Monday, 15 June 2020

23-06-2020





* తిరుపతిలోని " అలిపిరి "
* అద్దంతో మార్మిక సాధనలు
* శ్రీరమణీయం 
* "RIP"  అంటే అర్థం ఏంటి?
* ఏపీలో కొత్త జిల్లాలు


* : నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,


* అన్నమయ్య సంకీర్తన


🌷🌾🍃🍂🌿🎋🌷


*తిరుపతిలోని " అలిపిరి " కి ఆ పేరు ఎలా వచ్చింది ... ?*


( శ్రీవారి మహిమలు - యదార్థ సంఘటనలు )


" తిరుమల " కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న " అలిపిరి " ప్రాంతానికి చేరుకోవాలి.


అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం.


అయితే కొండ క్రింద ఉన్న ఈ    "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.


అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.


అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ?


దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?


అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.


పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.


ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-


"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.

 మరి " అలిపిరి " అన్న పేరు ఎలా వచ్చిందో  పూర్తిగా చదివి తెలియనివారికి తెలియపరచాలని మా హృదయపూర్వక విజ్ఞప్తి.


అది ( 1656 - 1668 ) ప్రాంతం . ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.


ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.


ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా & ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.


పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.


అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న


" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం.


ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు.


ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు :


🌺ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.


🌹రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.


అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.


దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.


సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.


అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు.


అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ".


ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు.


కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ",


"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు.


" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే" ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు.


*కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.*


ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.


అప్పుడు తురుష్కులు చేస్తున్న, చేసిన దురాగతాలూ మరియు పైన పేర్కొన్న ఘటనల గురించి, " వేంకటాచల విహార శతకము " అని ఒక కవి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ " ఎన్టీఆర్ " " వేంకటేశ్వర కళ్యాణం " సినిమాలో కొంత చూపించారు.
ఈ " వేంకటాచల విహార శతకము " లో ముఖ్యం గా ( 6, 9, 90 & 98 ) పద్యాలలో, కవి తురుష్కులు చేస్తున్న పాపాలు, దౌర్జన్యాలకు విపరీతంగా కోపం తెచ్చుకుని శ్రీ స్వామి వారిని తీవ్రంగా ప్రశ్నించాడు. మీ గోవిందరాజు బొజ్జ నిండా తిని హాయిగా పడుకున్నాడు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా లేవడా .. ? అని.


 *పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళి రెము వెన్న బూరియలును సరడాల పాశముల్ ? చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు*


 *అప్పము లిడైన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు శాకముల్ సూపముల్ చాలు లంబళ్లు శుదనములును సద్యోఘృతమ్ము*


 *పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండ బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె శత్రు సంహార వెంకటాచల విహార*


( వేంకటాచల విహార శతకం )

సుల్తానుల సైన్యం చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింపజేయమని కోరుతూ ఓ అజ్ఞాత కవి ఈ శతకం వ్రాశాడు.


ఆరోజుల్లో సుల్తానుల సైన్యం ఆలయాలలోకి వెళ్ళి విగ్రహాలను నాశనం చేసేవాళ్లు. జిగురుపాల కోసం అనే వంకతో దేవాలయాలలో ఉండే రావి చెట్లను నరికేసేవాళ్లు. గుడి పూజారులు నుదుట పెట్టుకునే నామాలను బలవంతంగా తుడిపేయించేవాళ్లు.


ఇలా అరాచకాలు చేసే అల్లరిమూకల్ని అడ్డగించి గెలవడం ఓ వేంకటేశా ... నీకైనా శక్యమేనా ? ఏదో వెఱ్రితనం కొద్దీ నీకు అంటూ దేవుణ్ణి రెచ్చగొట్టే పద్యాలు ఇందులో కనిపిస్తాయి. కొండపైన నువ్వు కొండ దిగువన మీ అన్న గోవిందరాజ స్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపిస్తాడు ఈ కవి. ఆయన పేరు ఈ శతకంలో ఎక్కడా కనిపించదు.


ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరు ఏర్పడింది .


 *కొసమెరుపు :* ఒక్క ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఏడు కొండల గురించి కానీ, లేదా స్వామి వారిని గురించి కానీ తప్పుగా మాట్లాడినవారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసి పోయారు.


కానీ, అన్ని కాలాలకి, అన్ని సంఘటనలకి ఆ సాక్షిభూతుడిగా సర్వకాల సర్వావస్థుడిగా ఆ శ్రీవారు చిరునవ్వులు చిందిస్తూ ... మన కళ్ళముందే ఉన్నారు, అదే ఆయన వైభవమ్.


ఆయనే మన *హిందూ వైభవానికి* ప్రత్యక్ష సాక్షి.


రచన: మంగు వెంకట రామారావు


ప్రచురణ: హిందూ వైభవం


🙏🙏🙏🙏🙏🙏🙏


 *ఓం నమో వేంకటేశాయ*


అద్దంతో మార్మిక సాధనలు


      
     మిర్రర్ ని చూస్తూ జపం చేయడం, దాని ముందు కూర్చుని అలాగే ధ్యానం చేయడం, ఇలా కొంత కాలం (మొదట్లో) చేస్తూ ఉండగా, నాకు అద్దంలో  రకరకాల రంగులు, ఆకారాలు, కొన్ని సంఘటనలు వరుస క్రమంలో, కొన్ని సార్లు పూర్తి స్థాయిలో..... ఆ సంఘటన లో నేనే ఉన్నాను అనేంత గాఢమైన స్థితిలో!!  ఇంకా కొన్ని సార్లు  spirits కనబడేవి. సాధన మొదటి దశలో ఉండగా కనిపించే రంగులు స్పష్టం గా ఉండేది కాదు!!  మిర్రర్ ముందు కూర్చుని చూడగానే మిర్రర్ కి బదులుగా ఓ పెద్ద కాంతి వలయం గానీ పూర్తిగా ఓ ఆకారం కానీ కనబడేది. దానినే చూస్తూ ఉంటే దానికి సంబంధించిన మరో విషయం కనిపించేది!!  అయితే ఈ రంగుల విషయంలో నేను చాలా కన్ఫ్యూజన్ అయ్యే వాడిని. ఎందుకు అంటే నాకు కనిపించిన రంగులు ఇంత వరకు సాధారణ నేత్రాలకు కనిపించవు. అవి. వాటికి ఏ పేరుతో పిలవాలో లేక పిలుస్తారో కూడా తెలియదు. మనకు తెలిసిన భాషలు ఆ రంగులకు పేర్లింకా పెట్టలేదు.   ఈ ఆరా  (Aura)  గురించిన కొన్ని పుస్తకాలు కూడా చదివాను. కానీ వాటి ద్వారా నాకు పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో వివరించే రంగుల గురించి నేను చూసే రంగులకు పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ పుస్తకంలో కోపం వస్తే ఓ రంగంలో, కామపూరితమైన ఆలోచనలు వస్తే మరో రంగు, ప్రేమ ఉన్న వ్యక్తి ఆరా ఇంకో రంగును కలిగి ఉంటారు అని సూచించారు. కానీ నేను నా మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి చూశాను. అద్దం ముందు కూర్చుని ఒకరి మీద కోపం తెచ్చుకుని చూస్తే ఎరుపు రంగు బదులు మరో రెండు రంగులు మిళితం అయి కనిపించడం జరిగింది. అలాగే ఫోన్ లో డివోషనల్ పాటలు వింటూ చూడగా మరో రంగు. బాగా వ్యాయామం చేసి చూడగా మరో మూడు రంగులు మిళితమై శక్తిని స్వీకరిస్తున్నట్లు!  నిద్ర లేవగానే చూస్తే నా ప్రాణామయ కోశం కొత్త శక్తి కలిగి తేజోవంతంగా చూశాను. అలాగే ఫ్రిజ్ లో పెట్టి మూడు రోజుల పాటు ఉంచిన కూరగాయలను తీసి చూస్తే వాటి చుట్టూ ఓ విధమైన స్పటికం రూపంలో, లైట్ స్పార్క్ కనబడింది. ఇలా కొన్ని రోజులుగా చేస్తూ ఉండగా నాకు ఈ  occult science  కి సంబంధించిన పుస్తకాలు చదవడం మీద ఆసక్తి పోయింది. కారణం ఏమిటి? అంటే, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన అన్ని విషయాలను పూర్తిగా వివరించలేకపోవడం.... ఒకటైతే రెండో విషయం ఏమిటంటే..... వీటి గురించిన దర్శనాలు, అనుభవాలు, అన్ని కూడా వారి వారి అంతర్గత అభివృద్దిని బట్టి, కారణ శరీరం యొక్క అభివృద్దిని బట్టి, వారు చూసే దృష్టి కోణం బట్టి ఉంటుంది అని గ్రహించాను. ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన విషయాలను ఓ పట్టాన ఇది ఇది అని ఇంటర్ప్రిట్ చేయడం కష్టం. ఇలా చేస్తూ ఉండగా నా తల మీద కొన్ని అంగుళాల ఎత్తు లో నాకు ఓ రోజు కొత్త రంగు కనిపించడం జరిగింది ఆరా కంటే కూడా కొంత తేజోవంతంగా, వేగంగా మారుతున్న రంగు అది. తర్వాత నేను ఆలోచించే ఆలోచనలు కూడా నాకు చిత్ర రూపంలో కనిపించడం.....
