్నవాళ్ళకి ఒక పట్టాన గేలానికి దొరికేదికాదు. అటూ ఇటూ నీళ్ళల్లో తిప్పితే మట్టి లేచి నీళ్లు అన్నీ మురికి అవుతున్నాయని పెద్దవాళ్ళు గొడవ. 

బావిలో బొక్కెన తిన్నగా పడినా, పడి పక్కకి వాలినా కొంచెం ఈజీ గానే గేలానికి తగులుకునేది. బొక్క బోర్లా పడి నుంచుని ఉంటే మటుకు  చిక్కించుకోడానికి కొంచెం శ్రమ ఎక్కువే పడాల్సివచ్చేది. చిక్కినట్లే చిక్కి, శబ్దం చేసి పైకి లాగుతుంటే పట్టు తప్పి మళ్లీ కింద పడిపోయేది

మొత్తానికి గేలం కొక్కేలకి బొక్కెన తగులుకుంటే విజయానికి ప్రతీకగా అరుపులు ,కేకలు, ఈలలు.  బొక్కెన పైకి లాగేటప్పటికి దాని నిండా ఇంత మట్టి, నీళ్లు, అదృష్టముంటే అప్పుడెప్పుడో బావిలో పడిన గరిటెలు,చెంచాలు కూడా పైకి వచ్చేవి. బొక్కెన సాధించిన పిల్లగాడు/పిల్లది తాను ఎంత నేర్పుగా పట్టుకున్నాను చిలవలు పలవలు గా కథానికలు చెప్పేవారు.

బొక్కెన దొరికాక బావిలో నీటిలో లేచిన మట్టి మరల అడుక్కి చేరి నీరు నిర్మలం అయ్యేవరకు నీరు తోడేవారు కారు. తాడు తెగి తాత్కాలిక జల సమాధి అయి పైకొచ్చిన బొక్కెన కి , కొత్త తాడు కట్టి బావిలోకి దింపడంతో మళ్లీ  యధావిధిగా కార్యక్రమాలు మొదలయ్యేవి.  బావిలోకి దిగి బొక్కెన ని గాలించి పట్టి, విజయవంతంగా పైకి తీసుకువచ్చిన గాలం గారిని నెమ్మదిగా దాని యధాస్థానం లోకి పంపించి చేతులు దులుపుకునే వాళ్ళం.

ఈ కార్యక్రమం అంతా అయ్యేవరకు నూతి గట్టు ఎంతో హడావుడి, ఎంతో కోలాహలంగా ఉండేది.ఆప్పట్లో ఇంటినిండా పిల్లలే గదా!

 ఇప్పటి యువతరానికి ఈ రాతలు కొత్తగాను, వింత గానూ ఉండవచ్చు. కానీ మా తరానికి మటుకు ఇవన్నీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు కింద లెక్క.

........


140 ప్రాంజలి ప్రభ ....అసలు రహస్యం - నేటి కథ.. 24-02-2023 

పూర్వం ఒక బ్రతకనేర్చిన వ్యక్తి ఉండేవాడు. అతను జ్ఞాని కాడు. కానీ  గురువులా వేషం వేశాడు. తనను ‘మౌన గురువు’గా ప్రకటించుకున్నాడు. తన దగ్గరకు ఎవరు వచ్చినా, ఏది అడిగినా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఏవో కొన్ని సైగలు చేసేవాడు. అతనితో పాటు పండితులైన ఇద్దరు సన్యాసులు అన్ని సమయాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అన్ని శాస్త్రాలనూ చదివిన వాళ్ళు. మంచి వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు. తమ మాటలతో జనాన్ని నమ్మించడంలో నిపుణులు. ఆ మౌన గురువు ఏ సైగ చేసినా, ఏ కేక వేసినా అందులో ఎంతో అంతరార్థం, పరమార్థం ఉన్నాయని చెప్పేవారు. అజ్ఞాని అయిన ఎంతో గొప్పవాడనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించారు.

ఆ గురువు ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది. అతణ్ణి దర్శించి తరించాలనీ, తమ సందేహాలు తీర్చుకోవాలనీ, ఆశీస్సులు పొందాలనీ దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఎందరెందరో వచ్చేవారు. ఎవరు ఏది అడిగినా ఆ మౌన గురువు చేతులు ఊపడమో, కాళ్ళు కదిలించడమో, కళ్ళు మూసుకోవడమో, ఎగరడమో, దుమకడమో, కేకలు వేయడమో చేసేవాడు. అతనికి అంతకన్నా మరేదీ తెలీదు. కానీ అతని దగ్గర ఉన్న పండిత సన్యాసులు తమ తెలివినంతటినీ ఉపయోగించి... ఆ చేష్టల్లో ఏదో పరమార్థం ఉందన్నట్టు... గొప్పగా వివరించేవారు. వచ్చిన వ్యక్తులు అది చూసి ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ పొందేవారు. వారిలో ఆ గురువు పట్ల గౌరవం విపరీతంగా పెరిగిపోయేది. అతనికి ధన, కనక, వస్తు, వాహనాలు సమర్పించేవారు. తమ జన్మధన్యమైందనుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేవారు. 

ఒకసారి ఆ ఇద్దరు సన్యాసులకూ ఏదో పని పడింది. త్వరలోనే తిరిగి వస్తామంటూ... మౌన గురువును ఒంటరిగా వదలి వెళ్ళారు. మరికొంతసేపటికి... ఆ గురువు గొప్పతనం గురించి విన్న ఒక జిజ్ఞాసువు... తన సందేహాలను తీర్చుకోవడానికి అతణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. మౌన గురువుకు నమస్కరించి... ‘‘మహాశయా! బుద్ధత్వం అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.

తన పండిత సన్యాసుల కోసం మౌన గురువు అటూ ఇటూ చూశాడు. వారు కనబడకపోవడంతో... వారు ఎక్కడికో వెళ్ళిన సంగతి గుర్తుకువచ్చి.. ‘లేరు, లేరు’ అని మనసులో అనుకుంటూ... తన రెండు చేతులనూ అటూ ఇటూ తిప్పాడు. 

ఆ వచ్చిన వ్యక్తి మరి కొన్ని ప్రశ్నలు వేశాడు. మౌన గురువు తనకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో చేశాడు. ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా, సంతృప్తిగా, వికసించిన ముఖంతో వెనుతిరిగాడు. ఈలోగా పండిత సన్యాసులు గాభరా పడుతూ అతనికి ఎదురువచ్చారు. 

ఆ వ్యక్తి వాళ్ళతో ‘‘ఈ మౌన గురువు ఎంత గొప్పవాడండీ! వాళ్ళూ, వీళ్ళూ చెబితే నేను నమ్మలేదు. కానీ ఈ రోజు ఆయనను ప్రత్యక్షంగా చూసి, ప్రశ్నించి, పరీక్షించి, వారి గొప్పతనాన్ని తెలుసుకోగలిగాను’’ అన్నాడు. ఆ సన్యాసులు ఆశ్చర్యపోయారు. ‘‘మీరు ఆయన్ని ఏం అడిగారు? దానికి ఆయన ఏమని సమాధానం ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు.

‘‘నేను ‘బుద్ధత్వం’ అంటే ఏమిటి? అని అడిగాను. ఆయన అన్ని దిక్కులనూ చూసి, చేతులు ఇలా ఊపాడు. అలా చేయడం ద్వారా... బుద్ధత్వం కానీ, బుద్ధుడు కానీ బయట ఎక్కడా కనిపించేవి కావని బోధించాడు. ఆ తరువాత ‘ధర్మం అంటే ఏమిటి?’ అని అడిగాను. ఆయన ఆకాశం వైపూ, నేల వైపూ చూపించాడు. అలా ‘భూమ్యాకాశాలకు ఆధారమైనది ధర్మం’ అని తెలిపాడు. ‘ధ్యానం అంటే ఏమిటి?’ అనే ప్రశ్నకు... కళ్ళు మూసుకొని, కొయ్యబొమ్మలా కూర్చొని... ధ్యానం అంటే ఏమిటో చక్కగా అవగతం అయ్యేలా చేశాడు. గురువు అంటే అలా ఉండాలి. గురువంటే ఆయనే... ఆయనే జ్ఞాని, ఆయనే బుద్ధుడు’’ అంటూ మౌన గురువు వైపు చూసి, చేతులు జోడించి, నమస్కరించి వెళ్ళిపోయాడు.

పండిత సన్యాసులు పరుగుపరుగున మౌన గురువు దగ్గరకు వెళ్ళారు. అతను వాళ్ళను చూసి ‘‘ఇంతసేపూ ఎక్కడికి పోయారు? వాడు వేసిన ప్రశ్నలకు దిక్కు తోచక చచ్చాను’’ అన్నాడు.

అసలు రహస్య యేమిటంటే వచ్చినవారి పేరు, ఊరు, చిరునామా, ఫోన్ నెంబరు   ముందుగా వ్రాయించేవారు, మరునాడు వారి ఫోన్ అకౌంట్లో కొంతపైకము పంపే వారు, అక్కడ వున్న వారికి వచ్చిన వాటిలో కానుకలు కొన్ని పంచేవారు, ఏరోజు కారోజు వచ్చిన వాటిలో ఒక భాగం ఉంచి మొత్తం పంచేవారు. తీసుకున్న వారు ఊరు కుంటారా పొందినవాళ్లు మరలా దానిలో కొంత మరునాడు ఇవ్వటం మొదలు పెట్టారు, మౌన గురువు లాంటివారిలో లేని గొప్పతనం ఎందరి బ్రతుకుల్లో సుఖం నింపింది 

బ్రతకటం కాదు బ్రతికించటానికి చదువక్కరలేదు, యుక్తి చాలు.

****

141. ప్రాంజలి ప్రభ.....దొంగలున్నారు జాగర్త

రాజు, రాణి అప్పుడే రైలు దిగి స్టేషన్ బైటకు వచ్చారు. వీళ్ళు దిగవలసిన హోటల్ రోడ్డుకు అటువైపు ఉంది.

వన్ వే ట్రాఫిక్ వల్ల చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆటోవాడు ఎక్కువ అడుగుతున్నాడు.

'సరేలే, ఈ కాస్తే కదా! ఉన్నది ఒకటే సూట్ కేసు. ఈ మాత్రం దానికి మళ్ళీ ఆటో ఎందుకు?' అనుకుని రాజు ఆ సూట్ కేసును చేత్తో పట్టుకుని నడుస్తున్నాడు.

"చక్కగా చక్రాల సూట్ కేస్ కొనుంటే ఈ బాధ తప్పేది కదా?" అన్న రాణి మాటలు అసందర్భంగా తోచాయి రాజుకి.

మాట్లాడకుండా నడుస్తున్నాడు.

ఇంతలో రాణి "ఇదుగో, ఆ బోర్డు చూడు" అన్నది.

రాణి చూపించినవైపు చూసాడు రాజు.

'ప్రయాస పడి సమస్త భారములను మోయుచున్న జనులారా, నాయొద్దకు రండి. మిమ్ము తేలిక పరచెదను' అని ఉంది.

"మనం కష్టపడి సూట్ కేస్ మొయ్యడం ఎందుకు? ఆయనకిస్తే మోస్తాడేమో, కనుక్కుందాం పద" అన్నది రాణి.

బుఱ్ఱ ఏ మాత్రం వాడే అవసరం లేని రాజు, రాణిని అనుసరించాడు.

ఇద్దరు లోపలకు వెళ్ళారు. తెల్ల బట్టలాయన ఎదురొచ్చి "ఏం కావాలి బిడ్డలారా?" అని అడిగాడు.

రాజు, రాణి తమ సూట్ కేసు భారం గురించి చెప్పారు.

"మీరు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేయుడి. మిమ్ములను తేలిక పరచెదను" అన్నాడు ఆ తెల్ల బట్టలాయన.

ఇద్దరూ కళ్ళు మూసుక్కూచున్నారు కానీ ప్రార్ధన ఎలా చేయాలో తెలియలేదు.

ఐదు, పది నిముషాలు గడిచింది.

రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి చూసాడు. ఆ తెల్ల బట్టలాయన కనపడలేదు.

'ఏమయ్యాడబ్బా?' అనుకుంటూ లేచి చుట్టూ చూసాడు.

ఇంతలో రాణి కూడా కళ్ళు తెరచింది.

"ఇదుగో, నిన్నే. ఆయన ఎటో పోయినాడు కానీ మనం పోదాం పద" అన్నది.

రాజు సూట్ కేస్ అందుకున్నాడు.

తేలికగా ఉంది.

"ఆహా, ఏమి మహిమా? నిజంగానే తేలిక పరచినాడు" అన్నాడు రాజు.

"తేలిగ్గా ఉందా? ఏదీ, నన్ను సూణ్ణీ" అంటూ సూట్ కేస్ తెరచి చూసింది రాణి.

ఇంకేముంది? సూట్ కేస్ ఖాళీ ....

'ఓరీడెమ్మా .... తేలిక పరచడం అంటే ఇదా? భారం మోస్తాడంటే ఇంకేదో అనుకున్నా' అనుకుంటూ, ఆ బోర్డు చూపించిన రాణిని ఏమీ అనలేక, మింగలేక, కక్కలేక ఖాళీ సూట్ కేసు పట్టుకుని నడవసాగాడు రాజు.

"నేను కళ్ళు మూసుక్కూసుంటే నీ కళ్ళు దొబ్బాయా?" అంటున్న రాణి మాటలు వినపడనట్లే నడుస్తున్నాడు రాజు.

బోర్డు చూసి మోసపోకండి..... కష్టపడటం నేర్చుకోండి..........

నీతి : మన సామాను మనమే మోసుకోవాలి. బరువైతే కూలీని పెట్టుకోవాలి. అంతేకానీ 'ఉచితంగా మోస్తాన'న్నవాణ్ణి నమ్మితే ఖాళీ సూట్ కేసులే మిగుల్తాయి.

లోకం మారింది బతక నేర్చుకోవటానికి TV లు చూపిస్తున్నారు.

మేధావులున్నారు జాగర్త మేతావులు గా మారకండి.

  ...........

142 సందర్భం వచ్చినది గనుక సిద్ధులగురుంచి పరిశీలిద్ధాము.

అష్ట సిద్ధులు

అణిమ– అతి చిన్న వాడిగా మారిపోవడం

మహిమ – పెద్ద రూపం పొందడం

గరిమ – బరువుగా మారడం

లఘిమ– తేలికగా మారిపోవడం

ప్రాప్తి  - ఇంద్రియాల అధిష్ఠాన దేవతల్ని దర్శించడం, ఏదౖైెనా ఎక్కడైనా పొందగలగడం

ప్రాకామ్య – కోరుకున్న పదార్థాల్ని దర్శించి అనుభవించే సామర్థ్యం పొందడం

ఈశిత్వ – జ్ఞాన వీర్యాదుల ప్రకోప శక్తి, సృష్టిపై ఆధిపత్య శక్తి

వశిత్వ – విషయ భోగాల నుంచి రక్తిని పొందడం, అన్నిటిపై ముఖ్యంగా పంచ భూతాలపై నియంత్రణ

కామావసాయత- సమస్త కోరికల ఉపశమనం

 ఈ అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.

అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణకు లంకలో ప్రవేశించేటపుడు చిన్న వాడిగామారి ప్రదర్శించాడు.

మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు. ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు. ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచ డం కనిపిస్తుంది.

ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు.

గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకెగిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మారడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.

భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.

లఘిమా అంటే తేలికగా అయిపో వడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.

ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.

ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. 

దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయం ఒక సిద్ధుడు తారసపడ్డాడు. తనకు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు.

ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పు రుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు😁😁😁

 సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా జగన్మాత అనుగ్రహం వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.

కాని జగన్మాతను ఆరాధిస్తే మనకు ఏవి అవసరమో, ఏ శక్తులు వశంచేస్తే మనకు ఉపయోగము ఉంటుందో, మన దీక్షా సామర్థ్యం ఎంత ఉందో ఆ మేరకు ఆతల్లి అనుగ్రహిస్తుంది. ఏ కోర్కె అయినా ధర్మబద్ధంగా ఉండాలి.…

---((())__


No comments:

Post a Comment