* ప్రకృతి లయ సమాధి
* అన్నమాచార్య సంకీర్తన
* శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం
* భావ రస మంజరి
చాతుర్మాస్య వ్రతం సమగ్ర వివరణ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అంటారు. ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ , పురుష భేదం గానీ , జాతి భేదం గానీ లేదు. వితంతువులు , యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన , బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ , వీలుకాకపోతే కటక సంక్రాంతి , కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.
చాతుర్మాస్యం
చరిత్ర
ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య , స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి . తొలినాళ్ళలో వర్ష , హేమంత , వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది . ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రఘాస యజ్ఞం , కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం , ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతము గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను , భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత , పిత్త , శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది .
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః
వ్రత నియమాలు
చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల (బ్రహ్మచర్య , గృహస్థ , వానప్రస్థ , సన్యాస) వారు పాటించవచ్చు. కుల , వర్గ నియమాలు కానీ , లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు , రెండవ నెలలో పెరుగు , మూడవ నెలలో పాలు , నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు , వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.
ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.
వ్రతకాలంలో బ్రహ్మచర్యం , ఒంటిపూట భోజనం , నేలపై నిద్రించడం , అహింస పాటించాలి.
ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.
భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగసాధన చేయడం శ్రేయస్కరం.
దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.
వ్రత వృత్తాంతము
చతుర్మాసాలు అంటే , ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ , శ్రావణ , బాధ్రపద , ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం , ఆకుకూరలు , వెల్లుల్లి , సొరకాయ , టమాట , ఆవనూనెల సేవనం మానివేయటం , నిరంతర జప , తప , హోమ , పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం , రోజూ ఒకే పూట భోజనం చేయటం , ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు , దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం , క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ , బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం , ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని , చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.
నారేళ్ళనాచి కథ
ఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి - చేయి మెత్తగా , మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే 'ఎముక లేని చెయ్యి' అని దానం చేసేవారిని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి , సేవచేసి , 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి , చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం , గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి , క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.
రాజు రాణి కథ
ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు , బావులు తవ్వించడం , బాటలు వేయించడం , బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది , తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట.
సుభద్ర వ్రతాచరణ
తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.
ముత్తైదువులు
చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్త్తెదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోముకున్నాక కన్నెముత్తైదువకు పసుపు , కుంకుమ , గాజులు , బట్టలు , భోజనం , బియ్యం , నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి , తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు , సీతాఫలాలు , చెరకు , ఖర్జూర పండ్లు వంటివాటితో కన్నె పిల్లల ఒడినింపి , గౌరమ్మకు నమస్కరిస్తారు. పరోపకారం , సేవాభావం , పరులను గౌరవించడం , చాతుర్మాస్య నియమాలు పాటించడం - మానవాళికి ఎంతో శుభం , ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.
--(())--
రోజువారీ సీరియల్ .... 7
ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణంలో విషయాలు క్లుపంగా
బాలకాండము
శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం
ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతంచేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు.
కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్ధమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు.
ప్రకృతి లయ అనేది ఒక సంస్కృత పదము. ప్రకృతి లయ అంటే ప్రకృతిలో లయించిపోవడం. ప్రకృతి అంటే ఏమిటి? విశ్వంలో కల స్థావర జంగమాలన్నీ ప్రకృతియే కదా! లయ అంటే ఏమిటి? ప్రకృతికి, తనకు అభేద స్థితి ప్రకటించడమే ప్రకృతి లయ సమాధి. తన చిత్త వ్యాపారాలను పూర్తిగా లయం చేయడమే ప్రకృతి లయ సమాధి లక్ష్యం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రకృతి , వ్యక్తావ్యక్తంగా ఉంది. భౌతిక అభివ్యక్తీకరణ పరిమితం. ఇది ప్రకృతిలో ఒక స్థాయి అయినప్పటికీ. ఈ భౌతిక అభివ్యక్తీకరణ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకృతి. అసలు భౌతిక ప్రకృతి , వ్యక్తం అనుకొంటె, దీనిని అనుసరించి అవ్యక్తమే హెచ్చు పాలు. ఈ ప్రకృతి సత్త్వ రజస్తమో గుణాలనే త్రిగుణాలను కలిగి ఉంది. ఎవడైతే ప్రకృతిలో నిరంతరం లయిస్తూ ఉంటాడో, వాడికి జనన మరణాతీతమైన స్థితి ఉంటుంది.
"ప్రకృతి లయ" అనేది...మనస్సును, ప్రకృతిలో లయింపజేయడం, మనస్సు యొక్క ఉన్నత స్థాయి సామర్థ్యం. తద్వారా , సాధకునికి, మనస్సుకి మధ్య అభేదం ఏర్పడుతుంది. భౌతిక మైన విషయాల కంటే కూడా, ప్రకృతి అనేది గొప్పది. ప్రకృతి మరల వ్యక్తము మరియూ అవ్యక్తంగా ఉంటుంది. ప్రకృతి సత్త్వ రజః తమో గుణాలను కలిగియుంటుంది. ఏ యోగి అయితే, ప్రకృతిలో , పరిపూర్ణ లయత్వాన్ని పొందుతాడో....అతనికి , భౌతికంగా తరువాతి జన్మలు ఉండవు.
