Monday, 2 May 2022


*శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రమ్ * న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు, *జికే  * సాధకులు - గురువులు *ప్రాంజలి ప్రభ - సెల్ చిన్న కధ-,  * జీవజాతుల నుండి మనిషి నేర్చుకోవాల్సిన , * పరశురామ జయంతి, *దుష్కర్మఫలితం


*🧘‍♂️91-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️*

*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*

*91. ఓం నమో నారాయణాయేతి తారకమ్||* 

*(తారసారోపనిషత్)*

*- ఓం నమో నారాయణాయ అను నీ మంత్రమే తారక మంత్రము.*

*లోకా+ సమస్తా: స్సుఖినోభవన్తు!*

***
*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - May 4._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 4._*

*Be not afraid. Think not how many times you fail. Never mind. Time is infinite. Go forward; assert yourself again and again, and light must come.*

*భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్కచేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో; నీ ఆత్మశక్తిని మరల మరల కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది.*
***
*_THE AWAKENING_*
*Inspirational Quotes of Swami Vivekananda*

*Learn everything that is good from others, but bring it in, and in your own way absorb it, do not become others.*

_*జాగృతి*_
*స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు*

*ఇతరులలోని మంచి అంతటినీ గ్రహించండి, మీదైన పద్ధతిలో దాన్ని మీలో లీనం చేసుకోండి, ఎవరిని గుడ్డిగా అనుసరించకండి.*
***
*🧘‍♂️నిష్ఠ🧘‍♀️*

*ప్రతిజ్ఞ: నా ప్రేమ - భానుని చూపు నిన్ను గురించిన నా ఆలోచనల దిక్చక్రం కిందకు దిగజారదు. ఊర్ధ్వముఖమైన నా కంటి చూపు నీ మీదకు తప్ప అన్యమైన దేని మీదకూ ప్రసరించడానికి కిందకు దిగనీయను. నిన్ను నాకు గుర్తు చెయ్యని ఏ పనిని నేను చెయ్యను.-

*శ్రీ పరమహంస యోగానంద / Whispers from Eternity*
***
*ॐ卐సుభాషితమ్ॐ*

*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*

*26) కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాఽత్మానం పశ్యతి కోఽహమ్|*

*ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః ||*

*కామ - క్రోధ - లోభ - మోహములను వదలి నిన్ను నువ్వు తెలుసుకో. ఆత్మజ్ఞానం లేని మూఢులు నరకంలో పడి పీడింపబడెదరు.*
***
  ప్రభువు కార్యకలాపాలను ఎలా అర్థం చేసుకోవాలి  

3. యద్యద్విధత్తే భగవాన్స్వచ్ఛన్దాత్మాత్మమాయయా
తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ

ఇతను స్వచ్చందాత్మ (ఇక్కడ ఆత్మ అంటే శరీరం), ఈయన దేహం సంకల్పాధీనం (మన దేహం కర్మాధీనం), తన సంకల్పముతో ఏ ఏ పనులు చేస్తున్నాడో, అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు.

సశేషం..
***
శ్రీఆది శంకరాచార్య విరచితం

*శ్రీ విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రమ్

1) చిదంశం విభుం నిర్మలం నిర్వికల్పం - నిరీహం నిరాకారమోంకారగమ్యమ్ ||
గుణాతీతమవ్యక్తమేకం తురీయం - పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే ||

2) విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం - జగజ్జీవనం జ్యోతిరానందరూపమ్ ||
అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం - త్రయీ వక్తి యం వేద తస్మై నమస్తే ||

3) మహాయోగపీఠే పరిభ్రాజమానే - ధరణ్యాదితత్త్వాత్మకే శక్తియుక్తే ||
గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే  సమాసీనమోంకర్ణికేష్టాక్షరాబ్జే ||

4) సమానోదితానేక సూర్యేందుకోటిప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్ ||
న శీతం న చోష్ణం సువర్ణావదాతప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్ ||

5) సునాసాపుటం సుందరభ్రూలలాటం  కిరీటోచితాకుంచితస్నిగ్ధకేశమ్ ||
స్ఫురత్పుండరీకాభిరామాయతాక్షం - సముత్ఫుల్లరత్నప్రసూనావతంసమ్ ||

6) లసత్కుండలామృష్టగండస్థలాంతం - జపారాగచోరాధరం చారుహాసమ్ ||
అలివ్యాకులామోదిమందారమాలం - మహోరస్ఫురత్కౌస్తుభోదారహారమ్ ||

7) సురత్నాంగదైరన్వితం బాహుదండైశ్చతుర్భిశ్చలత్కంకణాలంకృతాగ్రైః ||
ఉదారోదరాలంకృతం పీతవస్త్రం - పదద్వంద్వనిర్ధూతపద్మాభిరామమ్ ||

8) స్వభక్తేషు సందర్శితాకారమేవం - సదా భావయన్సంనిరుద్ధేంద్రియాశ్వః ||
దురాపం నరో యాతి సంసారపారం - పరస్మై పరేభ్యోపి తస్మై నమస్తే ||

9) శ్రియా శాతకుంభద్యుతిస్నిగ్ధకాంత్యా - ధరణ్యా చ దూర్వాదలశ్యామలాంగ్యా ||
కలత్రద్వయేనామునా తోషితాయ - త్రిలోకీగృహస్థాయ విష్ణో నమస్తే ||

10) శరీరం కలత్రం సుతం బంధువర్గం - వయస్యం ధనం సద్మ భృత్యం భువం చ ||
సమస్తం పరిత్యజ్య హా కష్టమేకో - గమిష్యామి దుఃఖేన దూరం కిలాహమ్ ||

11) జరేయం పిశాచీవ హా జీవతో మే - వసామక్తి రక్తం చ మాంసం బలం చ ||
అహో దేవ సీదామి దీనానుకంపిన్కిమద్యాపి హంత త్వయోదాసితవ్యమ్ ||

12) కఫవ్యాహతోష్ణోల్బణశ్వాసవేగ - వ్యథావిస్ఫురత్సర్వమర్మాస్థిబంధామ్ ||
విచింత్యాహమంత్యామసంఖ్యామవస్థాం - బిభేమి ప్రభో కిం కరోమి ప్రసీద ||

13) లపన్నచ్యుతానంత గోవింద విష్ణో - మురారే హరే నాథ నారాయణేతి ||
యథానుస్మరిష్యామి భక్త్యా భవంతం - తథా మే దయాశీల దేవ ప్రసీద ||  

14)భుజంగ ప్రయాతం              పఠేద్యస్తు భక్త్యా - సమాధాయ చిత్తే భవంతం మురారే ||
స మోహం విహాయాశు యుష్మత్ప్రసాదాత్సమాశ్రిత్య యోగం వ్రజత్యచ్యుతం త్వామ్ ||

********
* న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.

సూర్యుడు

శ్రీ‌కాకుళం జిల్లా 1.హ‌ర్షవ‌ల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి

చంద్రుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి 2. కోటే ప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.

అంగార‌కుడు
కృష్ణ 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.

బుదుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి 2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ 3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు 4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.

బృహ‌స్పతి

గుంటూరు 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి 3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు 4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.

శుక్రుడు

విశాఖ 1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు 2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు 3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.
శ‌ని

తూర్పగోదావ‌రి 1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం 2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ 3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం 4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.

రాహువు, కేతువు
చిత్తూరు 1. శ్రీ కాళ‌హ‌స్తి
తూర్పుగోదావ‌రి 2. మంద‌మ‌ల్లి నాగశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.
విశాఖ 4. సంప‌త్ వినాయ‌క స్వామి.
గుంటూరు 5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.

గ‌మ‌నిక‌
:
 ఈ క్షేత్ర ద‌ర్శన‌ముల‌న్నియు ఒక్క వార‌ము రోజుల‌లో పూర్తి చేసిన‌చో త‌గిన ప‌లిత‌ములు పొందుతారు.

****




* సాధకులు - గురువులు

ఆత్మ జ్ఞాన సాధనలో సాధకులు ఏఏ యోగ చక్రాలలో ఉంటే ఏ రకమైన గురువులు వస్తారో ఈ క్రింది విధంగా విభజించవచ్చును.

మూలం :- కపాల మోక్షం అనే మోక్ష సాధనా గ్రంథం.

1. మూలాధార చక్రము - మంత్రగురువు.

2.స్వాధిష్ఠాన చక్రము - మంత్రగురువు.

3.మణిపూరక చక్రము - దీక్ష గురువు.

4.అనాహత చక్రం - దీక్ష గురువు /భౌతిక గురువు.

5.విశుద్ధి చక్రము - దీక్ష గురువు /భౌతిక గురువు.

6.ఆజ్ఞా చక్రము - సద్గురువు.

7. గుణ చక్రం -   సద్గురువు.

8. కర్మచక్రం -   సద్గురువు.

9.కాలచక్రం- సద్గురువు.

10. బ్రహ్మ చక్రం- సద్గురువు.

11.సహస్రార చక్రం – పరమగురువు/విశ్వగురువు/జగత్ గురువు.

12.హృదయ చక్రం- ఆదిగురువు.

13.బ్రహ్మరంధ్రము - నీకు నీవే.... ఎవరి ఆత్మయే వారికి  గురువు.

అయితే ఇది అంతా శబ్ద పాండిత్యము. గ్రంథ జ్ఞానం. ఈ జ్ఞానం నుండి అనుభవ జ్ఞానం సంపాదించాలి.
****
*జి / కే 
అష్ట దిక్పాలకులు – ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు

అష్టలక్ష్ములు – ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ

అష్టస్థాన పరీక్ష – నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష

అష్టదోషములు : 1.చంద్రునిలో కళంకము, 2.హిమగిరియందు మంచు, 3.సముద్రునియందు ఉప్పు, 4.చందన వృక్షములనీడన త్రాచుపాములు, 5.పద్మములకు ముండ్లు, 6.సుందరీమణులకు వృద్దాప్యము, 7.కుచములకు పతనము, 8.విద్యావంతులకు దారిద్రము.

అష్టద్రవ్యములు : యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.

అష్టమహా రసాలు : 1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.

అష్ట భాగ్యములు : 1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].

అష్టావధానము : 1. చదరంగము, 2. కవిత్వము, 3. లేఖనము, 4. పఠనము, 5. గణితము, 6. సంగీతము, 7. యుక్తి చెప్పుట, 8. వ్యస్తాక్షర. (ఆ.) 1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము [ఈ యెనిమిదింటితో గూడినవి అష్టావధానము].

****

.

*ప్రాంజలి ప్రభ - సెల్ చిన్న కధ-

ఏమండోయి మీకు ఫోన్ వచ్చింది అట్లా అరవకే ఏదో మాట్లాడు ఇప్పుడు మాట్లాడమంటారు మాట్లాడాకా ఎదో సలహ ఇవ్వ బోతారు కదా

అట్లా అనన్లే ముందు వివరం తెలుసుకో మార్పుకు మార్గలు ఉపయోగాలు తెలప మంటున్నారు ఇంటికొచ్చి మట్లాడమను అన్నాడు-

ఎవన్నారే ఇప్పుడే వస్తారుటా దబ్బున స్నానం చేసి రండి, మరలా ఫోన్ ఏమండి ఫోన్ బాయ్ ను పెట్టుకొండి, నీవేం చేస్తావు నాకెందుకు మీరే ఫోన్ తీయండి, తలుపు శబ్ధంతో వెళ్ళి తీసింది వచ్చి కూర్చోండి అని చెప్పి లోపలకు వెళ్ళింది శ్రీ మతి శ్రీ దేవి వస్తూనే రామక్రృష్ణ నమస్కారములు తెలిపాడు
ముందు నేను చెప్పే విషయాలు మీజీవితానికి మార్గదర్శకాలు ఒక్కనిముషం నేను రికార్డు చేస్తాను ఆచరణ వల్లే జీవితం యోక్క పరమార్ధం తెలుస్తుంది ఆంతరాత్మ చెపుతున్నది అని ఆలోచన మానండి, ఓడిపోతానని భయాన్ని తొలగించు కోండి మార్పుని ధైర్యంగా ఎదుర్కోండి, అవాంతరాలను ఎదుర్కొని శక్తిని పెంచుకోండి మార్పు ఫలితాల కోసం ఎదురు చూడకండి మిమ్ము గుర్తించినది ఏదీ మిమ్మ వదలదని తెలుసుకోండి-
జీవితం సాగిపోయే ప్రవాహం అని తెలుసు కోండి, భంధాలను వదలి బ్రతుకు కలియుగంలో కష్టమని తెలుసుకోండి, మార్పు ప్రకృతిబట్టి పిల్లల బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనసుని బట్టి శ్రీ మతి అనుకరన బట్టి నడుచుకోవటమే నిజమైన మార్పు మీమార్పుకు కారణం చెపుతారా-

నేను తెల్లవారున లేచి ఓం శ్రీ రాం శ్రీ మాత్రేనమః నా ఆలోచనకు ఆచరణకు ప్రాణం, నేను యెప్పుడూ చెపుతూ ఉంటా నిన్నటి దాన్ని ఆలోచించకు
రేపటి దాన్ని గురించి విచారించకు, నేటి పనిని ధర్మమార్గాన చేస్తూ సాగు ముందుకు. ఆనందాన్ని పంచి పోందటమే నిజమైన మార్పు మీకందరికి ధన్యవాదాలు. మీదారిన మీరు సలహలిస్తూ ఉంటే కడుపు నిండదండి ఆచరించి అనుభవించిన వారికి తెలుస్తుందండి, నేను ఆచరించుటలేదా ఘమిటీ ఇదిగో ఈరోజు పండగ పెళ్ళాం కు సహయపడదామని అనుకోరు అది చేయి ఇది చేయి అని సలహమాత్రం ఇస్తారు -
ఏమిటండీ మీరు చేసేపనీ ఎక్కడున్నారు అని ఫోన్ చేసింది శ్రీ దేవి సజ్జ ఊడుస్తున్న ముందు దిగి రండి ఈ గారెలు తినండి పనివాడు వస్తాడు చేస్తాడు అని ఫోన్ కట్ చేసింది ఇంతేన అని నోరు తెరిచాడు అవును అంతే ఆ అన్నది
ఆ...ఆ... అం టు నవ్వు కున్నారు
--(())--


ఇతర జీవజాతుల నుండి మనిషి నేర్చుకోవాల్సిన విషయాలు. - జీవజాతులు vs జనాభా నియంత్రణ  
Ans :--
1) కప్ప జాతిని చేప, పాము జాతిని గ్రద్ద,చిన్న జంతువులను పెద్ద జంతువులు, ఇలా జనాభా నియంత్రణ కొనసాగుతుంది.
అంతేగాని జంతుజాతిని నియంత్రించడానికి వాటిని చంపడానికి మానవ జాతికి ఎటువంటి అధికారం లేదు.

2) చైతన్య పరిణామంలో ప్రస్తుతం మానవజాతి ముందుండి. పూర్వం కొన్ని నాగారికతల్లో మానవజాతి కంటే జంతుజాతే తెలివిగా ఉండేది. ప్రస్తుతం కూడా సకల ప్రాణికోటి మానవ చైతన్య పరిణామానికి దోహదపడుతుంది.

3) ప్రత్యక్షంగా పరోక్షంగా సకల జీవజాతుల మానవజాతికి తమ్ముళ్ల వంటివారు. వాటిని చంపడమంటే మానవ చైతన్య పరిణామాన్ని చంపుకోవడమే. జంతుజాతులన్నీ ఇతర లోకాలనుండి భూమ్మీద కు వచ్చిన ప్రతినిధులు.

4) మనకు ఒక చెయ్యి విరిగిందంటే అంగవైకల్యం, దేహానికి కొంత వెలితి ఏర్పడుతుంది. అలాగే జీవజాతులు చైతన్య పరిణామానికి మానవ జాతి ఆటంకం కలిగిస్తే మన చైతన్య పరిణామానికి ఆటంకం కలిగించినట్లే.

5) వైద్యశాస్త్ర ప్రయోగాల కోసం జంతువుల దేహాలు,
మృతజీవకణాలపై ప్రయోగాలు చేసి, వాటిని హింసించి చంపుతున్నారు. ఇది చాలా హీనమైన పని. దీని ద్వారా అభివృద్ధి అయిన అల్లోపతి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

******
* పరశురామ జయంతి

పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు. పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము తెలుపుచున్నవి. 

పరశురామ జయంతి నాడు ఉపవసించి , పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత ! వీర ! క్షత్రియాంతక ప్రభో ! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర !" అని అర్ఘ్యప్రదానము 
చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు , జామదగ్ని అని కూడా అంటారు.

పరశురాముని జన్మవృత్తాంతం:

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు , తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు , రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి , మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని , రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి , అజేయ పరాక్రమవంతుడై , ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది , పరశురాముడైనాడు.

కార్తవీర్యునితో వైరం:

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి , దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని , వేయి చేతులు పొంది , మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి , అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి , ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి , దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు , తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని , సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా , అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని , సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి , కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండేనికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

రామాయణంలో పరశురాముడు:

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి , రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను , రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తిని కొట్టమని చెప్పి , తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

మరికొన్ని విషయాలు:

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణం లో వివరించబడింది.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ , తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధ.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ , అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ , మందిరాలూ చాలా తక్కువ.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా , ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లొ గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.
*****
చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా

చదివే సమయంలో పెదవులు తగలనిది

శ్రీశా సతత యశః కవి
తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం
కాశా నిరతారాధిత
కీశేశా హృష్ణ గగనకేశా యీశా

ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది
అంటే పెదవి తగలనిది, తగిలేది

దేవా శ్రీమాధవ శివ
దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా
జ్యావగ వంద్యా వాసవ
సేవితపద పగవిరామ శివ జపనామా

కేవలం నాలుక కదిలేది

సారసనేత్రా శ్రీధర
రారా నన్నేల నిందు రాక్షసనాశా
నారద సన్నుత చరణా
సారతరానందచిత్త సజ్జనరక్షా     

                                                                                                                                   
నాలుక కదలని (తగలని) పద్యాలు

కాయముగేహము వమ్మగు
మాయకు మోహింపబోకు మక్కువగ మహో
పాయం బూహింపుము వే
బాయగ పాపంబు మంకుభావమవేగా
భోగిపభుగ్వాహ మహా
భాగా విభవైకభోగ బావుకభావా
మేఘోపమాంగభూపా
బాగుగమముగావువేగ బాపాభావా

నాలుక కదిలీ కదలని పద్యం

ఓ తాపస పరిపాలా
పాతక సంహారా వీర భాసాహేశా
భూతపతిమిత్ర హరి ముర
ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా  

🙏  పద్య భాషాభిమానులకు జోహార్లు.

తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు  
🙏 
*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *
*****
*దుష్కర్మఫలితం
  
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!

ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.  తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. 

కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.

ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.

 ”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.

అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…

”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు,  నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ,   నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు)

ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.

తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”
”నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...

”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.

అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ..  “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి....ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.

అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.

మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.
  
భూమి మీదపడి నప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”✍️

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!
***
*344) యోగవాసిష్ఠ రత్నాకరము 

1-106

జేతుమన్యం కృతోత్సాహైః పురుషైరిహ పణ్డితైః 
పూర్వం హృదయశత్రుత్వాజ్జేతవ్యానీన్ద్రియాణ్యలమ్‌. 

ఈ ప్రపంచమున అన్యమగు దేనిని జయింప ఉత్సాహము గలిగి యున్నవారైనప్పటికిని వివేకము గల మనుజులు తమ హృదయమందలి శత్రువు లగుటవలన మొట్టమొదట ఇంద్రియములనే పూర్ణముగ జయించవలెను. 

1-107

ఏతావతి ధరణితలే సుభగాస్తే సాధుచేతనాః పురుషాః 
పురుషకలాసు చ గణ్యా 
న జితా యే చేతసా స్వేన‌ 

ఎవరు తమ చిత్తముచే జయింపబడకయున్నారో (ఎవరు తమ చిత్తమును జయించిరో) వారే ఈ సమస్త భూమండలనుందును సౌభాగ్యవంతులు, వారే సాధుచిత్తులు; అట్టివారే పురుషు లనఁదగిన వారు మఱియు పురుషకళలగు మోక్షకౌశలాదులందు వారే గణనీయులు.

1-108

హృదయబిలే కృతకుణ్డల 
కలనావివశో మనోమహాభుజగః 
యస్యోపశాన్తి మాగత 
మలముదితం తం సునిర్మలం వన్దే.

హృదయమను బిలమున చుట్టచుట్టుకొని గర్వపరవశమైయున్న మనస్సను మహాసర్ప మెవనికి సంపూర్ణముగ వశమై పోయినదో, మఱియు ఎవఁడు స్వస్వరూపము (ఆత్మరూపము) తోడ లెస్సగ ఆవిర్భవించియున్నాడో, అట్టి మహానిర్మలుఁడగు తత్త్వవేత్తకు నమస్కరించుచున్నాను.
***
, తన చుట్టూ ఉన్న ను సంపాదించి పూర్ణత్వాన్ని సాధించాలనుకుంటుంది. అన్నిటికీ  నిన్ను నీవు గుర్తించానని అంటున్నావు.

అవుతుందని అంటున్నావు, అయితే ఎందుకు? దేనిని కాంక్షించి ఇంకా ఇలా కష్టపడి ప్రణాళికలను వేస్తూ, అమలు జరుపుతూ సమాజ సేవ చేస్తూ విశ్రాంతి లేకుండా వు? భ్రమాజనిత లయిన జీవులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు. 

జనకుడు కూడా ఈ జీవులలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఈ అతనిలో ఈ జ్ఞానం ఉందని ఎలా అనుకోవడం?

కావాలనే ఈ విధంగా అష్టావక్రుడు తన శిష్యుడిని హేళన చేస్తున్నారు. ఏర్పడిందో లేదో  ఇలా ప్రశ్నిస్తున్నారు.

*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
🕉️🌞🌏🌙🌟🚩

రేకు: 93-3
సంపుటము: 1-461
రేకు రాగము: ముఖారి.


వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల
పుడమిధరుఁడు మాఁకు భువనౌషధము!! 
॥పల్లవి॥


హరి యచ్యుతాయంటే నణఁగుఁ బాపములు
నరసింహ యనియంటే నాఁటినదుఁఖములు మాను
పురుషోత్తమాయంటేఁ బుండ్లు బూచులు మాను
పరమౌషధ మీతఁడే పాటింప మాకు!!
॥వెడ॥


వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా
వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను
శ్రీసతీశ యనియంటే చింతలిన్నియును మాను
గాసిదీర నితడేపో ఘనదివ్యౌషధము!! 
॥వెడ॥


గోవిందా యనియంటేఁ గూడును సంపదలు
యీవల మాధవయంటే నిహముఁ బరముఁ జేరు
దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు
శ్రీవేంకటేశుఁడే మాకు సిద్ధౌషధము!!
॥వెడ॥

🕉️🌞🌏🌙🌟🚩

*వెడమంత్ర = తుచ్ఛమైన మంత్రాలు*

*వేరువెల్లంకులు = మూలికా వైద్యములు*

*భువనౌషధము = గొప్పదైన మందు*

*బూచులు = మానసిక వ్యాధులు*

*గాసిదీర = మా శ్రమ తొలగుటకు*

*సిద్ధౌషధము  = దొరికన ఔషధం*

  ఓ ప్రజలారా భూదేవికి భర్త మాకు గొప్పదైన మందు అది ఉండగా ఇంకా తుచ్ఛమైన మంత్రాలు మూలికా వైద్యములు ఎందుకయ్యా. శ్రీహరి అచ్యుతా అంటే పాపములన్నీ నశిస్తాయి. నరసింహా అంటే పాతుకుపోయిన రోగాలు తొలగిపోతాయి.


పురుషోత్తమా అని ప్రార్ధిస్తే కురుపులు మానసిక వ్యాధులు తొలగిపోతాయి. కాబట్టి మాకు సమ్మతించిన పరమౌషధం ఈ శ్రీహరియే. వేరుగా ఇంకే మందూ అవసరంలేదు. బంధముల వలన మనిషి వేదన చెందుతాడు.


దానికీ ఒక మందువున్నది వాసుదేవ అని ప్రార్థిస్తే చాలును. కృష్ణా అని అంటే పేరుగన్న రోగాలు ఇబ్బందులు తొలగిపోతాయి. మా శ్రమ తొలగుటకు ఇతడే పో ఘనమైన ఔషధము.


 సగం వ్యాధులు సరైన తిండిలేక వస్తాయి. దానికి మందు ధనం అది వుంటే సగం వ్యాధులు రావు. గోవిందా అని అంటే సమస్త సంపదలు సమకూడుతాయి. ఇక మాధవా అన్నాము అంటే ఇహమున సుఖములు చనిపోయాక మోక్షము లభిస్తాయి.


 ఓ దేవా నారాయణా అని అంటే దేహములో దేహి సుఖముగా వుంటాడు. ఇవన్నీ లభించాలంటే ఒక మంచి గొప్పదైన ఔషధం కావాలి కదా. మాకు ఆ ఔషధమే శ్రీవేంకటేశ్వరుడు అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉️🌞🌏🌙🌟🚩

 *4.5.2022   ప్రాతఃకాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*చతుర్థస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*

*పృథుమహారాజు నూరు అశ్వమేధ యాగములను ఆచరించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️
*19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*ఇత్యామంత్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజో రుషా|*

*స్రుగ్ఘస్తాన్ జుహ్వతోఽభ్యేత్య స్వయంభూః ప్రత్యషేధత॥3364॥*

విదురా! యజ్ఞ యజమానియైన పృథుమహారాజునకు ఇట్లు విన్నవించిన పిదప ఋత్విజులు కోపముతో మంత్రపూర్వకముగా ఇంద్రుని ఆహ్వానించిరి. పిమ్మటవారు స్రుక్కు, స్రువములద్వారా ఆహుతులను సమర్పించుటకు సన్నద్ధులైరి. అప్పుడే బ్రహ్మదేవుడు అచటికి విచ్చేసి, వారి ప్రయత్నములను నిలువరించి ఇట్లనెను-

*19.30 (ముప్పదియవ శ్లోకము)*

*న వధ్యో భవతామింద్రో యద్యజ్ఞో భగవత్తనుః|*

*యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః॥3365॥*

ఋత్విజులారా! మీరు ఇంద్రుని వధింపదగదు. ఏలయన యజ్ఞమనగా ఇంద్రుడే. అతడు భగవంతుని ప్రతినిధి.  యజ్ఞముద్వారా మీరు ఆరాధించుచున్న ఈ దేవతలు అందరును ఇంద్రుని అంగములే. అట్టి ఇంద్రుని మీరు చంపగోరుచున్నారు. ఇది ఎంతవరకు యుక్తము?

*19.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*తదిదం వశ్యత మహద్ధర్మవ్యతికరం ద్విజాః|*

*ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసతా॥3366॥*

బ్రాహ్మణోత్తములారా! పృథుమహారాజు చేయుచున్న యజ్ఞమునకు విఘ్నమును కలిగించుటకై ఇంద్రుడు చేసినపని పాషండకృత్యము. అది పూర్తిగా ధర్మము నశింపజేయునట్టిది. కనుక, ముందుగా మీరు ఈ సంగతిని గమనించుడు. ఆ ఇంద్రుని వ్యతిరేకించుటను మానుకొనుడు. లేనిచో, అతడు మరింతగా పాషండమతమును వ్యాపింపజేయగలడు. తద్ద్వారా అధర్మము యొక్క ప్రచారము పెరిగిపోవును.

