Wednesday, 17 June 2020


🌻 Q 55:--సృష్టి ఎప్పటి వరకు కొనసాగుతుంది? 🌻

Ans :--
సృష్టి అనంతకాలం నుండి ప్రారంభమైంది. ఆనంతకాలం వరకు కొనసాగుతుంది. 

ఉదాహరణకు spring ని తీసుకుందాం. ఇది వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుంది
కానీ spring అక్కడే ఉంటుంది. 

అలాగే మూలచైతన్యం కోటానుకోట్ల రూపాలను తీసుకుంటుంది. వాటిని నాశనం చేసి మరల పునర్జన్మ ద్వారా ఇతర రూపాలను తీసుకుని పరిణామం చెందుతుంటుంది.

2) ఆత్మశకలం ఏ రూపాన్నైనా ధరించవచ్చు. ఒక నక్షత్రం గా, ఒక గ్రహం గా, ఒక మనిషిగా, ఒక జంతువుగా, ఒక చెట్టుగా, ఒక చేప గా, ఒక క్రిమిగా, ఒక ఎలెక్ట్రాన్ గా, ఒక పరమాణువు గా ఇలా ఏ రూపాన్నైనా తీసుకుంటుంది. ఇది human ఇంటెలిజెన్స్ కి అందదు.

ఇతర dimensions లో తీసుకునే రూపాలు మనకు అర్థం కావు. మన అంతర్ ప్రపంచానికి మాత్రమే అర్థం అవుతాయి.

🌹 🌹 🌹 🌹 🌹🌹. విశ్వమే సంపూర్ణ ఆత్మ! - ఆత్మయే విశ్వ స్వరూపాన్ని పొందుతోంది ! 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

విశ్వం ఒక బ్రహ్మ పదార్థం. అది ఓ పట్టాన అర్థం కాదు. అయితే, ఉపనిషత్తుల్లో వేల ఏండ్ల క్రితమే విశ్వాన్ని విశ్లేషించారు. 

‘ఆత్మనే విశ్వ స్వరూపాన్ని పొందుతుందని, తిరిగి విశ్వం ఆత్మ రూపాన్ని పొందుతుందని’ మన ఋషులు వివరించారు.

ఒక తాతయ్య తన మనవన్ని ఓ తిరకాసు ప్రశ్న అడిగాడు. ‘బాబూ! ఒక కొలనులో ఒక పడవ ఉంది. దానిలో ఓ కోడి ఉంది. ఆ పడవలో ఒక గ్రాము బరువు అధికంగా ఉంచినా అది నీళ్లలో మునిగిపోతుంది. అలాంటి సందర్భంలో ఆ కోడి ఒక గుడ్డు పెట్టింది. అప్పుడు పడవ మునిగిపోతుందా? లేదా?’. ఇదీ ప్రశ్న. 

ఆ మనవడు మహాఘటికుడు. తాత ప్రశ్నను సులువుగా అర్థం చేసుకున్నాడు. ‘పడవ మునగదు తాతయ్యా’ అని బదులిచ్చాడు. ‘ఆహా! భలే సమాధానం ఇచ్చావు. ఎందుకో చెప్ప’మన్నాడు తాతయ్య. 

‘అందులో ఏముంది తాతయ్యా! కోడి కడుపుతో ఉన్నప్పుడే ఆ పడవలో ఉందంటే ఆ కోడి, గుడ్డు రెండూ అంతకు ముందే పడవలో ఉన్నాయి. గుడ్డు కోడిని వదిలి బయటకు వచ్చిందంతే.  పడవలో కొత్తగా ఏ బరువూ చేరలేదు కదా!’ అన్నాడు. తాతయ్య సంతోషంతో ‘శభాష్‌!’ అని మనవన్ని మెచ్చుకున్నాడు.

 పై ప్రశ్నలో పడవను మనం విశ్వంతో పోల్చవచ్చు. ఖగోళ పదార్థాలన్నీ ఆత్మలోనే దాగి ఉన్నాయి. ఆత్మనే పరిణమించి ఖగోళ పదార్థాలుగా మారుతున్నది. 

అలాంటి ఖగోళ పదార్థాలు ఆత్మలోనే ఉన్నా, ఒక దానితో ఒకటి ఆధారపడుతున్నా, వేటికవే స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే, అవి ఆత్మలోనే ఉండికూడా విభిన్న ఆకృతులను దాల్చి ఉండటమే. 

ఈ ఖగోళ వ్యవస్థలో భూమండలమంతా ఒక యూనిట్‌. ఈ యూనిట్‌లో ఎన్ని జీవులు ఉద్భవించినా భూమి తిరిగే వేగంలోగాని, దిశలోగాని మార్పు ఉండదు. ఎందుకంటే, అవి ఈ యూనిట్‌ ద్వారానే ఉద్భవించి, ఇందులోనే జీవించి, దీనిలోనే అంతరిస్తున్న జీవులు.

భూమండలంలో ఉత్పన్నమయ్యే పంచభూతాలేవీ భూమికి భారం కావు. ఎంత వర్షించినా భూమి భారంలో తేడా ఉండదు. ఎన్ని కోట్ల పిడుగులు పడినా భూమి స్వీకరిస్తూనే ఉంటుంది. అంతేగాక, దాని విద్యుదావేశం ‘సున్నా’గనే ఉంటుంది.

 సౌరకుటుంబమూ ఒక యూనిట్‌. ఇందులో ఒక గ్రహం పుట్టినా, నశించినా మొత్తం పదార్థంలోగానీ, భారంలోగానీ తేడా ఉండదు. మన పాలపుంతకూడా ఇలాగే ఒక యూనిటే. ఇలాంటి కోటానుకోట్ల గెలాక్సీలు స్వతంత్రంగానే ఉన్నాయి. 

ఇలా విశ్వంలో కోటానుకోట్ల గెలాక్సీలు స్వతంత్రంగానే ఉంటున్నాయి కూడా. ఈ ఖగోళ పదార్థాలన్నిటికీ మాతృకైన ఆత్మకూడా ఒక యూనిటే. ఇందులో ఎన్ని చర్యలు జరిగినా, ఎన్ని ఆకృతులు రూపొందినా, ఎన్ని నశించినా ఏ మార్పూ జరగదని మనం అర్థం చేసుకోవాలి.

ఈ అద్భుత విషయాన్ని మన పూర్వీకులు ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేశారు. ‘ఆత్మ ఒక సంపూర్ణమైన వ్యవస్థ. అందులోనే అన్నీ జరుగుతున్నాయి. 

ఆ సంపూర్ణ వ్యవస్థలోనుండి అంతే వ్యవస్థను తీసి వేసినా, కలిపినా ఆ సంపూర్ణ వ్యవస్థే మిగిలి ఉంటుంది’ అని ‘ఈశావాస్యోపనిషత్తు’లోని ‘శాంతిమంత్రం’ మనకు బోధిస్తున్నది. 

‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే / పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే॥’. 

ఇంత గొప్పసృష్టి వాస్తవికతను వేలఏండ్ల క్రితమే రెండు చిన్న వాక్యాలలో ఎలా గుదిగుచ్చారో అని ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే, భగవంతుడనీ, నామరూపాలను వల్లె వేయడం ద్వారా భగవతత్త్వం అర్థం కాదు, జ్ఞానం రాదు. 

భగవంతుని హృదయంలో నిక్షిప్తం చేసుకుని, తీక్షణతతో ఆలోచిస్తేనే ఆత్మ చిక్కుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం మన ఆలోచనలలో నిండిపోతుంది.
🌹 🌹 🌹 🌹 🌹


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:  ...... 1
 

    ప్రాంజలి        

సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:



శ్రీ వీర హనుమత్ కవచము 

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 



శ్రీ పంచముఖి  హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                          



శ్రీ హనుమత్ ప్రార్ధన               
               
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా               
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా               
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!               
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా               
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!               
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము               
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   

శ్రీ  అంజనేయ సుప్రభాతము               
               
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !               
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !               
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !                
               
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం               
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్               
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !   

...........................      2


ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
              
1  ఆలింగనం అంటే ఏమిటి -(?)
 రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మనసులు కలసిన వేళ, హృదయం స్పందించిన వేళ, ప్రకృతి కరుణించిన వేళ, ప్రశాంత వాతావరణంలో, పున్నమి వెన్నెల కాంతులలో, చల్లగా వీచే గాలియందు ఆణువణువూ తపించే స్పర్శ హృదయాలు ఏకమవుటం లో ఉన్న ఆనందం, స్వర్గం కన్నా మిన్న అని నేను అనుకుంటాను, స్వర్గాన్ని అయినా వర్ణించగలము కానీ, సుఖాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. విద్యార్థులతో ఉన్న పెద్దలతో రామకృష్ణ శర్మ పంతులుగారు ఈవిధముగా చెపుతున్నారు.
  
ఆలింగనం మనుషుల మధ్య ఆప్యాయతకు అనురాగానికి గట్టి ఆనవాలు, తోలి వలపునకు అది ఓనమాలు, జన్మ జన్మ బంధాలకు, ఆత్మీయతకు, జీవిత సాఫల్యానికి, తన్మయత్వ స్వభావానికి, తరుణం మించకుండా తమకం తగ కుండా, చలామణి అవుతూ, నిత్య ఆశల వలయంలోకి లాగుతూ, మనస్సును నిర్మలంగా ఏరోజుకారోజు మార్చేది ఇది.

