వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేనచ !
వకార పంచభిర్యుక్తః నరః సంయాతి గౌరవం.!! ....... 56
అనగా మేలైన వస్త్రములు ,స్నానముచే నిర్మలమైన శరీరము , మృధు మధురమైన వాక్కు ,మంచి విద్య, దానికి తగిన వినయము ఇవియున్న వానికే గౌరవము లభించును.ఇవి లేని వాడు ఇంద్రుడైనను వానికి గౌరవము ఉండదు....
శ్లో === భార్యా వియోగాశ్చ జనాపవాదో ఋణ స్య శేషః కుజనస్య సేవా
దారిద్ర్యకాలే ప్రియదర్శనం చ వినాగ్ని నాప జ్చ దాహంతి కాయ [చిత్త]మ్ ...... 57
భావము === భార్యావియోగము, లోకుల నిందింప బడుట, ఋణ శేషము, నీచులను
సేవించుట, తనకు లేనప్పుడు తన వద్దకు వచ్చి పరామర్శించు వారు, ఈ ఐదుగురు ను నిప్పుతో పనిలేకయే దాహిమ్తురు. అనగా వీరు అవమాన భారముతో నశిమ్తురని భావము.
శ్లో|| దానపాత్రమతిక్రమ్య యదపాత్రే ప్రదీయతే।
తద్దత్తం గామతిక్రమ్య గర్దభస్య గవాహ్నికమ్॥
తా|| "దానము పొందుటకు అర్హత, యోగ్యత కలవాడికి కాక అనర్హుడికి, అయోగ్యుడికి చేసిన దానము గోమాతను కాక గాడిదను సేవించినట్లు వ్యర్థం ఔతుంది."
నేటి అనారోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం పత్రికలోని వ్యాసములు కీర్తనలు శ్లోకాలు పద్యాలు కధలు - చావండి చదవమని చెప్పండి
*ప్రాంజలి ప్రభ సుభాషితాలు *గజల్ -- అంచయాన - (011). కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 *మనశ్శాంతి* బోధ , * శ్రీ సూర్య మండల స్తోత్రం *ఓం నమః శివాయ: *కర్మ - జన్మ (1), *శ్రీ అన్నమాచార్య సంకీర్తన --1 * మనమేం చేస్తున్నాం? *మహాభాగవతం
*ప్రాంజలి ప్రభ సుభాషితాలు
*కీటోసపి సుమనః సంగదా రోహతి సతాం శిరః ౹
అశ్మాపి యాతి దేవత్వం మహద్భి : సుప్రతిష్ట : ౹౹
పువ్వుల స్నేహవల్ల కీటకము కూడా సజ్జనుల శిరస్సు ఎక్కుతుంది।అలాగే,మహాత్ముల ప్రతిష్ఠించిన శిలకూడా దైవత్వాన్ని పొందుతుంది।
***
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం
1 కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః।
ఇతి పరిభావయ సర్వమసారమ్ విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్ ।।
నీవెవరు? నేనెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నాతల్లి ఎవరు? నాతండ్రి ఎవరు? స్వప్నమువలే కనబడు ఈ ప్రపంచమును విడిచి అంతా నిస్సారమే అని భావించుము।
****
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు
88। స్వయమేవకృతద్వారం రుద్రాక్షం స్యాది హోత్తమమ్।।
(రుద్రాక్షజాబాలోపనిషత్)
- స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ప్రశస్తమైనది (స్వయముగా రంధ్రమున్న రుద్రాక్ష ధరించుట శ్రేష్టము)।
*****
*గజల్ -- అంచయాన - (011)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ
హృదయమునకు ప్రీతి కలిగించు హృదయమే అంచయాన
పుణ్య కర్మలు చేయు వారి శిరమున అంచయాన
యోగ నిష్ఠుల ప్రస్థానములొ సహాయ సహకారం
నిర్మలత్వము ప్రసాదించు రూపము అంచయాన
చ్ఛిన్నాభిన్నమైన తత్త్వజ్ఞానము సహకారం
ఉండే సంశయములనే తిర్చేటి అంచయాన
దుష్ట శిక్షణ శిక్ష రక్షణ యందు సహకారం
కపాల మోక్షముకు అనుశ్రుతముగా అంచయాన
ఆఖరి దశలో శాంతి కల్పించే సహకారం
విచ్ఛిన్నమస్తక గ్రంధులు ఏకం అంచయాన
నిత్యమూ సందర్భము ననుసరించి సహకారం
సరైన పునర్జన్మను కలుగచేయు అంచయాన
జనులకు ఆత్మజ్ఞానము అందించే సహకారం
జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు అంచయాన
మంచి వారు ఎల్లప్పుడు పూజింప అంచయాన
పాద పంకజములు కలగి పవిత్రత అంచయాన
____(((())))____
* కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 🌴
1. శౌనక ఉవాచ
కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా
జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్
భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు.
****
ప్రతి ఒక్కరూ చదవతగ్గ కధలు బాగున్నాయి
ReplyDelete