* సర్వాంతర్యామి అంటారు కదా.?
* దోశ పుట్టు పూర్వోత్తరాలు : -------------------- కధ
* భోగమే ప్రధానముగా జీవించుట
* జ్ఞానమును పొందుటకు మార్గము
* అన్నమయ్య సంకీర్తన
సర్వాంతర్యామి అంటారు కదా.?
*ఒక శిష్యుడు గురువుగారి ని అడిగిన ప్రశ్న....*
భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా.
హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్లడం దేనికి?
*గురువు గారి జవాబు:*
ముఖం మన దగ్గరే ఉంది.
కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దం లో చూసుకొంటాము,
అద్దంలో ప్రాణం లేదు,
కంటికి ప్రాణం ఉన్నా ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది.
అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం.
తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఈ రెండు కాకుండా మనకి ఏదయినా ఒక అద్దం లాంటిది కావాలి, *అదే విగ్రహం ....*
భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు.
అందులో భగవంతుడిని చూసే భక్తి మనకి కావాలి.
మనలోన భక్తి, విగ్రహం ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్నిస్తుంది....
*అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు....*
అందుకే గుడికి వెళ్ళాలి....
🌸 *దైవదర్శనం తరువాత* 🌸
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
*********************
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
*********************
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
"దేహాంతే తవ సాన్నిధ్యం"
***********************
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. 🌞🌹
"దేహిమే పరమేశ్వరం"
*********************
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! 🌹🌞R
🟠🟡 దోశ పుట్టు పూర్వోత్తరాలు : -------------------- కధ
🏹 నెల్లూరు సీమను పరిపాలించిన మనుమసిద్ధి మహారాజు ఆస్థానంలో కమ్మటి కవిత్వం చెప్పిన కవి తిక్కన, మహావీరుడు ఖడ్గ తిక్కన మాత్రమే కాదు. కమ్మటి వంటలు చేసే నారాయణ శర్మ కూడా ఉండేవారు. రాజు గారికి ప్రతీ రోజు ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, ఉప్పు పొంగలి తప్పనిసరిగా ఉండాల్సిందే. దానితో పాటు కొబ్బరి చట్నీ, కారప్పొడి, కమ్మటి సింహపురి మొలగొలకుల గ్రాసం తిన్న గేదెల ద్వారా వచ్చిన సువాసనతో కూడిన నెయ్యి, కమ్మటి పులుసు తప్పని సరి.
కానీ ఓ రోజు నారాయణ శర్మ గారు ఖర్మ కాలి భార్యతో గొడవపడి కొద్దిగా అన్యమనస్కంగా ఇడ్లీ పిండి రుబ్బుతుంటే నీళ్లు ఎక్కువై పల్చన అయిపోయింది. అంతే ప్రాణాలు ఉగ్గ బెట్టుకొని మంత్రిగారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. మంత్రి శివారాధ్యుల వారు కళ్లెర్ర చేసి ఉరిశిక్షే అన్నారు. చావు ఎలా తప్పదని చివరి సారిగా ఆప్తమిత్రులు భిషగ్వరుడు మాధవాచార్యుల వారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే ఓ ఉపాయం చెప్పి నేను చూసుకుంటానులే అని అభయం ఇచ్చారు. పక్కరోజు రాజుగారి అల్పాహారాన్ని పర్యవేక్షిస్తున్న మాధవాచార్యుల వారు ... ఓ పల్చటి అట్టు నేతితో వేసి తీసుకొచ్చారు. రాజు గారు తిని, రుచికి ఆశ్చర్యపోయి మాధవుల వారిని ఇది ఎలా తయారు చేశారు అని అడిగారు. వెంటనే మాధవులవారు వంటగదిలోకి రాజు గారిని తీసుకు వెళ్లి పెనం మీద పల్చటి ఇడ్లీ పిండిని వేసి చక్కగా నెరిపారు. అట్టు అద్భుతంగా వచ్చింది. పిండి పెనం మీద వేసేటప్పుడు రెండు సార్లు సుఁయ్ ... సుఁయ్ అని చప్పుడు వచ్చింది. అంతే పక్కన ఉన్న తిక్కన గారు ఆనందంతో
"ద్వే సుఁయ్" (రెండు సుయ్ లు) అని ఈ కొత్త అట్టుకి నామకరణం చేసేసారు.
ఆ 'ద్వే సుఁయ్' రూపాంతరం చెంది దోశగా మారి జన బాహుళ్యం లోకి వచ్చిందన్న మాట. ఇలా విక్రమ సింహపురి లో పుట్టిన దోశ విశ్వవ్యాప్తమై అనేక శతాబ్దాలుగా కొత్త రుచులను చేర్చుకుంటూ మసాలా దోశ, కారం దోశ, ఉప్మా దోశ, ఉల్లి దోశ అంటూ మార్పులు, రూపాంతరాలు, మెరుపులు చేసుకుంటూ మన గుండెల్లోకి చేరి పోయిందన్న మాట.🍀
🌹. భోగమే ప్రధానముగా జీవించుట జంతు లక్షణము. ప్రజ్ఞ ఆధారముగా జీవించే వాడు మానవుడు కనుకనే మోక్షార్హుడు 🌹
ఇల్లు తగలబడు పోవుచుండిన, ఇంటిలో నున్న వాడు తనను తాను కాపాడుకొనుటకు బయటకు ఎలా బయటకు పరుగెత్తునో అలా ఇంద్రియ విషయాలు అనే అగ్ని అంటుకొనినటువంటి వాడు , ఆ ఇంద్రియ విషయాలనే అగ్నినుండి బయట పడుటకు ఈశ్వరుని పాదముల చెంతకు పరుగెత్త వలెను. అటువంటివానికి మాత్రమే వైరాగ్యము అబ్బును.
భోగమే ప్రధానముగా జీవించుట జంతు లక్షణము. ప్రజ్ఞ ఆధారముగా జీవించే వాడు మానవుడు. కనుకనే అతనికి మోక్షార్హత ఉన్నది. ఇంద్రియ విషయములు కాల సర్పము వంటివి. అవి భగవంతుడు ఇచ్చిన కాలమును హరించి వేస్తాయి.
ఆ విషయము పూర్తగు సమయమునకు నీవు ఆత్మ స్వరూపుడవు అన్న భావనను మరపింప జేసి జీవ భావనలోనికి తీసికొనివస్తాయి. విషము ప్రాణాన్ని హరించి వేసినట్లు విషయము జ్ఞానాన్ని హరించి వేస్తుంది. కనుక విషయములు తోచిన వాటిని విషముగా, కాల సర్పముగా చూడండి.
ఇంద్రియ విషయములు తోచినప్పుడల్లా నేను మనో, బుద్ధి, చిత్త, అహంకారములను కాదు నేను చిదానంద రూపుడగు శివుడను అన్న భానవనను గుర్తుకు తెచ్చుకోండి. ఇటువంటి వాక్యములను మీ రోజువారి జీవితములో ఉపయోగించండి.
పంచ ప్రాణములు నేను కాదు. ప్రాణ సంజ్ఞ నేను కాదు. పంచ కోశములు నేను కాదు. కర్మేంద్రియములు నేను కాదు.
ఏ శక్తి చేత నీలో ఉచ్చ్వాస , నిశ్వాసలు పని చేస్తున్నాయో ఆ శక్తి పేరు ప్రాణ సంజ్ఞ. అది తల్లి గర్భములో నీ శరీరము ఏర్పడక ముందు నుండి కొట్టుకొంటున్నది. ఆ ప్రాణ సంజ్ఞనే హంస లేక చైతన్యము లేక ప్రజ్ఞ అంటారు. దాని వలననే ఈ శరీరము ఏర్పడినది.
ఇలా ప్రతిది నీవు కాదు అని తెలియజేసి నీవు వీటన్నింటిని నిరసించగా చివరకు మిగిలినది ఏదో ఆ చిదానంద స్వరుపుడవు నీవు అని తెలియజేసేదే నిర్వాణ షట్కము
🌹 🌹 🌹 🌹 🌹
* జ్ఞానమును పొందుటకు మార్గము
🌹. అదుపు తప్పిన అపేక్షయే మనలో మూడు గుణములు వర్తించడానికి కారణం. గురు బోధనను స్వీకరించి వైరాగ్యమును సాధకుడే ధృడ సంకల్పముతో సాధ్యం చేసుకోవాలి. 🌹
అపేక్ష ఉన్నంత కాలము వాటి వెనుక మూడు గుణములు పని చేస్తూనే ఉంటాయి. శరీరమే నేను అన్న భావనతోనే జీవిస్తూ ఉంటావు. నేను శరీరము కాదు అన్న స్థితిలో ఉండ గలిగితేనే నేను కర్తను కాదు అనే స్థితికి ఎదగ గలుగుతావు.
నీవు ఎన్ని చదివినా, ఎన్ని విన్నా నిజ జీవితములో వైరాగ్య ద్రుష్టి లేనిదే అనుభవము అసాధ్యము. గురువు ఏది నిత్యము , ఏది అనిత్యమో చెబుతారు. దేనిని ఆశ్రయిస్తే వివేకము కలుగుతుందో , దేనిని ఆశ్రయిస్తే అజ్ఞానము కలుగుతుందో వివరించి చెబుతారు.
కాని వైరాగ్యము మాత్రము నీకు నీవే సంపాదించు సంపాదించు కోవాలి. వైరాగ్యము లేనిదే శమాది షట్కసంపత్తి కలుగదు. శమాది షట్కసంపత్తి, ముముక్షత్వము ఎంత తీవ్రముగా ఉంటే అంత త్వరగా కలుగు తుంది. .
నిత్యా నిత్య వస్తు వివేకము నందు బలీయమైన విశ్వాసము ఉండాలి. వస్తువు నీకు సుఖమును ఇవ్వదు అన్న బలమైన పునాది ఉంటే తప్ప నీకు వైరాగ్యము కలుగదు.వైరాగ్యము బలీయముగా ఉంటే తప్ప దేహ వాసనను, లోక వాసనను , శాస్త్ర వాసనను నిరసించ లేవు.
నాది అనుకొనే ధన, కనక, వస్తు, వాహనములపై అపేక్షను విడువలేవు. వస్తువులపై నా ఆనందము ఆధార పడి లేదు, వాటి అవసరము నాకు లేదు అంటూ ప్రాకృతిక ప్రపంచము నందు వస్తువుల నన్నింటినిపై వ్యామోహమును విడచి పెట్టలేవు.
అపేక్ష విడువ వలెనన్న తద్వ్యతిరేక జీవితమును జీవించండి. నిష్కామ కర్మ చేయుట వలన చిత్త శుద్ధి కలుగు తుంది. అమనస్క పద్దతిలో కర్మ చేయుట వలన, ఆకర్త అను పద్ధతిలో కర్మ చేయుట వలన కర్మ బంధము తొలగుతుంది.
ఆలోచనల సమూహమే మనస్సు అంటే. దానిలో వరసగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలతో ప్రాణ శక్తి ప్రభావము, ఇంద్రియముల ప్రభావము కలిసినప్పుడు అరిషడ్వర్గములు ఏర్పడతాయి. అదే కోరికలకు కారణము.
కనుక కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను , ప్రాణ శక్తిని నీ స్వాధీనములోనికి తెచ్చుకో గలిగినప్పుడు మాత్రమే, వాటిని నీవు పనిముట్లుగా వినియోగించుకో గలిగినప్పుడు మాత్రమే కోరికలను త్యాగము చేయగలుగుతావు. శమ దమాదులు, యమ నియమములు పెట్టినది ఇందు నిమిత్తమే.
ఇవి నీకు స్వాధీనమైన(నీవు చెప్పినట్లు అవి ప్రవర్తించే విధముగా చేసికొనిన) కోరిక మెదలైన వెంటనే దాని యొక్క స్థానమును గుర్తించ గలుగుతావు. వెంటనే సరిదిద్దుకో గలుగుతావు. అప్పుడు అరిషడ్వర్గములు శత్రువులు కాక మిత్రులుగా మారతాయి.
జ్ఞానము జీవిత సంఘటనలతో పోరాటము నుండియే కలుగుతుంది. జీవితములో వచ్చిన పరిస్థితులను ఎదిరించడానికి పెద్దలు, మహర్షులు, అనుభవజ్ఞులు ఏ వాక్యములను అయితే చెప్పారో ఆ వాక్యములకు కట్టుబడి జీవించే వాడికి, ఆ పోరాటము నుండి జ్ఞానము కలుగుతుంది. జ్ఞానమును పొందుటకు వేరే మార్గము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - June 24.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 24.
Know that every thought and word that weakens you in this world is the only evil that exists. Whatever makes men weak and fear is the only evil that should be shunned.
మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడు అని గ్రహించండి. మనిషిని బలహీనపరిచే, మనిషికి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా భావించి తిరస్కరించాలి.
🕉🌞🌎🌙🌟🚩
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
ఫలానా చోట శివుడు ఉన్నాడు అని భావించే వాడికి, ఫలానా రోజు శివరాత్రి అనుకోవడం మామూలే.
ప్రతిచోటా,,,,,,........ 👁️శివుణ్ణి👁️ దర్శించే వారికి, ప్రతిరోజు శివరాత్రే అని ఉండటం మామూలే.
కాశీలోనే విశ్వనాథుడు ఉన్నాడు.... అనుకుని దర్శించే వారికి అక్కడే కాశీలోనే విశ్వనాథుని దర్శనం
విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని.... అణువణువున దర్శించేవారికి.,,, అణువణువున విశ్వమంతా విస్తరించిన ఆవిశ్వనాథుని దర్శనమే
విశ్వనాధుడనగా ఏవరు? ప్రణవనాదం ॐఓంకారంॐ.... ఏదైతే నాదం...,విశ్వమంతా వ్యాపించి నాదం ఏది ఉన్నదో ఆ విశ్వనాదమే విశ్వనాధుడు...ఓంకార స్వరూపుడు
🕉🌞🌏🌙🌟🚩
రాగము: గౌళ
నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క-
వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు !!
॥పల్లవి॥
ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ
నింగికిఁ జెయిచాఁచె నీబంటు
చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద
కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు !!
॥నేలమిన్ను॥
వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె
నిట్టతాడువంటివాఁడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు !!
॥నేలమిన్ను॥
అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు
నిలుచున్నాఁ డదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుఁడు
కలిగి లోకములెల్లఁ గాచెఁగా నీబంటు !!

🙏భవ దారిద్య్రం లేని వారు పోతన
🥀భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో
🥀ఆమె చోద్యంగా చూస్తూ ‘అదేమిటండీ! ఇప్పుడే కదండీ భోజనం చేసి వెళ్లారు. మళ్లీ భోజనం అంటున్నారు? మళ్లీ అప్పుడే ఆకలయిందా’ అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి.
🥀దిగ్భ్రమ చెందాడు పోతన ఇదేమిటి? ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. ‘నేను భోంచేశానా?’ అని అడిగాడు. ‘అవును. కూర్చుని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆపైన నేను భోజనం చేయమంటే చేశారు.
🥀మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం, నేను మీరు తిన్న విస్తరిలోనే భోం చేశాను’ అంది.
‘ఏదీ నువ్వు తిన్న విస్తరి?’
‘బైట తొట్లో వేశాను’ అంది ఇల్లాలు.
బయటికి వచ్చి కుప్పతొట్లో చూశాడు.
🥀అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కుని దొరకకుండా పరుగెత్తి పోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చుని తను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు.
🥀అక్కడ ఒక త్రాటియాకుపైన-
అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా/ పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోప లో/ త్పల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రపన్నుండు వి/ హ్వల నాగేంద్రము పాహిపాహి యన కుయ్యాలించి సంరంభియై’
🥀మొసలితో యుద్ధం చేస్తూ శక్తులుడిగి చేష్టలుల కోల్పోయిన నాగేంద్రము (గజశ్రేష్ఠుడు) ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ‘ఎవ్వనిచే జనించు’ ‘జగమెవ్వని లోపల నుండు లీనమై’ అని అర్థిస్తుంది, ప్రార్థిస్తుంది, అపుడు
🥀‘ఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి, వెంటనే పూనుకుని ఉన్నపళాన ఆపద్రక్షకుడు పక్రమించినవాడై రక్షణకు!
🥀దిగ్భ్రమతో పోతన కళ్ల వెంట ఆనందభాష్పాలు! ఆనందాతిరేకం! అంతలోనే దుఃఖాతిరేకం!
పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశే్చష్టుడయిన పోతనను చూసి కుదుపుతూ ‘స్వామీ స్వామీ!’ అని పిలిచింది ఆ పతివ్రతామతల్లి. తేరుకుని ఆమె భుజంపై తలవాల్చి మళ్లీ అమిత రోదనకు గురయ్యాడు పోతన.
🥀కాసేపు అతడిని దుఃఖింపనిచ్చి, ఆపైన ఓదారుస్తూ ‘ఏం జరిగింది నాథా! ఎందుకంతగా దుఃఖిస్తున్నారు’ అని అడిగింది ఇల్లాలు.
🥀‘శ్రీరామచంద్రుడు! శ్రీరాముని దర్శనభాగ్యం పొందావు నువ్వు! అనంత భాగ్యరాలివి! ధన్యాత్మవు. నాకా భాగ్యం కలుగలేదు’ అని చెపుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మళ్లా వెంటనే దుఃఖాభ్యాగ్నుడై!
🥀‘అవునా స్వామీ! నిజమా! ఇంతక్రితం వచ్చి వ్రాసి, భోజనం చేసి వెళ్లినవారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్ర మూర్తియా?’
‘అవును దేవీ! ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం! విను’
🥀అని ఆ పద్యాన్ని వెక్కిళ్ల మధ్యనే పాడుతూ, చెపుతూ, ఏడుస్తూ ‘చూడు - నువ్వు భగవంతుడి దర్శనం పొందావు - వారు వ్రాస్తున్నది చూశావు - నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు - వారి స్పర్శనం పొందావు! నాకేదీ ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా!’ అని మళ్లీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాత్యుడు.
🥀‘స్వామీ! మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి, మీరు వ్రాసినట్లుగా వ్రాసి, మీరు తిన్నట్లుగా తిని, నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు.
🥀మీరే తానై స్వామి వస్తే, మళ్లా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప ‘మహా భాగవత కావ్యాన్ని’ తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి, ఆనందం పట్టలేక, మీ రచనలో తానూ పాలు పంచుకోవాలని నిశ్చయించుకుని, మీకు భ్రమ కలిగించి బయటకు పంపి, తాను మీ రూపంలో వచ్చి, ‘తనను గురించి తానే’ గొప్పగా వ్రాసుకున్నాడు.
🥀ఇంత మహాభాగ్యులు మీరు. మీరు తెనిగిస్తున్న ‘మహాభాగవతం’ ఆచంద్రార్కం ప్రసిద్ధ పొందుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని, ప్రశాంతంగా కూర్చుని ధ్యానమగ్నులుకండి! మీకే అర్థం అవుతుంది’ అంది.
🥀వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాత్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, తన ఉచ్ఛ్వాసనిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయాడు. తన హృదయ కుహరంలో కొలువైవున్న ఆత్మారాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు ‘రామదాసు’లాగా!
🥀‘భవ సంతృప్తినీ, భావసంతృప్తినీ పూర్తిగా పొందారు పోతన దంపతులు. ఏ మాత్రం భవ దారిద్య్రం కానీ, భావ దారిద్య్రం కానీ లేనివారు! ముక్తజీవులు! ధన్యులు! పుణ్యాత్ములు!
వీరభద్ర విజయం, భోగినీ దండకం పోతన ఇతర రచనలు.
🥀పరమ ప్రఖ్యాతి పొందినదీ, ప్రతి కవీ, పండితుడూ, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది ‘మహాభాగవతం’! ఈ కావ్యానువాదం, ఇందులోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికితురాయి మహాభాగవతం!
🌹🌹🌹🌹🌹
🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼
[15:20, 24/06/2020] +91 92915 82862: శ్రీరమణీయం - (567)
🕉🌞🌎🌙🌟🚩
"ఆత్మసాధనకై చేసే ఇతర ప్రయత్నాలకు, అంతర్వీక్షణ సాధనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి ?"
మంత్రజపం, యోగసాధన, విగ్రహారాధన వంటి ఇతర సాధనా విషయాల్లో "జ్ఞాత-జ్ఞానం-జ్ఞేయం" అనే మూడు విషయాలు అవసరం అవుతాయి. అంటే నేర్చుకునేందుకు ఒక వ్యక్తి, నేర్చుకోవలసిన ఒక విషయం, నేర్చుకోవటం అనే మూడు క్రియలు కావాలి. కానీ ఆత్మసాధన కోసంచేసే అంతర్వీక్షణంలో ఈ మూడింటితో పనిలేదు. ఎందుకంటే విచారణమార్గంలో గమనించేది, గమనించబడేది, జ్ఞానాన్ని పొందేది కూడా మనసే ! మన మనసే ఆ మూడింటిగా ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ మనం మనసును గమనించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఈ పరిశీలనను మనసుకు అలవర్చటమే విచారణమార్గంలో మనంచేసే సాధన !!
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
అంతరంగం గమనించటమే అంతర్వీక్షణం !'
🕉🌞🌎🌙🌟🚩
[15:20, 24/06/2020] +91 92915 82862: "అమర చైతన్యం"
( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩
హృదయం
జీవం హృదయం నుంచే ప్రారంభమవుతుంది - పుడుతుంది. ఇది భౌతికమైన అవయవం - గుండె - కాదు. దానికి దగ్గరగా వుండే ఆధ్యాత్మిక కేంద్రం. ఏ దేశం, ఏ జాతి వారైనా, పిల్లవాడైనా తన అనుభూతులను చెప్పేటప్పుడు, హృదయ భావాన్ని ఛాతివైపే చూపిస్తారెందుకని. సాక్షాత్కారానికి లోపల, బయట అన్న ప్రసక్తి ఏమీ లేదు. నీవు కేంద్రాన్ని కనుగొంటే, అది విశ్వవ్యాపకమని తెలుసుకుంటావు. దాన్ని నీ శరీరానికి గాని, ప్రపంచానికి గాని అనుసంధానించుకోవచ్చు. అది కేవలం మానవులకే పరిమితం కాదు. ఆ కేంద్రాన్ని కనుక్కో. ఆ కేంద్రంలోనికి మళ్ళే ప్రయత్నం చేయి. అక్కడే వుండిపో. అది అనుభవానికి వచ్చినపుడు అదే అందరి కేంద్రం అని తెలిసిపోతుంది.
ప్రశ్న: హృదయమంటే ఏమిటి? అది గుండె మాదిరిగా ఉంటుందా.
జవాబు: హృదయమంటే అది ఆత్మకు స్థానము. కేవలం సాధకుని అవగాహన కొరకు అలా చెప్పబడింది. అది నేను అన్న ఆలోచనకు మూలం. అదే పరమసత్యం. నీ మూలమును చూడుము. నీ అన్వేషణ నిన్ను హృదయానికి చేర్చుతుంది. ఆధ్యాత్మిక హృదయం భౌతికమైన గుండె కంటే వేరైనది. గుండెకు చలనం (కొట్టుకోవడం) వున్నది. హృదయం అనుభవేద్యమే. డైనమో ఎలాగా అన్ని బల్బులకు, ఫ్యాన్లకు శక్తినిస్తుందో, ఆత్మ (హృదయం) నుంచే శరీరంలోని గుండెకు, శ్వాసకు శక్తినిస్తుంది.
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (34)
🕉🌞🌎🌙🌟🚩
2వ అధ్యాయము
అన్నింటికీ ఆధారం మనసే !!
మనలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నే చిత్తం అంటాము. ఆ సమాచారంతో సంబంధం పెట్టుకోవడం అహంకారం అవుతుంది. ప్రపంచాన్ని దానితో పోల్చి చూడటం బుద్ధిగా పరిణమిస్తుంది. అన్నింటినీ గ్రహించడాన్ని మనసు అంటున్నాము. ఇన్ని క్రియలుగా కనిపించే ఈ ప్రక్రియలు అన్నీ ఎరుక లేకపోతే లేనే లేవు. కాబట్టి మనలోని మూలమైన ఆ ఎరుకను ఎరుగకుండా చేసే ఇవేవీ నిజంగా లేనీవే అవుతాయి. అన్నింటికీ ఆధారం మనసే. జీవుడంటే జ్ఞాపకాల సమూహమే. వ్యక్తి అంటే అహంకారంతో కూడుకున్న జీవుడు. నిజానికి అవన్నీ వాస్తవిక ఉనికితో లేవు. కేవలం పరస్పర ఆశ్రితాలు. అవన్నీ ఎరుక ఉంటేనే ఉండేవి మాత్రమే అని గుర్తించాలి !

No comments:
Post a Comment