Sunday, 14 June 2020

20-06-2020



* నేటి కవిత్వం .. సంతసం
* అహంబ్రహ  (  శ్వాస యే  ఆయుష్షు )
* కరోనతో సహజీవనాన్ని కొనసాగించటానికి
పదవి విరమణ పొందిన ఒక  ఉద్యోగి అంతరంగం 👨‍🦳
* ఆద్యాత్మికం 




నేటి కవిత్వం .. సంతసం
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఆశించే మనసు నీ రూపమును ఏనాటికి మరల్చ లేదంటే
పాశాన్నే వదలి ప్రాణాన్ని పరువాన్నే చురుకుగా సమకూర్చే
విశ్వాసం కనుల ఆకర్ష మునకే మునకే లొంగుననియే మదిభావం
ఆశాపాశములు బత్కంత పెనవేసే పడచు ఆశలు తీర్చే 

కాలాన్నీ మరువ లేకే మదిలొ భావాలు ఒకటై మనువాడే
ముల్లోకాల సుమసామిప్యమును ఆశించి  ఒకటై మనసంతా
కల్లోలాల పలువాక్కుల్ని తెలిపీ హాయిని మనస్సుకు పంచే       
కోలాటాల్ జరిగి ఏకమ్ము అగుటే జీవితము సామము కాదే 

సంతోషం సగము ప్రస్ఫోట బలమే జీవిత సరాగములేగా 
ఛీత్కారం మరచి పంచే వలపు చెప్పేటి ప్రాతిభా తలపించే
తాత్పర్యం తనువు తత్తాన్ని తెలిపే సాదు సహనమ్మును పంచే
సత్యాన్నే కళలు గా సాగరమునే ఈదియు సమస్యల తీర్పే   

     --(())--


మెంతుల ఆరోగ్య ప్రయోజనాలు 

👉మెంతి కూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే మన ఆరోగ్యానికి తిరుగులేదు. 

👉మెంతి పొడి, 5 నుండి 50 గ్రాముల మోతాదులో తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
👉 మధుమేహంతో  బాధపడుతున్న వ్యక్తుల్లో రక్త  గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తుంది.

👉 మెంతి నీటిలో గాలక్టోమన్నన్ (galactomannan) ఉంటుంది, ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

👉నీటిలో నానబెట్టిన మెంతులను రాత్రి పడుకునేముందు తీసుకుంటే అధికముగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.

👉ఇది మాత్రమే కాక రక్తపోటు స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

👉 ఋతుస్రావం మొదటి మూడు రోజులలో వచ్చే కడుపు నొప్పి కి మెంతులు వాడటం వలన నొప్పిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

👉 ఇది  ఋతు చక్రాలను క్రమబద్ధీకరించడంలో కూడా  సహాయపడుతుంది.

👉కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటి వివిధ కడుపు సమస్యలను నివారించడానికి మెంతి విత్తనాలు సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు.

👉కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుభ్రం చేస్తాయి.

👉 ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన, అవి మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు.

👉 మెంతుల యొక్క పాలి ఇన్సురరేట్డ్ కొవ్వు ఆమ్లాలు (polyunsaturated fatty acids) అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

👉  ఈ కారణంగా కీళ్ళ నొప్పి తగ్గించడానికి మరియు ఆర్థిరైటిక్ వ్యక్తులలో వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

👉మెంతి విత్తనాలను వివిధ జీర్ణ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు.

 👉 శరీరంలో వేడినొప్పి తగ్గించే ప్రభావం, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

👉రోజుకు కనీసం రెండుసార్లు మెంతిపొడిని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది.

👉పైత్యం ఎక్కువగా ఉన్నపుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి దానికి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

👉మెంతులు స్త్రీలలో వివిధ రకాల రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించబడతాయి.

👉మహిళల పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి లేదా సిండ్రోమ్ యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.

👉 మెంతి విత్తనాల దీర్ఘకాలిక వినియోగం కూడా అండాశయ తిత్తులు మొత్తం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

👉మెంతికూర కు గాయాన్ని తగ్గించే మరియు వాపును నివారించే లక్షణాలు ఉండడం వలన దీనిని ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాల ప్రభావాన్ని తగ్గించేందుకు వినియోగిస్తారు.

👉 మెంతులకి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది శ్వాసకోశ వ్యాధులకు బాధ్యత వహిస్తున్న సూక్ష్మజీవులను నాశనం చేయడానికి సహాయపడుతుంది.

👉దీని ఉపశమనం కలిగించే చర్యలు శ్లేష్మ పొరను మెత్తగా చేసి కఫాన్ని పోగొడతాయి. 

👉మెంతులను తీసుకోవడం వల్ల కిడ్నీ, మూత్రణాళ సభందిత సమస్యలు నయమవుతాయి.

👉ఇంకా శరీరంపై వేడి ప్రభావాలు, బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ రుగ్మతల లక్షణాల నుండి మరియు దగ్గు మరియు సాధారణ జలుబు వంటి సాధారణ అంటురోగాల నుండి ఉపశమనంలభిస్తుంది.

👉మెంతులు,  దాల్చినచెక్క, అల్లం లేదా మిరియాలతో చేసిన టీ ని తీసుకోవడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

👉 ఇది మీ ఇన్సులిన్ మరియు ఇతర నియంత్రిత ఔషధాలపై మీరు ఆధార పడడాన్ని తగ్గిస్తుంది.

👉మెంతి ఆకులను దంచి తలకు పట్టిస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వెంట్రుకలు నిగానిగలాడుతాయి.

👉ముఖం పై వైట్ హెడ్స్ ఉన్నవారు ఈ మెంతి ఆకు పేస్ట్ ని రాత్రి పూట అప్లై చేసి ఉదయం శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ వైట్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.



* అహంబ్రహ  (  శ్వాస యే  ఆయుష్షు )

*మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...*
*100 నుండి 120 సం.౹౹లు  బ్రతుకుతాడు.*
*తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...*
*500 సం. లు బ్రతుకుతుంది.*
*ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?*🤔

*దీనిని .*
*సశాస్త్రీయంగా వివరిస్తాను...*
*అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.*

*మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.*

*ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.*
*వీటినే సెల్స్ అంటాం.*

*ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా* *(హరిత రేణువు)*
*"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.*

*ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు* *గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది.*
*దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.*

*ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది*
*ఇలా శరీరం లోని*
*కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...*

*ఇలా ఒక్కొక్క కణం నిముషానికి...*
*15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.*

*ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...*

*ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...*

*ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.*

*ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...*

*ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......*

*ఉదాహరణకు మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి.* *అనుకుంటే...*

*ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము.*
*మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే*ఆ స్థలం లో కణాలు తయారవు తాయి.*

*పాత వాటిని ఖాళీ చేస్తేనే...*
*కొత్తవి రాగల్గుతాయి.*
     
*అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.*

*ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...*

*వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి...*
*సరిగా ఉష్ణం జనించక......*
*తీవ్ర రోగాల బారిన పడతారు...*

*కనుక ఈ టాక్సిన్ లను .....*
*బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..*
*(విసర్జన)*
*చాలా ముఖ్యం.*

*ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.*

*అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...*

*5 రోజులు జీవిస్తుంది......*

*13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...*

*7 రోజులు జీవిస్తుంది......*

*ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ...*

*మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.*

*ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...*
*త్వరగా పాడై పోతుందో*
*పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో*
*అలాగే ఈ కణాలు కూడాను...*

*భారతీయ యోగులు ...*
*కణం యొక్క జీవిత కాలాన్ని...*
*3 నుండి 21 రోజుల వరకు...*
*పెంచి...*
*2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.*

*మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ...*

*శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...*
*ఆ కణం త్వరగా పాడైపోతుంది.*
     
*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......*

*మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...*

*ఎందు కంటే......*

*అవయవాలు "అంటే"...*
*కణాల సముదాయమే.*

*ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...*
*ఆయుష్షు పెరిగితే...*

*మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!*

*మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...*
*20 సంవత్సరాల ఆయుష్షును...*
*పెంచు కోవచ్చు...*

*యోగులు...*
*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*

*తాము...*
*ఏ రోజు...* *మరణించేదీ...*
*ముందే చెబుతారు...*

*శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం !*
గురూజీ.
శుభం భవతు.
✋✋✋✋✋

: మన గ్రూప్ సభ్యులకు రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కరోనతో సహజీవనాన్ని కొనసాగించటానికి కొన్ని సూచనలు: 

1) నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 

2) బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 

3)పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడివుంటుంది. 

4) పసుపు: మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి.  ఏది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 

6) అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 

7) వెల్లులి: ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 

8) డైలీ వాకింగ్ చేయండి  ఆసనాలు వేయండి ప్రాణాయామం చేయండి మెడిటేషన్ కూర్చోండి

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు. 

పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వాళ్ళ మీ శరీరం కరోనా వైరస్ రోగం తో ధైరంగా పోరాడే శక్తి ని ఇస్తుంది మరియు దరి చేరనివ్వదు.🙏
[19:08, 16/06/2020] Mallapragada Sridevi: 🙏నమస్కారం🙏
--(())--

 *   👨‍🦳 పదవి విరమణ పొందిన ఒక  ఉద్యోగి అంతరంగం 👨‍🦳

🕦సమయం  గడిచిపోయింది, 
 ఎలా  గడిచిందో తెలియదు, జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది                   తెలియకుండానే....

✍భుజాలపైకి ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు. తెలియనేలేదు..

✍అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో,
 తెలియనే లేదు.......

✍ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..
కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో,  తెలియనే లేదు......

✍ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది. కానీ  ఇప్పుడు  నా పిల్లలకు  నేను బాధ్యత గా మారాను  ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియనే లేదు.....

✍ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..
కానీ ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు....

✍ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..
అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో,
తెలియనే లేదు...

  ✍ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..ఉద్యోగం పొందాక ఎప్పుడు  రిటైర్  అయ్యామో..
తెలియనేలేదు....

✍పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..
వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో,
 తెలియనే లేదు.....

✍రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియనే లేదు....

✍ఇప్పుడు   ఆలోచిస్తున్నాను..
నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..
కానీ..శరీరం  సహకరించడం లేదు. 

 ✍ఇవన్నీ..జరిపోయాయి..
కానీ  కాలం  ఎలా  గడిచిందో....
తెలియనేలేదు..... తెలియనేలేదు....

     🦜It's  truth  of life.🦜

--(())--


ఆటవెలది పద్యాలు .......   2  

కమల నయన తనివి తీరని కామ్యపు
చూపు మాలొ ధర్మ నిర్ణ యంబు
నిలిపి మనసు విప్పి తెల్పేటి సత్యము 
నిత్య ధర్మ చలువ నీదె దృష్టి 

కమల నయన మమ్ము పెంచియు పోషణ 
ప్రేమ భుక్తి పంచి నిష్ట నేర్పి
మనసు తలపు లన్ని నీకృపయే మాకు
వినయము మది తీర్పు తెలుపు దృష్టి

కమల నయన మనసు అర్పించి భక్తితొ
వేడు చుంటి నిన్ను ఆశ లేక
కరుణ దయయు భయము నాకున్న తెల్వియూ 
నీకు అన్ని తెలుసు మాయ మాపు

కమల నయన మమ్ము బ్రోవుము ఎప్పుడూ
నీకు తప్ప లన్ని చెప్పు చుంటి
మక్కువైన మాట వాస్తవమేనని 
మోక్ష మిచ్చ మార్గ మంత తెల్పు

కమల నయన మనవి జనులను బ్రోచుము
ప్రేమ భందనా న్ని నిలుపు శక్తి
మాకు జన్మ అర్థ భావమ్ము మాపుము
సర్వ సభ్య సాక్షి శ్రీ నివాస

కమల నయన చూడు భౌతిక జగతినన్
నిద్ర నుంచి మేలు కొల్పు మిపుడు 
కోటి సూర్య తేజ మాబుధ్ధి ధర్మము
వైపు ఉంచి విధులు తెలుపు దేవ

కమలనయన భోగ మందిచి చూస్తావు
సొత్తు చూపి మత్తు లోకి దింపె
మాది నిన్న నేడు కష్టము అంతయు
రేపు మారు చుండు వికృతి దేవ

--(())--


* ఆద్యాత్మికం 

కలకు నిద్ర ఆధారం; ప్రపంచానికి మాయ ఆధారం.

మొదటిది చిన మాయ, రెండవది పెను మాయ.


 'నేను జయ' అన్నదాంట్లో:-

నేను - పరం;  జయ - ఇహం.


 కలలోని నేను - నామ రూప సహితుడను.

కల కనే నేను - నామ రూప రహితుడను.


 తీరం చేరేక పడవ అవసరం లేదు.

మోక్షం పొందేక దేహం అవసరం లేదు.


 నిద్రలో (అజ్ఞానం) ఉన్న తాను - సృష్టిలో ఒక అంశ.

మెలకువలో (జ్ఞానం) ఉన్న తాను - సృష్టికర్త.



 'నేను దేవుణ్ణి' అని

బయట ఉంటే దోషం.

లోపల ఉంటే సత్యం.

🕉🌞🌎🌙🌟🚩

Venue : Convention Centre Foyer, India Habitat Centre (IHC), Lodhi Road

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం .. సప్తమ స్కంధము - మొదటి అధ్యాయము తెలుగు  అనువాదము  రోజువారి సీరియల్ 
నారద-యుధిష్థిర సంవాదము-జయవిజయుల గాథ... 1  నుండి 10 యదార్ధ శ్లోకభావాలు    
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉   20..06...2020 


శ్రీశుక ఉవాచ

1.21 (ఇరువది ఒకటవ శ్లోకము) నుండి ౩౪ శ్లోకాల తాత్పర్యము 

శ్రీశుకుడు నుడివెను - సర్వసమర్థుడైన నారదమహర్షి యుధిష్ఠిరుని ఈ ప్రశ్నను విని మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ మహాసభయందు అందరు వినుచుండగా ధర్మరాజునకు ఈ కథను వినిఫించెను.

నారదుడు వచించెను- ధర్మరాజా! నింద, స్తుతి, సత్కారము, తిరస్కారము అనునవి ఈ శరీరమునకు సంబంధించినవి. ప్రకృతి, పురుషులను గూర్చిన వివేకము లేకుండుటచే అజ్ఞానకారణముగా ఆత్మయందు కల్పితమైనది.


దేహాభిమానము కారణముగా జీవుడు ఈ శరీరమును నేను అని భావించి, దండనము, పరుష వచనములు ఎదురైనప్పుడు, అవి తనవి గానే భావించును. కాని, భగవంతునకు జీవులవలె ఇట్టి అభిమానము ఉండదు. ఆ ప్రభువు సర్వాత్మ స్వరూపుడు, అద్వితీయుడు. ఇతరులను దండించు నప్పుడు గూడ క్రోధము, ద్వేషముల వలనగాక, వారి శ్రేయస్సు కొరకే అట్లు చేయును. భగవంతుని విషయములో హింసకు చోటులేదు.

అందువలన వైరముచేగాని, భక్తిచేగాని, భయముచేగాని, మైత్రిచేగాని, ప్రియతముడని గాని, లేక ఏ కారణమున నైనను భగవంతుని పై పూర్తిగ మనసును లగ్నము చేయవలెను. భగవంతుని దృష్టిలో ఈ భావముల యందు ఎట్టి భేదము ఉండదు.

రాజా! మనుష్యుడు భగవంతుని యెడల వైరభావముతో ఎంతటి తన్మయత్వమును భక్తిభావముతో పొందలేడు అని నా దృఢ విశ్వాసము.

తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో ఉంచి, మూసివేయును. పిమ్మట అది ఝుమ్మని నాదము చేయుచూ ఆ గూటిచుట్టూరా తిరుగును. ఆ పురుగు భయమునకు లోనై ఆ తుమ్మెదనే స్మరించుచుండును. తత్ఫలితముగా ఆ పురుగు తన శరీరమును విడువకుండగనే, ఆ తుమ్మెద రూపమును పొందును.

శ్రీకృష్ణభగవానుని విషయములోగూడ ఈ దృష్టాంతము చక్కగా వర్తించును. సర్వశక్తి మంతుడైన ఆ పరమపురుషుడు తన లీలలను ప్రకటించుటకై మానవునిగా గోచరించును. వైరభావముతో నైనను ఆ ప్రభువును నిరంతరము స్మరించుటచే పాపరహితుడై వారు కూడా ఆ స్వామినే పొందిరి.

పెక్కుమంది మనుజులు కామముతో, ద్వేషముతో, భయముతో, స్నేహముతో తమ మనస్సును ఆ భగవంతుని యందే లగ్నము చేయుటవలన వారి పాపములన్నియును ప్రక్షాళితము లయ్యెను. భక్తులవలె వారును ఆ భగవంతునిలో లీనమైరి.

రాజా! గోపికలు కామముతోను, అనగా ప్రేమభావముతో, కంసుడు భయకారణముగను, శిశుపాల దంతవక్త్రాది రాజులు ద్వేషభావముతోను, యాదవులు బాంధవ్య కారణముగను, మీరు (పాండవులు) స్నేహభావముతోను, మేము (మహర్షులు) భక్తితోను మన మనస్సులను భగవంతునియందు లగ్నమొనర్చుట జరిగెను.

పైన తెలిపిన భావములలో భక్తి భావము తప్ప మిగిలిన వాటిలో ఏ విధముగనైనను తరించిన వారిలో వేనుడు చేరడు - ఏలయన, అతడు ఏ విధముగ నైనను భగవంతుని స్మరింపలేదు. సారాంశ మేమనగా ఏ రీతిగ నైనను శ్రీకృష్ణుని యందు మనస్సును నిలుపుట అవసరము.

రాజా! మీ పినతల్లి కుమారుడైన శిశుపాలుడును, దంతవక్త్రుడును, శ్రీమహావిష్ణువునకు ప్రముఖ పార్షదులై యుండిరి. సనకాది బ్రాహ్మణ శాపము వలన ఆ ఇరువురును పదచ్యుతులైరి.

యుధిష్ఠిరుడు అడిగెను- భగవంతుని పార్షదులను గూడ ప్రభావితమొనర్చిన ఆ శాపము ఎట్టిది? అట్లు శపించిన వారెవరు? భగవంతుని అనన్య భక్తులు గూడ జనన మరణ రూప సంసార చక్రమునందు పడవలసి వచ్చె నను విషయము నమ్మశక్యముగాకున్నది. వైకుంఠ వాసులకు ప్రాకృత శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టి వారికి ప్రాకృత శరీరములతో సంబంధము ఎట్లు ఏర్పడినది? ఈ విషయమును  దయతో వివరింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని మొదటి అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


No comments:

Post a Comment