Tuesday, 14 June 2022

    

👉 'నేను'లో నుండి పరమాత్మ (ఆత్మ) వచ్చాడు.,
👉 పరమాత్మ నుండి జగత్తు (ప్రకృతి) వచ్చింది.
👉 ఆత్మ, ప్రకృతి కలయిక వల్ల జీవుడు ఉద్భవించాడు.
👉 జీవుడు లో నుండి 'నేను' వచ్చాడు.

➡️ మొదటి నేను - అహం స్వరూపం.
➡️ రెండవ నేను - అహంకార రూపం.

ప్రకృతితో సహజీవనం గడుపు చుండి 
చూచు వాణ్ణీ చూ సియు ఓర్పు చూపు చుండి 
చూచు సాక్షికి సాక్షిగా బతుకు చుండి 
సర్వ సాక్షిగ  పరమాత్ముడు గమనించు  

చూచేవాణ్ణి చూడు; తాకే వాణ్ణి చూడు;  తలచే వాణ్ణి చూడు. ఆ చూచే వాడే సాక్షికి సాక్షి. సర్వ సాక్షి. అతడే పరమాత్ముడు.ఆధ్యాత్మికం దుఃఖాన్ని లేకుండా చేయదు.
నీవు సుఖాన్ని ఎంజాయ్ చేసినట్టు, దుఃఖాన్ని కూడా అలా ఎంజాయ్ చేయగలిగే శక్తిని ఇస్తుంది.

మనసు ఖాళీగ ఉంచితే ఔషదమ్ము 
ఉదరము యుఖాళి గాఉంచు ఔషదమ్ము 
లంఖణము ఉన్న మనిషికి  ఔషదమ్ము 
జీవరాశుల తో ఓర్పు  ఔషదమ్ము 

*15-06-2022 పుట్టిన రోజు సందర్భముగా శుభాకాంక్షలు పంపినందుకు మీకు మీకుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు 


పగలే వెన్నెల జగమే ఊయల అన్నట్లు మబ్బులు మారి చల్లదనం తో హృదయాన్ని పరశింప చేయు రోజు ఎందరో మహానుభవులు అభిమానము తెలుపుతూ (100 కు పైగా )  శుభాకాంక్షలు  అందచేసిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు,  కృతజ్ఞతలు, తీయని వెన్నెల రేయ్ హాయిని కలుగ చేసి ఆ భగవంతునికి , తల్లి తండ్రులకు మరియు స్నేహితులకు ఋణ పడియున్నాను ముఖ్య ముగా ప్రాంజలి ప్రభ గా ( 2012 నుండి గూగుల్ (బ్లాగ్స్ ) ఫెస్ బుక్లో పోస్టు చేస్తూ వచ్చాను )              

శివుడికి:-  అందరూ చేసేది బిల్వార్చన.  మనం చేసేది అక్షరార్చన.  అవి పత్రాలు.  ఇవి సూత్రాలు.

 అవి నలిగిపోతాయి.  ఇవి మిగిలిపోతాయి.

        ****

బండిని లాగే ఎద్దులకు, బండిలో ఉండే సరుకు తో సంబంధం లేనట్లు., అట్లాగే కవులు వ్రాసే కవిత్వం ముందుతరాలకు పాఠాలు అవుతాయి, మనస్సు శాంతికి కవిత్వం ఒక భాగం,  

 సంసారాన్ని లాక్కొస్తున్న మీకు,  సంసారంతో సంబంధమే లేదు.

****

బ్రతికున్నాడు అంటే -- వాడు చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి అని।

 మరణించాడు అంటే -- వాడు చేయాల్సిన పనులు పూర్తయిపోయినాయి అని। 

***

ఈ 'పనుల మూటలు'  వ్యక్తి యొక్క గత జన్మల కర్మ విశేషాలు కావు। ఈ మూటలు ఈశ్వర సంకల్పాలు।



           నేటి కవిత  --కొవ్వొత్తులు  

*అన్నం ముద్దకయి కక్కుర్తుపడి  శరీరాన్ని సవారికిచ్చే జవరాళ్ళు"!

* వెక్కిరింపుల పకపకల్ నాలికల్ జాచినట్లు    దిక్కు దిక్కుల వెలిగి ఘోషించు కొవ్వొత్తులు  

* బ్రతుకు ఆటలో కక్కుర్తుపడి   సుఖం కోసం వెంపర్లాడే మొగరాయిడ్లు 

* కాల నిర్ణయమని కక్కుర్తుపడి    బ్రతుకుకై ధనాన్ని దోచుకొనే వరాళ్ళు"!   

 * ఓ బోగం చానా ! నీవు కక్కుర్తుపడి   సంఘానికి ఓ పనికిరాని పేపరు వా “

*  ముసుగులేని నిజానివి కక్కుర్తుపడి   నీడ పడనటువంటి నిర్మల మనసువి  “!!

* గుప్పు గుప్పుమని ధూమం కు కక్కుర్తుపడి   మరో పని లేక మహోత్సాహంతో కొవ్వొత్తులు 

* తెలుగు దేశాన రాగాలతో కక్కుర్తిపడి    పూలు దెబ్బలుగా కన్నీటి వేడి చుక్కల కొవ్వొత్తులు  

* మళ్లీ నేనే గెలుస్తానని కక్కుర్తిపడి చెయ్యలేనివి చేస్తానని చెప్పి నమ్మ పలుకులు 

* డబ్బుకు కక్కుర్తిపడి  ఓట్లు వేసే జనులు ఉన్న ఎంతమాత్రమూ మార్పురాదు 

* కులాలు మతాలూ ఏకమై కక్కుర్తిపడి ప్రవర్తనలవల్ల లాభాలన్నా నష్టాలు ఎక్కువా    

  ---((()))--


నేడు స్పందన పద్యాలు ..14-+06--2022

🙏🙏🙏🙏🙏🙏🙏

న్యస్తాక్షరి........

బ్ర   హ్మాం డ ము పద్య పాదాదిన రావాలి

🛑🛑🛑🛑🛑🛑🛑🛑

*బ్రహ్మ శైలియే ను బ్రతుకు తేజస్సు బ్ర

హ్మాండ మంతయునులె హావ భావ

డమరుకం కదిలెను  డబడబడబ మోత

ముందు కొంత మనసు ముచ్చటగుటె


*..పౌర్ణమి దినమందు వర్ణకపిలతేజ

చైత్ర మాసమునందు శుద్ధ తిధిన!

మందార మంకెన మామిడి చిరు వర్ణ

తమళ పాకులతోడ తన్మయుడవు!

గంధాలు పసుపునుగధకు సింధూరము

మానసిక బలమిచ్చు మారుతీశ!

అప్పాలుగారెలు యరటిపండ్లువడలు

యందాల హనుమకు హారతివ్వ!


*అంజనీకేసిరిలయంద మంజరివిగ

ధరణి నందున వెలసిన శరణునీదు

శివునికరుణవుయరుణంబుచిత్రరూప

రామ లక్ష్మణసీతమ్మ రమ్య భక్తి


*దేనిని వదిలి తేజీవి దినము సుఖము

దేనిని గ్రహించిన తృప్తి దినము భయము

దేనిని జడ జీవన మయ్యె దినము శోభ

దేనికను సందియ మగుటే దిన నరకము


* ప్రకృతి హరిజన గిరిజన ప్రతిభ యగుటె

జీవ నా కృతి గుణము గా జీవి యగుటె

మలిన రహిత సంస్కృతి ఇది మనుగడే ను

స్వార్ధ మనునది లేనట్టి సాగు జీవి



* జడసంగేసపిన లిప్తాః శ్రీసద్భావేసేపినోత్తరలా: ౹

  అంబోజకోరకా ఇవ విజ్ఞా వికసంతి విష్వస్మై: ౹౹

తెలిసిన వాళ్ళు మూర్ఖుల సహవాసములో ఉన్నా వాళ్ళు ఎటువంటి మార్పుచెందరు.డబ్బువున్నా కొంచం కూడా చంచల స్వభావం లేకుండా సమాజం మంచికి శ్రమిస్తారు.తామర మొగ్గ దీనికి మంచి ఉదాహరణ.బురదలో ఉన్నా మురికిగా ఉండదు.కాంతి ఉన్నా మార్పు చెందదు.ఒక్క సూర్యుని కిరణాలతో మాత్రం వికసిస్తుంది.

___((()))__


శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 25వ శ్లోకం:-

వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్త్యౌషధం దైత్యేంద్రార్తిక రౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధంభక్తాత్యంతహి తౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణ దివ్యౌషధం!!

భావం:-

ఓ మనసా శ్రేయస్సును కలిగించు శ్రీకృష్ణ దివ్యౌషధమును సేవింపుము. ఆ ఔషధము మోహమును శమింపచేయును. మునుల మనోవృత్తులను ప్రవర్తింప చేయును. రాక్షసేంద్రులలకు బాధలను కలిగించును. మూడులోకములను మరణము నుండి కాపాడును. భక్తులకు అత్యంతము హితము చేకూర్చును. సంసార బంధమును బాపును.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 13.

సర్వారిష్టాలకు మూలకారణం ఈర్షే. దీన్ని జయించటం సామాన్య విషయం కాదు.

జాగృతి

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు

అనుభవం పెరిగే కొద్దీ 'పురుష ప్రయత్నం' లోనే సర్వం ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే నా నూతన సందేశం.

🧘‍♂️విస్తరణ🧘‍♀️ 

నా క్రింద, పైన, ఎడమవైపు, కుడివైపు, ముందు, వెనుక, నా లోపల, బయట కూడా అనంతత్వం వ్యాపించి ఉంది.

    కళ్లు తెరిచి వున్నప్పుడు, నన్ను నేను పరిమిత శరీరంగా చూస్తాను. కళ్ళు మూసుకున్నప్పుడు నేను విశ్వానికి కేంద్రంగాను, నా చుట్టూ అనంతకాల మండలమూ, ఆనంద మండలమూ , సర్వజ్ఞమూ సజీవమూనైన అంతరిక్షము పరిభ్రమిస్తున్నట్టు గమనిస్తాను.

శ్రీ పరమహంస యోగానంద / Metaphysical Meditations


 05- శ్రీ కపిలగీత

అధ్యాయము - 1

శ్లోకం 04:-

ఈ క్రింది శ్లోకం అజ్ఞానాన్ని వర్ణిస్తున్నది.

అథ మే దేవసమ్మోహ మపాక్రష్టుం త్వమర్హసి |

 యోఽవగ్రహోఽహం మమేతిత్యేతస్మిన్ యోజితస్త్వయా || 4 |

టీకా :-

అథ = ఇప్పుడు; మే = నాయొక్క; దేవ = ఓ భగవానుడా; సమ్మోహమ్ = భ్రాంతి; అపాక్రష్టుమ్ = నాశనము చేయుటకు; త్వమ్ అర్హసి = నీవు మాత్రమే తప్పక చేయసమర్థుడవు; యః అవగ్రహః = ఏ తాదాత్మ్యము వలన; అహమ్ మమ ఇతి = నేను, నాది మొదలైన; ఇతి ఏతస్మిన్ = దీనిలోవలె; యోజితః త్వయా = నీచే కల్పించబడిన.