ఒక్కో రకం ఆలింగనానికి ఒక్కో రకం అనుభూతి, వాత్సాయన గ్రంధంలో అనేక రకాల అనుభూతులు మనకు తెలియ పరిచారు.

పెద్దలు మనకు దీవెన ఒక ఆలింగనం అట్లాగే లాలన పాలన చూసి ఆనంద పడుతూ ఇచ్చేది ఆలింగనం .

కరచాలనం చేసి, దరహాసముతో, మెత్తగా ప్రియమార హత్తు కొనుట మర్యాద పూర్వక ఆలింగనం. దేశాధినేతలు, ప్రముఖులు, జరిపే మర్యాద పూరకముగా, గౌరవ సూచనగా జరిపేది.  ఒకరకం ఆలింగనం.

పాలిండ్లు పొంగారి యవ్వన గర్వంతో బాహుబలిని ఆకర్షించి అనంత సుఖాలు పొందాలని ఆశించి, పెదాలు రుచిచూడాలని  ఘాడంగా ఆలింగనం చేసే శృంగార నెరజానుల ఆలోచనే వేరు, ఇది ఒక అనుభూతి.

ఆలింగనాన్ని ఆశించకుండా దూరం దూరం అని మడి కట్టుకు కూర్చున్న, మన:స్పర్ధలు పెరిగి, ఆరోగ్యము నలిగి, వయసు పెరిగి, ఆలోచనల మనిషి గా, అనుమాన మనిషిగా మారితే అపార్ధం పెరిగి సంసారం వీధిన పడుటకు ఆలింగనం లేకపోవుట కుడా ఒక కారణం. ఈ అనుభూతి పొందలేనివాడు సంసారిగా జీవిన్చలేడని నాభావన.
ఆశ్రయం కోసమో, అనుభందం కోసమో మద పిచ్చితో మగువ, మగవాన్ని రెచ్చగొట్టి కోరిక తెలియచేసి నేను కన్యను నీవు బ్రహ్మ చారివి మనమధ్య లేదు ఎటువంటి సందేహము నా భాహు భందాలలో చుక్కు మదనా అని వెంబడి పడేవారు, అటువంటి పరిస్థితులలో లొంగి పోయేవారు సహజం.

విశ్వనాధ గారి వర్ణన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం
పుష్కరతీర్థంలో జలకాలాడిన మేనక నిలువెల్లా తడిసిన బట్టలతో విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చింది. ఆ 'సురవధూటి' జుట్టును ముని తుడవబోయాడు. ఆమే వారించి తుడుచుకో, ఆమె తివురు ... అతడు వారించి తుడవగా . అతడు తివురు ... చేతులందేయుచు పెనంగా చివరిదైన ఫలము తడి కౌగిలింతగా పరిణమించే అన్నారు.
 అపనలతో తహ తహ లాడే శృంగార ఆలింగనాల పర్యవసానం చప్పుకో నవసరం లేదు.

నల్లని మేఘాలలో వెలుగుల విరజిమ్మే విద్యుత్తుదాగి వున్నట్లే....మనం చేసే ప్రతి కష్టంలోనూ సుఖం దాగి వుంటుంది. ఎదో కొత్తదనం మనలో దాగి ఉన్నది, అది  ప్రపంచానికి అందచేయటమే మనలక్ష్యం గా జీవించాలి,  అలాగే మనం చేసే పని మనం చేస్తున్నాము అనుకుంటాము, మనల్ని చేయిన్చేవాడు ఒక పరమాత్ముడు వెనక ఉండి నడిపిస్తు న్నాడని అనుకోలేము, ఇది నా కష్టార్జితం అని, ఇది నా సుఖాల సంతతని, నా తోడు ఆలింగన మని    అనుకుంటాం, కానీ రుణాల భంధమని గమనించ లేక పోతాం అయినా ఇది మాయా ప్రపపంచం, భాహు బందాలలో చిక్కి సుఖ సౌఖ్యాలు పొందిన వానికే మనస్సు ప్రశాంతిగా ఉండ కలుగు తుందని నాభావనా.          

తపస్సు కొకరు, చదువుకు ఇద్దరు, సంగీతానికి ముగ్గురు, ప్రయాణానికి నలుగురు, వ్యవసాయానికి ఐదు లేక ఏడుగురుండాలి.యుధ్ధానికి మాత్రం ఎక్కువమంది అవసరం. ప్రతిఒక్కరి జీవితానికి స్త్రీ పురుషుని సంగమం ఒక్కటే ఒక్కటి, ఇరువురికి నిత్యకల్యాణం పచ్చ తోరరణం, మనస్సు శాంతి కి సునాటికి మనోనిగ్రహ శక్తికి ఇది ఒక మార్గం అని నా భావనా   

ఈరోజు కొన్ని సామెతలను ఉదాహరింస్తున్నాను, మిగతా భాగము రేపు చెప్పుకుందాం

ప్రేమ కలయికకు ఒక నిదర్శనమైతే,  దయ, కరుణ, స్నేహము, వాత్సల్యము, బంధము, ఆత్మీయత, అనురాగము అనేవి కుడా ప్రేమకు చిహ్నాలు.

