Tuesday, 9 June 2020

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక రాజుకొక అన్నమయ్య సంకీర్తన


* సంసారంలో సరిగమలు -1
* 🌹. సమాధి స్థితి అంటే ఏమిటి? 🌹
* ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ


* అన్నమయ్య సంకీర్తన

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
సంసారంలో సరిగమలు -1

నాగభూషణం గారు రెవిన్యూ డివిజన్ లో పనిచేసి పదవీ విరమణ చేశారు, చేసిన తర్వాత ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు, నాగ వల్లి భార్య,  ముద్దుగా వల్లి వల్లి పిల్చేవాడు, వీరికి పిల్లలు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి , వీరికి పెళ్లిళ్లు చేయుటవల్ల ఎవరి కాపురము వారివి అగుట వల్ల పిల్లల దగ్గర తిరుగుతూ, మరియు ఇరువురూ ఛలోక్తులతో కాలం వెళ్లబుచ్చు తున్నారు.

ఒకనాడు పెళ్ళాం తో నాగభూషణం నేను కాశీకి వెళ్లి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను చూసి అన్ని వివరముగా నీకు చెపుతాను అని భార్యతో అన్నాడు.

అయితే ఈరోజే నేను అమలు పరుస్తా అన్నం , కూరా పప్పు వండి తిన్నాక రుచి ఎట్లాగున్నదో చెపుతా అది విని చప్పారిస్తూ బ్రతకండి అన్నాది.

అది ఎట్లా కుదురుతుందే

అదేగా మీరు చెపుతానన్నా కధ

దానికీ దీనికీ ఏమిటి పోలిక,

మీరు అన్నారు నేను చేసి చూపించాను అంతే

అవునే నేను నవ్వులాట కంటే నీవు నిజమని నమ్మి నాకు పస్తు పెడతావా.

అందుకేనండి భార్య గాని భర్తగాని చులకనగా మాట్లాడకూడదు, ఇరువురూ సమానము, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, వయసు వచ్చిన తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండ కూడదు, అన్నమాటలు నవ్వు కున్నారు.

నా అనుభవాన్ని బట్టి ఒక విషయం తెలిసింది. తెలివైన మగాడితో తెలివిలేని స్త్రీకాపురం చేయగలదు, కానీ తెలివైన స్త్రీ తెలివి తక్కువ మొగుడితో వేగటం చాలా కష్టం, నిజంగా అలాంటి వాళ్లకు దండం పెట్టాలి గొప్ప సత్యం కనుకున్న  వాడిలా చెప్పాడు నాగ భూషణం.

తప్పండి, మీరు నాకు దండం పెట్టకూడదు అయుక్షిణం సిగ్గు పడుతూ చెప్పింది నాగవల్లి.

వల్లి నీకో విషయం చెప్పాలి నా స్నేహితుడు నీకు తెలుసుగా

ఆ ఎందుకు తెలియదు ఆ తాగుబోతే కదా, అట్లా అనకే ఎదో బలహీనత ఆవహించి అలవాటుకు బానిసయ్యాడు అంతే,
ఆపిచ్చి తల్లి ఎలా భరిస్తున్నదో అంటూ

మీరు త్రాగితే ఎలాఉండేదో తెలుసా
ఎలా ఉంటుందే 

నేనైతేనా మానేదాకా పస్తు పెట్టేదాన్ని అప్పుడు మత్తు దిగి కాల బేరం వచ్చేదాక ఏడిపిస్తాను,
ఇప్పుడు మత్తు లేకుండా ఉన్న కల బేరం తెప్పెంచుకున్నావు కదే
ఏమిటండీ మీ మాటలు

అవునే నేను చెప్పిందే  వినాలి, నేను చేసిందే తినాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చేయమన్నట్లే చేయాలి
అంటే ఏమొగాడైనా లొంగక ఉంటాడా

ఏమండి మనమధ్య పంతాలు పట్టింపులు ఎందుకండీ, నీ మాటను నేను గౌరవించి అనుకరిస్తా.,
మరి నామాటను మీరు గౌరవించాలి కదండీ.

ఇప్పటి దాకా చేస్తున్నది అదేకదే.

సరదాగా, సరసంగా, చమత్కారంగా మాటలను మాట్లాడుట అలవాటు చేసుకుంటే ఏంతో మంచిదండి.

రాధాకృష్ణ లీలలను మాఅమ్మ చెప్పింది చిన్నప్పుడు
ఎంచెప్పిందే, నాకు చెప్పు అని అడిగాడు నాగభూషణం

ఒకనాడు శ్రీకృష్ణుడు ద్వారం వెలుపల ఉండి తలుపు తడుతున్నాడు. ఆలస్యంగా వచ్చినందుకు లోపల రాధ అలుగక చమత్కారంగా ఆట పట్టించింది.

వారిద్దరి మధ్య ఏ మాటలు సాగినాయి అని అడిగాడు

రాధ : చేతితో తలుపు తడుతున్నవారు ఎవరట ?
కృష్ణుడు : తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడే కపటురాలా ! నేను మాధవుడను.

రాధ : ఓహో వసంతుడివా ? ( వసంతుడిని మాధవుడని కూడా అంటారు )
కృష్ణుడు : కాదు నేను చక్రిని (చక్రము కలవాడును )

రాధ: అయితే కుమ్మరివా ? (చక్రం ఉపకరంముగా ఉన్నవాడు)
కృష్ణుడు : కాదు ధరణీధరుడను (కూర్మావతారంలో భూమిని ధరించిన విష్ణువుని )


రాధ: రెండు నాలుకలున్న పామువా?సర్పరాజగు ఆదిశేషుడివా ? (భూభారం మోస్తున్నది ఆదిశేషుడు అని కదా  మన నమ్మకం )
కృష్ణుడు: కాదు నేను భయంకర సర్ప కాళీయుని మర్ధించిన వాడను.

రాధ : ఓహో పాములను సంహరించే పక్షి నాయకుడు గరుత్మంతుడివా?
కృష్ణుడు : కాదు నేను హరిని

రాధ : వానర శ్రేష్టమా ? ( హరిశబ్దానికి వానరమని కుడా అర్ధమున్నది కదా )

శ్రీకృష్ణుడు:  ఎం చెప్పినా శృతి మెత్తగా తిప్పి కొట్టింది.      
అందుకే ఇరువురి మధ్య చమత్కార సంభాషణలు కావాలి, ఆరోగ్యానికి ఆనందానికి అవసరము
దాంపత్యంలో గాలివానాలుంటాయి, పెను తుఫానులున్నాయి, ఎన్ని అడ్డు వచ్చిన ఇరువురిమధ్య సఖ్యత చెక్కు చెదరదు.

ఎండలో నడిచి వచ్చిన కష్టము తెలియకుండా చీకటిలో చల్లని వెన్నెలలో మనసుకు హాయిని పంచేది దాంపత్య సుఖం. ఇరువురి మధ్య  ప్రేమ పెరుగును, ఎట్టి పరిస్థితిలో క్రోధం చేరదు. సంసారం మూడు మాటలు ఆరు న వ్వులుగా ఉంటుంది.

చాలా చక్కగా చెప్పావు వల్లి .
నాకు పెద్దలు చెప్పినవే మీకు గర్తు చేశాను అన్నది.

ఏమండి నేనొక ప్రశ్న అడుగు తానూ చెప్పండి 
ఒక గొడుగు క్రింద నలుగురు తడవ లేదు ఎందుకు ?
ఎందుకా అది పెద్ద గొడుగు అయినందుకు అన్నాడు భర్త
అప్పడు వర్షం లేదండి అందుకు
అందుకా నాకు తెలియలేదే .... అన్నాడు భర్త
సరే నాకు నిద్దర వస్తున్నది కాస్త పడుకుంటానండి, నన్ను లేపకండి.
రోజూ తంతూ నన్ను లేప కండి అంటుంది,  
ఎప్పుడు లేస్తుందో, నన్ను నిద్రపోకుండా చేస్తుంది ........

--(())--


నేటి కధలు - ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
 
 ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ

రాబోయే కాలం ఎలా ఉంటుందో అని ఉహిస్తున్నారా, పిల్లల చదువులు పోయాయని బాధ పడుతున్నారా, పూర్వం ఏ వసతులు లేనప్పుడు మన పెద్దాలు ఎలా ఉన్నారో అలా అలవాటు చేసుకోండి. ఇంట్లో కూర్చొని చక్కని కధలు చదివండి, తెలిసిన అందరికి తెలిపి  మనసు  తేలిక  పరుచుకోండి .
      
“భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్‌-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని ఎవ్వరు ఊహించలేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు  ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్చానువాదం చదవండి:

"భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’  అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా?  బతుకుoటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం.

యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్‌ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని  బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.

కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.

‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.

అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొoటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ. ప్రతి ఒక్కరిలో ఓర్పు ఓదార్పు ఉండాలి. పుకారులు నమ్మ కుండా యదార్ద౦ తెలుసుకొని జీవించండి.      

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
రాజుకొక 

1* అన్నమయ్య సంకీర్తన

ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ రంజకపు చేతలు సురలకెంత వశమా !!

ll 1చరణంll
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు 
కౌరవుల గెలిచే సంగర భూమిని సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట నీరోమములు కావ నిఖిల కారణము !!

ll 2చరణం ll
నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు 
రాముని గొలిచి కపిరాజాయను రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి 
ప్రేమముతో మగుడా పెండ్లాడెను !!

--(())--

🌹. సమాధి స్థితి అంటే ఏమిటి? 🌹

పరమాత్మ యందు ప్రవర్తిస్తున్న మనస్సు యొక్క వృత్తి ప్రవాహము భగవంతుని కంటే వేరైన మరియొక విషయములందు ప్రసరించకుండా అన్ని విధాలుగా అన్ని సమయాలలో అన్ని స్థితులలో పరమాత్మ యందే నిలుపుట మరొక దానివైపు ప్రసరింపజేయకుండా భగవత్‌ తత్త్వము యందే ని లిపియుంచుట సమాధి అనబడును.

సమ్యక్‌ ఆధానం – చక్కగా ఉంచుట. ఎదురుగా పరమాత్మ రూపం కనపడుతున్నా మన మనస్సు మరో రూపాన్ని తలచినా, ఆలోచించినా సమాధి భంగమే. మరే చోటికి వెళ్ళకుండా, ఎటువంటి ఆలోచన రాకుండా ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఆ భగవంతుని యందే నిరంతరాయముగా ఉంచుటే సమాధి.

🌹 🌹 🌹 🌹 🌹

ll3చరణంll
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ కలకాలమునునెంచ కలిగితిగా అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి 
నిలయపు హనుమంత నెగడితిగా !!

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment