శుభకృత్ సందర్భముగా
--
ఉ ::సప్తతురంగవాహనుఁడు చండమయూఖుఁడు కాశ్యపేయుఁడున్
తప్తసువర్ణకాంతిఁగలతాపసపూజ్యుఁడుపూషదేవుఁడున్
సుప్తజగమ్ముబద్ధమగు శోభలనిచ్చెడిరీతిదాతయున్
ప్రాప్తసుమంత్రపాఠములభావితకాంక్షలనిచ్చి బ్రోవుతన్ !!! "
" చం::శుభకర ! శబ్దదాతవె ! సుశోభిత ! మంగళకారి ! శ్రీధరా !
శుభము లఁగోరె దన్ నమ కసూక్త సమంత్ర జలాభి షేచనా !
ఇభముఖషణ్ముఖాదిసురసేవిత మన్మథదర్పదూర ..హే
ఇభవసనాంచితా ! ధవళదేహ !నమస్సులివే..పరాత్పరా !!! "
*
ఉ :: పన్నుగ పోటుయే మనసు మాటున కష్టము వచ్చిచేరుటన్
మన్నున ఆ ధిపత్యముయె మానస రోగము మంత్రిగుండుటన్
మౌనము గుంటు మోసముయె మెప్పుకు దానము బీదవారికిన్
మాన్యులు లీలలే యగుట మాదక ద్రవ్యము పెంచిపోషణే
****
ఉ ::ఉన్నత బావమే బ్రతుకు ఊసరి వెల్లిల జీవమెందుకున్
చిన్మయ లక్ష్యమే మనకు చేతల శిక్షణ స్వీయమార్గమున్
తన్మయ తిప్పలే వలదు తానుగ చేసిన ఒప్పుతప్పుగన్
పన్నగ నాలుకే వలదు పామర బుద్ధిగ మేలుచేయుటన్
*****
0
No comments:
Post a Comment