ప్రతి ఒక్కరు సృష్టి రహస్యానికీ తోడ్పాటుగా ఉండాలి " జోడు లేని బతుకు, తాడూలేని బొంగరం " అంది ఒక సామెత ఉన్నది. అనగా బ్రహ్మచారి జీవితం తడులేని బొంగరం ఒకటేనని దీని భావం ప్రతిఒక్కరు తప్పకుండా పెళ్లాడాలని, సమాజ పురోగతికి తోడ్పడాలనేది మన పూర్వీకుల ఆకాంక్షగా ఈ సామెత చెపుతున్నది. పురుషులు కానీ స్త్రీ కాని పెళ్లి కాకుంటే పరిపూర్ణులు కాలేరని మన పెద్దల నమ్మిక.

మీరందరూ అనవచ్చు పెళ్లిళ్లు కావటంలేదు, చదువులు ఉద్యోగాలు అంటూ కాలయాపన చేస్తూ వయసు ముదిరేదాకా ఉంటున్నారు, ఎంత ఉన్న సంపాదన సరిపోవటంలేదని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు, ప్రపంచ ఆధునిక పోకడలకు బానిసలై భయపడుతున్నారు, ఈవయసులో చేయాల్సిన పని ఆవయసులో చేయక భాధను తెచ్చుకుంటున్నారు.

ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తు చేస్తాను " కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగవు "
పెళ్ళి సంబందాల కోసం తిరగడం వాళ్ళ ఏడు జతల చెప్పులు అరిగా యంటారు. అంటే సంభందాలు కుదరటం అంత  కష్టమని భావన అయితే కొన్నిసార్లు పెద్దగా ప్రయత్నం లేకుండానే పిల్లలకు మంచి సంభందాలు వచ్చి వెంటనే  ఇరువైపులా అంగీకారం కుదిరి చెకఃచెకా పెళ్లిళ్లు జరుగుతాయి. కక్కు వస్తే ఆపడం అసాధ్యం అలాగే సమయమొస్తే ఇబ్బందులన్నీ తొలగి పెళ్లి తథ్యం.

ఆలింగన సుఖం తెలిసిన వారి మధ్య బంధం విడదీయుట అసాధ్యం. రేపుకొన్ని విషయాలు తెలుసుకుందాం మీకందరికీ వందనం అంటూ లేచారు తెలుగు మాష్టారు.                      
                                   --(())--




ఇది కథ అనుకుంటారో కల్పితం అనుకుంటారో కానీ ఆ వీరజవానుకు ఒక సెల్యూట్ చేయండి

ఆర్మీ అధికారికి ఓ వ్యక్తి దగ్గర నుండి లేఖ వచ్చింది
అందులో విషయం

అయ్యా!
నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైర్ అయ్యాను .
నా కొడుకు ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం లో వీరమరణం పొందాడు .
ఈ ఏడాది అతను ప్రాణాలు విడిచిన చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి చూస్తున్నాము .
అనుమతి ఇస్తే సంతోషము అలా కుదరదు మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వద్దు అని ముగించారు

ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు తడిచాయి వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో పిలిపించండి అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు

ఆ వృద్ధ దంపతులను అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు

ఎందుకు బాబు నువ్వు మాత్రం ఇలా నువ్వు ఎంత పెద్ద అధికారివి అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు

అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారు నేను మీ అబ్బాయితో కలిసి పని చేసాను
అని ఒక నిమిషం మాటలురాక నిలబడిపోయాడు
పర్లేదు బాబు ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు నేను ఏడవను అని చెప్పాడు
మీరు కాదు నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు

ఆనాడు పాకిస్థానీలతో యుద్ధం జరుగుతున్నది మా దగ్గర ఆయుధాలు అయిపోవడంతో నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వచ్చాను అప్పుడు మీ కొడుకు నన్ను లాగి
నీకు పిచ్చా నీకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు
నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్లి ఆ తూటాలను తన శరీరంలో తీసుకున్నాడు
శత్రువులను 13 మందిని చంపి ఇక్కడే మరణించాడు

అతడిని మొదటగా పట్టుకున్నది నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు పోయింది శరీరం లో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు
అక్కడ వింటున్న తల్లి తన చీర కొంగును అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది

ఆరోజు నేనే శవాన్ని తీసుకురావలసింది దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు అతడి కాళ్లపై వేయాల్సిన ఈ పూలు ఇలా వేసి నా ఋణం తీర్చుకుంటున్నాను అని అన్నాడు

