Saturday, 13 June 2020

16-06-2020



ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు 

శ్రీకృష్ణుని జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)
* నేటి కవిత్వం - క్రౌంచపద 
" భరోసా " కధ 
పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు
* అన్నమయ్య సంకీర్తన 
* ఓ చిలక ఇక నా వెంట పడకు
* శ్రీ సూర్యస్తోత్రం
* 🌻. రేపటికి ఏదైనా ఉండదేమో! అనే భావమే లోభం.  🌻

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -శ్రీ కృష్ణ భక్తి.! 
"One day a fruit vendor approached Lord Krishna's house, and the little toddler Krishna gathered some food grains with His little palms and went to the vendor to exchange the grains for fruit. On the way, almost all the grains fell from His palms, only one or two grains remaining, but the fruit vendor, out of full affection, accepted these grains in exchange for as much fruit as Krishna could take. As soon as she did this, her basket became filled with gold and jewels." - Srimad-Bhagavatam 10

శ్రీకృష్ణుని జననము - 1 (కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా)

కస్తూరి రంగరంగా - నాయన్న - కావేటి రంగరంగా 

శ్రీరంగ రంగరంగా - నినుబాసి - యెట్లునే మరచుందురా

కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ

దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ


యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను

ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెను

తలతోను జన్మమైతే - తనకు బహు - మోసంబు వచ్చుననుచు

ఎదురు కాళ్ళను బ్ట్టెను - ఏడుగురు - దాదులను జంపెనపుడు


నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున ఏడ్చుచు

నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు

ఒళ్ళెల్ల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి


నిన్నెట్లు ఎత్తుకొందూ - నీవొక్క - నిముషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను

గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబు లాడెనపుడు

ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు


కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీ పుణ్యమయె కొడకా - యింకొక్క - నిముషంబు తాళుమనుచూ

కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగాను

పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ


తడివస్త్రములు విడచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను

తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను

అడ్డాలపై వేసుక _ ఆబాలు - నందచందము చూచెను


వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ

సితపత్ర నేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామచంద్రుడమ్మ

శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము


పండ్లను పరుసవేది - భుజమున - శంఖచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి -బొడ్డున పారిజాతం

అరికాళ్ళ పద్మములను - అన్నియూ - అమరెను కన్నతండ్రీ

నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్ళు వ్రసెతండ్రీ


అన్నెకరి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా

నిన్ను నే నెత్తుకోని - ఏ త్రోవ - నేగుదుర కన్నతండ్రి

ఆ చక్కదనము జూచి - దేవకి -శోకింపసాగె నపుడు


తల్లి శోకము మాంపగా - మాధవుడు - గట్టిగా ఏడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను

నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా

అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా


బూచులను మర్ధించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా

నీ పుణ్యమాయె కొడుక - నీవొక్క - నిముషంబు తాళుమనుచు

అల్లడుగొ జోగివాడూ - నాతండ్రి - వస్తాడు పవళించరా


జోగి మందుల సంచులూ - ఏవేళ - నాచంక నుండగాను

జోగేమి చేసునమ్మా - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా

నీ పుణ్యమాయె కొడకా - నీవొక్క - నిముషంబు తాళుమనుచు

అల్లదుగొ పాము వచ్చె - నాతండ్రి - గోపాల పవళించరా


పాముల్ల రాజె అయిన - శేషుండు - పానుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నళినాక్షి - భయము నీకేలనమ్మా

నీలి మేఘపు చాయలూ - నీమేను - నీలాల హరములునూ

సద్గురుడు వ్రాసె నాడు - నాతండ్రి - నీరూపు నీచక్కన


నిన్ను నే నెత్తుకోనీ - యే త్రోవ - పొదురా కన్నతండ్రీ

నాకేమి భయములేదే - నాతల్లి - నకేమి కొదువలేదే

మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను వెరపించవస్తే

మా మామ నాచేతనూ - మరణామై - పొయ్యేది నిజముసుమ్మూ


వచ్చు వేళాయెననుచూ - నాతల్లి - వసుదేవు పిలువనంపూ

గోపెమ్మ బిడ్డ నిపుడ్ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా

అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ

రేపల్లె వాదలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చెనపుడూ


గోపెమ్మ పుత్రినపూడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ

దేవకీ తనయు డపుడు - పుట్టెనని - కంసునకు కబురాయెను

ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ

జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు


చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె

తెమ్మని సుతునడిగెను - దేవకి - అన్నదీ అన్నతోనూ

మగవాడు కాదురన్న - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా

ఉపవాసములు నోములూ - నోచి ఈ - పుత్రికను గంటినన్నా


పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా

దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి

పూజ ఫలములచేతనూ - వారికృప - వల్ల పుత్రికను గంటీ

నీ పుణ్యమాయెరన్న - నీవు పు - త్రికను దయచేయుమన్నా


నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుటతగదురన్నా

ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిబట్టి బ్రతిమాలెనూ

గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ

కాదు కాదని కంసుడు - దేవకి - పుత్రికను అడిగె నపుడు


అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె

అంబరమునకు ఎగురగా - వేయునపు - డా బాల కంసు జూచి

నన్నేల చంపెదవురా - నీయబ్బ - రేపల్లె వాడలోను

పెరుగుతున్నాడ వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ


నిజముగా దోచెనపుడూ - కంసుండు - యేతెంచి పవళించెనూ

రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను

నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ

చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను


పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను

శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను

రేపల్లె వాడలందూ - కృష్ణుండు -  తిరుగుచున్నా చోటకూ

చనుదెంచి విషపు పాలూ - ఇవ్వనూ - సమకట్టి ఇవ్వగానూ


బాలురతొ బంతులాడ - కృష్ణూని - బాలురందరు కొట్టగా

కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధినడుమన నిలచెనూ

--(())--

Image may contain: one or more people

భ  మా  స  భా  న  న  న  య   క్రొఞ్చపద ... 10  .. 18    
UII   UUU  IIU  UII  III   III   III  IUU 
నేటి కవిత్వం - క్రౌంచపద 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

నామది నిన్నేకో రి సమానాన్ని తలచినత డవున తలపులు తెల్పే 
నే మనసే పంచీ మమతే నంచీ మగువ కళలు మునుగు నటుల చేసే 
నే మది ఆడించే నటనే నా బతుకును ఒకవినయము నడిపించే  
నే మరి నీవన్నా నను అన్నా తెలిసి మసలు కొను  వలపుల రాణీ 

కాలమనే నావే కదిలే కాకుల కరుణ కలకల కరువు ఏగా 
ఏలను అన్నా నాతలపే యేలిక ఇరుకున మయమగు కధ చెప్పే  
పాలన లేకుండే మరి పాపాలను  కలయిక కపటము కరిగించే   
చాలని తెల్పాకే సహనం చూపియు సమయ తఱచు సుఖములు రాణీ  

మొహమనే దారే వినయం మత్తును కలుగు తనము మనసును వేధిం  
చే హరినీ సౌందర్యమునే చూపియు మనసు మరచు విధమున సేవే 
దాహము తీర్చేదే తనువే దాపరికము తెలపదు వయసును పెంచే 
స్నేహము ఆహార్యమ్మును ప్రశ్నే తలపకయు మనసే కలిపిన రాణీ   
  

--(())-- 


Radha Painting - Divine Embrace by Alexandra Bilbija


" భరోసా " నేడే చదవండి,  చదివి పిల్లలకు చెప్పండి  

అనగనగా ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"
రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.. 
కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.

         🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

--(())--


🙏🌺పూరీలో జగన్నాథునికి నివేదించే నైవేద్యాలు ఇవే
పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.🌺🙏

🌺1. అన్నం
2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
6. నేతి అన్నం 7. కిచిడీ
8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)
21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)
30. దొహిబొరా (పెరుగు గారెలు)
31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)
35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)
36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)
39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)
40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)
41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)
43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)
47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)
48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)
49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)
51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)
52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)
53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)
54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)
55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)🌺
(సేకరణ)

--(())_-


* అన్నమయ్య సంకీర్తన      
🕉🌞🌏🌙🌟🚩

రేకు: 37-2
సంపుటము: 1-228
రేకు రాగము: ముఖారి.


సిరి దొలంకెడి పగలు చీకఁటా యితఁడేమి
యిరవు దెలిసియుఁ దెలియనియ్యఁడటుగాన!!


తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడు
వెలుఁగుచున్నాడు బహువిభవములతోడ
కలగుణం బటువలెనె కాఁబోలు లోకంబు
కలదెల్ల వెలిలోనఁ కనిపించుఁ గాన !!


మేరమీరిన నీలమేఘమో యితఁడేమి
భూరిసంపదలతోఁ బొలయుచున్నాడు
కారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకు
కోరికలు తలఁపులోఁ కురియు నటుగాన!!


తనివోని ఆకాశతత్వమో యితఁడేమి
అనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడు
ఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబు
తనయందె యణఁగి యుద్భవమందుఁగాన!!

🕉🌞🌏🌙🌟🚩

భావము:-

ఈ స్వామి ధరించిన వైభవోపేతమైన నగలు, నల్లని ఆయన ఒంటిమీద మెరుస్తుంటే పగలు చీకటి సృష్టించినదితడేనా అన్నట్లున్నది. ఎందుకంటే ఆయన ఇరవు (మహిమ) కొంత తెలిసినట్లున్నాయేమి తెలియనీయడు.


1. ఆలోచిస్తే ఇతడు హరినీలదర్పణము (ఇంద్రనీలపు అద్దం) కాదుగదా! ఎన్నో వైభవాలతో వెలిగిపోతున్నాడే, మరి ఈయనకు గల గుణం కూడా లోకములో బయటకు కనబడే గుణాలలాగే కనిపిస్తున్నాయి. అద్దం చేసేపని కూడా అదే కదా! మనం యేమిచేస్తే బింబమూ అదే చేస్తుంది.


2. అతిశయించిన నీలమేఘమా ఇతడు అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద సంపదల నిండుకుండలా వున్నాడు, కారుణ్య నిధి కాబోలు అని కూడా అనిపిస్తున్నది. ప్రాణుల తలపులో కోరికలు కురిపిస్తున్నాడు కదా! మరి.


3. అనఘుడైన (పాపరహితుడైన) ఈ శ్రీవేంకటేశ్వరుడు అంతులేని ఆకాశతత్వమున్నవాడా యేమి? ఈ ఘనమూర్తి అట్లాగేవుంటాడు కాబోలు. ఎందుకంటే ఆకాశము ఏమీలేనట్లున్నా సకల ఖగోళ మండలం దాని యందే అణగివుంటుంది కదా! అన్నీ దానినుంచే 
ఉద్భవిస్తాయి.

🕉🌞🌏🌙🌟🚩



WORLDSELFIEPAGE: God loves art painting
నేటి గీతం 

ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

* ఓ చిలక ఇక నా వెంట పడకు 
నీదైర్యం, నీ ఓర్పు నాకు లేవు  
నన్ను నేనేనుగా ఒకరికి చిక్కా 
ఓ చిలక ఇక నా వెంట పడకు

మాయను ఎదిరించే శక్తి నాకు లేదు 
ఆత్మను రక్షించుకొనే భక్తియును లేదు 
కాల చక్రాన్ని గమనించి నడిచే యుక్తి లేదు  
చిలకపలుకులు చిన్మయ రూపానికి చిక్కా 

మనుష్యుని ప్రాణం ఏ చిలక యందు లేదు  
వెన్నలా కరిగే లీలా ఘనతకు చిక్కితే చాలు   
మానసోల్లాసమై హొయలుకు చిక్కి, సొబగుతో  
తన్ను తాను మరచి తన్మయత్వానికి చిక్కా 

ఆత్మ అదృష్టమో, పరమాత్మ అదృష్టమో 
కయ్యమునకు చిక్కక, వియ్యము పొంది 
నిత్యమూ జ్ఞానమనే గ్రాసం ను గ్రహించి
అజ్ఞానాన్ని తొలగించే విఙ్నానానికి చిక్కా 

కల్ముష రహితునిగా, ప్రేమ అనే పంజరంలో 
అనురాగం, ఆత్మీయత, బంధమనే చువ్వలమధ్య
ఉయ్యాలమీద ఊహల కందని సుందరితో 
హాయిని, అనుభూతిని,  పొందుటకు చిక్కా 

నెయ్యమునకు ఆ పరమాత్మ అండ అవసరం        
మన:శాంతికి, మనుగడకు, స్పర్సతాపము అవసరం 
చిరునగవు తోడైతే చిత్ర విచిత్రాలు చూడుట అవసరం 
రాధా కృష్ణులులాగా అనురాగ బంధానికి చిక్కా

ఓ చిలక ఇక నా వెంట పడకు 
నీదైర్యం, నీ ఓర్పు నాకు లేవు  
నన్ను నేనేనుగా ఒకరికి చిక్కా 
ఓ చిలక ఇక నా వెంట పడకు


--((*))--

ఓం శ్రీ రామ్  .... శ్రీ సూర్యస్తోత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ధ్యానం |


ధ్యాయేత్సూర్యమనంత
కోటికిరణం తేజోమయం భాస్కరం |
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||

ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం |
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 1||

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః  || 2 ||

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 4 ||

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనే మహాసాక్షిన్ ఆదిత్యాయ నమో నమః || 5 ||

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తే దయామూర్తే తత్త్వమూర్తే నమో నమః || 6 ||


సకలేశాయ సూర్యాయ ఛయేశాయ నమో నమః |
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనం || 7 ||

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణం |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ || 8 ||


సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ 
|| 9 ||


🚩🌞🚩🌞🚩

🌻. రేపటికి ఏదైనా ఉండదేమో! అనే భావమే లోభం.  🌻

       పలుకుబడి ఉందని ఇతరులతో పనులు చేయించుకుంటే, చిక్కుల్లో పడతారు.   

   తిడితే పడే వారి స్థితిలో నేనుందును గాక! అని‌ భగవంతుని ప్రార్థించు." పడ్డవాని వెనుక భగవంతుడు ఉండును.   

మాయ సత్యమైనదే కాని, అది కరిగిపోయిన తరువాత ఉన్న సత్యం వంటిది మాత్రం కాదు. మాయ తాత్కాలిక సత్యం. అది కరిగిన తరువాత ఉన్నది శాశ్వత సత్యం.  

మృత్యుభీతి లేనివాడే మృత్యువు లేనివాడు. ప్రపంచంలో అనేక అపచారములకు కారణం మృత్యుభీతి మాత్రమే.   


అక్కరలేని విషయాలలోనికి మనస్సు వెళ్లినచో ధర్మాచరణకు పనికిరావు...

--(())--

No comments:

Post a Comment