ఇలా ఒక రోజు నేను మా శ్రీనివాస్ మిత్రుడు ఇద్దరం కలిసి సినిమా కి వెళ్ళాం. కొంత సేపు చూస్తూ ఉండగా, ఆ సినిమా లో నటించిన నటీనటుల ఆరాలు కనిపించడం చూశాను. ఈ దృశ్యం చాలా వింతగా ఉంది నాకు మొదటి సారిగా చూడటం ఇలా. కొన్ని సార్లు ఆ షూటింగ్ టైంలొ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అప్పుడు చూశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఓ అలవాటుగా అయింది. రెండు సార్లు సినిమా చూస్తాను, ఒక సారి సినిమా ఎంజాయ్ చేయడానికి ఇంకో సారి వారి ఆరా చూడటానికి. తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చి ఇద్దరం టీ తాగడం కోసం బస్ స్టాండ్ కి వెళ్ళాం. ఆ బస్ స్టాండ్ లో ఉన్న వ్యక్తుల ఆరాలు మరో వింతైన రంగు ఉండటం చూశాను.
. నేను చూసింది ఆ పూర్తి బస్ స్టాండ్ యొక్క ఆరా ని!!  ఖమ్మం నుండి వచ్చిన హైదరాబాద్ బస్సు అపుడే వచ్చింది. దాని యొక్క ఆరా భలేగా ఉంది. గొంగళి పురుగు పై ఉండే జుట్టు లాగా ఉంది ఈ బస్సు యొక్క ఆరా. మనకు తెలిసిన ఏడు రంగులు కాకుండా ఇతర రంగులు చాలా రకాలు ఉన్నాయి. ఈ రంగులు. ఇలా చూడటం నాకు అదే ఓ పనిగా పెట్టుకున్నాను. రోడ్డు మీద ఉన్న ఓ షాప్ వద్ద నిలబడి టీ తాగుతూ వచ్చి పోయే వాహనాల ఆరాలను చూడటం. ఒక చెట్టు వద్దకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉండటం. తెల్లవారు జామున నిద్ర లేచి సూర్యోదయం అయే సమయం లో అనేక ప్రదేశాల యొక్క ఆరాలు చూడటానికి మన రెండు కళ్లు సరిపోవు. అలాగే శ్మశానం కి వెళ్ళి అక్కడ ఉండే కొన్ని రకాల స్పిరిట్స్ ని కూడా చూశాను.  ఇలా చాలా చాలా అనుభవాలు!!  ఈ ఫలితం వెనక శ్రద్ధ, దీక్ష, ఓర్పు ఉన్నాయి. నేను ఇదివరకు మా కొత్తగూడెం లో ఉన్న మా ధ్యాన కేంద్రానికి ఇన్చార్జ్ గా ఉన్నప్పుడు అక్కడే ఉండి ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, ధ్యాన మిత్రులతో కలసి ఈ విషయాలపై విశేషంగా చర్చించడం. నా క్లాస్ పుస్తకాలు చదవడం చేసేవాడిని. రాత్రి అంతా ధ్యానం చేయడం, జపం చేయడం ఇదే నా పని అయిపోయింది. దసరా సెలవులు రావడంతో భోజనం చేయకుండా కేవలం ధ్యానం, జపం చేస్తూ ఉండగా, అలిసి పోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పడుకుని ఉండగా ఓ ఇద్దరు అమ్మాయిలు నా పాదాల వద్ద నిలబడి బయటకు రా, బయటకు రా..... అని పిలిచారు. వెను వెంటనే నా శరీరం నుంచి నేను పూర్తి స్పృహతో బయటకు రావడం, తర్వాత మూడో వ్యక్తి ( మగమనిషి)  పేరు అప్రస్తుతం!!  నాకు ఓ పుస్తకాన్ని తెరిచి చూపిస్తూ..... ఇదిగో, ఇది నీ శరీరం, ఇందులో ఇవి ఊపిరి తిత్తులు, ఇవి మూత్ర పిండాలు ఇలా ఒక్కో అవయవాల గురించి చాలా విషయాలు వివరంగా చెబుతూ.....  ప్రాణామయకోశం ఇది, ఈ రంగులో ఉంది చూశావా?   మనోమయ కోశం ఇది, దీని రంగు ఇలా ఉంది..... ఇలా  చూపించి తిరిగి నా శరీరం లోకి వచ్చాక ఒక్క విషయం కూడా సరిగ్గా గుర్తు రాకుండా పోయింది. కొంత సమయం పాటు. ఒక రోజు ఒక వ్యక్తి ధ్యాన మందిరం లో ధ్యానం చేస్తుంటే, ఈయన ఆరా ఎలా ఉంటుందో చూద్దాం..... అని చూస్తూ ఉండగా ఆ మందిరం పై నుంచి అత్యంత స్పష్టమైన గొంతు వినబడింది. ధ్యానం చేస్తూ ఉంటే, వారి యొక్క ఆరాను చూడటం తప్పు అని!!  ఆ తర్వాత ఫేయిరీస్ కోసం ఈ మిర్రర్ సహాయం తో చెట్లపై చాల ప్రయోగాలు చేస్తూ ఉంటే ఓ రోజు వర్షం కురుస్తోంది. వాతావరణం చల్లగా ఉందని, ఆ వర్షంలో తడుస్తూ ధ్యానం చేయడానికి, ఓ వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెడితే, ఓ పెద్ద మనిషి పూర్తి శరీరం అంతా ఎరుపు రంగులో ఉండి దుస్తులు లేకుండా సడెన్ గా  కనబడటం గమనించి, ఉన్న ఫణంగా పరుగులు తీసి, కాళ్ళకు దెబ్బలు తగిలించుకున్నాను.

--(())--

: శ్రీరమణీయం - (560)
🕉🌞🌎🌙🌟🚩

"కనిపించే ప్రపంచం మనోకల్పితం అంటే నమ్మేదెలా ?"

'కల-ఇల'లను బేరీజు వేసుకుంటే మనః కల్పితమైన ప్రపంచం అవాస్తవమని తెలుస్తుంది. ఎవరు చేస్తున్నారో, ఎలా జరుగుతుందో మనకు తెలియకుండా, జరిగింది మాత్రమే తెలియటాన్ని మహత్యంగా భావిస్తున్నాం. కొంచెం మనసుపెట్టి గమనిస్తే మన నిత్యజీవితం అంతా మహత్యమేనని తెలుస్తుంది. మన గుండెను నడిపేది ఎవరు ? మనలో జరిగే రక్తప్రసరణకు కారణం ఎవరు ? మనలో శ్వాసను నడిపిస్తున్నది ఎవరు ? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే సైన్స్ చెప్పే 'శక్తి' అనే సమాధానంతో వెయ్యి ప్రశ్నలు పుడతాయి. ఏ వ్యక్తి, పరికరం లేని ఆ శక్తి ఎలా జనిస్తుందో గమనిస్తే అందులోవున్న మహత్యం అర్ధం అవుతుంది. మరి మహత్యం జరిగేచోట దైవం లేకుండా ఉండదు కనుక మనలో దైవం ఉన్నదనే మాట ముమ్మాటికీ సత్యం. నమ్మలేని ఈ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు సత్యం అనుకుంటున్న ఈ ప్రపంచం అబద్ధమని గ్రహించాలి. అందుకే 'కల-ఇల'లను బేరీజు వేసుకుంటే మనః కల్పిత ప్రపంచం అసత్యమని రూఢీ అవుతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)