భావం :-

ఓ భగవానుడా! దేహము మరియు జగత్తునందు “నేను” “నాది” అనే నాయొక్క అసత్య తాదాత్మ్యము నీచేతనే కల్పించబడినది. కావున నాయొక్క ఆ భ్రాంతిని నశింపజేయుటకు నీవే సమర్థుడవు.,

వివరణ :-

మాయ లేక భ్రాంతి అనబడే “నేను”, “నాది” అనే అసత్యమైన అభిప్రాయాల ఆధీనంలో జీవులన్నీ ఉన్నవి. వీటి వశంలో లేకుండా యీ శరీరంలో నివసించటమే మోక్షం. "అపరోక్షానుభూతి" ఈ విధంగా చెబుతున్నది. 

*ఆత్మా జ్ఞానమయో పుణ్యో దేహో మాంసమయోఽశుచిః |-

తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరమ్ ॥

ఆత్మజ్ఞానము పరిశుద్ధమైనది. శరీరం రక్తమాంసాదులతో కూడి మలినమైనది. అటువంటప్పుడు ఈ రెండింటిలో ఏకత్వాన్ని దర్శించటం కంటే అజ్ఞానమింకేదైనా ఉంటుందా? తార్కికంగా ఎవరైనా పై సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ మన మమకారాలు, వ్యామోహాలు మనలను వదలవు.

 కావున దేవహూతి భగవంతుని ఇలా ప్రార్థిస్తున్నది,”  “జోహి బాంధ్యో తోహి ఛోడో నీవే అన్నింటినీ సృష్టించువాడవు. ఈ బంధన కూడా నీ సృష్టే. కావున ఇందుండి నన్ను విడిపించగల సమర్థుడవు నీవే”.

దేవహూతి తన మాటలను ఇలా ముగిస్తున్నది.

15) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️

15) శ్లోకం:-

స్వామిన్కథం మమ భవార్ణవ లంఘనం స్యాత్-  ఆయాసలేశ రహితం వద తత్ర హేతుమ్ |

శృత్వా తు శిష్య వచనం రమణీయ మిత్థం  ప్రత్యుత్తరం గురు రదా త్కృత మందహాసః ॥ 15

టీకా

 స్వామిన్ = ఓ స్వామీ, మమ = నాకు, ఆయాస లేశ రహితం = కొంచెం కూడా కష్టం లేకుండా, భవ ఆర్ణవ లంఘనం = సంసార సముద్రాన్ని దాటడం, కథం స్యాత్ = ఎలా వీలవుతుందో, తత్ర హేతుం = ఆ పద్ధతిని, వద = బోధించండి, రమణీయం శిష్యవచనం = మనోహరమైన శిష్యుని వాక్కులని, శృత్వాతు = విని, కృత మందహాసః = చిరునవ్వు నవ్వి, గురుః = గురువు, ఇతం = ఈ ప్రకారంగా, ప్రత్యుత్తరం అదాత్ = జవాబిచ్చాడు.

భావం:-

"స్వామీ! నేను సునాయాసంగా సంసార సముద్రాన్ని తరించే మార్గం ఏది? ఆ పద్ధతిని నాకు చెప్పండి" రమణీయమైన శిష్యుని వాక్కులను విని మందహాసం చేసి గురుపు ఈ ప్రకారంగా జవాబిచ్చాడు.

వివరణ:-

సంసారంలో ఉంటూ బాధలన్నీ తీసేసుకోవడం సాధ్యం కాదని, ఆ సముద్రాన్ని దాటి వెళ్ళడమే అన్ని బాధలకి, భయాలకి మందు అని

గ్రహించాడు శిష్యుడు.

 అందుకే తేలికగా సంసారాన్ని దాటే మార్గం చెప్పమని కోరాడు. ఇదే ముముక్షుత్వం అంటే. మోక్షం పొందాలనే కోరిక పరమమైనది. నిజమైన వైరాగ్యం ఉంటేనే ఈ కోరిక జనిస్తుంది.

అందుచేత శిష్యుని వాక్కులు గురువుకి ఎంతో మధురంగా తోచాయి. ఇలా సూటిగా మోక్షం పొందడానికి అర్హులైన శిష్యులు అరుదుగా ఉంటారు. గురువు ఎంతో ఆనందంతో ఉపదేశానికి పూనుకుంటున్నాడు.

***

95) అష్టావక్ర గీత🧘‍♀️

అధ్యాయం - 9

నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము) 

శ్లోకం 03:-

 

अनित्यं सर्वमेवेदं तापत्रितयदूषितम् ।

असारं निन्दितं हेयमिति निश्चित्य शाम्यति ॥ ९-३ ॥

అనిత్యం సర్వమేవేదం తాపత్రితయదూషితం ।

అసారం నిందితం హేయమితి నిశ్చిత్య శామ్యతి ॥ 9-3 ॥

శ్లో|| అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితమ్ | 

అసారం నిందితం హేయం ఇతి నిశ్చిత్య శామ్యతి ||3.


 ఇదం= ఈ, సర్వం= సమస్త ప్రపంచము, అనిత్యం = అనిత్యమైనది, తాపత్రితయ దూషితం = తాపత్రయము చేత దూషితమైనది, అసారం = సారహీనమైనది, నిందితం = నిందితమైనది, హేయం = హేయమైనది, ఇతి = ఇట్లని, నిశ్చిత్య = నిశ్చయించి, శామ్యతి = శాంతిని పొందుచున్నాడు.

వివరణ:-

ఈ ప్రపంచం అనిత్యమని, మూడు విధములైన తాపంచే బాధింప బడేదనీ, సారహీనమని, దీనిని విడనాడితేనే శాంతి లభిస్తుందనీ తెలుసుకున్న జ్ఞాని నిత్యము సమచిత్తం కలిగి శాంతంగా ఉండగలడు.

తాత్పర్యం:-

చూస్తున్న గుడ్డివాడుగా, వింటున్నా చెవిటివాడుగా, బుద్ధిని సద్వినియోగం చెయ్యకుండా జీవితాన్ని మానవుడు వృథా చేస్తున్నాడని కిందటి శ్లోకంలో అష్టావక్రులు అన్నారు. విషయభోగాలను అభిలషించే జీవితం విషాదానికి లోనుకావడాన్ని చూస్తూ కూడా మనిషి విరక్తుడవడం లేదు. జ్ఞాని అయినవాడు ఈ ప్రపంచాన్ని ఎటువంటి దృష్టితో చూస్తాడో ఈ శ్లోకంలో చెపుతున్నారు మునీంద్రులు.

అజ్ఞాని, సమస్యలతో, సందేహాలతో, బాధలతో సతమతమవుతూ ఉంటాడు. జ్ఞాని సమత్వ బుద్ధి కలిగి శాంతంగా జీవించగలుగుతాడు. ఈ జీవితం అనిత్యమనీ, బాధామయమనీ మూడు విధములయిన తాపములచే దహింపబడుతూ ఉంటుందనీ తెలుసుకుని, మమకారామూ రాగబంధమూ లేకుండా సాక్షి మాత్రంగా వీక్షించగలుగుతాడు.

శరీరం మనస్సూ బుద్ధి వలన కలిగే బాధలను ఆధ్యాత్మికమనీ, బాహ్య ప్రపంచంనుండి సంక్రమించే కష్టాలను ఆధిభౌతికమనీ, ప్రకృతిపరంగా సంభవించే విఘాతాలను ఆధిదైవకమనీ అంటారు. ఈ మూడు రకాల తాపాలచే జీవి నిత్యమూ దహింపబడుతూ ఉంటాడు.

****

05- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️

5-సిద్ధభూమిక:-

పరిక్రమ మార్గాన్ని కనుక్కోటానికి చాలా కాలం క్రింద గోత్ ఛుంగ్ పా అనే లామా ప్రయత్నం మొదలు పెట్టాడు. కొంతదూరం వెళ్ళిన తర్వాత రెండు లోయ మార్గాలు వచ్చినవి. ఎటు వెళ్ళాలో తోచలేదు. ఇంతలో ఒక జడల బర్రె వచ్చింది. దాని ముఖం సింహం ముఖంలాగా ఉంది. తనను అనుసరించమని తలతిప్పుతూ అది సూచించింది. లామా దాని వెంట వెళ్ళాడు.

 అది ఒక గుహదగ్గరకు వెళ్ళి అందులోకి పోయింది. లామాలోపలికి వెళ్ళి చూస్తే దాని కాళ్ళ, కొమ్ముల గుర్తులు కనిపించినవి. ఆ గుహకు ఆయన దీరాఫుక్ అని పేరు పెట్టాడు. దీ అంటే జడలబర్రె, రా అంటే కొమ్ములు.ఫుక్ అంటే గుహ అని టిబెట్ భాషలో అర్థం. ఆ గుహలో అతడు 3సంవత్సరాల, 3 నెలలు, 3 రోజులు ధ్యానం చేస్తూ గడిపాడు. ఆ తరువాత పరిక్రమ మొదలుపెడితే ఒక నక్క కనిపించింది. దాని వెంట నడుస్తుంటే

నక్కల సంఖ్య 21కి పెరిగింది. అవన్నీ ఒక పెద్ద రాయి అడుగుకు వెళ్ళి మాయమైపోయినవి. ఆ గండశిలలో తారాదేవి సాక్షాత్కరించింది. ఆనాటి నుండి ఆ శిల పూజలందుకొంటున్నది.

నేను(శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి వారు )కైలాస మానస సరోవరయాత్ర చేసినప్పుడు మరుత్కుమారుడు, కౌశికుడు - అనే ఇద్దరు యోగులు కనిపించారు. వారు “నీవు, మేమిద్దరము మనం ముగ్గురము ఇక్కడి  క్రిందటి జన్మలో తారాదేవిని గురించి తీవ్ర సాధన చేశాము. ఆ దేవత సాక్షాత్కరించి అనుగ్రహించింది. కారణాంతరాల వల్ల నీవు శరీరాన్ని విడిచి మరోజన్మ తీసుకోవలసి వచ్చింది. నిన్ను చూడాలనిపించి మేమే సంకల్పించాము.

అందువల్ల నీకు రావాలనిపించి వచ్చావు. మనమైత్రీ చిహ్నంగా జగజ్జనని తారాదేవిని ఆవాహన చేస్తున్నాము” అన్నారు. దీర్ఘాన్నత దేహంతో మణిమకుటంతో సువర్ణాభరణాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ

దేవి సాక్షాత్కరించి ఆశీర్వదించింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రింద అయిదు రాత్రులు ధ్యానం చేస్తే కనిపించి అనుగ్రహించిన సన్నివేశం గుర్తుకు వచ్చింది. దీర్ఘకాల జీవులైన ఆ సిద్ధాశ్రమ యోగుల ఆత్మీయత ఎంతో సంతోషాన్ని కలిగించింది.

ఓంకారోదితశక్తి ప్రేరిత సిద్ధి వికాసాం

త్రీం కారాంతర కీలాదీపిత యోగవిలాసాం

మైత్రీ మంజుల హృదయధ్యానోత్తేజిత సారాం

గాయామ్యుజ్వలవీరాం తారాం మహిమాకారాం

అని తారాదేవిని స్తుతించాను. ఇద్దరు మిత్రులు సౌహార్దభావుకులై తారాదేవితో సహా అదృశ్యులైనారు

ఇక మరొక ముఖ్యమైన సంఘటన. కైలాసపర్వత పరిశ్రమకు మాతో వచ్చిన వారు చాలామంది వెళ్ళారు. నా వంటి వృద్ధులు, నడవలేనివారు ఆగిపోయినారు. ఒక రోజు గడచిన తర్వాత ఫోనులో బాధాకరమైన వార్త వచ్చింది. ప్రయాణీకులలో ఒక మహిళ త్రోవలో గుండెపోటు వచ్చి పడిపోయినది.

 మరణిస్తుందని అందరూ భయపడుతున్నారు. చేయగలిగిన ప్రాధమిక చికిత్స చేశారు. ఇక్కడ మా వసతి దగ్గర ఆ వార్త అందుకొన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ప్రాణరక్షణ చేయమని ప్రార్థించారు. క్లిష్ట సమయం. వెంటనే నా ఆదేశాన్ని అందుకొని ఒక షామియానా వేసి ఇటికెలతో తాత్కాలిక హోమకుండం నిర్మించి వస్తుసామగ్రి సమకూర్చి భైరవ హోమం ప్రారంభించాను. భైరవమంత్ర పురశ్చరణ చేసినవాళ్ళంతా ఆహుతులు వేస్తున్నారు. అందరి హృదయాలలో ఉద్విగ్నత! ఏమి కానున్నది ? రాత్రి సమయం. మంచుకురుస్తున్నది. గడ్డకట్టుకుపోయే శీతల వాతావరణం. అయినా ఒక వైపు ఆహుతులు వేస్తూ ఆపదలో ఆదుకొనే ఆ స్వామిని ప్రార్థించాను..

నమో భూతనాధం నమః ప్రేతనాధం

నమః కాలకాలం నమో రుండమాలం

నమః కాళికా ప్రేమలోలం కరాళం

నమో భైరవం కాశికా క్షేత్రపాలం

ఇంతలో అగ్నికుండంలో జ్వలిస్తున్న కాష్టద్యుతుల మధ్య భీషణ

సుందరమైన ఆకృతితో శ్వానరాజుతో భైరవుడు నిల్చున్నాడు.

సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు

         విమలదంష్ట్రా ప్రరోహములవాని

పవడంపుకొనలతో ప్రతివచ్చు ననవచ్చు

        కుటిలకోమల జటాచ్ఛటలవాని

ఇంద్రనీలములతో ఎనవచ్చు ననవచ్చు

       కమనీయతర దేహ కాంతి

ఉడురాజు రుచులతో ఒరవచ్చు ననవచ్చు

      చంచన్మదాట్టహాసములవాని


దర్శించి ప్రణామాలు సమర్పించాను.


సీ॥మందార మైరేయ మధుపానమత్తాయ

      భవ ! నమస్తే కాలభైరవాయ

కాళికాసురత శృంగార సంప్రీతాయ

     వర ! నమస్తే కాలభైరవాయ

డమరుఖట్వాంగ ఖడ్గ కపాల హస్తాయ

    భర్గా! నమః కాలభైరవాయ

అట్టహాసపలాయితాంతకాయ హరాయ

    వందనం తే కాలభైరవాయ


గీ|| భీషణశ్వానపరివార వేష్టితాయ

భూత బేతాళ గీతా సముత్తితాయ

వారణాసీ మహాక్షేత్ర పాలకాయ

భక్త సులభాయ తే నమో భైరవాయ

భైరవుడు అనుగ్రహించాడు. ఆయనతో వచ్చిన శ్వాసరాజు బయలుదేరాడు. హోమం పూర్తి అయింది. అక్కడ పరిక్రమ చేస్తూ పడిపోయిన మహిళ దగ్గరకు ఆ మంచుకొండలలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక పెద్ద నల్లని కుక్కవచ్చి వాసన చూచింది. ఆ వనిత కండ్లు తెరిచి నెమ్మదిగా లేచింది. పోతున్న ప్రాణం వెనక్కు వచ్చింది. అందరితో పాటు నడక మొదలైంది. పరిశ్రమ పూర్తియై కొండ దిగి అందరూ తిరుగు ప్రయాణం చేస్తున్నంతవరకు ఆ శునక రాజు అలానే నిల్చుని మళ్ళీ వెనక్కు

మంచుకొండలోకి వెళ్ళిపోయినాడు. భైరవుని కరుణ అద్భుతం !

సీ॥ కాశీ శ్మశానాన కాలభైరవునితో

             చరియించు నెవడు కింకరత మెరయ

భయదరూపముతోడ పదునుకోరలతోడ

            శ్రితవైరి నెవ్వాడు చీల్చి వేయు

కైలాసగిరి మీద కాపాడె నెవ్వాడు

            మహిళ నొక్కతె కృపామహిమ వెలయ

మృత్యుదేవత పలాయిత జేసె నెవ్వాడు

           సిద్ధేశు ప్రార్థన స్వీకరించి


గీ|| ఎవ్వ డలవోక గర్జించె హిమగిరీంద్ర

      దివ్యభూముల గుహలు ప్రతిధ్వనింప

      ప్రజ్వలన్నేత్ర వక్ష భౌభౌరవుండు

       ఆ మహాశ్వానరాజు నన్నోముగాక !


కాశీ రక్షకుడైన కాలభైరవుని వాహనం శునకమైతే హిమగిరిలో వజ్రభైరవుని వాహనం పులి. వజ్రభైరవుని ఆలయాలు మంచుకొండలలో అక్కడక్కడ ప్రకాశిస్తున్నవి.

****

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

🕉🌞🌎🌙🌟🚩


674) శ్లోకము :-


నిధే స్త్వత్తో హృత్వా భగవతి! న లజ్జే భువి  సృజన్ 

రసక్షోణీ ర్వా స్త్వదమలయశ స్సౌరభజుషః!

నృపోద్యానత్ సూనోత్కర మపహరన్ భక్తినటనం

వితన్వాన స్తస్మై ముహురుపహరం త్సేవక ఇవ!!  674 

భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! రాజు ఉద్యానవనమునుండి పుష్పములు దొంగిలించి 

భయము చేతనో  భక్తి నటించుచునో వాటినే రాజుకు మాటిమాటికి 

బహుమతిగా అందించు దొంగ సేవకుని వంటి వాడిని నేను.

సర్వ రస మధుర్యమైన వాజ్మయ నిధి అగు నీ నుండి, స్వచ్చమైన నీ కీర్తి సౌరభము వెదజల్లు పుష్పములనే  కావ్యముగా  సృజించి నీకే భక్తి నటించుచుసమర్పించుచున్నాను. అయిననూ నాకు సిగ్గు లేదు. అనగా ఈ కవిత్వమంతయు నీప్రసాదమే.


675) శ్లోకము :-


దధానా స్సంతోషం మనసి సుకవినా మతితరాం 

దధానాః ప్రత్యగ్రం విభుధసదసే భావ మలఘుమ్!

కులానా ముత్సాహం సపది విదధనా శ్శివవధూ 

పరాణాం శోభంతాం జగతి శిఖరిణ్యో గణపతేః !!  675

భావము:-


తల్లీ ! ఓ ఉమాదేవి! 

రస ఆస్వాదన అందు నిపుణులు,

ఈర్ష్య లేని మనస్సుకలవారు,

అగు మంచి కవుల అందు సంతోషాతిశయము 

కలిగించునవియు,



విద్వత్ పరిషత్తులకు 

అతిక్రొత్తదైన అభిప్రాయములు  ఎక్కువగా  కలిగించునవియు,

శివుని ఇల్లాలు ఉమాదేవి స్మరణే ప్రధానముగా కలవియు,

దేవి భక్తులకు ఉత్సాహము కలిగించునవియు, 

శిఖరీణీ వృత్త బద్ధమైన

ఈ  గణపతి  రచించిన స్తుతులు 

లోకమును ఉద్దరించు  కాక.


***

385) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

స్థితి ప్రకరణము  

రెండవ అధ్యాయము

దామ వ్యాళ కటోపాఖ్యానము

2-107

అసదభ్యుదితైర్భావైర్జలాన్తశ్చన్ద్రవచ్చలైః 

వఞ్చ్యతే బాల ఏవేహ న తత్త్వజ్ఞో భవాదృశః 

ఓ రామచంద్రా! నీటియందలి చంద్రబింబమువలె అసద్రూపములును, చంచలములునగు పదార్థములచే బాలుడే మోసగింపబడునుగాని నీవంటి తత్వజ్ఞుడు కాడు. 

2-108

య ఇమం గుణసంఘాతం భావయన్సుఖమీహతే ప్రమార్‌ష్టి స జడో జాడ్యం వహ్నిభావనయా స్వయా. 

ఎవడు శబ్దాది గుణములయొక్క సంఘాతమగు ఈ దేహాదులను “నేను, నాది” అని భావించుచు వానినుండి సుఖము నభిలషించునో, అట్టి జడుడు తన మనోరథముచే కల్పితమగు అగ్నిచే చలిని పోగొట్టుకొనువాడే యగును. 

(హృదయమందలి మనఃకల్పితమగు విశాలనగరము నశించినను లేక వృద్ధి నొందినను, ఏమి నశించుచున్నదో, ఏమి వృద్ధినొందుచున్నదో వచింపుము?!)

***

✍️। పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 24

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ।

। కుండ నిర్మాణాగ్ని కార్యాది విధి -1‌ 

నారదుడు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను। ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను। ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను। సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను। ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను। 

పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను। పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను। రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను। దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను। ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను। ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును।

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను। కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును। 7

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును। పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును। 9

సశేషం।।।।

****। ఓషో రోజువారీ ధ్యానాలు - 


 శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 379-2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 379-2 🌹

🌻। లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️। సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ।ప్రాంజలి ప్రభ 

మూల మంత్రము :

🍁। ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀  83। ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀

 379। ‘ఓడ్యాణ పీఠనిలయా' - 2 

సిద్ధాసనమున గాని, పద్మాసనమున గాని కూర్చుండి యోగము చేయువారు పొత్తి కడుపును తమలపాకువలె నుంచుకొని యుందురు। అటులున్నచో మూలాధార మందలి ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందుటకు స్వాధిష్ఠానమున మార్గము సుగమ మగును। స్వాధిష్ఠానము ద్వారా ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందినపుడే బ్రహ్మగ్రంథి విడును। అది రుద్ర గ్రంథి అని కొందరి అభిమతము। అట్లు వీడినచో జీవునకు దేహబంధ ముండక స్వేచ్ఛగ దేహము నందుండుట అనగ యేమో తెలియును।

శ్రీమాత కటి ప్రదేశము వున్నదో లేదో యన్నట్లుండును। ముప్పది ఐదవ నామమున శ్రీమాత మధ్య ప్రదేశమును నూగారు తీగతో పోల్చుట జరిగినది। అవిద్య యందు వసించు సర్వ జీవరాశికి దేహమే ఆధారము। అట్టి దేహము నుండి దేహాతీతములగు లోకములకు ప్రవేసించు మార్గము శ్రీమాతచే అధిష్ఠింపబడి యున్నది। అట్టి అధిష్ఠాన దేవతను 'ఓడ్యాణపీఠ నిలయా' అని కీర్తింతురు। యోగాభ్యాసము చేయువారు ఓడ్యాణ పీఠమును సరిచూసు కొనుట, శ్రీమాతను ఆరాధించుట ప్రధానమని తెలియవలెను।

సశేషం।।।

***

[5:21 am, 14/06/2022] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


708వ నామ మంత్రము


ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః


ఏ రకమైన ఉపాధులు లేనిది. అద్వైతమూర్తి. పరబ్రహ్మస్వరూపిణి. నిరాకారమైనది. చిన్నయస్వరూపిణి. జీవాత్మపరమాత్మలు ఒకటే యైనను అవిద్యతో భేదమున్నదిగా భావింపబడు మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి  సర్వోపాధి వినిర్ముక్తా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః యని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు ఆ తల్లికరుణచే అత్యంత స్వచ్ఛమైన మనస్సుగలిగినవారై కలియుగ జగన్నాటకంలో మాయల ఉచ్చులలో బడక, తాము కూడా ఒరులను మాయలబారిన పడనీయక, పరిపూర్ణమనస్కులై, ఆధ్యాత్మిక చింతనాపరులై, ధర్మార్థకామసంరక్షణమందు సక్రమవర్తనులై, మోక్షసాధకులై తరింతురు.


ఉప + అధి అనగా ఉపాధి, ఇక్కడ ఉపాధి అనగా కుటుంబంమీద మిక్కిలియాస గలవాడు.అనగా కుటుంబ చింతన గలవాడు. సూక్ష్మంగా చెప్పాలంటే తను, తన కుటుంబము, వారిపోషణ అనే ఆలోచనలు గలిగి యుండుట. ఈ కర్మలంపటములు జీవికేగాని, దేవికి కాదు. ఆమె వీటినుండి విడిచిపెట్టబడినది. ఇక్కడ జీవికి, దేవికి అభేదము ఈ విషయంలో గలదు. దీనికి ఉపనిషత్తులలో ఒక చిన్నకథ గలదు. రెండు పక్షులు ఒక కొమ్మమీద ఉన్నవి. రెండూ రూపంలో ఒకటే. జాతి కూడా ఒకటే. ఆ కొమ్మ మీది ఆ రెండు పక్షులలో ఒకటేమో కన్నీరు కార్చుచున్నది. ఆత్రంగా అటూ ఇటూ చూచుచున్నది.  అంటే ఆ పక్షి కర్మఫలాలను అనుభవిస్తున్నది. రెండవది ప్రశాంతంగా, మందహాసముతో నున్నట్లుగా, తనకు పట్టినవి ఏమీ లేనట్లుగా ఒక యోగిపుంగవునివలె కూర్చున్నది. ఈ రెండు పక్షులలో మొదటిది జీవాత్మ. కర్మబంధములకు లోనై ఉన్నది. రెండవది పరమాత్మ. అద్వైతంలో జీవాత్మ-పరమాత్మలు ఒకటేనని చెప్పాము. కాని ఈ జీవాత్మ-పరమాత్మలు అవిద్యచేత భేదం కలిగియుంటున్నవి. జీవాత్మలో అవిద్య తొలగిపోగానే పరమాత్మ స్వరూపాన్ని జీవాత్మ తెలిసికొంటుంది. అప్పుడు తనలోనున్న ఉపాధి (కర్మబంధం) తొలగిపోతుంది. పరబ్రహ్మలో లీనమైపోతుంది.


కాని పరమేశ్వరికి ఈ కర్మబంధములు (ఉపాధులు) లేవు. అందుచేతనే ఆ తల్లి సర్వోపాధివినిర్ముక్తా అని స్తుతింపబడినది.


ఆత్మకి గుణాలతో సంబంధం లేదు. నిరాకారమైనది. నిర్గుణమైనది. స్ఫటికమువలె స్వచ్ఛమైనది. కాని ఆ స్ఫటికముపై ప్రక్కనున్న వస్తువుల నీడ ప్రతిఫలించగా వివిధరంగులతో గోచరిస్తుంది. కాని పరమేశ్వరి (పరమాత్మ)  ఎటువంటి ప్రక్కనున్న భక్తుల బంధములు, కర్మబంధములు తన కంటక ఉండునట్టిది. అందుచేతనే ఆ తల్లి సర్వోపాధివినిర్ముక్తా యని స్తుతింపబడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః అని అనవలెను.

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

172వ నామ మంత్రము

ఓం నిస్సంశయాయై నమః

సంశయములు లేనిది, సంశయములను నాశనము చేయునది మరియు కోరికలు లేనట్టి  గురుస్వరూపిణియైన జగదీశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిస్సంశయా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం నిస్సంశయాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకుడు సంశయరహితుడై, జన్మకు కారణములు, పునర్జన్మ రహితమైన మోక్షసాధనకు తానేమి చేయవలెనో ఆ పరమేశ్వరి కరుణతో తెలిసికొని, ఆత్మానందానుభూతితో జీవించి తరించును.

 మానవ జన్మే సంశయాత్మకమైనది. ద్వైతమంటే ఏమిటి? అద్వైతమంటే ఏమిటి?  ఈ రెండిటిలో దేనిని అనుసరించాలి? జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్పే ద్వైతము ఎంతవరకూ అనుసరించదగినది, జీవుడు, దేవుడు ఒకటే అని చెప్పే అద్వైతము యొక్క నిర్వచనమేమిటి? అది అనుసరించినందువల్ల ఆత్మానందానుభూతి కలుగుతుందా? ఆత్మ, దేహము ఈ రెండూ ఒకటేనా? ఈ రెండూ కాని మనస్సే ఆత్మ అవుతుందా? ఇవి ఏమియు కాని బుద్ధికి, మనస్సుకు గల సంబంధం ఏమిటి? ఇవన్నీ సంశయాలే!

ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడు అని చెబుతారు. దేవలోకం ఉంది అంటారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలలో ఏది దేవలోకం? అసలు దేవతలను ఎవరైనా చూడడం జరిగిందా? 

ఇంక పరబ్రహ్మమంటే ఏమిటి? కర్మఫలం అనేది ఉందా? ఉంటే దానిని అనుభవింపజేసేవారు ఎవరు? దేవుడి గుడి, విగ్రహం, పుణ్యక్షేత్రం ఇవి ఏమిటి? దేవుడు సర్వాంతర్యామి అయితే, గుడికే ఎందుకు వెళ్ళాలి? , దేవుడిని విగ్రహంలోనే ఎందుకు వెదకాలి? పుణ్యక్షేత్రాలలోనే దేవుడు ఎందుకు ఉంటాడు?  ఇవన్నీ సంశయాలే మనకు. 

వీటికి సమాధానాలు వేదవేదాంగములందు, శాస్త్రములందు,  పురాణేతిహాసములందు తెలిసికోవచ్చు. అంతమాత్రమే కాదు. ఆ జగన్మాతను త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తే కూడా మానవునికి గల అనేక సంశయాలకు సమాధానం దొరుకుతుంది.

జగన్మాత సర్వ మంత్రస్వరూపిణి మరియు సర్వమంత్రాత్మిక. ఇంకను సర్వతంత్రాత్మిక.   జగన్మాత శ్రీవిద్యా స్వరూపిణి. కుండలినీ శక్తిగా షట్చక్రములలో ఉంటూ, బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులను ఛేదించుకుంటూ, సహస్రారంలో సుధాసాగరమందు పరమేశ్వరుని చేరి, అమృతధారలలో సాధకుని తన్మయుణ్ణిచేసి పరబ్రహ్మతత్త్వాన్ని అనుభవైకవేద్యంగా బోధించే గురుమండలరూపిణి గనుక నిస్సంశయా  యని నామ ప్రసిద్ధమైనది.  ఆ తల్లి సర్వ మంత్రస్వరూపిణి, సర్వతంత్రరూపిణి, మహాయో

గేశ్వరేశ్వరి గనుక నిస్సంశయా అని అనబడినది. ఆ పరమేశ్వరి మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా, జ్ఞానదాయనీ, సర్వవేదాంత సంవేద్యా,, సత్యానంద స్వరూపిణీ, ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తి స్వరూపిణీ,  గురుమండల రూపిణీ, దక్షిణామూర్తి రూపిణీ, శివజ్ఞాన ప్రదాయనీ, శాస్త్రసారా, పరబ్రహ్మస్వరూపిణీ అని వివిధ నామ మంత్రములే తన స్వరూపమైనది ఆ తల్లికి సంశయాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి నిస్సంశయా యని నామ మంత్రముతో స్తుతింప బడుచున్నది.  అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిస్సంశయాయై నమః అని అనవలెను.


 ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన పని చేస్తుండటమే  నిజంగా 'ఈశ్వర పూజ'।

1--ఏ పుట్టలో

 ఏ పుట్టలో ఏ పామున్నదో తెల్పలేము కదా, నమ్మాలి, నమ్మకం మీద బ్రతకాలి, అనుభవాలు కాలాన్ని ఎదుర్కొనే శక్తి నిస్తాయి కావునా , ఏ గుర్తింపూ కోరని మహాత్ములే మనలను ఈ తాదాత్మ్యం నుండి విముక్తులను చేయగలరు। అందువలన వారి సాన్నిధ్యాన్నే పొందాలి। మనసు శాంతి చేకూర్చే మార్గాలు వెతుక్కోవాలి।  (60 సంవత్సరాల పై బడ్డ వారు ) 

మహాత్ముల సాన్నిధ్యమంటే కేవలం స్తబ్ధతతో కలసి ఉండటం కాదు। అయితే దీర్ఘకాలంలో దీని వల్ల కూడ ఫలితం ఉండవచ్చు। (వయసుని బట్టి మారవచ్చు) కాని ఉత్సాహంగా కలిసి పని చేయడం, వికసించడానికి సంసిద్ధత, ఆధ్యాత్మిక మార్గము మీద నిబద్ధతల వల్ల ఉపయోగాలు బహుముఖంగా విస్తృతమవుతాయి। 

ఛాందోగ్యోపనిషత్తు (7।8।1) ఇలా అంటున్నది-

 “స యదా బలీ భవతి అథ ఉథాథా భవతి ఉత్తిష్టన్ పరిచరితా భవతి పరిచరన్ ఉపసత్తా భవతి ఉపసీదన్ ద్రష్టా భవతి శ్రోతా భవతి మన్తా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా భవతి!!- 

వీరుడైన శిష్యుడు గురువుని ఆశ్రయించి, సేవచేసి, ఆయనకు సన్నిహితుడై, ఆయన మనసు ననుసరించి, మిగతా వారితో ఆయన వ్యవహరించే తీరు గమనిస్తూ, వివేకపూరితమైన మాటలు వింటూ, పర్యావలోకిస్తూ వాటిని అర్థం చేసుకొని, అలానే వ్యవహరిస్తూ సత్యాన్ని తెలుసుకుంటాడు।”

14- శ్రీ కపిలగీత, అధ్యాయము - 1 శ్లోకం 14:-

త ఏతే సాధవః సాధ్వి సర్వసంగ వివర్జితాః ।

సంగస్తేష్వథ తే ప్రార్థః సంగదోష హరా హితే ॥ 14 ॥

టీకా:-

 తే ఏతే సాధవః = మహాత్ములైనవారు; సాధ్వి = ఓ మహాత్మురాలా; సర్వ సంగ వివర్జితాః = అనాసక్తులై; సంగః తేషు = వారి సాంగత్యం; అథ = కావున; తేప్రార్థ్యః = నీవు అన్వేషించు (కోరు); సంగ-దోష-హరాః = (ప్రాపంచిక) దుస్సాంగత్యమును పోగొట్టే వారు; హి = నిజంగా; తే = వారు।

భావం:-

ఓ సాధ్వీమ తల్లీ! ప్రాపంచిక సాంగత్యం పట్ల అనాసక్తులైన మహాత్ముల, యోగుల సాంగత్యమునే నీవు అభిలషించు। వారే నీ ప్రాపంచిక ఆసక్తులను పోగొట్టుతారు।

ఈ శరీరంతో ఉండే సంబంధమే ప్రపంచంలోని విషయాలు, వ్యక్తులతో వుంటే సంబంధాలకు మూలం। “దేహాత్మా సంస్థిత ఏవ కామా- శరీర తాదాత్మ్యము గలవాడు ఇంద్రియలోలుడే అవుతాడు" (వివేక చూడామణి-311) విషయ వస్తువుల మీద ఆధారపడటం, బాహ్యదృష్టి, పక్షపాతవైఖరి, మూర్ఖత్వము దురభిమానము మొదలయినవి శరీరమే తాను అనుకోవడం వల్ల వచ్చే అనర్థాలే।

ఒక్కోసారి గొప్ప విషయాల పట్ల వల్లమాలిన అభిమానం తప్పు దారి పట్టిస్తుంది। ఉదాహరణకు కొన్ని అభిప్రాయాలు:- 'ఇదే సరైన మార్గం' 'నా దేవుడే రక్షించగలడు' మొదలయినవి।

సర్వేజనాస్సుఖినోభవంతు 

"కవులు వ్రాసినా గ్రంథ పరిశీలనా కల్పిత క్లుప్త సారాసం" 

సేకరణ రచయిత :మల్లాప్రగడ రామకృష్ణ 

   ___((()))___


* పావులు వల్లనే కదులు పాపపు బుధ్ధులు పాడు చేయుటన్

బావులు తగ్గెనే ఇపుడు భావితరమ్ముకు బాధ పెంచుటన్

రావుల వారి పల్కులకు రాక్షస బుద్దియె కానవచ్చుటన్

దేవుడు లేనె లేడని మదిన్ కడునమ్ముచు గొల్తు భక్తితోన్

****

కాలమ్మే ప్రేమ భావం - కళలను కధలే - కావ్యమై సేవచేయా 

మూలమ్మే దాహ లక్ష్యం - ముడుపులు పెరిగే - మూగభావమ్ము పెంచే   

మాలగా దైవ సేవే - మలుపులు కదిలే - మానసమ్మే మ్మెను జూపే   

నీలికన్నుళ్లు ప్రేమా - నటనలు తెలిపే - నాట్యమై దేహ మాయే   

అంటూ ఈరోజు అనేక పద్యాలు వ్రాయటం జరిగింది తప్పులు దొర్లినా క్షమించగలరు ఎందుకంటే ఆలోచన మలుపులు 

నేటి స్పందన పద్యాలు 


మీ అభిమానానికి మీకు మీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు


 

🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 26వ శ్లోకం:-

ఆమ్నాయాభ్య సనాన్యరణ్య రుదితం వేద వ్రతాన్య న్వహం మేదశ్చేద ఫలాని పూర్తవిధయ: సర్వే హుతం భస్మని తీర్థా నామవగాహనా నిచ గజస్నానం వినా యత్పద- ద్వంద్వాం భోరుహ సంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:!!

భావం:-

శ్రీ నారాయణ పదాంభోరుహ స్మరణమును విడిచి కేవలము వేదములు వల్లెవేయుట అరణ్య రోదనము. వేదోక్త నియమములను పాటించుట కండలు కరుగుటకు చేయు వ్యాయామ సదృశము. యజ్ఞాది కర్మలు బూడిదపాలు. గంగాది పుణ్యతీర్థ స్నానము గజస్నానము వలె ప్రయోజన శూన్యము. కనుక నిత్యము ఆ నారాయణుని స్మరిస్తూ సర్వకర్మలు ఆచరింపుము.

🕉🌞🌎🌙🌟🚩

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - June 14.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - జూన్ 14.

Every reaction in the form of hatred or evil is so much loss to the mind.

ఒకరిని ద్వేషించటం ద్వారా, అతనికి హాని కలగచేయటం ద్వారా మనం ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో అనర్ధం వాటిల్లుతూ ఉంటుంది.

పువ్వుల నుండి పరిమళం వచ్చినట్లు,  చందనం అరగదీస్తే సుగంధం వెదజల్లినట్లు,  భగవన్నామాన్ని స్మరించటం వల్ల అలౌకిక ఆనందం అనుభూతం అవుతుంది. 

-శ్రీశారదామాత.

🧘విస్తరణ🧘‍♀

దేహ చైతన్యంలో మునిగివున్నంత కాలం మనం పరాయి దేశంలో ఆగంతకులవంటి వారమే. మన స్వస్థానం సర్వ వ్యాపకం.

శ్రీ పరమహంస యోగానంద / Sayings Of Paramahamsa Yoganamda

🧘సుభాషితమ్🧘‍♂  శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

709వ నామ మంత్రము 15.6.2022


: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

173వ నామ మంత్రము 15.6.2022


. శ్రీమద్భగవద్గీత - 217 / Bhagavad-Gita -  217 🌹


🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము  - 13  🌴

13. సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్

🌷. తాత్పర్యం :
దేహమునందున్న జీవుడు తన స్వభావమును నియమించి మానసికముగా కర్మలన్నింటిని త్యజించినపుడు, కర్మను చేయక మరియు కర్మకు కారణము కాక నవద్వారపురము నందు(దేహములో) సుఖముగా వసించును.

🌷. భాష్యము :
బద్ధజీవుడు నవద్వారములు గల పురమునందు నివసించును. దేహకర్మలు (దేహమనెడి పురము యొక్క కర్మలు) స్వాభావిక గుణము ననుసరించి వాటంతట అవే అప్రయత్నముగా నిర్వహింపబడును. దేహపరిస్థితుల ప్రభావమునకు లోనైయుండెడి జీవుడు ఒకవేళ తలచినచో వాటికి అతీతుడుగును కావచ్చును. జీవుడు తన ఉన్నతస్వభావమును మరచి దేహాత్మభావనను పొందుట వలననే దుఃఖము నొందుచున్నాడు. 

కృష్ణభక్తిభావనలో అతడు తన సహజస్థితిని పునరిద్ధరించుకొని బంధము నుండి ముక్తుడు కాగలడు. కనుకనే కృష్ణభక్తిపరాయణుడైనంతనే మనుజుడు శీఘ్రముగా దేహపరకర్మల నుండి దూరుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమితజీవితము నందు అతడు నవద్వారపురములో సుఖుముగా జీవించును. నవద్వారములు ఈ క్రింది విధముగా తెలుపబడినవి.

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి: |
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ 

“జీవుని దేహమునందు నిలిచియుండెడి భగవానుడు విశ్వమునందలి సమస్తజీవులను నియమించువాడు. దేహము నవద్వారములను కలిగియుండును (రెండు కళ్ళు, రెండు నాసికారంధ్రములు, రెండు చెవులు, ఒకనోరు,మర్మావయము, గుదస్థానము). బద్ధస్థితిలో జీవుడు అట్టి దేహముతో తనను గుర్తించును. కాని హృదయస్థ పరమాత్మతో తనను అతడు గుర్తించినపుడు దేహమునందున్నపుడు భగవానుని వలె స్వతంత్రుడు కాగలదు (శ్వేతాశ్వతరోపనిషత్తు 3.18)”. 

కనుకనే కృష్ణభక్తిరసభావనము నందున్నవాడు దేహము యొక్క అంతర్బాహ్య కర్మలన్నింటి నుండి స్వతంత్రుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 616 / Vishnu  Sahasranama Contemplation - 616🌹

ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ

స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ

అఙ్గాని శోభనాన్యస్యేత్యచ్యుతః స్వఙ్గ ఉచ్యతే

సుందరమగు అంగములును, అవయవములు ఈతనికి గలవు కనుక అచ్యుతుడు స్వంగః. అంగము అనగా శరీరము అనియు అర్థము. సు + అంగః సుందరమగు శరీరము కలవాడనియు చెప్పవచ్చును.

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
విపులాంశో మహాబాహుః కమ్బుగ్రీవః శుభాననః ।
గూఢజత్రుస్సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః ॥ 15 ॥
దున్దుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
సమస్సమవిభక్తాఙ్గో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16 ॥

శ్రీరాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము గలవాడు. శుభప్రదమైన ముఖము గలవాడు. కండరములతో మూసికొని పోయిన సంధి యెముక గలవాడు. మనోహరములైన ఎఱ్ఱని కన్నులు గలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభిధ్వని వలె గంభీరమైన కంఠ స్వరముగలవాడు. నిగనిగలాడు శరీరచ్ఛాయ గలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములు గలవాడు. మేఘశ్యామ వర్ణ శోభితుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

Source Sloka
स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 295 / DAILY WISDOM - 295 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి  🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

 సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
 మైత్రేయ మహర్షి బోధనలు - 134 🌹 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 102. బృందము - జీవము - 1 🌻

బృందములందు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కలసిమెలసి మెలగవచ్చునా? లేక వారి మధ్య వ్యత్యాసము చూపవలెనా? తప్పక బృందమందు అందరును ఉండవచ్చును. కాని ప్రకృతి సిద్ధమగు కొన్ని వ్యత్యాసములు మన్నించుట శ్రేయస్కరము. ఒకే వృక్షమునకు వివిధమగు శాఖలున్నవి కదా! ఒక శాఖ తీరునకు మరియొక శాఖ తీరునకు వ్యత్యాసముండుట కూడ సహజమే అని గుర్తింపవలెను. వ్యత్యాసములతో కూడిన శాఖలతో ఒక వృక్షమున్నట్లే ఒక బృందమందు గల సభ్యుల మధ్య ఏకత్వమందు సహజమగు భిన్నత్వమును గుర్తించి మన్నింప వలెను.

పిల్లలు పిల్లలే, వారు పెద్దలు కారు. జీవ పరముగ పెద్దలే అయివుండవచ్చుగాని, దేహపరముగ, మానసిక పరముగ కారు. అట్లే పురుషులు పురుషులే. స్త్రీలు స్త్రీలే. పురుషులు, స్త్రీలు కాలేరు. స్త్రీలు, పురుషులు కాక సంఘమందు వృద్ధులుందురు. వారి జీవితానుభవము ఇతరులు తెలియవలసిన ఆవశ్యకత యున్నది. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, రెమ్మలువలె వృద్ధులు, స్త్రీ పురుషులు, పిల్లలు కలసిన బృందమే అందము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

[10:05 pm, 15/06/2022] +91 92915 82862: 🧘‍♂️89-కర్మ - జన్మ🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

 8 వ ఆధ్యాయం - "కర్మ మర్మం"

 కష్ట సుఖాలు - నవగ్రహాలు 

ఆచారాలు, నమ్మకాలు మతానికి చెందినవి. ఈ పుస్తకం వేదాంత ప్రాతిపదిక మీద రాయబడింది. వేదాంతంలో నవగ్రహాలు, జ్యోతిషం, వాస్తు, రత్నధారణ, శని పూజ లాంటి వాటికి చోటులేదు.


 కాబట్టి అలాంటి అంశాలని ఈ పుస్తకం కర్మ సిద్ధాంత పరిధిలోనే సమర్ధిస్తుంది. వాటి మీద గౌరవం గలవారు దయచేసి ఈ పాయింట్‌నే గమనించగలరు.


 మనకి ప్రాప్తించే కష్టనష్టాలన్నిటికీ నవగ్రహాల ప్రమేయం వుందని చాలామంది నమ్ముతూంటారు. ముఖ్యంగా శనిగ్రహం ఇలాంటి నిందకి గురవుతూంటాడు.


కొన్ని కొన్ని గ్రహాలు మంచి రాశిలో వున్నప్పుడు పుట్టినవారికి సుఖాలు అధికంగా వస్తాయని, అవి నీచ స్థానంలో వున్నప్పుడు జన్మిస్తే కష్టాలు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇది నిజాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవడం అవుతుంది.

🕉️🌞🌏🌙🌟🚩
[10:06 pm, 15/06/2022] +91 92915 82862: 🧘‍♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘‍♀️

 28వ శ్లోకం:-

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యంకే న ప్రాపు ర్వాంచితం పాపినోపి హా న: పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్ తేన ప్రాప్తం గర్భ వాసాది దు:ఖం!! 

భావం:-

పాపాత్ములైనను శ్రీమన్నారాయణ అను నామమును ఉచ్చరించి తమ కోర్కెలను తీర్చుకొనిరి కదా! అయ్యో నా వాక్కు ఆ నామమును ముందు ఉచ్చరించినది కాదు. అందులకే నాకీ జన్మము. ఈ గర్భవాసము మున్నగు దుఃఖములు సంభవించినవి.

🕉🌞🌎🌙🌟🚩

* మనకు ఇప్పుడు కావల్సింది వేదాంతంతో మేళవింపబడిన పాశ్చాత్య విజ్ఢాన శాస్త్రం, దానికి మూలమంత్రంగా బ్రహ్మచర్యం పాటించటం మరియు శ్రద్ధ, ఆత్మవిశ్వాశాలను కలిగి ఉండటం.


* అనుభవం పెరిగే కొద్దీ 'పురుష ప్రయత్నం' లోనే సర్వం ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే నా నూతన సందేశం.


* దేవుడు నా హృదయం ద్వారా స్రవిస్తున్నట్టు అదే విధంగా అన్ని హృదయాల నుండి, భూమిలోని సూక్ష్మ రంధ్రాలనుండి, ఆకాశం నుండి, సృష్టిలోని అన్ని పదార్ధముల నుండి ఆయన జాలువారుతున్నట్లు అనుభూతి పొందుతాను. ఆయన నిత్య ఆనంద సంచలనం. ఆయన సమస్త సృష్టిని తనలో ప్రతిబింబిస్తున్న నిశ్శబ్ద దర్పణము. 


🕉️🌞🌏🌙🌟🚩

ॐ卐సుభాషితమ్ॐ卐 

****
06- శ్రీ కపిలగీత🧘‍♀️
అధ్యాయము - 1
 శ్లోకం 05:-

తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్ |

జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్ ॥ 5॥

టీకా :-

తమ్ త్వా = ఆయనలో, నీలో; (అలాంటి నిన్ను) గతా అహమ్ = నేను తీసుకొన్నాను; శరణం = శరణం; శరణ్యం = శరణాగతి; స్వభృత్య-సంసార-తరోః = నీ సేవకుల సంసార వృక్షమును; కుఠారమ్ = గొడ్డలి; జిజ్ఞాసయా = జ్ఞాన పిపాసతో; అహమ్ = నేను ప్రకృతేః పూరుషస్య = ప్రకృతి పురుషుల; నమామి = నమస్కరించుచున్నాను; సద్-ధర్మ-విదామ్ సత్యమును తెలుసుకున్న వారిలో; వరిష్టమ్ = శ్రేష్ఠుడవు. 

భావం:-

ప్రకృతి పురుషుల జ్ఞానమును పొందవలెనన్న పిపాసతో నేను నిన్ను శరణుకోరుతున్నాను. నిన్ను సేవించువారి సంసార వృక్షమును సంహరించగల గొడ్డలివంటి వాడవు.
నీ వొక్కడవే శరణ్యుడవు. సత్యమును తెలుసుకొన్న సర్వధర్మ వేత్తలలో నీవు శ్రేష్ఠుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను.

వివరణ:-

భగవద్గీత 15వ అధ్యాయములో భగవానుడు సంసార వృక్షమును వర్ణించిన తరువాత అసంగమనే శస్త్రముతో దానిని ఖండించమని అర్జునునకు చెప్పాడు. ఇక్కడ భక్తురాలు అవసరమైనదాన్ని ఇమ్మని భగవంతుని శరణు వేడుతున్నది.


ఇంతకు ముందు దేవహూతి తన భర్తయైన కర్దముడు జ్ఞానాన్ని ఇవ్వగల్గిన వాడైనప్పటికీ ఆయనను ప్రాపంచిక సుఖాల కోసమే ప్రార్థించింది. ఇప్పుడు ఆమె వాటిని అధిగమించి, తన పుత్రుని నుండి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నది.

కపిలభగవానుడిలా జవాబిస్తున్నాడు.

06- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️
06- శ్రీ కపిలగీత🧘‍♀️

అధ్యాయము - 1
 శ్లోకం 05:-

తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్ |

జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్ ॥ 5॥

టీకా :-

తమ్ త్వా = ఆయనలో, నీలో; (అలాంటి నిన్ను) గతా అహమ్ = నేను తీసుకొన్నాను; శరణం = శరణం; శరణ్యం = శరణాగతి; స్వభృత్య-సంసార-తరోః = నీ సేవకుల సంసార వృక్షమును; కుఠారమ్ = గొడ్డలి; జిజ్ఞాసయా = జ్ఞాన పిపాసతో; అహమ్ = నేను ప్రకృతేః పూరుషస్య = ప్రకృతి పురుషుల; నమామి = నమస్కరించుచున్నాను; సద్-ధర్మ-విదామ్ సత్యమును తెలుసుకున్న వారిలో; వరిష్టమ్ = శ్రేష్ఠుడవు. 

భావం:-

ప్రకృతి పురుషుల జ్ఞానమును పొందవలెనన్న పిపాసతో నేను నిన్ను శరణుకోరుతున్నాను. నిన్ను సేవించువారి సంసార వృక్షమును సంహరించగల గొడ్డలివంటి వాడవు.
నీ వొక్కడవే శరణ్యుడవు. సత్యమును తెలుసుకొన్న సర్వధర్మ వేత్తలలో నీవు శ్రేష్ఠుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను.

వివరణ:-

భగవద్గీత 15వ అధ్యాయములో భగవానుడు సంసార వృక్షమును వర్ణించిన తరువాత అసంగమనే శస్త్రముతో దానిని ఖండించమని అర్జునునకు చెప్పాడు. ఇక్కడ భక్తురాలు అవసరమైనదాన్ని ఇమ్మని భగవంతుని శరణు వేడుతున్నది.


ఇంతకు ముందు దేవహూతి తన భర్తయైన కర్దముడు జ్ఞానాన్ని ఇవ్వగల్గిన వాడైనప్పటికీ ఆయనను ప్రాపంచిక సుఖాల కోసమే ప్రార్థించింది. ఇప్పుడు ఆమె వాటిని అధిగమించి, తన పుత్రుని నుండి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నది.

కపిలభగవానుడిలా జవాబిస్తున్నాడు.
06- శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచితము - సిద్ధాశ్రమయోగులు🧘‍♀️

*🧘‍♂️6-సిద్ధభూమిక🧘‍♀️:-

సిద్ధాశ్రమ ప్రాంతంలో మానస సరస్సు అత్యంత ప్రధానమైనది. స్కాంద పురాణంలో దీని మహిమ ఎంతో అద్భుతంగా వర్ణించబడింది. యాభై ఖండాలున్న స్కాందంలో మానస ఖండం ఈ సరస్సు విశిష్టతను విశదంగా వర్ణించింది. బ్రహ్మ మానస పుత్రులు సనక సనందనాదులు శివానుగ్రహం కోసం కైలాస పర్వతపాదంలో ద్వాదశ వర్ష తపస్సు చేశారు. ఆ సమయంలో అక్కడ క్షామము నీటి కరువు ఏర్పడ్డవి. సాక్షాత్కరించిన పార్వతీపరమేశ్వరుల అర్చనకు జలం లభ్యం కాకపోవటంతో తండ్రియైన బ్రహ్మదేవుని ప్రార్థిస్తే వాళ్ళ కోసం తన మనస్సంకల్పంతో ఈ సరస్సు సృష్టించాడు కమలగర్భుడు. బ్రహ్మ సృష్టించాడు గనుక బ్రహ్మ సరస్సనీ, ఆయన మానసంలో నుంచి పుట్టింది గనుక మానస సరస్సనీ పేరు వచ్చింది. దానిలో నుండి స్వర్ణ
శివలింగం స్వయంభువుగా ఉదయించింది.


ఆ దేవునికే అమరభైరవుడని పేరు. ఆ తీరంలోనే ఇటీవల త్రవ్వకాలలో సువర్ణ శునక విగ్రహం దొరికింది. భైరవుడు శ్వానవాహనుడు గదా ! సరస్సు ఒడ్డున ఉన్న అల్లోనేరేడు చెట్టు (జంబూ వృక్ష) పండ్లు నీటిలోపడి " జం " అని శబ్దం చేయటం వల్ల అదే జంబు అనబడిందని ఆ చెట్టుకు ఈ పేరు కూడా జం శబ్దాన్ని బట్టే వచ్చిందని, ఈ చెట్లు ఎక్కువగా ఉండి నెమ్మదిగా జంబూ ద్వీపమన్న పేరు వచ్చిందని
పండితులు కొందరన్నారు.

సతీదేవి శరీరభాగాలు పడిన చోట్లు శక్తి పీఠాలైనవని అందరికీ తెలిసిన సంగతే. ఆమె దక్షిణ పాదం మానస సరస్సులో పడిందని అందువల్ల ఇది శక్తిపీఠమైనదని తంత్ర గ్రంతాలలో ఉంది. (కుడిచేయి అని ఒక చోట ఉంది) పీఠ దేవత దాక్షాయణి.

బౌద్ధులు ఈ సరస్సును అనవతప్త (వేడిలేనిది) అనే నామధేయంతో వర్ణించారు. గౌతమబుద్ధుని తల్లి మాయాదేవిని స్వప్నంలో దేవతలు తీసుకెళ్ళి ఈ సరస్సులో స్నానం చేయించి పరిశుద్ధి చేసిన తర్వాతనే ఆమె బుద్ధునకు జన్మనిచ్చిందని బౌద్ధ గ్రంథాలలో ఉంది.

జైనులు దీనిని పద్మప్రదం అన్నారు. కైలాసగిరికి వలెనే ఈ సరస్సుకు కూడా పరిక్రమ చేస్తారు. దూరం సుమారు 105 కి.మీ. సరస్సు చుట్టూ ఉన్న బౌద్ధమఠాలను చూస్తూ యాత్రికులు ప్రదక్షిణం చేస్తుంటారు. ఇది కూడా అనంత పుణ్య ప్రదాయకమని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతానికి తూర్పున ఉన్న మానస సరస్సు నుండి పడమట ఉన్న మరో సరస్సులోకి నీరు ప్రవహిస్తున్నది. దానికి రావణహ్రదమని పేరు. ఆ ప్రాంతాన్ని రక్షస్తల్ అంటారు. రావణాసురుడిక్కడే శివుని గూర్చి తపస్సు చేశాడు.

మానస సరస్సులో పద్మాలెక్కువగా ఉండటం వల్ల దానికి పద్మప్రదమని పేరుండేది. ఇప్పుడు పద్మాలు లేవు. గ్రంధాలు వర్ణించిన రాజహంసలూ
లేవు. భారతదేశంలో పూర్వకాలం ఉండేవని పురాణాలలో కావ్యాలలో వర్ణించారు. ఇప్పుడు రష్యాలో బాగా ఉన్నవని, వాటి యీకలతో చేసిన హంసతూలికా తల్పాలు ఆ దేశం పట్టణాల బజార్లలో అమ్ముతున్నారని వెళ్ళి వచ్చిన వారు చెపుతున్నారు.

మానస సరోవరంలో ఓంకారాకారంలో ఉన్న రాళ్లు దొరుకుతవి. వాటిని సేకరించి పూజిస్తారు. ఆప్తులకు కానుకగా ఇస్తారు. సరస్సు ఒడ్డున చాలామంది జాగరణ చేస్తారు. తెల్లవారుజాములోపు నక్షత్రాలు కొన్ని సరస్సులో పడటం ఎందరో చూచారు. దేవతలు స్నానం చేయటానికి వచ్చారంటానికి దీనిని గుర్తుగా భావిస్తారు. అమరులు జలకాలాడే ధ్వనులు, కాలి అందెల గజ్జెల ఘలంఘలలు విన్నవారూ ఉన్నారు. దేవతలు ఈ సరస్సులో రోజు స్నానం చేయటానికి వచ్చే మార్గాన్ని కాంతి సేతువుగా - వెలుగువంతెనగా
పురాణాలు వర్ణించినవి.

శ్లో॥ దివ్యచ్ఛాయా పథస్తత్ర
నక్షత్రాణ్యను మండలం
దృశ్యతే భాసురా రాత్రా
దేవీ త్రిపధగా తుసా..

ఆదియుగాలలో దేవతలు భూమి మీదకు తరచుగా వచ్చి ఎక్కువ కాలం ఉండి వెళుతుండేవారు. మొదటవారు దేవికా నదీతీరంలో దిగినారని పురాణాల ఉద్ఘాటన.హిమాలయాలు వారి నిత్యవిహార భూములు. కాళిదాస మహాకవి ఈ పర్వతాన్ని దేవతాత్మ అని వర్ణించాడు..

శ్లో॥ అస్త్యుత్తరాస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండ:

తూర్పు పడమర సముద్రాల మధ్య భూమిని కొలిచే మానదండం (కొలబద్ద వలె ఉన్నది హిమాలయం. ఆది దేవతలకు ఆత్మస్థానం. అందులోనిది మానస సరస్సు. భారతంలో ఈ సరస్సుకు బిందు సరస్సని పేరుంది.

యథా వ్యాలగలస్థో౬పి భేకో దంశానపేక్షతే!

తథా కాలాహినా గ్రస్తో లోకో భోగానశాశ్వతాన్!!

పాము నోట చిక్కిన కప్ప, తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, జనులు కాలరూపము అగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు.



(సశేషం )

🕉🌞🌏🌙🌟🚩
96) అష్టావక్ర గీత🧘‍♀️
అధ్యాయం - 9
నిర్లిప్తత - ఉదాసీనత (నిర్వేదము)  
శ్లోకం 04:-

कोऽसौ कालो वयः किं वा यत्र द्वन्द्वानि नो नृणाम् ।
तान्युपेक्ष्य यथाप्राप्तवर्ती सिद्धिमवाप्नुयात् ॥ ९-४ ॥

కోఽసౌ కాలో వయః కిం వా యత్ర ద్వంద్వాని నో నృణాం ।
తాన్యుపేక్ష్య యథాప్రాప్తవర్తీ సిద్ధిమవాప్నుయాత్ ॥ 9-4 ॥

శ్లో|| కోఽసౌకాలో వయః కిం వా యత్ర ద్వంద్వాని నోనృణామ్ | 
తాన్యు పేక్ష్య యథా ప్రాప్త వర్తీ సిద్ధిమవాప్నుయాత్ || 4.

ko’sau kaalo vayah’ kim vaa yatra dvandvaani no nri’naam ।
taanyupekshya yathaapraaptavartee siddhimavaapnuyaat ॥ 9-4 ॥

టీకా

 యత్ర = దేనియందు, నృణాం = మనుష్యులకు, ద్వంద్వాని = సుఖదు:ఖ ద్వంద్వములు, నో = లేవో, అసౌ= ఈ, కాలః కాలము, కః= ఏది? వయః = వయస్సు, కిం = ఏది? అపి తు = అయితే, న కః అపి ఏమియు లేదు , ఇతి = ఇట్లని, తాని = వాటినన్నిటిని, ఉపేక్ష్య = ఉపేక్షించి, యథా ప్రాప్తవర్తీ = యాదృచ్ఛికముగా వచ్చిన భోగముల ననుభవించుచూ, సిద్ధిం = సిద్ధిని, అవాప్నుయాత్ = పొందుచున్నాడు.

వివరణ:-

మానవ జీవితంలో ద్వంద్వాల ప్రభావానికి లోనుకాని కాలమేది? వీటిని తటస్తంగా చూస్తూ, కావాలనే కోరిక లేకుండా వచ్చిన వాటిని నిరసించ కుండా స్థిరత్వంతో జీవించేవానికి పూర్ణత్వం తప్పకుండా సిద్ధిస్తుంది.

తాత్పర్యం:-

సుఖదుఃఖాలతో నిండిన ఈ జీవితంపై ఆకర్షణ ఉన్నంతవరకూ ద్వంద్వాలు మనిషిని బాధిస్తూనే ఉంటాయి. మనస్సుతో తాదాత్మ్యం చెంది జీవిస్తున్నంతకాలమూ శీతోష్ణాలు, మానావమానాలు, కలిమిలేములు, యిష్టా యిష్టాలు మొదలుగాగల అసంఖ్యాకములైన ద్వంద్వాలు దుర్భరమైన మనః కల్లోలాన్ని సృష్టించి పెంచి పోషిస్తూనే ఉంటాయి. ఇక్కడ అష్టావక్రులు చెప్పినట్టుగా మనిషి జీవితంలో వీటి ప్రభావం లేనిదెప్పుడు? అహంకారం ఉన్నంత సేపూ ద్వంద్వాలు ఉండనే ఉంటాయి.


ఈ ద్వంద్వాల ప్రభావం నుండి తప్పించుకోవడానికి మనస్సుతోగల తాదాత్మ్యాన్ని విడనాడడం ఒక్కటే మార్గం. మనస్సును అధిగమించి,ద్వంద్వాల కతీతంగా నిలువగలగిన వ్యక్తి మాత్రమే పరిపూర్ణమైన శాంతితో జీవించగలడు.


అట్టి వానికి సంభవించే ఏ సంఘటననైనా సమత్వబుద్ధితో స్వీకరించగలుగుతాడు. 'యధాప్రాప్తవర్తి". అట్టివానిలో అజ్ఞానజన్యమైన అహంకారం నశించి జ్ఞానం ప్రకాశిస్తుంది. ఇక్కడ మహోపనిషత్తులోని ఒక శ్లోకం జ్ఞప్తికి వస్తోంది.


సంతోషామృతపానేన యే శాంతా స్తృప్తి మాగతాః! ఆత్మారామా మహాత్మనస్తే మహా పదమాగతాః!!(మహోపనిషత్తు 4-35)

సంతోషం అనే అమృతాన్ని పానం చేసి శాంతిని తృప్తిని సాధించిన మహాత్ములు, ఆత్మజ్ఞానం పొంది, ఆత్మనిష్టులౌతారు. 


సుఖం ఉంటే దుఃఖం కూడా ఉండి తీరుతుంది. ద్వంద్వాలలో ఏ ఒక్కటి ఉన్నా రెండవది కూడా పక్కనే ఉంటుంది. ఇవి అయస్కాంతంలో ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. అయస్కాంతం ఉందంటే, ఈ రెండు ధృవాలూ ఉండి తీరుతాయి. ఇదే విధంగా అహంకారం మనస్సూ ఉంటే ద్వంద్వాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ భావం ఎంతో అందంగా ఒక శ్లోకంలో ఇలా చెప్పబడింది.


సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్!

ద్వయమేతద్ధి జన్తూనామలంఘ్యం దినరాత్రివత్!!

సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తరువాత సుఖం తప్పకుండా వస్తుంటాయి. ఏ ప్రాణీ కూడా వీటినుండి తప్పించుకోలేదు. ఇవి దివారాత్రాలంత సహజంగా వరుసక్రమంలో వస్తూనే ఉంటాయి.


విచారంనుండి తప్పించుకోవాలంటే సంతోషంలోకి వచ్చితీరాలి. సంతోషం వద్దనుకుంటే విచారం వచ్చి తీరుతుంది. ఈ ద్వంద్వాలలో దేనిని కోరినా నిరాకరించినా రెండవది తప్పకుండా ఉండనే ఉంటుంది. సముద్రంలో తిన్నగా వెళుతున్న కొద్దీ తరంగాలను తప్పించుకోలేం.


 ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అంతు లేకుండా. ఇదే సముద్రం నుండి ఎత్తుగా విడిగా పోగలిగితే తరంగాల నుండి తప్పించుకోగలం. ఇదేవిధంగా మనస్సునుండీ అహం కారం నుండి విడివడగలిగితేనే ద్వంద్వాల ప్రభావం అదృశ్యం అవుతుంది.

🕉🌞🌏🌙🌟🚩
16) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి విరచితము ఆత్మవిద్యా విలాసము🧘‍♀️
16) శ్లోకం:-

దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్చితే ర్విభజనం భవవారి రాశేః | 

సంతారణే ప్లవ ఇతి శ్రుతి డిండిమోఽయం  తస్మాద్విచారయ జడాజడయో స్స్వరూపమ్ ॥ 16

టీకా

 దేహ ఇంద్రియ అసు హృదయ ఆదిక = దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, హృదయం మొదలైన, చైత్యవర్గాత్ = చైతన్యంతో కూడిన వర్గంనుండి, ప్రత్యక్ చితేః విభజనం = లోన ఉన్న చిత్తుని, విభజనం = వేరు చేయడం, భవవారి రాశేః = సంసార సముద్రాన్ని, సంతరణే = దాటడంలో, ప్లవః ఇతి = పడవ వలె, అయం = ఇది, శ్రుతి డిండిమః = ఉపనిషత్తుల చాటింపు, తస్మాత్ = అందుచేత, జడ అజడయోః స్వరూపం = జడమైన జడంకాని స్వరూపాన్ని గురించి, విచారయ = విచారణ చెయ్యి.

భావం:-

దేహం, ఇంద్రియాలు, పంచప్రాణాలు, హృదయం మొదలైన చైతన్యంతో కూడిన వర్గం నుండి లోనుండే చితిని విడదీయడమే సంసార సముద్రాన్ని దాటించే పడవ అని ఉపనిషత్తులు చాటిస్తాయి. అందుచేత జడాజడాల స్వరూపాన్ని గురించి విచారణ చేయుము.

వివరణ:- 

శిష్యుని హృదయం చాలా పరిపక్వత చెంది వున్నందున శ్రీ గురువు అత్యుత్తమమైన ఆత్మ విచారణా మార్గాన్ని సూటిగా బోధిస్తున్నాడు.


చైత్యవర్గం :- దేహము, అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలనే నాలుగు అంతఃకరణాలు కలిసిన ఇరవైయింటినీ చైత్యవర్గమంటారు.


ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి, కాబట్టి జ్ఞానేంద్రియాలకి ఆ పేరు వచ్చింది. తక్కిన వాటికి వేరే రకమైన చైతన్యం ఉన్నది. దేహం ఎంతో తెలివైయింది. తనకి పడని వాటిని, అక్కరలేని వాటిని వెంటనే బయటకి తోసివేస్తుంది.


 కర్మేంద్రియాలకు, పంచప్రాణాలకి తమ తమ పనులు చేయడానికి తగిన జ్ఞానం ఉన్నది. అంతఃకరణాల వ్యవహారాలన్నీ చైతన్యంతో కూడినవే.


అయితే ఇవి చైతన్యంతో కూడిన జడాలు. వాటికి స్వతహాగా చైతన్యం లేదు, స్థూల సూక్ష్మ రూపాలుగా ఉన్న ఈ ఇరవయింట్లోను చైతన్యం ప్రసరించిన కారణంగా అవి చైతన్యంతో ప్రవర్తిస్తాయి.


 చైతన్య ప్రసారం ఆగిపోగా అవి తిరిగి జడాలవుతాయి, నశించిపోతాయి. చైతన్యంలేనిదే అవి నిలవలేవు, కొండలు, నదులు మొదలైన వాటిలాగా అవి జడాలుగా నిలిచి ఉండవు. కేవలం చైతన్యాన్ని ప్రసరించడానికే అవి ఉపయోగ పడతాయి. అందుకే అవి చైత్యవర్గం అని పిలువబడుతాయి.

ప్రత్యక్షితి:-

 అన్నింటికి అంతరంలో ఉండే చితి. బల్బులోకి ప్రవేశించి వెలుగు నిచ్చే కరెంటులాగా, పైన చెప్పిన చైత్యవర్గం లోపల ప్రవేశించి చైతన్యాన్ని ఇస్తుంది.


విభజనం :- సంసారంలో కొట్టుమిట్టాడే జీవుడు చైతన్యవంతుడు. అందుండి తరించాలని తహతహపడేది కూడా ఈ జీవుడే.


అందువల్ల తనలోని చితిని, చైత్యవర్గాన్ని విడదీసి తన చితి తన చైత్యవర్గంలోకి ప్రవేశించి, బాహ్య విషయాలని చూపుతోందని, చూపిస్తుందని గ్రహించాలి.


అప్పుడే అతడికి తన నిజ స్వరూపం తెలిసి బాహ్య ప్రపంచాన్ని అధిగమిస్తాడు. లోపలి చితిని విడదీసినప్పుడు దానికి బాహ్య ప్రపంచంలోగాని, దాని బాధలతో గాని సంబంధం ఉండదు.

🕉️🌞🌍🌙🌟🚩
- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ఆరవశతకం)

676) శ్లోకము :-

అంతర్వలక్ష పరిధి భ్రమ మాదధానో 
వక్త్రస్య పూర్ణతుహిన ద్యుతి మండలస్య!
హాసః కరోతు  భవతాం పరమం ప్రమోదం 
శుద్ధాంత పంకజదృశః ప్రమథేశ్వరస్య!!  676.

పదవిభజన :-
     
అంతర్వలక్ష పరిధి భ్రమం ఆదధానో 
వక్త్రస్య పూర్ణ తుహిన ద్యుతి మండలస్య!
హాసః కరోతు  భవతాం పరమం ప్రమోదం 
శుద్ధాంత పంకజ దృశః ప్రమథేశ్వరస్య!!  676

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి!
ప్రమథ గణములకు ఈశ్వరుడగు 
పరమశివుని అంతఃపుర సుందరివి అగు
ఓ పార్వతి!
నీ చంద్ర బింబము వంటి ముఖము చుట్టును
నీ హాసము యొక్క కాంతి 
శుభ్ర పరివేషము  కల్పించుచు,
అందరకు పరమానందము కూర్చు కాక. 

సూచన:-

పరివేషము అనగా చంద్రుని
లేక సూర్యుని లేక దేవతామూర్తుల 
మరియు  మహాను భావుల శిరస్సు 
చుట్టి వచ్చి వృత్తాకారమున కట్టిన
కాంతి పుంజ రేఖ.
దీనినే  ఆంగ్లమున "ఆరా" అందురు

🕉🌞🌎🌙🌟🚩

677) శ్లోకము :-

సమ్మోహనాని తుహినాంశు కలాధరస్య 
సంజీవనాని సరసీరుహ సాయకస్య!
సందీపనాని  వితనోతు జనేషు శక్తే:
సంహర్షణాని మమ సంతు శివాస్మితాని!!  677 

పదవిభజన :-

సమ్మోహనాని తుహినాంశు కలాధరస్య 
సంజీవనాని సరసీరుహ సాయకస్య!
సందీపనాని  వితనోతు జనేషు శక్తే:
సంహర్షణాని మమ సంతు శివాస్మితాని!!   677 

భావము:-

తల్లీ ! ఓ ఉమాదేవి!

పరమ శివుని సమ్మోహము కావించునది,

అరవిందము బాణముగా కల 
మన్మథుని  బ్రతికించు సంజీవని,

వినతులగు భక్తుల శక్తిని ఉత్తేజింప చేయునది,

అగు పార్వతి మంద హాసము 
నాకు మిక్కిలి హర్షము కలిగించు కాక. 

ఆవిధముగా నీ మందస్మితము 
సమ్మోహనము,
సంజీవనము,
సందీపనము,
సంహర్షణము  
అనే లక్షణములు కలది.

🕉🌞🌎🌙🌟🚩: శ్రీమన్నారాయణీయము                     దశమ స్కంధము 72వ దశకము - అక్రూరుని ఆగమనము - 72 - 7 & 8 - శ్లోకములు
🕉️🌞🌏🌙🌟🚩

72-7

సాయం స గోపభవనాని భవచ్చరిత్ర-
గీతామృత ప్రసృతకర్ణరసాయనాని।

పశ్యన్ ప్రమోదసరితేవ కిలోహ్యమానో
గచ్ఛన్ భవద్భవనసన్నిధిమన్వయాసీత్॥

7వ భావము :-

అక్రూరుడు వ్రజము చేరునప్పటికి సాయంసమయమయ్యెను. ప్రభూ! నీ గృహమునకు చేరు - త్రోవలో గోపజనుల గృహముల నుండి -


నీలీలలను వర్ణించు శ్రావ్యమయిన గానములను - ఆ అక్రూరుడు వినెను. వీనుల విందుచేయు వారి గాన-గీతామృతములను ఆస్వాదించుచు ఆనందపారవశ్యముతో అతడు నీ గృహము చెంతకు చేరెను.

🕉️🌞🌏🌙🌟🚩
 
72-8

తావద్దదర్శ పశుదోహవిలోకలోలం
భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయంతమ్।

భూమన్।భవంతమయమగ్రజవంతమంత-
ర్ర్బహ్మానుభూతిరససింధుమివోద్వమంతమ్॥

8వ భావము :-

భగవాన్! అక్రూరుడు నీ గృహము చేరు సమయమునకు - నీవు నీ అన్న బలరామునితో కలిసి గోమాతలనుండి గోక్షీరము స్వీకరించు కార్యక్రమమును పర్యవేక్షించుచుంటివి.

నిన్ను చూచిన అక్రూరునికి - ప్రభూ! నీవు అతనిరాకకొరకే వేచి చూచుచున్నట్లుగా అనిపించెను; అతని అంతరంగము - బ్రహ్మానంద జ్ఞానామృత స్వరూపమును చూచిన అనుభూతితో - పొంగిపొరలెను.

***
[10:07 pm, 15/06/2022] +91 92915 82862: 🧘‍♂️386) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 
🕉️🌞🌏🌙🌟🚩

స్థితి ప్రకరణము  
రెండవ అధ్యాయము
దామ వ్యాళ కటోపాఖ్యానము

2-109

అసత్సద్వా జగద్యస్య తేనాసౌ సుఖదుఃఖయోః అగమ్య ఏవ మూర్ఖస్తు తద్వినాశేవ దుఃఖితః . 

ఎవని దృష్టియం దీ జగత్తు దృశ్యరూపముచే అసత్తుగను, అధిష్ఠాన బ్రహ్మ రూపముచే సత్తుగను నుండునో, ఆతడిక సుఖదుఃఖములకు అగమ్యుడై వర్తించును. కానీ మూర్ఖుడో, ఈ జగత్తు దృశ్యరూపముచే సత్తుగ భావించి, తద్వినాశముచే (పుత్ర మిత్రాది దృశ్య పదార్థముల వినాశముచే) దుఃఖము నొందుచున్నాడు. 

2-110

అసత్యభూతం తోయాన్తశ్చన్ద్ర వ్యోమతలాదికమ్‌ 
బాలా ఏవాభివాఞ్చన్తి మనోమోహాయ నోత్తమాః. 

నీటియందలి చంద్రబింబము, ఆకాశముయొక్క నీలత్వము మొదలుగా గల అసత్పదార్థములను మనోమోహము కొఱకు బాలురే (అజ్ఞానులే) లెస్సగ కోరుదురు కాని, ఉత్తములు కాదు. 

2-111

తస్మాన్మా త్వం భవో బాలో రామ రాజీవలోచన 
అవినాశమిహాలోక్య నిత్యమాశ్రయ సుస్థిరమ్‌. 

కమలనేత్రుఁడవగు ఓ రామచంద్రా! నీవు బాలుడవు (అజ్ఞానివి) కాకుము. నాశరహితమగు ఆత్మను సందర్శించి ఆ సుస్థిర ఆత్మపదమునే నిరంతర మాశ్రయింపుము.


No comments:

Post a Comment