Saturday, 7 May 2022

111

ప్రతి ఒక్కరికీ  పేరు పేరుునా అమ్మలు గన్న అమ్మను తలుస్తూ మాతృదినోత్సవము సందర్భముగా ప్రాంజలి ప్రభ  శుభాకాంక్షలు




*నేటి పద్యాలు సూక్తులు *  సప్త మహర్షులు - సప్త ఋషి మండలము, * అన్నమాచార్య సంకీర్తన


స్త్రీ కి ప్రకృతి ఇచ్చిన వరం 'అందం' 
వారు త్వరగా కోల్పోయిదీ అదే !?
*చంద్రికా పద్యం 
ప్రకృతి ధర్మమేను ప్రగతి మార్గమేను పడతి ఆశ తీరు 
ప్రకృతి సత్యమేను ప్రతిభ చూపు దారి సూర్యవెలుగు మల్లె  
ప్రకృతి విద్య యేను పగలు రేయి  సుఖము పుడమి కోర్క తీర్చు   
ప్రకృతి అమ్మ మాట ప్రధమ దీవెనయే ఓర్పు నేర్పు నిచ్చు 
****
*దత్తపది......ఉప్పు, పప్పు, చెప్పు ,  ముప్పు పూరించుట 
*ఆటవెలది 
మనసు అగ్గి మీద ఉప్పుగా మార్చకు 
చెప్పి నాక పప్పు చేయ వేమి     
చెప్పు చేతలనుట చేత కానిది మాట         
ముప్పు ఎంత నున్న ముందు వినుట  
(ఆ అమ్మ పలుకు ) 
.....
*ఉత్పలమాల 
ఉప్పుకు కారమే చెలిమి ఊపిరి పోసియు తృప్తి పర్చుటన్
పప్పుకు శాకమే చెలిమి పాశము గట్టిగ కల్సి పోవుటన్
చెప్పుకు తేలుయే చెలిమి చెంతకు వచ్చి చచ్చిపోవుటన్
ముప్పుకు భయ్యమే చెలిమి ముందర చూపుని రాశపర్చుటన్         
***
*తేటగీతి 
కళ్ళకు కనికరం దృష్టి కానిదేది 
రెండు కళ్ళు సర్వం చూడు రెప్ప ఆపు 
చూసినది చెప్పఁ లేదులే చూపులకళ   
అలసి నా గుర్తించీ తెల్పు ఆకలినియె
***
తేటగీతి
పడిన చోటనే వెతుకు ట ఫలము దక్కు
పాడు బడ్డచోట భయము తో తాడు పామె
చెదల పుట్టలో పాములే చేరు చుండు
బుర్రలో మెదిలే కళ బుడగ లాగ
......

****
మన్మధుడు అశరీరుడు మనసు నుండు
ప్రేమ పుట్టె శరీరుడు ప్రియము చేసి
ముందు చెయ్యి చెయ్యి కలపి ముద్దు చేసి
సుఖమనువివేక వంతమై సూత్ర రక్తి
ఆటవెలది
అమ్మ అనుచు తిట్టి ఆట పట్టుట బుధ్ధి
రొమ్ము పాలు త్రాగి రొమ్ము తన్నె
వెర్రి కోప మోచ్చి వేసెకత్తి అయినా
 తల్లి ప్రేమ జూపె తనయ పైన
(మత్తెక్కిన మనిషి వాక్కు)
........
ఎదుటి వారి ముందు నటన ఏల నీకు
వాస్తవము తెలిపే కళ వరద పొంగు
దాచి నా దాగనిది నిత్య దారిఅదియె
జీవితంలో న ఎన్నాళ్ళు జీత మగును
.......
పెంపకము ప్రేమ సూత్రమే పేగు పూత
ఏది పొరపాటు జరిగినా యెదనుతాకు
పిడుగు పడ్డ ప్రేమ చెదరదే సుతులలొ
జగతిలో అమ్మ నాన్న యే జాగృతి గనె
.......
అమ్మ కే హక్కులేదని అన్న దెవరు
గౌర వింపదగిన తల్లి గళము వినుట
అమ్మలను గన్నయమ్మయే ఆది శక్తి
పురుషునకు బానిసత్వం మా పుడమి నందు
.....
🧘‍♂️95-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️

95(అ). ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయాక్లిష్ట కారిణే నమో వేదాంత వేద్యాయ||
 
(గోపాలపూర్వతాపిన్యుపనిషత్)

-ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంత వేద్యుడునగు శ్రీకృష్ణపరమాత్మకు నమస్కారము.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 8.

Is not self-sacrifice, then, a virtue? Is it not the most virtuous deed to sacrifice the happiness of one, the welfare of one, for the sake of the many?

మనిషి కేవలం త్యాగం ద్వారానే అత్యున్నతమైన స్ధితికి చేరే పరిణామాన్ని సాధిస్తాడు - తనతోటి వారికోసం ఎంతవరకు త్యాగం చేయగలడన్న దాన్ని బట్టి మనిషి అంత గొప్పవాడుగా కీర్తించబడతాడు.

జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

ఇనుప కండరాలు, ఉక్కునరాలతో నిర్మితమైన శరీరం, వజ్రాయుధం లాంటి దుర్భేధ్యమైన సంకల్పాలనే నేను కోరుకునేది.

ॐ卐సుభాషితమ్ॐ

శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం

30) ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారమ్|

జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్ ||

ప్రాణాయామము - ప్రత్యాహారము - నిత్యానిత్యవస్తువివేకము జపంతో కలిసిన సమాధిస్థితి - ఏకాగ్రత వీటిని శ్రద్ధగా ఆచరించు.
***


* అన్నమాచార్య సంకీర్తన

నేల మిన్ను ఒక్కటైననీబంటు వొక్క- | 
వేలనే అక్షుని తెగవేసెగా నీబంటు ||

ఉంగర మెగరవేసి ఉదధిలో పడకుండ | 
నింగికి చెయిజాచి నీబంటు |
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద | 
కుంగదొక్కి పదముల కుమ్మెగా నీబంటు ||

వెట్టగా రావణు రొమ్మువిరుగ చేతనే గుద్దె | 
నిట్టతాడువంటివాడు నీబంటు |
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి | 
పట్టపగలు తెచ్చె బాపురే నీబంటు ||

అలరనన్నియు జేసి అజునిపట్టానకు |
 నిలుచున్నాడదివో నీబంటు |
బలువేంకటేశ ఈ పవననందనుడు |
కలిగి లోకములెల్ల కాచెగా నీబంటు ||
***
భావము :-

 నేలమిన్ను ఒక్కటైన నీబంటు రామునితో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడో అన్నమయ్య వివరిస్తున్నాడు.

 ఓ రామా ! చిత్రమైన ధనస్సుతో రావణుని కుమారుడు   అక్షకుమారుడు రాగా , అతని  ప్రతిభనుచూసి సంతోషించి  నీ సేవకుడైన హనుమంతుడు  నేలా, ఆకాశము ఒకటయ్యేటట్లుగా శరీరాన్ని పెంచాడు.    పాముని  గరుత్మంతుడు గట్టిగా పట్టుకున్నట్లుగా  అక్షకుమారుని పాదాలను గట్టిగా పట్టుకొని వేయి మార్లు గిర గిర  తిప్పాడు.  ఆ తరువాత నేలపై కొట్టి చంపాడు  

1:  ఓ రామా ! నీ సేవకుడయిన హనుమంతుడు నువ్వు ఇచ్చిన  ఉంగరాన్ని తన సహజ స్వభావముతో ఎగురవేసి సముద్రములో పడకుండా , ఆకాశము వైపు చేయి చాచాడు.
 హఠాత్తుగా ఒక్క గెంతు వేసి సముద్రాన్ని అవలీలగా దాటి  జంబుమాలిని  నేలమీద పడవేసి కుంగదొక్కి పాదాలతో నీసేవకుడయిన హనుమంతుడు నలిపాడు కదా !  (  జంబుమాలి ప్రహస్తుని కొడుకు. రావణుని సేనాధిపతులలో ఒకడు. అశోకవనభంగ సమయములో హనుమంతుడు ఇతనిని చంపాడు)  

2:  రామా ! తాపము కలిగేటట్లుగా యుద్ధములో రావణుని రొమ్ము విరిగిపోయేటట్లుగా తన చేతితో గుద్దిన - నిలువుగా ఉన్న తాటి చెట్టులాంటి వంటి వాడు(నిట్ట తాడు) నీ సేవకుడయిన హనుమంతుడు( రావణుడు  - హనుమంతుడు కొట్టిన అరచేతి దెబ్బకి భూకంప సమయంలొ పర్వతంలా వణకి పోయాడని వాల్మీకి రామాయణం)

 బాపురే ! ఎంత ధైర్య వంతుడయ్యా !  మందులకొండ అయిన సంజీవని పర్వతాన్ని తేజస్సుతో నడు రేయి తీసుకువచ్చి ఆ పర్వత కాంతులతో రేయిని పట్టపగలు చేసిన వాడు నీ సేవకుడయిన హనుమంతుడు

3:  రామా ! అన్నీ  చేసి నీపట్టాభిషేకములో ఏమి తెలియనట్లుగా ఒక మూలగా నిలబడ్డాడు నీ సేవకుడయిన హనుమంతుడు.బలవంతుడవయిన ఓ వేంకటేశా ! నీ సేవకుడయిన హనుమంతుడు ఈ లోకములనన్నింటిని రక్షించేవాడు.

***

పాట సంఖ్య:-【266】
 🌹........నేటి నా పాట.........🌹
*****************************
మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
08/05/2022.
*****************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
***************************
మంచి మసాలా సీన్  బ్యాక్ గ్రౌండ్ అంతా
బస్తీ లా  ఊర మాస్ సెటప్... సిచ్యుయేషన్
 కుర్రకారు హుషారుగా  ఊగే సమయం
  మల్లెపూల బండి తోసుకుంటు  హీరో ముందుకు
 హీరోయిన్ వస్తుంటే ఆ మల్లెపూల ను మెడలో వేసుకొని
మత్తుకళ్ళ చూపులతో హీరో  పాడే పాటకు మల్లెలు అమ్మే అమ్మాయి నేను రెడీ అంటు ఢీ కొట్టి మరీ వంత పాడుతు హుషారుకే  హుషారు  పుట్టిస్తు సాగే పాట..*
**********************************************

పల్లవి:-
********
మత్తెక్కిస్తున్నావే మల్లెపువ్వులా
అత్తరు పూస్తానే ఒంటినిండుగా
 వచ్చేయవే వయ్యారాల గువ్వా
ఇచ్చెయ్యవే నీ అందాల గోవా

 సూర్యుడిలా బళే వేడిగున్నావు
 నా ఈడుకి సరిజోడీవవుతావు
 నీ భూగోళమంతా ఆక్రమిస్తాను
 వద్దన్నదెవరు  సిద్దంగా వున్నాను రా
 సింహమంటీ మగసిరి మొనగాడా..

 మత్తెక్కిస్తున్నావే మల్లెపువ్వులా
అత్తరు పూస్తానే ఒంటినిండుగా
 వచ్చెయ్యవే వయ్యారాల గువ్వా
ఇచ్చెయ్యవే నీ అందాల గోవా..

చరణం:-1
**********
చిత్తయిపోతా నీ చెంత కొచ్చి
గుత్తంగా ఇచ్చుకుంటా  సోకులన్ని
మహత్తు ఏదో నీలో వుంది
జగత్తు అంతా చూసినంత హాయిరా నీ కౌగిళి...

చూపులకే పడిపోయాను
నీ ఊపుకే ఊయలై ఊగాను
 తోపు వంటే నీవేరా నీ లాంటి మగాడినే
 ఇంత వరకు చూడలేదురా...
పల్లవి:-
*******
 మత్తెక్కిస్తున్నావే  మల్లెపువ్వులా
అత్తరు పూస్తానే ఒంటి నిండుగా
 వచ్చెయ్యవే వయ్యారాల గువ్వా
 ఇచ్చెయ్యవే నీ అందాల గోవా...
 చరణం:-2
*********
 మాసుగాడి ఫోజులో  సూపర్ గా వున్నావులే
 ఏ డ్రెస్ వేసినా నీ అడ్రస్ అదురులే
 తాచుపాములా బుసకొడుతున్నావు
 నీ వేడి స్పీడుకి తట్టుకోగలనా నేను..

 వేటగాడినే నేను  బాణమేసినానే నీకు
 ఆట ఆడుకోవడానికి తయారుగా వుండు
 మాట ఇస్తున్నాను దొరగారు
 నీవెపుడు రమ్మంటే అపుడు
 నీ ఒడిలోకి వచ్చి వాలుతాను నేను...

అదిరే నీ అందం చెదిరే నా హృదయం
కుదిరే ఈ సమయం  నీ కులుకులకు బోణి కొట్టేస్తాను
 నవ్వులతో వస్తాను నా  పువ్వును నీకు
 నైవేద్యంగా ఇస్తాను   అందాలన్ని హారతి పళ్ళెంలో
 పెట్టి నీకు అప్పగిస్తాను..
పల్లవి:-
********
 మత్తెక్కిస్తున్నావే మల్లెపువ్వులా.
అత్తరు పూస్తానే నీ ఒంటి నిండుగా
 వచ్చెయ్యవే నా వయ్యారి గువ్వా
 ఇచ్చెయ్యవే నీ అందాల గోవా....
******************************************

చుట్టూతా వందిమాగత బృందాలు బృందగానాలు
చరిత్ర చెప్పడంలేదా యశోవృక్షం ఆకులురాల్చుతుందని
నిన్నటి వసంతపు అభినందనల మందారాలు
రేపటి గ్రీష్మంలో ఆకులురాల్చేసి మోడవుతుందని!

                       ——— లక్ష్మా రెడ్డి  పసుల


No comments:

Post a Comment