* ఆటవెలది పద్యాలు - జీవితం లో తండ్రి
* విచిత్ర వినాయక దేవాలయము..!!
* ఆనంద పద్యాలు
* ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?
* అన్నమయ్య సంకీర్తన
*నీవు ఎవరు*
* నేటి కవిత్వం - కాలము * తెనాలి రామ కృష్ణ కధలు
సుందర కాండ (వాల్మీకి విరచి రామాయణం) 27-06-2020
(మల్లాప్రగడ రామకృష్ణ అంత్యానుప్రాస భావ సుందర కాండ)...... 4
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణ మహా కావ్యములో సుందరమైనది "సుందర కాండ "
ఈ ఉత్తమోత్తమ గ్రందాన్ని ఆంద్ర మహాజనులకు తేట తెలుగులో సులభ శైలిలో ప్రతిఒక్కరు చదివే విధముగా నా చేత ఆ సీతా రామాంజ నేయులు వ్రాయమన్న విధముగా నేను గూగల్ వారి సహాయ సహకారముతో, యూట్యూబు, ట్విట్టర్, మరియు ఫేస్ బుక్ సహాయముతో నేను ఇందు పొందు పరుస్తున్నాను.
నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇది మాత్రము నిష్టగా, ఇష్టముగా చదివి రోజుకు కొంత చొప్పున చదువుతూ పూర్తిగా మాత్రము చదవవలెను, మద్యలో మాత్రము ఇది ఆపకూడదు, సుబ్రపరుచుకొని పరిసుబ్ర ప్రాతమున చదవగలరు, యువకులు, పిల్లలు, స్త్రీలు వృద్ధులు అందరు చదవవచ్చును.
"సుందరే సుందరో రామ:
సుందరే సుందరి కథా
సుందరే సుందరి సీతా
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందర: కపి:
సుందరే సుందర మంత్రం
సుందరే కిం న సుందరం ".
శ్రీరాముడు సుందరుడు, సీత సుందరి, కథ సుందరం, వనం సుందరం, కావ్యం సుందరం. హనుమ సుందరుడు. మంత్రం సుందరం.
సుందర కాండలో సుందరం కానిదేమున్నాది ?
మా తాతగారు, మాతండ్రి గారు హనుమత్, బాలా ఉపాసకులు
నాకు వచ్చిన విద్యతో నలుగురికి అర్ధమయ్యె విధముగా చదువుతారని ఆ సీతా రామాంజనేయుల కృపకు పాత్రులవుతారాని ఒక చిన్న ఆశతో
భీష్మ ఎకాదశినాడు నేను సుందర కాండ వ్రాయుట ప్రారంభించినాను, ఆ దేవుని సంకల్పము పూర్తి చేయగలనని నమ్మకముతో ఇందు పొందు పరుచుతూన్నాను.
నాకు సహకరిస్తున్నా డి.టి.ఎ.మరియు డిస్ట్రిక్ ట్రాజరీ స్టాప్ వారికి, హనుమత్ భక్తులకు, రామాయణము వ్రాసిన ఎందఱో మహానుభావులకు, స్నేహితులకు, సహకారం అందించిన నాశ్రిమతికి, మాపిల్లలకు , ప్రతిఒక్కరికి, చదివినవారికి చదవమని చెప్పినవారికి ఆ హనుమంతుని దీవెననలు ఉండునని నేను నమ్ముతున్నాను, మీరు ఆదేవుని కృపకు పాత్రు లవతారని ఆశిస్తున్నాను
ఇట్లు తమ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు
O -- O -- O
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సింహికను వధించుట
దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట
O -- O -- O
.................................. ............................. 5
తండ్రులను గుర్తుంచుకొనే రోజుగా ఈనాడు అందరికీ శుభాకాంక్షలు
౨౧-౦౬-2020
ఆటవెలది పద్యాలు - జీవితం లో తండ్రి
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లాలి లాలి అంటూ ఎత్తు కొనే తిప్పి
నాన్న చెప్పు కథల విలువ మనసు
అంటి పెట్టి కోని జీవితాన్నే మార్చు
కాల నిర్ణ యాన్ని అనుక రించు
పుట్టి పెరుగు చున్న నాకును చదువును
మంచి బుద్ధి వచ్చు మార్గ మచ్చు
తునక వెంట ఉండి కాపాడు తండ్రి యే
నిలువ నీడ కళల పంట గానె
కొయ్య గున్న నాకు మంటల విలువను
తెలిపి మది మాయ విప్పి చెప్పె
సమయ తలుపు పలుకు నిష్టగ ఉండేట్లు
చూచు మంత్ర లాగ తండ్రి బోధ
"విశ్వైక చైతన్య రసాను దాతః ,
సంక్షేమ సౌభాగ్య సుశబ్ద దాయిన్ !
ఆదిత్య రుక్శాంతి సుకామ్య కారిన్
రక్షస్వ మాం పాహి మరీచి మాలిన్!!!
సత్యాన్ని బోధించు వినమ్ర దాతా
విశ్వాస చాతుర్య మనస్సు పంచున్
చైతన్య భావాన్ని ఉషోదయాన్నీ
కర్తవ్య దాతృత్వ యసస్సు తండ్రీ
కదలి కదిలి ఒక్క విషయమూ చెప్పక
ఆత్మ తృప్తి కొరకు వేచి ఉండు
జన్మ పొంది పెద్ద వరముగ మానవ
సత్య పల్కు తండ్రి పంచి పెట్టు
బుద్ధి ప్రణయ తత్వ వికసిత మవ్వుట
హావ భావ సంతసమ్ము యేగ
భోగ లాల సమ్ము జీవికి ప్రధమము
మార్పు నేర్పు ఓర్పు తీర్పు తండ్రి
మనకు గురువు ఎవరు? ప్రశ్నలు వేయకు
భాస్కరాత్మ ప్రథమ వెలుగు గుర్వు
తల్లి తండ్రు లేగ కారక జన్మకు
ఉగ్గు పాలు పోసి పెంచు జగతి
--(())--
విచిత్ర వినాయక దేవాలయము..!!
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం.
ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం.
ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.
దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.
వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి..,
వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే.
కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం:.💐
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు.
నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది. జై గణేశా..!!
సర్వేజనా సుఖినోభవంతు..

--(())--
ఆనంద పద్యాలు రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తేట గీతి
రామచంద్రుడు ధరణిలో రాజుగాగ
ధర్మముద్దరణముజేయు తరుణ మందు
శక్తియుక్తుడౌ శివునట శరణు వేడె
అట్టి శూలియె నన్నిక యాదరించు
నిద్ర అందరికీ ఖాళి లాంటిదేను
నిద్ర సర్వప్రపంచము లీన మౌను
నిద్ర సహజము జరగడం లేదు అనకు
నిద్ర ఆరోగ్య సూక్తికి ముఖ్య మార్పు
శ్వేత ముఖ దేహ కాంతుల నొప్పి మహిత
స్వేచ్ఛ పద వాక్కు వెల్గుల నొప్పు మహిత
జ్వాల మయ మస్త కాంతులు తెల్పు మహిత
ప్రేమ మయ వేద బోధలు తెల్పు మహిత
వినయ వశిన్యాదులైన శక్తులతొ మహిత
వినయ చరితార్థులైనమౌనులతొ మహిత
వినయ చదువార్జులైన విద్యలతొ మహిత
వినయ సముపార్జులైన శక్తులతొ మహిత
సకల వాక్కుల సృష్టి కర్త మది మహిత
సకల దాహము తీర్చు భర్త మది మహిత
సకల దేహము ఇచ్చి పుచ్చు మది మహిత
సకల దానము చేసి సేవ మది మహిత
--(())--
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
రేకు: 771-5
సంపుటము: 16-419
రేకు రాగము: లలిత.
సుముఖ మంగళము శుభమంగళము
శమదమగత తే జయమంగళం!!
గంభీరగుణ కమలారమణా
శంభురాణి నుత సకల లోకయుత
మాం భజ-తే జయమంగళం
అంభోధిశయన హరినయనా!!
కనకాంబర నిజఘనచరణాంబర
దనుజ శరణ హతదైత్యగణా
అనుపమచరిత్ర అనంత నిరత
సనక ప్రియ తే జయమంగళం!!
చతుర్భుజాంగా సదయా పాంగ
గతనక్రాంబుజ కర చక్ర
శ్రితశరణాగత శ్రీవేంకటపతి
చతుర నమో తే జయమంగళం!!
🕉🌞🌏🌙🌟🚩
భావము :-
చక్కనిముఖము గలవాడా! విద్వాంసుడా ! ప్రసన్నుడా ! (సుముఖ!) నీకు శుభము, క్షేమము.
కామక్రోధాదులు లేక యడగియుండుట చేత క్లేశమునోర్చు గుణము చేత (శమ)బాహ్యేంద్రియ నిగ్రహము చేత(దమ) పొందదగినవాడా ! నీకు జయ మంగళము.
1. లోతుగల(బాగా పరిశీలిస్తే గాని అంతుబట్టని) గుణములు కలవాడా !ఉత్తమురాలయిన లక్ష్మీ దేవికి ఇష్టమైనవాడా! రామావతారంలో శివుని రాణి అయిన పార్వతి చేత పొగడబడినవాడా ! అన్ని లోకములు కూడుకొనియున్నవాడా ! నన్ను సేవించు. నీకు జయమంగళము. పాలసముద్రములో శయనించువాడా ! సూర్య నయనా !
2. పట్టువస్త్రములు ధరించినవాడా! తనదయిన గొప్పదయిన పాదముచే ఆకాశమును వామనావతారములో ఆక్రమించినవాడా ! రాక్షసులకు శరణము ఇచ్చినవాడా ! చంపబడిన రాక్షస సమూహములు కలవాడా! పోలికలేని చరిత్ర కలవాడా ! అంతులేని ఆసక్తి కలవాడా ! సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు అను వారికి ఇష్టమైనవాడా!
3. నాలుగు చేతులు కలవాడా ! కడ కన్నులయందు (కళ్ల చివర) దయను కురిపించువాడా !పద్మములాంటి చేతిలోని సుదర్శన చక్రముతో మొసలిని సంహరించినవాడా ఆశ్రితులకు శరణము అనుగ్రహించువాడా ! శ్రీ వేంకటేశ్వరా! నేర్పు కలవాడా! నమస్సులు. నీకు జయ మంగళము.
విశేషాలు :
మాంభజ : “నన్ను సేవించు.” అనే మాట ఒక చెలికత్తె స్వామి వారిని ఆట పట్టిస్తూ చెప్పినట్లుగా భావించుకోవాలి.
🕉🌞🌏🌙🌟
నేటి కవిత్వం - కాలము
రచయత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
కాలము తిరుగుచు ఉండు మనోకాలమే
చిలికి వణికి కదులు చుండూ
పల్లమునకు జలమే జరిగే
పంచవన్నె చిలక పలుకు మనసంతా
చల్లని పిలుపు వలే కలలే
చిత్ర మాలికలుగ కదలి పెనవేసే
ఎల్లరు కలసి మనస్సు కథల్లే
తపించు తపనలు తెలుపుట కాదా
మారదు మనసు తపించు మనోమాయవల్ల
సకల విషయమును తెల్పే
కోరెను వినయ విధేయత పక్కా
సరాగ పలుకు తొ తనువును పంచే
మారక వయసును పంచు కమతమ్మే
సకాల సమయమున మనసు పంచే
తోరణములుగ మనోవెలుగే తెల్పి
నిత్య సుఖమును బడయుట కాదా
--(())--
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
రేకు: 771-5
సంపుటము: 16-419
రేకు రాగము: లలిత.
సుముఖ మంగళము శుభమంగళము
శమదమగత తే జయమంగళం!!
గంభీరగుణ కమలారమణా
శంభురాణి నుత సకల లోకయుత
మాం భజ-తే జయమంగళం
అంభోధిశయన హరినయనా!!
కనకాంబర నిజఘనచరణాంబర
దనుజ శరణ హతదైత్యగణా
అనుపమచరిత్ర అనంత నిరత
సనక ప్రియ తే జయమంగళం!!
చతుర్భుజాంగా సదయా పాంగ
గతనక్రాంబుజ కర చక్ర
శ్రితశరణాగత శ్రీవేంకటపతి
చతుర నమో తే జయమంగళం!!
🕉🌞🌏🌙🌟🚩
భావము :-
చక్కనిముఖము గలవాడా! విద్వాంసుడా ! ప్రసన్నుడా ! (సుముఖ!) నీకు శుభము, క్షేమము.
కామక్రోధాదులు లేక యడగియుండుట చేత క్లేశమునోర్చు గుణము చేత (శమ)బాహ్యేంద్రియ నిగ్రహము చేత(దమ) పొందదగినవాడా ! నీకు జయ మంగళము.
1. లోతుగల(బాగా పరిశీలిస్తే గాని అంతుబట్టని) గుణములు కలవాడా !ఉత్తమురాలయిన లక్ష్మీ దేవికి ఇష్టమైనవాడా! రామావతారంలో శివుని రాణి అయిన పార్వతి చేత పొగడబడినవాడా ! అన్ని లోకములు కూడుకొనియున్నవాడా ! నన్ను సేవించు. నీకు జయమంగళము. పాలసముద్రములో శయనించువాడా ! సూర్య నయనా !
2. పట్టువస్త్రములు ధరించినవాడా! తనదయిన గొప్పదయిన పాదముచే ఆకాశమును వామనావతారములో ఆక్రమించినవాడా ! రాక్షసులకు శరణము ఇచ్చినవాడా ! చంపబడిన రాక్షస సమూహములు కలవాడా! పోలికలేని చరిత్ర కలవాడా ! అంతులేని ఆసక్తి కలవాడా ! సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు అను వారికి ఇష్టమైనవాడా!
3. నాలుగు చేతులు కలవాడా ! కడ కన్నులయందు (కళ్ల చివర) దయను కురిపించువాడా !పద్మములాంటి చేతిలోని సుదర్శన చక్రముతో మొసలిని సంహరించినవాడా ఆశ్రితులకు శరణము అనుగ్రహించువాడా ! శ్రీ వేంకటేశ్వరా! నేర్పు కలవాడా! నమస్సులు. నీకు జయ మంగళము.
విశేషాలు :
మాంభజ : “నన్ను సేవించు.” అనే మాట ఒక చెలికత్తె స్వామి వారిని ఆట పట్టిస్తూ చెప్పినట్లుగా భావించుకోవాలి.
🕉🌞🌏🌙🌟🚩
🕉🌞🌏🌙🌟🚩
రేకు: 771-5
సంపుటము: 16-419
రేకు రాగము: లలిత.
సుముఖ మంగళము శుభమంగళము
శమదమగత తే జయమంగళం!!
గంభీరగుణ కమలారమణా
శంభురాణి నుత సకల లోకయుత
మాం భజ-తే జయమంగళం
అంభోధిశయన హరినయనా!!
కనకాంబర నిజఘనచరణాంబర
దనుజ శరణ హతదైత్యగణా
అనుపమచరిత్ర అనంత నిరత
సనక ప్రియ తే జయమంగళం!!
చతుర్భుజాంగా సదయా పాంగ
గతనక్రాంబుజ కర చక్ర
శ్రితశరణాగత శ్రీవేంకటపతి
చతుర నమో తే జయమంగళం!!
🕉🌞🌏🌙🌟🚩
భావము :-
చక్కనిముఖము గలవాడా! విద్వాంసుడా ! ప్రసన్నుడా ! (సుముఖ!) నీకు శుభము, క్షేమము.
కామక్రోధాదులు లేక యడగియుండుట చేత క్లేశమునోర్చు గుణము చేత (శమ)బాహ్యేంద్రియ నిగ్రహము చేత(దమ) పొందదగినవాడా ! నీకు జయ మంగళము.
1. లోతుగల(బాగా పరిశీలిస్తే గాని అంతుబట్టని) గుణములు కలవాడా !ఉత్తమురాలయిన లక్ష్మీ దేవికి ఇష్టమైనవాడా! రామావతారంలో శివుని రాణి అయిన పార్వతి చేత పొగడబడినవాడా ! అన్ని లోకములు కూడుకొనియున్నవాడా ! నన్ను సేవించు. నీకు జయమంగళము. పాలసముద్రములో శయనించువాడా ! సూర్య నయనా !
2. పట్టువస్త్రములు ధరించినవాడా! తనదయిన గొప్పదయిన పాదముచే ఆకాశమును వామనావతారములో ఆక్రమించినవాడా ! రాక్షసులకు శరణము ఇచ్చినవాడా ! చంపబడిన రాక్షస సమూహములు కలవాడా! పోలికలేని చరిత్ర కలవాడా ! అంతులేని ఆసక్తి కలవాడా ! సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు అను వారికి ఇష్టమైనవాడా!
3. నాలుగు చేతులు కలవాడా ! కడ కన్నులయందు (కళ్ల చివర) దయను కురిపించువాడా !పద్మములాంటి చేతిలోని సుదర్శన చక్రముతో మొసలిని సంహరించినవాడా ఆశ్రితులకు శరణము అనుగ్రహించువాడా ! శ్రీ వేంకటేశ్వరా! నేర్పు కలవాడా! నమస్సులు. నీకు జయ మంగళము.
విశేషాలు :
మాంభజ : “నన్ను సేవించు.” అనే మాట ఒక చెలికత్తె స్వామి వారిని ఆట పట్టిస్తూ చెప్పినట్లుగా భావించుకోవాలి.
🕉🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment