Thursday, 25 June 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ


: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 1 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఉపోద్ఘాతము 🌻

ఉపనిషత్‌ అంటే ఉప+నిషత్‌ గురువుకు సమీపముగా నుండి విచారించుట - అని అర్థము.
ఉపనిషత్‌ విచారణ క్రమంలో ప్రధానం ఏమిటంటే గురువుగారు చెప్పినదానిని చెప్పినట్లుగా ఆచరించటం.

శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సాధ్యం. మిగిలినటువంటి వారికి అనుసరణీయులు అయినటువంటి వారికి, ఈ ఉపనిషత్‌ విచారణ పెద్దగా ఫలవంతం కాదు. 

కాబట్టి మీలో కూడా ఆ విధమైనటువంటి శరణాగత లక్షణం నూటికి నూరుపాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సక్రమంగా సాగుతుంది. సరైనటువంటి సందేహాలు కలుగుతాయి. సరైనటువంటి పరిష్కారాలు సూచించబడుతాయి.

                 శిష్యుని యొక్క అధికారిత్వం బట్టి ఉపనిషత్ యొక్క ప్రయోజనం. ఈ ప్రయోజనం మాత్రం అన్నింటికి సమానమే. ఏమిటంటే, పరబ్రహ్మ నిర్ణయమే ప్రయోజనం. వేదము యొక్క యథార్థ లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయము. జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ - ఈ నాలుగు స్థితులని, కర్మ-భక్తి-యోగ-జ్ఞాన మార్గముల ద్వారా నిర్ణయం చేయడమైనది. 

ఈ నాలుగు మార్గముల ద్వారా సుస్పష్టమైనటువంటి విధి విధానాన్ని, జీవనాన్ని అందించినటువంటి గొప్పశాస్త్రం వేదము. ఈ మానవజాతికి ఉత్తమమైనటువంటి ప్రసాదం. ‘వ్యాసోచ్ఛిష్టము’. వేదము అంతా కూడా వ్యాసోచ్ఛిష్టము’ అంటే అర్థం ఏమిటంటే వేదము వ్యాసుని చేత బోధించబడింది.

             వేదాంత శ్రవణం అంటే ఏమిటి? వేదాంతం అంటే, వేదముల యొక్క అంత్యమునందు బోధించబడినటువంటి ఉపనిషత్‌ వాక్యములు ఏవైతే ఉన్నాయో, అట్టి ఉపనిషత్తులకే వేదాంతం అని పేరు. 

ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తు వాక్యములందు ప్రధానము తత్వజ్ఞానము .తత్‌, త్వం అని విచారణ ద్వారానే ఈ నడక అంతా సాగుతుంది. ఈ తత్వమసి మహావాక్యోపదేశం క్రమంగా చెప్పబడినటువంటి ఉపనిషత్‌ వాక్య విచారణని ఆశ్రయించి ఎవరైతే ఉపనిషత్తుని అధ్యయనం చేస్తారో, వారికి తప్పక జ్ఞానసిద్ధి కలుగుతుంది. 

       మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు.  

నచికేతుడు యమధర్మరాజు తనకిచ్చెదనన్న మూడు వరములలో, మూడవ వరముగా మనష్యుడు మరణించిన తర్వాత అతడు ఉండునని కొందరు, ఉండడని కొందరు చెప్పుచున్నారు. ఉన్న ఎడల ఆ తత్త్వమును గురించి చెప్పవలసినదిగా కోరినాడు. 

దీనికి సమాధానముగానే అనేక ఉపమానములతో ఈ ఉపనిషత్‌ చెప్పబడినది. యమధర్మరాజు నచికేతుడు అడుగగానే ఆత్మతత్వమును బోధింపక అతనిని ధన కనక వస్తు వాహనాదుల నిచ్చెదనని అనేక ప్రలోభములకు గురిచేసి అతని అర్హతను గుర్తించిన తర్వాతనే ఆత్మను గురించి బోధించెను. వైరాగ్యము మొదలగు అర్హతులున్నవారే బ్రహ్మజ్ఞానమునకు అర్హులని స్పష్టమగుచున్నది. 

జీవునిగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఉంటాయో, ఆ ప్రలోభాలన్నింటినీ నీకు అసలు ఉన్నాయా? లేదా? అని పరీక్షించిన తరువాతనే నీకు ఆత్మవిద్యను ఉపదేశించడం జరుగుతుంది. ఎవరైతే జీవభావంలో ఉన్న ప్రలోభాలకు లొంగనివారు ఉంటారో, వాళ్ళు మాత్రమె ఆత్మవిద్యకు అర్హులు. 

అటువంటి ధన, కనక, వస్తు, వాహన, జగత్‌ సంబంధమైనటువంటి, సంసార సంబంధమైనటువంటి, పుత్ర, పౌత్ర, ధన, ధారాదులను అనుగ్రహించగలిగే సమర్థుడైనటువంటి యమదేవత అవన్నీ ఇస్తానంటాడు. 

అవన్నీ ఇస్తానంటే, సంతృప్తి చెందిన వాడవైతే, నీవు ఆత్మవిద్యకు పనికిరావు. దీనిని బట్టి సూచన ఏమి తెలుసుకోవాలి? మనలో ఇప్పుడు వింటున్న వారిలో జగత్‌ సంబంధమైనటువంటి కామ్యకర్మల ద్వారా సంతృప్తి, భోగి భోగ్య భావన ద్వారా ఎవరైతే భోక్తగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారో, వీరు ఈ రకమైనటువంటి ఆత్మవిద్యను గ్రహింప జాలరు. 

సతి, సుత, ధార, మోహములు ఎవరికైతే బలంగా ఉన్నాయో, ఎవరికైతే ధన కనక వస్తు వాహనాది ప్రాప్తి యందు ఆసక్తి కలిగియున్నారో, వారు ఆత్మవిద్యను గ్రహించడానికి అధికారిత్వము లేనటువంటివారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 2 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

మోహత్యాగము ఎవరైతే చేశారో, వారు మాత్రమే ఆత్మవిద్యను పొందగలుగుతారు. ఆత్మవిద్యను తెలుసుకుంటే మోహం పోతుందా? మోహం విడిచిన వాడికి ఆత్మవిద్య వస్తుందా?

చీకటి ఎప్పుడు పోయింది? వెలుతురూ ఎప్పుడు వచ్చింది?  వెలుతురు వస్తే చీకటి పోయింది. చీకటి వస్తే వెలుతురు పోయింది. రెండింటిలో ఏది కరెక్టు? చీకటి తనంతట తానుగా పోదు. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి . 

కాబట్టి, మోహం తనంతట తానుగా విడువదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం చేతనే, మోహం నుంచి విడువడుతావు. కాబట్టి, అట్టి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్న శీలురై ఉండాలి. ఇది లక్ష్యము. 

సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గుర్తించవలెనన్న ఇంద్రియములను బాహ్యవృత్తులనుండి మరలించి, మనస్సును ఏకాగ్రము చేసి విచారణ ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మను గుర్తించవలెను. సూక్ష్మము అంటే ఏమిటి? కనిపించనది సూక్ష్మము. కనబడేది అంతా స్థూలము, అంటే ఇంద్రియ గోచరమయ్యేది అంతా. కనబడేది అంతా అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియముల ద్వారా తెలియబడేది అంతా స్థూలమే! 

కర్మేంద్రియములు అన్నీ కలిపి ఒకటే మూట. కర్మేంద్రియముల సంఘాతము ఒక మూట, జ్ఞానేంద్రియ సంఘాతము ఒక మూట. ఈ రెండూ కలిపితే ఇంద్రియ సమూహము. ఈ రెండింటి ద్వారా నీకు సంవేదనల రూపంలో తెలియబడుతున్నదంతా స్థూలమే. 

మరి సూక్ష్మమనగా ఏమి? ఆహార ప్రాణ మనస్సుల యొక్క సమాహారమైన శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మము. ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి ఆత్మను గ్రహించాలి అంటే, సశక్తమైనటువంటి ఇంద్రియం బుద్ధి ఒక్కటే! మిగిలినవి ఏవీ సశక్తమైనవి కావు. 

ఎవరిలో అయితే ఈ బుద్ధి వికాసం పూర్ణంగా వికసిస్తుందో, అది మాత్రమే తన బింబమైనటువంటి చైతన్యమునందు సంయమించడానికి అర్హమైనటువంటి ఇంద్రియము.

సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి సూక్ష్మబుద్ధి ఎవరికైతే ఉందో, వారు మాత్రమే ఆత్మ  విద్యను గ్రహించగలుగుతారు. ఎవరెవరికైతే ఇంద్రియోపలబ్దమైనటువంటి జగద్భావనలయందు ఆసక్తి ఉన్నదో, వారు స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉంటారు. 

కాబట్టి, అటువంటి స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆత్మ విద్యను తెలుసుకోవడానికి వీలుకాదు. సూక్ష్మబుద్దే సాధ్యం కానటువంటివారికి, బుద్ధి గ్రాహ్యమతీంద్రియం - అనేటటువంటి స్థితి అసాధ్యం. 

కాబట్టి మానవులు మొట్టమొదట ఏ స్థితికి ఎదగాలి? సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితికి ఎదగాలి. 

 స్థూలగతమైనటువంటి ఇంద్రియోపలబ్ధి చేత పొందేటటువంటి సుఖ దుఃఖ సమావిష్టమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి వాటి వెనుక ఆసక్తిని, భోగ్య భావనని నీవు జయించినప్పుడు మాత్రమే, బుద్ధి అంతర్ముఖమై సూక్ష్మస్థితిని పొందుతుందన్నమాట. 

కాబట్టి, సాధన ప్రతి ఒక్కరూ ఏ దిశగా చేయాలి? బుద్ధి తన బింబమైనటువంటి చైతన్యము నందు సంయమింప చేసేటటువంటి జ్ఞానపద్ధతిని ఆశ్రయించాలి. అందరూ ధ్యానం ధ్యానం అని అంటూ ఉంటారు. ఏమిటి ధ్యానం అంటే? బుద్ధిని తన మూలమైనటువంటి చైతన్యమందు సంయమింప చేయడమే ధ్యానం అంటే!


🌹 🌹 🌹 🌹 🌹

🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 3 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

ఆత్మ సాక్షాత్కారమైనవారికి పునర్జన్మ లేదని, మోక్షము పొందుదురని, ఆత్మసాక్షాత్కారము కాని వారు వారి కర్మననుసరించి మరల మరల జన్మించుదురని చెప్పబడినది. ఏమిటి ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే? మోక్షానికి అధికారిత్వమే ఆత్మసాక్షాత్కార జ్ఞానం.

ముక్తి మోక్షము అన్న రెండు స్థితులని కూడా ఆత్మసాక్షాత్కారం లేనిదే నీకు అధికారిత్వము రాదు. ఏమిటయ్యా? ఇందులో ఉన్న విశేషము అంటే, జనన మరణ చక్రములోనుంచి నిన్ను బయట పడవేయగలిగినటువంటి సమర్థనీయములు ఇవి.

ఇది  సృష్టి లక్షణమైనటువంటి జనన మరణ చక్రం ఏదైతే ఉందో, ఈ జనన మరణ చక్రానికి కారణమైనటువంటి అవిద్యను పోగొట్టుకోగలిగినటువంటి సామర్ధ్యము కలిగి యున్నది.

🌻. మోక్షప్రాప్తికి సాధనములు ఏమిటట ? శ్రద్ధ, పట్టుదల. 🌻

మానవునికి ప్రతీక్షణము లోపించేటటువంటివి రెండు. అయితే శ్రద్ధైనా లోపిస్తుంది, లేకపోతే పట్టుదలైనా లోపిస్తుంది. బుద్ధి యొక్క వైక్లబ్యానికి, విపరీతజ్ఞానానికి ఇవి రెండే మూలకారణము. ఎప్పటికప్పుడు మానవుడు పరీక్షించుకోవాలన్నమాట.

నేను లక్ష్యశుద్ధిలో ఉన్నానా? లేదా? లక్ష్యసిద్ధి కొరకై ప్రయత్నిస్తున్నానా? లేదా?  లక్ష్యశుద్దేమో శ్రద్ధ, పట్టుదల. లక్ష్యసిద్ధి ఏమో ప్రయత్న పూర్వకము.

కఠోపనిషత్తును వల్లులుగా తీర్చిదిద్దడమైనది. ప్రథమవల్లి, ద్వితీయవల్లి, తృతీయవల్లి, చతుర్థ వల్లి, పంచమ వల్లి - ఇలా వల్లులుగా తీర్చిదిద్దడమైనది.

వల్లి అంటే అర్థం ఏమిటంటే లత. ఏదైన లత అల్లుకోవాలంటే దానికి ఆధారంగా స్థిరమైనుటువంటి ఒక ఆధారాన్ని పెట్టాలి. ఒక కర్రో, ఒక శూలమో ఏదైతే కదలకుండా, స్థిరంగా, స్థాణువుగా ఉంటుందో, దానిని అశ్రయించి అల్లుకునేది ఏదైతే ఉందో, దానిని వల్లి అంటారు.

ఈ వల్లి అనేటటువంటిది ఎందుకు పెట్టారయ్యా అంటే, కొంతకాలం తరువాత ఏమైపోతుందంటే, ఆ మధ్యలో ఏదైతే ఆధారంగా పెట్టబడినటువంటి కర్ర ఉన్నదో, ఆ కర్ర కనబడదు. అంతగా ఈ వల్లి దాని చుట్టూ అల్లుకుంటుందన్నమాట. మొత్తం ఆ శిష్యుని యొక్క సాధికారత వల్ల, శిష్యుడే గురువై శోభిస్తాడు అని అర్థం.

ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావో, ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, గురుశిష్యుల మధ్య అభేద సిద్ధి కలుగుతుంది.

ఇట్టి అభేద సిద్ధి వల్ల, శిష్యుడికి ఈ గురువుకి మానసికమైనటువంటి అభేదం ఏర్పడుట వల్ల దేశకాలమానములు అనేటటువంటి భేదములు వారిద్దరి మధ్య ఎక్కడ కూడా పొడసూపవు. ఈ ఐక్యతాసిద్ధిని పొందవలసినటువంటి అవసరం సాధకులందరికీ ఉన్నదన్నమాట.

కాబట్టి దీనిని వల్లులుగా తీర్చిదిద్దడం వెనుక ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇదన్నమాట. అట్టి ఐక్యత సిద్ధిని పొందాలి అనేటటువంటి సూచన అందులో ఉందన్నమాట.
🌹 🌹 🌹 🌹 🌹



🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 5 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

  నచికేతుడు ఏం చేశాడు? మొదటి  వరం అడిగాడు. ఓ వైవస్వతా! నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తరువాత నన్ను గురించి చింతించు చుండును. 

కావున నా తండ్రి ఎటువంటి చింతన లేక, ప్రసన్న చిత్తంతో ఉండునటుల అనుగ్రహింపుము. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు, నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి, ప్రేమతో మాట్లాడునట్లు అనుగ్రహింపుము... 

ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాం? ముందు నా సంగతి ఏంటో చూడండి బాబూ అంటాం. అంతేనా కాదా? సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటువంటి దానిచేత ప్రేరేపితమై మాట్లాడుతూ వుంటాయి. 

ఇక్కడ ఓ జ్ఞానీ! అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరం అడగడంలోనే మనం తెలుసుకోవాలి. తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. కానీ తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించాడు మొట్టమొదట. 

తనకు ఆయన గురువుగారు. తండ్రి మాత్రమే కాకుండా తపస్వి, గురువుగారు. ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు. 

ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదట వరాన్ని ఏ దిశగా కోరాడు? అంటే, తన గురువుగారు సంతోషంగా వుండాలి. అంతే కాకుండా తన యెడల వ్యగ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి. 

ఆ వరం కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని, ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలియై అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం.

            మనం పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోరా అని అడిగేప్పడు కూడా మనలో అహం వ్యక్తమౌతుంది. ఇచ్చేచేయి నాదనేటటువంటి అహం పనిచేస్తుంది. 

అడిగేవాడు కూడా అధికారంతోటి అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు. కానీ, ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే వుంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది.

      మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజూ చేసే పని ఏమిటీ అనంటే, అన్నం వండుతారు, మీ భార్య పిల్లలు మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు. 

సాధారణంగా గృహిణి స్థానంలో వున్నటువంటి భార్యగారు అందరికీ ఆహర సేవలను అందిస్తూ, వారికి అన్నీ వడ్డిస్తారన్నమాట! వడ్డించేటప్పడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా వుండాలి? ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి? అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇచ్చే చేయి నాది’ అనే అహం ఉండకూడదు. ‘చేసేవాడను నేను, నేనే చేస్తున్నాను’ అనే అహంతో చేయకూడదు. 

అలా గనుక చేశావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. పొందేవారు కూడా, సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి. 

కానీ భౌతికమైన, ఐహికమైన, సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకంగా ఒకరి యెడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగమించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాలి. 

       ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం ఒనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవసంబంధాలని కలిగివుంటావో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవీ స్వరూపుడిగా మారిపోతాడు. నువ్వు దైవీభావనలోకి మారిపోతావు. ప్రతి చోట ‘నేను’ అన్న స్థానంలో ఆ ‘ఈశ్వరుడు’ వచ్చి కూర్చొంటాడు. 

ప్రతీ చోట ‘నేను’ అన్న స్థానంలో ‘నేను’ను తొలగించి, ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా, ప్రతిక్షేపించాలి.   ‘నేను’ అన్న ప్రతీ చోట ‘ఈశ్వరుడు’ని పెట్టడం అభ్యాసం చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 6 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

నిద్రాదేవత ఈ మృత్యు దేవత ఆధీనంలో వుంటుంది. నిద్ర పట్టని వారు కొంతమంది వున్నారు. ఊరకూరికే లేచికూర్చొంటుంటారు, ఊరుకూరికే కలత నిద్ర పోతూ వుంటారు. కారణం ఏమిటి? అంటే, మరణభయ సమానమైనటువంటి కలలు వస్తుంటాయి. 

ఆ మరణ భయ సమానమైనటువంటి కలలు ఎప్పుడైతే ప్రస్ఫటమైనటువంటి, బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధులమీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమై పోతుంది. 

కారణమేమంటే, మేల్కొంటే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, పూర్తిగా ఎఱుకను పొందితే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోదు కూడా, మేల్కొన్నా కూడా ఆ కల యొక్క ప్రభావం పోదు.  కారణం మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు ఈ నాలుగు అవస్థలు ఒకదానికి ఒకటి సంబంధపడి వుంటాయన్నమాట. 

కాబట్టే, మనం నిద్రావస్థలో మనం మన ఎఱుకను మనం పూర్తిగా కోల్పోతున్నాము. మరణములో కూడా ‘నేను’ అనే ఎఱుకని కోల్పోతున్నాము. 

ఎవరైతే, ఈ నాలుగు అవస్థలలో ‘నేను’ అనే ఎఱుకను నిలబెట్టుకున్నారో, వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచన ప్రాయంగా చెప్తున్నారు.

            చాలామంది తామసికమైన అజ్ఞానభూయిష్టమైనటువంటి నిద్ర పోయి, ఆహా! చాలా బాగా నిద్రపట్టిందండీ, ఒళ్ళు మరచిపోయి, ఒడలు మరచిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ వుంటారు. ఇదో రకమైన ఆనందము. ఇది తామసిక గరిష్ఠమైనటువంటి నిద్ర. కానీ... ఇది శాంత చిత్తమైన నిద్ర కాదన్నమాట. 

ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎఱుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, ‘స్వీయ నేను’ ని గుర్తిస్తూ, ‘సెల్ఫ్‌ రియలైజ్‌డ్‌ స్టేటస్‌’ [self realized status] లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో, వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థం. 

ఎప్పుడైతే ఆ శాంత చిత్తంతో నిద్రించాడో, అతనిలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనమందరం కూడా రోజువారీ నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించడం నేర్చుకోవాలి.

         నీలో ప్రజ్ఞ మేల్కొన్నవాడవై, స్వప్రకాశ స్థితిలో వుండి, నిద్రలో మనం విశ్రాంతి తీసుకోవడం అభ్యాసం చెయ్యాలి. ఆ రకమైన మెలకువను కలిగి వున్నటువంటి నిద్రగా మనం నిద్రను స్వీకరించాలి. ఆ రకంగా మీరు తురీయంలో ప్రవేశిస్తారన్నమాట! 

అటువంటి నిర్వాణానుభవం ద్వారా తాను తురీయస్థితిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి శాంత చిత్తుడై నిద్రించడం అన్నటువంటి దాంట్లో, సూచన ప్రాయంగా నిర్వాణానుభవ స్థితిని సూచిస్తున్నాడు. 

ఎప్పుడైతే ఒకసారి నీకు నిర్వాణ సుఖం లభించిందో, నువ్వు వాటిని మెలకువలోనూ, స్వప్నంలోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఇక. ఎలాగో చెప్పనా? 

ఎవరైనా తమ తలకాయిని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎవరైనా సిద్ధపడుతారా? ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకని? తల లేకపోతే జీవితం లేదు కాబట్టి. అంత ముఖ్యమైనటువంటిది.  అట్లాగే, నీ జీవితానుభవాల మొత్తం మీద, అత్యంత విలువైన అనుభూతి ఏదైన ఒకటి ఉందంటే అది నిర్వాణం. 

ఒక్కసారి నిర్వాణ సుఖాన్ని అనుభూతి పొందినటువంటివాడు మరలా ఎట్టి కష్ట పరంపర వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సుఖదుఃఖ పరంపర ఏర్పడినప్పటికీ కూడా, ఎట్టి ద్వంద్వానుభూతులు ఏర్పడుతున్నప్పటికీ కూడా, ఈ నిర్వాణ సుఖాన్ని పోగొట్టుకోరు. 

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రయత్న పూర్వకముగా నిర్వాణ సుఖాన్ని నిలబెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అన్ని సాధనలలో కెల్లా ముఖ్య సాధనమిదే!          

 ఈ శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీలో నిర్వాణ సుఖం ఏర్పడుతుంది. అట్టి నిర్వాణ సుఖమే, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పునాది. ఆధారభూతమైనటువంటి పునాది స్థితి అన్నమాట!
🌹 🌹 🌹 🌹 🌹


🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 7 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

కామమునకు అధిపతి మన్మథుడు. ఈ మన్మథుని చేతిలో ఐదు బాణములు వుంటాయి. పంచపుష్పబాణుడు అంటారు వీటినే. పంచచామరములు.

ఆ పంచపుష్పబాణుడు ఏం చేస్తాడంటే, ఆ పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. అవి కామప్రేరణ కలుగుతుంది. కోర్కె కలుగుతుందన్నమాట! ఆ కోర్కె ప్రభావం చేత, గుణ ధర్మాలు కలుగుతాయి.

గుణ ధర్మాల చేత విషయవాసనలు ప్రకోపిస్తాయి, ఆ ప్రలోభం చేత సుఖదుఃఖ ప్రలోభితులు కలుగుతుంది. ఆ సుఖదుఃఖ స్మృతుల ప్రభావం చేత, వాసనాబలం ప్రేరితమై తత్ రీతిగా మానవుడు జీవిస్తూ వుంటాడు.

ఇది జీవభావంలో వున్నటువంటి ప్రతిబంధకం. ఈ ప్రతిబంధకాన్ని పోగొట్టాలి అంటే, అనురాగం అనేటటువంటి స్థితినుంచీ ప్రేమ అనేటటువంటి స్థితికి మారాలి.

            ఈశ్వరానుగ్రహం లేకుండా ఏ మానవుడు ఈ ప్రేమ అన్న స్థితిని తెలుసుకోలేడు. ఎవరికైతే ఈ నిర్వాణానుభవం లేదో, వారికి ప్రేమ మృగతృష్ణ వంటిది. అంటే అర్థం ఏమిటి?

ఎండమావిలో నీరు ఎంత సత్యమో, జీవభావంలో ప్రేమ అంత సత్యము. ఆత్మభావనలో, నిర్వాణ సుఖంలో, నిర్వాణానందంలో ఏ స్థితి అయితే కదలక, మెదలక స్థిరంగా, సమంగా ద్వంద్వ ప్రవృత్తులకు లోబడకుండా వుంటుందో, దాని పేరే ‘ప్రేమ’. ఈ ‘ప్రేమ’ చాలా విలువైనది. ఈ ప్రేమ చాలా రకాల విశాల భావనలతో, విస్తృత అర్థంతో ప్రయోగించబడుతోంది ఈ తత్త్వజ్ఞానంలో. ఈ ‘ప్రేమ’ అనేటటువంటి లక్షణమే లేకుండా నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరగలేవు.

ఈ సౌర కుటంబం విశ్వంలో... తన స్థానంలో తాను నిలబడలేదు. విశ్వమంతా వ్యాపకమై దాని దాని స్థానములలో, వాటి వాటి పనులను నిర్వహించే కూడా ఈ ప్రేమ వల్లనే!! కాబట్టి ఈ ప్రేమ విశ్వజనీనమైనది, విశ్వవ్యాపకమైనది.

         వ్యాపక ధర్మంతో కూడినటువంటి ‘ప్రేమ’ అనేటువంటి లక్షణాన్ని జీవభావంలోకి వచ్చేటప్పటికి ‘నేనొక వస్తువును ప్రేమించాను’ అనే అభిమానయుతమైనటవంటి అహంకార మమకార మిశ్రితంగా మానవుడు వినియోగించుకుంటున్నాడు. తత్‌ ప్రభావం చేత అది ప్రతిబంధకమై, అనురాగమై మమకారాన్ని బలవత్తరంగా ప్రేరేపిస్తుంది.

తత్‌ ప్రభావం చేత ఆ వస్తువు కనబడకపోయినా, ఆ మనిషి కనబడకపోయినా, లేదా తత్‌ స్మృతి ప్రభావం చేత అయినా సరే, నీవు దుఃఖాన్ని పొందుతావు. ఈ రకంగా ప్రతిబంధకమై కూర్చొంటుంది అనురాగము. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించి ఈ అనురాగ బంధ విముక్తులవ్వాలి.

తప్పనిసరిగా ప్రేమ భావంతో మానవులందరూ సమత్వభావంతో వ్యవహరించాలి. వైరం లేకుండా వుండాలి, ద్వేషం లేకుండా వుండాలి. రాగద్వేషాలు అనే ద్వంద్వ ప్రకృతి నుంచీ విముక్తులవ్వాలి. ఈ ప్రేమ రాగద్వేషములకు అతీతమై వుంటుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 8 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

నచికేతుడు మూడవ వరముగా ‘ఆత్మతత్వము’ను గురించి అడుగగా, యముడు నచికేతునకుగల యోగ్యతను తెలుసుకొనుటకున్నూ, వాని దృఢత్వమును ఎఱుగ గోరియూ, యముడు ఈ విధముగా అనుచున్నాడు
నూరు సంవత్సరములు జీవించునట్టి, పుత్ర పౌత్రులను అడుగుము.

వారితో కూడా సుఖముగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రములను, బంగారము మొదలగువానిని కోరుకొనుము. విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము.

ఈ సంపదలన్ని ఉన్నప్పటికిని నేను అల్పాయిష్కడనైతినే అని, వీని వలన కలుగు ఫలమేమని నీవు తలంచినచో, ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు, నీవు ఎంతకాలము జీవింప తలంతువో, అంతకాలము సుఖముగా జీవించి యుండు నటుల, వరమును కోరుకొనుము. విస్తారమైన ధనమును, దివ్యములు మానుషములు అగు, ఏ యే కామములు కలవో, వానిని అన్నింటిని కోరుకొనుము.

ఈ లోకమున మానవులకందని కోరికలు ఎన్నియో కలవు. ఆ కోరికలన్నింటిని నీవు స్వేచ్ఛగా అడుగుము. రథములతోను, వాద్యములతోను కూడినట్టి స్త్రీలను, నీకు ఒసంగు చున్నాను. ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము. అన్ని సుఖములను అనుభవింపుము. అంతేకానీ, మరణానంతర విషయము నన్ను అడుగకుము అని యముడు చెప్పెను.

         ఇక్కడ మనందరి విశేషాలను చెబుతున్నారన్నమాట. మనమందరం కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పడు రోజువారి నిత్యజీవితంలో కూడా, నిత్యపూజలు చేసేటప్పుడు, అనేక రకములైనటువంటి కోర్కెలను మనం అడుగుతూ ఉంటాము.

ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది సిద్ధ్యర్థం, ఇలా ‘ధం’ అని చెప్పేటటువంటి ఎన్ని మంత్రాలు శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, విధుల రూపంలో ఏవైతే మనం రోజువారీ అడుగుతున్నామో, అవన్నీ కూడా మనకి ఇప్పుడిక్కడ బోధిస్తున్నారన్నమాట.

మానవులందరూ సాధారణంగా అడిగేవి ఏమిటి? అంటే, నా మనవళ్ళు, ముని మనవళ్ళని చూచేంత వరకూ నేను బ్రతికి ఉండుట. మునిమనుమడికి మునిమనుమడు పుట్టేవరకూ అనుగ్రహించా పో! అన్నాడాయన.

పూజలు జరిపేటప్పుడు మనం గుడికెళ్ళి పూజించారనుకోండి, ఏం చెబుతారు? ధన వస్తు వాహన కనక పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అంటాడాయన, ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడన్నమాట.

ఒక్కోసారి ఒక్కొక్కటి అడిగితే కష్టమని. ధన, వస్తు, వాహన, కనక మళ్ళా వస్తువులలో, వాహనాలలో కనకం ఉంటుందో లేదో అని, మళ్ళా కనకం వేరుగా ధన, వస్తు, వాహన, కనక ఇంకేమిటి? రధ, గజ, తురగ ‘రధ గజ తురగ’ - అంటే, ఏనుగులు, గుర్రాలు, రధాలు. ఇంకేం కావాలట? ఇవన్నీ ఉన్నాయండీ మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా? వద్దా? అవి కూడా ఇచ్చారు.

ఇవన్నీ కలిపి ఏక మొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పనిలేకుండా, నీకు మొత్తం ఒకసారే ఇచ్చేశాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు.
       
ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటంటే, మానవులెవరైతే, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని, తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్రమోక్షేచ్ఛను పొందాలనే ప్రయత్నం చేస్తారో, తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ప్రకృతి వీటన్నింటినీ అనుగ్రహించడం మొదలుపెడుతుంది. అనుకున్నదే తడవుగా అయిపోవడంతో మొదలౌతుంది. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు, అనుకుంటాడు. వర్షం ఆగిపోతుంది.

ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారు, టక్కుమని ఎక్కమంటారు, ఎక్కించుకుని తీసుకువెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలోకి దించేస్తారు.

ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు, వెంటనే ఆ సమయం సందర్భం ఒనగూడి, ఆయన్ని అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజరాజని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు.

వెంటనే మండలాధిపత్యమో, లేకపోతే సామ్రాజ్యాధిపత్యమో ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరినటువంటి లోకానికి అధిపతిగానో, వెంటనే చేయబడుతాడు.

ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ, ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు అంతే, ఇంకేమి ఎక్కువ అననవసరం లేదు. ఓకే అంటే చాలు, రెండు అక్షరాల పదం, సరే అంటే చాలు. ఔను అంటే చాలు. తల పంకించినా చాలట, దానికి ఎక్కువ అవసరం లేదు, ఔను అని తల ఊపినా చాలట. అంతే, అది అయిపోతావు అంతే వెంటనే.

ఆ రకంగా నీవు ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి, భోగ భాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేలోగానే వస్తుంది. వాటన్నింటి యందు నీవు విరక్తుడవై, పూర్ణవైరాగ్యమును పూని ఉన్నవాడవైతేనే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు.
🌹 🌹 🌹 🌹 🌹

[17:06, 24/07/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 9 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

మా అమ్మాయికి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి ఏదో అయ్యింది. లేదూ మా అబ్బాయికి ఏదో అయ్యింది. లేదూ మా ఆయనకి ఏదో అయ్యింది, లేదూ మా ఇంకొకరికి ఏదో అయ్యింది, మా సంబంధీకులకు ఏదో అయ్యింది, ఏ సంబంధమూ లేనివారికి ఏదో అయ్యింది, అనేటటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది. 

ప్రవేశించగానే ఏమౌతుందంటే, తత్‌ కారణ రీత్యా, ఆ బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానబలం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటు వంటి శక్తి ద్వారా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారమన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ, శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే. తపఃశక్తి వలన ఇవన్నీ సాధ్యమే. కర్మఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే. 

ఆయా ఉపాసన బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. తత్‌ ప్రభావ రీత్యా, ప్రేరేపించబడి, ఆ సంకల్పమునకు నీవు లోబడి, నీవు ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే ప్రవర్తించావో, తత్‌ ప్రభావ రీత్యా నీకా మాలిన్యం అంటుకోక తప్పదు. 

మాలిన్యం అంటుకోగానే శుద్ధ చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై, మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి, నీవు జీవుడవైపోతావు.

 ఆత్మసాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటటువంటిది మరపుకు వస్తుంది. “మరుపే జీవుడు. ఎఱుకయే ఆత్మ” - ఈ సత్యమును తెలుసుకోవాలి.

      రోజూ కాబట్టి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు, కామమును లవలేశమైననూ మిగుల్చుకోకుండా పోగొట్టుకోవాలి. 

జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను, అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి, అట్టి వాగ్దాన భంగం కలుగకుండా నీవు నిలబెట్టుకోవాలి. అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తూ ఉంటాయి. 

వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ఠ చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత, నీవు ఎదురించాలి. అంతేగానీ, ఆయా చిన్న చిన్న సమస్యలను గురించి, నీవు ప్రభావితం కాకూడదు.

       పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినది అంతా కామమని పేరు. ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా? లేదా? అన్న ప్రశ్న వేసుకున్నావనుకో అది కామము అవునో కాదో అర్థమైపోతుంది. వెంటనే ఆ కామమును నిర్జించాలి. వైరాగ్యముతో కామము యొక్క మూలమును నిర్జించాలి. 

అలా ఎప్పుడైతే నిర్జించిన వాడివి అవుతావో, నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవు అవుతావు. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్రవైరాగ్యము చాలా అవసరము. 

ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? లేదా? అనేటటువంటి ప్రాధమ్యాలని సరిగ్గా ఆయన ముందు ఉంచి, ఆయా కామము యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతోందా? లేదా? అనేటటువంటి సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకూ కూడా నీలో ఆ కామము యొక్క ప్రభావము ఉండదు. సాధారణంగా అందరూ ఇవేవీ నాకు అక్కర్లేదండి అనే అంటూ ఉంటారు. 

కానీ, సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమై, అనుభోక్త మయ్యేటటుంవంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ, అప్పుడు కదా వాటి యొక్క నిరూపణము అయ్యేది?

        కాబట్టి, మానవుడు ఆ జీవన పర్యంతము వీటియందు మెలకువ వహించి ఉండాలి. ‘స్త్రీ బాలాంధ జడోప మాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః’ అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం. 

కాబట్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతుంది. అంతా బానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. లేదా ఒకటి పొందడం జరుగుతుంది. 

ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ, నీలో ఏమైనా మార్పు గనుక సంభవించినట్లయితే తత్‌ ప్రభావం చేత, నీవు ఆత్మసాక్షాత్కార ఆత్మానుభూతి అనేటటువంటి స్థితి నుంచీ జీవుడుగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరముగా ఉండేటటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి.  

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 10 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. 🌻

ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి “నాన్యః బంధాయ విద్యతే వాసుదేవాయ ధీమహి”. అటువంటి వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు.

 ఏమిటీ? ఒకటి ఇంద్రియజయము. రెండు భక్తి. ఈ రెండింటి ద్వారా జ్ఞానసిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి. “భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు లేరు” అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు. 

అంటే అర్ధ ఏమిటటా? “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే?” అనేటటువంటి పద్యాన్ని గనుక, మనం భాగవత పద్యాన్ని గనుక గుర్తిస్తే - “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే?” - ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు. ఎంతోమంది మహనీయులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, 

యశఃకాములైనటువంటి వాళ్ళు ఎంతోమంది పృధ్విలో వచ్చారూ, పోయారు.  కానీ వారేమైనా సిరి మూటకట్టుకుపోయారా? వారేమైనా తృప్తిని పొందారా? అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు మానవుడు.

         అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని, శ్రమని, శ్రద్ధని, ఆసక్తిని, తహని, నిశ్చయాన్ని, లక్ష్యాన్ని మనం సాధించాలి. 

అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగమార్గమై వున్నటువంటి జగత్ వ్యాపార విషయములందు అనురక్తి కలిగి వుండరాదు. విరక్తి వుండటం అవసరం కాని అనురక్తి లేకుండా చూసుకోవడం ముఖ్య అవసరం. ఈ రెండింటి మధ్య బేధాన్ని కొద్దిగా మనం గుర్తించాలనమాట. 

మానవుడు ప్రతిరోజూ తన శరీర అవసర నిమిత్తమై భోజనం చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. అనురక్తి లేక చెయ్యాలి. వైరాగ్య భావంతో చెయ్యాలి. ఈశ్వర ప్రసాద భావంతో చెయ్యాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా గనుక ఆచరించకపోయినట్లయితే అది సాధ్యపడదు. 

ఇట్లా గమనించుకోవాలన్నమాట. ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరు కూడానూ చక్కగా సంపాదించాలి. అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం. 

అందుకని అనురక్తి దేంట్లో వుంది, ప్రియాప్రియాలు దేంట్లో వున్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని వాటియందున్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



17:36, 27/07/2020] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 11 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. - 2 🌻

అయితే ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం వుండాలా వద్దా అంటే తప్పక వుండాలి. యమ నియమాలు లేనటువంటి జీవితం ఎప్పటికీ కూడా సాధ్యపడదు. 

గృహిణి తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవలచినటువంటి అవసరం వుందా లేదా? చాలా అవసరం వుంది. ఆ పనిని అనురక్తి లేకుండా చేయవలసిన అవసరం వుంది. వైరాగ్య భావంతో చేస్తే ప్రతిదీ సమర్ధవంతంగా చేయగలిగేటటువంటి శక్తి లభిస్తుంది. 

అంతేగాని చిందరవందరగా ఇల్లంతా అన్ని వస్తువులూ పడవేసుకుని వుండి, నేను జ్ఞానంలో వున్నానండీ, నేను వైరాగ్యంలో వున్నానండీ, నాకేం పట్టదండీ అనేటటువంటి విధానం సరియైనటువంటి జీవితం కాదనమాట. 

భౌతికంలో సమర్ధవంతంగా సామాన్యమైనటువంటి జీవితాన్ని, విశేషణములు లేనటువంటి జీవితాన్ని, అహం ప్రతిపాదించేటటువంటి- అహం బలపడేటటువంటి జీవితాన్ని జీవించకుండా, వైరాగ్య భావంతో జీవించవలసినటువంటి అవసరం చాలా వున్నదనమాట సాధకులందరికీ కూడా. ఈ వైరాగ్య లక్షణాన్ని మోక్షప్రాప్తి వరకూ నిలబెట్టుకోవాలి. ఈ తరువాత అది సహజమైపోతుంది. 

ఇది చాలా ముఖ్యం. జ్ఞానం లభించాలి అంటే తప్పక వైరాగ్య భావన బలవత్తరమైనటువంటిదిగా వుండాలి. అదేకాక, భక్తి విశ్వాసాలు కూడా వైరాగ్యంతో పాటు చాలా ముఖ్యమైనటువంటివి. 

ఈ మూడూ కలిసి జ్ఞానానికి అధికారిత్వాన్ని ప్రసాదిస్తాయి. వినయము, విధేయత వస్తాయనమాట భక్తి విశ్వాసాల వలన. అలా ప్రతి ఒక్క మానవుడు తనని తాను ఈ రకమైనటువంటి భోగలాలసత నుంచి విరమింపచేసుకునేటటువంటి పద్ధతిగా జీవనాన్ని సాగించాలి.

సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా. ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు. 

కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.

 కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.

 ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా. అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే - అసలు మరణానతరం జీవితం వుందా లేదా? 

కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా  వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు. 

అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు. 

కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు.  

నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటు వంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 12 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. - 3 🌻

సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా. 

ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు. కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు. 

దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.
        
 కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.

 ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా. 

అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే - అసలు మరణానతరం జీవితం వుందా లేదా? కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా  వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు. అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు. 

కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు.  నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటువంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹













Only admins can send messages


* దశ మహా విద్యలు - ఛిన్న మస్తా
* మన ఆకాశిక్ records ఎవరైనా చూడవచ్చా ?* "కరోనా కుమారి"  (చిన్న కధ -5)
* 1940నాటి  చిత్రరాజాన్ని జాతికి పరిచయం 
* అన్నమయ్య సంకీర్తన





* దశ మహా విద్యలు - ఛిన్న మస్తా

దశ మహా విద్యలు - ఛిన్న మస్తా

|| ఛిన్నమస్తాధ్యానమ్ ॥

 |ప్రత్యాలీఢపదాం సదైవ దధతీం ఛిన్నం శిరః కర్త్రికాం
దిగ్వస్త్రాం స్వకబన్ధశోణితసుధాధారాం పిబన్తీం ముదా ।
నాగాబద్ధశిరోమణిం త్రినయనాం హృద్యుత్పలాలఙ్కృతాం
రత్యాసక్తమనోభవోపరి దృఢాం వన్దే జపాసన్నిభామ్ ॥


భావం : ఖండిత శిరస్సు, ఆ శిరస్సునొక చేతితో ధరిస్తూ, మొండెం నుండి వెలువడిన రక్త ధారలు....అందొక ధార ఖండిత మస్తకంలో పడుతూ, మరి రెండు ధారలు, ప్రక్క నున్న "వర్ణిని, ఢాకిని" అనే యోగినుల నోళ్ళలో పడుతూ, దిగంబరంగా ఉంటూ, ఒక చేత కత్తెరను ధరించిన....మాంసాలంకృత రూపాన్ని ధ్యానిస్తున్నాను.

ఈ రూపాన్ని తలచుకుంటేనే, ఒళ్ళు జలదరిస్తుంది. చిత్ర పటాన్ని చూచినా, గగుర్పాటు కలుగుతుంది.

ఈమెకు, ప్రచండ చండి, వజ్రవైరోచని అనే పేర్లు కూడా ఉన్నాయి. 

"కావ్యకంఠ వాశిష్ఠీ గణపతి ముని" , తన ఛిన్న మస్తా సాధనలో, వారి కపాలముపైన గల బ్రహ్మ రంధ్రము చిట్లగా, ఒకానొక అనితర సాధ్యమైన కాంతిపుంజము, వారి తలపై నిరంతరము కన్పడేది. ఇది సాధనా సిద్ధి.


      వజ్రయాన బౌద్ధంలో ఛిన్నమస్తాదేవిని   'ఛిన్నముండ' అని పిలుస్తారు.


    చండాసురుడు, ముండాసురుడు అని రాక్షసులు ఉండేవారని వారిని అమ్మవారు సంహరించింది గనుక ఆమెకు 'చండముండాసుర నిషూదిని' అని పేరు వచ్చిందని దేవీ పురాణాలు చెబుతాయి. కాళికా దేవి మెడలో ఉండే పుర్రెల దండకు 'ముండమాల' అని పేరు. ఆమెకు 'ముండమాలా విభూషిణి' అని పేరుంది. కనుక 'ముండ' అనే పదం తిట్టు కాదు. దాని అర్ధం 'తెగిన తల' అని మాత్రమే. 'మస్తిక', 'మస్త' అంటే ఏమిటో 'ముండ' అంటే కూడా అదే అర్ధం.


    బౌద్ధతంత్రాలలో కూడా ఈమెను వజ్రవారాహి అనీ వజ్రయోగిని అనీ వజ్రతార అనీ పిలుస్తారు. 'చిన్నముండ వజ్రవారాహి సాధన' అనేది బౌద్ధ - వజ్రయాన తంత్రాలలోని ఒక గ్రంధం. దీనిలో ఈ దేవత సాధనలు వివరంగా ఇవ్వబడ్డాయి. హిందూ తంత్రాలలో అయితే ఈమెను క్రోధకాళి అనీ ఉన్మత్తకాళి అనీ పిలుస్తారు. దశ మహావిద్యా దేవతలలో కాళి, తార, చిన్నమస్తిక ఒక గ్రూపుకు చెందిన దేవతలు.ఎందుకంటే వీరి ఆకారాలు భయానకంగా ఉండటమే గాక, మామూలు మనుషులకు అర్ధంకాని రహస్య తాంత్రిక భావనలతో ముడిపడి ఉంటాయి. ఆయా మార్గాలలో సాధన చేసేవారికే వీరి ఆకారాల వెనుక ఉన్న రహస్యాలు అర్ధమౌతాయి గాని ఊరకే గుడికెళ్ళి భయం భయంగా 'దేవుడా నా తప్పులు క్షమించు.నన్ను కాపాడు' అంటూ దణ్ణాలు పెట్టుకునే మామూలు నేలబారు భక్తులకు ఈ రహస్యాలు అందవు. ఎందుకంటే ఇవి సాధనా రహస్యాలు గాబట్టి వీటిని అనుభవ పూర్వకంగా గ్రహించాలి గాబట్టి. అర్హత ఉన్న సాధకులకు ఈ రహస్యాలు చెప్పబడతాయి గాని, ఊరకే కుతూహలపరులకు ఎన్నటికీ ఇవి తెలియబడవు, అందవు. అది అంతే.
     

     సృష్టికి ముందు నాద ప్రకాశాలుంటాయి. ప్రకాశము, ఆకాశానికి పరిమితమైతే...ఆమె "భువనేశ్వరి".  అదే కాల రూపం చెందితే "కాళి". ఆ ప్రకాశమే సృష్టిలో అంతర్భూతమై, దానిని వెలువరించినపుడు "త్రిపుర సుందరి" అని పిలిచాం. వ్యక్తీకరించబడని అవ్యక్త నాద శక్తిని "త్రిపుర భైరవి" అని పిలిచాము. ఆ నాదమే చూచినపుడు "తార" అని పిలిచాం. ఇక సృష్టి నిమిత్తం ప్రకాశ, నాద, కాంతులు ఒక దానిపై ఒకటి పనిచేస్తూ....ఉండే దశను, తాంత్రికులు "ఛిన్నమస్తా" అని పిలిచారు.
   

    ఈమెకు కాళికి సంబంధం ఏమిటి? కాళి చర్యలు భయంకరమైనవి. కనుక ఆమె "చండి". కాళి కంటే భయంకరమైనది ఛిన్నమస్తా. ఈమె ప్రచండ చండి. విద్యుత్ శక్తి కాళి అయితే, శాసించేది ప్రచండ చండి.


    కుండలినీ యోగ సాధనలో , మానవ దేహమందు మూలాధారము వద్ద నున్న కుండలినీ శక్తి ఊర్థ్వ గమిత్వము చెందుతూ, బ్రహ్మ-విష్ణు-రుద్ర యను గ్రంథి త్రయమును భేదనము చేసి, సహస్రారము నందున్న శివుణ్ణి చేరవలెను. ఆజ్ఞా చక్రము వరకే, సాధకునికి ఇంద్రియ సంబంధము. ఇక అక్కడ నుండి ప్రయాణము "ఇంద్రియాతీతము". ఛిన్న మస్తా యొక్క శక్తి, సుషుమ్నా నాడి ద్వారా ప్రవహించును. సుషుమ్నకు ఇరువైపులా ఉన్న ఇడా-పింగళ నాడుల ద్వారా, ప్రసరించు శక్తు
లు "వర్ణిని-డాకినులు".


    ఈమె వీర సాధకులకే వశమవుతుంది.

--(()--

దశ మహావిద్యలు - భువనేశ్వరి మహావిద్యా


   ఈమె దశ మహావిద్యలలో 4వ మహావిద్య అయిన "భువనేశ్వరి".

   కాళి కాలమునకు సంకేతమైతే, భువనేశ్వరి ఆకాశమునకు సంకేతము. ఈమెను ఆకాశ శక్తి అనవచ్చును. సమస్త భువనములకు అధిష్ఠాత్రి.

   మనచుట్టూ ఆవరించి యున్నది "మహాకాశం". మనలో ఉన్నది "దహరాకాశం". ఈ ఆకాశ రూపంలో విస్తరించిన ఈ చిచ్ఛక్తి స్వరూపిణియే "భువనేశ్వరీ దేవి".

   నిర్గుణ పరబ్రహ్మం సృష్టికి సిద్ధపడినపుడు, ఎక్కడ, ఏ పరిస్థితి, ఎలా...అనే సందేహం కలుగుతుంది. ఆ స్వయంవ్యక్త ప్రకాశమే, ఒక హద్దును నిర్ణయించుకొని "ఆకాశమైనది". ఆకాశం నుండే కాంతి ప్రవాహం ఆరంభం అవుతుంది.

   సృష్టి ఆరంభ దశలలో, పరమాత్మ తనను తాను చూసుకున్నాడట. "తదైక్షత" అని ఉపనిషత్తు. (ఈక్షణ శక్తి).ఆ చూపే ఆకాశం. దానినుండి నామ,రూపాత్మక జగత్తు ఏర్పడింది. దృష్టిని బట్టి సృష్టి అన్న వాదం కలదు కదా! ఆ గ్రహణ శక్తి తెలుసుకోవాలన్న శక్తియే భువనేశ్వరి.


    కావున ఈమె పరమేశ్వరుని "ఈక్షణ శక్తి". ఈ ఈక్షణ శక్తి, ఇచ్ఛా శక్తి కంటే వేరు కాదు.

    ఈమె రెండు చేతులలో పాశాంకుశాలను ధరిస్తుంది. మిగిలిన రెండు చేతులతో వరద, అభయ ముద్రలను ధరిస్తుంది. ఈమెను "మాయా శక్తి" అని కూడా అంటారు. తాంత్రిక వాఙ్మయం ప్రకారం ఈమెయే, దేవతల తల్లి "అదితి". ఆమె రూపం ఇలా వర్ణించబడింది.


    ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ మహావిద్యను ఉపాసిస్తే ఆసాధకుడికి మూడోకన్ను (third eye activation) తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్తసిద్ధుల్ని, సకల భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.


    ఈమె ఉపాసన చాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన "వరోవసి విద్య" ఆధారంగా చేయబడుతుంది. ఈమె బీజ మంత్రం "లజ్జా బీజం".


    కాళి, భువనేశ్వరి కాలానికి, ఆకాశానికి అధిష్ఠాన దేవతలై ఈ నామరూపాత్మక జగత్తుకు కారణభూతులవుతున్నారు. భువనేశ్వరి ఆకాశమైతే, కాళి , ప్రాణ శక్తి. కాళి చేసే పనులకు ఈమె రంగాన్ని సిద్ధం చేస్తుంది.


 ఉద్యదినద్యుతి మిందు కిరీటాం తుంగకుచాం నయనత్రయ యుక్తాం |
స్మేర ముఖీం వరదాంకుశపాశా భీతి కరాం ప్రభజే భువనేశీం||


ఈ విద్యకు "హ్రీం" బీజాక్షరం. లేదా "ఓం" ప్రణవంతో చేర్చిన బీజం గానీ జపించవచ్చు. మహా విద్యలన్నింటికీ గురువు ద్వారా విధిగా ఉపదేశం తీసుకోవాలి.


 పరమాకాశం నుండే వేద మంత్రాలు వచ్చాయని, వాటికి మూలం ఓంకారమని వేద మార్గంలో ఉండగా,  భువనేశ్వరి యొక్క నాద శరీరమే "హ్రీం" అని తాంత్రికులు ఈ "హ్రీంకారానికి" పట్టం కడతారు. ఇదే తాంత్రిక ప్రణవం. దీనినే "లజ్జా బీజం" అన్నారు. ఈ బీజం సిగ్గు, సంకోచం, స్వేచ్ఛారాహిత్యాన్ని సూచిస్తుంది కదా!



 "భువనేశ్వరీ పరమ శాంతా"...కనుక శాంతిని కోరేవాడు  ఈ విద్యను ఉపాశించాలి.


దశ మహా విద్యలు - త్రిపుర  సుందరి

ఈ దేవత దశ మహావిద్యలలో 3వది. ఈమె శుద్ధ జ్ఞాన స్వరూపిణి. శివ-శక్త్యైక్య రూపిణి. కామమే, సృష్టికి మూల కారణం. పరబ్రహ్మకు, సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. అంటే తాను బహు విధాలుగా మారాలనే ఇచ్ఛ కలిగింది.

సోకామాయత బహుస్యాం ప్రజాయాయేతి  ---తైత్తిరీయ ఉపనిషత్తు

అపుడు పూర్ణ బిందు స్వరూపుడైన  పరబ్రహ్మ, తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. వారే శివ-శక్తులు. వారే ప్రకాశ - విమర్శాంశలు. సూర్యునికి ఎదురుగా, అద్దాన్ని ఉంచితే...అందులోనిది అతని ప్రతిబింబమే అయినా .....మాయయే. ఆ ఆది పరాశక్తియే మాయా స్వరూపిణి. ఆమెయే యావత్ చరాచర సృష్టికి మూల కారణం. ఆమెయే శ్రీ మహారాజ్ఞి. ఆమెయే పరా భట్టారిక. ఆమెయే జగన్మాత కామేశ్వరి. లావణ్య మూర్తి లలిత. సౌందర్య రాశి "త్రిపుర సుందరి".


    ఆమె "అ" కారాది "క్ష" కారాంతము...50 అక్షరాల రూపంలో ఉంటుంది. ఆమె వలనే సృష్టి-స్థితి-లయాలు. ఎప్పుడామె , సృష్టి వ్యాపారాల నుండి విముఖంగా ఉంటుందో, అపుడే ప్రళయం.


    త్రిపుర సుందరి అను పదమునకు ముందు "త్రిపుర" ఏమిటి? పురమనగా నగరము, స్థలము, క్రియ జరిగే చోటు అని అర్థం. పరబ్రహ్మలో మొదట కోరిక కలుగగా, స్పందన ఏర్పడి, నాదమేర్పడి బిందురూపాన్ని ధరించగా, ఆ బిందువు మరల మూడు బిందువులై త్రికోణమేర్పడినది. ఈ త్రికోణమే, సృష్టికి ఆధారం. అదే బ్రహ్మ యోని.


    త్రిపుర సుందరికి మూడైన వ్యక్తిత్వాలు కలవు. 1. బాలా 2. త్రిపుర సుందరి 3. త్రిపుర భైరవి. వీటిలో త్రిపుర సుందరిది సౌమ్య రూపం. ఐదవ మహా విద్య అయిన "త్రిపుర భైరవి" ది ఘోర రూపం. అయితే ఈ రెండు రూపములు ఒకే నాణెము యొక్క రెండు పార్శ్వములు. త్రిపుర సుందరికి, మంత్రిణి లేదా జ్ఞాన శక్తి "మాతంగి". త్రిపుర సుందరికి, సైన్యాధి కారిణి, దండ నాథ, వారాహీ లేదా బగళా ముఖీ.


    ఈమె రూపాన్ని సౌందర్యలహరిలో, ఆది శంకరులు ఇలా వర్ణించారు.


 క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥

భావము : తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.


    సాధకుని మనస్సు, ఆమె ఆధీనము లోనే ఉంచి, ఆమె సంకల్పమే...నెరవేరుగాక...అని భావించడమే సాధన.


    శాక్తేయులు విగ్రహాలకు బదులు యంత్రాలను పూజిస్తారు. అవి సరళ రేఖలతోనూ-వక్రరేఖలతో-బిందు కోణాలతోనూ ఉంటాయి. ఇలా పూజించడం ఉత్
తమమని తాంత్రికుల మాట. మంత్రమే దేవత. దేవతా శరీరమే యంత్రం.


--(())--

* మన ఆకాశిక్ records ఎవరైనా చూడవచ్చా ?

మన record ని ఇంకొకరు చూడడానికి అనుమతి లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆత్మ పురోగతికి సాయం చేయడానికి దీనిని చూడవచ్చు.

ఆత్మ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించి స్వచ్ఛత సాధించి, 7వ ఆవరణ 9వ దశకు చేరితే అనగా అద్వైత స్థితికి పూర్తిగా పరిపూర్ణంగా చేరితే ఆ తరువాత ఆ ఆత్మ ఇంకో విశ్వానికి తన ఆకాశిక్ రికార్డ్ తో పాటి చేరుతుంది.

అక్కడ అనుభవాలన్నింటిని నేర్చుకుని మరో విశ్వానికి అలా ఆత్మ అ
నంతంగా తన ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. ఎవరైతే చివరి జన్మల్లో వుంటారో వారి భూలోకంలో పిలవబడే నామం మరియు వారి ఆత్మ నామం ఒకటే అయి వుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

click to enlarge...

* "కరోనా కుమారి"  (చిన్న కధ -5)

ఈ ఘోరాలన్నింటికీ  కారణమైన  మీ  అమ్మాయి  మీద  ఒళ్ళు మండి, లాగి పెట్టి  ఒక్కటి కొట్టాలని ఉన్నప్పటికీ,  ఆ  ముళ్ళసుందరిని మేము తాకినా, ఆమె మమ్మల్ని తాకినా క్వారంటైన్ అయ్యేది మా బ్రతుకేనని గ్రహించి ఆ ప్రయత్నం  విరమించుకున్నాము. అసలు ఆమెని తాకడమనే  వెర్రి  ఆలోచనకే  భయంతో  వణుకుతూ చేతులు  శానిటైజర్లతో రుద్దీ రుద్దీ,  పాలకోవా మందంలో ఉండే మా చేతులు, పూతరేకుల మందానికి  అరిగిపోయాయి.

ఈ తాకడాలు, తలనొప్పులూ ఎందుకులే గాని,  పోనీ దూరంనుండైనా  నోరారా  తిట్టి మా నోటిపూత  తీర్చుకుందామంటే,  మా మూతులకి  మాస్కులు  తగిలించేసింది ముష్టి మొహంది.

ఏ మాటకామాట, అసలు మీ అమ్మాయి అందమే అందం!  నట్టింట్లో నెత్తి  మీద కిరీటం పెట్టుకు తిరుగుతుంది.... వెధవ  చీకేసిన తాట్టెంక మొహమూ అదీనూ..! 

ఆవిడ గారు అడుగెట్టాక,
ఓ  పండుగా  లేదు, పబ్బమూ  లేదు.
ఓ  మాటా  లేదు, మంచీ  లేదు.
ఓ  సినిమా  లేదు, షాపింగ్ లేదు. 
ఐసోలేషన్లూ, క్వారంటైన్లూ తప్ప...!

వెళ్లక వెళ్లక  బయటకెళ్లినా,  ఈ వేసవిలో ఆ PPE కిట్లు, మాస్కులూ  వేసుకుంటుంటే  కావేసిన మామిడి పళ్ళల్లా మగ్గి చస్తున్నాం,  మా ముక్కూ మొహం మండా!

 పొరపాటున బయట  చీదినా, తుమ్మినా  పక్కనోళ్లు  చూసే  అనుమానపు  చూపుల  ఆపరేషన్లని తట్టుకునే కంటే, కూసింత కోపరేషన్తో ఇంట్లో కూర్చోవడం మంచిదని  భావించి గుట్టుగా  బతుకుతున్నాం,  వెధవ సంతాని... వెధవ సంత!  

అంతకీ నయానో, భయానో బెదిరిద్దామని పళ్ళాలూ గట్రా కొట్టి, దీపాలవీ పెట్టి చూసాము కూడా...  అబ్బే, మొండి ఘటం కదూ... లొంగి చావలేదు!

పోనీ మొన్నేదో యుగాంతం అన్నారు కదా, పనిలో పనిగా మీ కరోనా కుమారి  కూడా అంతమైపోద్దేమోనని అతిగా  ఆశపడ్డాము మరియు ఆవేశపడ్డాము కూడా, అబ్బే ఆ ముచ్చటా తీరలేదు... మాకంత అదృష్టం ఎక్కడిదీ...?   

 చివరికి ఏవో మాకు తోచిన  "ఆత్మనిర్భరాలవీ"  ప్రకటించుకుని  కాస్త ధైర్యం చెప్పుకుందామనుకున్నాం గానీ,  ఇక నిబ్బరంగా ఉండడం మా వల్ల కాదు బాబూ...!!!
  
అయినా  మొదటి  నుండీ  మీతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు.  అయినప్పటికీ  పిల్ల  మేనమామ  అయినటువంటి  ఆ  WHO గారు  చెప్పిన  కల్లబొల్లి కబుర్లు నమ్మి, నిండా మునిగి, ఇప్పుడు భయంతో వణికి చస్తున్నాం.

ఇక  అసలు  చెప్పదలచుకున్నదేమనగా,  మరి  మీ  గారాల  కూతురు  తన  పుట్టింటిని, మరీ  ముఖ్యంగా  తన తల్లిగారైన  గబ్బిలాన్ని  గుర్తు  తెచ్చుకుని  గంపెడు గుబులు పడుతుంది..... బెంగతో దిగులు చెందుతుంది.

ఎలాగూ  ఆషాడం  కూడా  వచ్చింది కనుక  శాస్త్రం  ప్రకారం  మీ  కరోనా  కుమారిని  పుట్టింటికి   తీసుకెళ్లి, అమ్మాయి బెంగ తీర్చవలసిందని  వేడుకుంటున్నాము.

 ఆషాడం  తర్వాత మీ పుత్రిక  మళ్ళీ  మా గడప  తొక్కకుండా, ఆలోగా  మేము కూడా  మీలాగా  ఒక  గోడ  కట్టుకుని,  మా  పాట్లేవో  మేము  పడతాము.
 ఇంతే సంగతులు!!

 .                            .ఇట్లు 
మీ  "కరోనా కుమారి"  బాధిత  వియ్యలవారు

😝😜👆🏻🤨😳


* 1940నాటి  చిత్రరాజాన్ని జాతికి పరిచయం 
(ఈ అద్భుతమైన 1940నాటి  చిత్రరాజాన్ని జాతికి పరిచయం చేసిన మోదుమూడి సుధాకర్ గారికి కృతజ్ఞతా సుమములు.)   ఈ ఫోటోలో... కూర్చున్న వ్యక్తి మహనీయులు. శ్రీ కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ  విమలానందభారతీస్వామి.వీరి  పూర్వాశ్రమ నామం  కానుకొలను త్రివిక్రమ రామారావు(KT.రామారావు) .వీరిది బందరు.వీరు విశ్వనాథ సత్యనారాయణగారికి  తర్కశాస్త్రంలో గురువు మరియు బందరు కాలేజీలో English lecturer,  న్యాయవాది  కూడా. తర్వాత పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానందభారతీస్వామివారు కూడా పూర్వాశ్రమంలో విమలానందస్వామికి బందరులో విద్యార్థి. శ్రీ రామాయణకల్పవృక్షం కావ్య అవతారికలో,  విశ్వనాథ వీరి గురించి రాస్తూ... వీరిని సాక్షాత్తు బ్రహ్మగా భావించారు. "నాకేమైనా తర్కం కాస్త అబ్బిందంటే, ఈ గురుదేవుని బిక్ష",  అని విశ్వనాథ స్వయంగా అనేకసార్లు చెప్పుకున్నారు.ఈ ఫోటోలో నేలపైన కూర్చున్న బాలుడు సామాన్యుడు కాడు. గంధర్వస్వరూపుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ..... కీర్తనలు ఎవరైనా పాడతారు, సంగీత లోకంలో నీకంటూ  ప్రత్యేకమైన గుర్తింపు  , విశిష్టమైన కీర్తి, ముద్ర ఏర్పడాలంటే  నువ్వు ఏదైనా చెయ్యాలి, అని, బాలమురళిగారికి దిశానిర్దేశం చేసినవారు శ్రీ  విమలానంద.  స్వామి ఆజ్ఞతో, ప్రేరణతో 72 మేళకర్తలకు బాలమురళి స్వరరచన చేశారు. అవధాన కవిసమ్రాట్టులైన  కొప్పరపు కవులకు విమలానంద అత్యంత ఆత్మీయులు.పూర్వాశ్రమంలో కానుకొలను త్రివిక్రమరావుగా ఉన్నప్పుడు కొప్పరపువారి  అనేక సభల్లో పాల్గొన్నారు. " కామిని పాద నూపురము ఖంగున మ్రోగదు హేతువేమొకొ.. " మొదలైన అనేక సమస్యలు వారు ఇవ్వడం, కొప్పరపువారు పరమాద్భుతంగా పూరణ చెయ్యడం జరిగింది.తిరుపతి వేంకటకవులు -కొప్పరపు కవులను ఒకరినొకరికి పరిచయం చేసినవారిలో విమలానందస్వామివారు ప్రథమశ్రేణీయులు. మరియొకరు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. స్వామివారు కొప్పరపువారి అసమాన ప్రతిభకు ప్రత్యక్ష సాక్షులు.స్వామివారు కొప్పరపువారిపై ఆనాటి పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు కూడా వ్రాశారు.ఇందులో నిలుచుని ఉన్నవారు మరో మహనీయులు.సంగీతసార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.పారుపల్లివారు త్యాగయ్య గురుపరంపరలోని మహాత్ములు.మంగళంపల్లివారికి స్వయంగా గురుదేవులు.కూర్చున్న బాల బాలమురళి వెనకాల నిల్చున్నవారు, వారి తండ్రి పట్టాభిరామయ్యగారు. ఇందరు  మహనీయులు ఈ చిత్రరాజంలో ఉన్నారు - వందే గురుపరంపరాం... . ఈ తెలుగుతేజాలు, ఈ భారతీయ తేజోమూర్తులు మనకు స్ఫూర్తులు-   🙏🙏🙏


🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 13 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.. జ్ఞానోపదేశము 🌻

ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములగు సంపదలనిచ్చెదనని ప్రలోభపెట్టినను వానిని సరకుగొనక మరణాంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి యమధర్మరాజు వానికి జ్ఞానోపదేశము చేయనారంభించుచున్నాడు:

చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారనమాట. ముందు ఆచార్యవర్యులెవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా, అహంకారానికి గురి అవుతాడా లేదా, అజ్ఞానానికి గురి అవుతాడా లేదా, ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారిత్వం వున్నది అనేటటువంటి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. 

అలా పరిశీలన చేసిన తరువాత మాత్రమే వారికి ఆత్మవిషయమును గురించినటువంటి బోధని పూర్తిచేయాలి. అంతేగానీ, వచ్చినవారందరికీ తగినవారందరికీ చెప్పాలా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి. 

ఎవరికి ఏ స్థాయిలో వున్నటువంటి వివేకము, విచారణ వుంటయ్యో, వారివారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి , వారి వివేకాన్ని అనుసరించి వారికి మనం బోధించాలే గానీ , కనబడ్డవారందరికీ “నువ్వు ఆత్మ స్వరూపుడివి! నువ్వు బ్రహ్మస్వరూపుడివి ! నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి! నువ్వు ఇక తెలుసుకొనవలసినది ఏమీ లేదు! చెయ్యవలసింది ఏమీలేదు! పొందవలసినది ఏమీలేదు!” అనేటటువంటి అంశాలను చెప్పామనుకోండీ, రెంటికీ చెడ్డ రేవడిగా అయ్యేటటువంటి అవకాశం వున్నది.

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గము స్వధర్మము-పరధర్మము 🌻

ఈ ప్రపంచములో మానవులు నడచుకొనుటకు రెండు మార్గములు కలవు. ఒకటి శ్రేయోమార్గము. రెండవది ప్రేయోమార్గము. 

ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవియై మానవుని బంధించుచున్నవి. కాబట్టి జీవులందరి ముందు ప్రతిచోట, ప్రతి క్షణం, ప్రతి తలపులో కూదా రెండు రకములైనటువంటి అవకాశాలను ఈ ప్రకృతి కల్పిస్తుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

    అంటుంది భగవద్గీత. అంటే అర్ధం ఏమిటీ? శ్రేయము-ప్రేయము, స్వధర్మము-పరధర్మము. ఈ రెండు అంశాలు ఒకచోటే వుంటాయి. నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది? అని చక్కగా విచారణ చేయాలి. పరధర్మమేది? అనేది విచారణ చెయ్యాలి. 

ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేది అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. ఎంత దగ్గరిదారి అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. 

ఎంత ధర్మసంకటమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపచేయడానికి సిద్ధంగా వున్నప్పటికీ నీవు దానిని - పరధర్మాన్ని - ఆచరించకూడదు. కారణమేమిటంటే శ్రేయము-ప్రేయము అనే విభజన స్పష్టముగా చెప్తున్నాడు జీవితంలో. 

దేనిని ఆచరిస్తే అత్మానుభూతికి దగ్గరవుతావో, ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతియందు నిలకడ కలిగివుంటావో అటువంటిది శ్రేయము. శ్రేయస్సును కలిగించేది. 

ఎన్ని జన్మలకైననూ నిన్ను విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అటువంటి శ్రేయోమార్గమును నువ్వు ఆశ్రయించాలి. 

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹
🕉

No comments:

Post a Comment