★★★ఏ గుణానికి ఏది మందు?★★★
‘డిప్రెషన్’, ‘స్ట్రెస్’, 'టెన్షన్’ - ఈ మూడు మాటలూ ఇప్పుడు నిత్యజీవిత నినాదాలై పోయాయి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి రంగంలోనూ మామూలై పోయాయి.
వీటికి పరిష్కారాలేమిటి?
భారతీయ తత్త్వశాస్త్రం పురాణాది ధార్మిక గ్రంథాల ద్వారా చక్కని సూచనలిచ్చింది. మనం గమనించలేక పోతున్నాం, అన్వయించుకోలేక పోతున్నాం.
ఒకప్పుడు భోగాలనిపించుకున్న వాటిని - ఇప్పుడు అవసరాలనుకుని, వాటిని ఎలాగైనా సాధించాలనే ఆశ ఒక ప్రధాన కారణం. అలాగని 'గొర్రెతోక' జీవితాలను సర్దిపుచ్చుకోమని కాదు కానీ, నిరంతరం ఏదో లోటును అనుభూతికి తెచ్చుకుంటూ, ఏదో కావాలనే ఆరాటాన్ని పెంచుకుంటూ సాగి పోవడం తగదు కదా!
ఒక నిదానం, ఒక క్రమశిక్షణ - లేకుండా అసంతృప్తి, అసహసం పెంచుకొని - కేవలం ‘సంపాదనయే జీవితం' అనే లక్ష్యాన్ని మనకు మనమే నిబద్ధించుకుని, ఆ దిశగా పరుగులు పెట్టే యాంత్రికతకు అలవాటుపడ్డాం.
ఒక పరిధి, ఒక పరిమితి ప్రతిదానికీ ఉంటాయి. అర్థకామాల సంపాదన అవసరమే కానీ, ఆ అవసరం ఏ మేరకు? అని నిర్దేశించే 'ధర్మం' అనే 'రెగ్యులేటర్' ఉండాలి. అది జీవితాన్ని తీవ్రమైన పరుగు పెట్టించకుండా నియంత్రిస్తుంది.
ఈ డిప్రెషన్లో బోలెడు రకాలున్నాయి.
అన్నిటినీ విశ్లేషించి, చికిత్స చేయడానికి ఎన్నో వైద్యశాలలున్నాయి. అవి పచ్చగా వర్ధిల్లుతున్నాయి.
అయితే మన ధార్మిక వాఙ్మయ చికిత్సా విధానం పద్ధతిని కూడా గమనించుకుంటే ముందు జాగ్రత్తలు, చికిత్సలు కూడా సాధ్యమౌతాయి.
శరీరంలో వాత, పిత్త, కఫ తత్వాలుంటాయి. ఒక్కొక్క దేహం ఒక్కో తత్త్వం. దానిననుసరించి చికిత్స జరపాలి - అంటుంది ఆయుర్వేదం. అలాగే మానసికంగా సత్వ రజస్తమో గుణాల తత్త్వాలుంటాయి. వాటిని విశ్లేషించగలగాలి. ఒక్కొక్కరి మనస్తత్వంలో ఈ గుణాల పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక్క గుణం మాత్రమే ఈ ప్రపంచంలో ఉండదు. మూడూ కలిసే ఉంటాయి. వేటిని ఎలా నియంత్రించాలో తెలిసి బ్రతకడమే తెలివితేటలు.
సాధారణంగా - మానవ జన్మ రజోగుణ ప్రధానమైనది. దేవతలు సత్యగుణ ప్రధానులు. భూతప్రేతాదులు తమోగుణ ప్రధానులు. మనలో ఏ గణాన్ని ఎక్కువ చేసుకుంటే ఏ వర్గంలోకి చేరవచ్చో పై విభజన బట్టీ మనమే ఎంపిక చేసుకోవచ్చు.
