Saturday, 13 June 2020

15-06-2020 ఈ నాటి కధలు

జీవిత స‌త్యాన్ని చెప్పే క‌ప్ప క‌థ‌.!

వాస్తవానికి ఈ కథ మనందరి జీవితాలకి కూడా అన్వయించుకోవచ్చు.

ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు.
ఇందులో చాలా నీతి ఉంది!
ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల అంటారు!
కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!

అలాగే మనం కూడా ఉద్యోగ జీవితంలో కానీ నిజ జీవితంలో కానీ అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉంటూ జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. 
ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి యుక్తిగా బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది. 
అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి.


'జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా ముఖ్యం' 

--(())--



* శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ.
*తేట గీతి నేటి పద్యాలు 
* శ్రీ విష్ణు స్తుతి
* శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం..
* ఒక ముసలి ఆవిడ
* తెల్ల కాకి కధ

🌺 DURGA DEVI ॐ 🌺


శ్రీమాత్రేనమః  శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ.  

శ్రీలలితా సహస్రనామావళిలోని ప్రప్రథమ నామమంత్రము
🕉 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 

సమస్త చరాచర వస్తు ప్రపంచానికి, మాతలందరకేమాత, సమస్త సృష్టికి మూలమైనది,, మంగళప్రదమైన తల్లికి నమస్కారమ

శ్రీలలితా సహస్రనామావళలోని శ్రీమాత అను మూడక్షరముల (త్ర్యక్షరీ) ప్రప్రథమ నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరిస్తూ ఆ జగన్మాతను ఆరాధించు ఉపాసకులకు సర్వశుభములను చేకూర్చును, సంతాన హీనులకు సంతానము ప్రసాదించును, అష్టైశ్వర్యములు చేకూర్చును, బ్రహ్మజ్ఞాన సంపదను సమకూర్చి తరింపజేయును. 

శ్రీమాతా: మాతా అంటే అమ్మ, మరి శ్రీమాతా అంటే అమ్మలగన్న అమ్మ. లలితా దేవి అందరికీ అమ్మ. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి. శ్రిలలితా సహస్ర నామాలు వసిన్యాది దేవతలు  అమ్మ స్వరూపాన్ని బాగుగా ఆకళింపు చెసుకుని చెప్పినవి. మనం కూడ అమ్మని వాళ్లలా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 

ఇప్పుడు మనం అమ్మని ఎవరికైనా పరిచయం చెయ్యలంటే ఏమి చెప్తాం, ఇదిగో వీరు మా అమ్మ. ఇప్పుడు శ్రిలలితా దేవి గురించి చెప్పాలంటే శ్రీమాతా, శ్రీ అంటే గౌరవం అంతకుమించి శక్తిమంతురాలు అని కూడ అర్ధం.  మా అమ్మ ఎటువంటి అమ్మ అంటే తరువాత వచ్చే నామాల్లొ చూడవచ్చు. అమ్మ వారి నామాలు ఎంతగా పేర్చారు అంటే వరుస క్రమం కూడ చాల ప్రాధాన్యత కలిగి వుంటుండి. 

సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ అలాగే సృష్టికి కారణమైన పరాశక్తి, మన అమ్మలకు కారణమైన పరాశక్తికూడా మనకు అమ్మ అవుతుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో మోస్తుంది ఆసమయంలో ఆశిశువు పిండంగా మారినప్పటినుండి నెలనెలా పెరిగే విధానానికి కారణమైనది జగన్మాతయే. ఈ విషయం ముందు ముందు నామ మంత్రములలో మనకు అర్థమవుతుంది.

అందుచే ఆ జగన్మాత కూడా మనకు అమ్మ అవుతుంది. తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచడానికి కావలసిన వన్నీ ఇచ్చేది జగన్మాతయే,అందుకే జగన్మాత మనకు అమ్మయే. 

