*ఉపనిషత్ సూక్తి *పద్యాలు *మాతృసేవ *[దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు..? *శ్రీ అన్నమాచార్య సంకీర్తన* భాగవతం
100-ఉపనిషత్ సూక్తి
100. సర్వేషాం బీజానాం హయగ్రీవైకాక్షరబీజమనుత్తమం మంత్రరాజాత్మకం భవతి||
(హయగ్రీవోపనిషత్)
- అన్ని బీజాక్షరములలోను హయగ్రీవైకాక్షర(బీజాక్షర)ము అనుత్తమమైనది.(సర్వోత్తమమైనది). ఈ హయగ్రీవ బీజాక్షరము మంత్ర రాజాత్మకము.
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 13.
కృతజ్ఞత, అతిధిసత్కారం భారతీయుల ప్రత్యేక లక్షణాలని మనం గుర్తించాలి.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
ప్రజల ఆలోచనావిధానం, కార్యనిర్వహణల్లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులు, వాటిలో పరిణితి సాధించే మార్గాలను వారికి తెలియజెప్పాలి.
విచక్షణ
మోహం మనుషుల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది. మనం కోరుకునే వస్తువు చుట్టూ అది ఊహాకల్పితమైన అందమైన ఆకర్షణ ఏర్పరుస్తుంది.
శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి / ఒక యోగి ఆత్మ కథ లో
ॐ卐సుభాషితమ్ॐ
గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం
ॐॐॐॐॐॐॐॐॐ
4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః | సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనస్చేన్న లగ్నం గురోరఙ్ఘ్రిపద్మే | తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ||
అర్ధము:- విదేశాలలో ఎంతో గొప్పవానిగా, స్వదేశములో ఎంతో ధనవంతునిగా కీర్తింపబడుతున్నప్పటికీ, సంఘంలో ఎంతో సదాచార సంపన్నునిగా గుర్తింపు వున్నప్పటికీ, గురుని పాదపద్మములపై మనస్సు లగ్నం కాకపోతే, వీటివలన ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
ధరణిలో పరమాత్ముని ప్రతిరూపంగా జన్మించిన ప్రతిజీవికి, మనుగడకోసం అవసరమయ్యే శక్తిసామర్ధ్యాలను, తగిన జ్ఞానాన్ని ఆ పరమాత్మ ప్రసాదించేడు.
జీవులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నుడిగా, తన సంపూర్ణ ప్రతిరూపంగా, పూర్తి మేధస్సుతో మానవుణ్ణి సృష్టించేడు పరమాత్మ. తనలాగే మానవుడు కూడా ఈ సృష్టిని, అందున్న ప్రతి జడజీవాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, ఈ సృష్టి నిర్వాహణలో తనకు ఎంతో చేదోడువాదోడుగా వుంటాడని భావించేడు పరమాత్మ.
మానవుడు కూడా తన అపరిమిత జ్ఞానంతో కొన్ని ప్రత్యేక శక్తులను తన స్వంతం చేసుకొని, సృష్టిలో వున్న అన్ని జడజీవాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, అపర పరమాత్మగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మిగతా జీవాలతో పోలిస్తే, మానవుడు అన్ని రంగాలలో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తూ అభివృద్ధి చెందుతున్నాడు.
కానీ మానవుడు మాయకులోబడి అహంకారవశుడై తన నిజస్వరూపాన్ని విస్మరిస్తున్నాడు. తనలో వున్న ఇంద్రియాలు, మనస్సు ఈ మాయకు దోహదపడుతున్నాయి. వీటికి లోబడి, అమోఘమైన ప్రజ్ఞ వున్నప్పటికీ ఆనందంగా, ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు.
ఈ మాయ నుండి బయటపడే మార్గాన్ని “గురువు” మాత్రమే చూపగలడు! అతడు మాత్రమే జీవిత పరమార్ధాన్ని తెలియజెయ్యగలడు!
అటువంటి సద్గురుని పాదపద్మములను ఆశ్రయించని జీవితము నిజంగా వ్యర్ధమే మరి!
***
*పద్యాలు
అమ్మను కలిసి దీవెనలు నే ఆది నుంచి
హృదయ తృప్తి పరచు తల్లి హాయిగుంచె
మమత మానవతా మది మాకు పంచి
మాతొ ఉండి మమ్మును జూసె మాతృ దేవి
వందనం అభివందనం
దూరు తావులే తలపులే దురద పెంచి
పరిమళమ్ముగా ఉండియు పక్కసద్ది
మాట తెలిపియే మనసుకు మత్తు నుంచి
కవిత లల్లి కధలు తెల్పి కళలు జూపె
స్వర్గసీమ ఏది సమరభూమిగ మారె
ఒకరి నొకరు కలయు ఓర్పు లేక
వంత పలుక లేక వరుసమార్పులగుట
ఎవరికెవరు రారు ఏమనవలె
అవయవసౌష్టమేఅవధి ఆశయు పాశముగా ను ఉండుటన్
నవవిధివాంఛలే మనకు నారునుపోయుటపెంచుటేయగున్
అవనిని కోరుటే కళలు ఆలనపాలన సేవయేయగున్
ప్రవరుడు నవ్వరూథినిని పట్టి సుఖించె హిమాలయంబునన్
తలపులు నీవి కాలమున తాపపుబుద్ధి యు మాకు ఏలనున్
మలుపులు ఎన్ని సేవలు లె మానస బుధ్ధి యు ఏల మాకునున్
వలపులు పుట్టి వాదనలె వేకువ మత్తున ఉంచు టేలనున్
కొలుపులు గొల్చు వారాలకు గోర్కల దీర్చవె శ్రీ యశస్వి నీ
పువ్వు పువ్వు గా గుర్తించు పుడమి నందు
పువ్వు లో ప్రేమ యే స్వేచ్ఛ ప్రతిమ యగు టె
పువ్వు నువ్వు పూజలకు నే పుణ్యముకునె
నవ్వులు అనకు నటనేల నయన పువ్వు
ఆ పరాత్పరుడుయె ఆనంద నిలమందు
భాస్కరకళ తోను భక్తి పెంచె
నిత్య శోభ శుభము నెంతయు పంచుటే
ఆలమేలుమంగ ఆలి గుండె
--(())--
Part _1రమణమహర్షి ౼ *మాతృసేవ:- 🙏🏻రచన::మాతృశ్రీ సీతాలక్ష్మి అమ్మగారు.జూటూరి
మన భారతదేశం కర్మభూమి. ధర్మం లోపించి అధర్మం పెరిగినప్పుడు తాను అవతరించి ధర్మాన్ని నిలబెడతానని గీతాచార్యుడు అన్నారు. ఎందరో మహాత్ములు యోగులు, అవతార పురుషులు, గొప్ప సాధుపుంగవులు అవతరించిన మనదేశం పుణ్యభూమి. అలా వచ్చిన వారే యోగులలో అగ్రగణ్యులు అయిన భగవాన్ రమణమహర్షి. జ్ఞాన,సిద్ధులు కలసిన అద్వైతమూర్తి వారు. వారి పుట్టుకతో భారతావని పులకించింది. తమిళ నాడు లో,మధుర దగ్గరలో వున్న తిరుచ్చళి గ్రామంలో 1878 లో డిసెంబర్ లో జన్మించారు. అసలు పేరు వెంకట్రామన్. తెలుగు లో మంచి పండితులైన వారి బంధువు వీరిని ముద్దుగా రమణ, రమణి అని పిలిచేవారు. ఒకరోజు స్కూల్ కు వెళ్తుండగా వీరి బంధువు ఒకరు ఎదురుకాగా, వెంకట్రామన్ వీరిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు. అరుణాచలం నుండి అనగా, ఆ పేరు వినగానే తెలియని దివ్యావేశం కలిగింది. అది ఎక్కడుంది? అని అడిగారు. తిరువణ్ణామలైని అరుణాచలం అంటారు. చిన్నతనంలో " పెరియ పురాణం", చదివారు. ఆ భక్తశిరోమణులకు భగవంతునిపై గల ప్రేమ,భక్తి రమణులను ఆశ్చర్యం కలిగించేది. అన్నగారి మందలింపు ఈశ్వరుని పిలుపుగా తోచి వెంటనే అరుణాచలం బయలుదేరారు. (సశేషం)
***
*అమృతస్య పుత్రాః*
*🧘♂️శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 4🧘♀️*
భక్తుడు : స్వామీ! బ్రహ్మజ్ఞానం పొందాక విచక్షణ, విచారణలు మిగిలి ఉంటాయా?
శ్రీరామకృష్ణులు : భగవత్సాక్షాత్కారానంతరం, భగవత్ సంసర్గం పొందాక విచక్షణ, విచారణలు నశిస్తాయి. ఎంతకాలం మనిషి విచక్షణ, విచారణలు చేయగలడు? "నేను, నువ్వు' అనే భావన ఉన్నంతవరకు విచక్షణ, విచారణలు ఉంటాయి. ఏకత్వాన్ని యథార్థంగా గ్రహించిన వ్యక్తి అంతర్ముఖుడై, మౌనం పాటిస్తాడు. అందుకు ఉదాహరణ త్రైలింగస్వామి.
బ్రహ్మజ్ఞానం పొందగానే కామకాంచనాలపట్ల వ్యామోహము తొలగిపోతుంది. కొయ్యదుంగ మండే టప్పుడు చిటపటమనే శబ్దం వస్తుంది. మండటం పూర్తయిన తరువాత ఎలాంటి శబ్దమూ రాదు.
అనురక్తి నశించగానే ఆరాటమూ అదృశ్యమవుతుంది. గంగానదిని సమీపించేకొద్దీ చల్లదనాన్ని పొందినట్లు, భగవంతుడి సమీపానికి పోయేకొద్దీ శాంతిని పొందుతావు.
బ్రహ్మజ్ఞానం పొందాక కూడా కొందరు 'విద్యా నేను'ను,
'భక్తి నేను'ను కలిగి, మనస్సును దిగువ స్థితిలో నిలిపి ఉంచుతారు. నారదాది మహర్షుల విషయం ఇటువంటిదే. వారు 'భక్తి నేను'ను లోకోపదేశార్థం నిలుపుకొని ఉన్నారు. అదే ప్రయోజనానికై శంకరాచార్యులు విద్యా నేను'ను ఆశ్రయించి ఉన్నారు.
భగవల్లాభం పొందిన వారి కామక్రోధాలు నామ మాత్రాలే. అవి కాలిపోయిన తాడులాంటివి. అది ఆకృతిలో తాడులా కనిపించినా, ఉఫ్ అని ఊదగానే చెల్లాచెదరైపోతుంది.
దారానికి అతిచిన్న పోగు అంటిపెట్టుకొని ఉన్నా ఆ దారాన్ని సూది బెజ్జంలోకి ఎక్కించలేము. అలాగే, విషయాను రక్తి జాడమాత్రంగా ఉన్నా భగవత్సాక్షాత్కారం పొందలేము. మనస్సు విషయానురక్తి నుండి విముక్తం కాగానే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.
......
7. నేటి హాస్యం
"తల్లీ! మీ ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవడం లేదని మీ అత్తగారు ఒక్కటే పోరు పెడుతున్నారు"
"అమ్మా! ఆయన అడుగుజాడల్లో నడవాలంటే నేను కూడా రోజూ బార్‌కు, పేకాటకు వెళ్లాలి"
ఆ ...... ఆ......
--((*))--
.
జనక మహారాజు దశరధ మహారాజుకు సీతా రాముల వివాహము జరుపుటకు నిశ్చ ఇమ్చినామని లగ్న పత్రిక తెలియ పరుస్తూ దూత ద్వారా తెలియ పరిచాడు.
రామ నామం చేయండి
ఆస్వాదించండి
ఆస్వాదించి ఆనందించండి
ఆనందించి తరించండి
కన్యా దాత జనక మహారాజు దూతల ద్వారా దశరధునికి పంపే సందేశం
ఓ మహారాజ మీ రాజ్యము యోక్కయునగ్ని హోత్ర సహేతంగా అడిగే కుశలం
నా కుమార్తెను వీర్య శుల్కముగా ప్రకటించగా శ్రీ రాముడి పొందే విజయం
విశ్వామిత్ర వెంట వచ్చిన రాముడు నే పెట్టిన పరీక్షలొ పొందే విజయం
నా కుమార్తెను నీ కుమారునికి ఇచ్చి వివాహము చేయుటకు అనుమతికి ఆహ్వానం
నీకుమారునిఆనందం కోసం పురోహితాది సకలపరివారముతో వచ్చి జరిపించాలి శుభకార్యం
విశ్వామిత్రుని యనుజ్ఞ గైకొని, శతానందుని యనుజ్ఞ గైకొని మీ రాక కొరకు నిరీక్షన
వసిష్ఠ, వామ, దేవాది ఋషులు తో కలసి దశరధ మహారాజ చేయుదము కుశల సంభాషణం
సకల పరివారముతో ఒక క్రమ పద్ధతిలో చేరే మిదులా నగరం
దశరధ్ మహారాజు పరివారాన్ని చేర్చ విడిది గృహం
కౌసల్యా, సుమిత్ర, కైకెఇ కి రామున్ని చూసి కలిగే ఆనందం
వశిష్ట మహర్షి సంప్రదించి తేలి శుభ ముహూర్తం
ఓ జనక మహారాజా మీరు దానంచేయుమహాత్ములు మీ గౌరవమే మా గౌరవం
మేము ప్రతిగ్రహీతులమ్ దాతల హృదయం ఆనందింప చేయుటయే మా ధర్మం
కన్యాదాత మనస్సును కిమ్చుకైన భాధకల్గిమ్చక మగపెళ్లివారు ఉంటారుసహనం
దశరధ మహారాజు యొక్క మాటలు విని జనకమహారాజుకు కలిగే ఆశ్చర్యం
దానము లలో కెల్లా ఉత్తమ మైనది కన్య దానం
దాతకును ప్రతి గ్రహీతకును కల్గించును పుణ్యం
పురుషార్ధ సిద్ధిని కల్గిమ్చ్ వివాహము స్వధర్మం
కన్యా దానం వళ్ళ ఉభయులకు కల్గు శ్రేయస్కరం
ఎవరి కొరకు వేచి యుండనవసరం లేదు ఇది మా గృహం
మీ కు కావలసినవి తెలియ పరిస్తే క్షణంలో చేస్తాం
స్నానానికి సుగంధ పరిమళాళ తో ఉన్న జలం ఏర్పాటు చేస్తాం
సత్కరించి ఇష్టాన్న భోజనం ఏర్పాటు చేసి ఇచ్చే తామ్బూల0
ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…>
మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
_మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా.. అని మీరు అడగవచ్చు కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ? అన్నదే ఈనాటి మన ప్రశ్న >
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ… వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే > పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే…
No comments:
Post a Comment