Sunday, 29 May 2022




* " పాలితకింకరం ,సర్వం ,

మాలికారుండరాజితమ్..

నీలవర్ణాత్మతత్త్వస్థం,

నీలకంఠం స్మరామ్యహమ్ !!! "


సీ..కాయమన్నది నీది....కానుకగుటెకదా

మానసికముగా ను....మహిమ జూపు

నిర్బంధ కళలకు... నిర్విరామ కృషియే

నీలోన ప్రేమయే... నిన్ను జూపు

లోనాబయట జూడు...లోతుగా గమనించు

మీరు మీరుగనేలె....మేను జూపు

సుఖనిద్ర అవసరం...సమయాన్ని జూపించు

ఆరోగ్య సంపదే....ఆది జూపు


జీవితంతో నిజంగానె జీవ యాత్ర

హృదయ స్పందనలను బట్టి హృద్యమైన

శయన విగ్రహాలు వలెనే సకల మగుటె

బుద్ధుని ప్రబోధం వలే బుడగ బ్రతుకు

____((()))____


*అక్షిపశ్న కదాలుమం ఛిద్యంతే హి శిరోరుహః ౹

 వర్ధమానాత్మనా మేవ భవంతి హిపత్తయః ౹౹


కనురెప్పలను ఎవరు కత్తిరించరు.అయితే తల జుట్టును అప్పుడప్పుడు కత్తిరిస్తారు.అలాగే,ఈ లోకంలో  అభివృద్ధి పొందుతున్న వ్యక్తులు ఎదురయ్యే విపత్తులను నిరంతరంగా ఎదిరిస్తూ ఉండాలి.


 శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️*

*14) శ్లోకం:-*

*సర్వాపదాం నిలయమేత్య వయోధికత్వం  జంతుః సుఖం న లభతే హ్యాపి కించిదత్ర |*

*పుంసామిహాస్తి న భయం ఖలు మృత్యుతోఽ న్యత్- ధిక్కృత్య సంసృతి మిమామభవం విరక్తః ॥ 14*

*టీకా* 

సర్వ ఆపదాం నిలయం = అన్ని కష్టాలకి ఉనికిపట్టు అయిన, వయోధికత్వం = వృద్ధాప్యాన్ని, ఏత్య = పొంది, అత్ర = ఈస్థితిలో, జంతుః = జీవుడు, కించిత్ అపి సుఖం = కొద్దిపాటి సుఖాన్ని కూడా, న లభతే హి = పొందడు కదా, పుంసాం = పురుషుడికి, ఇహ = ఈ దశలో, మృత్యుతః = చావుకన్నా, అన్యత్ భయం = మరణంకన్నా వేరే భయం, ఖలు న అస్తి=ఉండదు కదా, ఇమం సంస్కృతిం=ఈ మార్పుని, ధిక్కృత్య = ధిక్కరించి, విరక్తః అభవం = విరక్తుణ్ణి అయ్యాను.

*భావం:-*

అన్ని కష్టాలకు మూలమైన వృద్ధాప్యం వచ్చాక జీవుడికి ఆస్థితిలో ఎలాంటి సుఖమూ వుండదు.

 మృత్యువు వినా ఇతర భయం ఇంకేమీ మిగలదు. ఈ మార్పుల ప్రపంచాన్ని ధిక్కరించి విరక్తుణ్ణి అయ్యాను. 

*వివరణ:-*

వృద్ధాప్యంలో రాని చిక్కులు, ఇబ్బందులూ లేవు. చూపు, వినికిడి,

ఓపిక, జీర్ణశక్తి అన్ని ఉడికిపోతాయి. తల నెరసి, పళ్లూడి, బుగ్గలు గుంటలు పడి శరీరం వికారంగా తయారవుతుంది. దేహానికి భోగించేశక్తి ఉండదు. ఇక చావు వస్తూందనే భయం ఒక్కటే మిగిలి ఉంటుంది.

పసితనంలో ముద్దులొలికిన శరీరమే, యౌవనంలో దృఢంగా బలంగా ఉన్న శరీరమే, వృద్ధాప్యంలో ఈ వికృత రూపాన్ని పొందుతుంది. ఇదే సంస్కృతి అంటే. దీనిని గుర్తించి ఏవగించుకోవడం విజ్ఞత లక్షణం. అదే నిజమైన విరక్తి.

384) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 

*స్థితి ప్రకరణము*  

*రెండవ అధ్యాయము*

*దామ వ్యాళ కటోపాఖ్యానము*

2-104

కేచిచ్ఛక్తత్వమప్యుచ్చైఃప్రాప్య తుచ్ఛతయాధియా 

పునస్తిర్యక్త్యమాయాన్తి తిర్యక్త్యాన్నరకానపి. 

కొందఱు జీవులు ఉత్కృష్టజన్మను, జ్ఞానప్రాప్తికి సదవకాశములను బొందియు, తనయొక్క తుచ్ఛ విషయలోలత్వబుద్ధిచే మరల పక్షి, మృగాది నీచయోనులందు బుట్టి అటనుండి నరకమునకు గూడ బోవుచున్నారు. 

2-105

అసదేతదితి జ్ఞాత్వా మాఽత్ర భావం నివేశయ 

అనుధావతి న ప్రాజ్ఞో విజ్ఞాయ మృగతృష్ణికామ్‌. 

ఓ రామచంద్రా! ఈ దృశ్య జగద్రూపసంసారము అసత్తు (లేనిది) అని ఎఱిగి దానియందు నీ భావమును (దృష్టిని) ప్రవేశింపజేయకుము. (ప్రీతిగలిగి యుండకుము) “ఇది మృగతృష్ణ” అని యెఱింగిన ప్రాజ్ఞుడు మరల దాని వెంట ఎన్నటికిని పరుగెత్తడుగదా! 

2-106

వస్తున్యసతి లోకోఽయం యాతు కామమవస్తుని యస్తు వస్తు పరిత్యజ్య యాత్యవస్తు స నశ్యతి. 

సత్యవస్తువు (ఆత్మ ) లేనిచో మనుజుడు అసత్య వస్తువు (దృశ్య ప్రపంచమును) ను కోరవచ్చును. కాని సత్యవస్తువు ఉండియుండ అద్దానిని త్యజించి ఎవడు 

అసత్యవస్తువు కొఱకు పరువిడునో అతడు వినాశము నొందును. (పరమ పురుషార్థమునుండి భ్రష్టు డగును).

94) అష్టావక్ర గీత🧘‍♀️*

*అధ్యాయం - 9*

*నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)* 

*శ్లోకం 02:-*

*कस्यापि तात धन्यस्य लोकचेष्टावलोकनात् ।*

*जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशमः गताः ॥ ९-२ ॥*

*కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ ।*

*జీవితేచ్ఛా బుభుక్షా చ బుభుత్సోపశమః గతాః ॥ 9-2 ॥*

శ్లో|| కస్యాపి తాత! ధన్యస్య లోకచేష్టావలోకనాత్ | 

జీవితేచ్ఛా బుభుక్షాచ బుభుత్సోపశమం గతా |2.

*kasyaapi taata dhanyasya lokachesht’aavalokanaat ।*

*yeevitechchhaa bubhukshaa cha bubhutsopashamah’ gataah’ ॥ 9-2 ॥*

హేతాత = ఓనాయనా! లోకచేష్టావలో కనాత్ = ఉత్పత్తి వినాశరూపమగు లోక స్వరూపక్రియలను చూచుటవలన, కస్య = ఒకానొక, ధన్యస్యాపి = ధన్యునకు మాత్రమే, జీవితేచ్ఛా = జీవింపవలెననెడి కోరిక, బుభుక్షా = భోగేచ్ఛ, బుభుత్సా = జ్ఞానం సంపాదించవలెననెడి అభిలాష, ఉపశమం = శాంతిని, గతా = పొందుచున్నది.  

*వివరణ:-*

కుమారా! లోకాన్నర్థం చేసుకోవడం వలన జీవించాలని, అనుభవించాలనీ, తెలుసుకోవాలని కోరికలు నశించగా శాంతుడై జీవించే జ్ఞాని లోకంలో చాలా అరుదు. అట్టివాని జన్మ నిజంగా ధన్యమే.

*తాత్పర్యం:-*

అపారమయిన ప్రేమతో (తాత) కుమారా అని జనకుని సంబోధిస్తున్నారు మునీంద్రులు.

తన చుట్టూ ఉన్న జీవితాన్ని, జీవితంలోని బాధలనూ, భయాలనూ ఆందోళననూ అశాశ్వతత్వాన్నీ, చూస్తూ కూడా మనిషి జీవించాలనే కోరిక నుండి బయటపడలేక పోతున్నాడు.

మనశ్శరీరాలకు అవినాభావ సంబంధం ఉంది. మనస్సే శరీరం, జీవించాలనీ ఇంద్రియాలతో విషయభోగాలను అనుభవించాలనీ మనస్సు కోరుకుంటుంది.

 వాటిని తీర్చుకోవడం కోసం అనేక విధాల శ్రమిస్తుంది, ఈ కోరికలలో కొన్ని మాత్రమే తీరి మిగిలిన వాటి వల్ల అంతులేని అసంతృప్తి బయలుదేరుతుంది. తీరని కోరికల ఒత్తిడితో బుద్ధి పనిచేస్తుంది.

 తీరే విధానం ఏమిటని ఆలోచించడం మొదలు పెట్టిన బుద్ధి క్రమంగా తీర్చేవారెవరనీ, కోరికలంటే ఏమిటనీ, కోరే నేనెవరనీ, కనబడే ప్రపంచం ఏమిటనీ, ఇలా అనంతంగా ప్రశ్నలు వేసుకుంటూ తెలుసుకోవాలనుకుంటుంది.

బుద్ధి లక్షణమే తెలుసుకోగోరడం, తెలుసుకోగోరే బుద్ధి ఉన్నంతకాలమూ తెలియబడే ప్రపంచం కూడా ఉండనే ఉంటుంది. మనశ్శరీరాలకి జీవితేచ్ఛ, బుభుక్షా, అంటే జీవించాలని అనుభవించాలనీ కోరికలు అసంఖ్యాకంగా ఉంటాయి.

జీవితం అశాశ్వతం బాధామయం అని తెలిసినప్పటికీ, బుద్ధికి సంబంధించి తెలుసుకోవాలనే కోరిక-బుభుత్స విధిగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న జీవితాన్ని ప్రపంచాన్నీ చూస్తూ కూడా ఈ కోరికలను విడిచి పెట్టలేకపోవడం ఆశ్చర్యకరం, విచారకరం!

అధిష్ఠానమయిన చైతన్యం, ఇంద్రజాల సదృశమయిన ప్రపంచంగా తెలుసుకోవాలనుకునే బుద్ధిలో తెలియబడే భావాలుగా, జగత్ జీవ ఈశ్వర భావాలతో విభ్రాంతిని కలిగిస్తున్నది.

ఈ సత్యాన్ని అర్థం చేసుకుని భ్రమకూ అజ్ఞానానికి మూలమయిన తెలుసుకోవాలనే కోరికను విడచి పెట్టి నిశ్చల బుద్ధితో శాంతంగా జీవించే మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు.

జీవితపు మిథ్యాత్వాన్ని అర్థం చేసుకుని నిర్లిప్తతతో ఉదాసీన భావంతో సాక్షిగా చూస్తూ శాంతంగా స్వస్థితిలో నిష్ఠకలిగిన అట్టి మహాత్ముల జీవితం ధన్యం. సాధారణంగా అందరూ జీవితేచ్ఛకూ బుభుక్షకూ, బుభుత్సకూ దాసులయ్యే ఉంటారు.

తెలుసుకోగోరే బుద్ధి బహిర్ముఖమయి బాహ్యప్రపంచాన్ని చూస్తున్నంత సేపూ తెలియబడేవి అనంతంగా ఉంటూనే ఉంటాయి. ఇదే బుద్ధి ఇదే లక్షణంతో అంతర్ముఖమయి శాస్త్రసహాయంతో సత్యాన్ని అన్వేషిస్తే క్రమంగా శాంతస్థితి నంది స్వస్థితిలో నిలువగలుగుతుంది.

 ఇలా అంతర్ముఖమయిన బుద్ధి, జీవితేచ్ఛా బుభుక్షలనూ, విచక్షణతో వితరణ గుణంతో చూసే మనస్స్ఫూర్తి కలిగిన వ్యక్తి మాత్రమే నిర్వేదాన్నీ, నిర్లిప్తతతనూ సంపాదించగలడు.

 మిగిలిన వారంతా దుఃఖాలయం అశాశ్వతం అయిన జీవితాన్ని చూస్తున్న గ్రుడ్డివారు, గ్రుడ్డిగా అనుసరిస్తూనే ఉంటారు. ఏదో తెలుసుకోవాలనుకొంటూ, వింటూ, విన్నదాన్ని అర్థం చేసుకోలేని చెవిటివారు, అందుకే వింటున్నా తెలుసుకోవాలనుకుంటూనే ఉంటారు.

