Tuesday, 9 June 2020



* ఉచ్ఛిష్ట గణపతి
* ఓంకారం
* శ్రీగురుభ్యోనమః
* అన్నమయ్య సంకీర్తన
* 🌻. సుఖజీవనము 🌻
*విష్ణు సహస్ర నామ మహిమ
* శ్రీగురుభ్యోనమః

యజ్ఞార్ధము, పురుషార్ధము, స్వార్ధము మూడున్నాయి.

 యజ్ఞార్ధము: ఇతరుల శ్రేయస్సు కోసమే నేను బ్రతుకుతాను అనే దీక్ష పట్టిన వానికి  తన జీవితము మీద తనకు స్వామిత్వము వస్తుంది. నీ జీవితానికి నువ్వే రాజువైపోతావు. ఋషులు ఒక సూక్తినిచ్చారు.

నిష్కారణముగా ఇతరుల శ్రేయస్సు కొరకై పనిచేసేవారు నిష్కారణముగా ఆనందంగా ఉంటారు.

పురుషార్థం :  పురుషార్ధమంటే ధర్మాన్ని ఆధారము చేసుకొని అర్ధ, కామాదులను పరిపూర్ణము చేసుకోవడము. దీనివలన చిక్కులుండవు తప్ప, మోక్షము రాదు.

స్వార్థం :
స్వార్థం అంటే కేవలం మన గురించి మనము పనిచేయడం.
రెండవ, మూడవ దానిలో మనము తరించే పద్ధతి లేదు.

🌻. భాగవతము 🌻

--(())--


* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత నీ రంజకపు చేతలు సురలకెంత వశమా !!

ll 1చరణంll
తేరిమీద నీ రూపు తెచ్చిపెట్టి ఆర్జునుడు 
కౌరవుల గెలిచే సంగర భూమిని సారెకు భీముడు పురుషాముగ్రము తెచ్చు చొట నీరోమములు కావ నిఖిల కారణము !!

ll 2చరణం ll
నీ మూలమునగాదె నెలవై సుగ్రీవుడు 
రాముని గొలిచి కపిరాజాయను రాముడు నీ వంకనేపొ రమణి సీతా దేవి 
ప్రేమముతో మగుడా పెండ్లాడెను !!

ll3చరణంll
బలుదైత్యులను దుంచ బంటు తనము మించ కలకాలమునునెంచ కలిగితిగా అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి 
నిలయపు హనుమంత నెగడితిగా !!

🕉🌞🌎🌙🌟🚩

🌻. సుఖజీవనము 🌻

మానవుడు సుఖముగా జీవించవలెనన్న ఏది ప్రదానము- ధనమా? ఆరోగ్యమా? సత్ సంతానమా? 

ధనము వలన మానవుడు శారీరకముగా సుఖమును అనుభవించగలడే కానీ, మానసికముగా శాంతిని పొందలేడు. ఇక ఆరోగ్యము మానవునకు ముఖ్యమయినది. ఆరోగ్యవంతుడు కష్టపడి ధనము సంపాదించగలడు. కానీ, ఒక‌ ధనవంతుడు ఆరోగ్యమును‌ పొందలేడు. 

అయితే, ఈ ఆరోగ్యము శరీరానికా? మనస్సుకా? ఆరోగ్యవంతమయిన శరీరము కన్నా ఆరోగ్యవంతమయిన మనస్సు ప్రధానము. 

శారీరక రుగ్మతలకు కారణము కేవలము భౌతిక పరిస్థితులే కాక, మానసిక పరిస్థితులు కూడా కారణము అని పెద్దలు సూచించి ఉండిరి. ఇదే విధముగా రోగమునకు కాక, రోగికి చికిత్స చేయు విధానము హోమియోలో సూచించబడినది. 

కామక్రోధాదులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే కాక శారీరక ఆరోగ్యమునకు కూడ శత్రువులే. కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి శరీరములోని గ్రంథులపై ఎక్కువ ప్రభావమును చూపును. 

ఒకరిపై ద్వేషము, పగ, చికాకు కలిగిన వ్యక్తికి అన్నము హితముగా ఉండదు. నిద్రపోలేడు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండును. 

ఈ ప్రభావము వలన నరములకు ఒత్తిడి కలిగి రక్తపు పోటు వచ్చును. గుండె, ఊపిరితిత్తులు దీని ప్రభావమునకు లోనయి రోగముల రూపముగా పరిణమించును. 

నేటి కాలమున మూడువంతుల రోగులు మానసిక కారణముల వ్యాధులకు లోనగుచున్నవారే.
✍ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹

🌼🌿*విష్ణు సహస్ర నామ మహిమ :*🌼🌿
పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు .
 ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .
భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . 
ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను  విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు .  అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది .
 అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . 
ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ  , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది .
 భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట . 
ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట .
 వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి  కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు .
 ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ
కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . 
ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా  " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . 
అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను ,  ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగు ను తొలగించాడు . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు .
 అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది . 
విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .
--(())--

No comments:

Post a Comment