ఓం శ్రీ రాం - శ్రీ ఆత్రేనమ: - శ్రీ క్రిష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
21. దేశరూప, దెవభూయ, దేవకీనందన,
ధనాధిప, ధన్య, ధర్మరక్షక,
ధీమన్థ, ధీర్ఘ దృష్టి , దివ్యకరుణ,
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
22. సర్వకాల, సర్వావస్థలలో, సంధర్శనదేవ,
సర్వమానవుల, సమ స్యల, ప్రక్షాళదేవ,
సమగ్రమైన, సందేహములను, నివర్తదేవ,
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
23. దర్పక, ద్వాదశాత్మ, దామోదర,
దీ క్ష క, దుర్వర, ద్యూ దకర,
దాక్షిణ్య, దినమణి, దివాకర,
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ.
--((*))--
అద్భుతమైన చైనా పిల్ల చిద్ట్ద్రం చూసి మీ అభిప్రాయం తెలపండి ఇది 1956 సినిమా
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
3. కోటి ప్రభలతో కొండంత వెల్గు - పరులు చూసిన కానరాని వెల్గు
గురుకృపచే కాక గుర్తెరుంగని వెల్గు - అమృత్ మహిమచే వ్యాపించె వెల్గు
విధ్యుత్ లతల పరివేష్టిత వెల్గు - ఘననీల కాంతుల గ్రక్కు వెల్గు
ప్రణవ నాదములు గల్గిన వెల్గు - మౌనులెన్నగ రమ్యమైన వెల్గు
ఆది మధ్యంతర రహితమైన వెల్గు
ఆత్మనే కదిలించు పరమాత్మ వెల్గు
హృదయానంద పరమానంద వెల్గు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
4. వేదంబులు నీవె, వేదాంగములు నీవె - జాలరులు నీవె, భూజాములు నీవె
క్రతువులు నీవె, పర్వతములు నీవె - మంచువు నీవె, నదులు నీవె
కనకాద్రి నీవె, యాకాశంబు నీవె - తరువులు నీవె, అగ్ని నీవె
అనురూపము నీవె, అవనీతలము నీవె - - బ్రహ్మము నీవె, గోపతియు నీవె
నిన్ను గొల్చుటకు నేనెంత
అణువులో అణువంత
హృదయానంద సుమంత
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((*))--
ఓం శ్రీ రామ్
ద్విశాఖామాశాస్తే తదను చ విభక్తుం నిజకలామ్
స్వరూపాదున్మేషప్రసరణనిమేషస్థితిజుషస్
తదద్వైతం వందే పరమశివశక్త్యాత్మనిఖిలమ్"
*నేటి పద్యాలు ,--*నేటి ప్రాంజలి ప్రభలు
*. పతివ్రతా ధర్మములు, * భాగవతం
-ఉపనిషత్ సూక్తి
108. జ్ఞానం లబ్ధ్వా2చిరాదేవ మామకం ధామ యాస్యసి||
(ముక్తికోపనిషత్)
- ఆత్మజ్ఞానమును పొంది అచిరకాలములో నాయొక్క ధామమును చేరవచ్చును. (అని శ్రీరామచంద్రుడు శ్రీ ఆంజనేయస్వామితో చెప్పెను.)
-
*శ్రీరామకృష్ణ బోధామృతము
*మాయ
బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించేది మాయే. మా యొక్క తోడ్పాటు లేనిపక్షంలో ఎవరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలరు? శక్తిని (అంటే భగవంతుడి సృజనాదిక రూపమైన మాయా-శక్తిని) దర్శించకుండా భగవంతుణ్ణి చూడలేము.
*-శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల*
3 వ శ్లోకం:-
జయతు జయతు దేవో దేవకీ నంద నోయం !
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః !
జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో !
జయతు జయతు పృధ్వీ భారనాశో ముకుంద !!
భావం:-
ఓ దేవా ! దేవకీనందన ! నీకు జయము. వృష్ణివంశ మంగళ దీపమా ! కృష్ణా నీకు జయము. సుకుమార శరీర, మేఘశ్యామా ! నీకు జయము. భూ భార నాశక ! ముకుంద ! నీకు జయము జయము.
---
604 *శ్రీమతాం వరః,
బ్రహ్మాదీనాం సమస్తానామ్ ఋగ్యజుస్సామలక్షణా ।
యేషాం శ్రీరస్తి తేషాం చ ప్రధానః శ్రీమతాం వరః ॥
ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ ।
ఇతి శ్రుతేర్మహావిష్ణుః శ్రీమతాం వర ఉచ్యతే ॥
*ఋక్, యజుర్, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి శ్రీగల బ్రహ్మ మొదలగువారు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో శ్రేష్ఠుడు 'శ్రీమతాంవరః'.
ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ (తైత్తిరీయ బ్రాహ్మణము 1.1.1)
'ఋక్కులు, యజుస్సులు, సామములు - ఈ త్రివిధ రూపము గల విద్యయే 'సత్'జనులకు ఉండు శ్రీ. అది అమృత తుల్యమౌ శాశ్వతమగు శ్రీ.' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.
---
No comments:
Post a Comment