శ్రీః మాతి వర్తతే గర్భరూపేణ అస్యామ్ అతి శ్రీమాతాః 
- శ్రీ రూపమైన పరావిద్య - బ్రహ్మవిద్య, ఈమె యందు గర్భరూపముగా ఉండును గనుక పరాశక్తి శ్రీమాత అయినధి. దాతః  అనగా దానము ఇచ్చునది, మాత అనగా శ్రీలను, సర్వ సంపదలను అందించునది. సాక్షాత్ మోక్ష సామ్రాజ్యదాయిని జగన్మాత లలితాంబికాదేవి. శ్రీ అనే అక్షరంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి (మువురమ్మలు) ఉన్నారు అందుకే శ్రీమాత మువురమ్మలకు మూలమై యున్నది. ఏడు శక్తులు మాతలుగా,  సప్తమాతృకలుగా శాస్త్రకారులుగా కీర్తింపబడుతున్నారు. ఈ సప్తమాతృకలు లలితాంబ ఖడ్గమాలా స్తోత్రం కూడా (బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అనికూడా ప్రస్తావింపబడినది.  సప్తమాతృకలు ఈ విధంగా చెప్పారు:

బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా|
వారాహీ చైవ చేంధ్రాణీ చాముణ్డా సప్తమాతరం

భావము- బ్రాహ్మీ అనగా బ్రహ్మ సంబంధమైనది, మాహేశ్వరీ అనగా మహేశ్వర సంబంధమైనది, వైష్ణవీ అనగా విష్ణు సంబంధమైనది, వారాహి అనగా వరాహ సంబంధమైనది, ఇంద్రాణీ అనగా ఇంద్ర సంబంధమైనది, చాముణ్డా అనగా చండ-ముండాసురులను చంపి చాముండగా ప్రసిద్ధమైనది. 

         ఈ సప్తశక్తులు సచ్చిదానంద పరమశివ, పరబ్రహ్మమునకు పరిచారికలైన సప్తమాతలుగా విఖ్యాతిగన్నవి. శ్రీ అనగా మంగళము, శ్రేష్ఠము అని అనుకున్నాముగదా, శ్రీమాత అనగా మంగళ కరమైన మాత, శ్రేష్ఠమైన మాత, బ్రాహ్మీ మొదలైన మాతలు శివపరిచారికలుగా ఉన్నారు. శ్రీరూపమైన శ్రీమాత మాత్రము వారికంటే మిన్నయై శివస్వరూపిణియై విరాజిల్లుచున్నది. 

సారాంశమేమనగా శివునికినీ శ్రీమాతకునూ భేదము లేదు. ఇదియే అర్ధనారీశ్వర శివతత్త్వము, సేవ్యసేవక భావాతీతము. 
శ్రీమాతను సేవించు భక్తులకు ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కల్గించుటయే గాక సచ్చిదానంధ రూపమైన పరమపదమును సైతం అనుగ్రహించును. కన్నతల్లికి మించిన శక్తి గలదియు, సర్వకాలములో ఉండేదియు, అనంత కరుణామూర్తియు అగుటచే, అనగా కన్నతల్లికంటే శ్రేష్ఠురాలు అగుటచే శ్రీమాత అనబడుచున్నది అనియు భావించవలెను. 

ప్రపంచోత్పత్తి కాలమున బ్రహ్మదేవునికి త్రయీ విద్యను ప్రసాదించినదియు, శ్రీచక్ర బిందుమండల వాసిని అనియు తెలియదగును మరియు ప్రపంచంలో తల్లులు కొందరికే తల్లులైతే శ్రీమాత అనంత బ్రహ్మాండములకు తల్లి. 

