Friday, 5 June 2020

శ్రీ లలితా సహస్ర నామములు


WORLDSELFIEPAGE: God loves art painting



శ్లోకం 03

11. పంచతన్మాత్ర సాయకా : 
ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.

12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : 
తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.

శ్లోకం 04

13. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : 
సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.

14. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : 
పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.

శ్లోకం 05

15.  అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : 
అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.

16. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : 
ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

శ్లోకం 06

17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : 
ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.

18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : 
ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.

శ్లోకం 07

19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : 
క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది.

20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా :
ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 08

21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా  :
కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.

22. తాటంక యుగళీభూత తపనోడుప మండలా  :
చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.

శ్లోకం 09

23. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - :
 పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.

24. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా -  :
కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

శ్లోకం 10

25. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - :
శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.

26. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - :
కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

శ్లోకం 11

27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - :
తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.

28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా  :
చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.

శ్లోకం 12

29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా  :
లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.

30. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా  :
పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 13

31. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా -
బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.

32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా -
రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.

శ్లోకం 14

33. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ -
కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.

34. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ -
బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.

శ్లోకం 15

35. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా -
కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.

36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా -
వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలు గలది.

శ్లోకం 16

37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ -
ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.

38. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా -
రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.

శ్లోకం 17

39. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా -
 కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.

40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా -
మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 18

41. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - 
ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.

42. గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.

43. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - 
తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.

శ్లోకం 19

44. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - 
గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.

45. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - 
పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

శ్లోకం 20

46. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - 
ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.

47. మరాళీ మందగమనా - 
హంసవలె ఠీవి నడక కలిగినది.

48. మహాలావణ్య శేవధిః -
 అతిశయించిన అందమునకు గని లేదా నిధి.

శ్లోకం 21

49. సర్వారుణా - 
సర్వము అరుణ వర్ణంగా భాసించునది.

50. అనవద్యాంగీ - 
వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.

51.  సర్వాభరణ భూషితా -
 సమస్తమైన నగల చేత అలంకరించబడింది.

52. శివకామేశ్వరాంకస్థా -
 శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.

53. శివా - 
వ్యక్తమైన శివుని రూపము కలది.

54. స్వాధీన వల్లభా - 
తనకు లోబడిన భర్త గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 22

55. సుమేరు శృంగమధ్యస్థా - 
మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.

56. శ్రీమన్నగర నాయికా - 
శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.

57. చింతామణి గృహాంతఃస్థా -
 చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.

58. పంచబ్రహ్మాసనస్థితా - 
ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.

శ్లోకం 23

59. మహాపద్మాటవీ సంస్థా - 
మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.

60. కదంబ వనవాసినీ - 
కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.

61. సుధాసాగర మధ్యస్థా - 
చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.

62. కామాక్షీ - 
అందమైన కన్నులు గలది.

63. కామదాయినీ - 
కోరికలను నెరవేర్చునది.

శ్లోకం 24

64. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - 
దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - 
భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 25

66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా -
సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.

67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా -
అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.

శ్లోకం 26

68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా -
చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.

69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా -
గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.

శ్లోకం 27

70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా -
కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.

71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా -
జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.

శ్లోకం 28

72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా -
భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.

73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా -
నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.

శ్లోకం 29

74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా -
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.

75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా -
మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 30

76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా -
విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.

77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా -
కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.

శ్లోకం 31

78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా -
మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.

79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ -
రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.

శ్లోకం 32

80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః -
చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.

81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా -
మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.

శ్లోకం 33

82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర సైనికా -
ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరము గలది.

83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా -
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

శ్లోకం 34

84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః -
శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.

85. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా -
మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 35

86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ -
కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.

87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ -
శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

శ్లోకం 36

88. మూలమంత్రాత్మికా -
 మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.

89. మూలకూట త్రయకళేబరా -
 మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.

90. కులమృతైక రసికా -
కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.

91. కులసంకేత పాలినీ -
కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

శ్లోకం 37

92. కులాంగనా -
కుల సంబంధమైన స్త్రీ.

93. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.

94. కౌలినీ -
కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.

95. కులయోగినీ -
కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.

96. అకులా -
అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.

97. సమయాంతఃస్థా -
సమయాచార అంతర్వర్తిని.

98. సమయాచార తత్పరా -
సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 38

99. మూలాధారైక నిలయా -
మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.

100. బ్రహ్మగ్రంథి విభేదినీ -
బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.

101. మణిపూరాంతరుదిరా -
మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.

102. విష్ణుగ్రంథి విభేదినీ -
విష్ణుగ్రంథిని విడగొట్టునది.

శ్లోకం 39

103. ఆజ్ఞాచక్రాంతళస్థా -
ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.

104. రుద్రగ్రంథి విభేదినీ -
రుద్రగ్రంథిని విడగొట్టునది.

105. సహస్త్రారాంభుజారూఢా -
వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.

106. సుధాసారాభివర్షిణీ -
అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.

శ్లోకం 40

107. తటిల్లతా సమరుచిః -
మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.

108. షట్చక్రోపరి సంస్థితా -
ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.

109. మహాసక్తిః -
బ్రహ్మమునందు ఆసక్తి గలది.

110. కుండలినీ -
పాము వంటి ఆకారము గలది.

111. బిసతంతు తనీయసీ -
 తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 11  / Sri Lalita Sahasranamavali - Meaning - 11 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 41

112. భవానీ - భవుని భార్య.

113. భావనాగమ్యా -
భావన చేత పొంద శక్యము గానిది.

114. భవారణ్య కుఠారికా -
సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.

115. భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.

116. భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.

117. భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 42

118. భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.

119. భక్తిగమ్యా - భక్తికి గమ్యమైనటువంటిది.

120. భక్తివశ్యా - భక్తికి స్వాధీనురాలు.

121. భయాపహా - భయములను పోగొట్టునది.

122. శాంభవీ - శంభుని భార్య.

123. శారదారాధ్యా - సరస్వతిచే ఆరాధింపబడునది.

124. శర్వాణీ - శర్వుని భార్య.

125. శర్మదాయినీ - శాంతిని, సుఖమును ఇచ్చునది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

శ్లోకం 43

126. శాంకరీ - 
శంకరుని భార్య.

127. శ్రీకరీ - 
ఐశ్వర్యమును ఇచ్చునది.

128. సాధ్వీ - 
సాధు ప్రవర్తన గల పతివ్రత.

129. శరచ్చంద్ర నిభాననా -
 శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.

130. శాతోదరీ - 
కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.

131. శాంతిమతీ - 
శాంతి గలది.

132. నిరాధారా -
 ఆధారము లేనిది.

133. నిరంజనా - 
మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 44

134. నిర్లేపా - 
కర్మ బంధములు అంటనిది.

135. నిర్మలా - 
ఏ విధమైన మలినము లేనిది.

136. నిత్యా - 
నిత్య సత్య స్వరూపిణి.

137. నిరాకారా - 
ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.

138. నిరాకులా - 
భావ వికారములు లేనిది.

139. నిర్గుణా - 
గుణములు అంటనిది.

140. నిష్కలా - 
విభాగములు లేనిది.

141. శాంతా - 
ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.

142. నిష్కామా - 
కామము, అనగా ఏ కోరికలు లేనిది.

143. నిరుపప్లవా - 
హద్దులు ఉల్లంఘించుట లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


42 వ శ్లోకము లలిత సహస్రనామాలు నామము
తెలుగు పద్యము
ప్రేమ భక్తుల వాత్సల్య మంటు తిరుగు
భక్తి గమ్యమే స్వాధీన పరచు చుండు
భయము పోగొట్టు దేవి ఈశ్వర శక్తి
శాంతి సుఖము ను పంచు శర్వుని భార్య

43 వ. శ్లోకము: పత్ని శివుని భార్య "శరచంద్ర  నిభానన"
పత్ని సేవలు ఐశ్వర్యమును కలి గించు
దృష్టి అజ్ణానపు పొరలు లేని శక్తి 
సర్వశక్తితొ నిత్యము శాంతి గొలుపు
పత్ని  చిక్కియు నాజూకు గలిగి ఉండు

44 వ శ్లోకము లలిత సహస్రనామాలు నామపద్యాలు

కర్మ బంధము అంటని సర్వ శక్తి
సహజ రూపము లేనిది సత్య శక్తి
భావ కల్పన లేనట్టి శాంతి శక్తి
హద్దు ఎప్పుడు అడగని నిత్య శక్తి

నిర్మలా కృతి ప్రత్యేక  శక్తి మాత
నిర్గుణామయి నిష్కలా స్వేచ్ఛ శక్తి
లోక కల్యాణ మాత వాసవి శక్తి
నిత్య సత్యము తెల్పెటి ఆత్మ జ్యోతి


లలిత సహస్త్ర నామములు 
శ్లోకం 45  భావపు పద్యము 
నిత్య మంతటా వ్యాపించి ఉన్న మాత 
శుద్ధ మైనది జ్ఞాన స్వ రూప రాలు 
ఆశ్ర యమనునది అవస రమ్ము లేని 
సంగమము వికారము లేని నిత్య మాత   

46  వ శ్లోక భావపు  పద్యము 
మదమ కారణ దోషము లేని మాత 
విధికి విద్యల ఉద్యోగ కల్పు మాత 
తనకు మించిన దేవత లేని మాత 
వదలె రాగము వైరాగ్య ముంచు మాత   

47  వ శ్లోక భావపు పద్యము  
ఏమి చింతలు లేనిది ప్రకృతి మాత 
కళల అవగాహ పొరపాటు లేని మాత  
అహము మోహము లేనట్టి ధర్మ మాత 
మనసు మమకార పాపము తెంచు మాత




శ్లోకం 45

144. నిత్యముక్తా -
ఎప్పుడును సంగము లేనిది.

145. నిర్వికారా -
ఏ విధమైన వికారములు లేనిది.

146. నిష్ప్రపంచా -
ప్రపంచముతో ముడి లేనిది.

147. నిరాశ్రయా -
ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.

148. నిత్యశుద్ధా -
ఎల్లప్పుడు శుద్ధమైనది.

149. నిత్యబుద్ధా -
ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.

150. నిరవద్యా -
చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.

151. నిరంతరా - ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 46

152. నిష్కారణా - 
ఏ కారణము లేనిది.

153. నిష్కళంకా - ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.

154. నిరుపాధిః - ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.

155. నిరీశ్వరా - ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.

156. నిరాగా - రాగము అనగా కోరికలు లేనిది.

157. రాగమథనీ - రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.

158. నిర్మదా - మదము లేనిది.

159. మదనాశినీ - 
మదమును పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 47

160. నిశ్చింతా -
ఏ చింతలూ లేనిది.

161. నిరహంకారా -
ఏ విధమైన అహంకారము లేనిది.

162. నిర్మోహా -
అవగాహనలో పొరపాటు లేనిది.

163. మోహనాశినీ -
మోహమును పోగొట్టునది.

164. నిర్మమా -
మమకారము లేనిది.

165. మమతాహంత్రీ -
 మమకారమును పోగొట్టునది.

166. నిష్పాపా -
పాపము లేనిది.

167. పాపనాశినీ -
పాపములను పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకం 48
168. నిష్క్రోధా - 
క్రోధము లేనిది.

169. క్రోధశమనీ - 
క్రోధమును పోగొట్టునది.

170. నిర్లోభా - 
లోభము లేనిది.

171. లోభనాశినీ -
 లోభమును పోగొట్టునది.

172. నిస్సంశయా - 
సందేహములు, సంశయములు లేనిది.

173. సంశయఘ్నీ - 
సంశయములను పోగొట్టునది.

174. నిర్భవా - 
పుట్టుక లేనిది.

175. భవనాశినీ -
 పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 


శ్లోకం 49

176. నిర్వికల్పా - 
వికల్పములు లేనిది.

177. నిరాబాధా - 
బాధలు, వేధలు లేనిది.

178. నిర్భేదా - 
భేదములు లేనిది.

179. భేదనాశినీ - 
భేదములను పోగొట్టునది.

180. నిర్నాశా - 
నాశము లేనిది.

181. మృత్యుమథనీ - 
మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.

182. నిష్క్రియా - 
క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.

183. నిష్పరిగ్రహా - 
స్వీకరణ, పరిజనాదులు లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 



శ్లోకము 51

193. దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.

194. దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.

195. దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.

196. సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.

197. సాంద్రకరుణా - గొప్ప దయ గలది.

198. సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


శ్లోకము 52

199. సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.

200. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.

201. సద్గతి ప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.

202. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.

203. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.

204. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


శ్లోకము 53

205. సర్వయంత్రాత్మికా - 
అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.

206. సర్వతంత్రరూపా - 
అన్ని తంత్రములను తన రూపముగా గలది.

207. మనోన్మనీ - 
మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.

208. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.

209. మహాదేవీ - 
మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.

210. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.

211. మృడప్రియా - 
శివుని ప్రియురాలు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 


శ్లోకం 54

212. మహారూపా - 
గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.

213. మహాపూజ్యా - 
గొప్పగా పూజింపబడునది.

214. మహాపాతక నాశినీ - 
ఘోరమైన పాతకములను నాశనము చేయునది.

215. మహామాయా -
 మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.

216. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.

217. మహాశక్తిః - 
అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.

218. మహారతిః - 
గొప్ప ఆసక్తి గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. శ్లోకం 55 🌻

219. మహాభోగా -
గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.

220. మహైశ్వర్యా -
విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.

221. మహావీర్యా -
అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.

222. మహాబలా -
అనంతమైన బలసంపన్నురాలు.

223. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.

224. మహాసిద్ధిః -
అద్వితీయమైన సిద్ధి గలది.

225. మహాయోగేశ్వరేశ్వరీ -
గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 🌻. శ్లోకం 56

226. మహాతంత్రా -
గొప్పదైన తంత్ర స్వరూపిణి.

227. మహామంత్రా -
గొప్పదైన మంత్ర స్వరూపిణి.

228. మహాయంత్రా -
గొప్పదైన యంత్ర స్వరూపిణి.

229. మహాసనా -
గొప్పదైన ఆసనము గలది.

230. మహాయాగ క్రమారాధ్యా -
గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.

231. మహాభైరవ పూజితా -
ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌻. శ్లోకం 57

232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ -
సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.

233. మహా కామేశ మహిషీ -
 మహేశ్వరుని పట్టపురాణి.

234. మహాత్రిపుర సుందరీ -
గొప్పదైన త్రిపురసుందరి.

🌻. శ్లోకం 58

235. చతుష్షష్ట్యుపచారాఢ్యా -
అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.

236. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.

237. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా -
గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌻. శ్లోకం 59

238. మనువిద్యా -
మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.

239. చంద్రవిద్యా -
చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.

240. చంద్రమండలమధ్యగా -
చంద్ర మండలములో మధ్యగా నుండునది.

241. చారురూపా -
 మనోహరమైన రూపము కలిగినది.

242. చారుహాసా -
అందమైన మందహాసము కలది.

243. చారుచంద్రకళాధరా -
అందమైన చంద్రుని కళను ధరించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

 🌻. శ్లోకం 60

244. చరాచర జగన్నాథా -
కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.

245. చక్రరాజ నికేతనా -
చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.

246. పార్వతీ -
పర్వతరాజ పుత్రి.

247. పద్మనయనా -
పద్మములవంటి నయనములు కలది.

248. పద్మరాగ సమప్రభా -
 పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 31  / Sri Lalita Sahasranamavali - Meaning - 31 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 62

254.  ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా -
ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.

255. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.

256. విశ్వరూపా -
విశ్వము యొక్క రూపమైనది.

257. జాగరిణీ -
జాగ్రదవస్థను సూచించునది.

258. స్వపంతీ -
స్వప్నావస్థను సూచించునది.

259. తైజసాత్మికా -
తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

[06:28, 15/07/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 32  / Sri Lalita Sahasranamavali - Meaning - 32 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 63

260. సుప్తా -
నిద్రావస్థను సూచించునది.

261. ప్రాజ్ఞాత్మికా -
ప్రజ్ఞయే స్వరూపముగా గలది.

262. తుర్యా -
తుర్యావస్థను సూచించునది.

263. సర్వావస్థా వివర్జితా -
అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.

264. సృష్టికర్త్రీ -
సృష్టిని చేయునది.

265. బ్రహ్మరూపా -
బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.

266. గోప్త్రీ -
గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.

267. గోవిందరూపిణీ -
విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

[06:46, 16/07/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 33  / Sri Lalita Sahasranamavali - Meaning - 33 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 64

268. సంహారిణీ -
ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.

269. రుద్రరూపా -
రుద్రుని యొక్క రూపు దాల్చింది.

270. తిరోధానకరీ -
మఱుగు పరచుటను చేయునది.

271. ఈశ్వరీ -
ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.

272. సదాశివా -
సదాశివ స్వరూపిణి.

273. అనుగ్రహదా -
అనుగ్రహమును ఇచ్చునది.

274. పంచకృత్య పరాయణా -
సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 34  / Sri Lalita Sahasranamavali - Meaning - 34 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 65

275. భానుమండల మధ్యస్థా -
సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.

276. భైరవీ -
భైరవీ స్వరూపిణి.

277. భగమాలినీ -
వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.

278. పద్మాసనా -
పద్మమును నెలవుగా కలిగినది.

279. భగవతీ - భగశబ్ద స్వరూపిణి.

280. పద్మనాభ సహోదరీ -
విష్ణుమూర్తి యొక్క సహోదరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 35  / Sri Lalita Sahasranamavali - Meaning - 35 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 66

281. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి -
తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.

282. సహస్రశీర్షవదనా -
వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.

283. సహస్రాక్షీ -
వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది.

284. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

🌻. శ్లోకం 67

285. ఆ బ్రహ్మకీటజననీ -
బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.

286. వర్ణాశ్రమ విధాయినీ -
 వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.

287. నిజాజ్ఞారూపనిగమా -
తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.

288. పుణ్యాపుణ్యఫలప్రదా -
 మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 36  / Sri Lalita Sahasranamavali - Meaning - 36 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 68

289. శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా -
వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.

290. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా -
అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.

🌻. శ్లోకం 69

291. పురుషార్థప్రదా -
పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.

292. పూర్ణా - పూర్ణురాలు.

293. భోగినీ -
భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.

294. భువనేశ్వరీ -
చతుర్దశ భువనములకు అధినాథురాలు.

295. అంబికా - తల్లి.

296. అనాదినిధనా -
ఆది, అంతము లేనిది.

297. హరిబ్రహ్మేంద్ర సేవితా -
విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37  / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 70

298. నారాయణీ -
నారాయణత్వ లక్షణము గలది.

299. నాదరూపా -
నాదము యొక్క రూపము అయినది.

300. నామరూపవివర్జితా -
పేరు, ఆకారము లేనిది

301. హ్రీంకారీ -
హ్రీంకార స్వరూపిణి.

302. హ్రీమతీ -
లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.

303. హృద్యా -
హృదయమునకు ఆనందము అయినది.

304. హేయోపాదేయవర్జితా -
 విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37  / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 71

305. రాజరాజార్చితా -
రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.

306. రాఖినీ -
కామేశ్వరునికే రాణి.

307. రమ్యా -
మనోహరమైనది.

308. రాజీవలోచనా -
పద్మములవంటి కన్నులు కలది.

309. రంజనీ -
రంజింప చేయునది లేదా రంజనము చేయునది.

310. రమణీ - రమింపచేయునది.

311. రస్యా - రస స్వరూపిణి.

312. రణత్కింకిణి మేఖలా -
మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39  / Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 72

313. రమా -
లక్ష్మీదేవి.

314. రాకేందువదనా -
పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.

315. రతిరూపా -
ఆసక్తి రూపమైనది.

316. రతిప్రియా -
ఆసక్తి యందు ప్రీతి కలది.

317. రక్షాకరీ -
రక్షించునది.

318. రాక్షసఘ్నీ -
 రాక్షసులను సంహరించునది.

319. రామా -
ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.

320. రమణ లంపటా -
రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40  / Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 73

321. కామ్యా -
కోరదగినటువంటిది.

322. కామకళారూపా -
కామేశ్వరుని కళయొక్క రూపమైనది.

323. కదంబకుసుమప్రియా -
కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

324. కళ్యాణీ -
శుభ లక్షణములు కలది.

325. జగతీకందా -
జగత్తుకు మూలమైనటువంటిది.

326. కరుణా రససాగరా -
దయాలక్షణానికి సముద్రము వంటిది.

🌻. శ్లోకం 74

327. కళావతీ -
కళా స్వరూపిణీ.

328. కలాలాపా -
కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.

329. కాంతా -
కామింపబడినటువంటిది.

330. కాదంబరీ ప్రియా -
పరవశించుటను ఇష్టపడునది.

331. వరదా -
వరములను ఇచ్చునది.

332. వామనయనా -
అందమైన నేత్రములు గలది.

333. వారుణీమదవిహ్వలా -
వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41  / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 75

334. విశ్వాధికా -
 ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.

335. వేదవేద్యా -
వేదముల చేత తెలియదగినది.

336. వింధ్యాచలనివాసినీ -
వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.

337. విధాత్రీ -
విధానమును చేయునది.

338. వేదజననీ -
వేదములకు తల్లి.

339. విష్ణుమాయా -
విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.

340. విలాసినీ -
వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

🌻. శ్లోకం 76

341. క్షేత్రస్వరూపా -
 క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.

342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ -
స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.

344. క్షయవృద్ధివినిర్ముక్తా -
 తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 77

345. విజయా -
విశేషమైన జయమును కలిగినది.

346. విమలా -
మలినములు స్పృశింపనిది.

347. వంద్యా -
నమస్కరింపతగినది.

348. వందారుజనవత్సలా -
నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.

349. వాగ్వాదినీ -
వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.

350. వామకేశీ -
వామకేశ్వరుని భార్య.

351. వహ్నిమండవాసినీ -
అగ్ని ప్రాకారమునందు వసించునది.

🌻. శ్లోకం 78

352. భక్తిమత్కల్పలతికా -
భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.

353. పశుపాశ విమోచనీ -
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.

354. సంహృతాశేషపాషండా -
 సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.

355. సదాచారప్రవర్తికా -
 సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 43 / Sri Lalita Sahasranamavali - Meaning - 43 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 79

356. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా -
ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.

357. తరుణీ -
ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.

358. తాపసారాధ్యా -
తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.

359. తనుమధ్యా -
కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.

360. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

🌻. శ్లోకం 80

361. చితిః -
కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.

362. తత్పదలక్ష్యార్థా -
తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.

363. చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.

364. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః -
తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 44  / Sri Lalita Sahasranamavali - Meaning - 44 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 81

365. పరా -
పరాస్థితిలోని వాగ్రూపము.

366. ప్రత్యక్చితీరూపా -
 స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.

367. పశ్యంతీ -
రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు

368. పరదేవతా -
పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.

369. మధ్యమా -
పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.

370. వైఖరీరూపా -
స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.

371. భక్తమానసహంసికా -
భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.

🌻. శ్లోకం 82

372. కామేశ్వరప్రాణనాడీ -
శివుని ప్రాణనాడీ స్వరూపిణి.

