అధముల కధికారముయే
మదమెక్కినదైన రాజ్యమేఇది భయ్యమ్
విధిరాతలుమార్చరులే
మదిలో మెదిలే అనేకమైన వి కధలే
చమత్కార పద్యం
ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం
అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి, తృతీయం బక్కడ
నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!
భావం:
గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను....
ఏమీ అర్థం కాలేదు కదా!? ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు
1) భూమి
2) నీరు
3) అగ్ని
4) వాయువు
5) ఆకాశం.
ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.
చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,
పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,
ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,
తృతీయము అంటే అగ్ని ,
ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి....
హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం
ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!!
*****
0 Com
దొరికేసింది శ్లోకము.. ప్రధమాంకము లో ఉన్నది..
అద్వైతం సుఖ దుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసు య
ద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్న హార్యో రసః
కాలేనావరణాత్య యాత్పరిణతే యత్స్నేహ సారే స్థితం
భద్రం తస్య సుమానుషస్య కధమప్యేకం హి తత్ప్రార్ధ్యతే
సుఖ దుఃఖయో = సుఖములందు దుఃఖములందు
యత్ అద్వైతం = ఏకముగా ( రెండు కానిది )ఉండేది ఏదో
సర్వాసు అవస్థాసు = అన్ని అవస్థల యందునూ
( కలిమి లేమి మొదలగు )
యత్ అనుగతం = ఏది అనుసరించునదో
యత్ర = దేనియందు
హృదయస్య = మనస్సునకు
విశ్రామః = విశ్రాంతి యో
యస్మిన్ = దేనియందు
జరసా = ముసలి తనము చే
రసః = ప్రీతి
అహార్య = హరింప బడదో
కాలేన = కాలముగడచు టతో
ఆవరణ అత్యయాత్ = అ రమరికలు తొలగి పోవుట వలన
పరిణతే = పరిపక్వత నందిన
ప్రేమ సారే = ఉన్నత మైన అనురాగము నందు
యత్ స్థితం = ఏది నిలుచునో
తస్య సుమానుషస్య = ఆ మానవ దాంపత్య మునకు
తత్ ఏకం భద్ర = ఒకే ఒక భద్ర స్థితి
కధమపి = ఎట్లైననూ
ప్రార్ధ్యతే హి = అభిలషింప బడు తున్నది
సుఖ దుఃఖాలను ఇద్దరూ కలిసి ఒకటి గా అనుభవించటం, కలిమి లేమి లలో కలిసి పయనించటం, మనస్సులను పరస్పరము ఊరడిల్లచేసుకోటం, ముసలి తనం లో కూడా ప్రీతి తగ్గక పోవటం, కాలము గడుస్తున్న కొద్దీ అరమరికలు పోయి ప్రేమసారంగా గాఢ పరిపక్వత చెందటం ఇవన్నీ ఉత్తమ దాంపత్య లక్షణములు..
ఇలాంటి ఈ దాంపత్యానికి అన్ని విధాల భద్రమగును గాక అన్నది ఒక్కటే నేను కోరుకుంటున్నాను...
ఇది కూడా శ్రీ రామచంద్రుడు చెప్పినట్టే భవభూతి చెప్పారు...ఉత్తర రామ చరిత లోనే....
ఏమాట కామాట అదిరింది శ్లోకము...
ఇంక doubt లేదు..this is final..మీ మిత్రునికి forward చేసేయ్....
*****

No comments:
Post a Comment