గొప్ప పర్వతాన్నో, సూర్యాస్తమయాన్నో చూస్తున్నపుడు ఆ క్షణంలో మీరు ప్రకృతితో లయమై ఉంటారు. మీరు సూర్యాస్తమయాన్ని చూస్తున్నారనుకోండి.. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మీరు అక్కడ సూర్యునితో కలిసి, సూర్యుని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. క్షణ కాలంపాటు మీరు మీ ఉనికిని మర్చిపోతారు. అక్కడ absorb అవుతారు. మీ ధ్యాస అంతా సూర్యునిపైనే ఉంటుంది. ఇది ప్రకృతి లయ సమాధి.
సమాధిలో ఉన్నప్పుడు మీరు సర్వం మర్చిపోయి ‘విదేహం’గా ఉంటారు లేదా ప్రకృతితో సంపూర్ణంగా లయమైపోయి ఉంటారు. ప్రకృతిలయ అనేది తీవ్రమైన సాధనతో కూడుకున్నది. సాధకులు సంవత్సరాల తరబడి ఒంటరిగా కూర్చుని ఆలోచనలన్నీ లయం అయిపోయేవరకూ నిరీక్షిస్తారు. మనసు శూన్యం అయిపోతుంది. మీరు కూడా దీన్ని ఒక ప్రయోగంలా చేసి చూడవచ్చు.
భట్టాచార్య
--(())--
* అన్నమాచార్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
1501. 24|06|20
రేకు: 178-3
సంపుటము: 2-388.
అంతరాత్మ హరి గలఁడంతే చాలు
యెంతకెంత చింతించనేలా వెఱవ!!
॥పల్లవి॥
వెనక జన్మపు గతి వివరించి నే నెరగ
అనుగు మీఁదటి జన్మమది యెఱగ
ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము
యెనసి యీ భవములకేలా వెఱవ!!
॥అంత॥
నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని
కన్నుల రేపటి చేఁత కానఁగరాదు
పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే
యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ!!
॥అంత॥
పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది
యిరవైతి నింకా నాకేలా వెఱవ !!
॥అంత॥
🕉🌞🌎🌙🌟🚩
కీర్తనలో అర్ధాలు:-
-----------------------------
వెరవ = భయపడను
ననిచి = ఆలోచిస్తే
భవము = పుట్టుక
పన్ని = ప్రాప్తించి
యిరవైతి = సుస్ధిరముగా
*****
భావామృతం:-
-----------------------
నా అంతరాత్మలో శ్రీహరివున్నాడు. నాకు ఆ తృప్తి చాలును. ఎంతకు నెంత చింతించను నాకు భయమెందుకు. నా వెనుకటి జన్మ ఎలా ఉందో నాకు తెలియదు. ఆలోచిస్తే ఈ జన్మలో యేమి జరుగుతుందో కోంత తెలుస్తోంది. అలాంటప్పుడు నా అదుపులో లేని పుట్టుకలకు నేను దిగులుపడి ప్రయోజనం ఏమి. నిన్నటిదినము జరిగినది నిమిషములో జరిగింది అనే భ్రమ కలుగుతుంది. రేపు యేమి జరుగుతుందో తెలియనే తెలియదు. ప్రాప్తించి నేటి దినమున ముందు ఆలోచించినట్లు గానే జరుగుతున్నది. ఇంక యెంచి చూస్తే దేనికోసం భయం. పరలోక ప్రాప్తికాని ఇహలోక కర్మ అయినా నా చేతిలో లేవు. హరి శ్రీవేంకటపతియే అన్నిటికి కర్త. అతనిని శరణు అన్నాను ఇక ఆయన ఇష్టం. సుస్ధిరముగా వున్న నాకు భయమెందుకు అంటు అన్నమయ్య కీర్తించాడు.
🕉🌞🌎🌙🌟🚩
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- నేటి స్తోత్రం
(ఆనందం - ఆరోగ్యం - ఆద్యాత్మికం ప్రాంజలి ప్రభ లక్ష్యం )
సేకరణ/రచ్చయా: మాలాప్రగడ రామకృష్ణ
శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం
ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ దశమం భక్తవత్సలం
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం ||
సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు
సంస్కృతన్యాయములు
అతివీర్యవతీవభేషజే బహురల్పీయసి దృశ్యతే గణః
అల్పవస్తవునందును మిక్కలి వీర్యవంతమగు ఔషధము నందు వలెనే పెధ్ద గుణము కానవచ్చును
అతివీర్యవతీవభేషజే బహురల్పీయసి దృశ్యతే గణః
అల్పవస్తవునందును మిక్కలి వీర్యవంతమగు ఔషధము నందు వలెనే పెధ్ద గుణము కానవచ్చును
అత్యుత్కటైః పుణ్యపాపైరిహైవ ఫలమశ్నుతే
పుణ్యపాపములధికమగునేని వాని ఫలమును ఇచ్చటనే అనుభవిం చును.
అత్యుచ్చ్రయః పతనహేతుః
పెరుగుట విరుగుట కొఱకే అంధకూపన్యాయము
అంధపరంపరాన్యాయము
గుడ్డివాడునూతిలోపడగా వాడిననుసరించవచ్చువారలును నూతియందునపడిరి. రెంటికీ ఒకే అర్థము.
గుడ్డివాడునూతిలోపడగా వాడిననుసరించవచ్చువారలును నూతియందునపడిరి. రెంటికీ ఒకే అర్థము.
అధకస్యాధికం ఫలం
ఎక్కుపూజలుసలిపిన ఎక్కువఫలము కలుగును అటులే పాపపుపనులెక్కువజేసిన పాపపుఫలమే ఎక్కవగాకలుగును సందర్భాన్నిబట్టి వాడవలయును.
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం ఆధ్యాత్మికం
నేటి కవిత
భావ రస మంజరి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
మేనిలో గంధాలు పూసావు
మెరుపు తీగలా మెరిసిపోతున్నావు
చిగురాకు ఆధారాలు చూపుతున్నావు
సింధూర వర్ణాల వలువలు ధరించావు
తరుణీ సుమ పరిమళాలతో భ్రమింపచేస్తున్నావు
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
నీలి కన్నులతో, నిండైన రూపముతో,
చిరునవ్వు మంద హాసముతో,
కస్తూరి పరిమళాలతో,
కరిగించు రస ధారతో,
కనువిందు చేస్తూ, మత్తెక్కిస్తున్నావు
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
నల్ల శిరోజాలతో మైమరిపిస్తూ
సింధూరపు ఆధరాలతో పిలుస్తూ
మేని ముసుగులో చూపక చూపిస్తూ
ముక్కెర అందంతో మురిపిస్తూ
వక్షోజాలను వయ్యారంగా వలకబోస్తూ
ఎందుకే నావెంట పడతావ్
ప్రకృతి వరాలు నీకు తోడుండగా
--((**))--
గిరగిరగిరాం
భ్రమరం
గిరాం భ్రమణం
భ్రమం
‘భ్రమరణం’
భ్ర్రమణ భ్రమరం
భ్రమర భ్రమణం
గిరగిర గిరాగిరాగిరాం భ్రమణం
రణం
మరణం
రణమరణం దారుణహననం
ధిషణానిధనం
వృథామథనం
అది నా చెంలో కథనం
లోకధనం
కదనం
కదన కథాకథనం
అది నా యెదలో రణనం
ఝణ ఝణ ఝుంఝుణ ఝుణాఝుణా నికణనం
అది నా నయనంలో ప్రథ మారుణ కిరణం
రణ నిస్సహణం
వధ విధా నాచరణం
నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం
రణద్రణ నిస్సహణ ప్రణవం
అది నా హృదయంలో రుధిరజలనం గీతాజననం:::
నేటి కవిత
భావ రస మంజరి
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
ఇది నా యదలో రణం
నిరంతరం ఉండే భ్రమరం
ఇది మనస్సుతో చేసే మధనం
ఇది మకుటం కాని మకుటం
నాలో దాగి ఉన్న హాసనం
ఇది చెప్పు కోలేని భ్రమణం
ఇది ధనం కాని కధనం
నిరంతరం ఉండే ఇంధనం
ఇది ప్రేమ కథా కధనం
భ్రమా భ్రమర సంచరణం
నిస్సహాయ ప్రణవం
నిరంతరం చలించే కిరణం
--((**))--
| ||||
తనతల్లి చోటనే తప్ప నటించిన, దురితాత్ముననుఁ గురుద్రోహ మెంత
కొతుకొకింతయు లేక గురున కెగ్గొనరించు, కఠినాత్మునకుఁ గృతఘ్నత్వ మెంత
కృతమెఱుంగని మహాకిల్బిషాయుత్త చి, త్తునకు మిత్రద్రోహ మనఁగ నెంత
పరమమిత్రుల బాధపఱుచు దుర్నయమునకుఁ, బ్రజలనందఱ గష్టపరచుటెంత
అనుచుఁదనదు చరిత్రంబు లవని జనులు
నిందసేయంగ బ్రతుకు దుర్నీతిపరుడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల
వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు.
షోడశ గణపతులు
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.
బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.
కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.
తరుణ గణపతి:
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను… పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.
భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను…
నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్
అనే మంత్రతో స్తుతించాలి…ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.
వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను….
బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.
శక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను…
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.
7. సిద్ధి (పింగల) గణపతి
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను….
పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.
ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను….
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.
విఘ్న గణపతి
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను…
శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.
క్షిప్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను….
దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.
హేరంబ గణపతి
అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా
అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రన
ిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.
12. లక్ష్మీ గణపతి
బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
మహాగణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.
విజయ గణపతి
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని….
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.
నృత్య గణపతి
సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.
ఊర్ధ్వ గణపతి
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి
Fine ,sanskrit laws,chaturmasya varta,katha fine
ReplyDelete