* దేవుడు కనబడడు - ఉనికి కనబడుతుంది
* అన్నమయ్య సంకీర్తన
*మనః ప్రవృత్తి
. మనః ప్రవృత్తి కెరటాలను పరమాత్మ యందు ప్రసరింప చేయుటే ధ్యానము. 🌹
శుభములకు, మంగళములకు ఆశ్రయమైన భగవంతుని యందు మనస్సుని ఉంచుట ధారణ అన్నాం.
అలా ఉంచిన మనస్సును పరమాత్మ యందు ప్రవర్తింపజేయుట, అంటే ఒకసారి మనస్సు భగవంతుని పై నిలిచిన త రువాత మొత్తం భగవంతుని రూపాన్ని ఒకేసారి నిలుపుకోలేము కావున ఒక్కొక్క అవయవాన్ని ధృఢంగా నిలుపుకోవాలి.
మొదలు పరమాత్మ పాదాల యందు మనసు నిలిపి పాదాలు తప్ప మరి వేటిపైనా ప్రవర్తించకుండా నిలుపగలుగుట. ఆ తరువాత పిక్కలు, మోకాళ్ళు, ఊరువులు ఇలా ఒక్కొక్క అవయవం యందు మనస్సు నిలిపి దాని యందే ప్రసరించునట్లు చేయడాన్ని అనగా మనస్సు యొక్క ప్రవృత్తి కెరటాలను పరమాత్మ యందు ప్రసరింప చేయుటే ధ్యానము.
ఇలా ధ్యానం చేయుటలో మనస్సుకు ప్రవర్తింపజేస్తే భగవంతునివి కాని ఇతర గుణముల యందు మనస్సు వెళ్ళదు. అందుకే ధ్యానముతోటే భగవంతునికి సంబంధించని గుణములను తొలగించుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌏🌙🌟🚩
రేకు: 61-3
సంపుటము: 1-312
రేకు రాగము: ధన్యాసి.
నందనందన వేణునాదవినోద ము-
కుంద కుందదంతహాస గోవర్ధనధరా !!
రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా !!
కమల కమలవాస కమలారమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా !!
పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నరహరి నామ పన్నగశయనా !!

No comments:
Post a Comment