రజోగుణం వల్ల కామం, క్రోధం కలుగుతాయి. ఇవి తగిన మోతాదులో ఉండాలంటే సత్వగుణ సహాయం కావాలి. వివేకం, జ్ఞానం, సంతోషం, సంతృప్తి, సత్యం, నిగ్రహశక్తి, దయ, సామ్యం వంటి లక్షణాలు సత్వగుణ సంబంధాలు.
రజోగుణం వల్ల కలిగే లక్షణాలతో ఒకదానితో తీవ్రమైన అనుబంధం పడుతుంది. అది రాగమైనా, ద్వేషమైనా కావచ్చు. ఏదైనా ఎక్కువ ఆశించడం, ఎక్కువ భావించడం, ఆ చింతనలో అంచనా లెక్కువగా వేసుకోవడం, ఆశలు పెంచుకోవడం వంటి స్వభావాలు రజోగుణ ప్రకోపాలు, దీనితో నిజ జీవితంలో అంచనా ఏ మాత్రం దెబ్బతిన్నా, ఆశించినదానికి విరుద్ధంగా జరిగినా అలజడి, ఒత్తిడి ఏర్పడతాయి.
సాత్విక సాధనలలో ముందుగానే మనసును సంస్కరించుకుంటే ఈ రజఃప్రభావాల నుండి జాగ్రత్త పడవచ్చు. అందుకే సాత్వికాహారం, సాత్వికమైన దైవచింతన, నియమబద్ధమైన జీవిత విధానం, శ్రమతో ధర్మబద్ధంగా సంపాదించుకున్న దానితో తృప్తి చెందడం, క్షమాగుణం వంటివి అలవరచుకుంటే మానసిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.
రజోగుణ ప్రకోపం వల్ల ఒత్తిడికి, ఆందోళనకు గురైతే - కొందరు సత్వగుణంతో నియంత్రించుకోగలరు. ఆధ్యాత్మిక బోధలు, సాధన వంటివి ఈ విధమైన నియంత్రణలో భాగాలు. వేదాంత శాస్త్రం బోధించే 'వస్తు విచారం’ (ఏ విషయంలో ఎంతమేరకు సారం వుందో తేల్చే ఆలోచన) దీనికిసహకరిస్తుంది.
అయితే రజోగుణం తీవ్రస్థాయిలో దెబ్బతీసినప్పుడు, ఈ సత్వగుణంలో చికిత్స కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొందరు ఆ విధమైన ప్రయత్నాన్ని చేయరు కూడా. దానికి బదులుగా తమోగుణ సహాయాన్ని తీసుకుంటారు. నిద్ర, కునుకుపాటు, సోమరితనం, జడత్వం వంటివి తమోగుణ లక్షణాలు. మందులతో నిద్రపుచ్చడం, దేనికీ స్పందించని స్థితికి మెదడును తీసుకువెళ్ళడం - ఈ తమోగుణ చికిత్సా విధానం. ఇప్పుడు ఎక్కువ భాగం ఈ విధానాన్నే అవలంబిస్తున్నారు.
ఇది తాత్కాలికంగా రజోగుణ తీవ్రతని తగ్గించినా, తమోగుణం పాళ్ళు పెంచే ప్రమాదం ఉంది. జాడ్యం, మాంద్యం వంటివి సంక్రమించి బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఎన్నో సాధించగలిగిన ధీశక్తి మొద్దుబారుతుంది.
ఇలా కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికమైన ధ్యాన యోగ, సంకీర్తనాది సాధనాలు సహకరిస్తాయి. మనం వేదాంతం పలికే జ్ఞాన వైరాగ్యాలే స్ఫూర్తినిస్తాయి.
నిరాడంబర జీవితం, మితాహార, విహారాలు, ఉత్తమలక్ష్యమైన భగవచ్చింతన... ఈ మూడూ గొప్ప ఔషధాల్లా పని చేస్తాయి. ఎన్ని పనులు సాధించినా, ఎన్ని వ్యాపకాలున్నా 'మితి' అనే ధోరణిని ఈ మూడింటి ద్వారా సాధించవచ్చు.
