104) శ్లోకము:-
అవహేలితశాస్త్రై ర్థైరవజ్ఞాతమహాజనైః
కష్టామప్యాపదం ప్రాప్తో న మూఢైః సమతామియాత్.
శాస్త్రములను, అందలి అర్థములను తిరస్కరించువారును, జ్ఞానులగు మహాత్ములను ఉపేక్షించువారు నగు మూఢులతోటి సాంగత్యమును, కష్ట ఆపత్కాలమలందును కూడ చేయరాదు.
న వ్యాధిర్న విషం నాపత్తథా నాధిశ్చ భూతలే
ఖేదాయ స్వశరీరస్థం మౌర్ఖ్య మేకం యథా నృణామ్.
ఈ ప్రపంచమున మనుజులకు తమ శరీరమందున్న అజ్ఞానము ఎంత దుఃఖమును కలిగించునో, అంత దుఃఖమును ఏవ్యాధిగాని, విషముగాని, ఆపదగాని, మానసిక బాధగాని కలుగజేయజాలవు.
ఆపదో యా దురుత్తారా యాశ్చ తుచ్ఛాః కుయోనయః
తాస్తా మౌర్ఖ్యాత్ర్పసూయన్తే ఖదిరాదివ కణ్టకాః.
దాటుటకు కష్టతరమైనట్టి గొప్ప ఆపద లెవ్వి కలవో, మఱియు ప్రపంచమున నీచజన్మ లెవ్వికలవో, అవియన్నియు ఖదిర (చండ్ర)వృక్షము నుండి ముండ్లవలె అజ్ఞానము నుండియే జనించుచున్నవి.
***
చంద్రాతపః కశ్చన సంప్రసన్నో మహేశనేత్రా తిథితర్పణోనః!
మనోభిలాషం సఫలీకరోతు మహేశ్వరీహాసలవప్రకాశః !!
భావము:-
ఆచూపుల సుఖశీతలత, చంద్రుని అమృతత్త్వము మహేశ్వరుని నేత్రములకే కాక, భోజనార్థము వచ్చు అతిథులకు సకల సంతర్పణముగా, మనోభిలాషను తీర్చుచు, వారి తాపముల ఉపశమింప చేయుచున్నవి.
No comments:
Post a Comment