*19.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*పృథుకీర్తేః పృథోర్భూయాత్థర్హ్యేకోనశతక్రతుః|*

*అలం తే క్రతుభిః స్విష్టైర్యద్భవాన్ మోక్ష ధర్మవిచిత్॥3367॥*

ఎనలేని కీర్తి ప్రతిష్టలు గల పృథుమహారాజు చేసిన యజ్ఞములు తొంబదితొమ్మిదియే యగుగాక! అవి చాలును అని పలికి, పిమ్మట బ్రహ్మదేవుడు పృథుమహారాజుతో ఇట్లనెను - రాజా! నీవు మోక్షధర్మములను బాగుగా ఎరిగినవాడవు. నీకు ఇంద్రపదవియొక్క అవసరము లేనేలేదు. కనుక, నీవు యజ్ఞములను చేయవలసిన అవసరమేమున్నది?

*19.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*నైవాత్మనే మహేంద్రాయ రోషమాహర్తుమర్హసి|*

*ఉభావసి హి భద్రం తే ఉత్తమశ్లోకవిగ్రహౌ॥3368॥*

రాజా! నీవును, ఇంద్రుడును శ్రీహరియంశలే. కనుక నీ స్వరూపమేయైన ఇంద్రునియెడ కినుక వహించుట తగదు. నీకు శుభమగుగాక!

*19.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*మాస్మిన్ మహారాజ కృథాః స్మ చింతాం నిశామయాస్మద్వచ అదృతాత్మా|*

*యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోఽతిరుష్టం విశతే తమోఽంధమ్॥3369॥*

మహారాజా! ఈ యజ్ఞవిఘ్న విషయమున నీవు ఏమాత్రమూ చింతింపవలదు. నీవు నా మాటను సాదరముగా వినుము. దైవికముగా విఘ్నము ఎదురైనప్పుడు అదేపనిగా దానిని గూర్చియే ఆలోచించుచున్నవాని మనస్సు మిగుల కోపమునకు లోనగును. అప్పుడు అతడు మోహపరవశుడై అశాంతిని పొందును.

*19.35 (ముప్పది ఐదవ శ్లోకము)*

*క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహః|*

*ధర్మవ్యతికరో యత్ర పాషండైరింద్రనిర్మితైః|*

రాజా! ఈ యజ్ఞమును విరమింపుము. దేవతలందరు మిగుల దురాగ్రహులు అనగా, అంతులేని పట్టుదలగలవారు. ఇంద్రునిచే సృష్టింపబడిన పాషండులు ఇట్లు ధర్మవ్యతిరేక కార్యమునకు ఒడిగట్టిరి.

*19.36 (ముప్పది ఆరవ శ్లోకము)*

*ఏభిరింద్రోపసంసృష్టై పాషండైర్హారిభిర్జనమ్|*

*హ్రియమాణుం విచక్ష్వైనం యస్తే యజ్ఞధ్రుగశ్వముట్॥3371॥*

మహారాజా! యజ్ఞాశ్వమును దొంగిలించి, నీ యజ్ఞమును విఘ్నము కలిగించుటకు పూనుకొనినవాడు ఇంద్రుడే. అతనిచే సృష్టింపబడినవారే ఈ పాషండులు. వీరు తమ తియ్యని మాటలచేత జనులను ఆకట్టుకొనుచున్నారు. ఆ పాషండుల మాటల ఉచ్చులలో బడిన ఈ  జనులను చూడుము.

*19.37 (ముప్పది ఏడవ శ్లోకము)*

*భవాన్ పరిత్రాతుమిహానతీర్ణో ధర్మం జనానాం సమయానురూపమ్|*

*వేనాపచారాదవలుప్తమద్య తద్థేహతో విష్ణుకళాసి వైన్య॥3572॥*

మహారాజా! నీవు సాక్షాత్తు విష్ణ్యంశ సంభూతుడవు. వేనుని దురాపచారమువలన జనులయొక్క వర్ణాశ్రమ ధర్మములు లుప్తములై పోవుచుండెను. సమయానుకూలముగా ధర్మములను పరిరక్షించుటకై నీవు వేనుని శరీరమునుండి ఉద్భవించితివి.

*19.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*

*స త్వంవిమృశ్యాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి|*

*ఐంద్రీం చ మాయాముపధర్మమాతరం ప్రచండపాషండపథం ప్రభో జహి॥3373॥*

నృపాలా! నీవు సాక్షాత్తుగా భగవదవతార పురుషుడవు. ధర్మపరిరక్షణకై అవతరించినట్టి నీవు నీ లక్ష్యమును గూర్చి బాగుగా ఆలోచింపుము. భృగువు మొదలగు ప్రజాపతులయొక్క సత్సంకల్పమును నెరవేర్చుము. ప్రబలమైన ఈ పాషండమార్గము ఇంద్రుని యొక్క మాయవలన ఏర్పడినదే. ఇది అధర్మమునకు తల్లివంటిది. కనుక ఈ పాషండ మార్గమును రూపుమాపుము.

*మైత్రేయ ఉవాచ*

*19.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*

*ఇత్థం స లోకగురుణా సమాదిష్టొ విశాంపతిః|*

*తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సందధే॥3374॥*

*మైత్రేయుడు వచించెను* - విదురా! లోకగురువైన బ్రహ్మదేవునియొక్క ఆదేశానుసారము సర్వసమర్థుడైన పృథుమహారాజు యజ్ఞసంకల్పమును విరమించెను. అంతేగాక, ఆ ప్రభువు ఇంద్రునితో సఖ్యమును ఏర్పరుచుకొని సంధి చేసికొనెను.

*19.40 (నలుబదియవ శ్లోకము)*

*కృథావభృథస్నానాయ పృథవే భూరికర్మణే|*

*వరాన్ దుదుస్తే వరదా యే తద్భర్హిషి తర్పితాః॥3375॥*

నిరుపమానమైన యజ్ఞములను నిర్వహించిన పిదప పృథు మహారాజు  అవబృథస్నానమును ఆచరించెను. అతనిద్వారా ఆయా యజ్ఞములయందు హవిస్సులను అందుకొని పరితృప్తులైన దేవతలు ఆయనకు పెక్కు వరములను ప్రసాదించిరి.

*19.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*విప్రాః సత్యాశిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధదక్షిణాః|*

*ఆశిషో యుయుజుః క్షత్తరాదిరాజాయ సత్కృతాః॥3376॥*

విదురా! నరేంద్రులలో ప్రముఖుడైన పృథుమహారాజు మిగుల భక్తిశ్రద్ధలతో బ్రాహ్మణోత్తములకు భూరిదక్షిణలను ఒసంగెను. ఆయన చేసిన సత్కారములకు వారెంతయు సంతుష్టులై, ఆ ప్రభువునకు అమోఘమైన ఆశీస్సులను ఇచ్చిరి.

*19.42 (నలుబది రెండవ శ్లోకము)*

*త్వయాఽఽహూతా మహాబావో సర్వ ఏవ సమాగతాః|*

*పూజితాః దానమానాభ్యాం పితృదేవర్షిమానవాః॥3377॥*

ఆ సందర్భమున ఆ విప్రవరులు మహారాజుతో ఇట్లనిరి - *ప్రతాపశాలియైన ప్రభూ! పితృదేవతలు, దేవతలు, ఋషులు, మానవులు మొదలగువారు పెక్కుమంది నీ ఆహ్వానమును అందుకొని యజ్ఞమునకు విచ్చేసిరి. వారిని అందరిని చక్కగా పూజించి, దానములతో, బహుమతులతో సత్కరించితివి. నీకు శుభమగుగాక!


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకోనవింశోఽధ్యాయః (19)*

ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పందొమ్మిదవ అధ్యాయము (19)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*4.5.2022   సాయంకాల సందేశము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*చతుర్థస్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*పృథుమహారాజుకు యజ్ఞశాలయందు శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*మైత్రేయ ఉవాచ*

*20.1 (ప్రథమ శ్లోకము)*

*భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః|*

*యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్ తమభాషత॥3378॥*

*మైత్రేయుడు వచించెను*- విదురా! షడ్గుణైశ్వర్య సంపన్నుడు, యజ్ఞరక్షకుడు, యజ్ఞభోక్తయు, ఐన శ్రీమహావిష్ణువు పృథుమహారాజుచే ఆచరింపబడిన తొంబది తొమ్మిది యజ్ఞములకు ఎంతయు సంతుష్టుడయ్యెను. అంతట ఆ పురుషోత్తముడు ఇంద్రునితో సహా అచటికి విచ్చేసి ఆ మహారాజుతో ఇట్లనెను-

*శ్రీభగవానువాచ*

*20.2 (రెండవ శ్లోకము)*

*ఏష తేఽకార్షీద్భంగం హయమేధశతస్య హ|*

*క్షమాపయత ఆత్మానమముష్య క్షంతుమర్హసి॥3379॥*

*శ్రీభగవానుడు ఇట్లు పలికెను*- రాజా! నీవు నూఱు యజ్ఞములకు చేయవలయునని సంకల్పించితివి. కాని ఈ ఇంద్రుడు నీ నూరవ యజ్ఞమునకు విఘ్నమొనర్చి నీ సంకల్పమును భంగపరచెను. తన తప్పునకు మన్నింపుమని ఈతడు నిన్ను అర్థించుచున్నాడు. కనుక ఇతనిని క్షమింపుము.

*20.3 (మూడవ శ్లోకము)*

*సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః|*

*నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హి నాత్మా కళేబరమ్॥3380॥*

నరేంద్రా! లోకములో మంచిబుద్ధి గలిగిన సాధువులు, ఉత్తమపురుషులు ఇతర ప్రాణులపట్ల ఎట్టి ద్రోహమును తలపెట్టరు. ఏలయన *ఈ శరీరము  ఆత్మకాదు* అని వారు ఎరుగుదురు.

*20.4 (నాలుగవ శ్లోకము)*

*పురుషాయది ముహ్యంతి త్వాదృశా దేవమాయయా|*

*శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధసేవయా॥3381॥*

నీవంటి జ్ఞానులు దేవమాయకు మోహితులు ఐనచో చిరకాలము వారు చేసిన సత్సంగము అంతయును వృథాయైనట్లేగదా!

*20.5 (ఐదవ శ్లోకము)*

*అతః కాయమిమం విద్వానవిద్యాకామకర్మభిః|*

*ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోఽనుషజ్జతే॥3382॥*

కావున *అజ్ఞానము, వాసనలు, కర్మలు మొదలగువానిచే నిర్మింపబడినది ఈ శరీరము* అని తెలిసికొని, జ్ఞాని దీనియందు ఆసక్తుడు కాడు.

*20.6 (ఆరవ శ్లోకము)*

*అసంసక్తః శరీరేఽస్మిన్నమునోత్పాదితే గృహే|*

*అపత్యే ద్రవిణే వాపి కః కుర్మాన్మమతాం బుధః॥3383॥*

ఈ శరీరమునంధు ఆసక్తిలేని జ్ఞాని, దీనిద్వారా సముపార్జించుకొనిన గృహమునందును, దారాపుత్రాదుల  యందును, సంపదలయందును ఎట్లు ఆసక్తుడగును?

*20.7 (ఏడవ శ్లోకము)*

*ఏకః శుద్ధః స్వయంజ్యోతిర్నిర్గుణోఽసౌ గుణాశ్రయః|*

*సర్వగోఽనావృతః సాక్షీ నిరాత్మాఽఽత్మాఽఽత్మనః పరః॥3384॥*

ఈ ఆత్మ ఉన్నది ఒక్కటే అనగా, అద్వితీయము. శుద్ధమైనది స్వయముగా ప్రకాశించునది. గుణములకు అధిష్టానము అయిననూ అది గుణాతీతమైనది - నిర్గుణము. సర్వవ్యాపకమైనది. ఆవరణములు లేనిది. సర్వమునకు సాక్షియైనది. శరీరమునందు ఆత్మ ఉండును. కాని, ఆత్మయందు వేరొక ఆత్మ ఉండదు. కావున, అది శరీరముకంటే వేరైనది. విలక్షణమైనది.

*20.8 (ఎనిమిదవ శ్లోకము)*

*య ఏవం సంశమాత్మానమాత్మస్థం  వేద పూరుషః|*

*నాజ్యతే ప్రకృతిస్థోఽపి తద్గుణైః స మయి స్థితః॥3385॥*

ఆత్మ దేహమునందే ఉన్నప్పటికిని, దేహలక్షణములు దీనికి ఉండవు. దేహము ప్రకృతికి సంబంధించినది. ఆత్మ ఈ ప్రకృతి గుణములచే లిప్తము కానిది. ఈ జ్ఞానమును కలిగియున్న పురుషుడు పరమాత్మనైన నాయందే యుండును.

*20.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యః స్వధర్మేణ మాం నిత్యం నిరాశీః శ్రద్ధయాన్వితః|*

*భజతే శనకైస్తస్య మనో రాజన్ ప్రసీదతి॥3386॥*

పృథుమహారాజా! నిష్కామ భావముతో, తన వర్ణాశ్రమ ధర్మములద్వారా నిత్యము భక్తిశ్రద్ధలతో నన్ను ఆరాధించువానియొక్క చిత్తము క్రమక్రమముగా పరిశుద్ధమగును.

*20.10 (పదియవ శ్లోకము)*

*పరిత్యక్తగుణః సమ్యగ్దర్శనో విశదాశయః|*

*శాంతిం మే సమవస్థానం బ్రహ్మకైవల్యమశ్నుతే॥3387॥*;

ఆ విధముగా అంతఃకరణము పరిశుద్ధమైన వానికి విషయభోగములతో ఏమాత్రమూ సంబంధము ఉండదు. అతనికి తత్త్వజ్ఞానసిద్ధి లభించును. అతడే నాతో సమత్వస్థితిని (అద్వైతస్థితిని) పొందును. పరమశాంతి, బ్రహ్మైక్యము, కైవల్యము అనగా ఇదియే.

*20.11 (పదకొండవ శ్లోకము)*

*ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనామ్|*

*కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనమ్॥3388॥*

దేహము, జ్ఞానము, క్రియ, మనస్సు అనువానికి సాక్షియైనప్పటికిని, కూటస్థుడైన ఆత్మ వాటితో లిప్తుడుగాడు. ఈ తత్త్వమును తెలిసినవాడు పరమశ్రేయో రూపమైన మోక్షమును పొందును.

*ద్రవ్యమ్ = పృథివ్యాధి భూతాని, జ్ఞానమ్ = శ్రోత్రాది జ్ఞానేంద్రియాణి, క్రియ = వాగాది కర్మేంద్రియాణి, ఆత్మా = మనః - ఏషామ్ అధ్యక్షమ్ కూటస్థమ్ స్వరూపతః నిర్వికారమ్ ప్రత్యగాత్మానం యోగేన సంజీవదశాయామపి సుఖమాప్నోతి*

*20.12 (పండ్రెండవ శ్లోకము)*

*భిన్నస్య లింగస్య గుణప్రవాహో ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః|*

*దృష్టాసు సంపత్సు విపత్సు సూరయో న విక్రియంతే మయి ఐద్ధసౌహృదాః॥3389॥*

పంచభూతములు,ఇంద్రియములు వాటి అధిష్ఠానదేవతలు, చిదాభాసము (పరిచ్ఛిన్న జీవుడు) అనువాటి సముదాయమునందు ఆత్మ ప్రతిఫలించుటచే అవి ప్రకాశించుచున్నవి. కనుక, ఇవి ఆత్మకంటే భిన్నమైనవి. అయితే గుణప్రవాహరూపమగు గమనాగమనములు లింగ (సూక్ష్మ) శరీరముచే కలుగుచుండును. కాని, సర్వసాక్షియైన ఆత్మకు వీటితో ఎట్టి సంబంధమూ ఉండదు. నాయందు దృఢమైన అనురాగముగల జ్ఞానులు సంపదలయందును, ఆపదలయందును హర్షశోకాది వికారములకు లోనుగారు.

*20.13 (పదమూడవ శ్లోకము)*

*సమః సమానోత్తమమధ్యమాధమః సుఖే చ దుఃఖే చ జితేంద్రియాశయః|*

*మయోపక్లుప్తాఖిలలోకసంయుతో విధత్స్వ వీరాఖిలలోకరక్షణమ్॥3390॥*

మహావీరా! కనుక, నీవు ఉత్తమ, మధ్యమ, అధమ పురుషులయెడ సమానభావముతో మెలగుచు సుఖ, దుఃఖములయందు సమత్వమును వహింపుము. మనస్సును, ఇంద్రియములను జయించి, నాయందే ఏకాగ్రచిత్తుడవై  మంత్రులు మొదలగువారి సహాయముతో ఈ సకలలోక రక్షణ భారమును వహింపుము.



(చతుర్థ స్కంధము లోని ఇరువదియవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*


No comments:

Post a Comment