373. కృతజ్ఞా -
చేయబడే పనులన్నీ తెలిసింది.

374. కామపూజితా -
కామునిచే పూజింపబడునది.

375. శృంగారరససంపూర్ణా -
 శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.

376. జయా -
జయస్వరూపిణి.

377. జాలంధరస్థితా -
 జాలంధరసూచిత స్థానము నందున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹




🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 87

399. వ్యాపినీ -
 వ్యాపనత్వ లక్షణము కలది.

400. వివిధాకారా -
వివిధములైన ఆకారములతో నుండునది.

401. విద్యావిద్యాస్వరూపిణీ -
విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.

402. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ -
 మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ.

🌻. శ్లోకం 88

403. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః -
భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.

404. శివదూతీ -
శివుని వద్దకు పంపిన దూతిక.

405. శివారాధ్యా -
శివునిచే ఆరాధింపబడునది.

406. శివమూర్తిః -
శివుని యొక్క స్వరూపము.

407. శివంకరీ -
శుభములు చేకూర్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. 

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 39  / Sri Lalita Sahasranamavali - Meaning - 39 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 72

313. రమా -
లక్ష్మీదేవి.

314. రాకేందువదనా -
పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.

315. రతిరూపా -
ఆసక్తి రూపమైనది.

316. రతిప్రియా -
ఆసక్తి యందు ప్రీతి కలది.

317. రక్షాకరీ -
రక్షించునది.

318. రాక్షసఘ్నీ -
 రాక్షసులను సంహరించునది.

319. రామా -
ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.

320. రమణ లంపటా -
రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40  / Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 73

321. కామ్యా -
కోరదగినటువంటిది.

322. కామకళారూపా -
కామేశ్వరుని కళయొక్క రూపమైనది.

323. కదంబకుసుమప్రియా -
కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

324. కళ్యాణీ -
శుభ లక్షణములు కలది.

325. జగతీకందా -
జగత్తుకు మూలమైనటువంటిది.

326. కరుణా రససాగరా -
దయాలక్షణానికి సముద్రము వంటిది.

🌻. శ్లోకం 74

327. కళావతీ -
కళా స్వరూపిణీ.

328. కలాలాపా -
కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.

329. కాంతా -
కామింపబడినటువంటిది.

330. కాదంబరీ ప్రియా -
పరవశించుటను ఇష్టపడునది.

331. వరదా -
వరములను ఇచ్చునది.

332. వామనయనా -
అందమైన నేత్రములు గలది.

333. వారుణీమదవిహ్వలా -
వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 41  / Sri Lalita Sahasranamavali - Meaning - 41 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 75

334. విశ్వాధికా -
 ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.

335. వేదవేద్యా -
వేదముల చేత తెలియదగినది.

336. వింధ్యాచలనివాసినీ -
వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.

337. విధాత్రీ -
విధానమును చేయునది.

338. వేదజననీ -
వేదములకు తల్లి.

339. విష్ణుమాయా -
విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.

340. విలాసినీ -
వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

🌻. శ్లోకం 76

341. క్షేత్రస్వరూపా -
 క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.

342. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ -
స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.

344. క్షయవృద్ధివినిర్ముక్తా -
 తరుగుదల, పెరుగుదల లేనిది.
క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 77

345. విజయా -
విశేషమైన జయమును కలిగినది.

346. విమలా -
మలినములు స్పృశింపనిది.

347. వంద్యా -
నమస్కరింపతగినది.

348. వందారుజనవత్సలా -
నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.

349. వాగ్వాదినీ -
వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.

350. వామకేశీ -
వామకేశ్వరుని భార్య.

351. వహ్నిమండవాసినీ -
అగ్ని ప్రాకారమునందు వసించునది.

🌻. శ్లోకం 78

352. భక్తిమత్కల్పలతికా -
భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.

353. పశుపాశ విమోచనీ -
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.

354. సంహృతాశేషపాషండా -
 సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.

355. సదాచారప్రవర్తికా -
 సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. 

No comments:

Post a Comment