శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (1)
వెన్నెల వీధుల్లో చుక్కల రాత్రుల్లో
తెల్లటి జాజుల్లో మాలలు మల్లెల్లో
చల్లని గాలుల్లో చామర ఊపుల్లో
స్వాగత వేళల్లో సాధన సేవల్లో
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
ఋతురాగపు శోభలతో
మునిమానస కీర్తనతో
నిజ భక్తుల యాటలతో
విధి వాకిట పాటలతో
హృదయా నందాలతో
తప్పెట మోతలతో
సంబరాల కళలతో
కలియుగ దైవముతో
కలసి మెలసి కదలికగా
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
తారలతో తోరణాలు కట్ట స్వాగతాలు పలుకుతున్నా,
జాజులు విరజాజులు మల్లెల పరిమళాలు పంచుతున్నా,
నక్షత్రాలను దోసిట పట్టి
నీ ముంగిట నిలుస్తున్నా,
చుక్కల దుప్పటి కప్పి
ఊరేగింపు వేచి చూస్తున్నా...
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
వెన్నెల వీధుల్లో చుక్కల రాత్రుల్లో
తెల్లటి జాజుల్లో మాలలు మల్లెల్లో
చల్లని గాలుల్లో చామర ఊపుల్లో
స్వాగత వేళల్లో సాధన సేవల్లో
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (2)
ఎవరు ఎవరిని చెప్పలేను
ఏల ఏదని తప్పు చేయను వేంకటేశా
ఎంత పొందేద అంత చాలును
ఏమి చెప్పినా ఎదలో మాటను వేంకటేశా
ఇహపరసుఖమే, వలపుల తలపే, మధురిమ పదసేవకే వేంకటేశా
సహనపు మదిలో, మెరపుల వలపే, వరునికి రజనీ కరే వేంకటేశా
అహమిది తిలకం, లిఖితము విధిగా, మరువని నయ విందులే వేంకటేశా
మహిమని మదనే, సుమధుర వదనే, పెదవుల సుఖ మాయలే వేంకటేశా
.ఎవరు ఎవరిని చెప్పలేను
ఏల ఏదని తప్పు చేయను
ఎంత పొందేద అంత చాలును
ఏమి చెప్పినా ఎదలో మాటను......
అనుకరణ మదీ, కులుకుల సొగసే, వినయపు ధరహాసమై వేంకటేశా
అణుకువ హృదయం, థలుకుల మెరుపే, మదనపు విధి వాంచలై వేంకటేశా
చినుకులు తడిపే, హృదయపు పొగరే, చితికియు మరబొమ్మ వై వేంకటేశా
వణుకులు మటు, మాయమగు సమరమే, జరిగియు మదనమ్ముయే వేంకటేశా
ఎవరు ఎవరిని చెప్పలేను
ఏల ఏదని తప్పు చేయను వేంకటేశా
ఎంత పొందేద అంత చాలును
ఏమి చెప్పినా ఎదలో మాటను వేంకటేశా
***
శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (3)
మరువగలేని యెండలివీ ,మనసున భాధ పెట్టెనివీ
మారణహోమము కాలమిదీ వేంకటేశా
నిరతము దైవసన్నిధిన,ముచ్చటజేసిరి క్షేత్రమందునా
నీమమువీడక దీక్షచేసితి వెంకటేశా
పలుకుల మయమై, పదనిస పరమై, పరువపు చెలి బంధమే వెంకటేశా
థలుకుల మెరుపై, థకదిమి వరుసై, సమయపు మది మిత్రమే వెంకటేశా
కులుకులు కథలై, సహనపు కలువై, కనికర మగు శాంతమే వెంకటేశా
అలకలు మెదిలే, అదనపు సుఖమై, అలసట కళ గంధమే వెంకటేశా
సరిగమ పలుకే, సమరము జరిపే, సహజము కథ బంధమే వెంకటేశా
పరుగుల పరువం, పలుకుల మురిపం, పదనిస వ్యధ చిత్రమే వెంకటేశా
దరువుల తపనే, తపనుల కథలే, తరమున సత్య మిత్రమే వెంకటేశా
కరువుల కలలే, కనికర వ్యధలే, కనుమయ విద్య సత్యమే వెంకటేశా
మరువగలేని యెండలివీ ,మనసున భాధ పెట్టెనివీ
మారణహోమము కాలమిదీ వేంకటేశా
నిరతము దైవసన్నిధిన,ముచ్చటజేసిరి క్షేత్రమందునా
నీమమువీడక దీక్షచేసితి వెంకటేశా
********
4
సదా, సర్వత్రా, సర్వథా పరమాత్మవి వేంకటేశా
అభేదభావ మనస్సుతో భజించ గలిగితి వేంకటేశా
జగమంత ఒక వింత చదరంగము...
పాడు విధియేమో కనరాని సుడిగుండము
బతుకంతయు ఒక నాటక రంగము
ప్రకృతి విధి యంత ఆడు విశ్వమయము
జగమంత ఒక వింత చదరంగము...
పాడు విధియేమో కనరాని సుడిగుండము వేంకటేశా
ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ
అలలాగా చెలరేగి పోవాలి...
నేననుకున్న గమ్యం చేరాలీ వేంకటేశా
ఆ లోతులు చూసీ రీతులు తెలిసి...
కలలాగా కరిగాక పోవాలి
నీదయ యున్న రాజ్యం చేరాలీ వేంకటేశా
జగమంత ఒక వింత చదరంగము...
పాడు విధియేమో కనరాని సుడిగుండము వేంకటేశా
నా కనులందు నిలిచిన దివ్యమూర్తివీ
నా గుండె గూటిలో నిలిచే ప్రేమ మూర్తివీ
నా మదిలో మెదిలే కావ్యానికి స్ఫూర్తివీ
నా అనురాగాలు ఆత్మీయత బంధానివీ
జగమంత ఒక వింత చదరంగము...
పాడు విధియేమో కనరాని సుడిగుండము వేంకటేశా
సదా, సర్వత్రా, సర్వథా పరమాత్మవి వేంకటేశా
అభేదభావ మనస్సుతో భజించ గలిగితి వేంకటేశా
*****
వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (5)
మాటకు మతికి అందని మర్మం
కష్ట నష్టాల జీవితంలో ఖర్మం.... వేంకటేశా
పుణ్య పాపాల మానవుల వైనం
నీవే ఆత్మ పరతత్వం పరబ్రహ్మం....వేంకటేశా
మనిషీ యనురాగము జోలు -
మతిలేకయు చిక్కిన పట్లు
కలమాయను రోగము జోలు -
గతిలేకయు చిక్కిన పట్లు.... వెంకటేశా
కుల మంతయు గోలను చేసి -
కను మాయకు చిక్కుట కెట్లు
విధి బోధయు అంతయు తెల్పి -
తనువంతయు చిక్కుట కెట్లు... వేంకటేశా
మది మాయను వేలము వేసి -
మది తప్పియు శీలముతూట్లు
విధి లేకయు గాలము వేసి -
కల కాలము రోగము పోట్లు.. వేంకటేశా
చిరు దీపము చీకటి చీల్చె -
చిరు నవ్వులు మాయకు తూట్లు
శిఖ పింఛము అందము పెంచె -
శిఖ పట్టులు తన్నుల పోట్లు....వేంకటేశా
మాటకు మతికి అందని మర్మం
కష్ట నష్టాల జీవితంలో ఖర్మం
పుణ్య పాపాల మానవుల వైనం
నీవే ఆత్మ పరతత్వం పరబ్రహ్మం
****
మల్లప్రగడ రామకృష్ణ (6)
ఎంత ధ్యానం చేస్తామో... వెంకటేశా
అంతా ఆధ్యాత్మికతయె... వేంకటేశా
శరీరంలోనే ఉంటాము....వేంకటేశా
స్పృహతో జీవించ లేము.. వేంకటేశా
*ఆత్మ స్పృహతో* జీవిస్తాం... వేంకటేశా
కలమాయలు కాలము గాను
సహనమ్మగు శాపము యెట్లు
వల కాయము వాకిలి గాను
ప్రహసమ్మగు పాపము యెట్లు.. వెంకటేశా
శిల బత్కున మోహము గాను
యహమేవిధి దాహము యెట్లు
తల యున్నను తాపము గాను
కథయే మది దోషము యెట్లు... వేంకటేశా
గురు సేవయు చేసిన మంచి -
గురు పాదము పట్టిన పాట్లు
గురు పత్నిని కోరిన విద్య -
గురు పత్నిని తిట్టిన పోట్లు.. వేంకటేశా
గిరిగీచుక కూర్చొనఁ బోకు - -
సరి లేరని నాకెవరని తిట్లు
మరి యాదగ నుండుట మేలు -
ధరనెచ్చట నున్నను పాట్లు... వెంకటేశా
సమభావము పెంచిన మంచి -
సమ యోచన తెల్పినపట్లు
సమరాగము పల్కిన మంచి -
సమ సేవలు చేసిన పట్లు... వేంకటేశా
ఎంత ధ్యానం చేస్తామో... వెంకటేశా
అంతా ఆధ్యాత్మికతయె... వేంకటేశా
శరీరంలోనే ఉంటాము....వేంకటేశా
స్పృహతో జీవించ లేము.. వేంకటేశా
*ఆత్మ స్పృహతో* జీవిస్తాం... వేంకటేశా
*******
వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (7)
ఏమని నిను గొల్తు, ఏ రీతిగా నిను గొల్తు
రమ్మని పిలిచి నిను గొల్తు, రారమ్మని పిలిచి నిను గొల్తు వేంకటేశా
మమపాలింపమని నిను గొల్తు, మాధుర్యము నందించమని గొల్తు
భావ భవ బంధాల విముక్తి కోరుతూ నిను నిత్యమ్ము గొల్తు వెంకటేశా
గుళ్ళు గోపురాలు గొప్పగా తిరుగుచు నిను చేరా
జనుల బాధ పెట్టు జాతి ద్రోహుళ నరికట్టాలని నిను కోరా
గూడెమందు తిరుగు గుంట నక్కలను మట్టు పెట్టాలని కోరా వేంకటేశా
నీచుడని తెలిసియు నేత నెంచ ప్రజల మూర్ఖత్వాన్ని మార్చ కోరా
జాతి ద్రోహదుర్మార్గులను యంతము చేయాలని నిను కోరా ప్రజాస్వామ్యమందున సిరులె ముఖ్యమన్నా వారి బుద్ధి మార్చమని చేరా వేంకటేశా
అమ్మలుగన్న అమ్మలతో మీ చూపులు చాలు వేంకటేశా
స్త్రీల మాంగల్య కట్టు బొట్టు చాలు - దుష్టులను మార్చటానికి
స్త్రీల నిస్వార్థం చూపులు చాలు - స్వార్ధం బయటబడటానికి
కర్షక కార్మిక స్వేదం చాలు - మానవుల ను బ్రతి కించ టానికి
ప్రేమ మమత సమత ఉంటె జాలు - జీవితం సుఖమవ్వటానికి
అయినా వేంకటేశా
ఏమని నిను గొల్తు, ఏ రీతిగా నిను గొల్తు
రమ్మని పిలిచి నిను గొల్తు, రారమ్మని పిలిచి నిను గొల్తు వేంకటేశా
మమపాలింపమని నిను గొల్తు, మాధుర్యము నందించమని గొల్తు
భావ భవ బంధాల విముక్తి కోరుతూ నిను నిత్యమ్ము నిను గొల్తు వెంకటేశా
గోవిందా.. గోవిందా... గోవిందా
****
వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (8)
కాలము మారదు, మా ఊహల తీరవు,
ప్రేమే - గాలమై మన మధ్య ఆశల దాహమ్ గా
నిను నమ్మి చేరితి వేంకటేశా...
మూలమై మా కూడిక దేహమ్ - జ్వాలయై మా దేహపు ధైర్యమ్, మౌనమే మా ధ్యాన మార్గమ్ముగా నిన్ను చేరి కొల్తు వేంకటేశా...... 2
నిత్యమూ సుమ నాదము నిండగా వేద పఠన మేగా నీదరీ
తత్వమూ సుఖ ధామము ధన్యతా విధి సేవలు యేగా చేరితి నీదరి వేంకటేశా....
సత్యమూ నిజ సాహస సాధనా నైజము యేగా నీదరీ
పైత్యమూ మా పైకము, మా మైకమూ, మా దాహము యేగా నీదరి చేరితి వేంకటేశా...
ధ్యానమే సుఖదా వరదానమే, తత్వమే విధిగా సుఖదానమే నీ దరీ చేరితి
మౌనమే సుఖమార్గ పయనమై, మోక్షమే నిత్య మార్గమై నీదరి చేరితి వేంకటేశా......
దానమే నిజధర్మ వినయమే , మానమే విధి కర్మ సమయమే నీదరీ చేరితి
గానమే జతగమ్య తరుణమే, ప్రాణమే విధి మర్మ శరణమే నీదరి చేరితి వేంకటేశా...
కాలము మారదు, మా ఊహల తీరవు,
ప్రేమే - గాలమై మన మధ్య ఆశల దాహమ్ గా నిను నమ్మి చేరితి వేంకటేశా...
మూలమై మా కూడిక దేహమ్ - జ్వాలయై మా దేహపు ధైర్యమ్, మౌనమే మా ధ్యాన మార్గమ్ముగా నిన్ను చేరి కొల్తు వేంకటేశా
***
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (9)
చిత్తశుద్ధిగా నీకు సేవ జే సేదా
జన్మ పావనత కై స్మరణ జే సేదా
ముక్తి కోసమే నేను మ్రొక్కి వే డదా
నిన్ను పొగడగ విద్య నీ దయ కదా వేంకటేశా
అఖిల భోగ భాగ్యంబులు కోరను, గుండెలు పల్కరింపుగా విద్య చాలును
పుడమిలో జనుల మెప్పుకోరను, సజ్జనుల సాంగత్యము కోరెదను
సరివారిలో బ్రతిష్టలు కోరను, అందరి హితముగా నిన్ను కోరె దను
పారమార్థికమునకు నేను పాటుబడెదను, సహన ధైర్యమే అందరికీ పంచమని కోరెధను వేంకటేశా
చిత్తశుద్ధిగా నీకు సేవ జే సేదా
జన్మ పావనత కై స్మరణ జే సేదా
ముక్తి కోసమే నేను మ్రొక్కి వే డదా
నిన్ను పొగడగ విద్య నీ దయ కదా వేంకటేశా
బాధ నమ్మలేను బలవంతులైనను,బ్రతుకునందు నొక్క మారి మ్రొక్కెదను
శాంతిని కొనలేను శక్తిమంతునై యున్నను నిన్ను వేడుకొందును
కాలము ఎదురీదలేను, కలియుగంలో బతకి బతికించలేను
చిత్త సృష్టి యదియు నీపైనను నిలకడ నుంచు భాద్యత నీదేను వేంకటేశా
చిత్తశుద్ధిగా నీకు సేవ జే సేదా
జన్మ పావనత కై స్మరణ జే సేదా
ముక్తి కోసమే నేను మ్రొక్కి వే డదా
నిన్ను పొగడగ విద్య నీ దయ కదా వేంకటేశా
గోవిందా... గోవిందా... గోవిందా
***
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (10)
ఏమేమి చెప్పేది, యేలా చెప్పేది, కలియుగ తీరు
యీ లోకంలో మనుజ తీరు మార్చవయ్య వేంకటేశా
ఆశ చేత మనుజ లాయువు కలవారు
భ్రమల చేత బ్రష్టు బట్టి తిరుగు వారు
మురికి కూపమందు ముసురు నీగల తీరు
మనసు మార్చ లేని బ్రతుకు యీదెడి వారు వెంకటేశా
బంధువులు లేని తావున నిలిచేవారు
మచ్చికలేని తావునా నిలిచేవారు
అనుమానమైన తావును నిలిచేవారు
అంటు రోగమున్నా లెక్కచేయక తిరిగేవారు వేంకటేశా
కనుమా మానుము మౌనము వీడుమా
కనుమా మాబాధలనిక కారుణ్యముతో వేంకటేశా
వినవయ్యా మా వినతులు నీ విప్పుడు
మనమున నిన్నే కొలుతుము మహిలో వేంకటేశా
విప్పాల్సిన చోట విప్పక, కప్పాల్సిన చోట కప్పక
సాటి ఆడది సిగ్గు లేక తిరగ,వస్త్రాలంకరణ ఏమిటి వేంకటేశా
సిగ్గు చెప్పే తల్లి లేదా!?బుద్ధి చెప్పే తండ్రి లేడా!?
మంచి,చెడు చెప్పే తోబుట్టువులు లేరా!?స్నేహితులు,బంధువులు లేరా!?
అరిచే మహిళా సంఘసంస్కర్తలు లేరా!? వేంకటేశా
పుడమి పైన నడుచు, పూజ్యులు స్త్రీలుయే
పుణికి పుచ్చు కొనియు, పుణ్య గుణము, వేంకటేశా
ప్రాణ దాన మొసగు జ్ఞానులు, ధన్యులు, స్త్రీలుయే
నిత్యమూ మారు రూపులాప్తు లీలలుగా వేంకటేశా
నీకైతే
శేషుడు పవణము భక్షంచి బ్రతుకుచుండు
ఖగరాజు పాములు భక్షించి బ్రతుకుచుండు
లక్ష్మీ దేవి పెరంటాలకుపోయి బ్రతుకుచుండు
నీవైతే భక్తుల ప్రసాదాలు తిని బ్రతుకుచుండు
మరి మానవుల గతి ఏమిటి వేంకటేశా
మణుజుని మనస్సు శాంత పర్చు వేంకటేశా
ఏమేమి చెప్పేది, యేలా చెప్పేది, కలియుగ తీరు
యీ లోకంలో మనుజ తీరు మార్చవయ్య వేంకటేశా
****
శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (11)
ప్రతిరేయి తొలిరేయి శ్రీదేవిని, భూదేవిని
సంతసింప చేయు శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
అందమైన సుఖభోగాలందించి,
కులుకుల భామిని, కోమలిని ముచ్చటించి,
జనులకు క్షేమాన్ని చూసేటి... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
అలకైన అలివేణిని ముచ్చటించి, ఒగలైన లతాంగిని మురిపంలో ముంచి, జనుల హృదయాలలో స్థిర స్థానాన్ని
పొందావు.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
వీక్షిత మృగాక్షి సౌందర్యానికి లొంగి,
పలుకైన నీలవేణి కలలు తీర్చి,
జనుల మనస్సు శాంతి పర్చెడి.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
చక్కని రమణి తొ సల్లపాలు జరిపి,
నగువైన తరుణిని తరింపజేసి,
మ్రొక్కిన వారికి మొక్షాన్నిచ్చే.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
సకల చరాచరసృష్టికి ఆదిపరాశక్తి అంసలైన
శ్రీదేవి, భూదేవి, భాగ్యమే
స్త్రీ జన్మ సుదతుల సంసార యోగ్యత కల్పించే,
బ్రహ్మ వరముగా సమస్త లోకాలు పాలించే.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశా
గోవిందా.. గోవిందా.. గోవిందా
****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (12)
సాక్షత్తు శ్రీదేవి, భూదేవితొ చతురత సంభాషణలా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర లీల
కలలు రేపగనేల కలువల గుండి !
కళలు సృష్టించ కథలుగా నుండి!
పూబాల మనసున పూజ్యము పంచు !
కోపాలు చూపకే కోలాట యాట.....వేంకటేశా!!
పలకవే నిలపవే పదనిస జాన !
చిలుకవై పాడవే చిన్మయ జాన!
శాంతిని కూర్చియు ప్రేమను పంచు !
బ్రాంతిని మాపియు బంధము పెంచు.....వేంకటేశా!!
కళలు చూపగనేల కర్తవ్య మిపుడు !
ప్రళయమేలేదులే ప్రభలుగా యిపుడు!
పూబంతి యనుచునే వత్తుట వలదు !
శాపంబు మనమధ్య శత్రుత్వ మొలదు....వేంకటేశా "!!
కలవవే మమతగా కమనీయ మెంచి !
పలుకవే సుఖముగా పదనిస నెంచి
కాంతిని హాయిగా కానుక గాను !
శాంతిని పంచుట సాహస మేను..... వేంకటేశా!!
వలపు పండుగవేళ తలపుల లేల !
కలసి సౌఖ్యముపొందు కథలుగా యేల!
ఓహీల తనువుకు వోర్పును జూప
సహితము ప్రేమయే సహనము జూప.....వేంకటేశా!!
తనువుయే తపముగా తరుణికి వలదు !
కనుల నే మూసినా కరువాయె నిదుర !
జాజుల నవ్వులా జాబిలి తాను !
గాజుల సవ్వడి నాకలి తోను.... వేంకటేశా!!
***-
శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (13)
నీకు దాసుండు నంటి.. నిన్ను నమ్ము కొని యుంటి..... వేంకటేశా
నీకు నిత్య పూజ...నిన్ను కోరి సేవ నంటి.... వేంకటేశా
ఆశా పాశాలను వదల లేక పోయినా
గోప్యంగా కాలాన్ని వెల్ల బుచ్చుతున్నా ,,,, వేంకటేశా.. 2
మంచి చెడును గమనించ లేక పోయినా
గోరంత దీపాన్మి వెలిగిస్తూ జీవిస్తున్నా ,,,, వేంకటేశా..2
పుణ్య పాపములు ఎన్నో చేసియుండినా
గోగంధనముకు చిక్కి విలవిల్లాడుతున్నా ,,,, వేంకటేశా.. 2
సుఖదుఃఖాలు నన్ను వెంబడించి యుండినా
గోచారమని భావించి గోవిందా అని అంటున్నా ,,,, వేంకటేశా..2
ఆకలి దప్పులతో అలమటించి యుండినా
గోత్రము చెప్పకనే ధర్మాన్ని అనుసరిస్తున్నా ,,,, వేంకటేశా...2
సుడిగుండాలు లోకి జీవితం జారి పడినా
గోరగింత ఆవహించినా గోవిందా అని అంటున్నా ,,,, వేంకటేశా 2
అన్నాతమ్ముడు ఆదరించ లేక పోయినా
గోసర్గము నా హృదయం తో ప్రార్ధిస్తున్నా ,,,, వేంకటేశా...2
అక్కాచెల్లెళ్ళ పల్కు అనేది లేక పోయినా
గోశీర్షము పులిమి గోవిందా అని అంటున్నా ,,,, వేంకటేశా....2
నీకు దాసుండు నంటి నిన్ను నమ్ము కొని యుంటి... వేంకటేశా
నీకు నిత్య పూజ నిన్ను కోరి సేవ నంటి ... వేంకటేశా
గోవిందా... గోవిందా.. గోవిందా
*****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (14)
గురువు శిష్యులతో దైవాన్ని గూర్చి తెలపడం
దేవునితో ఐక్యతకు వెళ్దాం
ఆత్మపరిశీలన చేసుకుందాం
నిత్యానందంగా జీవిద్దాం
కాలాన్ని బట్టి దైవాన్ని పూజిద్దాం
మా తప్పుడు ఆలోచన మరిచితి
మా జ్ఞానం తొ సమస్యల పరిష్కృతి
మా నిస్వార్థముగా బ్రతుకులో ప్రగతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
మా ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య ప్రగతి
మా వ్యక్తిత్వం లో యహంకారం యధోగతి
మా అనంత ఆనందానికి శ్రీమతియే గతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
మా ఉన్నత చైతన్యానికి కర్తవ్య స్థితి
మా విద్యలను బోధ చేసే పరిస్థితి
మా నమ్మకమే ఎప్పటికీ విశ్రాంతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
మా ఆశీర్వాదాలకు విలువ పరిమితి
మా చుట్టూ ఉన్న దైవత్వమే మనోగతి
మా సత్యాన్ని యథాతథంగా శరణాగతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
మా మనస్సును ఉన్నతంగా ఉంచే స్థితి
మా మాయ తొలగాలంటే దైవాన్ని ప్రార్ధనగతి
మా దృష్టికి సరిపోయే జీవన శైలిగా మతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
మా దైవత్వానికి ప్రాధాన్యతయే శాంతి
మా మంచిగా ఉండటమే ప్రతిఫలం బ్రాంతి
మా హక్కును ఎంచుకోవడం శక్తికి దుర్గతి
మా శ్రేయస్సుకు ఏకైక మార్గం మీ స్మరణ వేంకటేశా
దేవునితో ఐక్యతకు వెళ్దాం
ఆత్మపరిశీలన చేసుకుందాం
నిత్యానందంగా జీవిద్దాం
కాలాన్ని బట్టి దైవాన్ని పూజిద్దాం
గోవిందా... గోవిందా... గోవిందా
ॐ తత్సత్
******
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (15)
మార్గదర్శన మగు మధుర కావ్యములీల
మనసు కనులతోడ, మానవులకు
అరయు చుండి సతము యావత్ప్రపంచంబు
తరుణ లీల గనుము తత్వ మందు
అమరిక ప్రేమ మనది ఆనంద నిలయమునా యుండెదమా
సమరముయేల మనమధ్య సఖ్యత లయలుగా నుండేదమా
బ్రమలనువీడి నిజానిజాలు నిత్యము పంచుకొని జీవించెదమా
విమల చరితుడవై మా వేదన మాన్పగ వేగిరరమ్ము వేంకటేశా
సతతము మేము నిను వీడి మన లేము నీదు ప్రేమకు చిక్కి నీ
కతలను చెప్పు కొనుచు నీదు చేష్టలను గుర్తు చేసుకొనుచు మా
వెతలను గమనించక, వోదార్చక, సుఖముగా నుండేదవో మా
మతి గతి అన్నియు నీవే గుణశీల తిరుమల తిరుపతి వేంకటేశా
కలలు కంటి మా కనులు మూసిన తెరిచిన మీ రూపమే
వలపులు కు సంబంధించినది కదా మరువని మీ దేహమే
లలనలను బాధపెట్టుటయు లాలించుటయు మీ దాహమే
జలజల రాలే బాష్పములను కనులతో కనలేవా వెంకటేశా
వాదనలేల మానుమిక,వాస్తవ మన్నది మీకు తెల్సులే
ఖేదమదేలమీ కికను, గెల్వగ నాగతి మానసమ్ములే
కాదనలేక మీ మనసు కానుక నాకుయె మల్లె పూలులే
మాదయ యంతమీకొరకు మాస్థితి నాట్యము వేంకటేశ్వరా
గోవిందా... గోవిందా... గోవిందా
******
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (16)
కలత వరద వెన్నుతడు తుంటే తెలప
పలుకు వరద నన్ను వల దంటే తెలప
కంటిచెమ్మ చెలమ మనుతుంటే తెలప
ఇంటి లోగతి తిడుతుంటే తెలప వేంకటేశ్వరా
కూడులేక కమిలి పోతుంటే తెలప
మాడు మోదెడివాడు మడి యంటే తెలప
కడుపు కరకరగా యవుతుంటే తెలప
గడుసు పిండమని నసుగు తుంటే తెలప వేంకటేశ్వరా
కలువ విలువ వెక్కిరిస్తుంటే తెలుప
సలప రింతలవల్ల బాధంటే తెలుప
కోరిక కత్తులై కోస్తుంటే తెలప
తీరిక బ్రతుకునా శిక్ష్యంటే తెలుప వేంకటేశ్వరా
కారపు మమకార మౌతుంటే తెలప
హారతి బ్రతుకుగా మీవేంటే తెలప
కందిన కన్నుల మాటంటే తెలుప
చిందిన జీవిత కథంటే తెలప వేంకటేశ్వరా
తాళియె ఎగతాళి చేస్తుంటే తెలప
మాలిగా నీవెంట నేనుంటే తెలప
కర్షక మొరలుగా పెడుతుంటే తెలప
శీర్షిక కథలు గా కలయంటే తెలప వేంకటేశ్వరా
కలవాడి యాసతీర్చుతు యుంటే తెలప
కులనాడి గోత్రమే పోతుంటే తెలప
కడలి లో కన్నీరు కులుకుంటే తెలప
వడలి పువ్వగువేళ ప్రేమంటే తెలప వేంకటేశ్వరా
మందగ తెల్లవార్లు కథ మానస హింసయు వేంకటేశ్వరా
బృందముగానుభీతిగను బాధలు పెట్టెను వేంకటేశ్వరా
వందలు వేలుగా జనుల, వాంఛలు తీర్చెను వేంకటేశ్వరా
నిందల లెక్కబెట్టకను నీతినినమ్మితి వేంకటేశ్వరా
(దత్త పది: నింద వంద బృంద, మంద!)
గోవిందా... గోవిందా... గోవిందా
****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (17)
తిరుమల తిరుపతి వేంకటేశా -
హృదయాన్ని దోచే శోభితరూపా ।
మా భవబంధాలను ముబాపగరావా l
కల్మషంబులను బారద్రోలగ రావా
ఏమారకమిముభజియింతూనామానసబాధలుబాపు
॥శ్రీ శ్రీశ్రీ వెంకటేశ్వరా ॥........2సార్ల
ఊహలతో ఊపిరిపోసి - దేహము కూ దప్పికతీర్చి
ఆశలతో ఆకలితీర్చి - మాటలతో మంచినిచెప్పి
మనసునే దోచావు దేవ --శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా
స్వేదముతో సేవలు చేసి - దీపముతో వెల్గునుపంచి
భావముతో భయ్యముతుంచి - బాధ్యతతో భద్రతపెంచి
మనసునే దోచావు దేవ - శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా
కానుకతో ఏడ్పును తుంచి - గానముతో గాయము మాన్పి
రాగముతో రోగము మాన్పి - మాటలతో మోసముచేసి
మనసునే దోచావు దేవ -శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా
నవ్వులతో హాస్యముపంచి - చిందులతో చింతనుతుంచి
పల్కులతో ప్రేమనుపంచి - వేదముతో ఆశలు పెంచె
మనసునే దోచావు దేవ - శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరా
కోరిభజింతుము నిత్యమూ మోక్షమార్గమును-ముదముగఁజూపవా సత్యమూ
భౌతికసుఖములవీడీహరివాసముగోరితిస్వామీ
ఏరికోరి మీపాదమునమ్మితి చేరితి ..శ్రీ
శ్రీ శ్రీ వెంకటేశ్వరా
గోవిందా... గోవిందా... గోవిందా
--(())--
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (18)
కలిసి నడిచిన కలంతోను, కలలు కంటి నాను దేవా
కర్పూర వెలుగుల వాసన, హృదయ మందు చిక్కె దేవా
కొలువు దీర్చిన విద్య పిలుపులు, కళల మనసునిచ్చు దేవా
కలము సాక్షిగ రెక్కలుకదిలె, కాళ్లకు చిక్క కుండె వేంకటేశా
ఆగ్రహం మనసు ను మధించు, ఉగ్ర రూప మవ్వు దేవా
నిగ్రహం మనసు ను రక్షించు,.స్వర్గ సీమ నైన దేవా
పరికించి పరవశించు లతల్లొ,.సిరుల లక్ష్మి నుండు దేవా
పరిమళం పారవశ్యం ముగా, పరిపరి విధములుగ వేంకటేశా
పరితోషమును పొంది శాంతించి, కరుణ చూపి కదుల దేవా
పరమాత్ముని తలచి జీవించు, విరిసిన లత వలెను దేవా
యవనిలో ఆశలుండుటయేను, అవసరమ్ము యేను దేవా
అత్యాశలు పనికి రావులే, నిత్య సత్య పలుకు వేంకటేశా
దేశభక్తి ఘనము నరులకు, పాశ మవ్వు చుండు దేవా
భాషలందు తెలుగు వెలుగులు , వేష భాష లందుదేవా
మట్టి మనిషి ఆకశమ్మునా, గట్టి పలుకు లాగ దేవా
కొనగోట మీటిన జీవిత౦, కనుమరుగున పడెను వేంకటేశా
భూగోళపు మనిషిగా నీవు, భగ్గు మనక ఉన్న దేవా
నింగి నేలను నిండిఉన్నావు, ఒగ్గి అగ్గి లాగ దేవా
నీ జన్మ దినమున మాకల నిజము తెల్పు చున్న దేవా
అక్షరాంజలులతో అర్పణ, శిక్షనిచ్చు దేవ వేంకటేశా
ప్రాంజలి ఘటియించి తెల్పితి, సృజన పలుకు లన్ని వేంకటేశా
తెలుగుతనముకు అద్దముగను, తలచు చున్న కవిని వేంకటేశా
--(())__
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (19)
భార్య సంతాన బాధ్యత బంధమగుట
వ్యథలు దేనికి వ్యాపక విద్య యగు ట
శాంతి సౌఖ్యము పొందుటే సమయ ముగుట
శ్వాస నున్నంతవరకునే సాధ్య మగుట వేంకటేశ్వరా
పండు టాకులు రాలుట పలక రింపు
వయసు యుడికినాక పలుకు వరుస కలుపు
జవ్వనాల పొంగులు తగ్గ జపము తలువు
స్థిరము కానిదానికొరకు స్థితియు మలుపు వేంకటేశ్వరా
నిత్య సంయోగము వియోగ నీడ బ్రతుకు
కెరటములు మాదిరే జీవ కినుకు బ్రతుకు
లేమి తొలగించుటకు వీలు లేని బతుకు
ఏది దాంపత్య సంపద యేల బతుకు వేంకటేశ్వరా
ఈ ఋణానుబంధముజన్మ మిష్ట మవుట
కర్మ బంధజీవ గమన కాలమగుట
జనన మరణాల ధర్మము జాతరగుట
జీవి సుఖదుఃఖ సంసార జీర యగుట వేంకటేశ్వరా
కోరికవలన జన్మించి కోరి కరిగి
స్వార్ధగుణముకు చిక్కియు సాగుమరిగి
రక్త సంభంధముల పైన రక్ష తరిగి
సాల్యమై జవగమనమై సాక్షి కొరిగి వేంకటేశ్వరా
కన్ను చూపుయు కనలేని కన్నుకన్ను
మిన్ను మన్ను చెలిమి సుఖ మిన్ను మన్ను
తన్ను కున్న మనసు కన్ను తన్ను తన్ను
నిన్ను మరియు నిన్నును నిన్ను నిన్ను నిన్ను వేంకటేశ్వరా
*****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా ప్రార్ధనా మాలిక
మల్లాప్రగడ రామకృష్ణ (20)
మొదలు శ్రీరామ శ్రీకార మేలు కొలుపు
నిత్య సంస్కార గౌరవo నియమ మలుపు
మనిషి మమకార ప్రేమ లో మౌన మెరుపు
పలకరించే నమస్కార పలుకు తలపు వేంకటేశ్వరా
పదవి తో వచ్చు యధికార పాఠ్య మగుచు
అనధికారపు సంపద ఆప దనుచు
రమ్య వేళలోన వెటకారమ్ము వగుచు
భయము చేయుహాహాకారము బాధ్య తనుచు వేంకటేశ్వరా
బహుమతిలొ పురస్కారపు బలుపు తెలుపు
పదవి ఎదిరించ ధిక్కార పాలు నలుపు
వద్దని తిరస్కారపుయహం వలపు పులుపు
లెక్క లో గుణకారము లేత పిలుపు వేంకటేశ్వరా
విధి గుణింతమ్ము నుడికార విలువ గరకు
విధి యహంకార పిలుపులే విద్య బెరుకు
విధి పరిష్కార మలుపులే విద్య పలుకు
విధి ప్రయోగ యవిష్కార వినయ థలుకు వేంకటేశ్వరా
సంధు లోన యాకారము సంధి కొచ్చె
సమర సాయము సహకార సంత కొచ్చె
స్రీలకు యలంకార సొగసు శీఘ్ర మెచ్చె
మేలు మమకార యుపకార మోక్ష మొచ్చె వేంకటేశ్వరా
కీడు చేయుటే యపకార కీలక మగు
శివుని ఓంకార నాదమే చెలిమి మెరుగు
విష్ణువు కళ శాంతాకార విద్య చెరుగు
ఏనుగు ఘీంకార శబ్దము ఎరుక కలుగు వేంకటేశ్వరా
మదము తోను హూంకారము మచ్చ తెచ్చు
నిత్య పైత్యముయె వికార నీడ జొచ్చు
నిత్య యాకార శాంతియు నిలక డిచ్చు
ఇంటి చుట్టూను ప్రాకార యిష్ట మిచ్చు వేంకటేశ్వరా
ఒప్పుయన్న యంగీకార ఓర్పు గెలుపు
మనిషి చీత్కార భయముయే మచ్చ మలువు
పగ ప్రతీకార యాలోచనమతి నలుపు
అందరికి నమస్కారము ఆశయమ్ము వేంకటేశ్వరా
****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ ప్రార్ధన మాలిక (21)
మల్లాప్రగడ రామకృష్ణ
నీతొ శ్రీదేవి భూదేవి నిత్య చెలిమి
ధనము వడ్డీగ పంచెడి ధరణి చెలిమి
ధాత ధన మంత దానము ధర్మ చెలిమి
వేల్ల తొ చెలిమి నిత్యము వేంకటేశ
భక్తులే యిచ్చు నీలాలు బంధ చెలిమి
కానుకల కావ్య రచనలు కాల చెలిమి
మ్రొక్కు లనుపొంది తీర్చెడి మోక్ష చెలిమి
వేకువసుప్రభాతము నిత్య వేంకటేశ
చెలియ లేని బతుకు చూడ చెలిమి లేమి
కలుములమ్మ వీడ మనసు కలవరమవ
ఉండగలడా సిరిపతియు నొంటరిగను
పిచ్చి వాడై వై కుంఠ ము వీడి ధరణి
చేరె సిరినివెతుకగను వేంకటేశ
చెలిమికి వయసేది తెలుప చింత వలదు
చెలిమి యంతస్తు చూడదు చేరువగుట
చెలిమి అర్ధ యర్ధాంగియె చిలిపి మాయ
చెలిమి అర్థము చుట్టునె తిరుగు చుండు.... వేంకటేశ
చెలిమి కి మనసున్ననుచాలు చింత తొలగు
చెలిమికే యర్ధ భాగము చెలి మనసుయె
చెలిమి సుఖదుఃఖ తోడగు చిత్త మందు
చెలిమి బ్రతికియె బ్రతికించు చిరునగవులె..... వేంకటేశ
జీవితంలో చెలిమి తోను జీవ యాత్ర
భావ భావ బంధ చెలిమి బాధ మార్చు
ఎవరు యన్న చెలిమి మిన్న యదను తట్టు
భాగ్య పరమైన చెలిమియే భవ్య తీర్పు.... వేంకటేశ
చదువులొ చెలిమి సరిదిద్ధి చక్క బరచె
పుస్తకచెలిమి పూర్ణమై పూజ్య మగుటె
తెలుప తప్పొప్పుల చెలిమి తీర్పు బలిమి
తగువుల చెలిమి వలదులే తప్పు యదియె..... వేంకటేశ
*****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక (22)
ప్రణయ సాగరమే మది పలుకు నాంది
వలపుల తలపులు తెలుపా వరుస నాంది
మెరుపుల సొగసుల కళలు మోయు నాంది
మనుసు మమతలు పంచవా మోహ నాంగి
ఓ శ్రీదేవి, ఓభూదేవి మీ మనసు నాదికా
గంధ చందనం పూసెద గాలమిది యు
మేఘశ్యామ రూప తులసి మాల యిదియు
వేష శిఖ పింఛమౌళిగా వినయ తీరు
గొప్ప కదళీఫలములను గ్రోలె దేవ
ఓ శ్రీదేవి, ఓభూదేవి మీ మనసు నాదికా
రాత్రి వెంట వెలుతురులా రమ్య పరచు
లేమి వెంటను కలిమియె లేత వలపు
కష్టమున వెంటసుఖముయె కాలమలుపు
వచ్చు మనిషికి నీడలె సమయ గెలుపు
ఓ శ్రీదేవి, ఓభూదేవి మీ మనసు నాదికా
మదన కదనకుతూహల మనసు కొరకు
మనసు రంజింపచేయుట మనుగడ లకు
మనసు నాదిక మీసొంత మేను కళలు
మీకు నవనీతమునుతెచ్చి మీకు పంచ
ఓ శ్రీదేవి, ఓభూదేవి మీ మనసు నాదికా
మూగ మనసుతో కోరుతూ ముఖ్య మగును
మౌన గీతముపాడుతూ మౌఖ్య మందు
నుదుటి రాతలు గురించి సూత్ర మగును
ప్రేమ పంచుతున్నాములే ప్రీతి కొరకు
ఓ శ్రీదేవి, ఓభూదేవి మీ మనసు నాదికా
గోవిందా.. గోవిందా.. గోవిందా
****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక (23)
మల్లాప్రగడ రామకృష్ణ
సద్దుమణుంగు వేళయది
చక్కని లీలలు జూప గల్గుటే!!
పెద్దరికంబు నిల్పుకొని
ప్రేమగ వచ్చియు నిన్ను కొల్చుటే!!
ముద్దఱ వేయు మా మనసు
ముఖ్యము నీకృప యేను తెల్పుటే!!
ప్రొద్దటి పూటనన్ములను
బూన్చెను చర్చలు వేంకటేశ్వరా
తిరుమల కొండపైవెలసె,
తీరని కోర్కెలు దీర్చు దైవమే!!
తరుణము తృప్తి పర్చెవిధి
తప్పులు దిద్దెడి దివ్య తేజమే!!
పరిధిని దాటనివ్వకయె
పాఠము నేర్పెడి సర్వవిశ్వమే!!
సరిగమపల్కు సుస్వరము
సాధ్యము పంచెడి వేంకటేశ్వరా
సరగున వచ్చి చేరితిని,
సప్తగిరుల్విడనాడబోనురా!!
కరుణను జూపు మాకళకు
కార్యము నీదయ కాల మాయరా!!
స్వరములు పల్కితీ కరుణ
శాంతియు నిల్పుము సేవ ముందరా!!
పరిపరి సేవలే తమకు
పేర్చియు చేసితి వేంకటేశ్వరా!!
పరువును నిల్పు చాలునిక,
పావనమూర్తివినన్ను బ్రోవరా!!
జరజర జారు కోర్కెలవి
జాడ్యము మార్చుయు మమ్ము జూడరా!!
మురహర నీకృపారసము,
ముచ్చటదీర్చును దాహ తృప్తిరా
నరహర భాగ్య దేవర
మనో మయ మందిర వేంకటేశ్వరా
****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక (24)
మల్లాప్రగడ రామకృష్ణ
ఏమని చెప్పెదా కథలు
యేకము చేయని విద్య నాదిగా!!
ఆమని మాటలే కళలు
ఆశయ మయ్యెను యేల పొందుగా!!
కామిని కావ్య భావమధి
కాల వివర్ణము కల్సి రాదుగా!!
నామది నిన్ను కోరెద
వినమ్రము గానులె వేంకటేశ్వరా!!
కెవ్వని కేక దప్ప యిక
కిమ్మన కుండుట నాదు జన్మగా!!
సవ్వడి చేసినా కనని
సాధక బుద్దియు నాది కర్మగా!!
కవ్వముబట్టిచిల్క విధి
కావ్యము లేలని జీవ ప్రశ్నగా!!
జవ్వని చూపులే మనసు
జాతర దేనికీ వేంకటేశ్వరా!"
పెద్దల మాటలే మనసు
పెన్నిధి సన్నిధి గాను యుండురా!!
ప్రొద్దున పల్కులే హృదయ
పోరుగ పువ్వుయు శబ్ద మవ్వురా!!
సద్దుకు పోదమన్నను
విశాల మనస్సుయు నవ్వి యేడ్చురా!!
వద్దని చెప్పినా గుణవి
వాదము పెర్గెను వేంకటేశ్వరా!!
కాలము వేగ మార్గమగు
కాముని లీలలు వెంట నేర్పుగా
జ్వాలల బుద్ధియే పెరిగి
జాడ్యము సర్వ మయమ్ము తీర్పుగా
చాలని దేది లేదియు సు
చంద్రకళేయగు సాధ్య మార్పుగా
మాలిక మాదిరే బ్రతుకు
మానస వీణగ వేంకటేశ్వరా
****-
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక (25)
మల్లాప్రగడ రామకృష్ణ
చక్కని వాడవయ్యా
చిక్కులను తొలగించవయ్యా ......
నిక్కముగా తెల్పుతున్నామయ్యా
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి ......
ఏ గతిన బ్రోచెదవో మమ్ము
ఏ తీరున చూచెదవో మమ్ము
ఏ మాయ చేసెదవో మమ్ము
ఏ మన్న కొలిచెదము తండ్రి ....... చక్క
నమ్మి యుండి నిన్నే కొల్చెద
నమ్మకము వమ్ము చేయకయ్యా .....
కమ్ము కున్న బాధల్ని తొలగించి
చెమ్మకళ్ళను తుడవవయ్యా తండ్రి ... చక్క
నీదు పదసారస మేగతి
నీదు సమపూజల మేగతి
నీదు సమసేవల మేగతి
నీవు మా సమస్యలు తీర్చు తండ్రి ...
చక్కని వాడవయ్యా
చిక్కులను తొలగించవయ్యా ......
నిక్కముగా తెల్పుతున్నామయ్యా
మక్కువగా ప్రార్ధిస్తున్నమయ్యా తండ్రి ......
******
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక.. 26
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసు లోతు తెలుప సూత్ర మార్గ మేది
వయసు మార్పు తెలుపసూత్ర వాక్కు యేది
సొగసు పంచు మనసు సూత్ర సొమ్ము యేది
తపసు చేయు మగువ సూత్ర తత్వ మేది వేంకటేశ్వరా
నయన చుక్కల సూత్ర నాట్య మేది
మెరుపు వెల్గు పుడమి సూత్ర మేలు యేది
కలల అమ్మ మనుసు సూత్ర కావ్య మేది
కళల తండ్రి పలుకు సూత్ర కాల మేది వేంకటేశ్వరా
ఆత్మలకు రూప ము నిజమా ఆశ యేది
ప్రేమలో అర్ధము గనుమా ప్రీతి యేది
జీవనమున మోక్షంమ్మగు జీత మేది
శ్రమకు సాక్ష్యమ్ము లక్ష్యమ్ము శాంతి యేది వేంకటేశ్వరా
అడ్డ దారిలో అందలం ఆట యేది
విధిగ యపనింద యగచాట్లు వెన్న యేది
కర్మల కథలు కళలుగా కదలి కేది
కాల నిర్ణయముగనుయే కామ్య మేది వేంకటేశ్వరా
కలువ వెలుగు కాంచనముగా కాల మేది
నిజము నయనాల వెలుగులే నిర్మలమది
అంజలి ఘటించి తెలిపేద ఆశయనిధి
విజయ ప్రదమగుటయు విద్య విలువ మది వేంకటేశ్వరా
వయసు వార్ధక్యమనునది వ్యాధి యేది
నిత్య సంతస పలుకులే నిజము యేది
నిర్వి రామకృషి ఫలము నీడ యేది
సమయ సుఖదుఃఖ ధైర్యము సర్వ మేది వేంకటేశ్వరా
అమ్మ ఆరాట పోరాట అలక యేది
నాన్న పోరాట జీవితం నాంది యేది
స్నేహ వలయసూత్రము నకు సేతు వేది
వేణు గోపాల ప్రేమకు వేల్పులేవి వేంకటేశ్వరా
*****
శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర ప్రార్ధన మాలిక..27
మల్లాప్రగడ రామకృష్ణ
కాలు మోపిన గడ్డ భారమవ్వుటయేల
కన్న కడుపుకేను కష్టమే తెచ్చుట
కనులుగాంచగలుగు కాంతులన్నికలలు
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
కలలలో కదణమే కలసి పూజ్యామగుట
నీతొనెవ్వరుచెప్ప నిజముయే లేదులే
బ్రతుకుబాటన భ్రమ బరువుల బాధ్యత
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
దారిలో ముళ్ళు దండు దశలుగాను
దిశలన్ని చీకటి దీనబ్రతుకు కథ
బలము ధనము ఉండు భాగ్య మైన పలుకు
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
బీదబేధమనేల బెరుకులేని మనసు
పరుగు పర్వముగాను పడకయె పాశమై
గడ్డి పరకగాలి కదలిక జీవితం
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
వానలోన నిలిచి వాదన గానుండు
గగనమంటుకలలు గమ్యము గానుండు
గడనెత్త గర్వము గడ్డుకాలమగుట
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
నేర్పు పాఠముగనే నీడలు చుట్టునె
పోరుసల్పు పరుష పదజాల పలుకనె
పొగరుబోతుపలుకు పొగనుసెగనుపెట్టు
క్షణికమె కావచ్చు క్షమించు వేంకటేశ్వరా
*****
28..
నిన్ను మరిచేందుకు యేమేమి చేస్తున్నానో
తెలియదు వెంకటేశ్వరా
కాలాన్ని సమర్ధించలేను,
ప్రకృతిని విమర్శించలేను వేంకటేశ్వరా
మనిషి మనిషిగా గుర్తించలేని
సమాజంలో యుండలేను వేంకటేశ్వరా
భక్తి మార్గము తప్ప మరో మార్గము
తెలియదు వేంకటేశ్వరా
కన్నీరు ,మౌనం ,బాధ,దుఃఖం
వీటన్నిటికీ, మూల్యం చెల్లిస్తున్నానో తెలియదు
నీ జ్ఞాపకాల ఆఖరి గుర్తులు
చెరిపేస్తున్నానో తెలియదు
అయినా మనసు తపిస్తుంది వేంకటేశ్వరా
ఒకప్పుడు నేను వ్రాసిన ప్రేమ,
భక్తి గీతాన్ని చేరిపేస్తున్నానో
చదువుతూనే ఉన్న కాని
వాటిని దహనం చేస్తున్నానో
నాలాంటి వాడు ఈ లోకపు సమూహాలలో
యుండ గలనో లేనో
నమ్మకస్తులు ఎపుడూ ఒంటరిగానే
దొరుకుతారు వేంకటేశ్వరా
నిన్ను మరిచేందుకు యేమేమి
చేస్తున్నానో తెలియదు వెంకటేశ్వరా
కాలాన్ని సమర్ధించలేను,
ప్రకృతిని విమర్శించలేను వేంకటేశ్వరా
మనిషి మనిషిగా గుర్తించలేని
సమాజంలో యుండలేను వేంకటేశ్వరా
భక్తి మార్గము తప్ప మరో మార్గము
తెలియదు వేంకటేశ్వరా
*****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధన గీత మాలిక..29
మల్లప్రగడ రామకృష్ణ
భక్తిగ పాడెద భాగ్యము నీదయ
గుడినీజేరుద సుందరా నీకృప
కీర్తనజేసెద వీలుగా నీప్రేమ
సేవలు జేసెద శీఘ్రము నీలక్ష్య
చరణము1
వెంకట రమణ సంకట హరణ 2సార్లు
పద్మమనోహరపాలయ ధరణి
మమ్ముగా యేలుము మానస శరణ
నెమ్మది జేయుము నయనాల హరి
చరణము2
ఇంపుగతాళాల్వేయుదమా యి పుడే
వినసొంపుగరాగాల్దీ యుదమా యి పుడే
శంఖకాహళము-భేరిమృదంగము ఇపుడే
మానవ హా హా కారము లిపుడే
2సార్లు
చరణము3
హరిహరియనిమొరజేయుదమా ఇపుడే
మరి పరిపరిరీతుల గొలుచుదమా ఇపుడే
సారెసారెకును-సారసాక్షునీ ఇపుడే
నమ్మకమే మాకు కలిగేను ఇపుడే
2సార్లు
చరణము4
అలమేల్మంగతొగూడుమా
ఆనందడోలికలోమునుగుమా
నిత్య అనురాగము పంచుమా
నిజభక్తులనూ-నిక్కముగా చూడుమా 2సార్లు
రుణానుబంధము తీర్చుమా
మ్రొక్కులు తీర్చితి మోక్షము పంచుమా
సర్వము నీదయ కృపామయా
నిజభక్తులనూనిక్కముగా చూడుమా
భక్తిగ పాడెద భాగ్యము నీదయ
గుడినీజేరుద సుందరా నీకృప
కీర్తనజేసెద వీలుగా నీప్రేమ
సేవలు జేసెద శీఘ్రము నీలక్ష్య
గోవిందా... గోవిందా.. గోవిందా
*****
30..
ధనమును నమ్ముచు బ్రతికెదరు
తనుసౌఖ్యంబులను బొంది తహతహ తోడ నుందురు
మనసు లేక గడిపెడి వణుకుచూ వారు
దురితగుణంబుల తోడ నున్నారు వేంకటేశా
దురుసుతనంబుగ వరలుచు నున్నారు
పరతత్వమెఱుంగలేని పామఱుల యెడ నున్నారు
గరుణను జూపుచు విధి వంచితు లౌతారు
తరియించెడి దారిజూపు!దయగొని వేంకటేశ్వరా
వనములఁ గూల్చుచు మూఢులు కొందరు
ధనరాసులు పోగుబెట్టి దయలేని మతులు కొందరు
గనలుచు ఓర్పు లేక నుందురు
వినుమయ!భూమాత పడెడి వెతలను వేంకటేశా
నీపదములె బట్ట భవహరా
కదలక పడియుంటి నయ్య ముందరా
క్రమ్మగ మాయ కమ్మి బ్రతుకౌనురా
సరియగు శీలము నిడవయ్య!సరగున వేంకటేశ్వరా
*****
*ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక...శుభాకాంక్షలతో*10-7-24
నిర్వహణ:: ఫేస్బుక్ ద్వారా... మల్లాప్రగడ
కవితలు యూహ జనితమే
భవిత తెలపుటే విధిగను భాగ్యము కవికే
సవివరణలు తెల్పు కళే
కవుల కావ్యము నిజమగు కాలము తీర్పే
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా గీతం..31..
రానివానలు యండమావులు రవ్వ వెల్గులు యేలనో
కానివారును యున్న వారును కాచు కుండుట యేలనో
దాని నిత్తును దీనినిత్తును దారిచూపక యేలనో
రాని దంటుయు వేంకటేశ్వర రాకపోకలు యేలనో
కాలుజారిన కీలకమ్మగు గ్రక్కుతీయుట యేలనో
పాలు పొంగిన నీళ్లుజల్లుట పాఠమవ్వుట యేలనో
జాలువారిన జవ్వనమ్ముయు జాము రాత్రియు యేలనో
మేలు జేయని వాని కేమియు మోక్షమోచ్చును యేలనో
గోనెలందునగారు నీరది గొప్పదేనన యేలనో
దానికన్నను మిన్నగాదుర,ధార వర్షము యేలనో
వానౙల్లులు మంచి గూర్చవు వద్దుమాకని యేలనో
పూనిమేలుగ వేంకటేశ్వర పుష్టియుండును యేలానో
తప్పు చేసిన వాన్ని మార్చుము తక్షణమ్ముయు యిప్పుడే
నిప్పుయున్నను చల్లబర్చియు నీచ బుద్దియు యిప్పుడే
ఒప్పు యేయని వాదనమ్ముయు ఓర్పు లేనిది యిప్పుడే
చెప్పవేమియు వేంకటేశ్వర చింత మాపుము యిప్పుడే
*****
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర గీతం... 32
// శ్రీదేవి మరియు భూదేవి చిలిపి చిలిపి నవ్వులతో పలకరింపు //చూస్తున్నావా స్వామి వేంకటేశ్వర
చిలిపి చిలిపి నవ్వులతో పలుకరింతువి దేలనో
కలసి కలసి పువ్వులతో పులకరింతువు దేలనో
పలుకు పలుకులోన వలపు చిలుకరింతువి దేలనో
మలుపు మలుపు లోన తలపు కులుకు చూపితి దేలనో
// శ్రీదేవి మరియు భూదేవి చిలిపి చిలిపి నవ్వులతో పలకరింపు //చూస్తున్నావా స్వామి వేంకటేశ్వర
అంత చిన్న దీప కళిక ఇంత ఆశలు ఏలనో
సొంత మన్న దేది జపము యంత కరుణ యేలనో
ఇంత వెలుగు లేలనో ఈ జగతి తెలియాడు నేలనో
వింత కళలు లీలనో యీప్రగతి ఓలలాడు నేలనో
// శ్రీదేవి మరియు భూదేవి చిలిపి చిలిపి నవ్వులతో పలకరింపు //చూస్తున్నావా స్వామి వేంకటేశ్వర
ఇంత లేత పూల తీగకు ఇంత విరహమేలనో
ఇంత తేనె తీపి పంచ కలుగుట ఏలనో
ఈ గాలి
ఊయలూగు నేలనో సోలిపోవునేలనో
// శ్రీదేవి మరియు భూదేవి చిలిపి చిలిపి నవ్వులతో పలకరింపు //చూస్తున్నావా స్వామి వేంకటేశ్వర
ఇంత పేద గుండెలోన ఇంత మమత ఏలనో
ఇంత వలపిది తనువులు తృప్తి
ఏలనో
నీ రూపు
ఆవరింతు నేలనో ఆదరించు నేలనో
// శ్రీదేవి మరియు భూదేవి చిలిపి చిలిపి నవ్వులతో పలకరింపు //చూస్తున్నావా స్వామి వేంకటేశ్వర
గోవిందా.. గోవిందా.. గోవిందా
*****
33..
ముందరనిను కొలవగాంచ ముడుపు తెచ్చి
మోసపోతిని, నిను కాన మోక్ష మేది
యిందునే తుదిపదమెక్కితిని మది గతి
వేకువే వచ్చినా నులే వేంకటేశ
కాయము ఘటన పొందాను కాల మందు
చేయ పుణ్యపాపము గతి చింత లందు
పాయము పలు రుచులెరిఁగి పలుకు చుంటి
రోసితి బ్రతుకు నందును వేంకటేశ
హృదయ విజ్ఞాన మెఱిఁగితి కృపను జూపు
చదువులు చదివితి జపము సేసితిగతి
మనసు చంచలములు మాని మార్గ మెతక
నిదుర మెలకువ నీ జప వేంకటేశ
అందరిఁ గొలిచి సేవించి అనుభవించి
అన్ని జూచితి శ్రీవేంకటపతి నీవె
కాచితివి చెదరితినా సకాల మందు
వేదములు చదివితి నేను వేంకటేశ
*****
ధ్రు . కో.సమయ పాలన తోనునిత్యము సాధనౌను హితమ్ముగా
ప్రముఖ సానుభవమ్ముయేవిధి ప్రాభవమ్ము హితమ్ముగా
గమన సార్ధక విద్యశోధన గమ్య మవ్వు హితమ్ముగా
రమణ సేవలు శాంతి నిచ్చును రాజ్య మేలు హితమ్ముయే
ధ్రు.కో.పుడమినందున చేయు దేదియు పుట్టినందున తెల్పుమా
కడవ లాగున చల్ల నేస్తము కాలమందున తెల్పుమా
నడక నేర్పిన తండ్రికీనిజ నమ్మ వాక్కులు తెల్పుమా
మడమ తిప్పక తల్లిసేవలు మార్గమే యగు నిత్యమూ
మ. కో.రుద్ర తాండవ నీల కంఠడు రుద్ర భూమిన యేలనో
భద్ర మించియు దుష్ట తుర్మియు భాద్యతేయగు యేలనో
నిద్రలేకయు భక్తరక్షయు నీడ గుండుట యేలనో
ముద్ర లాగయు వేంకటేశ్వర ముందరుండుట యేలనో
మ. కో.తల్లి జానకి నన్ను నమ్ముము తత్వ మాయయు కాదులే
తల్లి నాపలుకేను నీదయ తన్మ యమ్ముయు కాదులే
తల్లి వానర రామదూతను తక్షణమ్ముయు కాదులే
తల్లిచూడుము రామముద్రిక దారి రాముని లీలలే
****
శ్రీ శ్రీ వేంకటేశ్వర ప్రార్ధనా మాలిక
మల్లప్రగడ రామకృష్ణ (1)
వెన్నెల వీధుల్లో చుక్కల రాత్రుల్లో , తెల్లటి జాజుల్లో మాలలు మల్లెల్లో
చల్లని గాలుల్లో చామర ఊపుల్లో , స్వాగత వేళల్లో సాధన సేవల్లో
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
ఋతురాగపు శోభలతో , మునిమానస కీర్తనతో , నిజ భక్తుల యాటలతో
విధి వాకిట పాటలతో , హృదయా నందాలతో , తప్పెట మోతలతో, సంబరాల కళలతో
కలియుగ దైవముతో
కలసి మెలసి కదలికగా
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
తారలతో తోరణాలు కట్ట, స్వాగతాలు పలుకుతున్నా,
జాజులు విరజాజులు, మల్లెల పరిమళాలు పంచుతున్నా,
నక్షత్రాలను దోసిట పట్టి, నీ ముంగిట నిలుస్తున్నా,
చుక్కల దుప్పటి కప్పి, ఊరేగింపు వేచి చూస్తున్నా...
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
వెన్నెల వీధుల్లో చుక్కల రాత్రుల్లో, తెల్లటి జాజుల్లో మాలలు మల్లెల్లో
చల్లని గాలుల్లో చామర ఊపుల్లో , స్వాగత వేళల్లో సాధన సేవల్లో
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
శ్రీదేవి భూదేవి శ్రీ శ్రీవాస ఊరేగింపు
***
గరుడవాహనంపైనెక్కి ముత్యాల కుచ్చులు ఊగిసలాడుతున్న రథంపై మంగళవాయిద్యాల హోరులో దానవులు భయకంపితులయ్యేటట్లు తిరువీధులగుండా తన దేవేరితో దేవదేవోత్తముడైన శ్రీవేంకటేశ్వరుని ఊరేగింపు సాగిపోతున్న విధానాన్ని వర్ణిస్తున్నారు
అదిగ దిగొ" కదు లుతునున్న" రధము
మాఢ వీధిల్లో ఊరేగుచున్న విధము
శ్రీ శ్రీదేవి, భూదేవి, శ్రీనివాస సమేతంగా
దేవ దేవుని ప్రార్ధించుదాము అందరమూ రండి .... ....
నరులు, సురులు, దేవతలు కొలుచు విధము
శ్రేష్టలు, పండిత, పామరులు, కొలుచు నిజము
కదలి వస్తుంది శ్రీ శ్రీ శక్తి ప్రదమైన రథము
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుని కొలుద్దాము రండి రండి ..... ... అ
అన్ని దిక్కుల్లోను సాగుచున్నస్వామి
డోళ్ళు, తప్పెట్లు, బాకాలు, శబ్దాల మధ్య స్వామి
పుత్తడి రధమున ఊరేగు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి
నృత్య గీత చెక్క భజన కోలాటాల మధ్య స్వామి
బ్రాహ్మణ వేద మంత్రములు వింటూ ఉండే స్వామి
క్షోభను తొలగించును వేంకటేశ్వరుండు
శ్రీదేవి భూదేవి ఒకటిగ చేరి రక్షగాయుండు
అందరి మ్రొక్కులు తీర్చే మహాను బావుండు
తిరుమలలో మనమూ వేడుకుందాము రండి
***
ఎన్ని మహిమలు చూపియు యేల చెప్ప
మాటలన్నను సహనసమ్మోహమతడు
కన్ను లకె పండుగగనున్న కాల పురుష
తపము నిత్య సంతస వెంకటేశ్వరుండు
సహజ కప్పురముయె పురుషోత్తమునకి
లీల ఏలనని విశద లౌక్య మేను
పాలజలధిలో పవళించ ప్రార్థనలగు
కోటి జన్మల రుణమును కోర్క తీర్చు
సంపదతొ మనసుకు శాంతి సాధకుడగు
చూచు కళ్ళునిత్యము సాగు సూత్రమగుట
విశద పరచి చూచెకళలు విశ్వనేత్ర
విశ్వ మంతయు లీలలు వేంకటేశ
శ్రీవేంకటేశ్వరునిదివ్య లీల
నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా
మానావమానాలు భరించా : మంచి చెడులనేవి భరించా
విధి జయాపజయాలు భరించా : పాపపుణ్యాలను భరించా
నీవే నాకును దిక్కు నీకు అమ్మకు చేస్తున్నా మొక్కు
ధీనర క్షాకోరు హక్కు శ్రీ వెంకటేశ్వరా చెప్తున్నా వాక్కు
సత్కాలమున జన్మ, సత్కర్మలు చేస్తున్న
నిస్వార్ధ బుద్ధితోనున్న, సర్వం నీకె అర్పిస్తున్నా
నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా
భక్తితో స్తుతిస్తూ వేడుకుంటున్న
నీలాలు అర్పించి కదులుతున్న
అమ్మ వకుళాదేవిని ప్రార్ధించు చున్న
నీ నామ జపంచేస్తూ దర్శించుతున్నా
రక్కసుడైన ప్రహ్లాదుని రక్షించినవాడవు
బలిచక్ర వర్తిని అర్ధించి అనగ తొక్కావు
కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టావు
మొక్కులు తీర్చిన మోక్షం ఇచ్చేవాడవు
నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా
లోకమంతా ఈర్ష్యాద్వేషాలతో ఉన్న
కోపాతాపాలతో కాలుతూ యున్న
మోసం, మోహం, మాయాలె కమ్ముకున్న
నేను మాత్రం నిన్ను మరవలేకున్నా
భ్రష్టుడై, దుష్టుడైన అజామిళుడు ను ఆదుకొన్న
ముసలి నోటినుండి గజరాజుని రక్షించియున్న
స్త్రీ వేషం వేసి అమృతాన్ని పంచి యున్న
బాధలను తొలగించే బాధ్యత నీదేయన్నా
నేనేమి అన్నాను, నన్ను నేను మరిచా
నిన్ననేను కలిశా, నన్ను నీకు అర్పించా
గోవిందా నీదాసుడని నిరంతరం ప్రార్ధించా
అనుగ్రహం కోసం నిన్ను యాచంచా
తిరుమల తిరుపతి వెంకటరాయ మన్నించు
****