🕉🌞🌎🌙🌟🚩

"RIP"  అంటే అర్థం ఏంటి? ఎందుకు ఎక్కడ వాడాలి??
మనం ఈ మధ్యకాలంలో ఎవరైనా చనిపోయిన వార్త విన్నప్పుడు watsapp లో లేదా social media లో జనాలు గుంపులో మందలాగా RIP అని రాసి పెడుతుంటారు. బాగా చదుకున్నామనుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా ఆ పదానికి అర్థం ఏమిటో  తెలుసుకోకుండానే RIP అని పెట్టడం ఒక ఆచారంగా మారిపోయింది. కాని ఈ పదాన్ని ఎవరు ఉపయోగించాలి ఎవరి కోసం ఉపయోగించాలో చూద్దాం.

అసలు ఎవరిదైన మరణ వార్త విన్నప్పుడు RIP అనే పదం వాడటం మన సంస్కృతి లో లేదు పాశ్చాత్య మతాలైన క్రైస్తవం, ఇస్లాం ఆచారల నుంచి పుట్టింది. హిందూధర్మం గురించి మరిచిపోవడం వల్ల జనాలకు ఈ పదం వాడుక దాని అర్థం మీాద అవగాహన లేకుండా పోయింది.

RIP అనే పదానికి అర్థం "Rest in Peace" (శాంతిగా శయనించి శాశ్వత నిద్రను పొందు ) ఈ పదం కేవలం ఎవరినైతే గొయ్యి తవ్వి పాతిపెడతారో వాళ్ళ కోసం మాత్రమే వాడాలి అంటే ముస్లిం లేదా క్రైస్తవులు మరణించినప్పుడు ఈ పదం వాడొచ్చు ఎందుకంటే వారి ఆచారం ప్రకారం వారు మరణానంతరం ఆ వ్యక్తిని పాతిపెట్టి పడుకోమని చెప్పి ఎప్పుడైనా "judgement day" లేదా "కయామత్ కే దిన్"  వచ్చినప్పుడు ఈ శవాలన్నీ పునర్జీవులౌతాయని వారు నమ్ముతారు. అంటే అప్పటి వరకు విశ్రాంతిగా శయనించమని RIP అని రాస్తారు లేదా కోరుకుంటారు.

కానీ హిందూ ధర్మం సాంప్రదాయాల ప్రకారం శరీరం భౌతికమైనది, ఆత్మ అమరమైనది,అందుకే హిందూ ధర్మంలో మరణించిన వ్యక్తిని కట్టెలు నెయ్యితో యథాశక్తి కాలుస్తారు. అంటే ఒక హిందూ చనిపోతే RIP(Rest In Peace) అని రాయడంలో అర్థమే లేదు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ వేరొక దేహంలోకి వెళుతుందని పునర్జీవం పొందుతుందని నమ్ముతారు. ఆ ఆత్మకు కొత్త దిశ/సద్గతి ప్రాప్తించాలనే శ్రాద్ధకర్మలు శాంతిపాఠాలు చేస్తారు.

అంటే హిందూ ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరాలని లేదా వినమ్ర శ్రద్ధాంజలి లేదా శ్రద్ధాంజలి అని మాత్రమే రాయాలి. Fashion కోసమో style గా ఉంటుందనో లేదా తెలియకుండానో లేదా గుంపులో మంద లాగా RIP అని రాయకూడదు. అదే క్రైస్తవం లేదా ముస్లింలు మరణించినప్పుడు RIP అని రాయవచ్చు.

ఈ మధ్య శ్రద్ధాంజలి అని రాయడానికి కూడా బద్దకించి shortcutలు వెతుక్కుంటున్నాం. ఆ క్రమంలోనే ఈ RIP మనకు అంటుకుంది. అవివేకంతో ఒకరు చేసారని దానినే గుడ్డిగా follow అవుతున్నాం. ఈ విషయం ఎవరినీ ఉద్దేశించినది కాదు కేవలం వాస్తవాలు తెలియచెప్పడం కోసమే.

అందుకే ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఈ విషయం తెలియని చాలామందికి తెలియపరుస్తారని కోరుకుంటున్నాం.

🙏🙏🙏🙏🙏

 "అమర చైతన్యం" 
 ( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: ఈ ఆలోచనల నుంచి తప్పించుకునేదెలా..

జవాబు: నీవు అనవసరమైన ఆలోచనలతో నిండిపోయినావు. అదే అసలు సమస్య. నీవు ఉన్నట్లుగానే వుండు. ఆలోచనలన్ని మాయమౌతాయి. ఆలోచనలు, స్పందనలు ఎవరికి వస్తున్నాయి. నీవు అతిగా ఆలోచించడానికి బాగా అలవాటు పడిపోయినావు. అందువల్లనే ఆలోచించకుండా ఉండలేక పోతున్నావు.


ప్రశ్న: 'అహం బ్రహ్మస్మి' అని అనుకుంటూ వుండేదా.. అది సరియైన అభ్యాసమేనా..

జవాబు: అలా ఎందుకు అనుకోవాలి.. నిజానికి నీవు బ్రహ్మానివే. నేను మనుష్యుడునా, నేను పురుషుడునా అని ఎవరు అనుకుంటా వుంటారు. ఎవరైనా ఎపుడైనా నేను మనుష్యుడను కానేమో అని సందేహం వస్తే నేను జంతువును అని అంటే అపుడు కాదూ నేను మనుష్యుడనే అని చెప్పవచ్చు.  తప్పు అభిప్రాయము పోగొట్టుకునేందుకు అలా అనుకొనవచ్చును. దృఢపడింతర్వాత ఇక అలాంటి ఆలోచన అవసరం లేదు. సాక్షాత్కారమైతే ఇక సిద్ధాంతాలతో నమ్మకాలతో పనిలేదు.

🕉🌞🌎🌙🌟🚩
: "ఋభుగీత "(27)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

బ్రహ్మంగా ఉండాలంటే అడ్డుగా ఉన్న గుణాలు తీసేస్తే చాలు !!

అద్వితీయ స్థితిలో అందరం సామానులమే. అలాంటి అద్వితీయస్థితే నిర్గుణబ్రహ్మము. మనకు కోరికలు, బాధలు, సంతోషాలు రకరకాలుగా ఉన్నా అవేవిలేని శూన్యస్థితి మాత్రం అందరికీ సమానంగా అద్వితీయంగానే ఉంటుంది. మనం ఆశలేని స్థితిలో ఆనందంగా ఉన్నప్పుడు అన్నిటికి పరమమైన శూన్యంగా, దేనితోనూ పోలికలేని అద్వితీయంగా ఉంటాము. అదే బ్రహ్మము. బ్రహ్మంగా ఉండాలంటే అడ్డుగా ఉన్న గుణాలు తీసేస్తే చాలు. గుణాలు లేకుండా జీవనం ఎలా అని మనం అనుకోనక్కర్లేదు. ఆస్థితి వస్తే పరమాత్మే మనని నడుపుతాడు !



🕉🌞🌎🌙🌟🚩



సశేషం

[07:36, 22/06/2020] Mallapragada Sridevi: ఏపీలో కొత్త జిల్లాలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
కొత్త జిల్లాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి
1) అరుకు 
130. కురుపాం 
131. పార్వతీపురం
132. సాలూరు
146. మాడుగుల,
147. అరకు లోయ 
148. పాడేరు
172. రంపచోడవరం 
2) శ్రీకాకుళం 
120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.
3) విజయనగరం 
126. ఎచ్చెర్ల,
128. రాజాం 
129. పాలకొండ హ
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.
4) విశాఖపట్నం 
135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140.తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం
5) అనకాపల్లి 
144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట
153. నర్సీపట్నం.
6) కాకినాడ 
154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.
7) అమలాపురం 
161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం
164. రాజోలు
165. గన్నవరం
166. కొత్తపేట,
167. మండపేట
8) రాజమండ్రి
159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు
174. నిడదవోలు,
185. గోపాలపురం 
9) నరసాపురం 
175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.
10) ఏలూరు
182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం 
187. చింతలపూడి
189. నూజివీడు
192. కైకలూరు
11) మచిలీపట్టణం 
190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు
12) విజయవాడ 
188. తిరువూరు
198. భవానీపురం,
199. సత్యనారాయణ పురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ
203. జగ్గయ్యపేట
13) గుంటూరు
205. తాడికొండ
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ
14 నరసారావుపేట
204. పెదకూరపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల
15 బాపట్ల
208. వేమూరు 
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.)
16) ఒంగోలు 
221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి
17) నంద్యాల 
253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్
18 కర్నూలు
256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు
19) అనంతపురం
267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు
20) హిందూపూర్
 271. సింగనమల
275. మడకసిర
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి
21) కడప
243. బద్వేల్
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు
22) నెల్లూరు 
228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ
242. ఉదయగిరి.
23) తిరుపతి 
238 సర్వేపల్లి,
 239. గూడూరు
240. సూళ్ళూరుపేట
241. వెంకటగిరి,
286. తిరుపతి,
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు
24) రాజంపేట 
244. రాజంపేట
246 కోడూరు
247. రాయచోటి
281. తంబళ్ళపల్లె
282. పీలేరు
283. మదనపల్లె
284. పుంగనూరు
25. చిత్తూరు
285. చంద్రగిరి,
289. నగరి,
290 గంగాధరనెల్లూరు
291 చిత్తూరు,
292 పూతలపట్టు
293 పలమనేరు,
294 కుప్పం.

--(())--



అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 16-4
సంపుటము: 1-98


చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు !!
॥పల్లవి॥


ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁకఁ గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు!! 
॥ఎంత॥


యెన్నితపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కధికము కలవేది
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు !! 
॥ఎంత॥


యిందరివాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు !!

🕉🌞🌎🌙🌟🚩


కీర్తనలో అర్ధాలు
--------------------------

ఎడపక = యెడతెగక
గడమేకాకి = కొరతేకాని
గడయేది = అంతమెక్కడుంది
 వెరవేచాలు = ఉపాయము చాలుకదా
అన్నువకు = అల్పత్వానికి
కందేగాకిఁక = ఉద్రేకంతో తపించిపోవటమే కాని


భావామృతం:- 
-------------------------

జీవుడికి యెన్ని పుణ్యాలు తపములు వాదములు చేసినా అంతెక్కడుంది. శ్రీహరిపైన ధ్యాస పట్టుబడితే చాలుకదా. యెడతెగక యెన్ని పుణ్యకర్మలు చేసినా కొఱతేకాని అంతమెక్కడుంది. తడబడినప్పుడు శ్రీహరియే నాదైవమని మనస్సులో విడువక చేబూనిన ఉపాయము చాలుకదా. ఎన్నితపములను యెంత కఠిన నిష్టతో చేసినా అల్పత్వానికి అధిక్యానికి కొలది యెక్కడుంది. వన్నెచిన్నెలకు భ్రమించక వనజాక్షుడైనా శ్రీహరిపై ఆ చిత్తము వున్నచో అదోక్కటేచాలు. అందరిని వాదముతో యెన్ని విధాలుగా జయించినా ఉద్రేకంతో తపించిపోవటమే కాని ఔనత్యం యెక్కడ వున్నది. లక్ష్మీదేవిని యేలుకొనిన శ్రీవేంకటేశ్వరుడు చూపే పొందికైన మహిమల అతిశయమే చాలుకదా తక్కినవన్నీ యెందుకు అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌎🌙🌟🚩

1 comment: