Wednesday, 10 June 2020

* కొత్తగా పెళ్లైన అమ్మాయి
* నారాయణుని రూపము ‌దిగివచ్చె
అన్నమయ్య సంకీర్తన
* "మెలకువ".
* వృద్ధాప్యం



కొత్తగా పెళ్లైన అమ్మాయి వాళ్ల నాన్నకు కాల్ చేసింది.

- నాన్నా..

- ఏరా చిట్టితల్లీ

- ఒక బస్తాడు బియ్యం, బస్తాడు మినప్పప్పు పంపిస్తావా..?

- ఎందుకు తల్లీ.. మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నరు. నెలకు లక్షకు పైగానే వస్తాయి. బియ్యం, పప్పులు ఎందుకు నానా..? జీతం రాట్లేదా.. అక్కడ బియ్యం, పప్పులు దొరకట్లేదా ?

- అదేం లేదు నాన్నా.. మాకు ఈ మధ్య దోశలు, ఇడ్లీలు ఇంట్లోనే చేసుకుని తినాలనిపిస్తోంది.

- ఓహో.. కంట్రోల్ బియ్యం పంపమంటావా..?

- అది కాదు నాన్నా.. ఇద్దరం ఇందాక యూట్యూబ్‌లో దోశలు, ఇడ్లీలు ఎలా చెయ్యాలో చూశాం. దాంట్లో నాన్న బెట్టిన బియ్యం, నాన్న బెట్టిన మినప్పప్పు మిక్సీలో వేసి రుబ్బాలని ఉంది నాన్నా.

- నువ్వెలాగూ శ్రీచైతన్య, అల్లుడు గారు నారాయణ కదమ్మా చదివింది

- అవును నాన్నా.. దానికీ దీనికీ ఏం సంబంధం నాన్నా

- నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాన్న పెట్టిన బియ్యం నాన్న పెట్టిన మినప్పప్పు .. పెట్టెయ్. ఇంతకు ఎవరి నాన్న పెట్టాలో యూట్యూబ్‌లో లేదా తల్లీ..!

--(())--

* నారాయణుని రూపము ‌దిగివచ్చె

అక్షరములుచ్చరించు నపుడు ధ్యానమున రంగులు పుట్టును.  ఆ రంగుల నుండియే నారాయణుని రూపము ‌దిగివచ్చెను.  

యజ్ఞమున అక్షరములు ఉచ్చరించుట వలన రంగులు వ్యక్తమగుట సుప్రసిద్ధము.  

ఏడు స్వరములలో అక్షరములు  ఉచ్చరించునపుడు ఏడు రంగులు పుట్టును.  వానిని మూడు స్థాయిలలో ఉచ్చరించునపుడు ఇరువది యొక్క వెలుగులు పుట్టును. 

 కనుకనే వేదోచ్చారణమున వర్ణములు అను పదము పుట్టెను.  వర్ణమనగా అక్షరము లేక రంగు.  

ఋక్కు అను పదమున‌ రెండర్థములును కలవు.

దీనిని బట్టియే  దేవుని రూపము సువర్ణమయ విగ్రహమని అగమశాస్త్రము తెలుపును.  తరువాతి కాలమున సువర్ణమనగా బంగారమని  అర్థము వచ్చెను.  

అప్పటి నుండి దేవాలయములలో బంగారు విగ్రహములు ప్రతిష్ఠ చేయబడుటయు,  దొంగల భయమేర్పడుటయు  వచ్చి యజ్ఞశాలలు దేవాలయములుగా మారినవి.

--(())--


ఓం  శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


సేకరణ చందమామ కధ.!  

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

 “ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు. ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు. అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు.

ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది. దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు. కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు.

 మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి. ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు.

 అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

 మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది. రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు. నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు.

అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది. ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది.

 అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది. ఇదీ కథ! ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు. విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు. కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు. మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.
--(())--

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 10-2
సంపుటము: 1-62

ll పల్లవి ll
ఎంత చదివిన నేమి వినిన తన-
చింతయేల మాను సిరులేల కలుగు  !!


ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను !!


పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను !!


వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయాల మాను జయమేల కలుగు !!

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు
---------------------------

అతికాముకుడు = అధిక కామము కల వాడు
దుర్గతులేల = బీదరికము రాకుండా
విరసవర్తనము = దురుసు ప్రవర్తన


భావామృతం:- 
--------------------------
ఎంత చదివినా ఎంత వినినా తెలియని విషయాలు తెలుస్తాయోమో కాని మనిషికి తన విచారము పోతుందా సుఖము అనే సిరి కలుగుతుందా. పరులను నిందించే పాడు అలవాటు విడిచిపెట్టక అతి స్త్రీ వ్యసనపరుడు పొందే బలహీనతలు విడనాడక స్ధిరత్వంలేని చంచల మనస్తత్వం పోకుండా ఎవ్వరికైనా ఎన్నడైనా సద్గతి కలుగుతుందా దుర్గతులు రాకుండా వుంటాయా. ఇంకొకడి ధనం మీద ఆశపడే నీచమనస్తత్వం వదిలిపెట్టకుండా పరదూషణ చేసే పాడు అలవాటు విడనాడక దురుసుగా పోగరుబోతుగా ప్రవర్తించే పాడు అలవాటు మానక పుణ్యం కలుగుతుందా. పోనీ మెడకు తగులుకోనే ఆపదలు పోతాయా. శ్రీవేంకటేశ్వరుడే సర్వస్వం అని నమ్మి ఆ దేవదేవుడిని ఎవరి ఆత్మలో వారు ప్రతిష్టించుకొని నిత్యమూ దర్శించటం అలవాటు చేసుకోవాలి. కోపము అనే దురలవాటును విడిచిపెట్టేయాలి. అసత్యానికి ఆమడదూరంలో వుండాలి. ఇట్లా వుంటే జయం కలుగుతుంది. అంతేకాని అన్నీ అనుమానాలే అపనమ్మకములే అయిన వానికి మంచి జరుగుతుందా అస్సలు జరుగదు అంటు అన్నమయ్య కీర్తించాడు.


🕉🌞🌎🌙🌟🚩

"మెలకువ".

కల కొనసాగుతున్నప్పటికీ -- 'ఇది కల' అన్న జ్ఞప్తియే "మెలకువ".

ప్రపంచం కొనసాగుతున్నప్పటికీ -- 'ఈ ప్రపంచం మాయ' అన్న జ్ఞప్తియే "జ్ఞానము".

✨⚡️✨⚡️✨⚡️

దేవుడైనా, గురువైనా  "నా" తర్వాతే.

✨⚡️✨⚡️✨⚡️

నాటకం జీవుడికి ముగియడం - మరణం.

నాటకం దేవుడికి ముగియడం- ప్రళయం.

✨⚡️✨⚡️✨⚡️

నేను దేహ భావన లో ఉన్నప్పుడు -- నీవు ప్రభువు, నేను దాసుడను.

నేను జీవ భావనలో ఉన్నప్పుడు -- నీవు పూర్ణాత్మవు, నేను అంశాత్మను.

నేను ఆత్మ భావన లో ఉన్నప్పుడు -- నీవే నేను, నేనే నీవు.

✨⚡️✨⚡️✨⚡️

శరీరంతో ఏకత్వం పొందిన 'నేను' - అహం వృత్తి (మిథ్యా నేను)

ఆత్మతో ఏకత్వం పొందిన 'నేను' - అహం స్ఫురణ (నిజమైన నేను)

🕉🌞🌎🌙🌟🚩

Q 36:--వృద్ధాప్యం

Ans :--
1)భూభౌతిక ప్రపంచంలో మనకు మనమే కొన్ని నైతిక విలువల్ని ఆపాదించుకుని ఆ చట్రంలో ఎన్నో పరిమితులకు లోబడి బ్రతుకుతున్నాము.

2) యవ్వనం అద్భుతమైందని, వృద్ధాప్యం శాపమని, పేదరికం ఆధ్యాత్మిక తకు దగ్గర దారని కొన్ని నమ్మకాలను మనమే ఆపాదించుకున్నాము.

 3) ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని మనకు మనమే సృష్టించుకున్నాం. ఉన్నత చైతన్యం మనకు స్వేచ్ఛ ఇచ్చింది. కానీ కట్టుబాట్లు అన్ని మానవుడు సృష్టించుకున్నాడు. అనాది కాలం నుండి, ఎన్నో పరిమితులతో నమ్మకపు వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు.

ఎప్పుడైతే ఆ నమ్మకపు వ్యవస్థను చేధిస్తాడో మానవుడు అప్పుడే ఎదుగుతాడు.

3) ఆధ్యాత్మికత యవ్వనంలో అవసరం లేదని, వృద్ధాప్యంలో నే అవసరమని, అమెరికా లో పుట్టడం అదృష్టమని, సోమాలియా లో పుట్టడం శాపం అని ఇలా ఎన్నో నమ్మకాలను పరిమిత జ్ఞానం తో మానవుడు ఏర్పరుచుకున్నాడు.

4) జీవితంలో యవ్వనం,వృద్ధాప్యం రెండు దశలు, రెండు ముఖ్యమే. అమెరికా లో,సోమాలియా లో గాని ఎక్కడ ఏ దేశంలో పుట్టినా భూమి ఒక్కటే. జన్మ తీసుకోక ముందే మన చైతన్య పరిణామానికి అనుగుణంగా, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సంకల్పించి భూమి మీద మానవుడు జన్మ తీసుకుంటాడు.

ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, భూమి మీద అన్ని దేశాలు, ప్రాంతాలు ఒకే స్థితిని కలిగి ఉన్నాయి. అంటే మన దేహంలో ఏ part ముఖ్యం అంటే ఎలా చెప్పగలం. అన్ని భాగాలు ముఖ్యమైనవే. అలానే భూమి అనే దేహంలో అన్ని countries, అన్ని భాగాలు ముఖ్యమైనవే.

5) వృద్ధాప్యం లో ఉన్నవారిని నిరాదరణతో చూడటం, చులకనగా చూడటం, ఇవన్నీ ఆధ్యాత్మిక లోపం వల్ల జరుగుతుంది.

6) దేహం వృద్ధాప్యంలో ప్రత్యేక మైన enzymes, harmones ఆధ్యాత్మికంగా, మానసికంగా అత్యున్నతంగా రాణించడానికి విడుదల చేస్తుంది, మన నమ్మకపు వ్యవస్థ వల్ల వార్ధక్యంలో పొందవలసిన ఆనందం, ఆధ్యాత్మిక పరిణామం చెందలేకపోతున్నాము.

7) యుక్త వయస్సులో వున్నప్పుడు వృద్ధాప్యం గురించి, మృత్యువు గురించి భయపడుతున్నాము. వృద్ధాప్యంలో దేహం తన శక్తిని కోల్పోతుందని, చూపు మందగిస్తుందని, చెవులు వినికిడి శక్తిని కోల్పోతాయని ముందుగానే మైండ్ లో ఊహించుకుని hypnotise చేసుకుంటున్నాము. 

అందువల్ల అదే భౌతిక వాస్తవంగా మనం సృష్టించుకుంటున్నాం, ఎందుకనగా మన ఆలోచనలే మన జీవితం గనుక, యద్భావం తద్భవతి గనుక....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment