Sunday, 8 May 2022

111



***



శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల

 18వ శ్లోకం:-

జిహ్వే కీర్తయ కేశవం మురరి పుం చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు కృష్ణం లోకయ లోచన ద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమా ధోక్షజం || 

భావం:-

(ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయవలసిన వానిని చేయుట. వెనుకటి శ్లోకమున జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే విడువదగిన వానిని చెప్పి, ఇందు చేయదగని వానిని చెప్పుచున్నారు.)

ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచు చుండుము. ఓ హస్త ద్వంద్వమా! నీవు భగవదర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరించుచుండుము. (ఇట్లు కర్మేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ నేత్రద్వంద్వమా! శ్రీకృష్ణభగవానునే చూడుము. ఓ శ్రోత్రద్వంద్వమా! ఆ శ్రీకృష్ణుని లీలలనే ఆకర్శింపుము. (ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ మనసా! ఆ శ్రీధరుడినే ధ్యానింపుము. (ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 4.

పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. కనుక ఈ ప్రపంచం మీద మీదైన ఒక గుర్తును ముద్రించిపొండి! మీరందరూ మహాత్ములైన ఋషుల సంతతికి చెందినవారు. మీరు ఘనకార్యాలు సాధించడానికి జన్మించారని నమ్మండి.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

నమ్మిన సిధ్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడటమే నాయకత్వ లక్షణం. కానీ మనం మాత్రం అవసరమైన త్యాగం చేయకుండానే నాయకులమవ్వాలని అనుకుంటాం. దాని ఫలితం శూన్యం - చివరకి ఎవరూ మనల్ని లక్ష్యపెట్టరు.

🧘‍♂️శాంతి🧘‍♀️

శాంత స్వభావుడైన వ్యక్తి పని ప్రారంభించే వరకు ప్రశాంతగా ఉండి, అప్పుడు పనిలో ప్రవేశిస్తాడు; పని పూర్తికాగానే , ప్రశాంతంగా కేంద్రానికి తిరిగి వస్తాడు. మీరు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉన్న గడియారపు లోలకము వలెవుంటూ, అవసరం అయినప్పుడల్లా  పనిలో దూకడానికి సిధ్దంగా ఉండాలి.

*శ్రీ పరమహంస యోగానంద 

యోగదా సత్సంగ పాఠాలు*

🧘‍♂️సుభాషితమ్🧘‍♀️

శ్లోకం:-

అఞ్జలిస్థాని పుష్పాణి

 వాసయన్తి కరద్వయమ్|

అహో సుమనసాం ప్రీతిః

వామదక్షిణయోః సమా||

తాత్పర్యం:-

దోసిట్లో ఉన్న పువ్వులు రెండు చేతులకూ సువాసన కలిగిస్తాయి. సుమనస్సులకు (మంచి మనస్సు కలవారు, పుష్పములు అని రెండు అర్థాలు) కుడి ఎడమలు రెండింటివిషయంలో (అనగా చెడ్డవారి విషయంలో, మంచివారి విషయంలో) ఒకే విధమైన ప్రేమ ఉంటుంది. ఏమి ఆశ్చర్యమ్


🕉️🌞🌏🌙🌟🚩

నేటి స్పందన పద్యాలు 04--06--2022

దత్తపది..ఇంద్ర భీష్మ విష్ణు బ్రహ్మ 

ఉ..ఇంద్ర వినోదకేళికళ ఈశ్వర సృష్టి యు చిత్తవృత్తులన్

భీష్ముడు బ్రహ్మచారిగను ప్రేమను రాజ్యము లక్షణాల్ని గన్

విష్ణువు విశ్వమందుననె వేకువ గమ్యము తెల్పుచుండుటన్

బ్రహ్మయు నిత్యమార్పులను బంధపు వ్రాతలు వ్రాయుచుండుటన్

..........

సీ....గోవింద బాలాజి గోవర్ధనోద్ధార

గోవుల పతితానుగోకులేశ!

కలియుగ కాలంలో కష్టాలు బాపిన

కలియుగ వైకుంఠ కనుచు జనులు!

ఏడేడుశిఖరాలు యేడుకొండలనుచు

శేషాచలంబుగా శేషువగుచు!

వెంకటాద్రియెరుగ వెల్గుపుష్కరిణియే

కోనేటిరాయుని కొండ పైన!

ఆ॥వె॥

శేషఁబడగజూడ శేషాద్రి యయ్యెను

నడుమనందు వెలసె నారసింహ

చివర వాలమందు శ్రీ శైల మల్లన్న

వెంకటేశ మహిమ వేడుకగుచు!

...........

గీ....ఇంద్ర దేవతల పలుకు ఈశ్వరేచ్ఛ

భీష్మ నిప్రతిజ్ణ తెలిసియే భీకరంబు

విష్ణు లీలలు వీనుల విశ్వ మగుటె

బ్రహ్మ సృష్టి యే నిత్యము బ్రతుకు నేర్పు

..........

ఆ....ఇంద్రవిరచితంబుయిందిర యష్టకమ్

భీష్మ ప్రజ్ఞ  దెలుయుభీకరంబు

విష్ణు సహస్ర నామ వీనుల విందగు

బ్రహ్మ జ్ఞాన మెరుగు  బడయగలవు

0 comm

 [6:18 am, 04/06/2022] Mallapragada Sridevi: నిజజీవితం అంటే.. రెండున్నరగంటల  సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. 

--==--==((((:•:))))==--==--

【🌹నేటి నా పాట 🌹పాట సంఖ్య:-293🌹】

***************

రచన:-మహేష్ వూటుకూరి ✍️

9640713717.

దోర్నాల.

04/06/2022.

******

పాట సందర్భంపై  విశ్లేషణ.

**********

ప్రతి మనిషి తన స్వార్థం కోసం తన మన భేదం చూపుతు చేస్తున్న  వేస్తున్న  మోసాల అడుగులకు

సమాజం మనిషి మనుగడ  ప్రశ్నార్థకంగా

మారబోతోంది ఆరేళ్ళ పిల్లాడినుండి రేపో మాపౌ పోయే ముసలి వాడీ వరకు  అందరిలో లోపాలే అందరు చేస్తున్న పాపాలే  ఇదే నచ్చనీ హీరో సమాజానికి మనుషులు దగ్గర కావాలఃటు మనమే సమాజం

 సమాజమే మనం  అంటు గళమెత్తి   సామ దాన బేద దండోపాయాలతో  శంఖం పూరించి  సమైక్యంగా సాగేందుకు అడుగై పిడుగై ఉరిమిన పాట....

****************

పల్లవి:-

****

అనుకున్నదే తడవుగా అగ్నిలా కదులుతా

ఆకాశపు హద్దునైనా జమదగ్ని నై చెరిపేస్తా

అనుక్షణం లక్ష్యమే  నా ముందున్న జీవితం.

 దాన్ని అందుకోవడానికి ఎంతకైనా తెగిస్తా.


 లోకం తీరెలా ఉన్నా  దాపరికాలు చేయను

 నన్నాపాలని ఎవరు చూసిన చేసేస్తాను భస్మం.

 నిన్న నేడు రేపు అంతా నాదే

 గెలుపు పిలుపు నాకే...


 అనుకున్నదే తడవుగా అగ్నిలా కదులుతా

ఆకాశపు హద్దు నైనా జమదగ్నినై చెరిపేస్తాను...

 చరణం:-1

*****

 నిదురిస్తున్నా ఈ లోకం సోమరి ప్రపంచం

నిజం  చెప్పని ఈ సమాజం తప్పుడు మార్గం

 నడిచే వాడు నడిపించే వాడు దొందు దొందై

 విలువలకు వలువలు వలిచేస్తున్నారు.


విను వీధుల నంతా  స్వార్థం చెత్తతో ముంచేస్తున్నారు

ఎవరెటుపోతే నాకేమంటు  ఎవరికి వారే వంచకులై

మంచిని మట్టిలో కప్పేస్తున్నారు...

మారాలి మార్చాలీ అందరూ మార్పు తో తీర్పు గొప్పగ వుండేలి చేస్తాను...

 పల్లవి:-

****

అనుకన్నదే తడవుగా అగ్నిలా కదులుతా

ఆకాశపు హద్దునైనా జమదగ్నినై చెరి పేస్తాను...

 చరణం:-2

***

 సోమరులారా లేవండి లేదంటే చావండి

 బ్రతుకంతా నీచత్వమేనా వదిలేద్దాం

ఒకరికొకరం తోడుగా బతికేద్దాం

 కుక్కల్లా పందుల్లా  ఎందుకు ఈ జీవితం.


 ఎన్నాళ్ళుంటాం  చెప్పగలవా

 ఎందుకు ఈ దోపిడి ఎందుకీ కోపతాపాలు

 వయసుచూడు ఎంతుందో సాటి మనిషిపై

 ఇదా నీవు చేసే దుర్మార్గం...

పల్లవి;-

****

అనుకున్నదే తడవుగా అగ్నిలా కదులుతా

ఆకాశపు హద్దులనైనా జమదగ్ని లా చెరిపేస్తాను..

చరణం:-3

***

మారకుంటే మరణ శాశనం రాయడమే

మిగిలింది ...

ఊరుకుంటే ఊరంతా  సర్వ నాశనం

మారాలి సాగాలి మంచి తనం

 మన చుట్టు ఈ చెట్లలా పెరిగేలా.....


 అనుకున్నదే తడవగా అగ్నిలా కదులుతా

ఆకాశపు హద్దులనైనా జమదగ్ని లా చెరీపేస్తా

అనుక్షణం లక్ష్యమే నా ముందున్న జీవితం.

దాన్ని అందుకోవడానికి ఎంతకైనా తెగిస్తా...



97. తత్ర పరమహంసానామ సంవర్తకారుణి, శ్వేతకేతు, దూర్వాస, ఋభు, నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక ప్రభృతయః|| 

(యాజ్ఞవల్క్యోపనిషత్)

- పరమహంసలనగా సంవర్తక, ఆరుణి, శ్వేతకేతు, దూర్వాస, ఋభు, నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక మొదలగు మునులు.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 9.

పవిత్రంగా నిస్వార్ధంగా ఉండడానికి సదా ప్రయత్నించు. మత సారమంతా ఇదే!

***

జాగృతి: స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వేయిసార్లు విఫలమైనా, మరొకసారి ప్రయత్నించండి.

***

ఆచార్య సద్బోధన:-             

మానవునికి ఆత్మజ్ఞానం కలుగవలెనన్న ముందుగా తనలో ఉన్న అహంకారమును వదిలివేయాలి.

దీపపు ఒత్తిలో నీరు చేరి ఉంటే ఎంత నూనె వేసిననూ,   ఎన్ని పుల్లలు వెలిగించిననూ దీపము వెలుగదు కదా!

అట్లే మనిషి మనసు అహంకారము అనే నీరుతో తడచి ఉన్నపుడు ఎంత సాధన చేసిననూ   జ్ఞాన జ్యోతి వెలుగదు. 

అహంకారమును మనసు నుండి పూర్తిగా బయటకు పంపినపుడు జ్ఞానజ్యోతి చక్కగా వెలుగుతుంది.

జ్ఞాన జ్యోతి వెలిగినంతనే అజ్ఞానము అనెడి చీకటి తొలగిపోతుంది. మనిషిలో ఉండిన అజ్ఞానం అనే చీకటి తొలగిపోవడమే మోక్షం.

ॐ卐సుభాషితమ్ॐ

మహాత్ముల_హితోక్తులు:-

నాకు సాక్షాత్కారం కలుగుతుందా అనే సందేహం.నాకు సాక్షాత్కారం కలుగలేదు అనే భావన-ఇవి రెండూ సాక్షాత్కారానికి ఆటంకాలు. అదేమీ కొత్తగా పొందేది కాదు. ఆత్మ సాక్షాత్కరించే ఉంది. కావల్సిందల్లా నాకు సాక్షాత్కారం లేదు అనే తలంపును తోసి పారేయడమే.

                            -రమణ మహర్షి

***
.
 ఉత్పలమాల....... పద్యాలు 
వలపుల చిన్నదే కళ వివాహము మత్తు యుకల్గి దేహమై
తలుపులు తెర్చియే పిలుపుగా పలు చేష్టలు కల్గి దాహమై
మలుపులు తెచ్చి యే సహన మాయలు కోర్కెలు కల్గి తృప్తి గా
పలుకక కూరుచున్ననె శుభం బొన గూడును భర్త కింటిలో
......
శర్మగ హృద్యమే పలికె శాశ్వత దీక్షలు చెప్పదల్చుటన్
ధర్మ ము లెన్ని ఉన్ననులె దారియు చూపక ఆశ నింపుటన్
కర్మల నీడలన్నియులె కాలము బట్టియె తట్టిలేపుటన్
నిర్మల హావభావములు నిన్నును నన్నును మార్పు తెచ్చుటన్
.......
జన్మను తీర్చిదిద్దుటయు జాడ్జము కాదులె ధర్మమేయగున్
జన్మయు ఇంద్రియాలకళ జన్యపరమ్ముగ ఉద్భవించుటన్
జన్మయు సేవగా కదిలె జాప్యము కాదులె నిత్య సత్యమున్
జన్మదినమ్ముగా శుభము జాతికి రక్షగ పుత్రికా పుర్షుడేయగున్
......
 న్యస్తాక్షరి...మీ నా క్షి రి -- పూరించే ఉత్పలమాల
మీగడ పాలలో మెరుపు మేనులొ తాపము తెల్పలేకయున్
నాగళమే యనే పలుకు నాన్యత ధన్యత తెల్పుచుండుటన్
క్షిగ్రత యే యవ్వు యుపుడె చింతయు చేరియు కర్మయవ్వుటన్
రోగము రమ్యమైన లియు రోషము పెర్గియు జీవమవ్వుటన్
.......
నాడిని పట్టి తెల్పుటయె నానుడి వాక్కులు కొట్టివేయుటన్
వాడిన పూలలో కలదు వాసన తక్కువ ఏలయవ్వుటన్
వేడిగ నేసముద్రముయు వేదన వల్లను ఏలచెప్పుటన్
ఆడిన ఆటలే జనుల ఆశల తీరము రాజకీయమున్
......
న్యస్తాక్షరి...మీ నా క్షి రి -- పూరించే ఆటవెలది 
మీద కెక్కియు ప్రేమతొ మేను పంచి
నాది సొంతమే భావము నాశ పెరిగి
క్షితిజ తీర్పుగా తెల్పెను క్షీణ దశయు
రోగము కాదులే సౌందర్య రమ్య పరచు
.......
న్యస్తాక్షరి.. ఆటవెలది 

మీస ముమెలి వేసి మీనగన్నులవాడు
నాశికపుటమునకు నచ్చిరేడు
క్షిరపుయాలుకగుడ పరమాన్నములతోన
రోజుఁగుడువరాజు మోజుతోన..
........
మీరు నేను ఒకటి మీన వేషాలేల
నాన కుండ జెప్పు నాదు మాట
క్షితిజ గతియు మతియు క్షీరము లగటయే
రోగ మేల నీకు రొప్పుయేల
---

కంద పద్యాలు
---
అమ్మ యన ప్రేమ సుధలే
అమ్మ మనసున తొలగించు అత్రము వ్యధలై
అమ్మయదు నాధు కధయే
అమ్మచెలిమియే నుఆత్మ సమయమ్మగుటే 
---
అమ్మ యోకప్రేమ ఝరియే
అమ్మ సుమ నవ్వుల రేడు సహనమ్ముగనే
అమ్మలలితమ్మె నిత్యము
అమ్మ మనమందు సిరిగను ఆకలి కలిగే
---
అమ్మ అను దేవి వడిలో
అమ్మ యనుప్రేమ ముడిపడి ఆశలు తీర్చే
అమ్మయను నింట గుడియే
అమ్మ గనుదీవెనలుగనె కాలము మార్చే
---
అమ్మ హరసమ్మె యగుటే
అమ్మ యన భూమి విధిగను అలకలు మార్చే
అమ్మ యన బువ్వ పెట్టియు
అమ్మ మనసు నిరతమ్మె ఆశయ మగుటే
---
నేను యె చిక్కితి స్వేచ్ఛకు
నేను అనుటేను మదిలో నయణాధికమే
నే కళలన్నియు కలిగే
నేను తెలిపెదా మనసున నటనా ప్రతిభే
.......
చీకటి తరిమే కాంతియు
వేకువ జామున నెవచ్చు వేల్పుల కళలై
మక్కువ తీర్చగ వెలుగై
చక్కని చుక్కల నడుమయే చిక్కగ సాగే
......
----
తేటగీతి పద్యాలు 

జీవితంలో న పొందాలి జ్ణాన భిక్ష
తెలియనిది తెలుసుకొనుటే తేట గీతి
మళ్ళి మళ్ళీ యున్న వయసు మనసు మారు
వాళ్ళు వీళ్ళు అనుట ఏల వాదమేల
.......
పరిచయంతో ను బుధ్ధి గా పలుకు తెలుపు
ఎవరు ఏమన్న బ్రతుకులో ఏడ్పులగుటె
ఎపుడు ఎక్కడా అనకుమా యదన నుండె
ఊపిరి చెలిమి కలుపుటే ఊత మగుటె
---
" * ఉప్పు * లేనికూరయహహ..చప్పగుండు
* పప్పు* తోడనోగిరమది పసనుఁగలుఁగు
* చెప్పు *డుపలుకులెపుడును తప్పుఁజేయు
 * ముప్పు *లనెదుర్కొనుటబల్మి పుడమి మీద !!! "
---
ఉప్పు కప్పురంబు ఒకటే ఉన్న రుచియె
వేరు చెప్పెడి మాటలు వేగ మగుటె
పప్పు కూడు తిన్న ను తప్పు పట్టు యేల
చెప్పు మాటలు వినకుమా తప్పు జరుగు
---
గొడవ లన్ని సుఖము బట్టి గోడు విప్పు
అసలు కొసరు ముద్దులు వల్ల ఆట ముప్పు
అవుసరం ఇద్దరిది ఆశ ఆద మరుపు
నవ్వుల కళలు పురివిప్పి నటన జూపు
----...
ఆదిశక్తి అసలు రూపు అమ్మదేను 
అవని శక్తిగా బ్రతుకంత ఆదు కొనెను
ప్రేమ పంచిపొందేదియే పిలుపులమ్మ
మామనసునందు ఉన్నట్టి మాతృమూర్తి
===
అమ్మ ఆటబొమ్మ యనకు ఆకలి గను
ఆత్మ తృప్తియే అందించు ఆశ వదులు
నిన్ను నన్ను సృష్టించిన నేత అమ్మ
కన్న ప్రేమకు బానిసై కళలు తీర్చు
---
శ్వాస యే ధ్యాన నిలకడ ధ్యాస పెంచు
ధ్యాన శాస్త్రమే ఆరోగ్య ధ్యాస పెంచు
మనిషి ఆత్మశాస్త్రము బుధ్ది మార్చు గుణము
మతము ఆధ్యాత్మిక పరమై మనసు మాట
........
మలినమును శుభ్ర పరుచుటే మలుపు మెరుపు
జలము మాలిన్య ము తొలిచి జయము నీదె
నాలుక రుచులు తెలిపియే మాయ నాపు
పరుల నిందలు వద్దులే ప్రాథమిక యె
---


శ్రీ అన్నమాచార్య సంకీర్తన

రేకు: 221-5 , సంపుటము: 3-118 , రేకు రాగము: లలిత.

వెదకినఁ దెలియదు వెనక ముందరలు

పదమున నిలుపవె పరమాత్మా!! 

॥పల్లవి॥

కోరిక లూరక కొనలు సాగఁగా

బారలు చాఁచీఁ బ్రపంచము

యీరీతి జీవులు ఇలఁ బొడమఁ బొడమ

దూరంబాయను తొలుతటి రాక!!  ॥వెద॥


కాయపు మదములు కప్పఁగఁ గప్పఁగ

ఆయము లంటీనదె మాయ

పాయక ఇందే పనుపడి పనుపడి

చాయలు మరచిరి జంతువులు!!  ॥వెద॥


బలుశరణాగతి ప్రాణులు దలఁచఁగ

నెలవున నిలిపెను నీకరుణ

ఇలపై శ్రీవేంకటేశ్వర యిహ పర-

మలవడి దొరకెను అరచేతికిని!! ॥వెద॥

***

350) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

2-5

ఇయన్మాత్రపరిచ్ఛిన్నో యేనాత్మా భవ్యభావితః 

స సర్వజ్ఞోఽపి సర్వత్ర పరాం కృపణాం గతః.  

స్వల్పమై, పరిచ్ఛిన్న మైనట్టి ఈ దేహాదులే ఆత్మయని లెస్సగ భావించువాడు సర్వజ్ఞుడైనను ఎల్లెడల మహాదీనత్వము నొందును. 

2-6

ఆత్మనో వ్యతిరిక్తం యత్కించిదస్తి జగత్త్రయే యత్రోపాదేయభావేన బద్ధా భవతు వాసవా.

ముల్లోకములందును ఆత్మకంటెను వేఱుగ ఏదేని వస్తువున్నచో దానిని పొందుటకుగాను వాసన జనింపవచ్చును. (కాని వాస్తవముగ ఆత్మకంటె వేఱుగ ఏ వస్తువున్ను లేదు. కాబట్టి వాసన అయుక్తమే యగునని భావము.) 

2-7

ఆస్థామాత్రమనన్తానాం దుఃఖానామాకరం విదుః అనాస్థామాత్రమభితః సుఖానామాకరం విదుః.

అసత్యమగు దృశ్యమందు విశ్వాసము (సత్యత్వబుద్ధి) గలిగి యుండుటటే అనంతదుఃఖములకు నిలయమనియు, దృశ్య మందెచటను విశ్వాసము లేకయుండుటయే అనంతసుఖములకు నిలయమనియు చెప్పబడినది.

*** 


నే టి  అనారోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం   పత్రికలోని  వ్యాసములు కీర్తనలు శ్లోకాలు  పద్యాలు కధలు - చావండి చదవమని చెప్పండి
సుభాషితం

స్థిత్యతిక్రాంతిభిరోణి  స్వచ్ఛాన్యాకులితాన్యాపి౹

     తోయాని తోయరాశీనాం మానాంసి చ మనస్వినామ్౹౹

గంభీరంగా ఉండే పెద్దవాళ్ళ మనస్సు ఎల్లలు దాటడానికి భయపడుతుంది.ఎన్ని కష్టాలుతలెత్తినా నిష్కల్మషంగా ఉంటుంది.అలాగే,సముద్రంలోపలవున్న నీళ్లు తీరందాటవు.పాడుచేసినా కూడా బురదగా అవ్వవు.

 సాపేక్షా న చ దాక్షిణ్యం   న ప్రితినర్చ సంగతిః ౹

     తథాసపి హరతే తాపం లోకనామున్నతో ఘనః ౹౹

ఎటువంటి అపేక్ష మేఘానికి లేదు.దయ లేదు.ప్రేమలేదు.జతగాడన్న భావనలేదు.అయినా,మేఘం తనదైన పెద్ద బుద్ధితో ప్రజల తాపాన్ని తీరుస్తుంది

***

-ఉపనిషత్ సూక్తి 

92. సో2హమర్కః పరంజ్యోతి రర్కజ్యోతి రహగం శివః||

(మహావాక్యోపనిషత్)

-పరంజ్యోతిస్సు అను ఆ జ్యోతిస్సే ఆదిత్య రూపములోనున్న నేను అగుచున్నాను.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 5.

That society is the greatest, where the highest truths become practical.

అత్యున్నత సత్యాలు, అభ్యాస యోగాలై ఆచరించే సమాజమే శ్రేష్ఠమైన సమాజం.

జాగృతి స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

ఇనుప కండరాలు, ఉక్కునరాలతో నిర్మితమైన శరీరం, వజ్రాయుధం లాంటి దుర్భేధ్యమైన సంకల్పాలనే నేను కోరేది.

విధేయత🧘‍♀️

  నేను పవిత్రమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను: నా ప్రేమ యొక్క సూర్యుని చూపు, నీ గురించి నా ఆలోచన యొక్క దిగ్మండలం క్రింద ఎప్పుడూ మునిగిపోదు. నీపై తప్ప మరెవరిపైనైనా ఉంచడానికి నా పైకెత్తిన కళ్ల దృష్టిని ఎప్పుడూ తగ్గించను. నిన్ను గుర్తు చేసే పనిని నేను ఎప్పుడూ చేయను.

శ్రీ పరమహంస యోగానంద, “నిత్యం నుండి గుసగుసలు”.

*ॐ卐సుభాషితమ్ॐ

శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం

27) గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్|

నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తమ్ ||

భగవద్గీత - విష్ణుసహస్రనామములను గానం చేయుము.ఎల్లప్పుడు విష్ణువుని ధ్యానించుము.మనస్సును సత్పురుష సాంగత్యమునందుంచుము.దీనజనులకు దానం చేయుము.

***

నాకు నచ్చిన  పాట 

సంగీత సాహిత్య సమలంకృతే

 సంగీత సాహిత్య సమలంకృతే


స్వర రాగ పదయోగ సమభూషితే

హే భారతి మనసాస్మరామి 

హే భారతి మనసాస్మరామి

శ్రీ భారతి శిరసా నమామి 

శ్రీ భారతి శిరసానమామి

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని

నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని

నాద నాదాంత పరివేశిని ఆత్మ సంభాషిణి

వ్యాస వాల్మీకి వాగ్దాయిని

వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సవుల్లాసిని


బ్రహ్మ రసనాగ్ర సంచారిణి

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి


భవ్య భలకారిణి

నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి

భవ్య భలకారిణి

నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి

సకల సుకళా సమున్వేషిణి

సకల సుకళా సమున్వేషిణి సర్వ రస భావ సందీపిణి

***



No comments:

Post a Comment