*🌹. ఉగాది విశిష్టత - చరిత్ర🌹*
*🍀. 'శుభకృత్' ఉగాది శుభాకాంక్షలు - ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ 🍀*
*ఉగాదిలో 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందింది.*
*ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ప్లవ నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత్' నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.*
*🍀. ఉగాది విశిష్టత - చరిత్ర 🍀*
*చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.*
*శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.*
*🍀. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత.. 🍀*
*ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.*
*🌻. బెల్లం - తీపి - ఆనందానికి ప్రతీక*
*🌻. ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం*
*🌻. వేప పువ్వు - చేదు- బాధకలిగించే అనుభవాలు*
🌻. చింతపండు - పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన *పరిస్థితులు*
*🌻. పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు*
*🌻. కారం - సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు*
ప్రాంజలి ప్రభ
(1) విడిచిపెట్టటానికీ వీలులేనిది - పట్టుకొనటానికీ వీలులేనిది ఆత్మ*. మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం - అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం? ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను; ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను - చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.
అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను - పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా? నన్ను నేనే పట్టుకోవటం ఎలా? నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా - నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం? కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు - విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది -
*(2) మనోవాచాం అగోచరం* :- మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో - ఒక వ్యక్తియో - ఒక విషయమో - ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు - వ్యక్తీ కాదు - విషయమూ కాదు - భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి - మనస్సు ఆలోచించగలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే - అసలు విషయమే కాదుగదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియలేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా? కాదే. అది తెలిసిన దానికి - తెలియని దానికి వేరైనది గదా - కనుకనే మనస్సుకు అందదు. అగోచరం.
మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్దశక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం? కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలకన్నింటికి అగోచరమే.
ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః ------" అని. కళ్ళు - వాక్కు - మనస్సు అక్కడకు పోలేవు అని. - ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి? మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా? - చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.
*(3) అప్రమేయం* :- సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి - కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.
ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ! ఇంతేగదా! అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని - అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా? రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను. మరి కొలవగలరా? సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.
*(4) ఆద్యంత రహితం* :- పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ - అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.
*(5) మహ* :- తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు.
*(6) అహం పూర్ణం బ్రహ్మ* :- అట్టి పరిపూర్ణ బ్రహ్మమును - పరమాత్మను - శుద్ధ చైతన్యాన్ని నేనే - నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన - అంతే.
--(()/--
కమ్మని వాసనతో పాటు నోరూరించే తీపినిచ్చే బెల్లం ఆరోగ్యానికీ చాలా మంచిది. ఎందుకంటే పంచదారలో ఉన్నట్లు బెల్లంలో ఎక్కువగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఇందులో ఖనిజాలు అధికం. అందుకే దీన్ని మెడిసినల్ చక్కెర అంటారు. బెల్లంతో సాధా రణంగా వచ్చే చాలా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతు న్నప్పుడు గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి, రోజుకు మూడుసార్లు తీసు కుంటే ఉపశమనం ఉంటుంది. కొన్ని కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజూ రెండుపూటలా వారం పాటు తీసుకున్నా... లేదంటే గ్లాసు పాలల్లో బెల్లం వేసి, రోజు తాగినా స్త్రీలకు నెలసరి సమస్యలు రావు.
--(())--
*(3) కేవల అఖండ చిన్మాత్రమ్* :- ఆత్మ - చిత్ - జ్ఞాన స్వరూపం. ప్రజ్ఞాన ఘనం. ఇక్కడి బుద్ధిలోని తెలివి ఒక వస్తువును గురించి తెలుసుకోనూవచ్చు. తెలుసుకోలేక పోనూ వచ్చు. కాని ఆత్మలో ఉండే తెలివి అలా కాదు. తెలుసుకోవటానికి - తెలుసుకోలేక పోవటానికి వేరైనది. తెలుసుకొనుటకు వేరే వస్తువులేమీ అందులో లేవు. కనుక అది జ్ఞానానికి - అజ్ఞానానికి అతీతమైనది. అది తెలిసిన దానికన్నా వేరైనది. తెలియని దానికన్నా అధికమైనది - పైగా అది అఖండం. ఆ జ్ఞానాన్ని విభాగం చేసే వీలులేదు. కనుకనే అది కేవల అఖండ చిత్ స్వరూపం.
*(4) నిర్వికల్పకం* :- ఎటువంటి ఆలోచనలు, సంశయాలు, సంకల్పాలు, వికల్పాలు లేనిది ఆ పరమాత్మతత్త్వం. ఉన్నదొక్కటే గనుక - రెండవదేదీ లేదు గనుక - దేనిని గురించి ఆలోచిస్తుంది? కనుక ఆలోచనలు లేవు. అలాగే దానికి ఏ కొరతలు లేవు - ఏ కోరికలు లేవు కనుక సంకల్ప వికల్పాలతో పనిలేదు. అందుకే అది నిర్వికల్పకం.
*(5) పరంతత్వం బుధః విదుః* :- అట్టి ఈ పరతత్త్వాన్ని ఎవరు తెలుసుకో గలుగుతారు? బుధః = విజ్ఞులు - వివేకం గలవారు. విజ్ఞులు అంటే జ్ఞానులు. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం. ఎవరిలో ఆత్మానాత్మ వివేకజ్ఞానం ఉంటుందో - దానితో వారికి ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం ఉంటుంది. అట్టివారే శమదమాదులతో - తితిక్షతో - శ్రద్ధతో - చిత్త ఏకాగ్రతతో సాధన చేసి స్వస్వరూపంలో నిలువగలుగుతారు. తనలో ఉన్న చిదంశను తానుగా గుర్తించగలుగుతారు. నేను ఈ నేను (క్షేత్రం) కాదు - ఈ నేనుకు వెనుకనున్న నిజమైన నేనును (ఆత్మను) అని తెలుసుకోగలుగుతారు. అట్టి కేవల చిత్ గా - చైతన్యంగా ఉండిపోతారు.
- ఇంకా ఆత్మ ఎట్టిదో -
******
"
నాకు ఇప్పుడు 73 ఏళ్లు. చిన్నప్పుడు చందమామ కధలన్నీ చదివాను. బాలమిత్ర కూడా. అయితే చందమామ ముందు మిగిలినవన్నీ తేలిపోయేవి.లైబ్రరీలో సంవత్సర సంచికలన్నీ ఒకటిగా బైండ్ చేసిపెట్టేవారు.వేసవిలో పిల్లలు ఎండలో బయటకు వెళ్లకుండా ఓక పుస్తకం ఇచ్చేవారు.నాపిల్లలకు నేను ఇంగ్లీషు,హిందీ చందమామ పుస్తకాలు తెప్పించేవాడిని.
ReplyDelete