వల్లభాపురం జనార్దన
---
[8:2 శార్దూలము
దేశంలో అభివృద్ధి యే కలలుగా దివ్యత్వ మైయుండెనే
దేశంలో నునె మంత్రమై పరుగులై దేహమ్ము దాహమ్ముయే
దేశంలో పడిలేచిపాకునదియే ధీనత్వ భావమ్ము యే
దేశంలో నడమంత్ర సౌర్య సిరియే ధైర్యమ్ము జీవమ్ముయే
***
ఉత్పలమాల
ప్రకృతిరియం విమలానాం క్లిశ్యం యదన్య కార్యేషు౹౹🌺
దేన్ని పళ్లతో నములుతామో వాటి రుచి నాలుక ను భవిస్తుంది.అలాగే,సత్పురుషులు,సహజంగా,స్వభావికంగా ఇతరుల మంచికోసం కష్టాలు పడతారు.
*న హి పూరాయితుం శక్య: లోభ్య: ప్రీత్యా: కథంచన|
నిత్యగంభీర తోయాభిరాప గభిరి వాంబుధి:౹౹🌺
అన్నికాలల్లో నీళ్లతో నిండిన నదులు సముద్రాన్ని ఎలా నింపలేవో అలాగే,అత్యాసాలను
తీర్చడము సాధ్యము కానిపని.
99-ఉపనిషత్ సూక్తి
99. జ్ఞానయజ్ఞ స్స విజ్ఞేయ స్సర్వ యజ్ఞోత్తమోత్తమః||
(శాట్యాయనీయోపనిషత్)
- ఆత్మజ్ఞాన యజ్ఞము సర్వయజ్ఞముల కంటే ఉత్తమోత్తమమైనది.
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 12.
Arise, awake and stop not till the desired end is reached. Be not afraid, for all great power, throughout the history of humanity, has been with the people. From out of their ranks have come all the greatest geniuses of the world.
లే! మేలుకో! లక్ష్యం చేరే వరకు ఆగకు! భయపడకు. మానవజాతి చరిత్రలో మహోన్నత శక్తి అంతా ప్రజల నుండే ప్రభవిస్తూ వచ్చింది. అలాంటి ప్రజా శ్రేణుల నుండే ప్రపంచంలోని మహా మనీషులంతా ఉద్భవించారు.
శ్రీ రామకృష్ణ బోధామృతము
మాయ
భగవంతుడు సర్వవ్యాపి అయిన పక్షంలో మనకెందుకు కనిపించడు? పాచిపట్టిన కోనేరును గట్టు నుంచి చూస్తే నీకు దానిలో నీరు ఉన్నట్లుగా కనిపించదు. నీటిని చూడదలిస్తే పాచిని తొలగించాలి. మాయా వృతం అయిన కళ్లతో చూస్తూ, భగవంతుడు కనిపించడం లేదని మొర పెడుతున్నావు. భగవంతుణ్ణి చూడ గోరితే నీ కళ్ళ నుండి మాయ అనే పొరను తొలగించుకో.
***
విచక్షణ
సాధుత్వమంటే మూగతనం కాదు. దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసేవేమీ కాదు. క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుధ్ధికి ప్రేరకమవుతుంది.
శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి /ఒక యోగి ఆత్మ కథ లో
ॐ卐సుభాషితమ్ॐ
గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం
ॐॐॐॐॐॐॐॐॐ
3) షడఙ్గాదివేదో ముఖే శాస్త్రవిద్యా | కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- ఆరు అంగముల యందు, నాలుగు వేదముల యందు, సకల శాస్త్రవిద్యల యందు ఎంతో ప్రావీణ్యత వున్నప్పటికీ, ఒక కవిగా గద్య, పద్య రచనలో ఎంతో ప్రతిభ వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ఆచరణకు నోచుకోని పాండిత్యము వలన, శాస్త్రజ్ఞానం వలన ప్రయోజనం సూన్యం. అది అజ్ఞానాన్ని సూచిస్తుంది.
ఈ కనబడే ప్రపంచంలో నిన్న వుంది, నేడు లేదు అన్న ప్రసక్తి ఉండదు. ఈ సృష్టిలో అన్ని జడ, జీవ పదార్ధాలు మార్పు చెంది కొత్తవాటిగా రూపుదిద్దుకుంటాయి. దేనికీ నాశనము వుండదు కేవలం మార్పు వుంటుంది. అలాగే మనం, మన బంధువులు ఆత్మస్వరూపంతో ఎల్లప్పుడూ ఉన్నవారమే. ఆత్మకి మార్పు లేదు. ఆత్మ నిత్యము, శాశ్వతము.
