Monday, 15 June 2020

22-06-2020




* మాతృ శ్రీ వందన పుష్పాలు
*జనరిక్_మందులు* గురించి
* అన్నమయ్య సంకీర్తన
*🌻. ఆనందసూక్తము 🌻
* శ్రీరమణీయం 

* గురు బోధ

* మాతృ శ్రీ వందన పుష్పాలు

పుడమి పచ్చదనం మానవాభ్యతనానికి నిండు తనం
రవియు వెచ్చదనం సమ్మోహాభ్యుతనానికి నిత్య ఫలం 
తరువు చల్లదనం నిత్యానందవాసానికి ఇచ్చుతనం
జనని హృధ్యతనం సంస్కారం నివాసానికి పంచుతనం ---1

పలుకులు మెత్త ముద్దులు పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి  ....  2

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే......  3

అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ.... 4

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు         ... 5
 ******


                        🌷🙏🌷

* అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రాగము: గౌళ


నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క-
వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు !!
॥పల్లవి॥


ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీబంటు
చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు !! 
॥నేలమిన్ను॥


వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె
నిట్టతాడువంటివాఁడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు !!
॥నేలమిన్ను॥


అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు
నిలుచున్నాఁ డదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుఁడు
కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు !!
॥నేలమిన్ను॥

🕉🌞🌎🌙🌟🚩

*🌻. ఆనందసూక్తము 🌻

🌻 స్పర్శ వలన ఆనందమున్నది. ఉద్రేకము వలనా సుకుమార సున్నిత భావావేశముల వల్లనూ ఆనందం కలుగుతుంది. అవగాహన వల్ల కూడ ఆనందోదయమవుతుంది. జ్ఞాన-వివేచన వల్ల కూడ ఆనందం కలుగుతుంది. 

ఆనందములోనికి ప్రవేశించుటవల్లనూ ఆనందం, అట్లే ఆనందములో స్థిరపడుట వల్లనూ ఆనందముంది. ఎప్పటికైనా ఎవరైనా కోరవలసినది‌కూడా ఆనందమే కదా! 

అయితే స్పర్శ వల్ల ఆనందము కూడా ఆనందమే! అది ఎవరూ కాదనలేరు. శీతాకాలంలో బయట చలిగా ఉంటుంది. అదే మీ కారులో కూర్చున్నామనుకోండి. లోపల వెచ్చగా ఉంటుంది. నాకు ఆనందంగానూ ఉంటుంది. అయితే ఒక విషయం. 

మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళినప్పుడు గాని లేదా భూమధ్యరేఖా ప్రాంతానికి గాని వెళ్ళినట్లయితే, అదీ మండువేసవిలో అయితే, చల్లని హిమగృహంలో (ఏ.సి. రూములో) కూర్చుంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. దీనినే స్పర్శ వల్ల కలిగే ఆనందమంటారు. 

కృష్ణభగవానుడు ఇట్లా అన్నాడు "చలికాలంలో వెచ్చదనం ఆనందమైతే, వేసవిలో చల్లదనం ఆనందమనుకుంటే ఆ ఆనందానికి ప్రామాణికత ఏమిటి? చల్లగా ఉన్నప్పుడు నాకు హాయి అని నేనంటే, అది తప్పనిసరిగా వేసవే అయుండాలి. నేను డెన్మార్కు వెళ్ళేవరకు ఆగి, అక్కడ చలికాలమయితే, ఆనందమంటే ఏమిటో నన్ను అడగండి, వెచ్చదనమే ఆనందమంటారు. 

అందువల్ల స్పర్శాసుఖము అని మనం పిలిచే ఆ సుఖంలో ఏదో కొద్ది సత్యము తప్ప పూర్తి నిజం కాదు. 

ఆనందము యొక్క పై అంచునుండి క్రమక్రమంగా పై స్థాయిలోని ఆనందానికి వెళ్ళాలనుకొంటున్నారు ప్రజలు. అయితే చివరి మెట్టు చేరేవరకు, ప్రతి ఘట్టములోనూ కలిగే ఆనందం శాశ్వతమైనది కాదు...


--(())--

862: శ్రీరమణీయం -(561)
🕉🌞🌎🌙🌟🚩

"పూజ అంటే ఏమిటి ? పూజలతో అసాధ్యమైన పనులు సుసాధ్యం అవుతాయా ??"

మనకు అనుభవంలోవున్నా, లేకున్నా, ఎక్కడో, ఎవరెవరికో జరిగినవి, మనకు తెలిసినవి పట్టిస్తూ మనం కీర్తిస్తూ ఉండటాన్ని ఇప్పుడు పూజ అంటున్నాం. ఏ పూజ చేయలేని వారు కూడా తాము నమ్మిన దైవం యొక్క సమర్థతను స్మరించుకుంటూ కూర్చున్నా అది పూజే అవుతుంది. మనం ఏది అడిగితే అది చేయగలగటాన్ని దైవం యొక్క సమర్థతగా భావిస్తాం. అనితర సాధ్యమైన పనులు చేసే వారిని దైవంతో సమానంగా కొలుస్తాం. శ్రీ షిరిడి సాయిబాబా వంటి మహానుభావులు అలా చేసి చూపారు. కనుకనే వారిని సమర్థ సద్గురువులుగా సంభోదిస్తాం. మనం ఎవరిని పూజించినా వారి సమర్థతను గుర్తించి స్మరించటమే అందులోని భావన. హనుమాన్ చాలీసా అయినా, విష్ణు సహస్రనామైనా ఆ దైవం యొక్క సమర్ధతను తెలిపేవే కదా ! మనకు జ్ఞానాన్ని, క్షేమాన్ని ప్రసాదించే గురువు విషయంలో కూడా అలాంటి స్మరణే అవసరం. అదే పూజ !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
కలకు-ఇలకు ఆధారం ఆత్మ !'- (అధ్యాయం -69)

🕉🌞🌎🌙🌟🚩
[: "అమర చైతన్యం" 
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: నేను ఆత్మనే అయితే నాకెందుకు తెలియడం లేదు.

జవాబు: నీ ప్రస్తుత జ్ఞానము అహానికి సంబంధించినది. సాపేక్షికమైనది. సాపేక్షజ్ఞానానికి ద్రష్ట, దృశ్యము ఉండాలి. కాని ఆత్మజ్ఞానమునకు ద్రష్ట, దృశ్యము అవసరం లేదు. ఎందుకంటే అవి పూర్ణము. జ్ఞాపకం చేసుకోవడం కూడా సాపేక్షికమైనది. జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, జ్ఞాపకం చేయబడే వస్తువు ఉండాలి. రెండవ వస్తువే లేనపుడు ఎవరు ఎవరిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైనది ఆత్మ.

 ప్రశ్న: నేను ఎంతవరకు ఆత్మ విచారం చేయాలి.

జవాబు: నీ చివరి సందేహం కూడా (తప్పు అభిప్రాయము) పొయ్యేంత వరకు చేయాలి. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు చెయ్యాలి. సముద్రగర్భంలోనే ముత్యాలున్నాయి. వాటిని వెలికి తీయాలంటే సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలి. అలాగే ఆత్మకూడా నీలోపలి, ఇంకాలోలోపలికి వెళితేనే, బాగా లోపలికి మునిగితేనే అనుభవానికి వస్తుంది.


పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలుగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడివై నిలబడు, అదే మనకిప్పుడు కావలసింది.

🕉🌞🌎🌙🌟🚩


స్వామివివేకానంద-ధీరయువతకు...
మూఢవిశ్వాసాలను త్యజించండి

మనకు కావలసింది బలం మనకు బలాన్ని ఎవరిస్తారు? ఉపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి. ఈ ప్రపంచం అంతటికీ జవసత్వాలు ఇవ్వగల బలం వాటిలో ఉంది. ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని, బలాన్ని, ఓజస్సును పొందగలుగుతుంది.

🕉🌞🌎🌙🌟🚩

నిద్ర అనేది బ్లాక్ హోల్ లాంటిది.
తనతో సహా సర్వ ప్రపంచం అందులోకి వెళ్లి లయమైపోతుంది.
✨⚡️✨⚡️✨⚡️
ఒకరు:- నేను అనుకున్నట్టు జరగడంలేదు స్వామి...
సద్గురు:- అనుకోవడం అనేది అసహజమైనది, జరగడం అనేది సహజమైనది.
🕉🌞🌎🌙🌟🚩

గురు బోధ
.........................................

ఆత్మ స్వరూపులు అందరికీ శుభభివందనములు శుభాశీస్సులు
ఆత్మ స్వరూపులు ఐన మనమందరము దైవ వారసులం.కానీ మనము దైవ వారసులం అని మరచి పోయిన కారణముగా నిరంతరం ఏదో ఒక కార్యము కారణముగా చింతలో ఉంటున్నాము. ఎప్పుడైతే భక్తుడు అను వాడు భగవంతుని సేవలో నిమగ్నుడై ఉంటాడో వాడికి లేమి అనునది కలగదు. తండ్రి చేతిని పట్టుకుని నడుస్తుంటే బిడ్డ తప్పటడుగు వేస్తున్నా తండ్రి సరిదిద్ది సరియగు దిశగా నడిపిస్తూ ఉంటాడు. గుంటలు వచ్చినా, బురద వచ్చినా వాటిని బిడ్డ దాట లేడు కావున తండ్రి తనచేతిలో ఉన్న బిడ్డ యొక్క చేతిని మరలా గట్టిగా పట్టుకుని బిడ్డను ఎగరవేసి గుంట నుండి లేదా బురద నుండి ఆవల నిలబెట్టుతాడు.ఇది మనకు తెలుసు.  . అదేవిధముగా ఎప్పుడైనా కష్టం వస్తె ఆ కష్టాన్ని తనదిగా భావించి బిడ్డ ముందు ఉంటాడు తండ్రి. ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ. మరి ఆ భగవంతుని బిడ్డలం ఐన మనలను కూడా అదేవిధముగా ఆ భగవంతుడు ఎప్పుడూ కష్ట కాలంలో మనకు సహాయం అందిస్తాడు. ఇది సత్యం . మరి ఎలా అందిస్తాడు? అన్నదే ఇక్కడ ప్రశ్న.. ఎప్పుడైతే నీవు భగవంతుని చేతిని పట్టుకుంటూ ఉంటావో అప్పుడు మాత్రమే తాను సహాయ పడతాడు. లేకుంటే ఆయన తాను తటస్థంగా ఉండి తన బిడ్డ ఎలా బయట పడగలదో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే బిడ్డ తన చేతిని వదిలి స్వయముగా తానే నడుస్తానూ ,అని మరం చేసి తండ్రి చేతిని వదిలి నడవడానికి ప్రయత్నం చేస్తే తండ్రి తనచేతిలో ఉన్న బిడ్డ చేతిని వదులుతాడు. బిడ్డ ఎలా నడుస్తాడు ? అని గమనిస్తూ ఉంటాడు గోతిలో పడినా కూడా లేవధియడు. ఎందుకంటే తనకు తాను స్వయముగా నడవడానికి సన్నద్ధం అయ్యాడు కావున. 

అదే తండ్రి యొక్క చేతిని బిడ్డ పట్టుకుని నడుస్తున్నప్పుడు తండ్రి చెబుతాడు, బిడ్డ ఎప్పుడూ నీవు నా చేతిని పట్టుకుని నడిస్తే ఎలా నీవు నీ శక్తి మీద నడవాలి , నేను సహాయం చేస్తాను . నీకు నీవు నడవడానికి ప్రయత్నం చేయి అని తన చేతిని వదిలి బిడ్డ ను నడవమని చెప్పినా బిడ్డ నడుస్తున్నప్పుడు గోతులు వచ్చిన, బురద వచ్చినా మరలా తన చేతిని బిడ్డ చేతికి ఇచ్చి పట్టుకో అని అంటాడు బిడ్డ పట్టుకొని ఆపద నుంచి తప్పించి బయట పడవేస్తాడు. ఇదంతా ఎప్పుడూ జరుగుతుంది? తండ్రి పర్యవేక్షణలో మాత్రమే....

అదే విధముగా భగవంతుని గట్టిగా పట్టుకుని ఉన్న నాడు భగవంతుడే మనకు రక్షణ కల్పిస్తాడు....

భగవంతుని పట్టుకొనక నీకు నీవే సొంతంగా నడవాలని ప్రయత్నము చేస్తే నీకు నీవే రక్షణ కల్పించి నడుచుకోవాలి. ...

కానీ నీకు నీవు సొంతంగా నడవడం రాదు, భగవంతుని చేతిని గట్టిగా పట్టుకోవడానికి మనస్సు కుదరదు, మారి ఎలా???????? బాధలు పడక తప్పదు......


No comments:

Post a Comment