పాప_ప్రక్షాళన
ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది..
‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది.
ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.
ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది.
ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.
🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩🙏
2. 🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...

రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా, అప్పుడు ఇంద్రుడు "సరే... పరమ శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తే, అప్పుడు వర్షం కురుస్తుంది" అని వరమిచ్చినట్టే ఇచ్చి, వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరుకం వాయించ వద్దని రహస్యంగా శివునికి చెప్పాడు.
రైతులు పరమ శివుడి దగ్గరకు వెళ్లి ఎంత బతిమాలినా... పన్నెండు సంవత్సరాల తరువాత మాత్రమే డమరుకం వాయిస్తానని చెప్పాడు.
రైతులు ఏమి చేయాలో తెలియక, పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు.
కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే వున్నాడు.
మూడు సంవత్సరాల తర్వాత, ఎప్పటి లాగానే ఆ రైతు పంట వేశాడు. మిగిలిన వారు అందరూ కలసి వెళ్లి "వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియూ శ్రమ వృధా చేస్తున్నావూ" అని అడగ్గా...
దానికి ఆ రైతు "వర్షం లేకుంటే పంట పండదు అని నాకూ తెలుసు, కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మరిచి పోకుండా వుండేటందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పాడు.
ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి... తమరు డమరుకం వాయించడం మరచి పోలేదు కదా, అన్నది చమత్కారంగా.
అంతట పరమ శివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరుకం వాయించాడు.
తక్షణమే వర్షం కురిసింది. దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా... మిగిలిన రైతులకు కడుపు మంటే మిగిలింది.
కాబట్టి మిత్రులారా......
ఈ లాక్ డౌన్ ఎత్తి వేయడానికి వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు, లేదా సంవత్సరం పట్టొచ్చు. కానీ మనం ఏ వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా దానికి సంబంధించిన విషయాలలో (లాక్ డౌన్ తో సంబంధం లేకుండా) నైపుణ్యాన్నీ మరియూ జ్ఞానాన్నీ పెంచుకునేందుకు నిరంతర ప్రయత్నం చేయాలి.
ముగింపు : ఎదురు చూస్తూ సమయం వృథా చేయకుండా... రేపటి రోజున (లాక్ డౌన్ ఎత్తి వేసిన రోజున) ఏమి చేయాలో దానికి సన్నద్ధం కావాలి.
***
"సాధనమున పనులు సమకూరు ధరలోన"
🙏
04. వృద్ధుల కు సలహాలు ...5
వృద్ధులు సలహాను తీవ్రంగా పాటించండి.
🦋 యునైటెడ్ స్టేట్ లో జరిపిన
ఒక అధ్యయనం ప్రకారం 51% పైగా వృద్ధులు
మెట్లు ఎక్కేటప్పుడు పడిపోతారు. ప్రతి సంవత్సరం చాలా మంది అమెరికన్లు మెట్లు ఎక్కేటప్పుడు పడి చనిపోయారు.
🦋నిపుణుల రిమైండర్: 60 సంవత్సరాల తరువాత ఈ 10చర్యలకు దూరంగాఉండాలి.
1) మెట్లు ఎక్కవద్దు.మీరు తప్పక ఎక్కితే, మెట్ల కేసు రైలింగ్‌లను గట్టిగా పట్టుకొని ఎక్కండి.
2) మీ తలను వేగంగా తిప్పకండి. కళ్ళు బైర్లు కమ్మి మీరు క్రింద పడిపోవచ్చు,
3) మీ కాలి బొటనవేలును తాకడానికి మీ శరీరాన్ని వంచవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి.
4) మీ ప్యాంటు ధరించడానికి నిలబడకండి.
కూర్చుని మీ ప్యాంటు ధరించండి.
5) నిలబడి ఒక్కసారి గా పడుకోకుండా మీ శరీరం యొక్క ఒక వైపు (ఎడమ చేతి వైపు, లేదా కుడి చేతి వైపు) నుండి కూర్చోని పడుకోండి.
6) వ్యాయామానికి ముందు మీ శరీరాన్ని ట్విస్ట్ చేయవద్దు. మొదట మీ శరీరాన్ని సిద్ధం చేసుకోండి.
7) వెనుకకు నడవకండి, వెనుకకు పడటం వలన తీవ్రమైన గాయం అవుతుంది.
8) భారీ బరువును ఎత్తడానికి నడుము వంచవద్దు. మీ మోకాళ్ళను వంచి, సగం చతికిలబడినప్పుడు వస్తువును పైకి ఎత్తండి.
9) మంచం మీద నుండి వేగంగా లేవకండి. మంచం నుండి లేవడానికి ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి.
10) వాష్‌రూమ్‌లో అధిక శక్తిని ఉపయోగించ వద్దు. ఇది సహజంగా రావనివ్వండి.
🤷♂️ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలి మరియు సానుకూలంగా ఆలోచించాలి.
--(())--
06. ❤️ సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది.
💓 ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?”అన్నాడు.
💞 పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా! అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ ? అన్నాడు.
💝 ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.
💞 దీర్ఘంగా ఆలోచించి..
💕 సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను.
💕 గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.
💕 చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు
💓 ~అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.
❤️ గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.
💕 హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు.
💞 ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.
💖 *కానీ.. *
💞 ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.
❤️ ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.
💞 ’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా ?’అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.
💖 సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు.
♦️ ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.
💝 అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః
*~శ్రీరామ్
No comments:
Post a Comment