సంయమనం గల చిత్తాన్ని, తొందరపాటులేని తనాన్ని బాల్యంనుంచే ఆధ్యాత్మిక జీవనసరళితో అలవాటు చేస్తే, ఆ పిల్లలు పెద్దయ్యాక మితిమీరిన రజోగుణానికి లోను కాకుండా, వాటి దుష్ప్రభాలకు గురికాకుండా ఉండగలరు.
లంకలోని సీతమ్మ ఈ సాత్విక సాధన వలననే, తన మహాదుఃఖతీవ్రతలో నిలదొక్కుకోగలిగింది. నిరంతరం రామచింతన, రామదీక్షపై విశ్వాసం, ధైర్యం, అశాభావం లాంటి సానుకూల సకారాత్మక భావాలు ఆమెకు ఆలంబనాలయ్యాయి.
హనుమంతుని ద్వారా రామవార్తను విన్నాక, అడిగి అడిగి రాముని వర్ణింపజేసి, ఆ రామకీర్తనతో పరవశించి సేదదీరింది.
అలాగే అరణ్యవాస కాలంలో ధర్మరాజాదులు సాత్విక సాధనలతో నిలబడగలిగారు. పురాణాల్లో - కష్టాలపాలైన దశలలో సావత్రి, దమయంతి, నలుడు వంటి వారు ఈ మార్గంలోనే స్వస్థులయ్యారు.
ఈ సాత్విక గుణ సమూహానికే 'దైవీ సంపద' అని పేరు పెట్టింది భగవద్గీత. 'దైవీ సంపద్విమోక్షాయ'. దైవీ సంపదవలననే దుఃఖం నుండి విడుదల లభిస్తుందని గీతాచార్యుని మాట.
[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, శివతత్త్వసుధానిధి, పూజ్య గురువులు “బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు” రచించిన వ్యాసం.]
"మృదంగ శైలేశ్వరి ఆలయం" అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.
కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.
దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.
ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు.
ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట.
మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని".
రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి.
మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.
Mr. అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు. తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని, వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతానున్నాము అని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు.
ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని, ఈ దొంగల అసమర్థత కి కారణం ఆ 'ప్రతిష్ట కర్మ' యొక్క 'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితం అని వారు చెప్పారు.
అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు.
ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం? వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని విడిచిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే చెప్పారు.
మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో?
🙏🙏🙏🙏🙏
* మనోజయం
రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి నీ మనసు ఆధీనంలో నువ్వు ఉండటం లేదంటే నీ ఆధీనంలోకి నీ మనసును తెచ్చుకోవడం తనదే పై చేయిగా ఉండాలని, ప్రతీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు. చివరికి అదే గెలుస్తుంది. మనం ఓడిపోతాం. గెలవడం మనసుకు అలవాటు ఓడిపోవడం మనకు అలవాటు. ఓడి, గెలిచామనుకుంటూ కొంతమంది సంతృప్తి పడుతూ ఉంటారు. ఆ అవకాశం మనకు ఇచ్చేది మనసే
మనసును గెలిచినవాడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. మనసును నేల కనిపించినవాడి నడవడిక నిండుకుండలా తొణక్క బెణక్క ఉంటుంది. మనో నాశనం అయినవాడి ముఖం భగవద్గీత చెప్పిన ఉత్తమమైన యోగిలా ఉంటుంది. మనలో ఉండి, మనతో పోరాటం ఈ మనసుకు... అదే గమ్మత్తు శత్రువు ఎక్కడో ఉండడు. లోపలున్నవాడిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే తొందరగా తేల్చుకోవాలి. మనసు
చెప్పినట్లు వింటే అరిషడ్వర్గాలకు ఆహుతి అయిపోతాం. లేదంటే మనసునే మచ్చిక చేసుకోవాలి. చితిలోని కట్టెను తీసుకుని, ఆ చితినే తగలబెట్టినట్లు మనసుతోనే మనసును నాశనం చెయ్యాలి.
ప్రపంచానికి వేదిక మనసే. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఎక్కడా ఎవరూ చూడరు. నిత్యం ఈ రంగస్థలం: ఖాళీగా రకరకాల భావోద్వేగాలతో నిండిపోయి, కుట్ర కుతంత్రాలతో మరిగిపోయి, రాగ ద్వేషాలతో, ఆశాపాశాలతో వేయి. పడగల సర్పంలా బుసలు కొడుతూ ఉంటుంది.
చాలా భీకరంగా, బీభత్సంగా, భయానకంగా ఉన్నత్తంగా ఉండే ఈ మనసును కూడా లొంగదీసుకునే రాజయోగి ఒకడున్నాడు. వాడు. మనిషే వాదెన్నడూ వెనకడుగు వెయ్యలేదు. రణమో, రాజనమో అంటూ పోరాడుతూనే ఉన్నాడు.
మనసును ఆధీనంలోకి తెచ్చుకునే దానితో సర్వకార్యాలు నెరవేర్చుకోవాలి. మనసు లేకపోతే మౌనాన్ని ఆశ్రయించాలి. కొండ మీద కూర్చోవాలి. శీతోష్ణ సుఖదుఃఖాదులను ఓర్చుకోవాలి. సంసార సముద్రాన్ని దాటేశానని సంతోషపడాలి. వద్దు వద్దు. అన్నీ ఉండగా, అందరితో ఉండగా, మనసును రళ్లెం వేసి పట్టుకుంటూనే ఈ బతుకు తీరం దాటాలి అంటాడు కబీర్ ఇది సంతోషం కలిగించే విషయం. కోట బయట యుద్ధం కంటే కోట లోపల యుద్ధం సురక్షితం అంటారు రామకృష్ణ పరమహంస..
ఇలా అందరూ చెయ్యగలరా? చెయ్యలేదు. అయినా తప్పదు. మనసు ఆధీనంలోకి మనం వెళుతున్నట్లు నటించి మన ఆధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. ఆ విషయాన్ని మనసు పసిగట్టకుండా చూసుకోవాలి. ఆ నైపుణ్యం మనకుండాలి. జీవితమంతా మనసుతో ఆడే అటే. ఇలాంటి రంజుగా ఉండే ఆట లేకపోతే బతుకు ఎంతో చప్పగా ఉంటుందనేమో భగవంతుడు మనిషికి మనసిచ్చాడు. ఆ మనసే అంతులేని శిక్షగా మారిపోయింది. మనసే బంధకారకం. మనసే మోక్ష కారకం అంటున్నాయి ఉపనిషత్తులు, అంటే ఎంతో చెడు చేసినా, చివరికి ఈ భవబంధాల్లోంచి విడగొట్టేది మన సేనన్నమాట. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు మనసు ఏదైనా చెయ్యగలదు. మంచిగా మనసుతో వ్యవహరిస్తూ అదుపు
చేసే సామర్థ్యం పెంచుకోవాలి. మనం ఒక ఎత్తు చేస్తే, అది మరో ఎత్తు వేస్తుంది. ఈ చదరంగ క్రీడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే పట్టుదల గల మనిషిని విజయం వరించకుండా ఉండదు!
ఆనందసాయి స్వామి
*“వంటపనా... అదేం మహా...!?”*
వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు... కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి.
ఏ ఏ కూరగాయలు ఎన్ని రోజులు ఫ్రెష్ గా ఉంటాయి... ఏవి త్వరగా చెడిపోతాయి అనేది తెలిసుండాలి. తెలిసుంటే చాలదు
రోజూ ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లు నిర్వహించాలి.తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు,
తినే సామర్థ్యం తెలిసుండాలి. దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని
సరిపడ పాత్రలు కూడా సమకూర్చుకోవాలి. రుబ్బాలి, వేయించాలి, ఉడికించాలి
పొడి చేయాలి. ఫాలో ఫ్రై... డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి.... ఫ్రై చేయాలి.కుక్కర్ మూత పెట్టాలే కానీ కేకలేయకూడదు.
అంట్లను కడగాలి... తుడవాలి... సర్దాలి.. శుభ్రతను పాటిస్తూ ఓ యుద్దమే చేయాలి.
నిన్నటి పాలు - ఈ రోజు పాలు, పాత డికాక్షన్ - కొత్త డికాక్షన్, కాఫీ పొడి - టీ పొడి తేడా తెలిసుండాలి. తెచ్చిన సామానులు సర్ది పెట్టే స్టోర్స్ మెనేజ్మెంట్ కూడా తెలిసుండాలి. రెండు మూడు బర్న ర్ల పై ఒకేసారి వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్ తెలిసుండాలి. వడ్డించడం తెలిసుండాలి.
మిగిలిన దానిని ఖాళీ చేసీ వేరే పాత్రలోకిసర్దుబాటు చేసే "స్పేస్ మేనేజ్మెంట్ " తెలుసుండాలి.
“అమ్మా...!” అంటూ పిలిచే వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్ని పనులూ పూర్తి చేయగలిగే మల్టీటాస్కింగ్ సామర్థ్యము కలిగి ఉండాలి.
ఒక దోశ హాట్ కంటైనర్ లోకి దూర్చి మరొకటి ప్లేట్లోకి వేసి - వేరోకటి పెనం పైన వేసే చేతి వాటం కలిగుండాలి.
నిత్య మేనేజ్మెంట్ - చిన్నచిన్న గాయాలు, చురుకులకు చలించని కామన్ సెన్సు, సమయస్పూర్తి ఉండాలి.ఇవన్నీ ఏ కోచింగ్ సెంటర్ కూ వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ “శ్రమ జీవులందరికీ” గౌరవాన్నిచ్చే పెద్ద మనస్సుండాలి...!
“వంటపనా... అదేం మహా...!?” అని వెటకరించే ముందు
“ఇన్ని సామర్ధ్యాలు, సుగుణాలు మనకున్నాయా...?!” అని ఆలోచించాలి.
"వంటపని"లో అందం అవసరం అది అందరి జీవనాధారం.
"వంటపని" ఒక ధ్యానం...!
భక్తి , దినచర్య , కళ , విజ్ఞానం , ప్రేమ, అనుభూతి, సేవ, గౌరవం, విలువ...
ఈ విషయాల్లో వెటకారం తగదు.
వంటింటి కళాకారులకి ఓ పెద్ద "నమస్కారం...!"
ఈ రోజు ** మంచి మాట..లు
*మనకు ఇచ్చిన జీవితం అదృష్టం గా భావించు*. *కష్టసుఖాలు దేమిడు ఇచ్చిన వరంగా భావించు*. *గెలుపు ఓటములు దేముడు ఇచ్చిన బహుమతులు గా స్వీకరించు*. అప్పుడు *జీవితం అంటే ఎప్పుడు నీకు కష్టం అనిపించదు..జీవితం అంటే ఎప్పుడు అసంతృప్తి ఉండదు*. *విత్తనం నాటగానే మహా వృక్షం కాజాలదు*. *మనిషి పుట్టగానే మహనీయుడు కాజాలాడు*. *సరిగమలు పలకగానే విద్వాoసుడు కాలేరు* *కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు* *కృషితో నాస్తి దుర్భిక్షo*.
*దేవుడికి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఆయనకు అది కరువు కాదు, వయసు మళ్ళిన అమ్మ నాన్న లకు ఒక ముద్ద అన్నం పెట్టండి, వాళ్ళు మనకు బరువు కాదు, మనకు మొదటి దేవుళ్ళు కనిపెంచిన తల్లి తండ్రులే .*
*నీవు మరణా నంతరం విడిచిపెట్టే ఆస్తి వివాదాస్పదం కాకుండా చూసుకో, లేకుంటే లాయర్లే మీ వారసులు అవుతారు...*
🍁 *సర్వేజనా స్సుఖినోభవంతు* 🍁✍️
శుభోదయం
.......
🌸శ్రీ గురు దేవాయ నమః.👏 రవిః
* 8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"-1
గహనా కర్మణా గతిః = కర్మ గతి తెలుసుకోవడం చాలా కష్టం. కర్మ ముందా, జన్మ ముందా?
కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ అనుకున్నాం. కాని మొదటి జన్మకి మునుపు మనకి జన్మ లేనప్పుడు కర్మ కూడా ఉండదు కదా? అసలు మొదటి జన్మ మనకి ఎలా వచ్చింది? అసలీ జన్మ చక్రంలో మనం ఎలా చిక్కుకున్నాం?
ఈ ప్రశ్నలని ఎంతమంది వేదాంతులని, ఎంతమంది మహాత్ములని, సత్ పురుషులని అడిగినా కూడా ఇంతదాకా ఎవరూ తృప్తికరమైన జవాబివ్వలేదు. చెట్టు ముందా, విత్తు ముందా? ఎవరు చెప్పగలరు?
బృహదారణ్యకోపనిషత్ లో ఈ ప్రశ్న వస్తుంది. త్రేతాయుగంలో జనక మహారాజు సభలో ఓ రోజు వేదాంత చర్చని ఏర్పాటు చేసి, ఎవరు అందులో గెలిస్తే వారికి బంగారు మువ్వలు, గంటలు కట్టిన వెయ్యి గోవులని బహుమానంగా ప్రకటించాడు. వేదాంత చర్చ జరుగుతోంది.
యాజ్ఞవల్క్య మహర్షి ఆ సభలో తనే గొప్ప పండితుడినని, కాబట్టి ఆ గోవులని తనకే ఇప్పించమని కోరాడు. గార్గి అనే తపస్వి ఆయన్ని చివరగా ఈ ప్రశ్న అడిగింది.
“జన్మ ముందా? కర్మ ముందా?”
“అది నువ్వు అడక్కూడదు. నేను చెప్పకూడదు.” జవాబు చెప్పాడు.
“కాదు. నేను అడుగుతున్నాను. నువ్వు చెప్పి తీరాలి.” గార్గి పట్టుబట్టింది.
“మరోమారు ఆ ప్రశ్న అడిగావంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది జాగ్రత్త.” హెచ్చరించాడు యాజ్ఞవల్క్యుడు.
ఆ గోవులని ఆయన తోలుకువెళ్ళాడు. జన్మ ముందా లేక కర్మ ముందా అనే ప్రశ్నని ఎవరూ ఎందుకు వేయకూడదు? దానికి సమాధానం లేదా? లేక ఉన్నా ఆ రహస్యాన్ని పరమాత్మ రహస్యంగా ఉంచదలచుకున్నాడా? ఇది ఇంతదాకా ఎవరికీ తెలీని విషయం.
'అసలు మొదటి జన్మ ఏది? అంతకు మునుపు మనం ఎవరం? ఆ మొదటి జన్మ ఎందుకు వచ్చింది? రెండవ జన్మకి కర్మ మొదటి జన్మ వల్ల వచ్చింది. మరి మొదటి జన్మకి కర్మ ఎక్కడ నించి వచ్చింది?'
వీటికి తార్కికమైన జవాబులు ఎవరూ ఇంతదాకా ఇవ్వలేకపోయారు. అసలీ కర్మ చక్రం ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ చెప్పలేరు కాబట్టి దీన్ని 'ఆది లేనిది' గా చెప్పారు.
***
No comments:
Post a Comment