బాబు నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాము కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలి పెట్టాలని తెచ్చాము కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని అర్థం అవుతున్నది
నీకు అభ్యన్తరం లేకపోతే తీసుకో బాబు అని అతనికి ఇచ్చి ఎంతో గర్వంతో వెనుకకు తిరిగారు ఆ తల్లితండ్రులు

ఇలాంటి కథలు వాస్తవాలు ఇంకెన్నో
ఇవేవి మనకు తెలియవు మనం ఆలోచించను లేము
రాజకీయనాయకుడికి పాలాభిషేకం చేసుకుంటూ
నటించే హీరోలకు భారీగా కట్ అవుట్ లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని మన సమయాన్ని మన విలువని పోగొట్టుకుంటున్నాము

ఇలాంటి వీరజవాన్ల ఎంతో మంది మనం బాగుండాలని వారి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు
కనీసం మనం గుర్తించలేక పోతున్నాం

🌷నా హృదయం 🌷


 ప్రారబ్ధ కర్మను అనుభవించుటకు జీవుడు మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటాడు.

 జీవులను ఉద్ధరించటానికి దేవుడు మళ్లీ మళ్లీ అవతరిస్తూ ఉంటాడు.

✨⚡️✨⚡️✨⚡️

 ఇద్దరికీ ముక్తి లేనట్లే.  'కర్మ-జన్మ' అనే ఆటను ఆడుతున్నంత వరకు.

*కర్మ, భక్తి, జ్ఞాన యోగముల సారం ఏమంటే - 'ఇది ఒక కల' (మాయ) అని ఎరిగి ఉండడమే.

✨⚡️✨⚡️✨⚡️

'ఒకటి'ని అనేకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది,  దానికి ''మాయ" అని పేరు.

తిరిగి 'అనేకాన్ని' ఏకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది.  దానికి "జ్ఞానం" అని పేరు.

✨⚡️✨⚡️✨⚡️

మనిషి లీల పేరు - కల.

దేవుని కల పేరు - లీల.

🕉🌞🌎🌙🌟🚩

ఓం నమః శివాయ
శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్/భావార్థ సహిత తాత్పర్యం
🕉🌞🌎🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
       
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా ।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥

స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూభిః ।
వ్యశేమ దేవహితం యదాయుః ॥

ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః ।
స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥

స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః ।
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥

ఓం తన్మామవతు
తద్ వక్తారమవతు
అవతు మామ్
అవతు వక్తారమ్
ఓం శాంతిః ।  శాంతిః ॥ శాంతిః॥।

॥ ఉపనిషత్ ॥

హరిః ఓం నమస్తే గణపతయే ॥

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి ॥ త్వమేవ కేవలం కర్తాఽసి ॥

త్వమేవ కేవలం ధర్తాఽసి ॥ త్వమేవ కేవలం హర్తాఽసి ॥

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి ॥

త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్ ॥ 1॥

               ॥ స్వరూప తత్త్వ ॥

ఋతం వచ్మి (వదిష్యామి) ॥ సత్యం వచ్మి (వదిష్యామి) ॥ 2॥

అవ త్వం మామ్ ॥ అవ వక్తారమ్ ॥ అవ శ్రోతారమ్ ॥

అవ దాతారమ్ ॥ అవ ధాతారమ్ ॥

అవానూచానమవ శిష్యమ్ ॥

అవ పశ్చాత్తాత్ ॥ అవ పురస్తాత్ ॥

అవోత్తరాత్తాత్ ॥ అవ దక్షిణాత్తాత్ ॥

అవ చోర్ధ్వాత్తాత్ ॥ అవాధరాత్తాత్ ॥

సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ॥ ౩॥

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః ॥

త్వమానందమయస్త్వం బ్రహ్మమయః ॥

త్వం సచ్చిదానందాద్వితీయోఽసి ॥

త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి ॥

త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి ॥ 4॥

సర్వం జగదిదం త్వత్తో జాయతే ॥

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి ॥

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి ॥

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి ॥

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః ॥

త్వం చత్వారి వాక్పదాని ॥ 5॥

త్వం గుణత్రయాతీతః త్వమవస్థాత్రయాతీతః ॥

త్వం దేహత్రయాతీతః ॥ త్వం కాలత్రయాతీతః ॥

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్ ॥

త్వం శక్తిత్రయాత్మకః ॥

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్ ॥

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం
ఇన్ద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం
బ్రహ్మభూర్భువఃస్వరోమ్ ॥ 6॥

               ॥ గణేశ మంత్ర ॥

గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరమ్ ॥

అనుస్వారః పరతరః ॥ అర్ధేన్దులసితమ్ ॥ తారేణ ఋద్ధమ్ ॥

ఏతత్తవ మనుస్వరూపమ్ ॥ గకారః పూర్వరూపమ్ ॥

అకారో మధ్యమరూపమ్ ॥ అనుస్వారశ్చాన్త్యరూపమ్ ॥

బిన్దురుత్తరరూపమ్ ॥ నాదః సంధానమ్ ॥

సంహితాసంధిః ॥ సైషా గణేశవిద్యా ॥

గణకఋషిః ॥ నిచృద్గాయత్రీచ్ఛందః ॥

గణపతిర్దేవతా ॥ ఓం గం గణపతయే నమః ॥ 7॥

               ॥ గణేశ గాయత్రీ ॥

ఏకదంతాయ విద్మహే । వక్రతుణ్డాయ ధీమహి ॥

తన్నో దంతిః ప్రచోదయాత్ ॥ 8॥

               ॥ గణేశ రూప ॥

ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణమ్ ॥

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్ ॥

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ ॥

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్ ॥

    భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ ॥

    ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్ ॥

    ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః ॥ 9॥

               ॥ అష్ట నామ గణపతి ॥

నమో వ్రాతపతయే । నమో గణపతయే । నమః ప్రమథపతయే ।
నమస్తేఽస్తు లంబోదరాయైకదంతాయ ।
విఘ్ననాశినే శివసుతాయ । శ్రీవరదమూర్తయే నమో నమః ॥ 10॥

               ॥ ఫలశ్రుతి ॥

ఏతదథర్వశీర్షం యోఽధీతే ॥ స బ్రహ్మభూయాయ కల్పతే ॥

స సర్వతః సుఖమేధతే ॥ స సర్వ విఘ్నైర్నబాధ్యతే ॥

     స పంచమహాపాపాత్ప్రముచ్యతే ॥

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ॥

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ॥

     సాయంప్రాతః ప్రయుంజానో అపాపో భవతి ॥

     సర్వత్రాధీయానోఽపవిఘ్నో భవతి ॥

     ధర్మార్థకామమోక్షం చ విందతి ॥

     ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ ॥

     యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి
     సహస్రావర్తనాత్ యం యం కామమధీతే
     తం తమనేన సాధయేత్ ॥ 11॥

అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి ॥

చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ।
స యశోవాన్ భవతి ॥

ఇత్యథర్వణవాక్యమ్ ॥

బ్రహ్మాద్యాచరణం విద్యాత్
     న బిభేతి కదాచనేతి ॥ 12॥

యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి ॥

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి ॥

స మేధావాన్ భవతి ॥

యో మోదకసహస్రేణ యజతి
    స వాఞ్ఛితఫలమవాప్నోతి ॥

యః సాజ్యసమిద్భిర్యజతి
    స సర్వం లభతే స సర్వం లభతే ॥ 1౩॥

అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్గ్రాహయిత్వా
సూర్యవర్చస్వీ భవతి ॥

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసంనిధౌ
వా జప్త్వా సిద్ధమంత్రో భవతి ॥

మహావిఘ్నాత్ప్రముచ్యతే ॥ మహాదోషాత్ప్రముచ్యతే ॥

మహాపాపాత్ ప్రముచ్యతే ॥

స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి ॥

య ఏవం వేద ఇత్యుపనిషత్ ॥ 14॥

॥ శాన్తి మంత్ర ॥

ఓం సహనావవతు ॥ సహనౌభునక్తు ॥

సహ వీర్యం కరవావహై ॥

తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ॥

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా ।
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ॥

స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః ।
వ్యశేమ దేవహితం యదాయుః ॥

ఓం స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః ।
స్వస్తి నః పూషా విశ్వవేదాః ॥

స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః ।
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥

ఓం శాంతిః । శాంతిః ॥ శాంతిః

॥।

॥ ఇతి శ్రీగణపత్యథర్వశీర్షం సమాప్తమ్ ॥

🕉🌞🌎🌙🌟🚩

అర్థ సహిత తాత్పర్యం
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

హరిః ఓం! లం! గణపతి బీజం.

నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.


త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).


త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు, నీవే ధరించే వానివి (ధర్త) నీవే లయం చేసుకునే వానివి (హర్త).  నీవు మాత్రమే సర్వమూ,  బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం) ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ (కాపాడు) మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను, శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను, దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా శేషించిన దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".


జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.


త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)


ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది. ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి. పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పాదాలు నీవే.


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి.  నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.


నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే.  త్రిమూర్తులు,  ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).


అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.


తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.


ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)


“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం,  అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.


ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.


“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!


ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దనైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులు

ముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజితుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.


హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు. శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే.


వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.


సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ  కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.


దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.


ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.


భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.


దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు. (నభిభేతి)


గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.


ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.


సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు (స) అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

🕉🌞🌎🌙🌟🚩


"ఋభుగీత " (28)
🕉🌞🌎🌙🌟🚩

2వ అధ్యాయము

ద్వంద్వమైన మనసు లేకపోతే ఆనందమే మనని నడుపుతుంది !!

నిజానికి సర్వకాల సర్వావస్థల్లో మనలోని పరమాత్మ వస్తువే మనని నడుపుతుంది. అది గుర్తుపట్టలేకనే గుణాలను ఆశ్రయిస్తున్నాము. ద్వంద్వమైన మనసు లేకపోతే ఆనందమే మనని నడుపుతుంది. మహానుభావులంతా అది మనకి చూపడానికే వచ్చారు. అది అనుభవంలోకి వస్తే అంతా బ్రహ్మమే అని గుర్తిస్తాము. పరిపూర్ణత్వం అంటే వెలితిలేని స్థితి. వెలితిని తీలుసుకోవడం కాదు... అసలు వెలితే లేదని గుర్తిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఉన్న బ్రహ్మములో వెలితిలేదు. అసలు ఉనికేలేని మనసును దేనితోనూ నింపలేము. కాబట్టి ఎదో లేదన్న వెలితి కేవలం భావన మాత్రమే !

🕉🌞🌎🌙🌟🚩

ఈ శాంతి మంత్రం యొక్క భావము
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

అర్థం :—
÷÷÷÷÷÷÷÷
మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా “మూడు తాపములు” అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, అధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల అర్థము.

🕉🌞🌎🌙🌟🚩

🌻. ఆనందసూక్తము  - 4  🌻

అయితే ఆనందాన్ని చేరుకొనే త్రోవ ఏమిటి? ఆ మార్గము సేవ, త్యాగములలో ఉన్నవి. ఆనందానికి సేవ, త్యాగములే ప్రోత్సాహకాలు. అవి అర్థం చేసుకోవటానికి ఎన్ని జన్మలు, పునర్జన్మలో కాలాన్ని హరించటానికి.

ఆనందాన్ని డబ్బుతో కొనుక్కోవచ్చని భావిస్తాము. అందుకై‌ పడరాని పాట్లు. అవసరమైనవి, ఆవశ్యకమైనవి కొనుక్కొనుటకు మాత్రమే ధనము అవసరమన్న సంగతి మరచిపోతాము.  

మనకు అవసరాలు, కోరికలు ఎన్నో!! కోరికల కొరకు వస్తువులు కొనటం మొదలుపెడతాము, కోరిక అనేది‌ అడుగు‌ భాగం లేని పాత్ర అని గ్రహించం. పైగా దానిని డబ్బుతో నింపాలని యత్నించి, డబ్బు సంపాదిస్తూ పోతుంటాము. దానికై కార్యకలాపాలు‌ పెంచుకొంటాము. ఇదంతా ఎందుకంటే అనందంగా ఉండాలని ఉంది కనుక. 

"ఆనందంగా జీవించాలనే దురదృష్టవంతునికి ఆనందంగా ఉండటానికి సమయమే చిక్కటం లేదు." అని పవిత్రగ్రంధాలు చెబుతున్నాయి. 

ఆనందంగా ఉండటానికి ఏదో‌ ఒకటి చేయాలని అనుకుంటున్నప్పుడల్లా మనకు వైఫల్యమే మిగులుతున్నది. ఎందుచేతనంటే ఆనందమునకు, ఆనందాన్ని కొనగలిగిన మరో వస్తువు లోకంలో లేదు. నిజంగా కొనగలిగితే, అది ఆనందం కంటే విలువయినదయి ఉండాలి. దానిని అంగీకరిస్తే పిచ్చితర్కమని జాలిపడాలి. అంటే దారి తప్పనట్టు లెక్క. 

ఇళ్ళతో‌కాని, అతి విలువగల వస్తువులని భావించేవానితో మనం ఆనందాన్ని కొనుక్కోటానికి యత్నిస్తుంటాము. అది టి.వి. కావచ్చు, సోఫాలు కుర్చీలు కావచ్చు. విద్యుత్ పరికరాలు కావచ్చు. అవి మనకు చెంది ఉంటాయి. కాని అవి మనము కాము. 

ఆనందం ఒకనికి చెందిన వస్తువు కాదు. అది ఒక విప్పారటం- తెరుచుకోవటం. అది నువ్వే అని మరచిపోకు. పువ్వుకు, రేకకు ఉన్న సంబంధము, నీకూ ఆనందానికి ఉన్న సంబంధము ఒక్కటే. అంటే పువ్వు యొక్క రేకలు ఆ పువ్వుకు చెందినవి కావు. అవి పుష్పంలోని భాగాలే. అవి పుష్పము యొక్క ఏకత్వములోను, సమన్వయములోనూ ఉన్నవి.

...✍ మాస్టర్ ఇ.కె.🌹


🌹 🌹 🌹 🌹 🌹


🌹. దేహములో నున్న జీవునకు మొదటి కర్తవ్యము స్వస్వరూప జ్ఞానము పొందుట. దాని యందు శ్రద్ధా జీవనమే అర్ధవంతమైన జీవితము 🌹

నీకు ఈ దేహము కర్మ ప్రభావముచే లభించినది. ఈ దేహమునకు ఒక కర్తవ్యము ఉన్నది. మొదటి కర్తవ్యము స్వస్వరూప జ్ఞానమును పొందుట. రెండవది  ఉదర పోషణార్ధము పని చేయుట. ఇతరులతో కలిసి ఉన్నప్పుడు మన పాత్రను మనము పోషించుట ఇంతకు మించి మనము చేయ వలసిన కర్తవ్య పాలన ఏమి ఉన్నది?

ఎదుటి వాడు ఏదైనా చెయ్య మన్నప్పుడు
దాని వలన ధర్మ లోపము ఏమైనా కలుగుతుందా?
దాని వలన జ్ఞాన లోపము కలుగుతుందా?
దాని వలన నాలో త్రిగుణముల ఉద్రేకము పెరుగుచున్నదా?
అనే విచారణ చేసికోవాలి.

జ్ఞానాందుడైన దృతరాష్ట్రుడు కుమారునిపై మోహముతో దుర్యోధనుడు చెప్పినది అధర్మమైనా విన్నాడు. పెద్దలు ఎన్ని చెప్పినా వినలేదు. చివరకు ఏమైనది.?

కనుక నీవు ఇతరులతో ప్రవర్తించేటప్పుడు  నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానము కోల్పోకుండా ప్రవర్తించాలి. నీవు చేయవలసిన కర్తవ్యము ఏమి లేని చోటకు  నీవు వెళ్లిన   నిన్ను తప్పక అది బాదిస్తుంది.

నీకు కలిగే ప్రతి ఆలోచనను నీవు విమర్శించాలి.
🌹 🌹 🌹 🌹 🌹

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 27-6
సంపుటము: 1-167

వాసివంతు విడిచినవాఁడే యోగి; యీ-
ఆసలెల్లా విడిచిన అతఁడే యోగి !!
॥పల్లవి॥


గద్దించి పారెడుతురగమువంటి మనసు
వద్దని మరలించినవాఁడే యోగి
వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు
దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి !!
॥వాసి॥


ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన
వంచన మునుఁగనట్టివాఁడే యోగి
పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు
దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి !!
॥వాసి॥


వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై
వగలుడిగినయట్టివాఁడే యోగి
నిగిడి శ్రీవేంకటేపతి నిజదాసుఁడై భక్తిఁ
దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన యోగి !!
॥వాసి॥

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు:
----------------------------

గద్దించి = యెదిరించి

మట్టుపెట్టువాఁడే = తుదముట్టించేవాడే

వెగటు = హేయమైన


****
భావామృతం
____
  
కీర్తి విడిచిపెట్టినవాడే అసలైన యోగి. ఆశ కోరికలను విడిచిపెట్టినవాడే అత్యత్తమ యోగి. మనస్సు యెదిరించి పరుగులు పెట్టు పొగరుబోతు గుఱ్ఱము వంటిది. అట్లా వుండరాదని మంచి స్వాధీనమున వుంచు వాడే నిపుణుడైన యోగి. కొండలవలె ఉన్నతమైన దేహగుణాలను ఒద్దని ప్రేరేపించే మానసిక వైకల్యమును సవరించి తుదముట్టించేవాడే గొప్ప యోగి. అతడే ధైర్యవంతుడు ఇంద్రియములు లొంగదీసికొని మోహము అనే మహాసముద్రంలో పడవేస్తాయి.


 వంచించబడిన మనిషి దానిలో మునిగిపోతాడు. అట్లా మునిగిపోనివాడే మోక్షార్హుడైన యోగి. పాపపుణ్యాలనే ధాన్యపుగింజల మీద పొట్టు వంటివి నరులు చేసే కర్మములు. పొట్టు ఒలిస్తేగాని గింజ మంచిదో చెడ్డదో తెలియదు. తత్త్వవేత అయిన యోగి ఆ గింజలను పొట్టుతో సహా దంచిపారవేయవలెను. హేయమైన కామము మొదలైన వానిని వెళ్ళగొట్టి శాంతి పొందినవాడే సఫలుడైన యోగి. పగ కపటము విడనాడినవాడే పరమయోగి. అతిశయించి శ్రీవేంకటపతి నిజదాసుడై భక్తిమార్గం‌లో జీవిస్తూ వైష్ణవ ధర్మాన్ని నిలుపువాడే ధన్యుడై హరి మెచ్చిన యట్టి యోగి అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment