Sunday, 1 May 2022


*🧘‍♂️341) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 

1-97

అయత్నోపనతేఽప్యక్షి పదార్థేషు యథా పునః 

నీరాగమేవ పతతి తద్వత్కార్యేషు ధీరధీః.

మనుజుల ప్రయత్నము లేకయే నిర్మితములైన వన, పర్వతాది పదార్థముల యొక్క ఛేదన భేదన హరణాదులందు దుఃఖాభావముచే జనులకు రాగరహితమగు దృష్టిపడునట్లు, ధీరబుద్ధి గల జ్ఞానియొక్క దృష్టియు పుత్రమిత్రాది వ్యవహారకార్యము లందు రాగరహితముగనే పడును. 

1-98

అప్రాప్తచిన్తాః సంప్రాప్తసముపేక్షాశ్చ సన్మతిమ్‌ 

న కమ్పయన్తి తరలాః పిచ్ఛాఘాతా ఇవాచలమ్‌. 

కదలుచుండు నెమలికన్నుయొక్క దెబ్బలు పర్వతమును చలింప చేయజాలనట్లు ప్రాప్తింపని పదార్థములఁగూర్చిన చింతలు, ప్రాప్తించిన పదార్థములఁగూర్చిన చింతలు, ప్రాప్తించిన పదార్థముల గూర్చిన ఉపేక్షలు జ్ఞానిని చలింప చేయజాలవు. 

1-99

సంశాన్తసర్వసందేహో గలితాఖిలకౌతుకః 

సంక్షీణకల్పనాదేహో  జ్ఞః సమ్రాడివ రాజతే.

జ్ఞాని (అజ్ఞాననాశముచే) సమస్త సందేహములు లెస్సగ శమించినవాడై (దృశ్యమిథ్యాత్వ దర్శనముచే) నశించిన సమస్త వాంఛలు గలవాడై, స్థూలసూక్ష్మాది దేహోపాధి కల్పనా రహితుడై, చక్రవర్తివలె విరాజిల్లును. (చక్రవర్తి దృష్టాంతము పామర జన దృష్టిననుసరించియే వచింపబడిన దగును).

.......

1*🧘‍♂️342) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️

ఆత్మన్యేవ నమాత్యన్తః స్వాత్మనాత్మని జృమ్భతే 

సంపూర్ణోఽపారపర్యన్తః క్షీరార్ణవ ఇవార్ణవే.

సంపూర్ణమై, అపారమైనట్టి క్షీరసముద్రము తనయందు తాను విజృంభించునట్లు, వాస్తవముగ జ్ఞాని అనంతాత్మరూపుడగుటచే స్వల్పమగు ఉపాధియందు పట్టక, పరిపూర్ణాత్మరూపముతో తన ఆత్మయందే విజృంభించుచుండును. (పరిపూర్ణాత్మ రూపము గలిగి శోభించుచుండునని భావము).

1-101

భోగేచ్ఛాకృపణాఞ్జన్తూ న్దీనాన్దీనేన్ద్రియాణి చ 

అనున్మత్తమనాః శాన్తో హసత్యున్మత్తకావివ. 

పిచ్చివారిని జూచి జనులు నవ్వునట్లు భోగేచ్ఛచే కృపణులగు దీనజనులను, భోగలోలుపములగు ఇంద్రియములను గాంచి అజ్ఞానమను పిచ్చి లేనివాడగు శాంత చిత్తుడైన జ్ఞాని నవ్వుచుండును. 

1-102

త్యజత్స్వాత్మసుఖం సౌమ్యం మనో విషయవిద్రుతమ్‌ 

అఙ్కుశేనేవ నాగేన్ద్రం విచారేణ వశం వయేత్‌.  

మదగజమును అంకుశముచే వశమొనర్చుకొనునట్లు, ఉత్తమమగు ఆత్మ సుఖమును వదలి విషయమువైపునకు పరువిడు మనస్సును, తత్త్వవిచారణచే వశ మొనర్చుకొనవలెను.

......

 నాస్తి మాతృ సమం దైవం నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు, తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు, ఆకలేసినా.. ఆనందం వేసినా దిగులేసినా దుఃఖం ముంచుకొచ్చినా పిల్లలకైనా, పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా గుర్తొచే పదం అమ్మ, తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ, అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి, కనుపాప లా కాపాడండి, ఒక్కసారి ఆలోచించండి, నలుగురికీ ఇలాంటి సందేశాలు పంపండి, బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం, తల్లి, తండ్రుల  ఋణం ఈ జన్మకి తీరదు. మనం ఈ స్థితిలో ఉండటానికి, వారు ఏవేవి త్యాగాలు చేశారో, మనకు తెలియదు. బ్రతికి ఉండగానే, ప్రేమించి,  గౌరవిద్దాం .

💐


౦౩.  🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 29వ శ్లోకం:-

నాథే న: పురుషోత్తమే త్రిజగతాం ఏకాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి! యం కంచి త్పురుషా ధమం కతిపయగ్రామే శమల్పార్థదం సేవాయై మృగయా మహే నరమహో మూకా వరాకా వయం!! 

-ప్రభూ! మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడులోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణుడుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పస్టముగా వివరించినారు.

నారాయణుడు సర్వ నర సమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామియై ఉండువాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈనరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధము మనము తొలగించు కొందుమన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు.

ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. *నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును.

ఈ నరుడు అల్పాల్పములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ములమగు మా సంగతి ఏమనుకోవలెనో తెలియదు.

పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ, మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలుగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడివై నిలబడు, అదే మనకిప్పుడు కావలసింది.

మనస్సును దృఢంగా తీర్చిదిద్దుకునేందుకు, మనం సందర్శించే పెద్ద వ్యాయామశాలే ఈ ప్రపంచం.

ఒక రోజు నేను ఒక పెద్ద ఇసుక కుప్ప మీద పాకుతున్న ఒక చీమను చూసాను. నేను ఇలా అన్నాను:" ఈ చీమ తను హిమాలయ పర్వతాలను ఎక్కుతున్నట్టు భావిస్తూ ఉంటుంది".

ఆ ఇసుక కుప్ప, చీమకు మహాపర్వతంలా కనిపించి ఉండవచ్చు, కాని నాకు కాదు. అలాగే మన లక్షల సౌరసంవత్సరాలు దేవుని మనస్సులో నిముషం కంటే తక్కువ.

***

04 . *ఎప్పుడు మారుతుంది ఈ దేశం?

నేననుకుంటున్నాను ఎప్పుడు దేశం మారుతుందా అని. గత కొన్ని సంవత్సరాలుగా,

మానవ సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి, నగరీకరణ, నవీకరణ అత్యంత వేగవంతంగా జరుగుతున్నది, ధరల పెరుగుతున్నాయి అంటూ ప్రోత్సాహం చూపేవారు ఎక్కువయ్యారు.అసలు బీదవాళ్ళనే వారు లేరు భారత దేశంలో కాని

మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉందిభోజనం అందరికీ కావాలి కాని., ఎవరూ వ్యవసాయం చేయా లనుకోరు. నీరు అందరికి కావాలి కానీ , నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు. పాలు అందరికీ కావాలి కానీ,ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు.నీడ అందరికి కావాలి కాని, చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.  భార్య  అందరికి కావాలి, కాని ఆడ పిల్లలు పుట్టా లనీ, వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు.

అంతా ఆధునికం అంటూధనం దుర్వినియోగం జరుగుతున్నది.

 ఆహారపు అలవాట్లు, మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకున్నాయి, అంతా ఇంట్లోవుండే నిత్యావసర వస్తువులను తెప్పించుకుని సుఖపడుతు న్నారు. అసలు విలువ ఏంతో తెలియటంలేదు చెట్లకు డబ్బులు కాస్తున్నాయి.

 మన అన్న భావన తొలిగి నేను - నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి, నైతిక విలువలు, మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి, చదువు, సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసక బారడం మొదలయింది.ఏది ఏమైనా వాట్సాప్, కరోనా పుణ్యమా అని సంబంధం సమాచారం అందుతున్నది.మనం నిజం తెలుసుకనేలోపు నిజాయితీ గా ప్రేమించే వాళ్ళను దూరం చేసుకుంటాం ఇదేనా జీవితం. మనిషి మనిషికీ మధ్య 

సామాజిక పరివర్తన అనేది ఎపుడూ సానుకూల దిశలో సమాజ హితం కోసం జరగాలి, వ్యతిరేక దిశలో పయనిస్తే మానవత్వం అనే పదానికి (అర్థం) విలువ లేకుండా పోతోంది.

అలాగే ప్రభుత్వం ధనికులకు అప్పులిచ్చి వసూలు చేయలేక బీదవారిపై వత్తి డి తగ్గాలి. సంక్షేమాలముసుగులో ధనాన్ని దుర్వినియోగం కూడా తప్పే, చదువు, ఆరోగ్య ఉచితం, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం రావాలని ఆశిద్దాం. కెరటాలు తీరానికి తాకితే వినోదం. ప్రజల కు నాయకుల మాటలు వినోదం. కెరటం దాటితే ఎంతో విధ్వంసం అవుతుందో అట్లాగే ప్రజల ఓర్పుపై ప్రయోగాల ప్రభావము అంతకన్నా ఎక్కువుగా రావచ్చు.

  

*ఏది ఏమైనా మనం చేయగలను  అనుకుంటే చేయగలము, చేయలేము అనుకుంటే చేయలేము.*          

        *నమ్మకం లోని నాణ్య తే మనల్ని నాణ్యమైన జీవితానికి మంచి మార్గం చూపిస్తుంది, వెనకడుగు వేస్తే వెన్ను పోటే గతౌతుంది అందరూ గమనించాలి.*

మనసుకు శాంతి కల్గించేందుకు చేసే మంచ పనుల ప్రయత్నం కావాలి, రావాలి వస్తుందని ఆశిద్దాం.

మీ శ్రేయోభిలాషి..మల్లాప్రగడ రామకృష్ణ

05 . *మహాభారత కధ  

 ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకొందాము.

      మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,, రెండవవాడు బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.        దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం  కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలనిమరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు.        అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

       మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.   ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం  అన్నదమ్ముల మధ్య, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను, నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. కానీ ఇరువైపుల వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.    అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా! మీ ఆలోచన చాలా అద్భుతమైనది, 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడటం భీమునకు ముఖ్యం. అందువల్ల యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. కాబట్టి 50 లక్షల మందికి భోజనం వండటం మీ వల్లే సాధ్యమవుతుంది, అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.

   నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. ఎలా వండేవాడు అంటే ...  తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా  తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు.

ఇది ఎలా సాధ్యం? అంత మంది చనిపోతున్నామిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా? అసలు నరేశునికి ఈ రోజుఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని ఎలాతెలుస్తుంది? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

    ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు. పట్టాభిషేకంజరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు, మమ్మల్నిఅందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం, అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం! 

ఇలా ఎలా చేశావు? అని అంటాడు. అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా! దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు. అప్పుడు యుధిష్టరుడు తడుముకోకుండా శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.  అప్పుడు నరేషుడు, మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు.

     ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరిముందు ఇలా చెప్తాడు...

       శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. శ్రీకృష్ణుడు తినకపూర్వం పెసరకాయలునేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడోదానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేలమంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఇది విని సభలోని వారందరూ శ్రీకృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

     ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

*****

.06 . *అనుభవసారం

సలహాలు సందేశాలు కావు అనుభవాలు ఆచరణకు ఆరోగ్య సూత్రాలు, ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు దాటిన వారికి..  ~~

1) మనల్ని మనం చెప్పుకోకూడదు, గతం గత: కాలాన్ని బట్టి  మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకోవాలి.. 

2)   ఎవ్వరితోనూ బేరాలాడవద్దు. ఎక్కువ, తక్కువ సంపాదన గురించి , వయసు తగ్గింది కాబట్టి మనం నష్టపోయేదీలేదు.. 

3) గొప్పలు చెప్పడం, వాదనలు, ప్రతి వాదనలు, వితండ వాదనలు, సలహాలు చెప్పఁటం, చేయకూడదు.  దీనివల్ల ఆరోగ్యపరంగా నష్టపోయేది మనమే.. 

4) ఏ విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకో కూడదు. ఏది అన్న అంతా మనమంచికే ఆదేవుడి లీల అని సర్దుకు పోవడమే, తేలికగా తీసుకోవాలి.  లేకపోతే మనస్తాపం వలన నష్టాలు తప్పవు.. 

5) నాకు శక్తిఉంది అనకండి, సహాయం చెయ మన్నా తప్పలేదు, ఎదో చిన్నచూపని అనుకోవద్దు, సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయవద్దు.. 

6) మనమందులు ఖర్చులు, తోడున్నవారి ఖర్చులు  దాచుకున్న డబ్బుతో సుఖముగా ఉండగలరు, ఉన్నది పిల్లలకు పంచి చింతన చెంది ఇతారులను నిందించడం అవసరమా .  మన అభిరుచులకు తగ్గట్లుగా మన దినచర్యని మలుచుకోవాలి.. 

7) ఎవ్వరిపైనా చులకన భావన వద్దు. మంచిది మీరెట్లాగుంటే అట్లాగే అనే సదభిప్రాయం, సద్భావన, సానుకూలత ముఖ్యం. 

😎 ముఖ్యంగా మన పిల్లల జీవితాలలో మన జోక్యం చేసుకో కూడదు. వాళ్ళ ఆలోచనలు బట్టి మనమే మారాలి, (నీకేంతెలియదనే మాట రాకూడదు) అడిగితేనే సలహా ఇవ్వాలి.. 

9) ఎవరినో ఉహించి మీరు అసలు మాట్లాడకూడదు, (మాకాలం అని అనవద్దు అన్నా పరువు పొయ్యేది మనదే)   కంపేరిజన్ వద్దు.  కమిట్మెంట్ వుండాలి.. 

10) అందరిని సంప్ర దించాకే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి,  తీసుకోవడంలో తొందర తగదు..  

11) ఆరోగ్యం, ఆనందం, ఆద్యాత్మికం, ఆహ్లాదం, నమ్మకం మన ధ్యేయం కావాలి.   .. 

12) నవ్వుల్తో మాటలే మందు, తక్కువమాట్లాడి ఎక్కువ నిద్ర పోవడమే మంచితనమే, పాత గుర్తులు పదే పదే అనక మంచి కధలు చెప్పి అందరిని ఆనంద పరచండి, బంధాలే చివరిదశలో బ్రతికించే ఆయుధాలు ..  ----

పండంటి వృధ్యాప్యానికి పన్నెండు విలువైన సూత్రాలు ఇవి...  పాటిస్తే  అంతా మన మంచికే...


* మనకి కలిగే కర్మ ఫలాలకి కారణాన్ని ఓ ఋషి ఇలా సూత్రీకరించాడు. 

అధర్మ ప్రభవం చైవ దుఃఖయోగం శరీరిణాం

ధర్మార్ధ ప్రభవం చైవ సుఖ సంయోగమక్షయం

భావం: 

 శరీర ధారులకి (మనుషులకి, ఇతర జీవులకి) కలిగే దుఖాలన్నీ అధర్మ ప్రవర్తన వల్ల, వారికి కలిగే అన్ని సుఖాలు ధర్మాచరణ వల్లే కలుగుతాయి.  

 ఏ జీవి జన్మ అయినా భూతకాలంలో చేసిన కర్మలని బట్టి ఈ రోజు నిర్మాణమై ఉంది. మన దేహం యొక్క ఉష్ణోగ్రతని తెలియచేసేది థర్మామీటర్. అలాగే మనం గతంలో చేసిన కర్మలు ఎలాంటివో తెలియచేసేవి ఈ జన్మలో వచ్చే కష్టసుఖాలు. 

సర్వేజనా సుఖినోభవంతు 

మీవిధేయుడు అనుభవసారం మల్లాప్రగడ రామకృష్ణ 

__((()))__

* 7-- నేను  భువనేశ్వర్ లో సబ్‌కలెక్టర్‌గా ఉన్నప్పుడు, ఒక సాయంత్రం నా ఫీల్డ్ టూర్ తర్వాత నేను ఆఫీసుకు తిరిగి వచ్చాను, నా ఆఫీసు ఛాంబర్ ముందు ఒక మహిళ ఒంటరిగా కూర్చుని ఉన్నట్లు గుర్తించాను. నేను ఆమెను నా ఆఫీసు గదికి రమ్మని అభ్యర్థించాను.ఇంకా వచ్చిన పని  గురించి అడిగాను.   భువనేశ్వర్ లో తన భూమిని విక్రయించడానికి అనుమతిని పొడిగించడం కోసం మీ కార్యాలయంలో ఒక దరఖాస్తు పెండింగ్‌లో ఉందని ఆమె చెప్పింది. నేను వెంటనే కేసు రికార్డు కోసం కాల్ చేసాను, ఆమె మూడుసార్లు పొడిగింపు తీసుకున్నట్లు గుర్తించాను.  పొడిగింపు కోసం ఇది ఆమె 4వ దరఖాస్తు.  నేను భూమిని అమ్మకుండా మూడుసార్లు అనుమతి పొందటానికి గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాను, కానీ ఆమె అనేక అనుమతులు తీసుకోవడానికి గల కారణాన్ని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. భూమిని విక్రయించడానికి మొదటి అనుమతి పొందిన తర్వాత, ఆమె కొడుకు మరణించాడు. గడువు ముగిసింది. ఇంకా తదుపరి పొడిగింపులలో ఆమె రెండు కష్టాలను ఎదుర్కొంది.  ఆమె భర్త మరియు మరొక కొడుకు మరణించారు.  ఆమె కొంత అప్పు  ఇంకా  వైద్య ఖర్చులను తీర్చడానికి భూమిని విక్రయించాల నుకుంది.  నేను ఆమెకు చెప్పాను, దయచేసి భూమికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి మరుసటి రోజు అఫిడవిట్  అందించండి అని.  ఆమె అలాగే  సమర్పించింది


 అదే రోజు  అనుమతి కూడా ఇచ్చారు.  ఆ మహిళ మరెవరో కాదు శ్రీమతి ద్రౌపది ముర్ము.  ఆమె ఒక గొప్ప  వినయ శీలి అయిన మహిళ, మాజీ మంత్రి. అయినా  ఆమె తన 


 పని కోసం సాధారణ పౌరుడిలా కార్యాలయానికి వచ్చింది.  ఆమె దేశాధిపతి కాబోతున్నందుకు మేము గర్విస్తున్నాము.


సేకరణ:






గజల్ -- అంచయాన - (012)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

 పాదములు చేరిన ఆపదలు బాపు అంచయాన 
మూడు లోకములకు ఆశ్రయ స్థానము అంచయాన  
ధ్యానంలో ఋషివర్యులకు స్థిమితము కలిగించుట  
అధిక ఆనందము పొంది అందించుఁ అంచయాన 
 
కల్యాణ గుణముల స్తుతించుచు సుఖము కలిగించుట
భయ వర్జితు లైన వారికీ భయము అంచయాన 

ఉషోదయంలా తత్త్వ విచారణను కలిగించుట
అవగాహన,ఆధ్యాత్మికత విషయాన అంచయాన 
 
నిత్య పురుష ప్రయత్నముకు తోడ్పాటు కలిగించుట
ఉన్నతి లో కరుణను అందించినది అంచయాన 
   
సుప్రతిష్థ వృత్తములు ని కృపయేను అంచయాన 
హృదయస్పందన కల్పించే శాంతిగా అంచయాన 

____(((())))___


 దత్తపది....... అత్త, దుత్త , చెత్త , పత్త
పత్త.....అంటే చిరునామా లేకుండ.... అడ్రస్ లేకుండ

అత్త మామల సేవ లు యాలి తలపు 
దుత్త లోనపాలు  పిసికి   దూడకుంచి
చెత్తగా నున్న  నీయుల్లుఁగొత్త జేసి
పత్తరము లెల్ల  సరిజేసీ పంచెపూర్ణ

ఉత్పలమాల
 అత్తయు మామయే కలిసి ఆకలి తీర్చియె ఆత్మతృప్తిగన్
దుత్తలొ పాలుపిస్కుటయు దూడల కుంచియు పాలు పిండియున్
చెత్త ను తీసి సుభ్రముయు గొత్తగ జేసియు చేయుసాయమున్
పత్తర మేను లేనిదియు పాశము నందునె చిక్కియుండుటన్

 తేటగీతి

అత్త తత్త్వము కోడలు కర్ధ మవక
దుత్త లోపాలు తేకనే దురిత పలుకు
చేత్త లాఎగరక ఉండి చేత జూపి
పత్తరము లేని పాశము పడక గదియె

 మత్తకోకిల

మండు వేసవి లోన మంటలు మాడుచేరియు బాధయే
తిండి లేకయె కాల మాయగ తీటబట్టియు బాధయే
మోండి గుండియు దాహ మున్నను మోడు లవ్వుట బాధయే
దండిగాధన మున్న నేమియు త్రాగు నీటికి బాధయే

తేటగీతి

అడుగు చిన్నదా పెద్దదా అడుగ వలదు 
గమ్య మే చేరుటకు మఖ్య గాల మేది
అతిగ పరుగల తోననే ఆశ పడుట
శ్వాస ఆడక కదులుటే సాక్షి ఏల
*****

...........



No comments:

Post a Comment