అలాగే లేనిదానికి ఉనికిలేదు, వున్నది లేకుండా పోదు. ప్రతి కార్యమునకు ఒక కారణము వుంటుంది. కారణము మూలము, కార్యము దాని వికారము. కారణము నిత్యమైనది, దానినే "సత్" అంటారు. కార్యము అనిత్యమైనది, దానినే "అసత్" అంటారు.
అంటే ఈ సృష్టికి మూలకారణం "సత్యము". దాని వికారమైన ఈ ప్రపంచము "అసత్యము". ఆత్మ సత్యము. శరీరము అసత్యము. దీనిని సమగ్రంగా తెలుసుకున్నవాడే గురువు!
అతడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలడు! జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మముల ఆశ్రయం పొందలేని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
***
అమ్మ మాట వేద వాక్క
ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంతో ఇంటికి వచ్చాడు. తల్లి..
‘ఎందుకురా అలా ఉన్నావు?’ అని ప్రశ్నించింది.
‘మా స్కూల్లో డ్రామా వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మాత్రం భటుడి వేషం ఇచ్చారు’ అని కంటతడి పెడుతూ చెప్పాడు ఆ పసివాడు.
‘పిచ్చి కన్నా.. ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే కీలకమైనది. నాటకం అన్నాక రకరకాల పాత్రలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర మాత్రమే లభిస్తుంది. నీ వేషం మరీ చిన్నదని దిగులు పడకు. అందరికన్నా బాగా నటించాలని ప్రయత్నించు. అప్పుడు నీ పాత్రే పెద్దదవుతుంది’ అని ఆ తల్లి కుమారుడికి సర్ది చెప్పింది.
రిహార్సల్స్ పూర్తయ్యాయి. స్కూల్లో నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులోని నటనకు గాను మొదటి బహుమతి ఎవరికి లభించిందనుకుంటున్నారు. మన ‘భటుడి’ పాత్రధారికే. తల్లి చెప్పిన మాటలతో ఆ చిన్నారి తన పాత్రలో లీనమై నటించాడు. అందరికన్నా మంచి నటనా ప్రతిభను కనబరిచాడు. చివరకు బహుమతి గెలుచుకున్నాడు.
ప్రయత్నం మనల్ని ఎంత ఎత్తుకైనా తీసుకువెళ్తుందనేందుకు పై కథ ఒక ఉదాహరణ.
తనది చిన్నపాత్రే కదా అని ఆ చిన్నోడు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే.. అతనికి గుర్తింపు లభించేదా?
పక్షులను చూడండి. అవి గుడ్డును పొదుగుతున్నప్పుడు మాత్రమే ఒకచోట కుదురుగా కూర్చుని ఉంటాయి. ఇది తప్ప మిగతా సమయమంతా అవి ఆహారాన్వేషణలోనే గడుపుతుంటాయి. తమ జీవిత కాలంలో లక్షల మైళ్ల దూరాన్ని ప్రయాణిస్తాయి. ఈ పయనమంతా గూడు కోసం, ఆహారం కోసమే కొనసాగుతుంది. కానీ, పక్షుల కంటే ఎన్నో రెట్లు వికాసవంతుడైన మనిషి మాత్రం తన జీవిత కాలంలో ఎక్కువ భాగాన్ని వృథాగానే పొద్దుపుచ్చుతాడు. చాలామంది జీవితంలో ఏం సాధించామా? అని వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే కనబడుతుంది. ఏ పనీ చేయకుండా రాయిలా పడి ఉండే గుణం మనిషికి అచ్చిరాదు. ఈ గుణాన్ని వదులుకోనిదే మనిషి గొప్పవాడు కాలేడు.
మనిషి జీవిత పర్యంతం ఏదో ఒక పని, ప్రయత్నం చేయాల్సిందే. గొప్ప వ్యక్తుల నిజ జీవిత విజయగాథలను, జీవితాలను చదవాలి. చుట్టూ ఉన్న వారిని గమనించి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. విజయం సాధించడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ ఒక ప్రయాణమే కానీ.. గమ్యం కాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే మనం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
***
పాట సందర్భంపై విశ్లేషణ:-
********
ఒక కష్టం మన అనే వారెవరో పరాయి వారెవరో
మనుషులంటే ఏంటో మంచి అంటే ఏంటో తెలియ జేస్తుంది.. ఒక ఉద్యోగం చేస్తున్న యువతి అనుకోని పరిస్థితి లో కష్టంలో పడుతుంది అపవాదు పడుతుంది లోకం బంధువులు రక్త సంబంధీకులు అందరు నిజమని దూరమై సాయమనేదే చేయరు ఆమెపై ప్రేమను పెంచుకున్న యువకుడు మాత్రం అది నమ్మక అది తప్పు అని నిరూపించి ఆమె మనసును గెలుచుకుంటాడు పరిస్థితి ఎంత దయనీయమై వుందో ఆ సమయం చావుతప్ప మరేం చేయలేని స్థితిలో బ్రతుకు పై ఆశను ఇచ్చిన ఆ యువకుడి తన సర్వస్వంగా భావించిన ఆ యువతి మనో భావమే ఈ పాట.
****************
పల్లవి:-
****
నీవు వుండగా కొండంత అండగా
ఎండైనా వానైనా కష్టం నష్టం ఏమైనా ఏవైనా
నన్నేమి చేయలేవు కదా..
నీ ఆసరే నాకు వేయ్యేనుగుల బలమై వుండగా
వందేళ్ళు నిండుగా జీవించే నైతిక బలమైనానురా
నీ వుండగా కొండంతా అండగా
ఎండైనా వానైనా కష్టం నష్టం ఎన్నైనా
నన్నేమి చేయలేవులే నా దారికి రానీయవులే..
చరణం:-1
****
గోడు వినని జనం తోడు నిలవని మనం
దేవుడల్లే వచ్చావు వరాలెన్నో కురిపించి
మోడు వారినా జీవితానికి తోడుగా నిలిచి నావురా....
ఏరు దాటినాక తెప్ప తగలేసే నేటి సమాజంలో
తూరుపు వెలుగులా వచ్చినావు నాకు అండగా..
పల్లవి:-
***
నీ వుండగా కొండంత అండగా ఎండైనా వానైనా
కష్టమైనా నష్టమైనా నన్నేమి చేయలేవురా...
చరణం:-2
గాయమైన గుండెకు గేయమై తీయనైనా రాగమే
పలికించి పరవశమై నీ హృదయం లో
పవళించులా చేసినావురా
నా తలరాతలను మార్చి తనువునే
నీ అణువణువులో కలుపుకున్న గంగా ప్రవాహానివిరా.
చీకటి చెరలో రేపటిని చూడలేని నాకు
శాశ్వతమైన వెలుగువై నిలిచినావుగా
ఆశలనే చిగురించి శ్వాసలో జీవం పోసినావుగా
నా వాడివై నా నీడవై నా జీవమైన నీకు
ఏమిచ్చినా ఋణం తీరదులే...
పల్లవి:-
****
నీవు వుండగా కొండంత అండగా
ఎండైనా వానైనా కష్టమైనా నష్టమైనా
నా దరికి రావులే....
చరణం:-3
****
కాలం ఎప్పుడూ ఒకేలా గుండదని
ఋజువే చేసినావుగా
తీరం ఒకటుంటుదని నావకు తెలిపావుగా
దారం నీవై ఈ పువ్వుకు ఆధారమైనావుగా
సర్వం నీవే నాకిక నాకే గమ్యం లేదిక
నీతో వుంటే చాలులే ఈ జీవితం ఇక
జరిగే ప్రతిక్షణం ఆనంద వీచికే నాకికా
కలిపిన దైవమా కృతజ్ఞతలు తెలుపుతోంది
నా అణువణువు.
పల్లవి:-
***
నీవు వుండగా కొండంత అండగా
ఎండైనా వానైనా కష్టం నష్టం ఎన్నైనా నా దరికే రానీయవు...
నీ ఆసరే వెయ్యేనుగుల బలమొ వుండగా
వుందేళ్ళు ఆనందంగా జీవించే నైతిక బలమై నిలిచావురా...
59-కర్మ - జన్మ
7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"
కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 1
1. దైవారాధన:
దైవారాధన ఎవరు ఎందుకు చేసినా దాని ఫలితంగా పూర్వ జన్మార్జిత దుష్కర్మలు క్షయం అవుతాయి. ఆ దైవారాధన ఏ రూపంలోనైనా ఉండచ్చు. జపం, పూజ, యజ్ఞం, వ్రతం, దేవాలయ సందర్శనం, క్రతువు... ఇలా శాస్త్రంలో చెప్పిన ఏ రీతిలో ఉన్నా ఫలం లభిస్తుంది.
ఆది శంకరాచార్య ప్రశ్నోత్తర మణిమాలలో ఇలా చెప్పారు.
కిం కర్మ కృత్వా న హి శోచనీయం?
ఏ కర్మ చేస్తే విచారించక్కర లేదు? - శివకేశవుల పూజ చేస్తే విచారించక్కర లేదు.
2. పుణ్య క్షేత్రాల దర్శనం, దీక్షలు:
తీర్థాటనకి వెళ్ళినప్పుడు పూర్వపు రోజుల్లో కాలి నడకనో, ఎద్దుల బళ్ళ మీదో వెళ్ళేవారు. వేళకి భోజనం ఉండదు. కౄర మృగాలుండే అడవులు దాటి వెళ్ళాల్సి వచ్చేది.
కటిక నేల మీద శయనం. ఎలాంటి ప్రాపంచిక లాభం రాని, దైవం కోసం స్వచ్ఛందంగా పడే ఈ శారీరక కష్టాల వల్ల, కర్మ ఫలంగా అనుభవించాల్సిన రాబోయే శారీరక కష్టాలు రద్దవుతాయి అని పెద్దలు చెప్తారు.
పూర్వకాలంలో తీర్థయాత్రల వల్ల ఈ అదనపు లాభం ఉండేది. ఇప్పుడు సౌకర్యాలు పెరిగి శరీరం అంతగా అలవదు. ఈ రోజుకీ మహారాష్ట్ర ప్రజలు ఏటా ఓ సారి కాలి నడకన పండరీపురానికి వెళ్తారు. దారిలో కటిక నేల మీద పడుకుంటూ వారు ఎంతదూరం అయినా ఇలా కాలి నడకనే గుంపులుగా వెళ్తారు. పుణ్య క్షేత్రాల దర్శనం వల్ల ఈ విధంగా శారీరకంగా అనుభవించాల్సిన దుష్కర్మల ఫలాలు రద్దవుతాయి.
నాడి జ్యోతిష్యం చెప్పేవారు పాప పరిహారంగా కొన్ని పుణ్య క్షేత్రాలని సందర్శించమని చెప్పడం మనకి అనుభవమే.
శ్రీశైల శిఖరం దృష్ట్యా వారణాస్యాం మృతోధృవమ్ కేదారే హృదకం వీత్వా పునర్జన్మ న విద్యతే
- పద్మ పురాణం
భావం:-
శ్రీశైలం శిఖర దర్శనం వల్ల, కాశీలో మరణం వల్ల, కేదార క్షేత్రంలోని నీటిని తాగడం వల్ల పునర్జన్మ లేక ముక్తి ప్రాప్తిస్తుంది.
3. ఆథ్యాత్మిక దీక్షలు:
ఇలాగే ఆథ్యాత్మిక దీక్షల్లో పడే శారీరక శ్రమతో ఎంతో దుష్కర్మ క్షయం అవుతుంది. అయ్యప్పమాల దీక్ష, ఆలాంటి కఠినమైన ఇతర దీక్షలు మన పాపాలని క్షయం చేస్తాయి. తమిళనాడులో గుళ్ళల్లో పెట్టే పొర్లు దణ్ణాలు, భగ భగ మండే నిప్పుల మీద నడక మొదలైనవి కూడా శారీరక కష్టంతో కూడిన, తద్వారా దుష్కర్మలని రద్దు చేసే దైవారాధనలే.
4. శారీరక సేవ:
ఇతరులకి శారీరకంగా చేసే సేవ వల్ల కూడా కర్మ క్షయం అవుతుంది. వెంకయ్య స్వామి దీన్ని గురించి ఇలా అనేవారు.
"అయ్యా! చేతుల్లో గీతలు అరిగేలా పని చేస్తే సద్గురువు మీ గీతల్ని మార్చి గీస్తాడు.”
5. హిత కర్మ:
ఆది శంకరాచార్య ప్రశోత్తర మణిమాలలో నిజమైన కర్మ ఎలాంటిదో ఇలా చెప్పారు.
సత్యం చ కిం భూతహితం సదైవః యదార్ధమైన కర్మ ఏది? - "ఎల్లప్పుడు పరులకి హితం చేయడమే యదార్ధ కర్మ."
ముఖ్యంగా మనవల్ల ఎవరికైనా అపరాధం జరిగితే వారికి మనం సదా హితాన్ని చేస్తూండాలి. అందువల్ల అతను మన అపరాధాలని మనసా విస్మరిస్తే, అది మనం చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం అయి ఆ కర్మ తొలగుతుంది.
6. పంచశాంతులు:
పాపపరిహారం కోసం పంచశాంతులు నిర్దేశించబడ్డాయి. అవి...
1. ఉపవాసం
2. జపం
3. మౌనం
4. పశ్చాత్తాపం
5. అన్నశాంతి
1. ఉపవాసం:-
తీర్ధయాత్రలా ఉపవాసం కూడా శారీరక కష్టంతో కూడిన దైవారాధన. కష్టం పాప ఫలానుభవంగా వస్తుంది. కాబట్టి మనం స్వచ్చందంగా పాప పరిహారం కోసం చేసే ఉపవాసంతో అనుభవించే శారీరక కష్టం, ఆ మేరకి రాబోయే ప్రారబ్ద కష్టాలని తొలగిస్తుంది.
వైష్ణవులకి ప్రతీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ఓ ప్రధాన దైవారాధన. ద్వాదశి ఘడియలు వచ్చాకే వారు ఉపవాస దీక్షని విరమిస్తారు. మన పెద్దలు కూడా ప్రాయశ్చిత్తంగా శాస్త్రంలో రెండు ఉపవాస వ్రతాలని నిర్దేశించారు. అవి - కృఛ్ఛ్రము, చాంద్రాయణము.
***
అమృతస్య పుత్రాః
శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 3
భక్తుడు:- మనస్సులో వ్యధనొందుతూ సంసారాన్ని
త్యజించడమా? లేక సంసారంలోనే ఉంటూ భగవచ్చింతన చేయడమా? ఏది సరైనది?
శ్రీరామకృష్ణులు:- మనస్సులో వ్యధనొందుతూ సంసారాన్ని త్యజించేవారు హీనశ్రేణికి చెందినవారు. సంసారంలో ఉంటూనే నిష్కామంగా కర్మలు చేయాలి.
భక్తుడు:- నా మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో ఉంటుంది. మళ్ళీ అంతలోనే అది దిగజారి పోతుందెందుకని ??
శ్రీ రామకృష్ణులు:- సంసారంలో ఉన్నప్పుడు అలాగే అవుతుంది. గృహస్తుని మనస్సు ఒక్కోసారి ఉన్నత స్థితిలో. మళ్ళీ నిమ్నస్థాయికి దిగిపోప్రస్తుంది.
అతడు ఒక్కోసారి అత్యంత భక్తిని కలిగి ఉంటాడు. మరోసారి, ఆ భక్తి తగ్గుముఖం పడుతుంది. అతడు కామినీ కాంచనాల నడుమ నివసించవలసి ఉంటుంది కదా! అందుకే అలా అవుతుంది.
గృహస్తు ఒక్కోసారి భగవచ్చింతన చేస్తాడు. భగవన్నామాన్ని ఉచ్చరిస్తాడు. మళ్ళీ ఒక్కోసారి మనస్సును కామినీ కాంచనాలపై లగ్నం చేస్తాడు. ఈగలాగ అన్నమాట. ఈగ ఒక్కసారి మిఠాయి మీద వాలుతుంది. మరోసారి క్రుళ్ళిన పండు మీద వాలుతుంది.
నిజమైన త్యాగికి భగవంతుడు తప్ప అన్యమైనదేదీ భగవత్రసంగాలు మాత్రమే వింటాడు. తేనెటీగలు కేవలం పువ్వుల మీదనే వాలుతాయి. మకరందాన్ని గ్రోలుతాయి.
లౌకిక ప్రసంగాలను వదిలిపెట్టు. భగవత్రసంగాలు తప్ప అన్యవిషయాలు ఏవి మాట్లాడవద్దు. భగవంతుడొక్కడే సత్యం. తక్కినదంతా మూన్నాళ్ళ ముచ్చటే!ఈ సంసార జంజాటాల మధ్య ఉంటే భగవచ్చింతన వీలుపడదు కొంతకాలం ఏకాంతవాసం అవసరం.
***
No comments:
Post a Comment