Tuesday, 16 May 2023

171 -177 stories

171 *మూడు రాళ్లు*


 ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు అతడు బాగా వృద్ధుడు ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి, ఇలా అన్నాడు , నాయనలారా.... నేను ఎంతోకాలం జీవించను ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, ఈ ఆస్తిని సంపాదించాను మిమ్మల్ని పెంచి పెద్దవాళ్లను చేశాను ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా... అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి సత్యమూర్తి తెలివైనవాడు.

నా వ్యాపారాభివృద్ధికి అతను ఎన్నో సలహాలిచ్చినవాడు అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి అప్పుడే నాకు మనఃశాంతి కలుగుతుంది అలా చేస్తామని నాకు మాటివ్వండి అన్నాడు అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులూ ప్రమాణం చేశారు కొద్దిరోజుల్లోనే నారాయణ మరణించాడు ఆ తర్వాత ముగ్గురు కొడుకులూ, తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు.

అందులో ఇంటి తాళాలు, మూడు రాళ్లు, ఒక ఉత్తరం ఉన్నాయి ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు తర్వాత ముగ్గురి వైపు తిరిగి, అబ్బాయిలూ... ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు ఏంటది...? అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను ముందు ఆ మూడు రాళ్లను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి.

ఓస్ అదేమంత పెద్ద విషయం కాదు మీ ముగ్గురు మూడురాళ్లను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు మాని, మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు అందువలన ఎవరి ఆస్తి వారికి ఇచ్చేస్తే, మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్దకొడుకు అంతే కాదు మూడు రాళ్లలా ఎక్కువ తక్కువ కాకుండా, మూడు వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు .

ఇక మూడోవాడు, ఆ మూడు రాళ్లు పొయ్యికి గల మూడు రాళ్లు అంటే మూడు రాళ్లు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది అలాగే మేం ముగ్గురం కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికే ఆ మూడు రాళ్లు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత, సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు అందులో ముగ్గురు అన్నదమ్ములు కలసిమెలసి ఉండాలి నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది.

చదివారు కదా మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి తండ్రి ఉద్దేశం ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు అందుకే కలసిమెలసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి.

ఈ తాళాలు నా ఒక్కడివి కావు మనందరివీ అని తన అన్నలిద్దర్నీ కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు తను చెప్పినట్లే పెట్టెలో మూడు రాళ్లు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.

__(())--

172...పెరుమార్చిన ఈగ (చిన్న కధ )
 . 
! అయినా నా పేరు కొక్కురోక్కో కాదు" అని అక్కడ నుండి పారిపోయింది.

అంతలో దానికి ఒక కుక్కపిల్ల కనిపించింది. "అబ్బ! ఎంతటి ముచ్చటయిన తోకో!" అని ఈగ ఈర్ష పడింది. అంతలో వచ్చిన పని గురుతుకు వచ్చి- "ఏమండీ, కుక్కపిల్ల గారూ! నా పేరు ఏమిటో చెప్పగలరా?" అని అడిగింది.

కుక్కపిల్ల చిరాకు పడింది. "అన్నం తినే హడావిడిలో నేనుంటే, ఈ ఈగ గోల ఏమిటో" అనుకొనింది. "బో బో" అని గట్టిగా మొరిగింది. దానితో ఈగ అక్కడ నుండి తుర్రుమంది.

"అమ్మయ్య" అని రొప్పుతూ ఒక చెట్టు మీద కూర్చుని సేద తీరింది. "అమ్మో ఇంక నా పేరు నాకు ఎప్పటికీ తెలీదేమో, యలాగా?' అని దిగాలు పడింది. అంతలో చెట్టు మీద కాకమ్మ ఈగను పలకరించింది- చెట్టు తొర్రలో ఉన్న పిల్లి మామ చాల తెలివైందని, దానిని అడగమని సలహా ఇచ్చింది.

దానితో ఈగ వెళ్లి పిల్లిని "నా పేరు ఏంటో తెలుసా, నీకు?" అని అడిగింది. "అయ్యో! నేను ముసలిదాన్ని అయ్యిపోయినానమ్మా! నాకు ఏమీ గుర్తుకు ఉండడం లేదు! అయినా పర్వాలేదు, ఆలోచిస్తాను- రేపు కనిపించు" అని అంది అది. దాంతో తన పేరు తెలుసుకో గలనన్న నమ్మకం ఈగకు పూర్తిగా పోయింది.

అంతలో దగ్గర్లో ఎక్కడో గోల గోలగా అనిపించి, అది అక్కడికి పరిగెత్తింది. అక్కడ

కోడి,కుక్క,పిల్లి,ఝుమ్మంటూ కందిరీగ,రోద చేస్తూ దోమ ఇంకా చాలా మంది పోగై ఉన్నారు. వాళ్ళంతా అప్పుడే ఈనబోతున్న గేదె వైపు చూస్తున్నారు. "నొప్పులు వోర్చుకో" అనీ, "అంతా మంచిగానే జరుగుతుందిలే" అని ధైర్యం నూరి పోస్తున్నారు. ఈగ కూడా తన పేరు గొడవ కాసేపు మర్చిపోయింది. 'ఎప్పుడు గేదె ఈనుతుందా, ఒక చిన్న దూడ పుడుతుందా' అని చూస్తుండగానే "హీ హీ" అని సకిలిస్తూ దూడ గేదె కడుపు లోనించి బయటకు వచ్చింది. అందరూ సంతోషంగా అరిచారు గానీ దూడమాత్రం 'హీ హీ' అని సకిలించడం ఆపడం లేదు.

అది విన్న ఈగకు తన పేరు 'ఈగ' అని గుర్తుకు వచ్చింది. "హమ్మయ్య" అనుకోని అది ఇంటి దారి పట్టింది.

{చిన్నప్పుడెప్పుడో చదివిన కథే అయినా ఆధ్యాత్మికంగా చూస్తే మనం మన లౌకిక వ్యహహారాలలో పడి మనమెవరమైనదీ మర్చిపోతున్నాం. నిరంతరం మనమెరవరమైందీ తెలుసుకుంటూ సాగిపోవాలి.}

--(())--
173 శిష్యునిలో తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలను; శ్రవణం చేసిన విషయం అనుభవంలోనికి తెచ్చుకోవటానికి తగిన లక్షణాలను తెలియజేయబోతున్నారు. 
*(i) మేధావి* :- గురువు చెప్పే శాస్త్ర విషయాలు పూర్తిగ తెలుసుకోవాలన్నా - అవి ఉపయోగపడాలన్నా శిష్యుడు మేధావి అయి ఉండాలి. *మేధావి అంటే అన్నిరకాల తెలివి తేటలు గలవాడు – అనికాదు*. ఎన్ని శాస్త్రాలనైన కంఠతా బట్టి అప్పజెప్పగలిగిన వాడనీ కాదు. *మరెవరు? గొప్ప జ్ఞాపకశక్తి గలవాడే మేధావి. అయితే సామాన్యంగా వేదాంతం వినేవారు అనేమాట ఒక్కటే! 'ఏమిటోనండీ చెప్పేటప్పుడు అన్నీ చక్కగా అర్థమయినాయి. కాని ఒకటీ జ్ఞాపకం లేదు*. అదేమిటో నా జ్ఞాపకశక్తి పూర్తిగా నశించిపోయింది" అంటుంటారు. కాని ఇది నిజంగాదు. ఎందుకంటే *వేదాంతంలో ఒక్కవాక్యాన్ని చదివి గుర్తుంచుకోలేనివారు కూడా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను పూసగ్రుచ్చినట్లు చెప్పగలుగుతారు, వర్ణించి చెప్పగలుగుతారు*. అప్పుడు ఆయా వ్యక్తులు ఎలా వ్యవహరించారో చెప్పగలుగుతారు. ఇదంతా జ్ఞాపకశక్తి ఉన్నదనటానికి ఋజువు. మరైతే ఎందుకు ఈ విషయాలే గుర్తుండవు? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలని, వాటితోనే *తన జీవిత పరమార్థం ముడిపడి ఉన్నదని భావించక పోవటం - వినేటప్పుడు శ్రద్ధ, ఏకాగ్రత లేకపోవటం - మనస్సు వేటి మీదకో పరుగులు తీయటం, అన్యవిషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం - ఇవే కారణాలు*. మరేం చేయాలి? 
*(1) గురువు శాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు పరిపూర్ణమైన శ్రద్ధతో - ఏకాగ్రతతో వినాలి. ప్రతిమాటా - ఒక్కటి కూడా వదలకుండా వినాలి*. 
*(2) అలా వింటూనే తన బుద్ధిలోనికి ఎక్కించాలి. అలా కాకుండా ప్రస్తుతానికి notes తీసుకుందాం - ఆ తర్వాత దాని గురించి విశ్లేషిద్దాం అనుకుంటే వినే దానిపై ఏకాగ్రత చెడిపోతుంది. కనుక వేదాంత విద్య వింటూ వింటూనే అర్థం చేసుకోవాలి*. 
గురువు బోధ చేస్తుంటే పరధ్యానంగా ఉండటం వల్ల ఒక విషయం అర్థంకాలేదు అనుకోండి. దానితో అనేక సందేహాలు బయలుదేరుతాయి. దృష్టి దాని మీదే పడుతుంది.  తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఆ తర్వాత చెప్పిన విషయాన్ని వినలేడు. దానితో చివరికి చెప్పినది మొత్తం అర్థం కాకుండా పోతుంది. అందుకే *వింటూనే అర్థం చేసుకోవాలని చెప్పటం*. 
ఇలా వింటూ వింటూనే అర్థం చేసుకోవాలంటే *నీవు వర్తమానంలో నిలవాలి*. గతకాలపు స్మృతులను నెమరు వేసుకోవటమో; భవిష్యత్తును గురించి ఊహలలో తేలిపోవటమో జరిగితే - గాలిలో మేడలు కడుతుంటే వేదాంతం అర్థం కాదు. కనుక *సదా వర్తమానంలో* నిలవాలి. 
*(ii) విద్వాన్* :- చెప్పినది చెప్పినట్లుగా విని, వింటూ వింటూనే అర్థం చేసుకోవాలంటే *శిష్యుడు విద్వాంసుడు కావాలి. అంటే వేదాంత శాస్త్ర గ్రంధాలతో పరిచయం ఉండాలి*. అందులో వచ్చే పదాల యొక్క అర్థాలు ముందే తెలిసిఉండాలి. అలా తెలిసి ఉంటే ఆ పదాలు వచ్చినపుడల్లా ఇక ఆ పదాల అర్థాలను గురించి ఆలోచించనక్కరలేదు. కనుక పాఠం నిరాటంకంగా సాగిపోతుంది. అలాగాక కొన్ని కొన్ని సాంకేతిక పదాలు వచ్చినప్పుడు వాటి అర్థం తెలియకపోతే - వాటిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో తర్వాత పాఠాన్ని వినలేం. దానితో వరుస చెడిపోతుంది. బోధ అవగాహన కాదు. ఉదాహరణకు *శరీరత్రయ వ్యతిరిక్త; అవస్థాత్రయసాక్షీ, నిస్తరంగ జలరాసి నిశ్చలం; అణోరణీయాణ్ – వాచ్యార్ధం - లక్ష్యార్థం --- అంటూ చెప్పుకుంటూ పోయేటప్పుడు వాటి అర్థం తెలిసి ఉంటే విషయం చకచకా అవగాహన అవుతుంది. అందుకే విద్వాంసుడు కావాలి శిష్యుడు*. 
అంతేగాక శాస్త్రం తెలిసిన విద్వాంసుడైతే శాస్త్రం ద్వారా ఈ ప్రపంచం అనిత్యమని తెలుస్తుంది. ఆత్మయే నిత్యమనీ, సత్యమనీ తెలుస్తుంది. ఈ నిత్యానిత్య వస్తు వివేకం వల్ల అనిత్య వస్తువులపై వ్యామోహం తొలగి వైరాగ్యం కలుగుతుంది. ఈ వివేక వైరాగ్యాల వల్ల మనోబుద్ధులు అంతర్ముఖం అవుతాయి. శాస్త్రాన్ని బాగా తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఈ తపన ఉన్నవాడే విద్వాంసుడు. అయితే *శాస్త్రాన్ని - తత్త్వాన్ని స్వయంగా చదివితే వాచ్యార్థమే తెలుస్తుంది. శాస్త్ర హృదయం అర్థం కాదు. అందువల్ల శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన సద్గురువు ద్వారానే లక్ష్యార్థాన్ని తెలుసుకోవాలి*. "ఆత్మసాక్షాత్కారం" అనగానే కంటి ఎదురుగా కనిపిస్తుందని అనుకుంటారు. శిష్యునిలో ఎంత పాండిత్యం ఉంటే గురువు అంత సులభంగా ప్రేమతో జ్ఞానాన్ని శిష్యునికి అందించగలుగుతాడు. 
*(iii) ఊహాపోహ విచక్షణః* :- ఇలా సద్గురువు ద్వారా గ్రహించిన తత్వజ్ఞానాన్ని - ఆత్మస్వరూపాన్ని స్వతంత్రంగా శోధించి - విశ్లేషణ చేసి,
:
:
*

--((***))--

174.దంపతుల మద్య చిరు హాస్య  సంభాషణల నీతి శ్లోకం (*)

తల్లి తండ్రులారా మీరు నడక ప్రారంభించు తున్నారా, ఈరోజు మీ మనవుడు వస్తున్నాడు, త్వరగా వచ్చేయండి, ఈ రోజు చాలా శుభదినం అని కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితండ్రులకు తెలియపరిచాడు, లోపలనుంచి భార్య ఏమిటండి ఈరోజు ప్రత్యేకత తొందర పడతా వెందుకు నీవు చూస్తావుకదా, అవును లేండి మీకు  పరాయిదాన్ని, ఏవిషయం నాకు చెప్పరు, అడిగితే ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతారు,  అయినా నా కెందుకు అంటూ లోపలకువేల్లింది  భార్య కొడుకు రావడం, నాలుగు కుర్చీలు వేయడం, పళ్ళెం చెంబు తెమ్మనడం క్షణాల్లో జరిగింది. నాన్నా , తాతగారు అమ్మొమ్మ వచ్చారు, వారిని ఈ కుర్చీలొ కూర్చో బెట్టండి, అమ్మ నీవుకూడా ఇటురా ఈరోజు మాతృ దినోశ్చవం. 
    మీ అమ్మగారు, నాన్నగారు వచ్చినట్టున్నారు వాళ్ళ నుకూడా  పిలిచి ఇక్కడ కూర్చో బెట్టు అన్నాడు కొడుకు 
సుబ్రహ్మణ్యం రాజశ్రీ కలసి మొదటగా  సుబ్రహమణ్యం అల్లితండ్రులకు పాదపూజచేసారు, వారికి మనవుడు తెచ్చిన కొత్తబట్టలు అందించారు, అట్లాగే రాజశ్రీ తల్లి తండ్రులకు పాదపూజ చేసారుకొత్త బట్టలు అందించారు. ,    
తాతగారు అమృతవాక్యాలు చెప్పండి, సరే మనవడా, సంస్క్రు త శ్లోకాలు మన ఋషులు తెలిపినవే తెలియపరుస్తాను విను

మాత్రా సమం నాస్తి శరీరపోషణం
విద్యాసమం నాస్తి శరీర భూషణం 
భార్యాసమం నాస్తి శరీరతోషణం 
చింతాసమం నాస్తి శరీరశోషణం


తల్లివలె శరీరాన్ని పోషించేది మరేదీ లే విద్యతో సమానమైన శరీర అలంకారం లేదు. 
భార్య వలే శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి లేదు. చింత వలే శరీరాన్ని ఎండపెట్టేదీ లేదు. తాతగారు మీరు చప్పండి తప్పదా మనవడా  

భూప్రదక్షిణ షట్కేన
కాశీయాత్రా యుతేన చ
సేతుస్నాన సతై ర్యశ్చ 
తత్ఫలం మాతృ వందనే 

"ఆరుసార్లు  భూప్రదక్షిన చేసిన ఫలం, 
వేయిసార్లు కాశీయాత్ర చేసిన పుణ్యం, 
నూరుసార్లు సేతుస్నానం చేసిన ఫలం 
తల్లికి ఒక్కసారి నమస్కారం చేయడం వల్లనే లభిస్తుంది ". 
పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆసీర్వాదమ్ అక్షతలతో 
పొందారు. 

మనవడా మీ తల్లితండ్రులవద్ద ఆసీర్వాదమ్ తీసుకో అన్నారు. 
అందరి అశీర్వాదములతో  ఆ గృహము నిత్యకళ్యాణం పచ్చతోరణంగా మారింది
తల్లి కి నమస్కారం పుణ్యఫలం 
  
వచ్చేవారం మరోశ్లోకం ద్వారా నవ్వుకుంటూ సూక్తులు నేర్చుకుందాం
--(())-- 

175...ప రి జ్ఞా నం 

#తద్దినం...

       మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ...

"ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి" అన్నాడు బ్రహ్మ...

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు. కూతురంటే అతనికి ప్రాణం. 

ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.

అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.

పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.

అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. 

"సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.

పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.

మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.

ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.

ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.

ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.

ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు....

********

176. అవతలి వ్యక్తికి డబ్బు అవసరం గనుక కాళ్ళు కాలుతున్నా సరే అలానే నిలబడ్డాడు..!

అతను ఈసారి 5 నిమిషాలకే 1000 ఇస్తా నిలబడమన్నాడు ..!

వాడు సరే అని కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా అలానే నిలుచున్నాడు ..!

ఈ సారి అతను 1 నిమిషానికి 1000 అన్నాడు ..!

అప్పటికే అవసరమైనంత డబ్బు వచ్చేసింది, పైగ స్పృహకోల్పోడానికి సిద్దంగా ఉన్నాడు ‌. అయినా సరే డబ్బు మీదా ఆశతో బలవంతంగా అలానే నిలుచున్నాడు ..!

చివరిగా ఈ సారి సెకనుకి 100000 అన్నాడు ..!

ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని నిలబడటానికి ప్రయత్నించి ఆ ఎండ తీవ్రతకు తట్టుకోలేక చచ్చిపోయాడు. . !

అవసరానికి, ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉంటుంది., ఆ దారాన్ని మనం సరిగ్గా చూసుకోకుండా దాటామో. .? 

మనల్ని ఇంకెవరో చూసుకోవల్సిన పరిస్ధితి వస్తుంది. . .!

ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేం..!

పాదాలు సాగినంత వరకే మన అడుగులు వేయగలం..!

అలాంటిది మన ఆశను మాత్రం హద్దు ఎందుకు దాటనివ్వాలి ..!

హద్దు లేని ఆశ. , తెడ్డు లేని పడవ కుదురుగా ఉండలేవు ..! ఏదో రోజు మనల్ని ముంచేస్తాయి. . .!!!

***
177.ఈ విధముగా జీవుడు తన కర్మలకును, గుణములకును అనుగుణముగా దేహయోనులయందును. మనుష్యయోనుల యందును లేదా పశుపక్ష్యాదుల యోనులయందును జన్మించును. అజ్ఞానాంధుడైన జీవుడు ఒక్కొక్కప్పుడు పురుషుడుగాను, ఒక్కొక్కప్పుడు స్త్రీగాను లేదా నపుంసకుడుగాను జన్మను పొందును.

ఆకలిగొన్న కుక్క ఇంటింటికిని తిరుగుచు తన ప్రారబ్ధానుసారము కర్రదెబ్బలునుగాని, అన్నమునుగాని  తినుచుండును. అట్లే జీవుడు పలువిధములైన వాసనల ప్రభావమున ఊర్ధ్వలోకములయందును, అధో లోకములయందును లేక మధ్య (మర్త్య) లోకమునందును తిరుగుచు తన కర్మానుసారము సుఖదుఃఖములను అనుభవించుచుండును.

జీవుడు ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములలో ఏదేని ఒక దానియందు చిక్కుకొనియే యుండును. వాటినుండి అతడు ఎన్నడును బయటపడజాలడు. ఎప్పుడైనను వాటినుండి విముక్తుడైనట్లు అనిపించినచో, అది  తాత్కాలికమైన నివృత్తియే అగును.

ఎవ్వరైనను మించిన భారమును తలకెత్తుకొన్నప్పుడు ఆ భారమును భుజముమీదికి మార్చుకొని, తాత్కాలికముగా ఉపశమనమును పొందుచుందురు. అనగా భారము ఒక చోటినుండి మరియొకచోటునకు మారినదేగాని, పూర్తిగా తొలగిపోలేదు. అట్లే మనుష్యుడు ఏదేని ఉపాయముద్వారా ఒక ముఖమునుండి బయటపడినను అతనికి మరియొక క్లేశము వచ్చిపడుచునే యుండును. అనగా, మానవునకు దుఃఖములనుండి శాశ్వతముగా విముక్తి లభించుట అసాధ్యమేయగును.

పుణ్యాత్ముడవైన రాజా! కర్మయొక్క ప్రతీకారము కర్మపరంపరవలన  సమాప్తము కాబోదు. కర్మ స్వయముగా అవిద్యనుండియే ఉత్పన్నమగును. అట్టి అజ్ఞానము (అవిద్య) ను నశింపజేయుటకు విద్యయే (జ్ఞానమే) ముఖ్యమైన సాధనము. ఒక స్వప్నములో అనుభవించిన ప్రభావము మరియొక స్వప్నముద్వారా నివృత్తికాదు. కాని, స్వప్నమునుండి  జాగృతము ఐనప్పుడు మాత్రమే, ఆ స్వప్నముయొక్క ప్రభావము నివృత్తమగును కదా!

స్వప్నావస్థలో మనోమయ లింగశరీరముతో చరించుప్రాణికి స్వప్నములోని దృశ్యములు అవాస్తవములే యైనను వాస్తవములుగా భాసిల్లుచుండును. అట్లే, జగత్తులోని దృశ్యపదార్థములు పారమార్థిక దృష్టితో అవాస్తవములే యైనను అజ్ఞానము నివృత్తి కానంతవరకును  అవి వాస్తవములుగానే తోచును. కనుక, అజ్ఞానావృతుడైన జీవునకు జనన మరణ రూపమగు సంసారమునుండి ముక్తి లభింపదు. అనగా - శాశ్వతనివృత్తికి ఉపాయము ఆత్మజ్ఞానమే. 

అవిద్య కారణముగా పరమార్థ స్వరూపమైన ఆత్మకు జననమరణరూప అనర్థపరంపర కొనసాగుచునే యుండును. అట్టి అజ్ఞానమునుండి నివృత్తిని పొందుటకు సకలలోక గురువైన శ్రీహరియందు దృఢమైన భక్తి కలుగుట యొక్కటియే ఏకైక సాధనము.

పరమాత్ముడైన వాసుదేవునియందు ఏకాగ్రతతో కూడిన (నిశ్చలమైన) భక్తిభావమే - భక్తి సాధనయే జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించును.

రాజర్షీ! భక్తిభావము భగవత్కథలను ఆశ్రయించి యుండును. కనుక, శ్రద్ధాదరములతో భగవత్కథలను ప్రతిదినము విన్నవానికి, పఠించినవానికిని అతి శీఘ్రముగా జ్ఞాన, వైరాగ్యములతో కూడిన భగవద్భక్తి ప్రాప్తించును.

రాజా! భగవంతుని గుణములను కీర్తించుట యందును, వినుటయందును తత్పరులైన భక్తులు పవిత్రచరిత్రలను కలిగియుందురు. అట్టి సాధుపురుషుల సమాజమునందు మహాత్ముల ముఖారవిందముల నుండి భగవంతుని చరితామృతము నిరంతరము జాలువారు చుండును. దివ్యమైన ఆ భగవత్కథలను తత్పరులై చెవులార ఆస్వాదించువారికి ఆకలిదప్పులే ఉండవు. అంతేగాదు భయము, శోకము, మోహము మొదలగునవి వారి దరిదాపులకే రాజాలవు.

అయ్యో! సాధారణముగా ఆకలిదప్ఫులవంటి బాధలకు గురియైన జీవుడు, అమృతమువంటి శ్రీహరికథలను వినుటయందు ఏమాత్రమూ ఆసక్తిని చూపడు. కచ్చితముగా ఇది విచారకరమైన విషయము.

(చతుర్థ స్కంధము లోని ఇరువది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment