167 *నేటి ప్రాంజలి ప్రభలు
*భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు కలకసి మెలసి జీవించేవారికి, ఉన్నది పంచుకుని తినేవారికి తప్పక లభిస్తుంది।
*బలం బలగం పైకం పైరవీలన్నీ తప్పటడుగులు పడితే తరిగిపోవు విలువైన విషయజ్ఞానం।
* ఓ ఉత్తములారా! భోగవాసనను హృదయుమునుండి పారద్రోలుడు! ఆ భోగములకొఱకుగాను ద్రవ్యలేశముచే నేమి ప్రయోజనము?
* భిన్న భిన్న భావావలంబులయొక్క ప్రేరణచే జనుచు పశుత్వమును బొందరాదు।
*దౌర్భాగ్యదాయకమును, నీచమును, అశుభమునగు (పుత్ర మిత్ర ధన పశు క్షేత్రాది రూప) సాంసారిక విచారణ అనునది ఘనీభూతమైన దీర్ఘమహానిద్రయే యగును। అద్దానిని త్యజించివైచి లెస్సగ ప్రబుద్ధులు కండు! అజ్ఞాననిద్ర నుండి మేలుకొనుడు!
__((())__
* రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
*. పతివ్రతా ధర్మములు
భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును
(45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు
(46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు
(47) బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను
(48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును
(49) తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను
(50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను
(51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును
(52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును
(53). ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును
(54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును
(55). భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).
సశేషం....
🌹 🌹 🌹 🌹
***
*ఓం నమః శివాయ*:
*ఇచ్చాశక్తి - జ్ఞానశక్తి - క్రియా శక్తి.*
*మన జీవితంలో జరిగేవి - జరగనివి*
*సాధారణంగా మన జీవితాల్లో మనకి బాగా ఇష్టం అయిన కొన్నిటిని మనం కోరుకుని అవి కావాలి రావాలి అనుకుంటే రావు. ఒక వేళ ఏదో రకంగా వచ్చినా ఉండవు. ఒక వేళ ఉన్నా అవి మనతో ఇంత కాలం ఖచ్చితం గా ఉంటాయి అని చెప్పలేము. అలాగే మనకి ఇష్టం లేని వాటిని లేదా మనకి కష్టం కలిగించే వాటిని అవి ఏలాంటి విషయాలైనా కావచ్చు లేక మనుషులే కావచ్చు, వాటిని లేదా వాళ్ళని మన నుంచి దూరంగా పోవాలి అనుకుంటాము. పోతే బాగుండు అనుకుంటాము. కానీ అవి పోవు .. వాళ్ళు పోరు. అవి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. ఒక వేళ అవి తాత్కాలికంగా పోయినా మళ్ళీ తిరిగి వస్తుంటాయి. రావచ్చు కూడా. మన దగ్గర నుంచి పోవడానికే వచ్చినవి మనం వాటిని గట్టిగా పట్టుకున్నా, పట్టుకోవాలని ప్రయత్నించినా అవి ఉండవు. అలాగే మన దగ్గర ఉండటానికి వచ్చినవి మనం వాటిని ఎంత వదిలించు కుందామని ప్రయత్నం చేసినా అవి ఓ పట్టాన వదిలి పోవు. ఇలా మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేని ఈ రాకపోకల మధ్య లోనే మనం కష్టనష్టాలకు గురి అవుతు, సుఖ దుఃఖాల మధ్య పరిభ్రమిస్తూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియని స్థితి లో కొట్టు మిట్టాడుతూ ఉంటాము.*
*ఈ ప్రపంచంలో కొంతమంది ఏమీ లేకపోయినా ఉన్నవాటితో తృప్తిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎన్ని వున్నా ఇంకా ఇంకా ఏవేవో కావాలనే అసంతృప్తితో ఉన్న వాళ్ళూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అలా అసంతృప్తి గా ఉండటం కేవలం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లనే. మనం కోరుకునే ప్రతి ఐహిక సుఖము దుఃఖం అనే కిరీటాన్ని ధరించిగాని మన దగ్గరకి ఎన్నడూ రానే రాదు. జీవితంలో ఏది కోరుకోవాలో ఏది కోరుకో కూడదో ఏది మనకి తగినదో ఏది మనకి తగదో అన్న విచక్షణ జ్ఞానం లేక పోవడం వల్లే మనం తరచు కష్టాలకి గురయ్యేది.*
*పరమాత్మ మనిషికి పుట్టుక తోనే మూడు రకాల శక్తులు ఇచ్చాడు. అవి ఒకటి ఇచ్చాశక్తి,రెండుజ్ఞానశక్తి, మూడు క్రియాశక్తి.*
*ఒకటవది ఇచ్చా శక్తి :-*
*అంటే ఏదైనా కోరుకునే శక్తి లేదా దేనికైనా సంకల్పించే శక్తి. ఈ ప్రపంచం లో కోరికలు లేకుండా ఎవరూ ఉండరు. ఆఖరికి దేవుళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. మహా ఋషులకి సైతం కోరికలు ఉంటాయి. అయితే వాళ్ళ కోరికలు అన్నీ నిస్వార్ధం గా ఉండి, భగవత్ కార్యాలపై దృష్టి కలిగి, సర్వ మానవాళికి శ్రేయస్సు కలిగించేవి అయి ఉంటాయి. అలాంటిది మామూలు మనుషులు గా పుట్టిన మనకి ప్రాపంచిక మైన కోరికలు ఉండటంలో ఏ మాత్రం తప్పు లేదు. కోరికలు లేనిదే, మనసులో “ఇచ్చ” అనేది లేనిదే మనం ఏ కర్మ చేయలేము. అయితే మనం ఇక్కడే పొరపాటు చేస్తుంటాము. మనం ఏది కోరుకున్నా భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు కాని మనం కోరికునే కోరికలు అన్నీ భగవంతుడి నియమానికీ, ఈ ప్రకృతి నియమాలకి వ్యతిరేక మైనవిగా ఉండకూడదు. ఇక్కడ మన విచక్షణ గనకా బలహీనం అయితే మనం శాశ్వత మైన ఆనందాన్ని ఇచ్చేవి కాకుండా అనిత్య మైనవి, అశాశ్వతమైన వాటినే మనం ఎక్కువగా కోరుకుంటాము. మనకున్న జ్ఞానశక్తి గనకా బలహీనంగా ఉంటే మనకు నిజంగా ఏది అవసరమో ఏది అనవసరమో సరిగ్గా గ్రహించలేము. అనవసరమైనవి అన్నీ కోరుకుని వాటిని పొందే ప్రయత్నంలో వాటిని నిలుపుకొనే ప్రయత్నం లో అనేక కష్టనష్టాలు కొనితెచ్చు కుంటాము. మనం కోరుకున్న వాటివల్ల మనం అనేకమైన బాధలు పడుతూ ఇతరుల అసూయా ద్వేషాలకి గురి అవుతూ ఎన్నో కష్టాలకి అవమానాలకి గురి అవుతూ చివరికి మనం కోరుకున్న వాటివల్ల ఏ సుఖము లేదని గుర్తించే స్థితికి వెళ్తాము.*
*రెండవది జ్ఞానశక్తి :-*
*ప్రతి మనిషికి సహజంగా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అది ఎంత ఉందన్నది, ఏ విషయానికి సంబంధించింది ఉందన్నది వేరే విషయం. మనకి మనసు అంటూ ఒకటి ఉంది గనకా మన దగ్గర కొద్దో గొప్పో మన పూర్వజన్మ సంస్కార పరంగా వచ్చిన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉంది గనకనే మనం కోరుకుంటాము. అదే ఇచ్చాశక్తి అనబడుతుంది. మనకి జ్ఞానశక్తి కూడా ఉంది గనకనే మనకి ఇచ్చాశక్తి కూడా ఉంది. ఎంతో కొంత జ్ఞానం లేకుండా మనకి తెలియని విషయాలని మనం కోరుకోలేము. మనకు తెలిసున్నవిషయాలని, వస్తువులని కోరుకోగలము గాని ఎప్పుడో కొన్ని సంవత్సరాల తరవాత రాబోయే వాటిని మనం ఇంకా చూడని విషయాలని వస్తువులని మనం ఇప్పుడే కోరుకోలేము. మనం ఏది కోరుకున్నా దేన్నీ ఆశించినా మనకి తెలిసున్న దాన్ని మనకి అనుభవంలో ఉన్నదాన్నే కోరుకుంటాము గాని మనకి తెలియని దాన్ని మన అనుభవంలో లేని దాన్ని కోరుకోలేము. ఈ విధంగా కోరుకోడానికి ఆధారమైనదే జ్ఞానశక్తి.*
*మూడోది క్రియాశక్తి :-*
*మనం దేన్నీ అయితే కోరుకుంటామో దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం మనం పడే శ్రమ దీన్నే క్రియాశక్తి లేదా కర్మ అంటారు. ఇది అందరికీ ఉంటుంది. కేవలం మనుషులకే కాదు అన్ని జీవరాసులకి ఉంటుంది. చిన్న దోమ కూడా దాని జ్ఞానశక్తి తో కలిగిన కోరికని తీర్చుకునేందుకు దాని క్రియాశక్తి ని ఉపయోగిస్తుంది. దోమకి తెలుసు ఎవరిని కుట్టాలో .. దేన్నీ కుట్టాలో. మనం ఒక కుర్చీలో కూర్చుంటే దోమ వచ్చి మనల్ని కుడుతుంది కాని కుర్చీని కుట్టదు. ఎందుకు ? దానికి తెలుసు చెక్క లోనుంచి దానికి కావలసిన రక్తం రాదనీ. అదే దానికి ఉన్న జ్ఞాన శక్తి. కుట్టాలి అన్నది దాని కున్నఇచ్చా శక్తి. సరిగ్గా అదను చూసి మనల్ని కుట్టడం అన్నది దాని క్రియా శక్తి. దాని క్రియా శక్తి లో అది పక్కా గా ఉంటుంది. మనం దోమ తెర వేసేలోపే అది లోపలకి దూరి పోగలదు. కాబట్టి మనిషి తో పాటు జీవులకి కూడా ఎంతో కొంత జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి భగవంతుడు ఇచ్చాడు. అయితే సమస్య ఏంటంటే జంతువులతో పాటు మనకి కూడా ఈ జ్ఞానశక్తి అనేది పరి పూర్ణంగా ఉండదు. మనకి జ్ఞానశక్తే గనక పూర్తిగా ఉంటే మనకి ఏ సమస్యలు రావు వచ్చే అవకాశమే ఉండదు. మనకి జ్ఞానశక్తి అనేది పరిమితం గానే ఉంది పూర్తిగా లేదు. మనకి ఆ జ్ఞానశక్తి వంద శాతం పూర్తిగా పనిచేయదు. మనం ఎన్నో విషయాలని ఇది ఇలా జరుగుతుంది లేదా ఇలా మారుతుంది అని ఎన్నో రకరకాలుగా ఊహిస్తాము, కాని అవి మన ఊహల్ని తల్లకిందులు చేస్తూ వేరే రకంగా జరుగుతూ ఉంటాయి. నిజంగా మన జ్ఞానశక్తి పరిపూర్ణంగ గనక పనిచేస్తే మనం ఒక పని లేదా ఒక కోరిక కోరుకోవడం వల్ల దాన్ని తీర్చుకునే ప్రయత్నం లో మనకి జరగబోయే నష్టం గనకా ముందుగా తెలిస్తే మనం ఆ పని పొరపాటున కూడా చేయము. తెలిసి నష్టం తెచ్చుకోము. మనం చేయబోయే పని వల్ల వచ్చే ఉపద్రవం మనకి పక్కాగా ముందే తెలిస్తే గనకా మనం ఆ పని చేసే అవకాశమే లేదు. సమస్యలో ఇరుక్కునే ప్రసక్తే ఉండదు.*
*ఉదాహరణకి మనం ప్రయాణం కి వెళ్ళ వలసి వచ్చినప్పుడు ఆ ప్రయాణం లో మనకి ఫలానా చోట ఫలానా ప్రదేశం లో మనం ప్రయాణం చేసే వాహనానికి ప్రమాదం జరిగి అందరితో పాటు మనం కూడా తీవ్రంగా గాయ పడతాము అని గనక మనకి ముందే తెలిస్తే మనం ఆ ప్రయాణం మానుకుంటాము.*
*ఇతరుల సలహాలు విని అవి నిజంగా వాళ్ళు చెప్పినట్టే లాభాల్ని కలిగిస్తాయని నమ్మి మనం ఎన్నో పనులు చేస్తుంటాము, కాని చివరికి అవి వాళ్ళు చెప్పినట్టుగా జరగవు. ఈ సంబంధం మంచిది అని చెప్తారు చేస్తాం కానీ వివాహం అయిన కొన్నాళ్ళకే కలహాలతో విడిపోతారు. ఫలానా సంస్థ లో దాంట్లో డబ్బులు దాస్తే వడ్డీ ఎక్కువ వస్తుందని దాస్తాము, కాని ఒక రోజు హఠాత్తుగా ఆ సంస్థ మాయమై పోతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలలో మన జ్ఞానశక్తి పనిచేయదు. అలా జరుగుతుందని ముందే తెలిస్తే మనం అసలు నష్టం కలిగించే పనులు చేయనే చేయం. లాభం జరుగుతుందని చెడ్డపని చేసినా దానికి మంచి ఫలితం రాక పోవచ్చు. పోనీ మంచి జరుగుతుందని మంచి పని చేసినా దానికి నష్టం జరగోచ్చు.*
*మనం స్వార్ధం ప్రయోజనం కోసం చేసే ఒక పనిలో మనం విజయ పధం లో నడుస్తూ ఉంటే .. అది అంతా నావల్లె నడుస్తోంది అనుకుంటాము. కాని నడిచేది కేవలం మన అహంకారం మాత్రమే. మనం అనుకున్నది జరగక పోవచ్చు. కాని జరిగే వాటిని ఎవ్వరూ ఆపలేరు. మనం ఆశించింది మనకి రాకపోవచ్చు కాని మనకి రాబోయే ఒక లాభాన్ని గానీ నష్టాన్ని గానీ సుఖాన్ని గానీ దుఃఖాన్ని గానీ మనకి దక్కకుండా ఆఖరికి ఆ భగవంతుడు కూడా అడ్డు పెట్టి ఆపలేడు అన్నది ఈ సృష్టి లో ఉన్న పరమాద్భుత మైన సత్యం.*
......
మల్లాప్రగడ రామకృష్ణ: 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*👌🏻హిత వాణి👌🏻*
*శ్లో|| సతాం సాప్తపదీ మైత్రీ ౹*
*సత్సతాం త్రిపదీ మతా ౹*
*సత్సతా మపి యే సన్తి ౹*
*తేషాం మైత్రీ పదే పదే ౹౹*
*భా|| "సంబంధం సాప్తపదీనమ్" అని ప్రసిద్ధి. ఏడడుగులతో ఎలాంటి బంధమైనా ఏర్పడుతుందని అర్థము. సజ్జనులతో ఏడడుగులు నడిచినా, ఏడు మాటలు అన్నా, విన్నా , కన్నా ఇట్టే మైత్రీభావం ఏర్పడుతుంది.*
*అదే సజ్జన శ్రేష్ఠులతో నైతే కేవలం మూడు అడుగులు గాని, మూడు మాటలు గాని సరిపోతాయి. వెనువెంటనే గాఢమైన స్నేహ భావం స్థిరపడుతుంది.*
*ఇక సజ్జన శ్రేష్ఠులలో అగ్రేసరులతోనైతే స్నేహబంధం అడుగడుగునా ఏర్పడుతుంది. ఒక అడుగులో, ఒక మాటలోనే ఏర్పడి చిరకాలం కొన సాగుతుంది.*
*ఇదే దుర్జన స్నేహబంధం శరత్ కాల మేఘము వలె త్వరగా ఏర్పడినా, క్షణంలో తేలిపోతుంది....*
*కాన సజ్జన దర్శనము, స్పర్శనము, భాషణము మన సకల పాపాలను, తాపాలను, దైన్యాన్ని బాపగల సామర్ధ్యము కలిగినవి.*
*నారదుని సత్సంగం వల్ల ఒక కీటకము పావురముగాను, లేగదూడగాను, రాజన్యునిగాను జన్మాంతరాలను పొంది జన్మ సార్ధక్యత పొందగలిగింది. నేటికి వివాహ ప్రక్రియలో "సప్తపది" పేరిట మూడుముళ్లు, ఏడడుగులు, మూడుప్రమాణాలతో స్త్రీ పురుషులు అన్యోన్యప్రేమ, అవినాభావసాహచర్యములో నూరేండ్ల పంట పండించుకోవడం సనాతన సంప్రదాయంగా వస్తున్నదే. సజ్జన సాంగత్యం చిరకాలం కొనసాగించాలనేదే మానవ జీవితానికి అర్థము. పరమార్థము....🙏🏻*
*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*
15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి ఒక పండితుడు షేర్ చేసి వారు చేసిన కృషియే ఈ అక్షర రూపం
1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని
ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!
2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)
3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!
4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!
5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!
6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!
7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....
అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.
వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.
అందరూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏
***
పరమాత్ముడు వెలిగే! - వాగధీశ్వరి
ఉపోద్ఘాతము:
త్యాగరాజస్వామి రచించిన కృతులలో అత్యద్భుతమైన చిత్రకావ్యములుగా పేర్కొనదగిన వాటిలో "పరమాత్ముడు వెలిగే" అన్న ఈ కృతిని సర్వశ్రేష్టమైనదానిగా నేను భావిస్తాను. ఈ కృతిలో త్యాగరాజస్వామి విశ్వరూపసందర్శనం తానుచేసి, మనచేకూడా చేయిస్తారు.
ఇందు ఆయన తన ఇష్టదైవమైన రామునినో లేక శంకరునో, గౌరినోకాక, అన్ని దేవతా స్వరూపములయందూ అంతర్లీనముగా ప్రకాశించే పరమాత్ముని దర్శించారు.
శివస్వరూపుడైన పరమాత్ముడు, సర్వవ్యాపియనే సత్యాన్ని, అత్యంత సుందరముగా వాగధీశ్వరి రాగములో వర్ణించి, త్యాగరాజస్వామి తన హృదయములో దర్శించిన "సత్యమ్-శివమ్-సుందరమ్" అను మూడు పరమాత్మ స్వరూపములను, మన హృదయములోకూడా నిలిచేటట్లు చేస్తారు.
ఈ కృతిలో త్యాగరాజస్వామి అద్భుత, శాంతరసములను ఆవిష్కరించారు
నవరసములనబడు అద్భుత, వీర, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, భయానక, భీభత్స, శాంత రసములలో, అన్నిటికంటే గొప్పది శాంతరసమని ఆనందవర్ధనునివంటి పండితుల అభిప్రాయము.
పరమాత్మచే సృష్టించబడిన ఈ విశ్వమంతా తొలుత శాంతరసముతో నిండివుంటుంది. ఈ శాంతరసమునుండే తక్కిన రసములు ఉద్భవిస్తాయి. తుదకు ఆ రసములన్నియూ శాంతరసములోనే లీనమైపోతాయి. కాబట్టి శాంతమన్నది ఒక రసముకాదు, అది నవరసముల సమ్మేళనము. కావున శాంతమే సర్వోత్కృష్టరసమని ఆనందవర్ధనులు ఋజువుచేశారు.
ఈ విషయములో ప్రకృతిపరమైన ఉదాహరణను తీసుకుంటే, మనకు కనబడే సూర్యకిరణములన్నీ శ్వేతవర్ణములో వుంటాయి. కాని కాంతి విక్షేపణము(Dispersion of Light) ద్వారా మనము ఆ సూర్యకిరణములలో అంతర్లీనమైయన్న సప్తవర్ణములనూ చూడగలము. అదే ప్రక్రియద్వారా తిరిగి ఆ సప్తవర్ణములూ శ్వేతకాంతిగా మారడం కూడా మనకు విదితమే. చిత్రకళలో శ్వేతవర్ణము శాంతికి సంకేతముగా వాడబడుట గమనార్హము.
ఈ శాంతరసమునుండి ఉద్భవించే మొదటిరసము అద్భుతరసము. ఈ సృష్టిలోని ఏ వస్తుశక్తివిశేషమునైనా ప్రప్రథమముగా పరిశీలించినపుడు అది మనకు అద్భుతముగా గోచరించును. ఇది అద్భుతరసానుభవములో ప్రాథమికస్థాయి. ఆ వస్తుశక్తివిశేషముపై అవగాహన పెరిగిన పిదప అది మనకు ఇంక అద్భుతముగా కనబడదు. కాని పరమాత్మయొక్క విశ్వరూపసందర్శనం అట్లుకాదు. అది నిరంతరమైన నిరవధికమైన ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతము. కనుక ఇది అద్భుతరసానుభవములో అత్యుత్తమస్థాయి.
సర్వోత్తమమైన ఈ అద్భుతరససిద్ధి పరిపూర్ణజ్ఞానులకు మాత్రమే సాధ్యము.
ఈ కృతిలోని సాహిత్యాన్ని గమనిస్తే, త్యాగరాజస్వామి పరమాత్మస్వరూపాన్ని తొలుత బహిర్ముఖుడై అందరిలో, అన్నింటిలో, పిదప అంతర్ముఖుడై తనలోనే దర్శించారు. ఈ దర్శనముతప్ప ఆయన ఇంకేకోరికనూ పదర్శించలేదు. కాబట్టి ఇది త్యాగరాజస్వామి నిష్కామచిత్తమును సాధించిన తరువాత రచించిన కృతిగా తేటతెల్లమౌతుంది.
ఈ కృతిలోని ఆద్యంతరసములైన అద్భుత శాంతరసములను దీప్తిమంతం చేయడానికి ఆయన ఎంచుకున్న వాగధీశ్వరి రాగం ఒక వాగ్గేయకారునిగా, సంగీతకళాస్రష్టగా ఆయన భావనాపటిమకు పరాకాష్ట. ఈ వివాదిరాగముద్వారా ఆయన ఆవిష్కరించిన పరమాత్ముని పరమాద్భుత వర్ణచిత్రము అత్యంత హృద్యముగా ఉంటుంది.
ఈ కృతిలోని త్యాగరాజహృదయాన్ని పరిశీలిస్తే, పరిపూర్ణజ్ఞానిగా, నిష్కామయోగిగా, స్వరార్ణవాన్ని మథించిన పరిపూర్ణకళాకారునిగా ఆయన మనకు దర్శనమిస్తారు.
ప. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే (పరమాత్ముడు)
ఈ కృతియొక్క పల్లవిని పరిశీలిస్తే, సత్యమ్-శివమ్-సుందరమ్ అయిన పరమాత్ముని తెలుసుకొమ్మని మానవాళిని ఉద్బోధించారు.
పరమాత్ముడు - శివమ్, ఆయన యొక్క వెలుగు - సత్యమ్ , ఆయన వెలిగే ముచ్చట - సుందరమ్, ఈ కృతి అంతా, క్రింది శ్లోకములోని సత్యమును, సుందరముగా వర్ణిస్తుంది:
యచ్చకించిజ్జగస్సర్వమ్ దృశ్యతే శౄయతే అపివా అంతర్బహిశ్చ తత్సర్వమ్ వ్యాప్య నారాయణః స్థితః ఈ పరమాత్ముని వర్ణన అంతా మనకు ఒక చలనచిత్రమువలె కనబడును.
అ. హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులట అందరిలో (పరమాత్ముడు)
ఈ అనుపల్లవిలో త్యాగరాజస్వామి విష్ణువులో, శంకరునిలో, దేవతలలో, మానవులలో, అనంతవిశ్వరాశులలో నిండి యున్నపరమాత్ముని తాను దర్శించి మనకు చూపిస్తున్నారు.
చ. గగన-అనిల-తేజో-జల-భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాది ఆశ్రితులలో (పరమాత్ముడు)
ఈ చరణములో చరాచరములన్నింటిలో ప్రకాశిస్తున్న పరమాత్ముని దర్శింపజేస్తున్నారు త్యాగరాజస్వామి. ఇక్కడ ’గగన-అనిల-తేజో-జల-భూమయమగు’ అన్న పంచభూతముల వర్ణనలో ఒక విచిత్రాన్ని మనం గమనించవచ్చు. సాధారణంగా పంచభూతములను చెప్పేటప్పుడు ’పృధివ్యాపస్తేజోవాయురాకాశః’ అంటే ’భూమి-జలము-తేజము(ఆగ్ని)-వాయు-ఆకాశము’ అనే క్రమములో చెపుతారు. కానీ దీనికి వ్యతిరేకముగా త్యాగరాజస్వామి ఆకాశమునుండి భూమివరకూ పంచభూతములను లెక్కిస్తారు. ఆయన ఎందుకిలా చేశారు అని యోచిస్తే, పైనచెప్పినట్లు మనకు ఒక చలనచిత్రము కనబడుతుంది.
ఎందుకంటే, అనుపల్లవిలో అఖిలాండకోటులను దర్శింపజేసే ఆయన చలనచిత్రపు కెమేరా ఊర్ధ్వముఖముగా ఉన్నట్లు మనకు తోస్తుంది. తరువాత చరణములోని భూమిపైనున్న చరాచరములను, వాటిలోని పరమాత్మస్వరూపాన్ని చూపించుటకు ఆ కెమేరాను క్రమముగా పైనుంచి క్రిందకు తిప్పుతారు. ఆ ప్రక్రియలో భాగంగానే పంచభూతములను గగనమునుండి భూమివరకు అని వర్ణిస్తారు. ఈ విషయము అవగతమైనపుడు, పరమాత్మస్వరూపమును, త్యాగరాజస్వామి దర్శించిన రీతిలోనే మనముకూడా దర్శించగలము. ఇప్పుడు చరణములోని వర్ణనావైశిష్టతను గమనిస్తే, మృగ ఖగ - భూమిపైనుండే చలనముకలిగిన జంతుపక్షికోటిలో నగ తరు కోటులలో - అచలనములైన వృక్షములలో, పర్వతములలో వెలుగుతున్న పరమాత్మను దర్శిస్తారు.
సగుణములో - భౌతిక ప్రపంచములో ఉండే అన్నివస్తువులకు, ప్రాణులకు రూపములు, గుణములు ఉంటాయి. ఇవికాక విశ్వములో ఇంకేమి ఉన్నాయని యోచిస్తే, గుణము మాత్రమేయుండి, రూపములేనివి అయినటువంటి గురుత్వాకర్షణశక్తి, విదుచ్చక్తి,
అయస్కాంతశక్తి వివిధ శక్తిస్వరూపాలు మన ఊహాపరిధిలోకి వస్తాయి.
కావున, ఈ పదముతో విశ్వములోని అన్నివిధములైన శక్తిస్వరూపముల (Matter & Energy forms)లో అంతర్లీనముగావున్న పరమాత్మను చూపిస్తారు. విగుణములో - గుణరహితమైన వస్తుశక్తిసముదాయముల అస్తిత్వమును కూడా వేల సంవత్సరాలక్రితమే ఊహించగలిగిన మన విజ్ఞానవేత్తలకు, ఋషులకు నా నమస్సులు. సామాన్యమానవులకు ఇవి ఊహాతీతమైన విషయాలు. కాని గతశతాబ్దములో అంతరిక్ష వైజ్ఞానికులు
కనుగొన్నదేమిటంటే: విశ్వములోని మొత్తము వస్తుశక్తిసముదాయములో సగుణాత్మకమైనది కేవలము 5% మాత్రమే. నిర్గుణవస్తుసముదాయము (Dark Matter) విశ్వములో 27% నిండియున్నది. తక్కిన 68% అంతా నిర్గుణశక్తిస్వరూపమే నిండియున్నది. విగుణములో కూడా పరమాత్ముని చూడగలిగిన మన ఋషులయొక్క, యోగులయొక్క మరియు
త్యాగరాజస్వామియొక్క దివ్యదృష్టి మనలను ఆనందాశ్చర్యచకితులను చేస్తుంది.
ఇంతవరకూ త్యాగరాజస్వామి బాహ్యప్రపంచములో, సగుణ నిర్గుణాత్మకమైన విశ్వములో పరమాత్మని దర్శింఛారు. దీనిలోనుండి కలిగేది అద్భుతరససిద్ధి.
సాధుత్యాగరాజాది
ఆశ్రితులలో - ఇక్కడ త్యాగరాజస్వామి బాహ్యప్రపంచాన్ని వదిలి
అంతర్ముఖుడౌతారు. తనలోనూ, సాధువులై ఆశ్రయించినవారందరిలోనూ కూడా నిత్యమూ వెలిగే పరమాత్మను ఆయన దర్శించారు. ఎవరైతే తనలోకూడా పరమాత్మ కొలువైయున్నాడని తెలుసుకుంటారొ, వారికి కామక్రోధాదులు నశిస్తాయి. సర్వతాపములు ఉపశమిస్తాయి. అప్పుడు వారికి సర్వోత్కృష్టమైన శాంతరససిద్ధి కలుగుతుంది. అటువంటి యోగులే జీవన్ముక్తులై, మోక్షప్రాప్తికి అర్హులౌతారు.
- ఆలమూరు విజయభాస్కర్
******
8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"
ప్రమాదాలు మంచికీ జరుగుతూంటాయి. రైలింజను చెడిపోయి వార్ధా రైల్లే స్టేషన్ లో ఆ రైలు ఆగిపోయింది. రైలు దిగి ఆకలితో ఫ్లాట్ ఫాం మీద ఓ కుర్రాడు పచార్లు చేస్తున్నాడు. అతని దగ్గరకి గంధం బొట్టు పెట్టుకున్న ఒకతను వచ్చి తనింటికి భోజనానికి పిలిచాడు.
ఫర్లాంగు దూరంలో కనిపించే ఆయనింటికి అతను, అతని మిత్రుడు కలిసి వెళ్ళారు. ఆమెకి ఏడో నెల. ఆమె భర్త రొట్టెలని ఒత్తి చేస్తూంటే ఆమె కొడుకు ఆ ఇద్దరికీ వడ్డించాడు.
ఇరవై రెండేళ్ళ తర్వాత ఆ యువకుడు అదే రూట్ లో రైల్లో వెళ్తూంటే, అతను ఎక్కిన రైలు మళ్ళీ వార్ధా స్టేషన్లోనే పాడైంది. రైలు దిగి పచార్లు చేస్తూంటే, తనకి భోజనం పెట్టినతను గుర్తొచ్చి వెంటనే అతను స్టేషన్లోంచి కనిపించే ఆయనింటికి వెళ్ళాడు. ఆయనకి తనని పరిచయం చేసుకున్నాడు. అతని కొడుకుతో చెప్పాడు.
"అప్పుడు నీ వయసు నాలుగేళ్ళు.”
మాటల్లో ఆయనకి మూత్ర పిండాల్లో రాళ్ళు చేరాయని, ఆపరేషన్ చేయించుకోడానికి సరిపడే డబ్బు లేదని తెలిసింది. ఆ యువకుడికి కూడా ఉద్యోగం లేదు.
కలెక్టరైన ఆ ఒకనాటి అతిథి ఆయనకి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచిత చికిత్సకి వెంటనే ఏర్పాటు చేసి, ఆ యువకుడికి వార్థాలో ఓ ఉద్యోగాన్ని కూడా ఇప్పించాడు.
!!! రెండోసారి రైలింజను మళ్ళీ అక్కడే ఎందుకు చెడిపోయింది?!!!!
దుష్టులతో సంపర్కం లేకుండా ప్రమాదాల్లో చిక్కుకోమా?
ఏ టెర్రరిస్ట్ దాడిలోనో అమాయకులు కష్టాన్ని అనుభవించారనుకుందాం. అప్పుడు తాము గతంలో చేసిన సంచితం లేదా అగామిలలో నిలువ ఉన్న పాపాలని ఈ అనుభవం రద్దు చేసేస్తుంది.
అవి ఇంకా ప్రారబ్ధ కర్మగా మారక ముందే ఇప్పుడు ఈ కష్టాన్ని ముందే అనుభవించడం ద్వారా అవి భస్మం అవుతాయి. అంతే తప్ప నిష్కారణంగా కర్మ చేయని ఎవరూ దాని ఫలితాన్ని అనుభవించరు.
అంటే ప్రారబ్దంలో లేకపోయినా, సంచితం లేదా అగామిల్లో కర్మ ఉంటేనే ఆ దాడిలో వారు చిక్కుకుని తమ కర్మ ఫలాలనే ఎవరైనా అనుభవించేది. మనం ప్రమాదంలో మరణించినా లేదా గాయ పడ్డా అందుకు కారణం మన పూర్వకృత పాపమే అవుతుంది.
దీన్ని గురించి ఓ ఋషి చెప్పిన మాటలివి.
ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః
భోక్తారో విప్రముచ్యన్తే కర్తా దోషేణ లిప్యతే
భావం:-
ఒకడు చేసిన పాప కర్మ వల్ల అనేక మంది దాని ఫలాలని అనుభవించినప్పుడు, అలా అనుభవించిన వారు తాము ఇదివరకు చేసిన పాప ఫలాలనించి విడివడతారు. కాని ఆ పాపపు పనిచేసిన ఆ ఒక్కడికీ మాత్రం ఆ పాప కర్మ అంటుకుంటుంది.
(తరువాత భాగంలో - కష్టసుఖాలు - నవగ్రహాలు)
____
No comments:
Post a Comment