*అధ్యాయం : 20*

*మేము కాశ్మీరు వెళ్ళలేదు*

“మన మనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది. ఏమైనా జబ్బు చేసిందా?”

“ఔను.” మా స్నేహితులు తెచ్చిన సామాను, నిన్నటి యథా స్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేక పోయాను.

“బయల్దేరిం దో ఓడ స్పెయిన్‌కు చేరాలని

 తిరిగొచ్చింది వెంటనే అడంగుకు చేరకుండానే!”

​అన్న పద్యం [“సింగి అద్దంకి పోనేపోయింది, రానే వచ్చింది” అన్నట్టు] చదివాను.

గురుదేవులు గదిలోకి వచ్చారు. ఖాయిలాచేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో, ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను.

“గురూజీ, నా పన్నెండో ఏట మొదలు, చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను. కాని సాగలేదు. చివరికి, మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నను చేరనివ్వదని నమ్మకం కుదిరింది!”

పార్వతి, కాళి, దుర్గ, ఉమ, తదితర దేవతలు జగన్మాత భిన్న స్వరూపాలు; ఒక్కొక్క ప్రయోజనాన్ని అనుసరించి ఒక్కొక్క నామసంకేతం ఏర్పడింది. దేవుడు లేదా శివుడు తన పరా ప్రకృతి అయిన అతీతస్థితి కారణంగా సృష్టికార్య విషయంలో క్రియారహితుడయి ఉంటాడు. ఆయన తన శక్తి (క్రియాశీల శక్తి)ని తన “సతు”లకు అప్పగించడం జరిగింది; బ్రహ్మాండంలో అనంతమైన వివరాలు అభివ్యక్తమయేటట్టు చేసేవారు. ఈ సృజనాత్మక “నారీ” శక్తులే. హిమాలయాలు శివుడికి నివాసస్థానమని చెబుతాయి పురాణ గాథలు. హిమాలయాల్లో పుట్టిన నదులకు అధిష్ఠాత్రిగా, గంగాదేవి దివినుంచి భువికి దిగింది. అందువల్లే గంగ స్వర్గంనుంచి దిగివచ్చి, “యోగీశ్వరేశ్వరుడు” త్రిమూర్తుల్లో సృష్టి సంహార స్థితికర్త అయిన శివుడి జటాజూటం ద్వారా భూమికి అవతరించిందని కావ్యాల్లో చెబుతారు. “భారతీయులకు షేక్‌స్పియర్” వంటి మహాకవి కాళిదాసు, హిమాలయాల్ని “పరమశివుడి అట్టహాసరూపం”గా అభివర్ణించాడు. ‘ది లెగసీ ఆఫ్ ఇండియా’ (భారతదేశ వారసత్వం; ఆక్స్‌ఫర్డ్స్) అనే గ్రంథంలో ఎఫ్. డబ్ల్యు. థామస్ ఇలా రాస్తాడు: “శివుడి తెల్లటి పలువరసను పాఠకుడు ఎలాగో ఊహించుకోగలగవచ్చు; కాని, అతడు, ఉత్తుంగ శిఖరాయమానమైన పర్వతలోకాన్ని అధిష్టించిన పరమేశ్వర స్వరూపాన్నీ, దివినుంచి దిగివచ్చిన గంగ ఉరకలువేస్తున్న శివజటాజూటాన్నీ, ఆపైనున్న సిగపువ్వు మాదిరి చంద్రబింబాన్ని అనుభూతం చేసుకుంటేనే తప్ప ఆయన్ని సంపూర్ణంగా అవగాహనచేసుకోలేడు.” హిందూ చిత్రకళలో తరచుగా, నల్లటి జింకచర్మం కట్టుకున్నట్టుగా శివుణ్ణి చిత్రిస్తూండడం కద్దు. రాత్రిపూట చీకటికి, అగోచరతకూ అది ప్రతీక. ఆ ‘దిగంబరుడు’ ధరించే ఏకైక వస్త్రం అదే. తనకున్నది ఏదీ లేకుండా, అన్నీ తనవే అయిన ఈశ్వరుడి గౌరవార్థం, శైవశాఖీయుల్లో కొందరు ఒంటిమీద ఏమీ ధరించకుండానే ఉంటారు.

కాశ్మీరులో విలసిల్లిన సాధుకోటిలో, 14వ శతాబ్దిలో జీవించిన లల్లా యోగీశ్వరి ఒకతె. ఆ శివభక్తురాలు దిగంబరి. ఆవిడ సమకాలికుల్లో సంశయాళు వొకడు, ఆవిడ దిగంబరిగా ఉండడానికి కారణమేమిటని అడిగాడు. ‘ఎందుకుండగూడదు? నా కిక్కడ మగవాళ్ళెవళ్ళూ కనిపించడం లేదు,’ అంటూ వాడిగా జవాబిచ్చిందావిడ. కొద్దిగా తీవ్రమైన ఆవిడ ఆలోచనాదృష్టిలో, ఈశ్వరానుభూతి లేనివాడు “మగవాడు” అని అనిపించుకోడానికి అర్హుడు కాదన్నమాట. ఆవిడ క్రియాయోగానికి సన్నిహితమైన యోగవిద్య ఒకటి సాధనచేసింది. ముక్తిని ప్రసాదించడంలో దానికి గల శక్తిని ఆవిడ అనేక పద్యాల్లో ప్రస్తుతించింది... వాటిలో ఒకదాన్ని ఇక్కడ అనువదిస్తాను.

ఏ దుఃఖహాలాహలం తాగలేదు నేను?

చావుపుట్టుకల చక్రగతులెన్నెన్నో నావి.

అహో, అమృతంతో నిండింది నా పాత్ర

శ్వాసప్రక్రియా సాధన ఫలాన్ని పొంది.

ఆవిడ మానవసహజమైన మరణానికి గురికాకుండా, తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. తరవాత, శోకతప్తులైన పురజనుల ముందు బంగారు దుస్తులు ధరించి సజీవంగా ప్రత్యక్షమైంది. చిట్టచివరికి ఒంటినిండా బట్టకట్టుకొని!

: *శ్రీమన్నారాయణీయము*                     *దశమ స్కంధము 72వ దశకము - అక్రూరుని ఆగమనము - 72 - 7 & 8 - శ్లోకములు*

72-7

సాయం స గోపభవనాని భవచ్చరిత్ర-

గీతామృత ప్రసృతకర్ణరసాయనాని।

పశ్యన్ ప్రమోదసరితేవ కిలోహ్యమానో

గచ్ఛన్ భవద్భవనసన్నిధిమన్వయాసీత్॥

7వ భావము :-

అక్రూరుడు వ్రజము చేరునప్పటికి సాయంసమయమయ్యెను. ప్రభూ! నీ గృహమునకు చేరు - త్రోవలో గోపజనుల గృహముల నుండి -

నీలీలలను వర్ణించు శ్రావ్యమయిన గానములను - ఆ అక్రూరుడు వినెను. వీనుల విందుచేయు వారి గాన-గీతామృతములను ఆస్వాదించుచు ఆనందపారవశ్యముతో అతడు నీ గృహము చెంతకు చేరెను.

 

72-8


తావద్దదర్శ పశుదోహవిలోకలోలం

భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయంతమ్।


భూమన్।భవంతమయమగ్రజవంతమంత-

ర్ర్బహ్మానుభూతిరససింధుమివోద్వమంతమ్॥


8వ భావము :-


భగవాన్! అక్రూరుడు నీ గృహము చేరు సమయమునకు - నీవు నీ అన్న బలరామునితో కలిసి గోమాతలనుండి గోక్షీరము స్వీకరించు కార్యక్రమమును పర్యవేక్షించుచుంటివి.

నిన్ను చూచిన అక్రూరునికి - ప్రభూ! నీవు అతనిరాకకొరకే వేచి చూచుచున్నట్లుగా అనిపించెను; అతని అంతరంగము - బ్రహ్మానంద జ్ఞానామృత స్వరూపమును చూచిన అనుభూతితో - పొంగిపొరలెను.

. శ్రీమద్భగవద్గీత - 216 / Bhagavad-Gita -  216 🌹*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము  - 12  🌴*


*12. యుక్త: కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్ |*

*అయుక్త: కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ||*


🌷. తాత్పర్యం :

*స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మఫలము యెడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మనుజుడు బద్ధుడగును.*


🌷. భాష్యము :

కృష్ణభక్తిరసభావితుడు మరియు దేహభావన యందున్నవాడు అనెడి ఇరువురి నడుమగల భేదమేమనగా మొదటివాడు కృష్ణునితో సదా కూడియుండగా, రెండవవాడు తన కర్మఫలము యెడ ఆసక్తుడై యుండును. కృష్ణుని యెడ ఆసక్తుడై యుండి కేవలము అతని కొరకే కర్మనొనరించువాడు నిక్కముగా ముక్తపురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యెడ ఎటువంటి చింతను కలిగియుండడు. ద్వైతభావనలో అనగా పరతత్త్వము యొక్క జ్ఞానరాహిత్యముతో కర్మనొనరించుటయే కర్మఫలముల యెడ చింతకు కారణమని శ్రీమధ్భాగవతము నందు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్త్వము. 


అట్టి శ్రీకృష్ణుని భక్తి యందు ద్వైతభావనము లేదు. సర్వము సర్వశుభకరుడైన శ్రీకృష్ణుని శక్తిఫలమే అయినందున కృష్ణపరకర్మలన్నియును ఆధ్యాత్మికతను సంతరించుకొని దివ్యములు మరియు భౌతికప్రభావరహితములును అయియున్నవి. కనుకనే కృష్ణభక్తిభావన యందు మనుజుడు పూర్ణశాంతితో నిండియుండును. కాని ఇంద్రియప్రీతి కొరకు లాభగణనలో మునిగినవాడు అట్టి శాంతిని పొందలేడు. అనగా కృష్ణునికి అన్యముగా వేరేదియును లేదనెడి అవగాహనయే శాంతికి మరియు అభయత్వమునకు ఆధారమై యున్నది. ఇదియే కృష్ణభక్తిరసభావన యందలి రహస్యము. 

🌹 🌹 🌹 🌹 🌹 

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 615 / Vishnu  Sahasranama Contemplation - 615🌹*

*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 615. స్వక్షః, स्वक्षः, Svakṣaḥ🌻*

*ఓం స్వక్షాయ నమః | ॐ स्वक्षाय नमः | OM Svakṣāya namaḥ*

*శోభనే పుణ్డరీకాభే అక్షిణీస్తో హరేరితిః ।*

*స్వక్ష ఇత్యుచ్యతే విష్ణుర్వేదవిద్యావిశారదైః ॥*

*సుందరములును, పద్మముల వలె ప్రకాశించునవియగు అక్షులు అనగా కన్నులు గలవాడు గనుక ఆ విష్ణుదేవుడు స్వక్షః (సు + అక్షః) అని కీర్తించబడుతాడు.*

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥


. నిత్య ప్రజ్ఞా సందేశములు - 294 / DAILY WISDOM - 294 🌹*

*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి  🍀*

*🌻 20. తేనె మొదట్లోనే ప్రవహించడం ప్రారంభించదు 🌻*


*పేర్కొన్న అభ్యాసం మనస్సును దాని చివరి సాధన వైపు నెమ్మదిగా మళ్లించడం మరియు అన్ని అడ్డంకులను తగ్గించడం కోసం ఉద్దేశించ బడింది. చాలా తీవ్రతతో ఎదురయ్యే ఇబ్బందులు, అధిగమించ లేనివిగా , చాలా కాలం పాటు ఆ రూపంలో ఉంటూ, బహుశా వాటిని చేరుకోవడం అసాధ్యం మరియు అధిగమించడం కష్టం అనిపించేలా ఉంటాయి. ఆదిలోనే తేనె ప్రవహించదని యోగ సాధకులు మరియు పూర్వం సాధువులు మరియు ఋషులందరికీ అనుభవమే.*


*అభ్యాసం ప్రారంభంలోనే వెలుగు చూడలేరు. ఇది నల్లటి మేఘాలతో దట్టంగా కప్పబడిన చీకటి ఆకాశంలా ఉంటుంది. ఒక వ్యక్తి తన ముందు చూడగలిగేది లేదా దర్శించగలిగేది సమస్యలు, కష్టాలు, బాధలు లేదా వారు ఆశించే వాటికి వ్యతిరేకంగా జరగటం. ఇలాగే క్రమేపీ విషయాలు కనిపించేంత చెడ్డవి కావు అనే భావన తనలోపల నుంచి వస్తుంది. అనేక జన్మల నుండి తనలో పేరుకుపోయిన సంస్కారాలు మరియు కర్మల యొక్క మందపాటి పొర కారణంగా ఒక వ్యక్తి యొక్క కఠోర ప్రయత్నాల ఫలితంగా వచ్చే ఈ కష్టాలు మరియు బాధలు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కర్మల మూట తప్ప మరొకటి కాదు.*


*కొనసాగుతుంది...*

🌹 🌹 🌹 🌹 🌹

*🧘‍♂️04- శ్రీ కపిలగీత🧘‍♀️*

*అధ్యాయము - 1 శ్లోకం 03:-*

*య ఆద్యో భగవాన్ పుంసా మీశ్వరో వై భవాన్ కిల |*

 *లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః ॥3 | II*

*టీకా*

య ఆద్య = ఎవరైతే మూలమో; భగవాన్ = భగవంతుడు; పుంసామ్ ఈశ్వరః = సమస్త జీవకోటికి ప్రభువు; వై = నిజానికి; భవాన్ = నీవు; కిల = రూఢిగా; లోకస్య తమసా అంధస్య = అజ్ఞానాంధకారముచే గ్రుడివారైన జీవులు; చక్షు = నేత్రము; సూర్య ఇవ = సూర్యునివలె; ఉదతి = = జన్మించావు. 

*భావం :-*

నిజానికి నీవు సర్వజీవకోటికి ఈశ్వరుడవు. ప్రపంచానికి మూలకారణుడవు. అజ్ఞానాంధకారముచే గ్రుడ్డివారైన జీవులకు దివ్యచక్షువైన సూర్యునివలె జన్మించావు.

*వివరణ :-*

ఈ భూమిపై జీవులన్నియు వారి వారి దినచర్యలను ప్రారంభించుటకు, తమ తమ జీవనయాత్రలు సాగించుటకు సూర్యోదయమునకై ఎదురు చూస్తారు. క్షితిజరేఖపై సూర్యోదయానికి పూర్వమే చీకటి మాయమవుతున్నది. ఆ సూర్యుని సమక్షంలో చీకటి యొక్క గుర్తులు కూడా మిగలవు.

అదే విధంగా భగవానుడు కూడా మానవులలోని అజ్ఞానాన్ని మాయం చేయటానికి అవతరిస్తాడు.

తన జీవితంలో జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు కపిల ముని తన కుమారునిగా జన్మించటం తనకు వరమని దేవహూతి భావించింది. నిజానికి పుత్రుడనగా తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించేవాడే కదా! (పున్నామ నరకాత్ త్రాయతే ఇతి పుత్రః).

: *🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️*

 *24వ శ్లోకం:-*

*శత్రుచ్చేదైక మంత్రం సకలముప నిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం! సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జపజప సతతం జన్మసాఫల్య మంత్రం!!*

*భావం:-*

*ఓ జిహ్వా! శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే జన్మకు సాఫల్యము ఇచ్చునది. కామాది శత్రువులను భేదించుటలో ప్రధాన సాధన మా మంత్రము. సర్వోపనిష ద్వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి. జననమరణములనెడి సంసారము నుండి తరింపచేయగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధ కారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్రమే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటు వేసినప్పుడు కాపాడగల మంత్రము. కనుక శ్రీకృష్ణ మంత్రమును జపింపుము.*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 12._*

*సమస్త జీవరాశులలో కొలువై ఉన్న భగవంతుణ్ణి సేవించే గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు.*

_*జాగృతి*_

*స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు*

*సత్యాన్వేషణలో నరకానికి వెళ్ళాల్సివచ్చినా వెనకాడకండి.*


*🧘‍♂️విస్తరణ🧘‍♀️*


*ప్రతి వస్తువు భగవంతుడే. ఈ గది, ప్రపంచమూ కూడా నా చైతన్యమనే తెరపైన 

చలన చిత్రాల్లాగా తేలుతున్నాయి ..... నేను ఈ గదివైపు చూచినప్పుడు పరిశుధ్ధమైన పరమాత్మ, పరిశుధ్ధ ప్రకాశము, పరిశుధ్ధానందము తప్ప ఇంకేమి కనిపించడం లేదు.... నా శరీరము, మీ శరీరాలు, ప్రపంచంలోని అన్ని వస్తువుల బొమ్మలు ఆ ఒక్క పవిత్ర జ్యోతి నుండి ప్రసరించే కాంతికిరణాలు మాత్రమే. నేను ఆ కాంతిని చూచేటప్పుడు, పరిశుధ్ధ పరమాత్మ తప్ప, వేరేదీ నాకు కనిపించటం లేదు.*


*శ్రీ పరమహంస యోగానంద SRF శిష్యులతో సంభాషణ, ఎన్సినీటస్ , కాలిఫోర్నియా*


*ॐ卐సుభాషితమ్ॐ卐* 


77-కర్మ - జన్మ

 8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"

 (కర్మ ప్రయోజనం)

ప్రపంచంలో మంచిని పెంచాలని క్రూరత్వాన్ని, దుర్మార్గాన్ని అంతం చేయాలనే ఉద్దేశ్యంతో భగవంతుడు కర్మని, అందుకే పాప పుణ్యాలని, కర్మ ఫలాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. లేకపోతే దుష్టులు మంచివాళ్ళని, బలవంతులు బలహీనులని హింసించడం పేట్రేగిపోతుంది.

 ఓ వ్యక్తి తన స్వార్ధం కోరి ఒక చెడు పని చేస్తే అందువల్ల అతనిలోని చైతన్యం సంకుచితం అయి, తద్వారా అజ్ఞానమయం అవుతుంది. 'ఈ కర్మ చేస్తే నేను సృష్టి చక్రంలో బంధింపబడతాను' అని ఆ చైతన్యం లేదా ఆత్మ దాని ఫలితాలని అనుభవించాక గ్రహిస్తుంది.

 తిరిగి దాని వికాసానికి మళ్ళీ ఎన్నడూ ఆ చెడు కర్మని చేయదు. అందువల్ల కర్మ అన్నది ఆత్మ వికాసానికి ఏర్పరచబడిన యంత్రాంగంగా భావించవచ్చు.

 ఈ క్రమంలోనే చెడు కర్మల ఫలితాలుగా కలిగే దుఃఖం ఆత్మవికాస పరిణామానికి ఉపకరిస్తుంది. ఇలాగే నిస్వార్ధంగా ఇతరుల మంచి కోసం చేసిన కర్మల వల్ల అతనిలోని చైతన్యం విశాలం అయి తద్వారా జ్ఞానమయం అవుతుంది.

 'ఈ కర్మని చేస్తే నేను వికాసం చెంది సృష్టి చక్రంలోంచి విడుదల చేయబడతాను' అని ఆ చైతన్యం లేదా ఆత్మ దాని ఫలితాలని అనుభవించాక గ్రహిస్తుంది.

 ఓ చిన్నపిల్ల బొటన వేల్లో కట్టె పేడు ముక్క దిగింది. అతని తండ్రి అ వేలుని చూసి చికిత్స చేయడానికి బాండ్ ఎయిడ్, ఆయింట్ మెంట్, టించర్ తెచ్చాడు.

 వేల్లోని పేడు ముక్కని తొలగించబోతే ఆ పాప 'వద్దొద్దు. అది తీయాలంటే నొప్పి. దాన్ని అలాగే ఉంచి కట్టు కట్టు.' అన్నది. ఐనా ఆ తండ్రి ఊరుకోడు కదా. వేల్లోంచి ఆ పేడు బయటకి వచ్చేదాకా ఆ పాపకి శాంతి ఉండదు. 

 కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఇలాగే ప్రవర్తిస్తాం. ఇక్కడ పేడు ముక్క దుష్కర్మ. దాన్ని వేల్లోంచి తీయడం కర్మ ఫలం. మనం చికిత్స వద్దంటాం. చాలు అంటాం. నొప్పి పుట్టకుండా పేడు తొలగాలనుకుంటాం.

కష్టం దుష్కర్మ అలాగే ఉండిపోతుంది. పేడు ముక్కని తీయద్దంటే తండ్రి పైన కట్టు తొలగితే ఊరుకుంటాడా? మనకి కష్టం తొలగి దుష్కర్మని అలాగే ఉండనీమంటే దేవుడు ఊరుకుంటాడా?

 ఇలాగే కర్మ ఫలానుభవం కూడా మన రక్షణకే అని గ్రహించాలి. జీవాత్మ రకరకాల దుష్కర్మలు చేస్తూ, దానికి శిక్షని అనుభవిస్తూ క్రమేపీ పవిత్రతని సంతరించుకుంటుంది. కర్మ ప్రయోజనం ఇదేనని అద్వైత వేదాంతుల నమ్మకం. 

 మన కర్మలకి దేవుడు ఎందుకు బాధ్యుడు కాడు? 

కర్మణః పురుషః కర్తాశుభస్యా ప్యశుభస్య చ

స్వఫలమ్ తదుపాసనాతి కథమ్ కర్తాస్విదీశ్వరః

                         --వన పర్వం 181-5

భావం:- 

ఎవరు చేసిన కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారు. దానికి భగవంతుడు కర్త కాడు.

 కొందరంటారు, మన హృదయంలో ఉన్న దేవుడే మన చేత కర్మలు చేయిస్తున్నాడు కాబట్టి వాటి ఫలితాలు కూడా ఆయనకే చెందాలని. మరి కొందరు 'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అన్న సామెత ప్రకారం, తాము చేసే ప్రతీ కర్మని పరమాత్మ ఆజ్ఞతోనే చేస్తున్నాం.

 కాబట్టి వాటి ఫలాలు కూడా ఆయనే అనుభవించాలని, అన్యాయంగా తాము అనుభవిస్తున్నామని అంటారు. ఇది నిజం కాదని, పరమాత్మకి మన కర్మలతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పడానికి పెద్దలు ఈ క్రింది ఉదాహరణ చెప్తూంటారు.

---

*ఏమిటీ నీవు పాపర్ చదువు తావా

లేదండీ ఆకలేస్తే తిద్దామని తెచ్చా

చిన్నాపెద్ద లేకుండా ఏమిటి ఆ వెటకారం

వెటకారం కాదండీ మీ మీద నాకున్న మమకారం

మరి చక్కగా మాట్లాడొచ్చు గా

నేను వార్తలు చెపుతా మీకు కోపం వేస్తే ముక్కలు చేసి అతికించ మంటారు

నిన్ను చూస్తే కాపీకొట్టేవానిగా కనిపిస్తున్నానా

బర్రెలాగమోత్తంతినేదాకా ఊరుకుంటే వాన్ని కాను

అది నాకు తెలుసండి అందుకే వెళ్ళొస్తా,

పాపర్ తీసి కెల్లవే

పరుగెత్తుతూ వచ్చి తీసుకెళతాడు పాపాలు మీద ఉన్న కల్లజోడు కృందపడేసి

ఓరి టింగురంగడా, మాటలపోకిరి, నా కళ్ళ జోడు పగలు గొట్టావురా...

మరలా వచ్చి ఆ పగిలింది నాకల్లజోడండీ

నాదగ్గర నీకళ్ళజోడు పగిలిందికదా ఇదిగో ఈ 500 తీసుకొని బాగు చేయించుకో

అంటాడు

డబ్బు తీసుకొని వెళతాడు

అయ్యగారి బలహీనత తెలిసిన పాపరోడు

ఎవరు మీరు?

ఈ వేషం మేమిటి?

ఆ నేనండీ ఆ నువ్వే 

బాల్యంలో బాలకులం

యవ్వనంలో యువకులం

వృద్ధాప్యంలో పండుటాకులం

రాలిపోయే ఎండుటాకులం..!

నీ బుర్రమి తిరిగిందా నేనడిగిందేమిటి, నువ్వచెప్పేదేమిటి

నన్నుతక్కువచేసి మాట్లాడకండీ

 మేము  ఎవరూ లేకున్న ఏకాకులం కాదు  ప్రేమలో ఉంటే ప్రేమికులం కాదు పెళ్ళైతే సంసారికులం తెలుసా       కాకుంటే బ్రహ్మచారికులం మేము

సరే వచ్చిన పనేంటి?

అది మాత్రం అడుగు కుండీ అది మీరే కొనుక్కోవాలి చెప్పకపోతే వెళ్లి పో ఇక్కడినుంచి కొంచెం కోపం తగ్గించు కోండి


మేము రక్షిస్తే రక్షకులం మేము భక్షిస్తే భక్షకులం మేము దేశ సైనికులం మేము సమాజ సేవకులం, మీకు ఆత్మీయులం,  సహాయం చేసే మనుషులం ఎవరండీ వచ్చింది అని లోపలనుంచి ఒకే అరుపు ఆ వచ్చిన వారు ఆ వచ్చిన వారెవరండీ, అన్నీ చెప్పాలి  ఆ చెపుతా విను

      ప్రయాణిస్తే ప్రయాణికులంటా

      నిత్య వాహన చోదకులంటా

      యాత్రలు చేస్తే యాత్రికులంటా

      మాయలు చేస్తే మాంత్రికులంటా


ఆ ఏమిటీ మంచోళ్ళా, మంచినీరు తెచ్చారా

ఆ...ఆ..

ఉపన్యసిస్తే ఉపన్యాసకులా వారు

హాస్యం పండిస్తే విధూషకులా వారు

పాడితే గాయకులావారు

సభలో ఉంటే సభికులా వారు

ఓరి నాయనో చెవిటి మేళం ఏం చెప్పినా అర్ధంకాదు, అయినా చెపుతా

సినిమా హాల్లొ ప్రేక్షకులంటా వీరు

టీవీ ల ముందు వీక్షకులంటా వీరు

నా కు వినబడిందిలే ఇలేసోధ్యమౌ డబ్బులతో చూసే ప్రేక్షకులు, సీరియల్స్ చూసేవారా 

నిన్నే సీరియల్ చూడనీరు అసలు వీళ్ళెవరో నేను కాదనుకుంటా అంటూ చీపురు కట్ట పట్టు కొచ్చింది

అంతే ఒక్కటే పరుగు వచ్చిన వారు.


      

【 🌹నేటి నా పాట.🌹 నా పాట సంఖ్య:-288】

**************

 రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

30/05/2022.

*********

పాట సందర్భం పై విశ్లేషణ.

********

 ప్రేమించడం కంటే ప్రేమించబడటం ఓ గొప్పతనంగా

మనిషి పై ప్రభావం చూపుతోంది. ఆ ప్రభావం పై ప్రభావితమైన యువకుడు చేసిన సాహసం  ప్రేమ విజయమై ఆనందాల సమూహం చేసి సాగిన ఈ పాట.

****************

పల్లవి:-

****

నువ్వు నేను

లవ్వు పువ్వుగా వికసించగా 

మనలో నవ్వులు వసంతలుగా విరబూసేగా


నువ్వు నేను

గువ్వల జంటగా

 ఒదిగుండగా

 మది మకరందమయి తీయగా పరవశించేగా....


 ఓ ప్రేయసి ఈ సాహసి

 చేస్తాడే ఏమైనా నీకోసం.. 

నువ్వంటే  నా ప్రాణమని తెలిసేనా


 నువ్వు నేను

 లవ్వు పువ్వుగా వికశించగా 

మనలో నవ్వుల వసంతాలు  విరబూసేగా

చరణం:-1

***

ఓ ప్రేయసి నా ఊర్వశి

 నీవో వరమైవచ్చి వాలెనే ఒయాసిస్సుగా...

చిరుజల్లులే కురుసే

చిరుప్రాయం నీజత చేరి నీ సాయం కోరేగా


చిరు పరువం చిగురులు వేసి

చిరు తాపం తీర్చమని నిను కోరగా

చిరు కానుకగా  సిరి మువ్వల సవ్వడులై

 నీ మగసిరి మురిపించేనుగా

 పల్లవి:-

***

నువ్వు నేను

 లవ్వు పువ్వుగా వికశించగా

 మనలో నవ్వులు వసంతాలుగా  విరబూసేనుగా..

 చరణం:-2

*****

ఎద పాటలో సుధలు  వర్షిస్తు

 సరిగమల తోటలో నవరసాలు

 నవగీతమై పాడేనుగా

 మధుర వాడలో అధరాల చుంభనాలు

 అమృత బాండమే సృష్టించేనుగా...


ఆనందం మనమై  ఉత్సాహం ఉప్పొంగ గా

సంద్యారాగం సముద్ర తీరం

అలల కెరటం పై ఆనంద విహారం

ఆలింగనాల సంగమంలో 

కౌగిళింతల కాపురం చేద్దాము రా రా...

 పల్లవి:-

****

నువ్వు నేను

 లవ్వు పువ్వులుగా వికశించగా

 మనలో నవ్వులు వసంతాలుగా విరబూసేగా.

**************

* కాలం అంటే అలుపెరగకుండా పరుగెత్తే సెకండ్ల ముల్లు కాదు.

నిదానమే ప్రధానమని భావించే నిమిషాల ముల్లు అంతకన్నా కాదు.

కదలీ కదలక జరిగే గంటల ముల్లూ కాదు.

యంత్రానికి అందని తంత్రమంతా కాలం కథలోనే కనిపిస్తుంది.

ఈ కాలచక్రంలోనే సృష్టి రహస్యం దాగి ఉన్నది.

ఈ అంతులేని కథను రసవత్తరంగా నడిపిస్తున్న

కథానాయకుడు సూర్యుడు.

ఏమిటీ కాలం..?ఎవరీ కాలనాథుడు..?

ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా, సంచరిస్తూ ఉంటాడని వేల ఏండ్ల కిందటనే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది. నియంత్రణ ఉన్నది. ఒక గ్రహాన్ని మరొక గ్రహం ఢీ కొట్టుకోకుండా చూసే ఏర్పాటు ఉన్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అని చెబుతున్నాయి పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను మాత్రమే కాక అనేక కోట్ల సూర్యులతో కలిసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు కమఠ. అదే కూర్మశక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావిస్తున్న అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు.

పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పర్చుకొని దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దాన్ని అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని ఆది వరాహమని, శ్వేత వరాహమని అన్నారు. భూమిని ప్రాణికోటి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే పూజా సంకల్పాల్లో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకొంటున్నాం.

సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక. వెలుగు కిరణం వేగంగా పయనిస్తుందన్నది సంకేతం. సూర్యుడు పట్టిచ్చిన కారణంగానే విష్ణుమూర్తి చక్రాయుధంతో తన తలను తెగ నరికాడన్న కోపంతో రాహువు సూర్యుడిని పట్టుకొని పీడించసాగాడు. ‘దేవతలందరి మేలును కోరి నేను రాహువును పట్టించాను. దాని ఫలితాన్ని నేను మాత్రమే అనుభవిస్తున్నాను. దేవతలెవరూ పట్టించుకోవడం లేద’న్న కోపంతో మండిపోవడం మొదలుపెట్టాడు సూర్యుడు. దాంతో లోకాలన్నీ దహించుకుపోవడం మొదలైంది.

దేవతలంతా బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు. వినత కొడుకు అనూరుడు సూర్యుడి రథసారథిగా కుదురుకునేట్లు చేశాడు బ్రహ్మదేవుడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించిందే! ఈ కారణంగా అనూరుడికి అరుణుడు అన్నపేరు స్థిరపడింది. దీనిని ఓజోన్‌ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు.

ప్రాచీన గ్రంథాలలోని విషయాలను ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఆధునిక శాస్ర్తాలకు ముడిపెట్టి విశ్లేషించ వచ్చా అన్నది ప్రశ్న. మహాభారతంలోని ఒక ఉపాఖ్యానం ఇందుకు సమాధానమిస్తుంది. గురుపత్ని కోరిక మేరకు పౌష్య మహాదేవి కుండలాలను ఆమె దగ్గర గ్రహించి తీసుకువస్తుంటాడు ఉదంకుడు. ఆ కుండలాలను ఉదంకుని దగ్గర నుంచి తస్కరించి ఎదురుగా ఉన్న పాముల పుట్టలో దూరి పాతాళానికి పారిపోతాడు తక్షకుడు. ఉదంకుడు పుట్టను తవ్వుకుంటూ పాతాళానికి చేరుకుంటాడు. తక్షకుడి నుంచి కుండలాలను తిరిగి సంపాదించి వాటిని గురుపత్నికి అందజేస్తాడు.

ఉదంకుడు పాతాళంలో కొన్ని దృశ్యాలను చూశాడు. కానీ, వాటి అంతరార్థం అతనికి బోధపడలేదు. సందేహ నివృత్తి కోసం తాను చూసిన విశేషాలను గురువుతో చెబుతాడు. ‘అయ్యా! అక్కడ ఇద్దరు వృద్ధ స్త్రీలు ఒక వస్ర్తాన్ని నేస్తున్నారు. ఒకావిడ నల్లని దారాన్ని వాడుతుండగా, మరొకావిడ తెల్లని దారాన్ని వాడుతున్నది. ఆ దారాలను పడుగు పేకలుగా వాడి వస్ర్తాన్ని నేస్తున్నారు. ఆ పక్కనే పెద్ద చక్రమున్నది. దానికి పన్నెండు ఆకులున్నాయి. ఆ చక్రాన్ని ఆరుగురు బాలురు తిప్పుతున్నారు. వారా చక్రం ఆగకుండా చూసే పనిలో నిమగ్నులై ఉన్నారు’ అని చెప్పాడు.

దానికి గురువు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ధాత, విధాత ఆ వృద్ధ స్త్రీల పేర్లు. నల్లని దారాలు రాత్రికి, తెల్లని దారాలు పగటికి సంకేతాలు. రాత్రింబవళ్లతో కూడిన దినాలను వారు తయారు చేస్తున్నారు. నీవు చూసిన చక్రం పేరు సంవత్సరం. దానికున్న పన్నెండు ఆకులు పన్నెండు నెలలు. ఆ చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు బాలురు.. ఆరు ఋతువులు’ అని వివరించాడు. ఇలా ఆ కథలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. ఐరావతుడి కథ కూడా ఈ ఉపాఖ్యానం లోనిదే. ఇలా కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో మన వేదాల్లో, పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే మన ఋషులకు మనం సమర్పించగల నివాళి.

కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి వంతుల వారిగా సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని మన పూర్వులు పేర్కొన్నారు.

[9:39 pm, 04/05/2022] Mallapragada Sridevi: ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతులవారు భూదానము యొక్క గొప్పతనమును గూర్చి వివరిస్తూ ఈ కథ చెప్పారు:

మాళవ దేశములో ఒక ఘోరారణ్యమున్నది. సూర్యరస్మి కూడా చొచ్చుకు పోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యములో ఒక పెద్ద బూఱుగు చెట్టు ఉన్నది. శాఖోపశాఖలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలీవృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది. చిలుకల కలకలరవాలతో జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి.

ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది. ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది!

ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలిదప్పికలతో అలసి ఆ శాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది. తామ్రతుండం ముక్కునుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు.

అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది. ఓడవ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. అజ్ఞానవశః తన ముక్కునుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకి ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములను పండితులకు దానము చేశాడు. ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు.

*త్యాగభావం

త్యాగం వల్లనే అమృతత్వం లభిస్తుందని శైవల్యోపనిషత్తు భోదించింది. మనిషి గుణాల్లో త్యాగం మహోన్నతమైనదని చెబుతారు పండితులు త్యాగం ధైర్యాన్ని ఇస్తుంది. చీర శాంతిని కలిగిస్తుంది. మనిషిని మనిషిగా మారుస్తుంది. త్యాగ ఉన్నదానితో అనుబంధం పెంచుకోడు. లేనిదాన్ని కోరడు. అందుకే 'త్యాగిని కా' అని గీత చెబుతోంది.

అనుభవించేవారికి భోగభాగ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి. త్యాగగుణం లోకానికే సంతోషాన్ని ఇస్తుంది. ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. నిజానికి త్యాగమంటే అందరినీ వదులుకోవడం కాదు. అందరి కోసం తననే వదులుకోగలగాలి. తనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన పురాణేతిహాసాల్లో త్యాగధనులైన మహాపురుషుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి నేటి తరానికి స్ఫూర్తిని కలిగిస్తాయి. తండ్రి సుఖసంతోషాల కోసం తన వశం కాబోయే హస్తినాపుర సామ్రాజ్యాన్ని త్యాగం చేసిన మహామహుడు భీష్మపితామహుడు. భీష్ముడు అంతటి త్యాగం చేయకపోతే, మహాభారత కథ మరోవిధంగా ఉండేది.

త్యాగంలోనే శాశ్వతానందం ఉందని, సర్వజనుల హితంలోనే నిజమైన సౌఖ్యం ఉందని స్వర్గసుఖాలను సైతం త్యజించిన భారతంలోని ముద్గలుడి వృత్తాంతం చెబుతోంది. ముద్గలుడు వ్యవ సాయం చేయగా వచ్చిన ధాన్యాన్ని పేదలకు, పక్షులకు పంచి మిగిలిన ధాన్యాన్ని తన కుటుంబ పోషణకు ఉపయోగించేవాడు. ముద్గలుడి త్యాగనిరతిని మెచ్చి దేవతలు అతణ్ని స్వర్గానికి తీసుకు వెళతారు. అక్కడికి వెళ్ళిన తరువాత తాను ఏం చేయాలో చెప్పమని దేవతల్ని అడిగాడు ముద్గలుడు. 'స్వర్గసుఖాలను అనుభవించు, హాయిగా జీవించు' అని చెప్పారు. దేవతలు.

అంతర్యామి

అది విన్న ముద్గలుడు 'ఇక్కడ సుఖాలను అనుభవిస్తూ సోమరిగా ఉండటం కన్నా, కష్టించి పనిచేస్తూ నలుగురికి సాయం చేయడంలోనే ఆనందం ఉంది. ఈ స్వర్గంకన్నా నా భారతావనే మిన్న' అని చెప్పి తన మాతృభూమికి వెనుతిరిగాడు. మన పూర్వీకులు దదీచి మహర్షి, శిబిచక్రవర్తి వంటి మహాత్ములు అసమాన త్యాగనిరతిని ప్రదర్శించి ఆదర్శమూర్తులుగా నిలిచారు. దధీచి మహర్షిలాగా ఇతరుల కోసం ప్రాణాలను ఆర్పించకపోయినా పరులను హింసించకుండా ఉండే సహృదయతను ప్రతి మనిషి అలవరచుకోవాలి. శిబిచక్రవర్తిలా పక్షికోసం శరీరాన్ని పణంగా పెట్టకపోయినా పరులకు హాని తల పెట్టకుండా ఉండాలి. మనిషి మహాత్ముడిలా ప్రవర్తించాలనే నియమం లేదు. నిర్భందం లేదు. కాని మంచి మనిషిగా బతికితే చాలు సమాజానికి ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదు.

ఉన్నచోటు నుంచి కదలలేని వృక్షాలు జీవించినప్పుడే కాదు, మరణించినా మనుషులకు మేలు చేస్తాయి. ప్రకృతి సర్వం అంతే. మనిషి కూడా ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని పరోపకారంతో ముందుకు సాగాలి.

స్వార్ధ రాహిత్యంతో కూడిన ప్రతికార్యం మనిషిని ధార్మికత్వం వైపు నడిపిస్తుంది. అలాంటి త్యాగగుణం మనిషిని మహానుభావుడిగా మారుస్తుంది. గౌతమబుద్ధుడు, గాంధీ మొదలైన వారంతా తమ ఆదర్శాలతో, త్యాగనిరతితో కీర్తికాయులై అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటివారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. పరోపకార బుద్ధి ప్రదర్శిస్తూ, దైవచింతన కలిగి సాధు వర్తనంతో జీవించడమే నిజమైన త్యాగగుణం. అదే ఒక యోగం. ఆ త్యాగమే. అమృతంతో సమానం. అదే దైవీ సంపద. - విశ్వనాథ రమ

 ----

శ్రీ గురు దేవాయ నమః👏                     ప్రభాత శ్లోకః:

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ ।

కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ॥

[పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ॥]

ప్రభాత భూమి శ్లోకః

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే ।

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ॥

సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం ।

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ॥

స్నాన శ్లోకః

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మి,సరస్వతి, గాయత్రి, దుర్గా, అన్నపూర్ణ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్ఠ ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. 💐💐

పెద్ద వారితో మర్యాదగా.. అధికార,హోదాలో ఉన్నవారితో గౌరవంగా.. స్నేహితులతో చనువుగా.. తెలియనివారితో అవసరం మేరకు మాత్రమే మాట్లాడటం మంచిది

కాలం కలసిరాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసివస్తుంది..ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు.. మన బాధకు కారణం ఏదైనా కావచ్చు.. కానీ ఆ కారణంగా ఎవరికీ హాని చేయుటకు ప్రయత్నం చేయకూడదు

ఖర్చు విలువ తెలియకుండా భార్యని.

కష్టం విలువ తెలియకుండా కొడుకుని.

బంధాలు విలువలు తెలియకుండా కూతుర్ని..

పెంచకూడదు..

చెప్పులు లేనివాడికి కాళ్ళు లేనివాడు కనిపించే అంత వరకు తెలియదు తాను ఎంత అదృష్టవంతుడు అనేది 

అందుకనే మనం ఎప్పుడు కూడా లేని వాటికోసం కాకుండా.. మనకున్నదానిలో ఆనందం చూడగలిగితే మన అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు..

ఏదైనా మంచి అయినా, చెడు అయినా చేసి మనం మరచిపోవొచ్చేమో కాని.. చిత్రగుప్తుడు అన్ని రికార్డు(ICC) చేస్తూనే ఉంటాడు.. తప్పక దాని ఫలితం ఉంటుంది.. కాబట్టి ఏదైనా చేసే ముందే, ఆలోచించుకోవాలి.. అనుభవించాల్సింది మనమే కాబట్టి.

------

“మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.

*“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.

నేను డబ్బు, పేరు  సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.

“పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు. 

మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది. 

ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.

ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. 

“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.

“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” 

“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది  ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “

“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.

“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.

“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”

అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. 

అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.

ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే...

(ఒక మిత్రుడి పేస్ బుక్ వాల్ నుండి ... ఇంగ్లీష్ నుంచి తెలుగు లోకి)

*కుదిరితే పరిగెత్తు.. , 

లేకపోతే నడువు... 

అదీ చేతకాకపోతే... 

పాకుతూ పో.... , 

       అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు... 


ఉద్యోగం రాలేదని,

 వ్యాపారం దెబ్బతినిందని,

 స్నేహితుడొకడు మోసం చేశాడని,

ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...

      అలాగే ఉండిపోతే ఎలా?


 దేహానికి తప్ప, 

 దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే...    


తలుచుకుంటే... 

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా... 

నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,

 అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?


సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు...,

పారే నది..,

వీచే గాలి...,

 ఊగే చెట్టు...,

ఉదయించే సూర్యుడు....

 అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,, 

ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు..,


లే... 

బయలుదేరు... 

నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో... , 

పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు... 


నువ్వు పడుకునే పరుపు... 

నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్... , 


నీ అద్దం.... 

నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... , 


నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..,


 మళ్ళీ చెప్తున్నా... 

కన్నీళ్ళు కారిస్తే కాదు..., 

చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..


*చదివితే ఇవి పదాలు మాత్రమే,

 ఆచరిస్తే...

 అస్త్రాలు.


గుర్తుంచుకో,  నీ జీవితానికి నీవే కర్తవు, క్రియవు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ, వెర్రి వాడిలా కాలం గడిపేయకు. ఈ జీవితం నీది, మర్చి పోకు 💐💐💐💐

[29/05, 11:42] +91 98483 99903: మనం ప్రస్తుతం చేస్తున్న పెళ్లిళ్ళు సాంప్రదాయ బద్ధమైనవేనా ?అసలు పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా? ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి. 

కాలంతో పాటు మన పద్ధతులు కూడా మారాలి అనే చట్టుబండ కబుర్లు కాదు.. మనస్ఫూర్తి గా చెప్పండి కరెక్టేనా? 


ముందు ప్రస్తుతం మనం చేస్తున్న పెళ్లిళ్ళకు అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! 

కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో మనం చేస్తున్న తప్పులు 👇

**************

👉*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,

👉*పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం,

👉*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

👉*ఆర్భాటంగా మండపాలు కట్టడం,

👉*మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం..

👉*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

👉*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

*👉పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం.. 

👉*దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం, 

👉*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,

*మధ్యతరగతి మనిషికి అవసరమా?


👉*ఒకడిని చూసి ఒకడు,

*👉ఒకడ్నిమించి ఒకడు

వెర్రెక్కి పోతున్నారు

నేటి కాలంలో.


*ఎంత తింటాడు మనిషి?

*దేంట్లో దొరుకుతుంది వినోదం?

*ఎలా చేయాలి వేడుక?

*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

*ఏది కడితే వస్తుంది హుందాతనం?

*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

👉*ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.


*పదిమందితో పట్టెడన్నం తింటే,

*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.


*👉ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

*చెమటపడితే కారిపోయే రంగుకీ, *పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ, *సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ, ఉన్నదంతా ఊడ్చిపెడితేపదికాలాలు బతకడానికొచ్చే కొత్తమనిషికి తర్వాత పెట్టేది ఏమిటి?

*👉అప్పు చేసి ఖర్చుచేసే, వెర్రితనం కాదు పెళ్ళంటే!

*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే ఇంగితమైన పని వివాహ మంటే!

*శక్తికి మించి ఎగరటం, *అప్పుచేసి ఆర్బాటం చేయటం

*ముమ్మాటికీ తప్పు👌*.

*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు*

***********

----

శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 20వ శ్లోకం:-

హే మర్త్యా: పరమం హితం శృణుత వో వక్ష్యామి సంక్షేపత: సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ప్రవిశ్య స్థితా:! నానాగ్నాన మపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వం ముహు!!

     భావం:-

మర్త్యులు అమృతత్వము పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశిస్తున్నారు. ఉపాయములు కర్మజ్ఞాన భక్తి యోగములుగా పేర్కొనబడినవి ఎన్నియో ఉన్నవి. కాని అవి ప్రయాససాధ్యములని సంక్షేపముగ ఒక ఉపయమును ఉపదేశించుచున్నారు.

ఆపదలనెడి కెరటములతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చియున్న ఓ మర్త్యులారా ! వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింతనములను విడచి మనసున "నమో నారాయణాయ" అను ఈ మంత్రమును ఓంకార పురస్సరముగా జపించండి.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 6.

ఒడుదుడుకులను తట్టుకొనే శక్తి మన సంస్కృతీ, సాంప్రదాయాలకే ఉంది. కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నరనరాల్లోకి మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రవేశపెట్టాలి.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

మంచి స్వభావం లేని వారిని.... నువ్వు దుష్టుడివి... అని...అనవద్దు. 'నువ్వు మంచివాడివి' కానీ 'మరింత మెరుగవ్వాలి' అని మాత్రం అనండి.

🧘‍♂️శాంతి🧘‍♀️ 

తాత్కాలిక చిత్తవృత్తులకు లొంగడమంటే ప్రకృతిలో ఒక భాగముగా వుండడమే. ఎప్పుడూ శాంతిని కోల్పోను అనే దృఢసంకల్పంలో మీ మనస్సును ఉంచగలిగితే మీరు దైవత్వాన్ని సాధించగలరు. మీ అంతరంగంలో ఒక నిశ్శబ్ద మందిరాన్ని నెలకొల్పుకుని , దానిలోనికి ఉద్రేకాలు, కష్టాలు , పోరాటాలు, కలతలు ప్రవేశించనియ్యకండి. అసూయ , ప్రతీకారము , కోరికలనూ కూడా బయటనే ఉంచండి. శాంతి పూరితమైన ఆ మందిరం లోకి దేవుడు వస్తాడు.

శ్రీ పరమహంస యోగానంద యోగదా సత్సంగ పాఠాలు.


🧘‍♂️సుభాషిత రత్నావళి🧘‍♀️ 


శ్లో𝕝𝕝  నిగ్రత్య న విశోద్భూయో

మహతాం దన్తిదంతవత్|

కూర్మగ్రీవేవ నీచానాం

వచ ఆయాతి యాతి చ||


తా𝕝𝕝 మహాత్ముల మాట ఏనుగు దంతంవలె ఒకసారి బయటకు వచ్చాక మళ్ళీ లోపలకు పోకుండా స్థిరంగా ఉంటుంది..... నీచుల మాట తాబేలు మెడవలె బయటకు లోపలకు (ముందుకు-వెనుకకు) వచ్చిపోతు స్థిరత్వము లేకుండా ఉంటుంది..... అనగా ఉత్తముల మాట ఎల్లవేళలా నిలకడగా ఉంటే, అల్పుల మాట అటూ ఇటూ సమయానుకూలంగా మారుతూ ఉంటుందని భావము.

---83-కర్మ - జన్మ🧘‍♀️

 8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"

 కొన్ని అపోహలు, నమ్మకాలని కర్మ సిద్ధాంతం కోణంలోంచి చర్చిoచుకుందాము.

 మొక్కులు ఫలిస్తాయా? 

 కర్మ సిద్ధాంతం క్షుణ్ణంగా తెలీని వారికి దేవుడు తలచుకుంటే మన ప్రారబ్ద కర్మని తొలగిస్తాడు అనే విశ్వాసం ఉంటుంది. కాని ప్రారబ్ద కర్మని దేవుడు కూడా తొలగించలేడు అన్నది శాస్త్ర వచనం.

 మన కర్మ బలం ముందు సర్వేశ్వరుడు కూడా మౌనం దాలుస్తాడు. ఈ జన్మలో మనం అనుభవించాల్సి వున్న ప్రారబ్ధ కర్మలన్నిటినీ మనం అనుభవించి తీరాల్సిందే తప్ప అంతకు ముందు వాటి నించి మనకి విడుదల వుండదు. అది విడవగా ప్రయాణించే బాణం లాంటిదని చెప్పుకున్నాం.

కాబట్టి ఏ మొక్కుల వల్లా ఏ దేవుడూ ప్రారబ్ధ కర్మలుగా మనకి వచ్చే కష్టాలని తీసేయడు. ప్రారబ్దంలో లేని సుఖాలనీ ఇవ్వడు. ఒకవేళ ప్రారబ్ధ కర్మ ప్రకారం ఏదైనా కష్టం కొంతకాలం తర్వాత తీరాల్సి వుంటే, మనం ఈ లోగా మొక్కుకుంటే ఆ మొక్కు వల్లే ఆ కష్టం తొలగిందని భావిస్తాం తప్ప నిజానికి ఆ మొక్కుకీ, ఆ కష్టం తొలగడానికి ఎలాంటి సంబంధం వుండదు.

 రెండు రంగులని కలిపితే ఆ మిశ్రమం మూడో రంగుని సృష్టిస్తే, అది అన్ని వేళల్లో, అన్ని చోట్లా, అన్ని సందర్భాల్లో అలాగే పని చేయాలి.

 అప్పుడే ఆ రెండు రంగులని కలిపితే మూడో రంగు తయారవుతుంది అంటాం. ఇలాగే మొక్కులు ద్వారా కష్టాలు తొలగడం నిజమైతే, అది అందరికీ, అన్ని సందర్భాల్లో వర్తించి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి అన్ని కష్టాలు పోవాలి. కాని అలా జరగడం లేదు అన్నది మనందరి అనుభవం.

కాబట్టి మొక్కులు శాస్త్రీయంగా పని చేయడం లేదు అని. మరణాంతక వ్యాధి నించి బాధని ఎలా తప్పించుకోలేమో అలా ప్రారబ్ద కర్మ ఫలాన్నించి కూడా తప్పించుకోలేం.

కాని రోగ బాధని తగ్గించుకునేందుకు, ఉపశమనానికి ఔషధాన్ని క్రమం తప్పకుండా ఎలా వాడుతామో అలా స్వాంతన కోసం పరమేశ్వరుడ్ని సేవించాలి. 

మరైతే ఈ మొక్కులని అసలు ఎందుకు సృష్టించారు?

క్రితం జన్మలో మనం దైవాన్ని పూజించి ఉంటే ఈ జన్మలో రోగాలు, కష్టాలు వచ్చి పడేవి కావు కదా. ఈ జన్మలో అయినా ఆ సంస్కారం మనకి అలవర్చాలని అయి ఉండచ్చు. మనం దైవం వైపు చూసేలా, మనలో దైవ భక్తి కలిగేలా వేసిన ఎరగా ఈ మొక్కులని పెద్దలు ఏర్పాటు చేసి వుంటారు.

మనం అనుభవించాల్సిన ప్రారబ్ద కష్టాలని మనం భరించే శక్తిని మొక్కుల యొక్క ఆరాధన ద్వారా భగవంతుడ్ని సేవిస్తే, అప్పుడు మనం అంతగా తల్లడిల్లిపోము. కష్టాల తీవ్రత కూడా తగ్గచ్చు. దేవుడి ఆరాధన ద్వారా సంచితం లేదా అగామి కర్మలు నశించే అవకాశం కూడా ఉంది.

రాబోయే జన్మల్లో అనుభవించాల్సిన కష్ట నష్టాలని, రోగాలని ఆ విధంగా మనం మొక్కుల నెపంతో చేసే దైవారాధన ద్వారా రద్దు చేసుకోవచ్చు. కష్టాల్లోనే కదా మన మనసు దేవుడు వైపు మొగ్గేది. అందుకని మొక్కులని పెద్దలు ఏర్పాటు చేసి ఉండచ్చు.

***

 *అమృతస్య పుత్రాః*

*శ్రీశారదామాత జీవిత చరిత్ర-20

*స్వామి శారదానంద :-1*

స్వామి శారదానంద పూర్తిపేరు శరత్ చంద్ర చక్రవర్తి. కలకత్తాలో 1865 డిశంబర్ 23 న సంపన్న కుటుంబంలో జన్మించారు. శరత్ తన బాల్యం నుండి ఎప్పుడూ ప్రశాంతంగా నిశ్శబ్దంగా మరియు ధర్మంగా ఉండేవాడు. డాక్టర్ కావాలనే ఆలోచనతో మెడికల్ కాలేజ్ లో చేరాడు. తన బంధువు స్వామి రామకృష్ణానంద (శశి)తో కలిసి బ్రహ్మసమాజ్ లో చేరాడు.

1883లో వారు కలసి దక్షిణేశ్వర్ కు వెళ్లారు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక శక్తివంతమైన అయస్కాంతం లాగా వారిని తన దగ్గరకు తీసుకున్నారు.

గురువుగారి చివరి సమయంలో శరత్ రాత్రి పగలు సేవ చేశాడు. శరత్ శారదానంద పేరును స్వీకరించి సన్యాస ప్రమాణాలను తీసుకున్నాడు. తన సోదర సన్యాసులతో కలసి కొన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు, తపొజీవితం గడిపారు.

1891 లో స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలలో విస్తృతమైన బోధన పనిని ప్రారంభించినప్పుడు అతనికి సహాయంగా మరో వ్యక్తి కోసం శారదానందను పిలిపించారు.

 1896 లో అమెరికా వెళ్లిన తరువాత ప్రతి నెల మాతృదేవికి డబ్బు పంపేవారు. సున్నితమైన శాంత స్వభావం, మర్యాద పూర్వకమైన వ్యక్తిత్వం, సమర్థవంతమైన ప్రదర్శన కారణంగా ఆయన అమెరికాలో చాలామంది స్నేహితులను గెలుచుకున్నారు.

 1897 లో రామకృష్ణ మిషన్ ను స్థాపించిన స్వామి వివేకానంద మిషన్ వ్యవహారాలను నిర్వహించడానికి శారదానంద లాంటి అత్యంత సమర్ధుడైన వ్యక్తి అవసరమని ఆయనను తిరిగి కలకత్తా పిలిపించి మిషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పదవి జీవితాంతం వరకు దాదాపు 30 సంవత్సరాలు కొనసాగింది. ఈ సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే శారదామాత జయరాంబాటిలో ఉన్నా కలకత్తాలో ఉన్న ఆమే అవసరాలను స్వయంగా ఆయనే చూసుకున్నారు.

మాతృదేవి కలకత్తాలో నివసించడానికి 'ఉద్బోధన్' భవంతిని కట్టించారు. 1909 నుండి మాతృదేవి కలకత్తాకు విచ్చేసినప్పుడల్లా ఇక్కడే బసచేసేవారు. భవన నిర్మాణానికి చేసిన ఋణాన్ని తీర్చడానికి 'శ్రీరామకృష్ణపరమహంస' (శ్రీరామకృష్ణుల సమగ్ర జీవితగాథ) గ్రంథాన్ని రచించారు. వంగభాషలో వ్రాసిన 'శక్తి పూజ' అనే పుస్తకాన్ని మాతృదేవికి అంకితం చేశారు.

మాతృదేవి పవిత్ర దేహాన్ని బేలూరు మఠంలో దహనం చేసిన ప్రదేశంలో మరియు జయరాంబాటిలో ఆలయాన్ని నిర్మించారు. 1927 ఆగస్టు మొదటి వారంలో గుండెనొప్పితో బాధపడ్డారు. రెండు వారాల తర్వాత 1927 ఆగస్టు 19న తుదిశ్వాస విడిచారు.

*****"


క0:: క్షమయె నిత్యా సత్యము 

క్షణమే జీవితము బుద్ధి క్షంతవ్యము గా 

క్షణ భంగరమే ప్రణతీ 

క్షయ రోగమున్న గతీ అక్షరమే యగుటన్

  

తే::క్షణము బ్రతుకులో ఆశలు కళలు ఏల

క్షణము సుఖము లో దు:ఖము జపము లేల 

క్షణమొక యుగము గానుండు సమర మేళ 

క్షణ నిరీక్షణ ప్రణయము శయన మేళ 

      




 

న్యస్తాక్షరి।।।।।।।।। క్ష  క్ష క్ష క్ష నాలుగు పాదాలలో పాదాదిన రావాలి।

క్షకు యతి అక్షరాలూ తెలపగలరు 


*సుక్క పర్వ తాన సక్కని మల్లన్న

లెక్క లేని పూజ మక్కువ బెరుగగ

నొక్క పొద్దు తోని సక్కగ జేసేము

శిక్కు లన్ని బాపి శింత దీర్చు



        

ఎందలో నెందుచు మాలుచు నిందలమిట

వేతి యుంతిమి నీకయి వేగలావె

తినుకు పూలను జళ్ళుచు తిన్న గాను

కులవవే వచ్చమా   మాతు కులువు కులువు!!

 

నేటి  స్పందన పద్యాలు  


నాకరములను బంధిచు నరక మవదు

నాలుకను కోసి నా కల మాగనికళ

గుండె రక్తము చిమ్మినా గుర్ర మైన

నన్ను గుర్తించే మనిషియే నాకు కలము

........

సీ..సమ్మోహనాపర సంచలిత ప్రణయం

సమతుల్య శ్రీ మతి.. శాంతి కోరి

సందర్భ సహకార..సమ్మేళనమ్ము కై

స్వరరాజ చరితమే..సమయ భేరి

వింతయాకారమ్ము..వెల్గు విశ్వవిభుడు

నర్ధనారీశుడై..నాట్య హోరి 

జ్వాలా కళలగుటే.. జ్యోతి ప్రజ్వలన యే

నటరాజ నాట్యము నయన జేరి


సర్వ శిధ్ధి నిచ్చు సర్వేశ్వరుని లీల

జగతి నందు తిరుగు జపము శక్తి 

అంబ పిలుపు కలిసి అర్ధనారీశ్వర

ఆర్తి జూపి ఆశ ఆట తీర్చె


ऊँ !

----

" రుద్రాయ , మదనఘ్నాయ

  జటాధరాయ శంభవే ..

  అక్షయ్యాయ , త్రినేత్రాయ ,

దక్షిణామూర్తయే నమః !!! "

----

ऊँ !

---

" శ్రీసర్వదోషహంతారం ,

   శ్రీ సర్వభాగ్యవాంఛదమ్..

   శ్రీ సర్వలోకసుబంధుం ,

   శ్రీ కశ్యపాత్మజం స్తువే ( / భజే ) !!! "

----

సుభాషితం

🌺యన్మాతాపితరౌ వృత్తం తనయే

      కురితః సదా౹

      న సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ

      యత్క్రుతమ్ ౹౹🌺

పిల్లల్ని పెంచేటప్పుడు తల్లి తండ్రి ఎంత శ్రమపడతారు అనేది గమనిస్తే,ఏ కొడుక్కి కూతురికి ఆ అమ్మ నాన్నల ఉపకారం తీర్చడం సాధ్యమే కాదు.

🌺✍🏽


సమస్యను పూరించండి.......

భర్త అల్లుడయ్యె భార్య కిపుడు


♥️♥️♥️

కర్త కరుణ గాను కారుణ్య భావమ్ము

విశ్వ మందు కలయ వెల్లు విరిసె

ప్రేమ నిత్య మగుటె ప్రేయసి కధలుగా

భర్త అల్లుడయ్యె భార్య కిపుడు

........

ముదిత పతిని జేర్చి ముడివేసి కొంగున

మతము మార్చి యతను మారిపోయె

కాంతబాధ చెందికలలోన కనగనే

భర్త అల్లుడయ్యె భార్య కిపుడు

.......

దత్తపది :: తమన్నా సమ0త త్రిష కాజల్ 

 

అం తమన్నా క ఇకనీకు ఆశ లేల  

ఇదియు వీ సమంతయు కాదు ఈశ్వరేచ్చ

గాయిత్రి ష కలం తెలిపే గాబ రోద్దు  

మనసు ఉంచుకాజల్ జల్ గ మనుగడకునె

........

న్యస్తాక్షరి ఆ॥వె॥


క్షమయు ధరణి గాద  క్షమియించు జనులను 

క్షణము క్షణము  తాను  కలుషితంబు 

క్షణము గోరిభాను కడలినే యడుగగా

క్షణము వరుణకురుయు ఋణముగాద

.........

సుభాషితం

🌺లజ్జంతే బాంధవాస్తేన సంబంధం

     గోపయంతి చ ౹

     మిత్రాణ్యమిత్రతాం యాంతి యస్య న

     స్యు: కపర్దకాః ౹🌺

ఎవరి దగ్గర ధనము ఉండదో అతని బంధువులు అతనితో సంబంధములు పెంచుకోవడానికి సిగ్గుపడతారు.అతని బంధుత్వం మరచిపోతారు.అటువంటివాడి స్నేహితులు కూడా దూరంగా  జరుగుతారు.

🌺✍🏽

 ఇంద్రగంటి నరసింహమూర్తి

 Mallapragada Sridevi: సమదృష్టి ....మీలో 

మానవ జన్మను ఎత్తిన ప్రతి వాడూ సమదృష్టిని అలవరచుకోవాలని మన సనాతన ధర్మం చెబుతోంది. దీనినే సమదర్శనం అని కూడా అంటూ ఉంటాం. సమాజంలో ఎవ్వరికీ ఇబ్బంది కల్గించకుండా, ఎవ్వరినీ  హీనంగా చూడకుండా అందరం ఒక్కటేనని, అందరిలోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడనే నిజాన్ని తెలుసుకోగలిగితే మనం సమదృష్టిని అలవరచుకోగలం.

అయితే స్వార్ధం మనిషిని సమదృష్టిలో ఉంచకుండా చేస్తోంది. సాధారణంగా స్వసుఖం, స్వాతిశయం అనేవి మనిషిలో స్వార్ధాన్ని ప్రోది  చేస్తూ ఉంటాయి. తానొక్కడే సుఖంగా ఉండాలనుకోవడం స్వసుఖం. అలాగే తానొక్కడే అందరికన్నా ఆధిక్యంలో ఉండాలనుకోవడం స్వాతిశయం. నిజానికి స్వార్ధంతో వచ్చే ఈ రెండు గుణాల వల్లనే మనిషి ఎన్నో అనర్ధాలకు, అక్రమాలకు పాల్పడుతుంటాడు. మంచీ, చెడు విచక్షణ మరచి అకృత్యాలు చేసుకుంటూ పోతాడు.

  సాధారణంగా సుఖంగా ఉండాలనుకోవడం, ఉన్నతస్థితికి  చేరుకోవాలనుకోవడం తప్పేమి కాదు. కానీ తన సుఖం కోసం, తన ఉన్నతికోసం స్వార్ధంతో ఇతరులకు ఇబ్బంది కల్గించడం అధర్మమవుతుంది.

తనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు తాను ఇతరులకు ఇబ్బందులు కల్గించినట్లుగానే, తన పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ఇతరులు కూడా తనకు ఇబ్బందులు కల్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ భావన కల్గినపుడు సహజంగానే మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలం.

అదేవిధంగా సంకుచిత స్వభావం కూడా సమదృష్టి లేకుండా చేస్తుంది. సంకుచిత భావనల వలన ఇతడు మనవాడు, అతడు పరాయి వాడు అనే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో అనర్ధాలకు కారణభూతమౌతాయి. కనుక సంకుచిత భావం లేకుండా ఉదారంగా ఉండగలిగే మానసిక పరిపక్వతను ప్రతి మనిషీ అలవరచుకోవాలి.

     తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవా చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ కూడదు. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేప్పొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు.

  మనుషుల్లో స్వభావరీత్యా ఒక మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే. ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో తానే అధికుడినని భావించడం, అన్నీ తనకే తెలుసనుకోవడం, ఎదుటివారి మాట తానెందుకు వినాలనుకోవడం లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయి. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది.

అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా, పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా బాధపడడం మానేసి వాటికి దూరంగా వెళ్లిపోయి తమ పని తాము చేసుకోవడం ఉత్తమం.

 ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం ఎవరికీ అపకారం చేయకుండా ఉండడమే సమదృష్టి. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలో, ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగిన నాడే సమదృష్టి ప్రస్ఫుటమవుతుంది.  

అందుకే మన స్వార్థాన్ని అదుపులో పెట్టడానికి, మన మాటలను, చేతలను క్రమబద్ధీకరించడానికి, మన వలన తోటివారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మన సనాతన ధర్మం ఎన్నో నియమాలను ఏర్పరచింది.

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు మానవ ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏదని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ, ఇతరులు ఏం చేస్తే మనకు కష్టం కలుగుతుందో, దానిని మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మమని చెబుతాడు.

సమస్త ప్రాణుల యందు సమ భావం కలిగినవారు, ఇష్టాయిష్టాలకు, సుఖ–దుఃఖాలకు, సంతోష–బాధలకు అతీతంగా ఉండేవారు నిరంతరం జనన మరణ సంసారాన్ని దాటుతారని, వారే  భగవంతుని రూపాలని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు.

మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, సమదృష్టిని సాధించడం దుర్లభం అవుతుంది. శారీరక ఆహ్లాదం, కోరికలు, ద్వేషాలు నిత్యం అనుభవంలోకి  వచ్చినంత కాలం సమదృష్టిని ప్రదర్శించడం దుస్సాధ్యం.  

ఎవరైతే మనస్సును ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంచుకుంటారో, శారీరక సుఖ–దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతులై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటారో, స్వార్థాన్ని, క్రోధాన్ని, ఐహిక సుఖాలను, ఆర్భాటాలను త్యజించి తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తారో అలాంటి వారు ఈశ్వరునితో సమానంగా మన వేదాలు చెబుతున్నాయి.

ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించినా, మనపట్ల అమర్యాదగా ప్రవర్తించినా, మనతో పరుషంగా మాట్లాడినా, మనలను కించపరిచినా సహజంగానే మనకు బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పనులను మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండాలి. అదే సమదృష్టి.

🌹 నేటి నాపాట🌹 పాట సంఖ్య:-294🌹

**************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

దోర్నాల.

 02/06/2022.

********

 పాట సందర్భంపై నా విశ్లేషణ:-

**********

  ఒకొక్క సారి మనల్ని మనమే నమ్మలేని వింతలా అనిపిస్తుంది కడుపేద వాడికి ఓ చిన్న సంఘటన

 ఓ పెద్దింటి అమ్మాయి ప్రేమ పొందే అదృష్టం అవకాశం

 వచ్చినపుడు ఆ పేద వాడు ప్రేమికుడను అయ్యాను

అనే ఆనందాను భూతిలో పొంగిన హృదయ స్పందన

ఈ పాట..

*****************

పల్లవి:-

***

సంతోషమే నీ రూపమై నా ఒడి చేరెనే

 ఆకాశమే ఆశల పల్లకి పంపెనే

 నీవే నా దేవతని

 ఆనుకోని అతిథిలా కలిసి  నా అంతా నీవై నిలిచావే

అనుకున్నదే తడవుగా తొలకరిలా తడిమినావే  నా హృదయాన్నే..


 సంతోషం మే నీ రూపమై

 నా ఒడిని చేరినావే..

చరణం:-1

 ఆకాశగగనంలా దిగివచ్చినావే 

 నిరాశ వాద నా వదనం వికశింప చేశావే...

 కాలమెంతగా వేచివుండమన్నా

నిరీక్షణంతా క్షణమల్లే  అనిపిస్తుంది.


 సరిలేరు నీ అందానికి భువిలోన ఏ సుందరి

 గురిచూసి వేసిన బాణంలా  చక్కగా చేరినావే 

నా హృదయ  నివాసానికి

ఏరి కోరి నన్నే కోరి  నాలో చేరిన  నారి మణి

నిను పొందు భాగ్యమే నా దేలే  సిరి రమణి

పల్లవి:-

***

 సంతోషమే నీ రూపమై

 నా ఒడిని చేరిన సౌంధర్యమా.

చరణం:-2

ఎవరులేని ఏకాంతంలో

 నీ ఒడినే నందనవనంగా చేసి

ఆనందాలనే అనుభూతులుగా పదిలం చేశావే

అందాల ఓ బృందావనమా...


 వచ్చినానని తెలిసి నడి రోడ్డు పైనా

 ముద్దాడి నీ ప్రేమ ఎంతో లోకానికి చాటినావే

 నా గుండెలోన గుడి కట్టుకొని అపురూపం గా

 చూసుకుంటానే ప్రియతమా  నా హృదయమా

 నా ప్రాణమా నా సర్వస్వమా...

 పల్లవి:-

***

 సంతోషమే నీ రూపమై

 నా ఒడిని చేరినా సౌందర్యమా

ఆకాశమే అందాల పల్లకి పంపే 

నీవే నా దేవతవని బహుమతిగా...

************

***

*హరిఓం ,

నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...

నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...

బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు...

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....

నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...

 నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...*

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...

పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...

ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ జీవితంలో భాగమైపోతాయి...

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...

ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..

ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...

 మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో వున్న మీకు తెలిసిన పెద్దవారిదగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగులేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్నచిన్న సహాయాలు చేయండి.

వృద్ధోపసేవ అని భారతంలో బాగా శ్లాఘించబడిన ధర్మం ఇది. వృద్ధోపసేవ వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు.......       🙏 ...........

***

శ్రీ శ్రీ శ్రీ

బ్రాహ్మణ బంధువులులకు 

నమసస్కారములు

నా పేరు గోపీశర్మ

గుంటూరు 

గుంటూరు లో  ఇంటివద్ద తయారు చేస్తాము. ఇక్కడినుండి all over India మరియు Abroad countries కూడా పంపుతాము🙏

Gopi sarma brodipet Guntur

9298801428

🙏పచ్చళ్లు 🙏


క్రింది వన్నీ కిలో రేట్లు అండి 


😋😋

1.ఆవకాయ వెల్లుల్లి లేకుండా  Rs.500

2.ఆవకాయ వెల్లుల్లి తో Rs.550

3.ఆవకాయ నువ్వులతోRs.500

4.చింతకాయ Rs.400

5.పండుమిరప Rs.400

6.ఉసిరికాయ Rs.400

7.నిమ్మకాయ Rs.400

8.కాకరకాయ Rs.400

9.స్పెషల్ కాకరకాయ Rs.500

10.అల్లం పచ్చడి Rs.400

11.టమాటో Rs.450

12.గోంగూర పచ్చడి Rs.400

13.కొత్తిమీర పచ్చడి Rs.450

14.మునక్కాయ పచ్చడి Rs.450

15.మాగాయ Rs.500

16.మామిడి అల్లం Rs.450

17.పనసపొట్టు పచ్చడి Rs.500

18.పుదీన పచ్చడి Rs.400

19.కరివేపాకు పచ్చడి Rs.400

20.పచ్చ ఆవకాయ Rs.500

21.నూపప్పు ఆవకాయ Rs.500

22.దబ్బకాయ             Rs.400

23.తీపి అల్లం పచ్చడి  Rs.400


🙏పొడులు 


1.  మునగాకు పొడి Rs.450

2.  కరివేపాకు పొడి  Rs.450

3.  పప్పుల పొడి Rs.400

4.  రసం పొడి  Rs.450

5.  పొడి చట్నీ Rs.500

6.  దోసె పొడి (మల్హపొడి) Rs.400

7.  మెంతి పొడి (మెంతిట్టు)Rs.400

8.  సాంబార్ పొడి Rs.450

9.  పల్లీల పొడి Rs.450

10. నువ్వులపొడి Rs.450

11. కంది పొడి  Rs.500

12. అవిశె పొడి Rs.500

13. పేలపిండి Rs.400

14. పులిహోగిరె పౌడర్ Rs.500

15. పులిహోగిరె పేస్ట్ Rs.500

16. ఒబేసిటీ పౌడర్ Rs.500

17.వెల్లుల్లి పొడి      Rs.400

18.కాకరకాయ పొడి Rs.500

19.పుదీన పొడి    Rs.500

20.కొత్తిమీర పొడి Rs.500

21.ఉలవపొడి      Rs.400

22.గోంగూర పొడి  Rs.500

23.ఉసిరి కారంపొడిRs.450

24.కూరకారం Rs. 400

25.బిసిబేళ్ బాత్ పొడి Rs.500

26.గుత్తి వంకాయ పొడి  Rs.500

27. చియా గింజల పొడి Rs. 500

28.చట్నీ పొడి               Rs. 450

29.నల్లకారం                 Rs.500

30.కొండపిండిఆకు పొడిRs.500

31.పొన్నగంటి ఆకు పొడిRs.500

32.బిర్యానీ రైస్              Rs.300


                   🙏స్వీట్స్ 🙏

              సున్నుండలు Rs.500

.              రవ్వ లడ్డు Rs. 400

            బెల్లం గవ్వలు Rs.450

                  అరిసెలు  Rs.500

               కర్జికాయలు Rs.500

               అవిశ లడ్డు Rs.600(Omega3 fatty acid)

              🙏 స్నాక్స్ 🙏

      మురుకులు     Rs.  450

      పప్పుచెక్కలు  Rs.450

      చేగోడీ             Rs.450

               🙏వడియాలు 🙏

  గుమ్మడి వడియాలు    Rs.600    మినప్పప్పువడియాలు  Rs.450

 జీలకర్ర  అప్పడాలు       Rs.400

 పాలకూర అప్పడాలు    Rs.400 పండుమిర్చిఅప్పడాలు   Rs400

సగ్గుబియ్యం అప్పడాలు Rs.450

చల్ల మిరపకాయలు       Rs.500

మినప అప్పడాలు         Rs.450

గమనిక....కొరియర్ చార్జీలు అదనం

🙏🤝😁👏

దయచేసి మీకు తెలిసిన

బ్రాహ్మణ గ్రూపులలో

ఈ మెసేజ్ ని పంపవలసినదిగా

కోరుకుంటునను

*** 

*అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచు పిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది.

అదే వీధమ్మట పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసూ వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం స్ఫురణకు రాగా తమ తమ తాంబూల కరండాలని తెరచి చూసుకున్నారు. భవభూతి పెట్టెలో సున్నము నిండుకుంది. అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి,

“తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే”

అని అడిగేడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం. తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే కాళిదాసు,

“వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే”

అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా!” అని అర్థం.

మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి ఉచితాసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తదుపరి భవభూతికి సున్నం అందించింది ట!

ఈ ప్రవర్తన చూసి భవభూతి కోపోద్రేకుడై, “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందస్తుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడు ట.

దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట!

ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలేరుట! అదీ కథ!!

***

*ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు   గారు. 

రుచులవి జాతివి మారెను/ 

పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.

కిచెనుల దూరెను మెల్లగ/

శుచియగు మన భావములను శూన్యము చేయన్


గుత్తి వంకాయ కూరా లేదు , గుమ్మడికాయ పులుసూ లేదు !

అరటికాయ వేపుడు లేదు ,అదిరే కొబ్బరి చట్నీ లేదు !

కొత్తావకాయ ఊసే లేదు ,కొత్తిమీర చారూలేదు !

కందా బచ్చలి మరిచారయ్యా !గుమ్మడి వడియంవిడిచారయ్యా !పలావు వుందని వడ్డించారు ! ఉల్లీరైతా ఉందన్నారు !

రుచిపచి తెలీని 'కూరే' సారు ! మిక్సుడు పికిల్ కూరేసారు !

బూరీ గారీ నోదిలేసారు !బూందీ లడ్డూ మార్చేశారు !


గులాబు జామూన్ ఉందన్నారు లైనులో జనాలు ముందున్నారు !


అయిసు క్రీముకేసడిగేసాకా , అయిపోయుంటుందన్నారొకరు !

ప్లేటుని చేతిలో పట్టుకుని ,ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,

బఫే లైనులో నుంచుంటే ,బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు ! కుదురుగ నిలుచుని తినమన్నారు !

తల్లీ పిల్లా తల్లడిల్లినా , ముసలీ ముతకా ముక్కి చూసినా !

బఫే తీరులో బలముందన్నారు ! గొర్రె మూక విని తలవంచారు !


పెద్దా చిన్నా పరుగులె పరుగులు !ముద్ద కోసమొక యుద్దపు తలపులు ! 

సాపాటు--గ్రహపాటు


ఔనండీ సుబ్రహ్మణ్యం గారు అది బఫే మీల్స్ కాదు బఫెల్లో మీల్స్ దానికి తోడు హనుమంతుడు సంజీవ పర్వతం మోస్తున్నట్టు చేతిలో బరువైన ప్లేటు

ఏ ఐటమ్ కి అది కొద్దిగా పెట్టించు కుందామంటే కొండ వీటి చాంతాడు లాంటి లైను, ఎంగిలి ప్లేటుతో ఈదుకుంటూ ప్రయాణం ఎడమ చేతి బరువు. లంక మేత గోదారీత లా మంచినీళ్ళు ఎక్కడో. మధ్యలో ఆద మరిస్తే ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో మనకి ఎవరు డాష్ ఇస్తారో కొంచెం వేగంగా నడిస్తే ఈ చలవరాతి ప్లోరింగ్ పై పడిన నీటి చుక్కలకి నడుం జారు తుందో వండే వాడెవడో వడ్డించేవాడెవడో చక్కగా తిందామంటే నలుగురికి పరిచయ మైన వారికి కత్తి సామే


ఎవరో ఒకరి పనికి మాలిన ముచ్చట్లు ఎక్కడేమున్నాయో

తెలవక అర్ధాకలితో భోజనం ముగింపు చెత్త కాయితాలేరుకునే

వాడిలా ఎక్కడ ఏమి ఉన్నాయో చూసుకుంటూ తిరుక్కుంటూ అభోజనం. నిజమే నిలబడి భోజనం నిజంగా నాగరికుల దౌర్భాగ్యం అందుకే వెళ్ళక పోతే ఎవరితో కలవమనుకుంటారు కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి అందరితో కలిసి భోజనం చేయాలి కాదు కాదు చేసినట్లు నటించాలి పేరుకు విందు దానికి ఓ టైము కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ,


అలా అని ఆలశ్యంగా వెళితే పదార్ధాలు నిండుకుండు

నిలబడి పెట్టే భోజనం యజమానికి సంతోషం లేదు

అతిధికి ఆనందం లేదు నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో చాల అదృష్టం. భోజన కాలే హరి నామ స్మరణ గోవిందా గోవింద.

***

🧘‍♂️378) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

స్థితి ప్రకరణము  
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము

2-85

యేన శబ్దం రసం రూపం గన్ధం జానాతి రాఘవ! 
సోఽయమాత్మా పరం బ్రహ్మ సర్వమాపూర్య సంస్థితః. 

ఓ రాఘవ! దేనిచే నీవు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తెలిసికొన గల్గుచున్నావో, అట్టి యీ ప్రత్యగాత్మయే సమస్త జగత్తును లెస్సగ వ్యాపించి వెలయుచున్నట్టి పరబ్రహ్మమై యున్నది. 

2-86

యస్మాదాత్మనో వ్యతిరిక్తే వస్తుని సిద్ధేసతి తత్రేచ్ఛాప్రవర్తతే. 
యత్ర స్వాత్మనో వ్యతిరిక్తం న కించిదపి సంభవతి 
తత్రాత్మా కిమివ వాఞ్చన్కి మనుస్మరన్ధావతు కిముపైతు.

ఆత్మకంటె వేఱుగ ఏదేని వస్తువుండుచో దానియందు కోర్కె జనింపవచ్చును, కాని ఎచట ఆత్మకంటె వేఱుగ ఏ పదార్థమున్ను ఒకింతైనను సంభవింపకయే యున్నదో, అచట ఆత్మ ఇక దేనిని కోరును, దేనిని స్మరించుచు పరుగిడును? దేనిని పొందును? 

2-87

పునః కృత్వా కృత్వా బహువిధమిదం కర్మ తరసా 
త్వయా ప్రాప్యం కిం తద్వద యదుచితం భూతకరణాత్‌ 
అకర్తృత్వే వాస్థా భవతు తవ చాప్యాగమవతో 
భవ స్వస్థః స్వచ్ఛః స్తిమిత ఇవ నిర్వాతజలధిః  

ఓ రాఘవా! ఇంకను వినుము. కర్తృత్వాభిమానముతో గూడి మరల మరల ఈ ప్రపంచమున బహువిధకర్మలను వేగముగ ఆచరించి ఆచరించి తుదకు పంచభూతసముదాయ రూపములగు నశ్వరపదార్ధముల కంటె అన్యముగ (ఆత్మవగు) నీ కుచితమైనట్టి గొప్ప ఫలమును దేనిని నీవు పొందగల్గితివో, చెప్పుము? కాబట్టి శాస్త్రాదుల ద్వారా ఆత్మ ప్రబోధమొంది నీవు అకర్తృత్వమందే విశ్వాసము గలిగి స్వస్థచిత్తుడవై నిర్మలరూపుడవై, గాలిలేని సముద్రమువలె నిశ్చలముగ గంభీరముగ వెలయుము.
*****
668, 669 - శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

668) శ్లోకము :-

ప్రచండా  గౌరీ వా త్వమసి
వసు రుద్రార్క వినుతే! 
స భీమః శంభు ర్వా విభు
రభయదః పాద సుహృదామ్!

తయో రేకం రూపం తవ
సహవిభోః ఖేలతి మహ
త్య ముష్మి న్నాకాశే ధవల
మహసి క్రీడతి పరమ్!!  668
 
పదవిభజన:-

ప్రచండా  గౌరీ వా త్వం అసి
వసు రుద్ర అర్క వినుతే! 
సః భీమః శంభుః వా విభుః
ఆభయదః పాద సుహృదామ్!

తయోః ఏకం రూపం తవ
సహవిభోః ఖేలతి మహతి 
ఆముష్మిన్ ఆకాశే ధవల
మహసి క్రీడతి పరమ్!!    668

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి!
భూ భువః స్వర్లోకములకు అధిపతులగు వసు రుద్ర ఆదిత్యుల చే కొనియాడ బడు జననీ!

నీవే  ఉగ్రరూప చండివిగా, సౌమ్యరూప గౌరివి గా అగుదువు. పాద భక్తులకు అభయమిచ్చు ఆ ఈశ్వరుడు  ఉగ్ర భీముడు గాని సుఖమయుడగు శంభుడు కాని అగును.

ఇట్లు విభునితో కూడిన దానివగు నీవు మొదటి చండీ రూపమున మహాకాశమున 
సూర్య కాంతి వలె  ఉగ్ర శక్తి ప్రకటన, రెండవ గౌరీ రూపమున చంద్రుని వెన్నెల విహార సౌమ్య ఆనందము  కలిగి ఉందువు.


669) శ్లోకము :-

విభక్తా యా ద్వేధా త్వ  మపి గగనే శీతమహస 
స్తథా రమ్యే  బింబే జ్వలిత  లలిత  స్త్రీ తనువిధా!

తయో ర్భ్రూహీశానే  జనని! కతమా మే జననభూః
పురా జన్మన్యాసీ ద్వికట మథవోగ్రైవ సుషవే!!  669

పదవిభజన:-

విభక్తా యా ద్వేధా త్వం అపి గగనే శీతమహసః 
తథా రమ్యే  బింబే జ్వలి త లలిత  స్త్రీ తనువిధా!

తయోః  భ్రూహి ఈశానే జనని! కతమా మే జననభూః
పురా జన్మని ఆసీత్ వికటం అథవా ఉగ్రా ఏవ సుషవే!! 669

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి!
సూర్య ప్రతప్త జ్వలిత శరీర చండివి నీవే. చంద్రుని కోమల లలిత శరీర  గౌరివి నీవే. 
రెండు రూపముల ఆకాశమున వసించు చున్నావు. నా పూర్వ జన్మమైన
గజముఖుని వికట రూపమునకు అందులో ఏ మూర్తి జన్మస్థానమో కదా.
--
* శ్రీమన్నారాయణీయము   దశమ స్కంధము 70వ దశకము - సుదర్శన గంధర్వుడికి శాపవిముక్తి – శంఖచూడ వృషభాసురుల సంహారము - 70 - 9 & 10 - శ్లోకములు*
🕉️🌞🌏🌙🌟🚩

70-9

చిత్రమద్య భగవన్। వృషఘాతాత్ సుస్థిరా౾జని వృషస్థితిరుర్వ్యామ్।

వర్ధతే చ వృషచేతసి భూయన్మోద ఇత్యభినుతో౾సి సురైస్త్వమ్॥

9వ భావము:-

భగవాన్! చిత్రముగా నీవావృషభమును వధించి - ధర్మమునుద్దరించితివి; భూమిపై స్థిరపరచితివి.


దేవేంద్రుడు మొదలగు దర్మానువర్తుల హృదయములలో ఆనందమును పెంపొందించితివి.

****
శ్రీ అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

రేకు: 271-6
సంపుటము: 3-411


ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ
వంతులకుఁ గొలిచేటివారి భాగ్య మిఁకను !!
॥పల్లవి॥


గక్కన మన్మథునిఁ గన్నతండ్రి గనక
యెక్కువ చక్కఁదనాల కితఁడే దొడ్డ
నిక్కపు సూర్యచంద్రాగ్నినేత్రుఁడు గనక
దిక్కులఁ గాంతుల నీ దేవుఁడే దొడ్డ !!
॥ఇంత॥


అంచెల లక్ష్మికి మగఁడై నాఁడు గనక
యెంచ రాని సంపదల కితఁడే దొడ్డ
పంచినచోటఁ జక్రము పంపు చేసీఁ గనక
మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ !!
॥ఇంత॥


దైవికపుఁ బురుషోత్తముఁ డితఁడు గనక
దేవతల కెల్లా నీ దేవుఁడే దొడ్డ
వావాత శ్రీవేంకటాద్రి వరములిచ్చీఁ గనక
యేవల దాతలలోన నితఁడే దొడ్డ !!
॥ఇంత॥

🕉🌞🌎🌙🌟🚩

భావామృతం:- 

ఎక్కడ చెప్పి చూసిన ఇంతటి దైవము లేడు. బాధ్యతగా కొలిచే వారి భాగ్యమింక చెప్పనక్కర్లేదు. గొప్పగా మన్మధునికి కన్నతండ్రి కనుక ఎక్కువ అందాలకు ఇతడే పెద్ద.


నిండైన సూర్యచంద్రాగ్నిని నేత్రాలుగా కలవాడు కనుక దిక్కులకు కాంతి అయిన పెద్ద దేవుడు ఇతడే. వరుసగా లక్ష్మీకి భర్తెనాడు కనుక ఎంచడానికి రాని సంపదలకి ఇతడే పెద్ద.


 తలచిన చోటికి చక్రము పంపించాడు కనుక మించిన ప్రతాపన మిక్కిలి పెద్ద. దేవతలందరిలో పురుషోత్తముడితడు కనుక దేవతలందరిలోను ఈ దేవుడే పెద్ద.


నోరార శ్రీవేంకటాద్రి వరము లిచ్చాడు కనుక ఇవతల దాతలలోను ఇతడే పెద్ద అంటు అన్నమయ్య కీర్తించాడు. 
*****

No comments:

Post a Comment