ఈవిధంగా మాతలను మించిన మాత అగుటచే పరాశక్తి శ్రీమాత అయినది, తల్లివలె పాలవంటి అనుగ్రహాన్ని ఇచ్చును, తండ్రివలె పోషణ చేకూర్చును, గురువువలె జ్ఞానమును ప్రసాదించును, అలాగే బ్రహ్మాది సర్వదేవతలు ఈ తల్లిని ఆశ్రయించి ఉన్నారు ఇంకను ముగ్గురు అమ్మలకు, ముగ్గురయ్యలకు మూలమైనది పరాశక్తి. అందుకే పరాశక్తి శ్రీమాత అని కీర్తింపబడుతున్నది. సంతానము లేని వారు శ్రీమాత్రే నమః బాలా త్రిపురసందరి మంత్రంతో సంపుటి చేసి జపిస్తే సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. కావున మాతా అనగా శుభప్రదాయిని, త్రిలోక జనని, సర్వ సంపదలను వర్షింపజేయునది.  ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, త్రిశక్తులకు, త్రిమూర్తులకు తల్లి, మోక్షప్రదాయిని, మోక్షరూపిణి అని తెలియగలము శ్రీమాతా అను ఈ శ్రీలలితా సహస్రనామావళిలోని ప్రప్రథమ నామ మంత్రమునకు అర్థము  1) శుభప్రదమైన తల్లి, 2) శ్రీ అను జగన్మాత 3) సర్వ సంపదలకు మూలమైన శ్రీ (సిరి)., 4) మోక్షసామ్రాజ్ఞి, 5) మోక్ష దాయిన, 6) మువురమ్మలకు (లక్ష్మీ, సరస్వతి, పార్వతులకు) మూలమైనది, 7) ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి,  క్రియాశక్తులకు మూలము (తల్లి). 

శ్రీమాతకు  నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనవలెను. 


ఈ వ్యాఖ్యానము  సేకరణ శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథము

--(())--

సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్|

తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్

పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్|

సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం॥

భావము


సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యకిరీటమునందు ధరించి, చిఱునగవుతో కూడిన ముఖంతో, ఉన్నతమైన వక్షస్థలంతో, చేతులలో మద్యంతో నిండిన రత్నభాండాన్ని, ఎర్రని కలువను ధరించి, సౌమ్యమైన రూపంతో రత్న ఘటమునందు ఎర్రని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ధ్యానించవలెను

🙏🙏🙏🌹🌹🌹

ఓం   శ్రీ రామ్ ....ఓంశ్రీమాత్రే నమః


జీవిత స‌త్యాన్ని చెప్పే క‌ప్ప క‌థ‌.!

వాస్తవానికి ఈ కథ మనందరి జీవితాలకి కూడా అన్వయించుకోవచ్చు.

ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది. ఇది కేవలం కథ కాదు.
ఇందులో చాలా నీతి ఉంది!
ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల అంటారు!
కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!

అలాగే మనం కూడా ఉద్యోగ జీవితంలో కానీ నిజ జీవితంలో కానీ అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉంటూ జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. 
ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి యుక్తిగా బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది. 
అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి.


'జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా ముఖ్యం' 

--(())--


* శ్రీ విష్ణు స్తుతి

ధ్రువ కృత భగవత్ స్తుతి

1)అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్|

 ప్రాణాన్నమో భగవతే పురూషాయ తుభ్యమ్ ||


2)ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్ |


సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభావసువద్విభాసి ||



3)త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః |


తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో || 



4)నూనం విముష్టమతయస్తవ మాయయా తే  యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః |


అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్య- మిచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేఽపి నౄణామ్ || 



5)యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ- ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్ |


సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్కిం‍ త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్ ||



6)భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతామమలాశయానామ్ |


యేనాంజసోల్బణమురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణకథామృతపానమత్తః ||



7)తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః |


యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద- సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసంగాః ||



8)తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య- మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్ |


రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః ||



9)కల్పాంత ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్ శేతే పుమాన్ స్వదృగనన్తసఖస్తదంకే |


యన్నాభిసింధురుహకాంచనలోకపద్మ- గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోఽస్మి తస్మై ||



10)త్వం నిత్యముక్తపరిశుద్ధవబుద్ధ ఆత్మా కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః |


యద్బుద్ధ్యవస్థితిమఖండితయా స్వదృష్ట్యా ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే ||



11)యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్ |


తద్బ్రహ్మ విశ్వభవమేకమనంతమాద్య- మానందమాత్రమవికారమహం ప్రపద్యే ||



12)సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మ- మాశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః |


అప్యేవమార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోఽస్మాన్ || 



ఇతి శ్రీమద్భాగవతమహాపురాణే చతుర్థః స్కంధే నవమోఽధ్యాయే ధ్రువ కృత భగవత్స్తుతిః ||


🕉🌞🌏🌙🌟🚩

1
--(())--

* శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం..

ఈ భూమండలంలో అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం...

తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. 
క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.

శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు  ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.

శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులు, రాణులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. ఆలయంలోని నిర్మాణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1 వ ప్రాకారం :-
〰〰〰〰〰〰

మహాద్వార గోపురం  :- (ఇత్తడి వాకిలి)

శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.
పడికావలి, సింహద్వారం, ముఖద్వారం
అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 
దీనినే తమిళంలో ”పెరియ తిరువాశల్‌” అని కూడా అంటారు. అనగా *పెద్దవాకిలి అని అర్థం.

ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.

ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు  కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.

ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం  ఉంటుంది.

శంఖనిధి - పద్మనిధి
మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు.  దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.

కృష్ణదేవరాయమండపం :-

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27' ×25' కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే ప్రతిమా మండపం అని కూడా అంటారు. 

ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో  కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.

అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించాడు.

అద్దాలమండపం

ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని
 అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే ప్రసాదం పట్టెడ అంటారు.

తులాభారం :-

శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.

రంగనాయక మండపం  :-

కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

తిరుమలరాయమండపం:-

రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం. 
ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి "అన్నా ఊయల తిరునాళ్ళ" అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.
అణ్ణై అనగా తమిళంలో హంస.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

రాజ తోడరమల్లు:-

ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.
 అవి రాజా  తోడరమల్లు
అతని తల్లి మోహనాదేవి
అతని భార్య పితాబీబీ విగ్రహాలు. 
ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.

ధ్వజస్తంభ మండపం :-

ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం  అంటారు. 

ధ్వజస్తంభం:-

వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.

బలిపీఠము :-

ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని (అన్నాన్ని ) ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

క్షేత్రపాలక శిల (గుండు) :-

ధ్వజస్తంభం కు ఈశాన్య (north - east)  మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే క్షేత్రపాలక శిల అంటారు.
ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.

సంపంగి ప్రాకారం  :-

మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం స్థలవృక్షం సంపంగి.  ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.

కళ్యాణ మండపం  :-

సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.

ఉగ్రాణం :-

స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.
సంపంగి ప్రదక్షిణకు  (north west)  వాయువ్య మూలగా ఉంటుంది.

విరజానది :-

వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.

ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.

నాలుగు స్థంభాల మండపం :-

సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.

పూలబావి :-

పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.
దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.

వగపడి :-

భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.

ముఖ మండపం :-

అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.
కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.

 2 వ ప్రాకారం :-
〰〰〰〰〰〰〰〰〰

వెండి వాకిలి – నడిమి పడికావలి...

ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 
ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న  శిల్పం ఉంది.

విమాన ప్రదక్షిణం :-

వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.

ఈ ప్రదక్షిణ మార్గంలో  వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,
పూలబావి,
అంకురార్పణ మండపం,
యాగశాల,
నాణాల పరకామణి,
నోట్ల పరకామణి,
చందనపు అర
విమాన వేంకటేశ్వర స్వామి,
రికార్డుల గది,
భాష్యకారుల సన్నిధి,
యోగనరసింహస్వామి సన్నిధి,
ప్రధాన హుండి
విష్వక్సేనుల వారి ఆలయం
మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.

శ్రీరంగనాథుడు :-

వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.
అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
వీనినే పొర్లుదండాలు అంటారు.

శ్రీ వరదరాజస్వామి ఆలయం :-

విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.

బంగారు బావి :-

దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.

వకుళాదేవి :-

బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.
శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.

అంకురార్పణ మండపం :-

బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.
ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.

యాగశాల :-

హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని  కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.

సభ అర :-

కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.

ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.

సంకీర్తన భాండాగారం :-

సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.

సాధుసుబ్రమణ్యశాస్త్రి గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.

భాష్యకార్ల సన్నిధి :-

ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.

తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.

ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.

ప్రధాన వంటశాల (పోటు) :- 

విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.

పరకామణి :-

స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.

చందనపు అర :-

స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.

ఆనందనిలయ విమానం :-

ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.

గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.

విమాన వెంకటేశ్వరస్వామి :- 

గోపురంపై  వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు. 

రికార్డు గది :-

స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.

వేదశాల :-

రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.
  

శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-

రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.

శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. 
'అళగియ సింగర్‌' (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది.

చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.
ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.

శంకుస్థాపన స్థంభం :-

రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.

పరిమళ అర :-

శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.

శ్రీవారి హుండి :-

భక్తులు కానుకలు వేసే ప్రాంతం.
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.

బంగారు వరలక్ష్మి :-

హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.

కటహ తీర్థం :-

అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.

విష్వక్సేన :-

హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.

ఘంట మండపం :-

బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.

పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని ఘంటపని అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.

ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.

గరుడ సన్నిధి :-

మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా  బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.

ద్వారపాలకులు :-

బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.
మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.

3 వ మూడవ ప్రాకారం :-
〰〰〰〰〰〰〰〰〰〰〰

బంగారువాకిలి :-

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.

స్నపన మండపం :-

బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌కోయిల్‌ అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.

దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.

రాములవారి మేడ :-

స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల  ఎత్తుగా కనిపించే గద్దెలు. ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. 
ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.

శయనమండపం  :-

రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి  శయనిస్తారు.

కులశేఖరపడి :-

శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. 

పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

🏛 ఆనందనియం 🏛 :-

కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” గర్భాలయం ”  అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-

గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”స్థానకమూర్తి” అంటారు.
అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”.... ధ్రువమూర్తి ....” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి. 

ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా 
    కొలువు శ్రీనివాస మూర్తి
     భోగ శ్రీనివాస మూర్తి
     ఉగ్ర శ్రీనివాస మూర్తి
     మలయప్ప స్వామి 

అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.
\
__)))____

*ఒక ముసలి ఆవిడ

*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*
*ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*
*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు . నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*
*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*
*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*
*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*
*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "* 
*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*
*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*
*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*
*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*
*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*
*ఆ ముసలావిడకు చదువు రాదు .*
*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*
*ఫ్రెండ్స్ , ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .*
*కానీ , మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*
*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*
*కానీ , మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*
*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*
*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత  ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .*
*ఫ్రెండ్స్ ,*
*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం* 
*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*
*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .*
*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత  .*
*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి*
*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*
*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*
*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత  .*
*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత.*
*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .*
 ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*
*ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*
*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*
*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు . నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*
*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*
*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*
*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*
*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*
*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "* 
*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*
*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*
*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*
*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*
*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*
*ఆ ముసలావిడకు చదువు రాదు .*
*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*
*ఫ్రెండ్స్ , ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు .*
*కానీ , మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*
*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం  ఉంది .*
*కానీ , మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*
*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*
*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత  ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .*
*ఫ్రెండ్స్ ,*
*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం* 
*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*
*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .*
*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో  కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత  .*
*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి*
*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*
*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*
*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత  .*
*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న  గ్రంథం భగవద్గీత.*

*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .*

--(())--

💐💐💐తెల్ల కాకి కధ💐💐💐

కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం కాకులు తెల్లగా ఉండేవట!!. మరి ఎందుకు నల్లగా మారాయో తెలుసుకుందామా!!

బ్రహ్మదేవుడు మనుష్యులను, పశుపక్ష్యాదులను సృష్టించాడు. అప్పుడు కాకులు చాలా అందంగా ఉండేవి. అందంతో పాటు అహంకారం కూడా ఉంది. బ్రహ్మదేవుడికి అలసట రావడంతో యోగనిద్రలోకి వెళ్ళాడు.మనుష్యులకు పాములకు పడేది కాదు కనిపిస్తే మమ్మల్ని చంపుతారు అని పాములు, కనబడితే కాటు వేస్తాయి అని మనుష్యులు ఉండేవారు. పాములు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి మనుష్యులు గుర్తుతెలియని జబ్బులతో చనిపోసాగారు.

యోగనిద్ర నుండి లేచిన బ్రహ్మదేవుడు మనుష్యులను చూసి జాలిపడి, ఒక దేవరహస్యం చెప్పాలని అనుకున్నాడు. ఆ దేవరహస్యం వల్ల మనుష్యులు బ్రతికే అవకాశం ఉంటుందనీ, కానీ ఈ విషయం వారికి చెప్పాలంటే ఒక దూత అవసరం ఉంది కనుక కాకిని పిలిచాడు. "భూలోకం వెళ్ళి మనుష్యులకు ఈ దేవరహస్యం చెప్పు" అని కాకి చెవిలో ఆ దేవరహస్యం చెప్పి పంపాడు.

ఆ కాకి దేవరహస్యం మోసుకుంటూ సత్యలోకం, విష్ణులోకం, కైలాసం దాటి భూలోకం పైన అడుగుపెట్టింది. సత్యలోకం నుండి ఏకబిగిన ఎగురుతూ రావడం వల్ల దానికి ఆయాసం, ఆకలి ఒకేసారి కలిగాయి. చుట్టూ చూసింది కాకి కి కొద్ది దూరంలో ఒక పాము చిన్న లేడిపిల్లని చుట్టుకొని చంపి తినబోతోంది. కాకి ఆ పాము దగ్గరకు వెళ్ళి "నాకు కొద్దిగా ఆహారం ఇవ్వగలవా" అని అడిగింది. దానికి ఆ పాము "ఇస్తాను కానీ ఇంతకీ ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు" అని అంది. "నేను దేవలోకపు పక్షిని ఒక దేవరహస్యాన్ని మనుష్యులకు చెప్పమని బ్రహ్మదేవుడు నాకు ఆదేశించాడు" అంది. మనుష్యుల పేరు చెప్పగానే పాముకు కోపం వచ్చింది. మనుష్యులకు ఆ రహస్యం తెలియనీయకూడదని ఒక పథకం వేసింది.

"సరే నేను నీకు ఆహారాన్ని ఇస్తా మరి బదులుగా నాకేం ఇస్తావు" అంది పాము. ఒకవైపు తన దగ్గర దేవరహస్యం తప్ప ఇంకేం లేదు, ఇంకోవైపు ఆకలి. కాకి కి ఏంచేయాలో తెలియక దేవరహస్యాన్ని పాముకు చెప్పేస్తుంది. "ఎవరయినా మరణించే ముందు వారి పైచర్మాన్ని ఒలిచేసుకుంటే వారు మళ్ళీ నూతన యవ్వనం పొందుతారు ఇదే ఆ దేవరహస్యం" అని చెప్పి ఆహారం తిని, అలసట తీర్చుకుని సత్యలోకం వైపు సాగిపోయింది.

అందుకే పాములు తను చనిపోయే సందర్భం వచ్చినప్పుడు పైచర్మాన్ని ఒలిచేసుకుంటాయి. దానినే మనం వాడుక భాషలో "కుబుసం" అంటాం.

ఇక కాకి విషయానికి వస్తే "మనుష్యులకు ఆ రహస్యం చెప్పావా" అని బ్రహ్మదేవుడు అడగగానే తడబడుతూ, "చెప్పాను" అని అబద్దం చెప్పింది. బ్రహ్మదేవుడు యోగదృష్టితో చూసి జరిగింది తెలుసుకుని కోపంతో ఊగిపోతూ "ఏ అందం చూసి సంబరపడుతున్నావో ఆ అందం నీకు లేకుండాపోతుంది భూలోకంలో పుడతావు" అని శపించాడు. కాకి శరణు కోరుతూ "స్వామీ ఇదంతా నా ఆకలి మూలాన వచ్చిందని" చెప్పగానే బ్రహ్మదేవుడు శాంతించి, "నీవు మనుష్యులకు పితృలోకానికి మధ్య వారధిలా ఉంటావు" అని చెప్పాడు.

అందుకే ఎవరయినా చనిపోయినపుడు పిండప్రదానం చేయగానే కాకి వస్తే అందులోకి చనిపోయిన వారు ఆత్మలుగా వచ్చి వారి ఆకలి తీర్చుకుని స్వర్గానికి వెళతారని నమ్ముతారు. 


ఇది నల్లగా మారిన ఒకప్పటి తెల్లకాకి కథ.


No comments:

Post a Comment