Wednesday, 18 May 2022





నేటి కవిత-11 

105-ఉపనిషత్ సూక్తి 

105. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదమ్| తత్ర తత్ర పరంబ్రహ్మ సర్వత్ర సమవస్థితమ్||

(సౌభాగ్యలక్ష్ముపనిషత్)

- ఎక్కడెక్కడికి మనస్సు వెళ్ళునో, అక్కడక్కడ పరమ పదమున పరబ్రహ్మ సర్వత్ర ఉన్నాడు.

లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 18.

ఇతరుల ఆలోచనా విధానం, కార్యనిర్వహణల్లోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులు, వాటిలో పరిణతి సాధించే మార్గాలను వారికి తెలియజేయండి.

--
శ్రీ రామకృష్ణ బోధామృతము 
మాయ

తనను కనిపెట్టగానే దొంగ పారిపోయే రీతిలో మాయ తత్వాన్ని నువ్వు గ్రహించగానే మాయ నివర్తిస్తుంది.

విచక్షణ 

ఏ సమస్యను అదే పనిగా మనస్సుతో తలపోస్తూ ఉండకండి. అప్పుడప్పుడు దానికివిరామ మివ్వండి. దానంతట అదే పరిష్కారం కావచ్చు. అలాగని, మీ వివేకం నశించిపోయేటంత దీర్ఘకాలం మాత్రం విశ్రాంతి తీసుకుంటూ కూర్చోకండి. అంతకంటె ఈ విరామకాలాన్ని మీ అంతరాత్మలోని ప్రశాంత సీమల్లోకి లోతుకు చొచ్చుకు పోవడానికి వినియోగించండి.

శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం

గురు అష్టకము/అర్థ తాత్పర్య సహితం

ఫలశ్రుతి:--

గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ | యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |
లభేద్వాఞ్చితార్థం పదం బ్రహ్మసంఙ్ఞం | గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||

ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను ఎవరు సావధానులై వింటారో, ఎవరు గురువును శ్రద్ధతో సేవిస్తారో, వారు పవిత్రులైనా, సన్యాసులైన, రాజులైనా, సజ్జనులైనా, బ్రహ్మచారులైనా, ఎటువంటివారైనా సరే వారు కోరుకున్నవన్నీ వారికి లభించి తుదకు పరబ్రహ్మమును చేరుకుంటారు!!

“గురు అష్టకం” సర్వం సంపూర్ణం.
॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

65-కర్మ - జన్మ

 7 వ ఆధ్యాయం - "కర్మ క్షయం"  కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 7

రోగ చికిత్స:   మనిషి వ్యాధుల నివారణకి ఆయుర్వేద శాస్త్రం ఈ కింది మూడు రకాల చికిత్సలని సూచిస్తోంది. ఇవి వారి ప్రారబ్ద కర్మలని బట్టి ఫలితాలని ఇస్తాయి.

 మానవ చికిత్స:- ఆహార విహారాదులని, దోష రహితమైన ఔషధులని, ద్రవ్యాలని మెళకువగా వాడటం.

 రాక్షస చికిత్స:-  శస్త్రచికిత్స ద్వారా శరీర అవయవాలని కోయడం, తొలగించడం, పెట్టడం, ప్రాణులని చంపి వాటితో తయారు చేసిన మందులతో చికిత్స చేయడం.

 దైవిక చికిత్స:- మంత్రం, హోమం, హవనం, ఉపవాసం, శుభకర్మ, ప్రాయశ్చిత్తం, పరిహారం, తీర్ధాటన, గురువు లేక భగవంతుని ఆరాధన మొదలైన వాటి ద్వారా వ్యాధులని నిర్మూలించుకోవడం.

 ఏడుపు పరమ పావనం 

రాన్ అనే ఓ అమెరికన్ భక్తుడు కేరళ లోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి దాని ఆరంభ దినాల్లో న్యూయార్క్ నించి వెళ్ళినప్పుడు, అతను అమ్మని చూసినా లేదా మాట విన్నా విపరీతంగా ఏడ్చేవాడు. దాన్ని నిరోధించడం అతనికి సాధ్యం అయేది కాదు. ఇలా చాలా రోజులు గడిచాక ఓ రోజు రాన్ అమ్మని అడిగాడు.

 “నేనిక్కడికి వచ్చాక నాలో ఏదో మానసిక బలహీనత చోటు చేసుకుంది. లేకపోతే నేనెందుకు ఇలా ఏడుస్తున్నాను?” అమ్మ కరుణగా చూసి చిరునవ్వు నవ్వుతూ చెప్పింది.

మన హృదయాంతరాల్లో మనమంతా దేవుని బిడ్డలమే. కాని పెద్ద వాళ్ళమయ్యే కొద్దీ మనిషి దుష్కర్మల చేత నిర్మింపబడ్డ గట్టి పెంకుతో కప్పబడి పోతాడు.

కామం, క్రోధం, అసూయ, కపటం, అత్యాశ, గర్వం వంటి అనేక వ్యతిరేక వాసనలు ఆ పెంకుని తయారు చేస్తాయి. చివరికి మృదువైన బిడ్డ గట్టిగా రాయిలా తయారవుతాడు. 

 కాని,  దేవుడి సమక్షంలో లేదా ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో ఆ పెంకు కరిగి విరగడం ఆరంభమవుతుంది. అలా జరుగుతున్నప్పుడు మనిషి చిన్న పిల్లవాడిలా ఏడుస్తాడు.

అది ఎవరికైనా జరిగితే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అనేక జన్మల ఆధ్యాత్మిక సాధనల ద్వారా సాధించలేని పవిత్రత అలాంటి కొన్ని నిముషాల ఏడుపు ద్వారా సంపాదించవచ్చు.”

 ఐతే,  దేవుడి కోసం తప్ప లౌకిక కారణాల ఏడుపు గురించి కాదు ఇది.---
---
*అపార కరుణామూర్తి హనుమయ్య*

కలియుగంలో మానవుల ఆధ్యాత్మిక సమర్థత పూర్తిగా క్షీణిస్తుందని... 

వారు ధార్మిక కార్యాలు నిర్వహించడంలో అశక్తులని తెలిసిన వాడు ఈ భవిష్య బ్రహ్మ.

అందుచేతనే పరమ దయాళువైన ఈ రామదాసుడు కేవలం సంకీర్తనకు.. సూక్ష్మమైన స్మరణకు.. స్తోత్రానికి, తలంపునకు.. కూడా కరిగిపోతాడు. 

భక్తులు తనకు హోమాలు, యాగాలు, పూజలు, కల్యాణాలు, వ్రతాలు, క్రతువులు చేయాలని ఏమాత్రం ఎదురు చూడడు... రామ.. అనే రెండు అక్షరాలు మనసులో తలచుకుంటే చాలు అదే మహా పుణ్యకార్యమని మురిసిపోతాడు.. 

ఆ మాత్రం స్మరణకే మహాభక్తుడని పొంగిపోతాడు.. ఆ దాసానుదాసునికి మేలు చేయాలని సంకల్పిస్తాడు.... 

అపార కరుణతో అరక్షణంలో అక్కడ వాలిపోతాడు.

ఎక్కడ రాముడి కోసం ఎవరు తలచుకున్నా.. ఎక్కడ సీతారాములను కొలిచే, తలిచే ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అక్కడ మహా పరవశంతో...

ఆనందబాష్పాలతో కొలువుదీరుతాడు మన ఆంజనేయస్వామి. 

తన స్వామిని తలచిన వాడు ఎవడైనా సరే కష్టాలు పడకూడదనేది ఈ స్వామి వ్రతం. 

రామభక్తులను అనుగ్రహించుటే ఈ స్వామి నియమం. అందుకే రామనామాన్ని పట్టుకున్న ఎవరికైనా సంపూర్ణ రక్ష. నారాయణావతారుడైన పరిపూర్ణ బ్రహ్మం, శ్రీరామం. ఆ రామనారాయణుడు పరాన్ని అనుగ్రహిస్తే.. ఈ రామబంటు ఇహాన్ని దాటిస్తాడు. 

మహా సాగరాన్ని అవలీలగా దాటిన హనుమకు.. మనల్ని భవసాగరం దాటించడం ఓ లెక్కా...! 

నిరంతరం శ్రీరామనామాన్ని పట్టుకోండి.. ఆ హనుమ మన వెంటనే ఉంటాడు.

 సీతారాములను మనం తలచినంతకాలం మారుతి కరుణాకటాక్షాలు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాయి. ఒక్క రామ మంత్రమే కోటి మంత్రాల పెట్టు... 

ఒక్క హనుమదనుగ్రహం ముక్కోటి దేవతల కటాక్షానికి సాటి. 

*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే*

🙏జై హనుమాన్ 🙏

***((())***

ప్రాంజలి ప్రభలు 

*స్వర్గపర్యంతము విఖ్యాతములైన తమ యుత్తమగుణములను, కీర్తిని జూచి సజ్జనులు స్తుతి చేయునంతటి పవిత్రస్థితిని బొందవలెను. అట్టి పుణ్యాత్ములు మృత్యువు నుండి రక్షింపబడుదురు.  కాని భోగాసక్తు లట్లెన్నటికిని కారు.  

*ఎవనియొక్క చంద్రునివలె స్వచ్చమైన కీర్తిని ఆకాశమువలె సర్వదేశకాలము లందును వ్యాపించినట్టి గీతములచే సుందరసిద్ధస్త్రీలు గానము చేయుదురో వారే జీవించియున్న వారు; తక్కినవారు మరణించినవారే యగుదురు. 

*గొప్ప పురుషప్రయత్నము నాశ్రయించి పరమార్థ ఉద్యమమును జేబట్టి శాస్త్రానుసారము నిర్భయముగ నిశ్చింతతో సాధనల నాచరించినచో ఎవడు మోక్షసిద్ధిని బొందకుండును?! {తప్పక పొందును).

*మహానుభావుల దగ్గరికి, దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు  ఒక స్థిర నిర్ణయాన్ని కలిగి, లక్ష్యసిధ్ధి కల్గి ఉండాలి. అది నీ జీవితములో సువర్ణావకాశముగా భావించి , జ్ఞాన మార్గము లక్ష్యముగా వెళ్ళాలి.

*.  మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది.  

*ఇక్షోరాగ్రాత్ క్రమశః పర్వణి  పర్వణి యథారసవిశేష: ౹

 తద్వత్సజ్జన మైత్రీ విపరీతానాం చ విపరీతా౹౹

చెరుకుగడ కణుపుకణుపులోని రసాన్ని ఎలా చివరనుంచి రుచిని ఇస్తుందో అలాగే,సజ్జనుల   స్నేహం దినదిన ప్రవర్ధమానంగా మధురంగా ఉంటుంది.అయితే,దుష్టుల స్నేహం అలాగే రోజురోజుకూ అంతమవుతు వస్తుంది.

-----
అమృతస్య పుత్రాః -శ్రీ రామకృష్ణ భక్తి సూత్రాలు - 9

ఏ కాస్తయినా కోరిక అనేది ఉన్నట్లయితే భగవంతుణ్ణి పొందలేము. సూదిలోనికి దారు ఎక్కించేటప్పుడు దారంలోని ఒక నూలు పోగు విడివడి ఉన్నా సరే దానిని ( దారాన్ని ) సూది (బెజ్జం ) లోనికి ఎక్కించలేము. 

కొందరు | 30 ఏళ్లపాటు జపం చేస్తుంటారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం ? కుళ్లిపోతున్న పుండు మామూలు మందులతో మానదు. దానికి పిడకలు కాల్చి వాతలు పెట్టాల్సి ఉంటుంది. కోరికలున్నట్లైతే సాధనలెన్ని చేసినా యోగం సిద్ధించదు. కాని ఒక్క విషయం మాత్రం నిజం. భగవత్ కృప గలిగినట్లైతే, ఆయన అనుగ్రహించి నట్లైతే ఒక్క క్షణంలోనే యోగం సిద్ధిస్తుంది. వెయ్యేళ్లుగా చీకటితో నిండిన గదిలోనికి ఎవరైనా దీపాన్ని తెస్తే ఆ గది ఒక్క క్షణంలో ప్రకాశవంత మవుతుంది గదా అలాంటిదే ఇదీను.

నిరుపేద బాలుడొకడు ఒక పెద్ద ధనవంతుని దృష్టిలో పడ్డాడు. ఆయన ( ధనవంతుడు ) వానికి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. వెంటనే ఆ నిరుపేద బాలునికి ఇల్లూ వాకిలీ, పొలం పుట్టా, బండ్లు వాహనాలు అన్నీ చేకూరాయి. భగవత్ కృప అట్టిదే. 

భక్తుడు - మహాశయా! భగవత్ కృప ఎలా లభిస్తుంది ? 

శ్రీ రామకృష్ణులు : భగవంతుడిది బాలక స్వభావం. పిల్లవాడొకడు జేబులో రత్నాలు పెట్టికొని ఇంటి 
గడప మీద కూర్చొని ఉన్నాడనుకుందాం. దారిలో ఎంతోమంది వస్తూపోతూంటారు.వారిలోచాలామంది ఆ బాలుణ్ణి రత్నాలివ్వమని అడుగుతారు. కాని ఆ పిల్లవాడు ముఖం ప్రక్కకు తిప్పుకొని ఊహూ, నేనివ్వనంటే ఇవ్వను అంటాడు.

అయితే కాసేపటి తరువాత ఒక వ్యక్తి ఆ దారిన వెళ్లుతున్నాడు. అతడు పిల్లవానిని రత్నాలు కావాలి అని కూడా అడుగడు. అయినా సరే ఆ బాలుడు పరుగు పరుగున అతని వద్ద కెళ్లి రత్నాలన్నిటిని ఆ వ్యక్తి చేతిలో పెడుతాడు. త్యాగం లేకుండా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోలేం. 
--
*#నైతిక_విలువలు 

" సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.."

" ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రితో రెండు నిమిషాలు మాట్లాడారు.."

" ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి " మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి " అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశ్చర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి.."

" సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ? నసిగాడు కార్యదర్శి "

వాజపేయి ఒక్క క్షణం అతని వంక చూసి నవ్వుతూ
" నిక్షేపంగా " అన్నారు..

" ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది..రాజీవ్గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు..సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు..కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయిని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు ..

కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా..అదీ ఆయన మాటల్లోనే..

1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది..డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు..ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు..ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు..కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ
 " అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియాకి రండి "..అని చెప్పారు..ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే..నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే "..

పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు ..!
----
*శ్రీ అన్నమాచార్య సంకీర్తన

రేకు: 382-6--- సంపుటము: 4-481 --- రేకు రాగము: కన్నడగౌళ.

వట్టిజోలి యెంత లేదు వైరాగ్యమే సుఖము
నెట్టుకొని వివేకింప నేరవలెఁ గాని!!
॥పల్లవి॥

కట్టుకొంటే నెంతైనాఁ గలదు సంసారము
పట్టి చేసితేఁ గలవు పనులెన్నైనా
చుట్టుకొంటే నూరఁగల చుట్టరికముఁగలదు
అట్టె మోక్షము గడించే దరు దింతేకాని!!
॥వట్టి॥

చేసేనంటేఁ గలవు సేనా సేన పనులు
లాసి తగిలించు కొంటే లంపటా లంటు
ఆసలు పెంచ జూచితే నంత కంతకుఁ బెరుగు
వేసిరి శాంతిఁబొందుటే వేడు కింతేఁకాని!! 
॥వట్టి॥

పనిగొంటేఁ బెనుగొనుఁ బంచేంద్రియంబులు
వెనుకొంటేఁ జిమ్మిరేఁచు వేడుకలు
తనిసి శ్రీ వేంకటేశు దసానుదాసుఁడై
కొన కెక్కఁగ నాతనిఁ గొలువవలెఁగాని!! 
॥వట్టి॥

భావం :-

 ప్రయోజనం లేని సంబంధం కంటే వైరాగ్యమే ఎంతో సుఖము. ఉద్యమించి వివేకముతో ఈ విషయం నేర్చుకోవాల్సిందే. ఈ సంసారము వున్నది ఎంతకట్టుకొంటే అంత వుంటుంది.

 పూనుకొని పరులకు మేలు చేయాలనుకొంటే ఎన్ని పనులైనా గలవు. కల్పించుకొంటే వూళ్ళో యెన్నో చుట్టరికాలు కలుస్తాయి. కాని మోక్షం సంపాదించాలి అంటే మాత్రం బహు అరుదుగా సాధ్యం. చేయాలి అనుకొంటే పనులు అధికముగా కలవు. గట్టిగా అంటించుకొంటే ఎన్ని లంపటాలైనా అంటుకొంటాయి. ఆశలు యెంత పెంచుకుంటే అంత పెరుగుతాయి.

 వాటిపై విసుగు కలిగి ఎంత శాంతి పొందితే అంత సంతోషం కలుగుతుంది. ఆశక్తి కలిగితే మానవుని పంచేంద్రియములూ పెనవేసుకొని వెనకడుగువేస్తే ఆనందము తలకెక్కుతుంది. తృప్తితో శ్రీవేంకటేశ్వరుని దాసానుదాసులైతే అధికమగు స్థానము పొందుట తథ్యము అంటు అన్నమయ్య కీర్తించాడు

---

పాట సంఖ్య:-【276】

********

🌹........నేటి నా పాట.......🌹

**********

మహేష్ వూటుకూరి ,,✍️

9640713717.

దోర్నాల.

**********

పాట సందర్భంపై విశ్లేషణ:-

**********

 ఇష్టం ప్రేమగా మారి ప్రేమ ఇద్దరిని ఒకటిగా కలిపే సమయంలో    ప్రేమ పొంగులో భామ ఒడి చేరి

 ఇన్నాళ్ళ గుసగుసలకు చెక్ పెడుతు

 సరసాలకు పదును పెడుతు  ఒకరిపై ఒకరు మనసులోని

 భావాలను పాటగా పాడుతున్న  ఈ పాట.

**************

పల్లవి:-

***

ఈ  నవ్వుల జాబిల్లి నాదైయిందీవేళ

ఈ పువ్వుల చామంతి నాకై పూసిందీవేళ

 గువ్వలుగా మారి ఎగిరిపోదామంది

 రివ్వున ఎగిరే  పక్షులవోళే ముద్దాడుకుందామంది 

ఈ ముద్దబంతి ముద్దిస్థోంది పరువాల ఇంతి..


 సరి సరి అంటునే సరసాల సరదాలకు పదును పెట్టింది

 వరి కుప్పల్లో దూరి సిరిమువ్వల నవ్వులు విసిరింది

 నారికేళీ తోటలో నాంచారి లా సంచరిస్తు

 ఈ సుందరి కోరి కోరి నన్నే కోరింది..


 ఈ నవ్వుల జాబిల్లి నాదైయిందీ వేళ

 ఈ పువ్వుల చామంతి నాకై పూసిందీ వేళ.


 చరణం:- 1

****

పరిగెత్తే కాలంతో  సై అంటుంది

ఉరికెత్తే ఉత్సాహాన్ని పందెం వేసి పడగొడుతుంది

ఎందులోనైనా తనదే గెలుపై  

ఎంతటోడైనా తలవంచేలా చేస్తుంది..


తల్వార్ లాంటి పిల్లరో

తేడాఒస్తే తలకాయే తీసేస్తుందిరో

క్యాన్వాయ్  వున్న  సి యమ్ అయినా

దిగి వచ్చి పలకరించే కేబబుల్ వున్న కతర్నాక్ లేడియైనా

 నా గుండె గూటిలో ఒదీగిపోయినా   వయ్యారాల మొలకరో...

 పల్లవి:-

****

ఆ నవ్వుల జాబిల్లి నాదైయిందీవేళ

ఈ పువ్వుల చామంతి నాకై పూసిందీవేళ.

చరణం:-2

***

అందాల కోనసీమలో  పూసిన 

అరుదైన పూష్పమే నీవులే

అనుబంధాల కలిమిలో 

 కురిసిన తొలకరి తొలి యవ్వనమా

 మేలిమిలా మిల మిలా మెరిసే

 పోతున్నావే


ఉయ్యూరు చెరకులా  బలే తియ్యగున్నావురా

కొవ్వూరు సబ్బులా  బలే  నురగొస్తున్నావే

 ఉయ్యాల జంపాలా ఊగేద్దాం ఊరంతా తిరిగేద్దాం

 సయ్యాట ఆడేద్దాం సంతోషంలో దూరేద్దాం

 పల్లవి:-

***

ఆ నవ్వుల జాబిల్లి నాదైయిందీవేళ

ఈ పువ్వుల చామంతి నాకై పూసిందీ వేళ.

*************


1 comment: